గీతోపనిషత్తు - 93

🌹. గీతోపనిషత్తు - 93 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍀 26 - 6 . ప్రాణాయామ యజ్ఞము - ప్రాణవాయువు ముక్కు పుటముల నుండి భ్రూమధ్యము వరకు ప్రవేశించి, అచటి నుండి వాయునాళము ద్వారా ఉపిరితిత్తుల వరకు వ్యాపించి యుండును. ప్రాణ వాయువును పూర్ణముగ పీల్చుట చాల ముఖ్యము. పరిపూర్ణముగ శ్వాసను పీల్చుట వలన ఎన్నియో రోగముల నరికట్టవచ్చును. 🍀

📚. 4. జ్ఞానయోగము - 29, 30 📚

Part 6

పంచప్రాణములు దేహమున ఈ క్రింది భాగములలో పనిచేయుచున్నవి.

🌷 1. ప్రాణవాయువు: 🌷

ఇది శ్వాస ద్వారా పీల్చబడుచున్నది. ముక్కుపుటముల నుండి ఉదర వితానము క్రింది భాగము వరకు ఈ వాయువు పనిచేయు చుండును.

కావున కనుబొమల నుండి ఉదర వితానము వరకు గల శరీర భాగములు, వాని స్వస్థత ఈ వాయువు బలమునకు సంబంధించి యున్నవి. ప్రాణవాయువు బలముగ స్వీకరింపబడుచున్నచో ఈ శరీర భాగమంతయు ప్రాణబలముతో కూడిన అస్వస్థతను దరిచేరనీయదు.

ప్రాణవాయువు ముక్కు పుటముల నుండి భ్రూమధ్యము వరకు ప్రవేశించి, అచటి నుండి వాయునాళము ద్వారా ఉపిరితిత్తుల వరకు వ్యాపించి యుండును.

ప్రాణవాయువును పూర్ణముగ పీల్చుట చాల ముఖ్యము. సామాన్యముగ జీవులు వారు పీల్చగలిగిన శక్తిలో నాలుగవ వంతు మాత్రమే పీల్చుదురని పరిశోధనలు తెలుపుచున్నవి.

పరిపూర్ణముగ శ్వాసను పీల్చుట వలన ఎన్నియో రోగముల నరికట్టవచ్చును. సత్సాధకుడు శ్వాసావయవముల నన్నింటిని పరిశుభ్రముగను, ఆరోగ్యముగను ఉంచుకొనుటకు జాగరూకత వహించి యుండవలెను.

అనగా ముక్కు, గొంతు, శ్వాసనాళము, ఊపిరితిత్తులు. వీటియందు తరచు జలుబు చేయుట, దగ్గు వచ్చుట ఇత్యాదివి కలుగకుండ శ్రద్ధ వహించవలెను. మూలసూత్రము- 'బాగుగ గాలి పీల్చుటయే.'

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

08 Dec 2020

భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 178

🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 178 🌹

🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. మార్కండేయ మహర్షి - 4 🌻

26. క్షమవల్ల మహత్తు, వస్తాయి. కానీ క్రోధంవల్ల ఉన్నశక్తులు నశిస్తాయి. ఏముంది? ఒకడికి అపకారం, అపచారం చేస్తాడు. అంతకన్నా చేయగలిగింది ఏముంది? దానివల్ల అది పొందినవాడికి కర్మక్షయం అవుతుంది. పాపక్షయం అవుతుంది. కాని క్రోధంవల్ల తపస్సే క్షయం అవుతుంది. వివేకి ఎప్పుడూ తన తపస్సును వ్యర్థం చేసుకోడు.

27. తనకు అపచారం చేసినవాడినికూడా సిక్షించకుండా వదిలిపెడతాడు. ఎందుచేతనంటే, పాపానికి ఫలం ఎలాగూ ఈ ప్రపంచంలో ఉండనే ఉంది. తనెందుకు తన తపస్సును వ్యర్థంచేసుకోవాలి? పాపంచేసినవాడే ఫలం అనుభవిస్తాడు. వివేకం అంటే ఇదే.

28. “గృహస్థులయొక్క ధర్మములేవి? కొడుకులు తల్లితండ్రుల విషయంలో ఎట్లాంటిభక్తి, ధర్మములు కలిగి ఉండాలి?” అని ధర్మరాజు అడిగాడు. “తల్లిదండ్రులమీద భక్తి, ధర్మార్థములందు ఆసక్తి, ఈ రెండే పుత్రులకు ఉండాలి” అని చెప్పాడు.

29. బ్రహ్మదేవుడు పూర్వం ఏడుగురు ఋషులను సృష్టించాడు. తరువాత తనను అరాధిస్తూ ఉండమని వాళ్ళతో బ్రహ్మదేవుడు చెప్పాడు. మరీచాదులైన ఆ మునులు బ్రహ్మ మాట వినక, అంతఃకరణలో పరమేశ్వరుడిని గురించి తపస్సుచేసారు. ఇది ప్రవృత్తి, నివృత్తుల విషయం. బ్రహ్మ తనను ఆరాధించమనడంలో అర్థం, వారిని ప్రవృత్తిమార్గంలో నిలుపటానికి, కాని వాళ్ళు నివృత్తిమార్గంలో మహేశ్వరుడిని అంతఃకరణలో ఆరాధించారు.

30. అందుకు బ్రహ్మదేవుడికి ఆగ్రహంవచ్చి, “మీ బ్రహ్మవిజ్ఞాన శక్తులు ఏవైతో ఉన్నాయో అవి నశించుగాక!” అని వాళ్ళను శప్తుల్ని చేసాడు. వాళ్ళాల్లో జ్ఞానాన్ని ఆయన హరించాడు. “ఆ తరువాత వాళ్ళు ప్రవృత్తిమార్గంలో వివాహాలూ చేసుకున్నారు. పుత్రులను కన్నారు. స్వర్గస్థులయినారు. అజ్ఞానంరాగానే మృత్యువు ఆవరించింది వాళ్ళను.

31. పృత్యువు – అవిద్య, అజ్ఞానం యొక్క లక్షణం. స్వర్గానికి వెళ్ళి భూలోకంలో తమ కొడుకులు క్రమంతప్పకుండా తమకు శ్రాద్ధాలు పెడుతుంటే చూచి ఆనందించటం వాళ్ళకు అలవాటయింది. చనిపోయిన తరువాత తమకు పుత్రులు శ్రాద్ధాదిక్రియలు విర్వర్తించటంవల్ల వాళ్ళకు ఆనందం. మొత్తం అవిద్య యొక్క లక్షణములే ఇవి! బ్రహ్మశాపమే అదంతా. ఆ శ్రాద్ధానందంలో వాళ్ళు సుఖంగా ఉన్నారు.

32. అసలు వాళ్ళు దేవతలకు తండ్రులు. మొత్తమొదట బ్రహ్మ సంతానంగా పుట్టారు. తరువాత దేవతలు వాళ్ళనుంచే పుట్టారు. అంటే దేవతలకు కూడా వాళ్ళు తంద్రుల లాంటివాళ్ళు. ఆ ఏడుగురిలో అమూర్తులు ముగ్గురు, సమూర్తులు నలుగురు. అంటే రూపంకలిగినవాళ్ళు నలుగురు. రూపం లేనివాళ్ళు ముగ్గురు. వీళ్ళను దేవతలు కూడా గౌరవించటం జరుగుతూ ఉంటుంది ఎప్పుడూనూ.

33. వాళ్ళు అలాగ మూడుయుగాలు ఉంటారు. ఆ తరువాత బ్రహ్మజ్ఞానం కొరకు జన్మిస్తారు. క్రమక్రమంగా వాళ్ళు ఇక్కడ పుట్టినతరువాత, సాంఖ్య మతాల్లో కొంతకలం ఉన్నతరువాత, పునరావృత్తిలేనటువంటి జ్ఞానమార్గంలో యోగసిద్ధి పొందుతారు. అంతేకాక, వాళ్ళు తమ యోగబలంతో – యోగసాధన చేసె భక్తులు, మోక్షమార్గాన్వేషకులు ఎవర్యితే ఉన్నారో, వాళ్ళకు యోగాభివృద్ధినిస్తారు.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

08 Dec 2020

భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 117

🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 117 🌹

✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. సర్వశూన్య స్థితి యందు ఎరుక - 2 🌻

487. నిర్వాణ స్థితిలో, భగవంతుడు 'చైతన్యము' యొక్క పాత్రను వహించుచున్నాడని దాని భావము.

488. అభావము నుండి పుట్టిన సంస్కారములే, సమస్త అనుభవములకు కారణము కాబట్టి ఇచ్చట మనస్సు దాని సమస్త సంస్కారములతో సహితముగా నశించి పోయినది. పరిమిత "అహమ్" యొక్క మిథ్యానుభవములు కూడా అదృశ్యమైనవి.

489. ఈ దివ్యశున్యత్వము, సత్యస్థితి నుండి పుట్టినదే గాని మాయ నుండి పుట్టినది కాదు.

490. అభావమైన మాయాసృష్టి అదృశ్యమైన తక్షణమే "అహంబ్రహ్మాస్మి" (నేను భగవంతుడను) అనెడు భగవదనుభూతి కలుగుటకు ఒక్క క్షణమునకు ముందుగానే, యీ దివ్య ప్రపూర్ణ పరమ శూన్యస్థితి యొక్క అనుభవము కలుగును.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

08 Dec 2020

శ్రీ విష్ణు సహస్ర నామములు - 81 / Sri Vishnu Sahasra Namavali - 81

🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 81 / Sri Vishnu Sahasra Namavali - 81 🌹

నామము - భావము

📚. ప్రసాద్ భరద్వాజ

🌷. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 🌷

ఉత్తరాషాడ నక్షత్ర ప్రధమ పాద శ్లోకం

🍀 81. తేజో వృషో ద్యుతిధరః సర్వశస్త్ర భృతాం వరః|
ప్రగ్రహో నిగ్రహో వ్యగ్రో నైకశృంగో గదాగ్రజః|| 🍀

🍀 757) తేజోవృష: - 
సూర్యతేజముతో నీటిని వర్షించువాడు.

🍀 758) ద్యుతిధర: -
కాంతివంతమైన శరీరమును ధరించినవాడు.

🍀 759) సర్వ శస్త్ర భృతాంవర: -
శస్త్రములను ధరించినవారిలో శ్రేష్ఠుడైనవాడు.

