🌹 31, MARCH 2024 SUNDAY ALL MESSAGES ఆదివారం, భాను వాసర సందేశాలు🌹

🍀🌹 31, MARCH 2024 SUNDAY ALL MESSAGES ఆదివారం, భాను వాసర సందేశాలు🌹🍀
🌹 31, MARCH 2024 SUNDAY ALL MESSAGES ఆదివారం, భాను వాసర సందేశాలు🌹
1) 🌹. శ్రీమద్భగవద్గీత - 514 / Bhagavad-Gita - 514 🌹
🌴. 13వ అధ్యాయము - క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం - ప్రకృతి, పురుషుడు, చైతన్యము - 25 / Chapter 13 - Kshetra Kshtrajna Vibhaga Yoga - Nature, the Enjoyer and Consciousness - 25 🌴
2) 🌹. శ్రీ శివ మహా పురాణము - 869 / Sri Siva Maha Purana - 869 🌹
🌻. దేవాసుర సంగ్రామము - 1 / Mutual fight - 1 🌻
3) 🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 127 / Osho Daily Meditations  - 127 🌹
🍀 127. మార్గాన్ని సిద్ధం చేయండి / 127. PREPARING THE WAY 🍀
4) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 539-4 / Sri Lalitha Chaitanya Vijnanam - 539-4 🌹 
🌻 539. 'శ్రుతిః' - 4 / 539. 'Shrutih' - 4 🌻
5) 🌹 సిద్దేశ్వరయానం - 26 🌹
6) 🌹 మీ స్వీయ చేతనను మీరు ప్రేమించండి మరియు గౌరవించండి / Love and respect your True Self. 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 514 / Bhagavad-Gita - 514 🌹*
*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. 13వ అధ్యాయము - క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం - ప్రకృతి, పురుషుడు, చైతన్యము - 25 🌴*

*25. ధ్యానేనాత్మని పశ్యన్తి కేచిదాత్మానమాత్మనా |*
*అన్యే సాంఖ్యేన యోగేన కర్మయోగేన చాపరే ||*

*🌷. తాత్పర్యం : పరమాత్ముని కొందరు ధ్యానము చేతను, మరికొందరు జ్ఞానాభ్యాసము చేతను, ఇంకను కొందరు నిష్కామకర్మ చేతను తమ యందే దర్శింతురు.*

*🌷. భాష్యము : మానవుని ఆత్మానుభవ అన్వేషణ ననుసరించి బద్ధజీవులు రెండు తరగతులని శ్రీకృష్ణభగవానుడు అర్జునునకు తెలియ జేయు చున్నాడు. నాస్తికులు, నిరీశ్వరవాదులు, సంశయాత్ములైన వారు ఆధ్యాత్మికభావనకు దూరులై యుందురు. అట్టివారికి అన్యముగా ఆధ్యాత్మికజీవనము నందు శ్రద్ధ కలిగినవారు అంతర్ముఖులైన భక్తులనియు, తత్త్వవేత్తలనియు, నిష్కామకర్ములనియు పిలువబడుదురు. అద్వైత సిద్ధాంతమును స్థాపించుటకు యత్నించువారలు సైతము నాస్తికులు మరియు నిరీశ్వరవాదుల యందే జమకట్టబడుదురు. అనగా శ్రీకృష్ణభగవానుని భక్తులే సరియైన ఆధ్యాత్మిక అవగాహనలో స్థితిని కలిగియుందురు.*