🍀 760) ప్రగ్రహ: -
ఇంద్రియములనెడి అశ్వములను తన అనుగ్రహము అనెడి పగ్గముతో కట్టివేయువాడు.

🍀 761) నిగ్రహ: -
సమస్తమును నిగ్రహించువాడు.

🍀 762) వ్యగ్ర: -
భక్తులను తృప్తి పరుచుటలో సదా నిమగ్నమై ఉండువాడు.

🍀 763) నైకశృంగ: -
అనేక కొమ్ములు గలవాడు, భగవానుడు.

🍀 764) గదాగ్రజ: -
గదుడను వానికి అన్న.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Vishnu Sahasra Namavali - 81 🌹

Name - Meaning

📚 Prasad Bharadwaj

🌷 OM NARAYANAYA VIDMAHE VASUDEVAYA DHIMAHI । TANNO VISHNU PRACHODAYAT ॥ 🌷

Sloka for Utarashada 1st Padam

🌻 tejōvṛṣō dyutidharaḥ sarvaśastrabhṛtāṁ varaḥ |
pragrahō nigrahō vyagrō naikaśṛṅgō gadāgrajaḥ || 81 || 🌻

🌻 757. Tejōvṛṣaḥ:
One who in the form of the sun causes rainfall at all times.

🌻758. Dyutidharaḥ:
One whose form is always brilliant.

🌻 759. Sarva-śastra-bhṛtāṁ varaḥ:
One who is superior to all bearing arms.

🌻 760. Pragrahaḥ:
One who accepts the offerings of devotees with great delight.

🌻 761. Nigrahaḥ:
One who controls and destroys everything.

🌻 762. Vyagraḥ:
One who has no Agra or end. Or one who is very attentive (Vyagra) in granting the prayers of devotees.

🌻 763. Naikaśṛṅgaḥ:
One with four horns.

🌻 764. Gadāgrajaḥ:
One who is revealed first by Mantra (Nigada). Or one who is the elder brother of Gada.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

08 Dec 2020

విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 154, 155 / Vishnu Sahasranama Contemplation - 154, 155

🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 154, 155 / Vishnu Sahasranama Contemplation - 154, 155 🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻154. అమోఘః, अमोघः, Amoghaḥ🌻

ఓం అమోఘాయ నమః | ॐ अमोघाय नमः | OM Amoghāya namaḥ

న మోఘం యస్య మోఘము అనగా నిష్ఫలము కాని చేష్టితము ఎవనికి కలదో అట్టివాడు.

:: పోతన భాగవతము - ప్రథమ స్కంధము ::

మ. భువనశ్రేణి నమోఘలీలుఁ డగుచుం బుట్టించు రక్షించు నం

త విధిం జేయు, మునుంగఁ డందు; బహుభూత వ్రాతమం దాత్మ తం

త్రవిహారస్థితుఁడై షడింద్రియ సమస్త ప్రీతియున్ దవ్వులన్‍

దివి భంగి గొనుఁజిక్కఁ; డింద్రియములం ద్రిప్పున్ నిబంధించుచున్‍.

శ్రీమన్నారాయణుడు ఈ సకల భువన జాలాన్నీ తన అమోఘమైన లీలావిలాసం చేత పుట్టిస్తుంటాడు, రక్షిస్తుంటాడు, అంతం చేస్తూ ఉంటాడు. అంతే కాని తాను మాత్రం ఆ జన్మ మరణాలతో నిమగ్నం కాడు. అనేకమైన ప్రాణి సమూహమందు ఆత్మస్వరూపుడై విహరిస్తుంటాడు. ఎంతో దూరంలో అందకుండా స్వర్గంలాగా ఉండి, జీవుల ఇంద్రియాలకు సంతోషాన్ని సంతరిస్తూ, తాను మాత్రం ఇంద్రియాలకు అతీతతుడుగా, నియంతయై ఇంద్రియాలను తన ఇష్టం వచ్చినట్లు త్రిప్పుతూ ఉంటాడు.

110. అమోఘః, अमोघः, Amoghaḥ

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION - 154🌹

📚. Prasad Bharadwaj

🌻154. Amoghaḥ🌻

OM Amoghāya namaḥ

Na moghaṃ yasya / न मोघं यस्य He whose actions never go in vain.

Śrīmad Bhāgavata - Canto 1, Chapter 3

Sa vā idaṃ viśvamamoghalīlaḥ sr̥jatyavatyatti na sajjate’smin,

Bhūteṣu cāntarhita ātmatantra ṣāḍvargikaṃ jighrati ṣaḍguṇeśaḥ. (36)

:: श्रीमद्भागवते प्रथमस्कन्धे तृतीयोऽध्यायः ::

स वा इदं विश्वममोघलीलः सृजत्यवत्यत्ति न सज्जतेऽस्मिन्‌ ।

भूतेषु चान्तर्हित आत्मतन्त्र षाड्वर्गिकं जिघ्रति षड्गुणेशः ॥ ३६ ॥

The Lord, whose activities never go in vain, is the master of the six senses and is fully omnipotent with six opulences. He creates the manifested universes, maintains them and annihilates them without being, in the least, affected. He is within every living being and is always independent.

110. అమోఘః, अमोघः, Amoghaḥ

🌻 🌻 🌻 🌻 🌻

Source Sloka

उपेन्द्रो वामनः प्रांशुरमोघश्शुचिरूर्जितः ।
अतीन्द्रस्संग्रहस्सर्गो धृतात्मा नियमो यमः ॥ १७ ॥

ఉపేన్ద్రో వామనః ప్రాంశురమోఘశ్శుచిరూర్జితః ।
అతీన్ద్రస్సంగ్రహస్సర్గో ధృతాత్మా నియమో యమః ॥ ౧౭ ॥

Upendro vāmanaḥ prāṃśuramoghaśśucirūrjitaḥ ।
Atīndrassaṃgrahassargo dhr̥tātmā niyamo yamaḥ ॥ 17 ॥

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 155 / Vishnu Sahasranama Contemplation - 155 🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻155. శుచిః, शुचिः, Śuciḥ🌻

ఓం శుచయే నమః | ॐ शुचये नमः | OM Śucaye namaḥ

స్తువతామర్చయతాం చ స్మరతాం పావనత్వతః ।

తథాఽస్య స్పర్శ ఇత్యాదిమంత్రవర్ణాచ్ఛుచిర్హరిః ॥

పవిత్రుడు. పవిత్రతను కలిగించువాడు. స్తుతించువారినీ, అర్చించిన వారినీ, స్మరించు వారినీ హరి పవిత్రులనుగా చేయును. అదిగాక ఆయన స్పర్శమును పవిత్రము కావున విష్ణువు శుచిః అని చెప్పబడును.

:: శ్రీమద్భాగవతము - నవమస్కన్ధము, దశమోఽధ్యాయము ::

ఏకపత్నీవ్రతధరో రాజర్షిచరితః శుచిః ।

స్వధర్మం గృహమేధీయం శిక్షయాన్స్వయమాచరత్ ॥ 55 ॥

ఏకపత్నీవ్రతమును పాటించినవాడూ, రాజర్షి వంటి చరితము గలవాడూ, పవిత్రుడూ అయిన శ్రీరామచంద్రుడు గృహస్తులకు స్వధర్మమును తన స్వీయ ఆచరణద్వారా నేర్పినాడు.

:: పోతన భాగవతము - అష్టమ స్కంధము, గజేంద్ర మోక్షము ::

సీ.భవము దోషంబు రూపంబుఁ గర్మంబు నాహ్వయమును గుణమును లెవ్వనికి లేకజగములఁ గలిగించు సమయించు కొఱకునై నిజమాయ నెవ్వఁ డిన్నియును దాల్చునా పరమేశునకు ననంతశక్తికి బ్రహ్మ కిద్దరూపికి రూపహీనునకుజిత్రచారునికి సాక్షికి నాత్మరుచికినిఁ బరమాత్మునకుఁ బరబ్రహ్మమునకుఆ.మాటలను నెఱుకల మనములఁ జేరంగఁ, గాని శుచికి సత్త్వగమ్యుఁ డగుచునిపుణుఁడైన వాని నిష్కర్మతకు మెచ్చు, వాని కే నొనర్తు వందనములు.

భగవంతునికి పుట్టుకా, పాపమూ, ఆకారమూ, కర్మా, నామాలూ, గుణాలూ లేవు. అతడు లోకాలను పుట్టించి నశింపజేయడం కోసము తన మాయాప్రభావముతో ఇవన్నీ ధరిస్తాడు. రూపం లేనివాడైనా ఆశ్చర్యకరంగా అంతులేని శక్తితో నిండైన రూపాన్ని పొందుతాడు. అన్నింటినీ చూస్తాడు. ఆత్మకాంతిలో వెలుగుతాడు. అతడే ఆత్మకు మూలం; అతడే మోక్షానికి అధికారి. అతడు మాటలకూ ఊహలకూ అందరానివాడు; పరిశుద్ధుడు. సత్త్వగుణంతో దరిజేర దగినవాడు. నేర్పరులు చేసే ఫలాపేక్షలేని కర్మలకు సంతోషిస్తాడు. అటువంటి దేవునికి నేను నమస్కారాలు చేస్తాను.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION - 155🌹

📚. Prasad Bharadwaj

🌻155. Śuciḥ🌻

OM Śucaye namaḥ

Stuvatāmarcayatāṃ ca smaratāṃ pāvanatvataḥ,

Tathā’sya sparśa ityādimaṃtravarṇācchucirhariḥ.

स्तुवतामर्चयतां च स्मरतां पावनत्वतः ।

तथाऽस्य स्पर्श इत्यादिमंत्रवर्णाच्छुचिर्हरिः ॥

One who purifies those who think of, praise and worship Him. His very contact is purifying.

Śrīmad Bhāgavata - Canto 9, Chapter 10

Ekapatnīvratadharo rājarṣicaritaḥ śuciḥ,

Svadharmaṃ gr̥hamedhīyaṃ śikṣayānsvayamācarat. (55)

Lord Rāmacandra who practiced monogamy, conducted His life as a Rājarṣi i.e., a Saintly King, pure - untinged by qualities like anger; taught good behavior for everyone, especially the householders by setting an example of Himself and His personal activities.