*ఆధ్యాత్మికజగత్తు భౌతికప్రకృతికి పరమమైనదనియు, అలాగుననే పరమాత్మ రూపమున సర్వుల యందు వసించియుండు శ్రీకృష్ణభగవానుడును భౌతికప్రకృతికి పరమైనవాడనియు వారు అవగాహనము చేసికొనుటయే అందులకు కారణము. పరతత్త్వమును జ్ఞానాభ్యాసము ద్వారా అవగాహన చేసికొనువారు కొందరు కలరు. వారు సైతము శ్రద్ధకలవారుగనే పరిగణింప బడుదురు. సాంఖ్యతత్త్వవేత్తలు ఈ భౌతికజగమును ఇరువదినాలుగు అంశములుగా విశ్లేషించి, ఆత్మను ఇరువదియైదవ అంశముగా భావింతురు. అట్టి ఆత్మను భౌతికంశములకు పరమైనదిగా వారు అవగతము చేసికొనినపుడు ఆ ఆత్మకు ఉన్నతముగా భగవానుడు కలడని వారు తెలిసికొనగలరు. అనగా భగవానుడు ఇరువదియారవ అంశము కాగలడు. ఈ విధముగా వారును కృష్ణభక్తిభావనలో భక్తియోగ ప్రమాణమునకు క్రమముగా చేరగలరు. అదేవిధముగా ఫలాపేక్షరహితముగా కర్మలనొనరించువారు సైతము పూర్ణలుగనే భావింపబడుదురు.*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 514 🌹*
*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*

*🌴 Chapter 13 - Kshetra Kshtrajna Vibhaga Yoga - Nature, the Enjoyer and Consciousness - 25 🌴*

*25. dhyānenātmani paśyanti kecid ātmānam ātmanā*
*anye sāṅkhyena yogena karma-yogena cāpare*

*🌷 Translation : Some perceive the Supersoul within themselves through meditation, others through the cultivation of knowledge, and still others through working without fruitive desires.*

*🌹 Purport : The Lord informs Arjuna that the conditioned souls can be divided into two classes as far as man’s search for self-realization is concerned. Those who are atheists, agnostics and skeptics are beyond the sense of spiritual understanding. But there are others, who are faithful in their understanding of spiritual life, and they are called introspective devotees, philosophers, and workers who have renounced fruitive results. Those who always try to establish the doctrine of monism are also counted among the atheists and agnostics. In other words, only the devotees of the Supreme Personality of Godhead are best situated in spiritual understanding, because they understand that beyond this material nature are the spiritual world and the Supreme Personality of Godhead, who is expanded as the Paramātmā, the Supersoul in everyone, the all-pervading Godhead. Of course there are those who try to understand the Supreme Absolute Truth by cultivation of knowledge, and they can be counted in the class of the faithful.*

*The Sāṅkhya philosophers analyze this material world into twenty-four elements, and they place the individual soul as the twenty-fifth item. When they are able to understand the nature of the individual soul to be transcendental to the material elements, they are able to understand also that above the individual soul there is the Supreme Personality of Godhead. He is the twenty-sixth element. Thus gradually they also come to the standard of devotional service in Kṛṣṇa consciousness. Those who work without fruitive results are also perfect in their attitude.*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 869 / Sri Siva Maha Purana - 869 🌹* 
*✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 36 🌴*

*🌻. దేవాసుర సంగ్రామము - 1 🌻*

*సనత్కుమారుడిట్లు పలికెను- ఆ దూత అచటకు వెళ్లి శివుని వచనమును యథార్థముగా వివరముగా చెప్పెను. మరియు శివుని నిశ్చయమును ఉన్నది ఉన్నట్లుగా చెప్పెను (1). దానవచక్రవర్తి, ప్రతాపశాలియగు ఆ శంఖచూడుడు ఆ మాటలను విని మిక్కిలి ప్రీతితో యుద్ధమును స్వీకరించెను (2). ఆతడు వెంటనే రథమునధిష్ఠించెను. మంత్రులు ఆతనిని అనుసరించిరి. ఆతడు శంకరునితో యుద్ధము కొరకై తన సైన్యము నాదేశించెను (3). శివుడు కూడ వేగముగా తన సైన్యమును, మరియు దేవతలను ప్రేరేపించెను. ఆయన స్వయముగా సర్వేశ్వరుడే అయిననూ లీలచే యుద్ధమునకు సన్నద్ధుడాయెను (4).*