🌻 🌻 🌻 🌻 🌻

Source Sloka

उपेन्द्रो वामनः प्रांशुरमोघश्शुचिरूर्जितः ।
अतीन्द्रस्संग्रहस्सर्गो धृतात्मा नियमो यमः ॥ १७ ॥

ఉపేన్ద్రో వామనః ప్రాంశురమోఘశ్శుచిరూర్జితః ।
అతీన్ద్రస్సంగ్రహస్సర్గో ధృతాత్మా నియమో యమః ॥ ౧౭ ॥

Upendro vāmanaḥ prāṃśuramoghaśśucirūrjitaḥ ।
Atīndrassaṃgrahassargo dhr̥tātmā niyamo yamaḥ ॥ 17 ॥

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

08 Dec 2020

కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 125

🌹. కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 125 🌹

✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. ఆత్మను తెలుసుకొను విధము - 55 🌻

నచికేతుడు తనలో తాను ఇట్లు అనుకొనుచున్నాడు. సూక్ష్మబుద్ధితో, సూక్ష్మాతిసూక్ష్మమైన ఈ ఆత్మను తెలిసికొనవచ్చునని, ఇంతవరకూ యమధర్మరాజు చెప్పియున్నాడు.

ఆయన చెప్పినంత సులభముగా ఆత్మను అందరూ గుర్తించ లేకున్నారు. అట్లు ఆత్మను గుర్తించకుండుటకు ప్రతిబంధ కారణములు ఏవైనా ఉన్నవేమో తెలిసికొని, తొలగించుకొనవచ్చును గదా యని, తలంచు చుండగా అతని సంశయుమును గ్రహించిన యమధర్మరాజు ప్రతిబంధ కారణములను ఈ విధముగా చెప్పుచున్నాడు.

కోహం బంధః, తప్పక ప్రతీ ఒక్కరూ విచారణ చేయవలసినటువంటి ప్రశ్న ఇది. నాకు బంధకారణమేమి? కోహం బంధః? అనే విచారణ చేసినట్లయితే,

పంచభూతముల చేత, ప్రేరేపింపబడుతున్నటువంటి ప్రకృతి చేత ప్రేరితమౌతున్నటువంటి, త్రిగుణాత్మకమైనటువంటి వ్యామోహము చేత, మాలిన్యము చేత, ప్రేరేపింపబడేటటువంటి, మనస్సు అనేటటువంటి, బుద్ధి అనేటటువంటి, అంతర ఇంద్రియాల ద్వారా అంతఃకరణ చతుష్టయాన్ని చక్కగా ఎఱిగి, ఆ అంతఃకరణ చతుష్టయ సాక్షి అయినటువంటి జ్ఞాత నేనని ఎఱిగి,

అట్టి జ్ఞాత స్థానములో తాను స్థిరముగా నిలబడి ఉండి, మిగిలినటువంటి 24 తత్త్వములను తన ఆధారముగనే తాను నడిపించుచున్నాడనేటటువంటి సత్యమును గ్రహించి, అవి తనకి పనిముట్లని గ్రహించి, తాను సహజముగా స్వస్వరూపుడునని, స్వయం ప్రకాశకుడనని, తన ప్రభావం చేత మాత్రమె, మిగిలిన 24 తత్వములు సమర్థవంతములు అగుచున్నవని

పిండాండ పంచీకరణ, బ్రహ్మాండ పంచీకరణములను లెస్సగా పరిశీలించినటువంటి వాడై, ప్రతి ఒక్క విశేషములను స్పష్టముగా ఎఱిగినటువంటి వాడై, సాంఖ్య తారక అమనస్క విధిని ఎఱిగినవాడై, తనను తాను విరమింప చేసుకుని,

తనను తాను తెలుసుకుని, తనను తాను పోగొట్టుకొనేటటువంటి రాజయోగ మార్గములో ప్రయాణము చేయవలసినటువంటి అవసరము ఉన్నది. అలా ఎవరైతే మనస్సును విరమింప చేయగలుగుతున్నారో, వాళ్ళు మాత్రమే ఈ ముక్తి పథంలో నడువగలుగుతున్నారు.

ఎవరైతే బాహ్య వ్యవహారముల నందు మగ్నత చెంది ఉంటారో, బాహ్య వ్యవహారం బలంగా ఉంటుందో, బాహ్య వ్యవహారములయందు, సుఖదుఃఖముల యందు ఆసక్తి కలిగియుంటారో వారందరూ తప్పక మరల జనన మరణ జరామరణ చక్రములో ప్రవేశింపక తప్పదు. సంసార చక్రములో పరిభ్రమింపక తప్పదు. అవిద్యా మోహము చేత బాధింపబడక తప్పదు. మనోభ్రాంతి చేత లాగబడక తప్పదు.

ఇట్లు గ్రహించనటువంటి వారు, వివేచనా శీలియై, వివేకముతో తమను తాము, తనలో ఉన్నటువంటి, యథార్థమైనటువంటి సర్వకాల సర్వ అవస్థలయందు మార్పు చెందనటువంటి, పరిణామ శీలము కానటువంటి, ఆత్మతత్వమును ఎఱిగేటటువంటి గొప్ప ప్రయత్నాన్ని చేయాలి. ఈ సత్యాన్ని ప్రతీ ఒక్కరూ గుర్తెరగాలి.

మనస్సు ఇంద్రియములతో కూడినప్పుడే అవి వాని వాని విషయములను గ్రహించగలుగును. లేనిచో ఇంద్రియములు విషయములను గ్రహించుట లేదు. ఆత్మ దర్శనము కావలయునని, మనస్సు అంతర్ముఖము కావలయును.

one cannot serve two masters అన్నట్లు ఒక సేవకుడు ఇద్దరు యజమానులను సేవింపలేనట్లు, మనస్సు అంతరముగా ఉన్న ఆత్మను, బాహ్యముగా ఉన్న శబ్దాది విషయములను, ఒకేసారి గ్రహించలేదు. శబ్దాది విషయములనుండి ఇంద్రియములను మరల్చిన గానీ, మనస్సు బాహ్య విషయముల నుండి మరలుటలేదు. ధ్యాన శీలుడైన వ్యక్తి మాత్రమే, ఇంద్రియములను నిగ్రహించి మనస్సును అంతర్ముఖము చేసుకొనగలడు.

అతి ముఖ్యమైనటువంటి రహస్యాన్ని ఇక్కడ చెబుతున్నారు. ధ్యానశీలుడైన వ్యక్తి మాత్రమే ఇంద్రియముల నుండి గ్రహించి, మనస్సును అంతర్ముఖము చేసికొన గలడు. ఈ రహస్య సూత్రాన్ని మనం మానవ జీవితంలో బాగా ఆశ్రయించ వలసినటువంటి అవసరమున్నది.

ధ్యానము అంటే ఏదో ఒక పది నిమిషాలో, పదిహేను నిమిషాలో, ఐదు నిమిషాలో, మూడు నిమిషాలో, గంటో, అరగంటో చేసేటటువంటి తాత్కాలికమైన ప్రయత్నం కాదు. సహజ ధ్యాన శీలియై ఉండాలి. సమాధినిష్ఠుడై ఉండాలి. - విద్యా సాగర్ గారు

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

08 Dec 2020

శ్రీ శివ మహా పురాణము - 290

🌹 .  శ్రీ శివ మహా పురాణము - 290 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴

70. అధ్యాయము - 25

🌻. సతీ వియోగము - 2 🌻

మహేశ్వరుడిట్లు పలికెను -

నీవు లోకములన్నింటికీ నా ఆజ్ఞచే కర్తవు. భరించువాడవు, హరించు వాడవు. ధర్మ, అర్థ, కామముల నిచ్చువాడవు, దుర్మార్గులను శిక్షించువాడవు (20). నీవు జగత్తునకు ప్రభువు. నీకు జగత్తునకు పూజ్యుడవు. మహాబల పరాక్రమములు గల నీవు ఎక్కడనైననూ నాకు కూడా జయింప శక్యము కానివాడవు కాగలవు(21).

నేను నీకు ఇచ్ఛా జ్ఞాన క్రియా శక్తులను ఇచ్చెదను. నీవు స్వీకరింపుము. ముల్లోకములలో అనేక లీలలను ప్రకటించగలిగే మహిమను, స్వాతంత్ర్యమును స్వీకరింపుము (22).

ఓ హరీ! నిన్ను ద్వేషించువారిని నేను ప్రయత్నపూర్వకముగా దండించుట నిశ్చయము. ఓ విష్ణో! నీ భక్తులకు నేను ఉత్తమమగు మోక్షము నిచ్చెదను (23).

దేవతలు కూడ తపింప శక్యము కాని ఈ మాయనను కూడా స్వీకరించుము. దీనిచే సంమోహితమైన జగత్తు జడాత్మకమగును (24). ఓ హరీ! నీవు నా ఎడమ చేయి. ఈ బ్రహ్మ నా కుడిచేయి. ఈ బ్రహ్మకు కూడా నీవు తండ్రివి. రక్షకుడవు కాగలవు (25).

రుద్రుడు నా హృదయము. నేనే రుద్రుడు. దీనిలో సంశయము లేదు. రుద్రుడు నీకు, మరియు బ్రహ్మాదులకు కూడ పూజ్యుడు. ఇది నిశ్చయము.(26). నీవు ఇచటనే ఉండి జగత్తునంతనూ పాలించుము. మరియు, విశేషించి అనేక అవతారములనెత్తి, ఆ అవతారములలో వివిధ లీలలను ప్రకటించుము (27).

నా లోకములో నీ యీ స్థానము సర్వసమృద్ధమై గోలోకమని ఖ్యాతిని బడసి అద్భుతముగా ప్రకాశించగలదు (28). ఓ హరీ! భూమియందు సాధువులను రక్షించే నీ అవతారములు ఏవి రాగలవో, వారందరు నిశ్చయముగా నా భక్తులుగను, నా వరములచే ప్రీతులుగను ఉండగలరు. నేను వారిని అట్లు చూడగలను (29).

రాముడిట్లు పలికెను -

ఈ విధముగా ఉమాపతియగు శంభుడు విష్ణువునకు స్వయముగా అఖండైశ్వర్యమును సంక్రమింపజేసి, ఆ కైలాస పర్వతమునందు తన గణములతో కూడి యథేచ్ఛగా క్రీడించుచున్నాడు (30). ఆనాటి నుండియు లక్ష్మీపతి గోపవేషమును ధరించి, అచటకు ఆనందముగా వెళ్లి, గోపులకు, గోపికలకు, గోవులకు ప్రభువు ఆయెను (31).

మరియు ఆ విష్ణువు ప్రసన్నమగు మనస్సు గలవాడై శివుని యాజ్ఞచే అనేక అవతారములను ధరించి సర్వ జగత్తును రక్షించెను (32). ఆయన ఇపుడు ఇచట శంకరుని ఆజ్ఞచే నాల్గు రూపములతో అవతరించినాడు. వారిలో నేను రాముడను. భరత లక్ష్మణ శత్రుఘ్నులు మిగిలిన వారు (33).

ఓ సతీ దేవీ! నేను తండ్రి యాజ్ఞచే సీతాలక్ష్ముణులతో గూడి వనమును వచ్చితిని. ఈనాడు దైవవశమున మేము దుఃఖితులమైతిమి(34) ఎవరో ఒక రాక్షసుడు నా భార్యయగు సీతను అపహరించినాడు. నేను అట్టి విరహము గలవాడనై తమ్మునితో గూడి ఈ అడవియందు నా ప్రియురాలిని వెదకుచున్నాను. (35)

నీ దర్శనము లబించినది గాన, నాకు అన్ని విధములా క్షేమము కలుగ గలదు. ఓ సతీ తల్లీ! నీదయచే దీనిలో సందేహమును లేదు(36). నాకు నీనుండి సీత లభించుట అను వరము నిశ్చయముగా ప్రాప్తించును. నీ అనుగ్రహముచే నాకు దుఃఖమును కలుగజేసిన ఆ రాక్షసుని, ఆ పాపాత్ముని వధించెను(37).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

08 Dec 2020

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 135 , 136 / Sri Lalitha Chaitanya Vijnanam - 135, 136

🌹. శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రము - 72 / Sri Lalitha Sahasra Nama Stotram - 72 🌹
ప్రసాద్ భరద్వాజ

🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 135 , 136 / Sri Lalitha Chaitanya Vijnanam - 135, 136 🌹
సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀. పూర్తి శ్లోకము :

నిర్లేపా, నిర్మలా, నిత్యా, నిరాకారా, నిరాకులా |
నిర్గుణా, నిష్కళా, శాంతా, నిష్కామా, నిరుపప్లవా ‖ 44 ‖

🌻135. 'నిర్మలా'🌻

అజ్ఞానపూరితమగు మలము లేనిది శ్రీలలిత అని అర్థము.

మలము లంటనిది శ్రీలలిత. సృష్టికార్యమంతయు అగ్నికార్యమే. అందువలన ప్రతి ఆవరణమునందు చేతలతోపాటు మలినముకూడ యుండును. నిప్పు ఉన్న చోట పొగయుండును. పొగచూరు యుండును. అద్దమున్నచోట దుమ్ము పట్టును. వంట చేసిన పాత్రకు మసి పట్టును.

ఆహారముగాను జీవులకు మలమూత్రాదు లేర్పడును. శరీరమునకు, పంచేంద్రియములకు, మనస్సునకు, బుద్ధి, అహంకారములకు కూడ మలినము సోకుచునుండును.

ఎచ్చట జ్ఞానమను అగ్ని యుండునో అచ్చట అజ్ఞానమను పొగకూడ యుండును. ఈ అజ్ఞానమును ప్రతి నిత్యము తొలగించుకొనుట సాధన. తొలగించుకొననిచో మలమునకు బలమేర్పడును.

మలములు బలపడినచో మరణానుభూతి కూడ యుండును. అన్ని స్థితులయందలి మలినములు నిత్యము తొలగించు కొనుటయే సాధన. దీపపు కాంతి నిశ్చలముగా నిలబడుటకు గాజు చిమ్నీ వాడుచుందుము. చిమ్నీని శుభ్రముగా తుడుచుకొననిచో దీపము గోచరించదుకదా! అట్లే తనయందలి మలినములను నిర్మూలించుకొనని వానికి తాను జ్యోతి స్వరూపుడనని తెలియదు.

అట్టి నిర్మూలనమునకు శ్రీలలిత ఉపాసనమును వినియోగించు కొనవలెను.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 135 🌹
1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj

🌻Nirmalā निर्मला (135)🌻

Mala means dirt arising out of impure matter, where the afflicted mental state of an empirical individual is disabled by his own impurity causing attachment to actions viz saṁsāra. She is without such dirt. In the last nāma impurity arising out of mind was discussed and in this nāma impurities arising out of matter is being discussed.

It is to be recalled that mind and matter is Śaktī. Mala is a sense of imperfection that leads to ignorance about the soul and hampers the free expression of the Supreme Self. This ignorance is caused by ego which is called mala or ānava-mala.

This nāma says that if one gets out of attachments towards matter by dissolving his ego, knowledge is attained. Presence of mala causes avidyā (ignorance) which leads to confusion, dirt and darkness. This darkness can be dispelled by meditating on Her, thereby acquiring knowledge.

It is interesting to note that all the nāma-s that talk about nirguṇa Brahman either directly or indirectly refer to meditation.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 136 / Sri Lalitha Chaitanya Vijnanam - 136 🌹
సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀. పూర్తి శ్లోకము :

నిర్లేపా, నిర్మలా, నిత్యా, నిరాకారా, నిరాకులా |
నిర్గుణా, నిష్కళా, శాంతా, నిష్కామా, నిరుపప్లవా ‖ 44 ‖

🌻136. 'నిత్యా' 🌻

సృష్టి, స్థితి, ప్రళయ కాలములయందు యుండునది శ్రీదేవి అని అర్థము.

భూత, భవిష్యత్, వర్తమానకాలముల యందుండునది, ఎప్పుడునూ వుండునది. పరాశక్తిగను, పరాప్రకృతిగను, అన్ని కాలములయందును శ్రీలలిత ఉన్నది.

ఉండుట, లేకుండుట అనునవి అవగాహనను బట్టియేగాని, అసలు సత్యము గాదు. స్థూలముగ నున్నవి కనబడ నపుడు లేవనుకొందుము. స్థూలమున కవతరించినపుడు వున్నది అనుకొందుము. ఇది స్థూలమగు అవగాహన మాత్రమే.

స్థూలము నుండి సూక్ష్మమునకు, సూక్ష్మమునుండి స్థూలమునకు అవరోహణ, ఆరోహణ క్రమములలో సృష్టి మొత్తమూ ఎప్పుడునూ వుండనే వున్నది.

అందలి జీవులు కూడ ఎప్పుడూ ఉండనే ఉన్నారు. 'ఉన్నది పోదు, లేనిది రాదు' అని శ్రీకృష్ణుడు గీతయందు బోధించినాడు. విత్తనము రూపమున మహత్తరమగు వృక్షముండును. వృక్షము రూపమున విత్తనముండును. విత్తనము వృక్షమైనపుడు, విత్తనము గోచరింపదు. కాని మరల విత్తనము వృక్షము కాగలదు.

అట్లే సమస్త జీవులును సూక్ష్మములోనికి పోవుచూ, స్థూలములోనికి వచ్చుచూ నుందురు. ఏదోనొక స్థితిలో వస్తువుండును గాని లేకుండుట యుండదు. ఇది సత్యము.

దీనిని దర్శించుట ఋషులకే సాధ్యము. స్థూల దృష్టిగలవారికి సాధ్యము కాదు.

శ్రీలలిత పరాశక్తిగను, పరమాత్మికగ నున్నపుడును, తనకు తానే చోటువలె ఉండును. ఆత్మ ప్రేరణలచేత ఆమె నవావరణలను సృష్టించుచు నుండును. అది ఆమె నిశ్వాశ. మరల సృష్టిని తన లోనికి ఇముడ్చుకొనును. ఆది ఆమె ఉచ్ఛ్వాస. ఇన్ని లోకముల సృష్టియు ఇట్లు ఉండుట లేకుండుటగా భాసించుచు నుండును. వీటన్నిటికిని ఆమె ఆధారము. ఆమె ఎప్పుడును ఉండునది.

స్థితి భేదముల కావల ఉండునది. అవస్థితులు లేనిది అగుటచే, నిత్య అని పిలువబడుచున్నది. ఆమె ఉద్భవించుట దేవతల కార్యమునకు సహకరించుటయే. ఉన్నది ఉద్భవించును కాని, లేనిది ఉద్భవించదు కదా! ఇది తెలిసినవారు ఋషులు. తెలియనివారు కూడా నిత్యులే కాని, నిత్యులమని తెలియదు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 136 🌹
1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj

🌻Nityā नित्या (136)🌻

Nitya means eternal and without changes. As nirguṇa Brahman is being discussed, one of the qualities of the Brahman is explained here.

Bṛhadāraṇyaka Upaniṣad (IV.v.14) describes the Brahman as “the Self is indeed immutable and indestructible”. Brahman is beyond changes and exists everywhere, omnipresent.

Nitya-s are the fifteen deities representing fifteen lunar days. They are worshipped while worshipping Śrī Cakra. Each of these deities has mūla mantra and is capable of giving different siddhi-s.

{Further reading on Nitya-s: Nitya is said to be the highest object of worship and the ultimate philosophical principle in kula system.

The world kula stands for Śaktī. Apart from the fifteen nitya-s, sixteenth nitya is Lalitāmbikā Herself, who is also known as Mahā Tripurasundarī.

Out of these nitya-s, the last three nitya-s are more concerned with internal worship. There are nine tantra-s that deal with these nitya-s. It is also said that the power of Śaktī is known as nitya.]

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

08 Dec 2020

8-DECEMBER-2020 MESSAGES

1) 🌹 శ్రీమద్భగవద్గీత - 572 / Bhagavad-Gita - 572🌹
2) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 154, 155 / Vishnu Sahasranama Contemplation - 154, 155🌹
3) 🌹. కఠోపనిషత్ వివరణ - చలాచలభోధ - 125🌹
4) 🌹. శివ మహా పురాణము - 290 🌹 
5) 🌹 Guru Geeta - Datta Vaakya - 146 🌹
6) 🌹. శ్రీ లలితా సహస్ర స్తోత్రము - 72 🌹
7) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 135, 136 / Sri Lalita Chaitanya Vijnanam - 135, 136🌹
8) 🌹. శ్రీమద్భగవద్గీత - 483 / Bhagavad-Gita - 483 🌹

09) 📚. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 94 📚
10) 🌹 Light On The Path - 47🌹
11) 🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 179🌹 
12) 🌹 Seeds Of Consciousness - 243 🌹   
13) 🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 118 🌹
15) 🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 82 / Sri Vishnu Sahasranama - 82🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 572 / Bhagavad-Gita - 572 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. 17వ అధ్యాయము - శ్రద్ధాత్రయ విభాగములు - 16 🌴*

16. మన:ప్రసాద: సౌమ్యత్వం మౌనమాత్మవినిగ్రహ: |
భావసంశుద్దిరిత్యేతత్ తపో మానసముచ్యతే ||

🌷. తాత్పర్యం : 
తృప్తి, సరళత్వము, మౌనము, ఆత్మనిగ్రహము, అస్తిత్వమును పవిత్రమొనర్చుట యనునవి మానసిక తపస్సనబడును.