*వెంటనే యుద్ధము ఆరంభమయ్యెను. అనేక రకముల వాద్యములు మ్రోగినవి. పెద్ద కోలాహలము వీరుల శబ్దముతో గూడి చెలరేగెను (5). ఓ మునీ! దేవదానవులు ఒకరితోనొకరు యుద్ధమును చేయ మొదలిడిరి. అచట దేవదానవసైన్యములు ధర్మయుద్ధమును చేసినవి (6). మహేంద్రుడు స్వయముగా వృషపర్వునితో యుద్ధమును చేసెను. భాస్కరుడు విప్రచిత్తితో ధర్మయుద్ధమును చేసెను (7).*

*విష్ణువు దంభునితో గొప్ప యుద్ధమును చేసెను. కాలాసురునితో కాలుడు, గోకర్ణునితో అగ్ని (8), కాలకేయునితో కుబేరుడు, మయునితో విశ్వకర్మ, భయంకరునితో మృత్యవు, సంహారునితో యముడు (9), కాలంబికునితో వరుణుడు, చంచలునితో వాయువు, ఘటపృష్టునితో బుధుడు, రక్తాక్షునితో శని (10),*

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 SRI SIVA MAHA PURANA - 869 🌹*
*✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj *

*🌴 Rudra-saṃhitā (5): Yuddha-khaṇḍa - CHAPTER 36 🌴*

*🌻 Mutual fight - 1 🌻*

Sanatkumāra said:—

1. The emissary returned and mentioned the words of Śiva, in detail and truthfully. He conveyed his decision as it was.

2. On hearing that, the valorous Dānava Śaṅkhacūḍa accepted lovingly the alternative of a fight.

3. Hurriedly he got into his vehicle along with his ministers. He commanded his army against Śiva.

4. Śiva too hastened to urge his army and the gods. The lord of all was ready himself with his sport.

5. The musical instruments formally announced the beginning of war. There was a great tumult along with the shouts of the heroes.

6. O sage, the mutual fight between the gods and the Dānavas ensued. Both the hosts of the gods and the Dānavas fought righteously.

7. Mahendra fought with Vṛṣaparvan. Bhāskara fought with Vipracitti.

8. Viṣṇu fought a great battle with Dambha, Kala with the Asura Kāla and the firegod fought with Gokarṇa.

9. Kubera fought with Kālakeya and Viśvakarman with Maya. Mṛtyu fought with Bhayaṃkara and Yama with Saṃhāra.

10. Varuṇa fought with Kālambika, the wind god with Cañcala. Mercury with Ghaṭapṛṣṭha and Śanaiścara with Raktākṣa.

Continues....
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 127 / Osho Daily Meditations  - 127 🌹*
*✍️. ప్రసాద్ భరద్వాజ*

*🍀 127. మార్గాన్ని సిద్ధం చేయండి 🍀*

*🕉 నువ్వు చేయగలిగింది ఏమీ లేదు. జ్ఞానోదయం అనేది అది జరిగినప్పుడు జరుగుతుంది, కానీ మీరు ప్రయత్నంతో మార్గాన్ని సిద్ధం చేస్తారు. 🕉*

*జ్ఞానోదయం జరిగేలా మీరు బలవంతం చేయలేరు. ఇది ఒక కారణం మరియు ప్రభావం విషయం కాదు. కానీ మీరు ఒకటి చేయండి; మీరు దానికి మార్గాన్ని సిద్ధం చేయండి. మీరు మార్గానికి ఆటంకం కలిగించే పనిని చేయవచ్చు-అది జరిగినప్పుడు అది జరుగుతుంది, కానీ మీరు సిద్ధంగా లేకుంటే, మీరు దానిని దాటవేయవచ్చు మరియు మీరు దానిని గుర్తించ లేకపోవచ్చు. చాలా మంది వ్యక్తులు సహజమైన జీవన గమనంలో సతోరి, సమాధి, జ్ఞానోదయం యొక్క మొదటి సంగ్రహావలోకనం దగ్గరకు వస్తారు, కానీ వారు దానికి సిద్ధంగా లేనందున వారు దానిని గుర్తించలేరు. వజ్రాల గురించి ఎప్పుడూ వినని వ్యక్తికి చాలా గొప్ప వజ్రం ఇచ్చినట్లే. అతను దానిని రాయి అని అనుకుంటాడు, ఎందుకంటే అతనికి దానిని గుర్తించే మార్గం లేదు.*