🌷. భాష్యము :
మనస్సును తపోసంపన్నము చేయుట యనగా దానిని ఇంద్రియభోగము నుండి దూరము చేయుటయే. ఇతరులకు మేలు చేయుతను గూర్చియే అది ఆలోచించునట్లుగా దానిని శిక్షణము గూర్చవలెను. 

ఆలోచన యందు మౌనమును కలిగియుండుటయే మనస్సుకు చక్కని శిక్షణము వంటిది. అనగా మనుజుడు కృష్ణభక్తిరసభావన నుండి ఏమాత్రము మరలక, సర్వదా ఇంద్రియభోగమును వర్జించవలెను. 

ఆ విధముగా కృష్ణభక్తిభావనను పొందుటయే స్వభావమును పవిత్రమొనర్చుకొనుట కాగలదు. మనస్సును ఇంద్రియభోగ ఆలోచన నుండి దూరము చేయుట ద్వారానే మానసిక సంతృప్తి లభింపగలదు. ఇంద్రియభోగమును గూర్చి మనమెంతగా ఆలోచింతుమో అంతగా మనస్సు అసంతృప్తికి గురియగును. 

నేటికాలమున మనము మనస్సును పలువిధములైన ఇంద్రియభోగ పద్ధతుల యందు అనవసరముగా నెలకొల్పుట వలననే మన మనస్సు తృప్తినొందు అవకాశమును పొందకున్నది. వేదవాజ్మయము వైపునకు దానిని మళ్ళించుటయే ఉత్తమమార్గము. 

అట్టి వాజ్మయము పురాణములు, మహాభారతములలో వలె మనస్తృప్తికర కథలను కలిగియుండును. మనుజుడు ఆ జ్ఞానము యొక్క లాభమును గొని పవిత్రుడు కాగలడు. మనస్సు సర్వదా వంచన స్వభావ వర్జితమై, ఇతరుల శ్రేయస్సునే తలుపవలెను. 

ఆత్మానుభవమును గూర్చి మనుజుడు సదా యోచించుటయే మౌనమనుదాని భావము. ఇట్టి భావన దృష్ట్యా కృష్ణభక్తిరసభావితుడైన భక్తుడు సంపూర్ణ మౌనమును పాటించనివాడే యగుచున్నాడు. మనోనిగ్రహమనగా మనస్సును ఇంద్రియభోగానుభవము నుండి దూరము చేయుటని భావము. 

అంతియేగాక మనుజుడు తన వ్యవహారములందు ఋజుత్వమును కలిగియుండి, తద్ద్వారా తన అస్తిత్వమును పవిత్రమొనర్చుకొనవలెను. ఈ లక్షణములన్నియును కలసి మానసిక తపస్సనబడును.
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 572 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

*🌴 Chapter 17 - The Divisions of Faith - 16 🌴*

16. manaḥ-prasādaḥ saumyatvaṁ
maunam ātma-vinigrahaḥ
bhāva-saṁśuddhir ity etat
tapo mānasam ucyate

🌷 Translation : 
And satisfaction, simplicity, gravity, self-control and purification of one’s existence are the austerities of the mind.

🌹 Purport :
To make the mind austere is to detach it from sense gratification. It should be so trained that it can be always thinking of doing good for others. The best training for the mind is gravity in thought. 

One should not deviate from Kṛṣṇa consciousness and must always avoid sense gratification. To purify one’s nature is to become Kṛṣṇa conscious. Satisfaction of the mind can be obtained only by taking the mind away from thoughts of sense enjoyment. The more we think of sense enjoyment, the more the mind becomes dissatisfied.

 In the present age we unnecessarily engage the mind in so many different ways for sense gratification, and so there is no possibility of the mind’s becoming satisfied. The best course is to divert the mind to the Vedic literature, which is full of satisfying stories, as in the Purāṇas and the Mahābhārata. 

One can take advantage of this knowledge and thus become purified. The mind should be devoid of duplicity, and one should think of the welfare of all. Silence means that one is always thinking of self-realization. The person in Kṛṣṇa consciousness observes perfect silence in this sense. 

Control of the mind means detaching the mind from sense enjoyment. One should be straightforward in his dealings and thereby purify his existence. All these qualities together constitute austerity in mental activities.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 154, 155 / Vishnu Sahasranama Contemplation - 154, 155 🌹*
📚. ప్రసాద్ భరద్వాజ 

*🌻154. అమోఘః, अमोघः, Amoghaḥ🌻*

*ఓం అమోఘాయ నమః | ॐ अमोघाय नमः | OM Amoghāya namaḥ*

న మోఘం యస్య మోఘము అనగా నిష్ఫలము కాని చేష్టితము ఎవనికి కలదో అట్టివాడు.

:: పోతన భాగవతము - ప్రథమ స్కంధము ::
మ. భువనశ్రేణి నమోఘలీలుఁ డగుచుం బుట్టించు రక్షించు నం
త విధిం జేయు, మునుంగఁ డందు; బహుభూత వ్రాతమం దాత్మ తం
త్రవిహారస్థితుఁడై షడింద్రియ సమస్త ప్రీతియున్ దవ్వులన్‍
దివి భంగి గొనుఁజిక్కఁ; డింద్రియములం ద్రిప్పున్ నిబంధించుచున్‍.

శ్రీమన్నారాయణుడు ఈ సకల భువన జాలాన్నీ తన అమోఘమైన లీలావిలాసం చేత పుట్టిస్తుంటాడు, రక్షిస్తుంటాడు, అంతం చేస్తూ ఉంటాడు. అంతే కాని తాను మాత్రం ఆ జన్మ మరణాలతో నిమగ్నం కాడు. అనేకమైన ప్రాణి సమూహమందు ఆత్మస్వరూపుడై విహరిస్తుంటాడు. ఎంతో దూరంలో అందకుండా స్వర్గంలాగా ఉండి, జీవుల ఇంద్రియాలకు సంతోషాన్ని సంతరిస్తూ, తాను మాత్రం ఇంద్రియాలకు అతీతతుడుగా, నియంతయై ఇంద్రియాలను తన ఇష్టం వచ్చినట్లు త్రిప్పుతూ ఉంటాడు.

110. అమోఘః, अमोघः, Amoghaḥ

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION - 154🌹*
📚. Prasad Bharadwaj 

*🌻154. Amoghaḥ🌻*

*OM Amoghāya namaḥ*

Na moghaṃ yasya / न मोघं यस्य He whose actions never go in vain.

Śrīmad Bhāgavata - Canto 1, Chapter 3
Sa vā idaṃ viśvamamoghalīlaḥ sr̥jatyavatyatti na sajjate’smin,
Bhūteṣu cāntarhita ātmatantra ṣāḍvargikaṃ jighrati ṣaḍguṇeśaḥ. (36)

:: श्रीमद्भागवते प्रथमस्कन्धे तृतीयोऽध्यायः ::
स वा इदं विश्वममोघलीलः सृजत्यवत्यत्ति न सज्जतेऽस्मिन्‌ ।
भूतेषु चान्तर्हित आत्मतन्त्र षाड्वर्गिकं जिघ्रति षड्गुणेशः ॥ ३६ ॥

The Lord, whose activities never go in vain, is the master of the six senses and is fully omnipotent with six opulences. He creates the manifested universes, maintains them and annihilates them without being, in the least, affected. He is within every living being and is always independent.

110. అమోఘః, अमोघः, Amoghaḥ

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
उपेन्द्रो वामनः प्रांशुरमोघश्शुचिरूर्जितः ।अतीन्द्रस्संग्रहस्सर्गो धृतात्मा नियमो यमः ॥ १७ ॥

ఉపేన్ద్రో వామనః ప్రాంశురమోఘశ్శుచిరూర్జితః ।అతీన్ద్రస్సంగ్రహస్సర్గో ధృతాత్మా నియమో యమః ॥ ౧౭ ॥

Upendro vāmanaḥ prāṃśuramoghaśśucirūrjitaḥ ।Atīndrassaṃgrahassargo dhr̥tātmā niyamo yamaḥ ॥ 17 ॥

Continues....
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 155 / Vishnu Sahasranama Contemplation - 155 🌹*
📚. ప్రసాద్ భరద్వాజ 

*🌻155. శుచిః, शुचिः, Śuciḥ🌻*

*ఓం శుచయే నమః | ॐ शुचये नमः | OM Śucaye namaḥ*

స్తువతామర్చయతాం చ స్మరతాం పావనత్వతః ।
తథాఽస్య స్పర్శ ఇత్యాదిమంత్రవర్ణాచ్ఛుచిర్హరిః ॥ 

పవిత్రుడు. పవిత్రతను కలిగించువాడు. స్తుతించువారినీ, అర్చించిన వారినీ, స్మరించు వారినీ హరి పవిత్రులనుగా చేయును. అదిగాక ఆయన స్పర్శమును పవిత్రము కావున విష్ణువు శుచిః అని చెప్పబడును.

:: శ్రీమద్భాగవతము - నవమస్కన్ధము, దశమోఽధ్యాయము ::
ఏకపత్నీవ్రతధరో రాజర్షిచరితః శుచిః ।
స్వధర్మం గృహమేధీయం శిక్షయాన్స్వయమాచరత్ ॥ 55 ॥

ఏకపత్నీవ్రతమును పాటించినవాడూ, రాజర్షి వంటి చరితము గలవాడూ, పవిత్రుడూ అయిన శ్రీరామచంద్రుడు గృహస్తులకు స్వధర్మమును తన స్వీయ ఆచరణద్వారా నేర్పినాడు.

:: పోతన భాగవతము - అష్టమ స్కంధము, గజేంద్ర మోక్షము ::
సీ.భవము దోషంబు రూపంబుఁ గర్మంబు నాహ్వయమును గుణమును లెవ్వనికి లేకజగములఁ గలిగించు సమయించు కొఱకునై నిజమాయ నెవ్వఁ డిన్నియును దాల్చునా పరమేశునకు ననంతశక్తికి బ్రహ్మ కిద్దరూపికి రూపహీనునకుజిత్రచారునికి సాక్షికి నాత్మరుచికినిఁ బరమాత్మునకుఁ బరబ్రహ్మమునకుఆ.మాటలను నెఱుకల మనములఁ జేరంగఁ, గాని శుచికి సత్త్వగమ్యుఁ డగుచునిపుణుఁడైన వాని నిష్కర్మతకు మెచ్చు, వాని కే నొనర్తు వందనములు.

భగవంతునికి పుట్టుకా, పాపమూ, ఆకారమూ, కర్మా, నామాలూ, గుణాలూ లేవు. అతడు లోకాలను పుట్టించి నశింపజేయడం కోసము తన మాయాప్రభావముతో ఇవన్నీ ధరిస్తాడు. రూపం లేనివాడైనా ఆశ్చర్యకరంగా అంతులేని శక్తితో నిండైన రూపాన్ని పొందుతాడు. అన్నింటినీ చూస్తాడు. ఆత్మకాంతిలో వెలుగుతాడు. అతడే ఆత్మకు మూలం; అతడే మోక్షానికి అధికారి. అతడు మాటలకూ ఊహలకూ అందరానివాడు; పరిశుద్ధుడు. సత్త్వగుణంతో దరిజేర దగినవాడు. నేర్పరులు చేసే ఫలాపేక్షలేని కర్మలకు సంతోషిస్తాడు. అటువంటి దేవునికి నేను నమస్కారాలు చేస్తాను.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION - 155🌹*
📚. Prasad Bharadwaj 

*🌻155. Śuciḥ🌻*

*OM Śucaye namaḥ*

Stuvatāmarcayatāṃ ca smaratāṃ pāvanatvataḥ,
Tathā’sya sparśa ityādimaṃtravarṇācchucirhariḥ.

स्तुवतामर्चयतां च स्मरतां पावनत्वतः ।
तथाऽस्य स्पर्श इत्यादिमंत्रवर्णाच्छुचिर्हरिः ॥

One who purifies those who think of, praise and worship Him. His very contact is purifying.

Śrīmad Bhāgavata - Canto 9, Chapter 10
Ekapatnīvratadharo rājarṣicaritaḥ śuciḥ,
Svadharmaṃ gr̥hamedhīyaṃ śikṣayānsvayamācarat. (55)

Lord Rāmacandra who practiced monogamy, conducted His life as a Rājarṣi i.e., a Saintly King, pure - untinged by qualities like anger; taught good behavior for everyone, especially the householders by setting an example of Himself and His personal activities.

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
उपेन्द्रो वामनः प्रांशुरमोघश्शुचिरूर्जितः ।अतीन्द्रस्संग्रहस्सर्गो धृतात्मा नियमो यमः ॥ १७ ॥

ఉపేన్ద్రో వామనః ప్రాంశురమోఘశ్శుచిరూర్జితః ।అతీన్ద్రస్సంగ్రహస్సర్గో ధృతాత్మా నియమో యమః ॥ ౧౭ ॥

Upendro vāmanaḥ prāṃśuramoghaśśucirūrjitaḥ ।Atīndrassaṃgrahassargo dhr̥tātmā niyamo yamaḥ ॥ 17 ॥

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 125 🌹*
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్ 
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. ఆత్మను తెలుసుకొను విధము - 55 🌻*

నచికేతుడు తనలో తాను ఇట్లు అనుకొనుచున్నాడు. సూక్ష్మబుద్ధితో, సూక్ష్మాతిసూక్ష్మమైన ఈ ఆత్మను తెలిసికొనవచ్చునని, ఇంతవరకూ యమధర్మరాజు చెప్పియున్నాడు. 

ఆయన చెప్పినంత సులభముగా ఆత్మను అందరూ గుర్తించ లేకున్నారు. అట్లు ఆత్మను గుర్తించకుండుటకు ప్రతిబంధ కారణములు ఏవైనా ఉన్నవేమో తెలిసికొని, తొలగించుకొనవచ్చును గదా యని, తలంచు చుండగా అతని సంశయుమును గ్రహించిన యమధర్మరాజు ప్రతిబంధ కారణములను ఈ విధముగా చెప్పుచున్నాడు.
       
         కోహం బంధః, తప్పక ప్రతీ ఒక్కరూ విచారణ చేయవలసినటువంటి ప్రశ్న ఇది. నాకు బంధకారణమేమి? కోహం బంధః? అనే విచారణ చేసినట్లయితే,

 పంచభూతముల చేత, ప్రేరేపింపబడుతున్నటువంటి ప్రకృతి చేత ప్రేరితమౌతున్నటువంటి, త్రిగుణాత్మకమైనటువంటి వ్యామోహము చేత, మాలిన్యము చేత, ప్రేరేపింపబడేటటువంటి, మనస్సు అనేటటువంటి, బుద్ధి అనేటటువంటి, అంతర ఇంద్రియాల ద్వారా అంతఃకరణ చతుష్టయాన్ని చక్కగా ఎఱిగి, ఆ అంతఃకరణ చతుష్టయ సాక్షి అయినటువంటి జ్ఞాత నేనని ఎఱిగి,

 అట్టి జ్ఞాత స్థానములో తాను స్థిరముగా నిలబడి ఉండి, మిగిలినటువంటి 24 తత్త్వములను తన ఆధారముగనే తాను నడిపించుచున్నాడనేటటువంటి సత్యమును గ్రహించి, అవి తనకి పనిముట్లని గ్రహించి, తాను సహజముగా స్వస్వరూపుడునని, స్వయం ప్రకాశకుడనని, తన ప్రభావం చేత మాత్రమె, మిగిలిన 24 తత్వములు సమర్థవంతములు అగుచున్నవని 

పిండాండ పంచీకరణ, బ్రహ్మాండ పంచీకరణములను లెస్సగా పరిశీలించినటువంటి వాడై, ప్రతి ఒక్క విశేషములను స్పష్టముగా ఎఱిగినటువంటి వాడై, సాంఖ్య తారక అమనస్క విధిని ఎఱిగినవాడై, తనను తాను విరమింప చేసుకుని, 

తనను తాను తెలుసుకుని, తనను తాను పోగొట్టుకొనేటటువంటి రాజయోగ మార్గములో ప్రయాణము చేయవలసినటువంటి అవసరము ఉన్నది. అలా ఎవరైతే మనస్సును విరమింప చేయగలుగుతున్నారో, వాళ్ళు మాత్రమే ఈ ముక్తి పథంలో నడువగలుగుతున్నారు.
    
     ఎవరైతే బాహ్య వ్యవహారముల నందు మగ్నత చెంది ఉంటారో, బాహ్య వ్యవహారం బలంగా ఉంటుందో, బాహ్య వ్యవహారములయందు, సుఖదుఃఖముల యందు ఆసక్తి కలిగియుంటారో వారందరూ తప్పక మరల జనన మరణ జరామరణ చక్రములో ప్రవేశింపక తప్పదు. సంసార చక్రములో పరిభ్రమింపక తప్పదు. అవిద్యా మోహము చేత బాధింపబడక తప్పదు. మనోభ్రాంతి చేత లాగబడక తప్పదు. 

ఇట్లు గ్రహించనటువంటి వారు, వివేచనా శీలియై, వివేకముతో తమను తాము, తనలో ఉన్నటువంటి, యథార్థమైనటువంటి సర్వకాల సర్వ అవస్థలయందు మార్పు చెందనటువంటి, పరిణామ శీలము కానటువంటి, ఆత్మతత్వమును ఎఱిగేటటువంటి గొప్ప ప్రయత్నాన్ని చేయాలి. ఈ సత్యాన్ని ప్రతీ ఒక్కరూ గుర్తెరగాలి.

         మనస్సు ఇంద్రియములతో కూడినప్పుడే అవి వాని వాని విషయములను గ్రహించగలుగును. లేనిచో ఇంద్రియములు విషయములను గ్రహించుట లేదు. ఆత్మ దర్శనము కావలయునని, మనస్సు అంతర్ముఖము కావలయును.

 one cannot serve two masters అన్నట్లు ఒక సేవకుడు ఇద్దరు యజమానులను సేవింపలేనట్లు, మనస్సు అంతరముగా ఉన్న ఆత్మను, బాహ్యముగా ఉన్న శబ్దాది విషయములను, ఒకేసారి గ్రహించలేదు. శబ్దాది విషయములనుండి ఇంద్రియములను మరల్చిన గానీ, మనస్సు బాహ్య విషయముల నుండి మరలుటలేదు. ధ్యాన శీలుడైన వ్యక్తి మాత్రమే, ఇంద్రియములను నిగ్రహించి మనస్సును అంతర్ముఖము చేసుకొనగలడు.

         అతి ముఖ్యమైనటువంటి రహస్యాన్ని ఇక్కడ చెబుతున్నారు. ధ్యానశీలుడైన వ్యక్తి మాత్రమే ఇంద్రియముల నుండి గ్రహించి, మనస్సును అంతర్ముఖము చేసికొన గలడు. ఈ రహస్య సూత్రాన్ని మనం మానవ జీవితంలో బాగా ఆశ్రయించ వలసినటువంటి అవసరమున్నది.

 ధ్యానము అంటే ఏదో ఒక పది నిమిషాలో, పదిహేను నిమిషాలో, ఐదు నిమిషాలో, మూడు నిమిషాలో, గంటో, అరగంటో చేసేటటువంటి తాత్కాలికమైన ప్రయత్నం కాదు. సహజ ధ్యాన శీలియై ఉండాలి. సమాధినిష్ఠుడై ఉండాలి. - విద్యా సాగర్ గారు 

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 290🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴* 
70. అధ్యాయము - 25

*🌻. సతీ వియోగము - 2 🌻*

మహేశ్వరుడిట్లు పలికెను -

నీవు లోకములన్నింటికీ నా ఆజ్ఞచే కర్తవు. భరించువాడవు, హరించు వాడవు. ధర్మ, అర్థ, కామముల నిచ్చువాడవు, దుర్మార్గులను శిక్షించువాడవు (20). నీవు జగత్తునకు ప్రభువు. నీకు జగత్తునకు పూజ్యుడవు. మహాబల పరాక్రమములు గల నీవు ఎక్కడనైననూ నాకు కూడా జయింప శక్యము కానివాడవు కాగలవు(21). 