*ఒకరు గుర్తించగలిగేలా ఒక రకమైన స్వర్ణకారుడిగా మారాలి. అది ఎప్పుడు జరుగుతుందో, అది అప్పుడే జరుగుతుంది. బలవంతం చేయడానికి లేదా మార్చడానికి మార్గం లేదు. మీరు దానిని సాధించలేరు, కానీ అది జరిగితే మీరు దానిని గుర్తించడానికి సిద్ధంగా ఉంటారు. మీరు ధ్యానం మానేస్తే మీ సంసిద్ధత నశిస్తుంది. ధ్యానాలను కొనసాగించండి, తద్వారా మీరు సిద్ధంగా ఉన్నారు, మీరు కొట్టుకుంటున్నారు, వేచి ఉన్నారు, తద్వారా అది మీ వైపు వచ్చినప్పుడు మీరు దానిని స్వీకరించడానికి సిద్ధంగా ఉంటారు.*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Osho Daily Meditations  - 127 🌹*
*📚. Prasad Bharadwaj*

*🍀 127. PREPARING THE WAY 🍀*

*🕉  There is nothing you can do. Enlightenment happens when it happens, but by your doing you prepare the way.  🕉*

*You cannot force enlightenment to happen. It is not a cause and effect thing. But you do something; you prepare the way for it. You can do something that can hinder the way-it happens when it happens, but if you are not ready, you may bypass it, and you may not even recognize it. Many people come near the first glimpses of satori, Samadhi, enlightenment, in the natural course of life, but they cannot recognize it because they are not ready for it. It is as if a very great diamond is given to someone who has never heard of diamonds. He will think it is a stone, because he has no way to recognize it.*

*One has to become a sort of jeweler so that one can recognize. When it happens, it happens only then. There is no way to force or manipulate it. You cannot make it happen, but if it happens you will be ready to recognize it. If you stop meditations your readiness will disappear. Continue meditations so that you are ready, you are throbbing, waiting, so that when it passes by your side you are open to receive it.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 539 - 4 / Sri Lalitha Chaitanya Vijnanam  - 539 - 4 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁*

*🍀 110. సర్వౌదన ప్రీతచిత్తా, యాకిన్యంబా స్వరూపిణీ ।*
*స్వాహా, స్వధా, అమతి, ర్మేధా, శ్రుతిః, స్మృతి, రనుత్తమా ॥ 110 ॥ 🍀*

*🌻 539. 'శ్రుతిః' - 4 🌻*

*తత్త్వమును వివరించ లేమని, దానిని గూర్చి తర్కించ లేమని, దాని నుండి దిగి వచ్చిన వారిని గూర్చి తెలియుట, వివరించుట నుండునని పెద్దలు పలుకుదురు.  దాని యందు యిమిడి యుండుట సాధ్యమని అంతకు మించి ఏదియూ సాధ్యము కాదని కూడ తెలుపుదురు. అట్టి అనిర్వచనీయము, అవిజ్ఞేయము, అప్రతర్క్యము, అనామకము, అరూపకము, అయిన తత్త్వమునకు రూప మిచ్చునది శ్రీమాత. అనగా ఆ తత్త్వమే తన రూపముగా గలది శ్రీమాత అని తెలియవలెను. సృష్టి యందు దైవము ఆమెయే. సృష్టికావలి దైవము వెలుగై రూపము ధరించినపుడు శ్రీమాతగ దర్శన మిచ్చును.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam  - 539 - 4 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️ Prasad Bharadwaj*