నేను నీకు ఇచ్ఛా జ్ఞాన క్రియా శక్తులను ఇచ్చెదను. నీవు స్వీకరింపుము. ముల్లోకములలో అనేక లీలలను ప్రకటించగలిగే మహిమను, స్వాతంత్ర్యమును స్వీకరింపుము (22). 

ఓ హరీ! నిన్ను ద్వేషించువారిని నేను ప్రయత్నపూర్వకముగా దండించుట నిశ్చయము. ఓ విష్ణో! నీ భక్తులకు నేను ఉత్తమమగు మోక్షము నిచ్చెదను (23).

దేవతలు కూడ తపింప శక్యము కాని ఈ మాయనను కూడా స్వీకరించుము. దీనిచే సంమోహితమైన జగత్తు జడాత్మకమగును (24). ఓ హరీ! నీవు నా ఎడమ చేయి. ఈ బ్రహ్మ నా కుడిచేయి. ఈ బ్రహ్మకు కూడా నీవు తండ్రివి. రక్షకుడవు కాగలవు (25). 

రుద్రుడు నా హృదయము. నేనే రుద్రుడు. దీనిలో సంశయము లేదు. రుద్రుడు నీకు, మరియు బ్రహ్మాదులకు కూడ పూజ్యుడు. ఇది నిశ్చయము.(26). నీవు ఇచటనే ఉండి జగత్తునంతనూ పాలించుము. మరియు, విశేషించి అనేక అవతారములనెత్తి, ఆ అవతారములలో వివిధ లీలలను ప్రకటించుము (27).

నా లోకములో నీ యీ స్థానము సర్వసమృద్ధమై గోలోకమని ఖ్యాతిని బడసి అద్భుతముగా ప్రకాశించగలదు (28). ఓ హరీ! భూమియందు సాధువులను రక్షించే నీ అవతారములు ఏవి రాగలవో, వారందరు నిశ్చయముగా నా భక్తులుగను, నా వరములచే ప్రీతులుగను ఉండగలరు. నేను వారిని అట్లు చూడగలను (29).

రాముడిట్లు పలికెను -

ఈ విధముగా ఉమాపతియగు శంభుడు విష్ణువునకు స్వయముగా అఖండైశ్వర్యమును సంక్రమింపజేసి, ఆ కైలాస పర్వతమునందు తన గణములతో కూడి యథేచ్ఛగా క్రీడించుచున్నాడు (30). ఆనాటి నుండియు లక్ష్మీపతి గోపవేషమును ధరించి, అచటకు ఆనందముగా వెళ్లి, గోపులకు, గోపికలకు, గోవులకు ప్రభువు ఆయెను (31). 

మరియు ఆ విష్ణువు ప్రసన్నమగు మనస్సు గలవాడై శివుని యాజ్ఞచే అనేక అవతారములను ధరించి సర్వ జగత్తును రక్షించెను (32). ఆయన ఇపుడు ఇచట శంకరుని ఆజ్ఞచే నాల్గు రూపములతో అవతరించినాడు. వారిలో నేను రాముడను. భరత లక్ష్మణ శత్రుఘ్నులు మిగిలిన వారు (33).

ఓ సతీ దేవీ! నేను తండ్రి యాజ్ఞచే సీతాలక్ష్ముణులతో గూడి వనమును వచ్చితిని. ఈనాడు దైవవశమున మేము దుఃఖితులమైతిమి(34) ఎవరో ఒక రాక్షసుడు నా భార్యయగు సీతను అపహరించినాడు. నేను అట్టి విరహము గలవాడనై తమ్మునితో గూడి ఈ అడవియందు నా ప్రియురాలిని వెదకుచున్నాను. (35) 

నీ దర్శనము లబించినది గాన, నాకు అన్ని విధములా క్షేమము కలుగ గలదు. ఓ సతీ తల్లీ! నీదయచే దీనిలో సందేహమును లేదు(36). నాకు నీనుండి సీత లభించుట అను వరము నిశ్చయముగా ప్రాప్తించును. నీ అనుగ్రహముచే నాకు దుఃఖమును కలుగజేసిన ఆ రాక్షసుని, ఆ పాపాత్ముని వధించెను(37).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 Guru Geeta - Datta Vaakya - 146 🌹*
✍️ Sadguru Ganapathi Sachidananda
📚. Prasad Bharadwaj
138

Sloka: 
Yadrcchaya copapannam hyalpam bahula meva va | Niragenaiva bhunjita abhyasa samaye muda ||

In spiritual practice, the body, the clothes and food aid in development. These also act as distractions. Not only do they aid in development, they also distract. A real aspirant will not worry about food, sleep or shame during his spiritual practice. 

An aspirant should let go of shame, should not yearn for food or for sleep. Nor should he yearn for a small shelter or for good clothes to cover him. He should also cast aside shame. Without worrying about any of these things, the aspirant must only focus on God.

Some people gather all paraphernalia like fans, pillows and air conditioning to set up for their spiritual practice. If the fan goes out of order, they’ll have hand-fans. They’ll set up a supply of beverages and juices for themselves. What kind of meditation is that? They’ll attend to phone calls in between and take a quick break by sleeping a little. 

This is what they do because they claim they are on a fast during their spiritual practice. What spiritual practice is this? If they are unable to concentrate, they will continue this vow for a few more days. What kind of vow is this? What spiritual practice is this? I don’t understand.

One should not care for fans, pillows and air conditioning during spiritual practice. Some others undertake rituals after eating sumptuous meals. 

They will eat on time, undertake rituals, penance, yoga and vows in between and eat again at the right time. They will then resume their rituals and vows. They will have done some yoga, and on the pretext of meditating while relaxing, they would have gotten some sleep.

Again in the afternoon, because they claim they don’t eat during spiritual practice, they drink 4 cups of coffee, 5 cups of tea and 3 glasses of juice. They come back and resume meditating and praying. In the night, they will eat 4 platefuls. 

Again, in the bed, they think they are going into “samadhi” while falling asleep. They think they are seeing God in their sleep and are visiting Vaikuntha (the abode of Lord Vishnu) in their dreams. Of course he’ll go to Vaikuntha, if he eats so much food. He thinks, “I went to Vaikuntha and sat there. 

There were a lot of people there. I got Indra’s position because I meditated so much and worked so hard”. What work did he do? Eating and drinking is hard work ? “…because I worked so hard and punished my body physically”.

 How did he punish his body with all those comfortable pillows around him? This is not the right way to meditate at all.
In spiritual practice, one must punish the body appropriately. One must eat just enough food to survive. 

One must neither eat (too much) to dullness nor starve to death. One must not sacrifice the body by not eating. A lot of people become anorexic from starving. That brings more trouble. The person will need to be put in the hospital. 

The person’s friends and relatives will need to pray for him. He will need medicines, special injections, saline etc. They will need to burn through more money for him. His spiritual practice is costing the others dearly.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రము - 72 / Sri Lalitha Sahasra Nama Stotram - 72 🌹*
*ప్రసాద్ భరద్వాజ*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 135, 136 / Sri Lalitha Chaitanya Vijnanam - 135, 136 🌹*
*సహస్ర నామముల తత్వ విచారణ*
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ 
మూల మంత్రము : 
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀. పూర్తి శ్లోకము :*
*నిర్లేపా, నిర్మలా, నిత్యా, నిరాకారా, నిరాకులా |*
*నిర్గుణా, నిష్కళా, శాంతా, నిష్కామా, నిరుపప్లవా ‖ 44 ‖*

*🌻135. 'నిర్మలా'🌻

అజ్ఞానపూరితమగు మలము లేనిది శ్రీలలిత అని అర్థము.

మలము లంటనిది శ్రీలలిత. సృష్టికార్యమంతయు అగ్నికార్యమే. అందువలన ప్రతి ఆవరణమునందు చేతలతోపాటు మలినముకూడ యుండును. నిప్పు ఉన్న చోట పొగయుండును. పొగచూరు యుండును. అద్దమున్నచోట దుమ్ము పట్టును. వంట చేసిన పాత్రకు మసి పట్టును. 

ఆహారముగాను జీవులకు మలమూత్రాదు లేర్పడును. శరీరమునకు, పంచేంద్రియములకు, మనస్సునకు, బుద్ధి, అహంకారములకు కూడ మలినము సోకుచునుండును. 

ఎచ్చట జ్ఞానమను అగ్ని యుండునో అచ్చట అజ్ఞానమను పొగకూడ యుండును. ఈ అజ్ఞానమును ప్రతి నిత్యము తొలగించుకొనుట సాధన. తొలగించుకొననిచో మలమునకు బలమేర్పడును.  

మలములు బలపడినచో మరణానుభూతి కూడ యుండును. అన్ని స్థితులయందలి మలినములు నిత్యము తొలగించు కొనుటయే సాధన. దీపపు కాంతి నిశ్చలముగా నిలబడుటకు గాజు చిమ్నీ వాడుచుందుము. చిమ్నీని శుభ్రముగా తుడుచుకొననిచో దీపము గోచరించదుకదా! అట్లే తనయందలి మలినములను నిర్మూలించుకొనని వానికి తాను జ్యోతి స్వరూపుడనని తెలియదు.

అట్టి నిర్మూలనమునకు శ్రీలలిత ఉపాసనమును వినియోగించు కొనవలెను.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 135 🌹*
*1000 Names of Sri Lalitha Devi* 
✍️. Ravi Sarma 
📚. Prasad Bharadwaj

*🌻Nirmalā निर्मला (135)🌻*

Mala means dirt arising out of impure matter, where the afflicted mental state of an empirical individual is disabled by his own impurity causing attachment to actions viz saṁsāra. She is without such dirt. In the last nāma impurity arising out of mind was discussed and in this nāma impurities arising out of matter is being discussed. 

 It is to be recalled that mind and matter is Śaktī. Mala is a sense of imperfection that leads to ignorance about the soul and hampers the free expression of the Supreme Self. This ignorance is caused by ego which is called mala or ānava-mala.  

This nāma says that if one gets out of attachments towards matter by dissolving his ego, knowledge is attained. Presence of mala causes avidyā (ignorance) which leads to confusion, dirt and darkness. This darkness can be dispelled by meditating on Her, thereby acquiring knowledge. 

It is interesting to note that all the nāma-s that talk about nirguṇa Brahman either directly or indirectly refer to meditation. 