*🌻 110. Sarvaodana pritachitta yakinyanba svarupini*
*svahasvadha amati rmedha shrutih smrutiranuttama ॥110 ॥ 🌻*

*🌻 539. 'Shrutih' - 4 🌻*

*Elders say that there is no explanation of philosophy, no reasoning about it, but knowledge and explanation could be given of those who descend from it. They also say that it is possible to be immersed in it and nothing beyond that is possible. Srimata is the personification of such indefinable, unknowable, irrational, anonymous, and abstract. In other words, it should be known Srimata has this tattva itself as her form. She is the God in the universe. The God beyond this creation takes a form of light and reveals as Sri Mata*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 సిద్దేశ్వరయానం - 26 🌹*

*💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐*

*🏵 భైరవనాథుడు 🏵*

*భైరవనాధుడీ క్షేత్రాలన్నీ దర్శించి ఆ యాదేవతలను పూజించాడు.గుహలో నుండి బయటకు రాగానే కొద్ది దూరం నుండి రాధాకృష్ణ భజన వినిపిస్తున్నది. ఎవరా అని అక్కడకు వెళ్ళాడు. కైలాస పర్వత ప్రాంతాలలో సిద్ధాశ్రమ ప్రదేశాలలో వివిధ నియమాలతో తపస్సు చేసేవాళ్ళు ఎందరినో చూచాడు. కాని భజన వినటం ఇదే మొదటిసారి. ఒక పెద్దాయన వేదిక మీద ఉండి రాధాకృష్ణ నామం చెపుతున్నాడు. అందరూ లయబద్ధంగా భజన చేస్తున్నారు. ఆభక్తుని చూస్తుంటే ఎందుకో గౌరవం కలిగింది. చేతులు జోడించి నమస్కరించి కూర్చున్నాడు. అంతఃప్రేరణ - తాను కూడా భజన చేస్తున్నాడు. కాసేపు అయ్యేసరికి కంటి వెంట కన్నీరు రావటం మొదలైంది. గొంతు గద్గదమైంది. భజనపూర్తి అయ్యేసరికి పరవశస్థితిలో ఉన్నాడు. ఇటువంటి అనుభూతి ఇంతవరకెప్పుడూ లేదు. భక్తులంతా లేచి వేదికమీద ప్రబోధకునకు నమస్కరించి అవతలికి వెళ్ళారు. ఇతనిని చూచారు గాని వాళ్ళెవరూ పలకరించలేదు.*

*బ్రహ్మస్థానంలోని ఆ మనీషి “భైరవనాథా! మహాసిద్ధుడవైన నీవిక్కడకు రావటం చాలా సంతోషంగా ఉంది. ఇది కృష్ణ తపోభూమి. గోవిందుని నిర్యాణానంతరం భక్తులు ప్రార్థిస్తే ఆ గోపాలుని తమ్ముడైన ఉద్ధవుడు ఈ సిద్ధాశ్రమ భూమిలోని ఈ ప్రదేశంలో తపస్సు చేస్తే శీఘ్రంగా కృష్ణ సాక్షాత్కారము రాధాదర్శనము కలుగుతుందని నిర్దేశించాడు. ఇక్కడ ఉపవాసాది కఠోర నియమాలక్కరలేదు. భజన చేస్తే చాలు. కొద్దిగా రాధామంత్రము గాని, కృష్ణ మంత్రము గాని చేస్తే సరిపోతుంది. కాసేపు నామ జపం చేస్తే చాలు. హృదయం ద్రవిస్తుంది. అశ్రుపాత, రోమాంచ, గాద్గద్యములు కలుగుతవి. కృష్ణ భూమి రక్షణకు సిద్ధగురువుల ఆదేశం వల్ల ఎంతో సేవ చేశావు. అందుకే ఇక్కడకు రాగలిగావు".*

*భైరవనాధుడు "మాహాత్మా! మిమ్ము దర్శించి ధన్యుడనైనాను. ఇంతకు ముందు భజన చేసిన వారంతా వందల సంవత్సరాల వయస్సున్న యోగులని తెలుసుకొన్నాను. శ్రీకృష్ణభగవానుడు అర్జునునకు ఉపదేశించిన గీతలోని భక్తియోగానికి ఉదాహరణ ప్రాయులైన వారు వీరంతా. కేవలం భజన చేత దీర్ఘాయువు పొందిన భక్తవర్యులు మీరు. నేను కృతార్థుడను. సెలవిప్పించండి. వెళ్ళివస్తాను" అన్నాడు. ఆ భక్త గురువు "రాక రాక వచ్చావు. ఈ పూట ఇక్కడ ఉండి మా ఆతిథ్యం స్వీకరించి రాత్రి గడచిన తర్వాత రేపు ఉదయం వెళుదువు గాని" అన్న ఆయన మాట కాదనలేక ఆ రాత్రి అక్కడే శయనించాడు. తెల్లవారు జామున స్వప్నం వచ్చింది. దానిలో రాధాకృష్ణులు దర్శన మిచ్చారు. శ్రీకృష్ణుడు "కుమారా! నీవు ఈ దేశానికి చేసిన సేవవల్ల మాకు సంతృప్తి కలిగింది. భైరవుడిచ్చిన ఆయువు సమయం పూర్తి అయినదని నీకు తెలుసు. కాని నీ యందు వాత్సల్యముతో నీ ఆయువును పొడిగిస్తున్నాను. ఈ శరీరాన్ని వదలి ఇంకో శరీరంలో ప్రవేశిద్దువుగాని, మధుర రాజధానిగా ఈ బృందావన రాజ్యానికి ఇటీవలే మా వంశీయుడైన ప్రవరసేనుడనే యువకుడు పట్టాభిషిక్తుడైనాడు. వాడు అల్పాయువు. కాలసర్పదష్టుడై త్వరలో మరణిస్తాడు. అతనిని శ్మశానానికి తీసుకు వెళ్ళినప్పుడు నా మాయవల్ల త్రోవనపోయే వ్యక్తి ఒకడు వచ్చి "నేను సర్పమాంత్రికుడను, ఇతనిని బ్రతికిస్తానంటాడు. దహనకాండ ఆపబడుతుంది. నీవు పరకాయ ప్రవేశ విద్యతో ప్రవరసేనుని శరీరంలోకి ప్రవేశించు. అంతా రాజు బ్రతికాడని పొంగిపోతారు. ఆ యోగి వెళ్ళిపోతాడు. ఆ శరీరమునందు నీవు వెయ్యేండ్లకు పైగా ఉందువుగాని" అని పలికాడు.*

*రాధాదేవి కృష్ణునివైపొకసారి చిరునవ్వుతో చూచి "చిరంజీవీ! కృష్ణ చంద్రుడు కరుణావర్షం నీ మీద కురిపించాడు. వెయ్యేండ్లు బ్రహ్మచర్య దీక్షలో ధర్మవీరుడవై కష్టపడ్డావు. కొత్త శరీరంలో సుఖపడవలసిన కర్మ యోగిస్తుంది. పూర్వజన్మలో నాగవంశీయునిగా ఉన్నపుడు నా సఖి ఇందు లేఖతో సంసారం చేసి ప్రణయజీవితం గడిపావు. ఆమె ఆ భౌతిక శరీరం విడిచి దివ్యభూమికలో నా సఖిగా ఉంది. నీ మీద మమకారం వదులుకోలేదు. ఆమెకు మళ్ళీ పాంచభౌతిక శరీరాన్ని ప్రసాదించాను. పుట్టి పెరిగి యౌవనంలోకి వచ్చింది. ప్రవరసేనునిగా ఆమెను వివాహం చేసుకొని మధుర భక్తి మార్గంలో జీవన యానం కొనసాగించు, శరీరం మారినా గర్భనరకం లేదు గనుక సిద్ధశక్తులు వెంటనే ఉంటవి. ధర్మరక్షణ జీవితయజ్ఞంగా కొనసాగించు. ప్రేమభక్తితో బ్రతుకుమల్లెపూల బాటగా ముందుకు వెళ్ళు" బృందావనేశ్వరులిద్దరూ అదృశ్యమైనారు. మెలకువ వచ్చింది. ప్రక్కనే ఉంచిన ఉత్తరీయం అందుకొన్నాడు. రాధాకృష్ణుల పాదముద్రలు దానిమీద కనిపిస్తున్నవి. కండ్లకద్దుకొన్నాడు. లేచి స్నానం చేసి సిద్ధమై కృష్ణాశ్రమం అధిపతి దగ్గరకు వెళ్ళి నమస్కరించి సెలవిమ్మని అభ్యర్థించాడు. ఆయన ప్రేమదేవతల అనుగ్రహం పొందావు గదా! వెళ్ళిరా. అని ఆశీర్వదించి పంపించాడు.*
*( సశేషం )*

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 మీ స్వీయ చేతనను మీరు ప్రేమించండి మరియు గౌరవించండి 🌹*
✍️. ప్రసాద్ భరద్వాజ

*మీ అంతర్గత చైతన్యాన్ని, మీలోనే వున్న, మీరు ఉపయోగించని శక్తి వనరును అన్వేషించండి మరియు దానిలో ఆనందించండి. మిమ్మల్ని మీరు ప్రేమించండి మరియు గౌరవించండి మరియు ప్రతిదీ అదే స్పందనల ప్రతిధ్వనిగా మారుతుంది. ఈ శరీరానికి, ఈ శ్వాసకు మరియు ప్రాణానికి ధన్యవాదాలు తెలపండి. జీవితం మీకు అందించే ప్రతి చిన్న ఆనందానికి ధన్యవాదాలు చెప్పండి మరియు నవ్వండి. మరియు మీరు ఇంతకు ముందెన్నడూ నవ్వని విధంగా చిరునవ్వు నవ్వండి మరియు లోతుగా పరిశోధించండి.*

* ఈ క్షణం యొక్క మంచితనంలో మిమ్మల్ని మీరు ముంచుకోండి మరియు ప్రతి రోజు దానితో ప్రారంభించి, దానితో ముగించండి. త్వరలో మీరు ఈ కొత్త జీవన విధానాన్ని ఇష్టపడతారు. మీరు బలంగా, ఉత్సాహంగా మరియు శక్తివంతంగా ఉన్నప్పుడు, మీరు అయస్కాంతం వలె పనిచేయడం ప్రారంభిస్తారు మరియు మీరు మంచి వ్యక్తులందరినీ మీ వైపుకు ఆకర్షిస్తారు. ప్రజలు తమ సొంత సాహచర్యాన్ని ఆనందించే వారి సహవాసాన్ని ఆనందిస్తారు.*
🌹🌹🌹🌹🌹

*🌹 Love and respect your True Self. 🌹*

*Explore your inner core, your untapped energy source and rejoice in it. Love and respect your Self and everything will become an echo of the same vibes. Thank this body, this breath and life. Give thanks for every little joy which life brings to you and smile. And smile like you have never smiled before and delve deep within.*

*Soak your Self in goodness of this moment and let every day begin with it and end with it. Soon you will love this new way of living. When you are strong, vibrant and energetic then you will begin to function as a magnet and you will attract all good people towards you. People enjoy the company of those who enjoy their own company.*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
#నిత్యసందేశములు #DailyMessages 
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
https://t.me/+9zDjTpPe_PQzMWVl
https://t.me/Sivasutras
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/bhagavadgeethaa/
https://t.me/AgniMahaPuranam
https://t.me/+LmH1GyjNXXlkNDRl
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages3
https://www.kooapp.com/profile/Prasad_Bharadwaj
https://www.threads.net/@prasad.bharadwaj