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 136 / Sri Lalitha Chaitanya Vijnanam - 136 🌹*
*సహస్ర నామముల తత్వ విచారణ*
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ 
మూల మంత్రము : 
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀. పూర్తి శ్లోకము :*
*నిర్లేపా, నిర్మలా, నిత్యా, నిరాకారా, నిరాకులా |*
*నిర్గుణా, నిష్కళా, శాంతా, నిష్కామా, నిరుపప్లవా ‖ 44 ‖*

*🌻136. 'నిత్యా' 🌻

సృష్టి, స్థితి, ప్రళయ కాలములయందు యుండునది శ్రీదేవి అని అర్థము. 

భూత, భవిష్యత్, వర్తమానకాలముల యందుండునది, ఎప్పుడునూ వుండునది. పరాశక్తిగను, పరాప్రకృతిగను, అన్ని కాలములయందును శ్రీలలిత ఉన్నది. 

ఉండుట, లేకుండుట అనునవి అవగాహనను బట్టియేగాని, అసలు సత్యము గాదు. స్థూలముగ నున్నవి కనబడ నపుడు లేవనుకొందుము. స్థూలమున కవతరించినపుడు వున్నది అనుకొందుము. ఇది స్థూలమగు అవగాహన మాత్రమే. 

స్థూలము నుండి సూక్ష్మమునకు, సూక్ష్మమునుండి స్థూలమునకు అవరోహణ, ఆరోహణ క్రమములలో సృష్టి మొత్తమూ ఎప్పుడునూ వుండనే వున్నది.

అందలి జీవులు కూడ ఎప్పుడూ ఉండనే ఉన్నారు. 'ఉన్నది పోదు, లేనిది రాదు' అని శ్రీకృష్ణుడు గీతయందు బోధించినాడు. విత్తనము రూపమున మహత్తరమగు వృక్షముండును. వృక్షము రూపమున విత్తనముండును. విత్తనము వృక్షమైనపుడు, విత్తనము గోచరింపదు. కాని మరల విత్తనము వృక్షము కాగలదు. 

అట్లే సమస్త జీవులును సూక్ష్మములోనికి పోవుచూ, స్థూలములోనికి వచ్చుచూ నుందురు. ఏదోనొక స్థితిలో వస్తువుండును గాని లేకుండుట యుండదు. ఇది సత్యము. 

దీనిని దర్శించుట ఋషులకే సాధ్యము. స్థూల దృష్టిగలవారికి సాధ్యము కాదు. 

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 136 🌹*
*1000 Names of Sri Lalitha Devi* 
✍️. Ravi Sarma 
📚. Prasad Bharadwaj

*🌻Nityā नित्या (136)🌻*

Nitya means eternal and without changes. As nirguṇa Brahman is being discussed, one of the qualities of the Brahman is explained here.  

 Bṛhadāraṇyaka Upaniṣad (IV.v.14) describes the Brahman as “the Self is indeed immutable and indestructible”. Brahman is beyond changes and exists everywhere, omnipresent.

Nitya-s are the fifteen deities representing fifteen lunar days. They are worshipped while worshipping Śrī Cakra. Each of these deities has mūla mantra and is capable of giving different siddhi-s.

{Further reading on Nitya-s: Nitya is said to be the highest object of worship and the ultimate philosophical principle in kula system.  

The world kula stands for Śaktī. Apart from the fifteen nitya-s, sixteenth nitya is Lalitāmbikā Herself, who is also known as Mahā Tripurasundarī.  

Out of these nitya-s, the last three nitya-s are more concerned with internal worship. There are nine tantra-s that deal with these nitya-s. It is also said that the power of Śaktī is known as nitya.]

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీమద్భగవద్గీత - 483 / Bhagavad-Gita - 483 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. 13వ అధ్యాయము - క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం - ప్రకృతి, పురుషుడు, చైతన్యము - 28 🌴*

28. సమం సర్వేషు భూతేషు తిష్టన్తం పరమేశ్వరమ్ |
వినశ్యత్స్వవినశ్యన్తం య: పశ్యతి స పశ్యతి ||

🌷. తాత్పర్యం : 
సర్వదేహములందు ఆత్మను గూడియుండు పరమాత్మను గాంచువాడు మరియు నాశవంతమైన దేహమునందలి ఆత్మ, పరమాత్మ లిరువురిని ఎన్నడును నశింపరానివారుగా తెలిసికొనగలిగినవాడు యథార్థదృష్టిని కలిగినవాడు.

🌷. భాష్యము :
దేహము, దేహయజమానియైన ఆత్మ, ఆత్మ యొక్క మిత్రుడు అనెడి మూడు విషయములను సత్సాంగత్యముచే దర్శింపగలిగినవాడు యథార్థముగా జ్ఞానవంతుడు. ఆధ్యాత్మిక విషయముల యథార్థజ్ఞానము కలిగినవాని సాంగత్యము లేకుండా ఆ మూడు విషయములను ఎవ్వరును దర్శింపలేరు. అట్టి జ్ఞానవంతుల సాంగత్యము లేనివారు అజ్ఞానులు. వారు కేవలము దేహమునే గాంచుచు, దేహము నశించిన పిమ్మట సర్వము ముగియునని తలతురు. కాని వాస్తవమునకు అట్టి భావన సరియైనది కాదు. దేహము నశించిన పిమ్మటయు ఆత్మ, పరమాత్మ లిరువురు నిలిచియుందురు. అంతియేగాక వారు అనంతముగా పలువిధములైన స్థావర, జంగమ రూపములలో తమ అస్తిత్వమును కొనసాగింతురు. జీవాత్మ దేహమునకు యజమానియైనందున “పరమేశ్వర” అను పదమునకు కొన్నిమార్లు జీవాత్మగా అర్థము చెప్పబడుచుండును. అట్టి ఆత్మ దేహము నశించిన పిమ్మట వేరొక దేహమును పొందుచుండును. ఈ విధముగా ఆత్మ దేహమునకు యజమానిగా తెలియబడుచుండును. కాని కొందరు “పరమేశ్వర” అను పదమునకు పరమాత్ముడని అర్థము చెప్పుదురు. ఈ రెండు భావములందును ఆత్మ మరియు పరమాత్మలు శాశ్వతముగా నిలుచువారే. వారెన్నడును నశింపరు. ఈ విధముగా ఆత్మ, పరమాత్మలను దర్శించువాడు జరుగుచున్నదానిని యథార్థముగా గాంచగలడు. 
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 483 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

*🌴 Chapter 13 - Kshetra Kshtrajna Vibhaga Yoga - Nature, the Enjoyer and Consciousness - 28 🌴*

28. samaṁ sarveṣu bhūteṣu
tiṣṭhantaṁ parameśvaram
vinaśyatsv avinaśyantaṁ
yaḥ paśyati sa paśyati

🌷 Translation : 
One who sees the Supersoul accompanying the individual soul in all bodies, and who understands that neither the soul nor the Supersoul within the destructible body is ever destroyed, actually sees.

🌹 Purport :
Anyone who by good association can see three things combined together – the body, the proprietor of the body, or individual soul, and the friend of the individual soul – is actually in knowledge. Unless one has the association of a real knower of spiritual subjects, one cannot see these three things. Those who do not have such association are ignorant; they simply see the body, and they think that when the body is destroyed everything is finished. But actually it is not so. After the destruction of the body, both the soul and the Supersoul exist, and they go on eternally in many various moving and nonmoving forms. The Sanskrit word parameśvara is sometimes translated as “the individual soul” because the soul is the master of the body and after the destruction of the body he transfers to another form. In that way he is master. But there are others who interpret this parameśvara to be the Supersoul. In either case, both the Supersoul and the individual soul continue. They are not destroyed. One who can see in this way can actually see what is happening.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. గీతోపనిషత్తు - 93 🌹*
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

*🍀 26 - 6 . ప్రాణాయామ యజ్ఞము - ప్రాణవాయువు ముక్కు పుటముల నుండి భ్రూమధ్యము వరకు ప్రవేశించి, అచటి నుండి వాయునాళము ద్వారా ఉపిరితిత్తుల వరకు వ్యాపించి యుండును. ప్రాణ వాయువును పూర్ణముగ పీల్చుట చాల ముఖ్యము. పరిపూర్ణముగ శ్వాసను పీల్చుట వలన ఎన్నియో రోగముల నరికట్టవచ్చును. 🍀*

*📚. 4. జ్ఞానయోగము - 29, 30 📚*
Part 6

పంచప్రాణములు దేహమున ఈ క్రింది భాగములలో పనిచేయుచున్నవి. 

*🌷 1. ప్రాణవాయువు: 🌷*

ఇది శ్వాస ద్వారా పీల్చబడుచున్నది. ముక్కుపుటముల నుండి ఉదర వితానము క్రింది భాగము వరకు ఈ వాయువు పనిచేయు చుండును.

కావున కనుబొమల నుండి ఉదర వితానము వరకు గల శరీర భాగములు, వాని స్వస్థత ఈ వాయువు బలమునకు సంబంధించి యున్నవి. ప్రాణవాయువు బలముగ స్వీకరింపబడుచున్నచో ఈ శరీర భాగమంతయు ప్రాణబలముతో కూడిన అస్వస్థతను దరిచేరనీయదు.

 ప్రాణవాయువు ముక్కు పుటముల నుండి భ్రూమధ్యము వరకు ప్రవేశించి, అచటి నుండి వాయునాళము ద్వారా ఉపిరితిత్తుల వరకు వ్యాపించి యుండును. 

ప్రాణవాయువును పూర్ణముగ పీల్చుట చాల ముఖ్యము. సామాన్యముగ జీవులు వారు పీల్చగలిగిన శక్తిలో నాలుగవ వంతు మాత్రమే పీల్చుదురని పరిశోధనలు తెలుపుచున్నవి.

 పరిపూర్ణముగ శ్వాసను పీల్చుట వలన ఎన్నియో రోగముల నరికట్టవచ్చును. సత్సాధకుడు శ్వాసావయవముల నన్నింటిని పరిశుభ్రముగను, ఆరోగ్యముగను ఉంచుకొనుటకు జాగరూకత వహించి యుండవలెను. 

అనగా ముక్కు, గొంతు, శ్వాసనాళము, ఊపిరితిత్తులు. వీటియందు తరచు జలుబు చేయుట, దగ్గు వచ్చుట ఇత్యాదివి కలుగకుండ శ్రద్ధ వహించవలెను. మూలసూత్రము- 'బాగుగ గాలి పీల్చుటయే.'

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 LIGHT ON THE PATH - 46 🌹*
*🍀 For those WHO DESIRE TO ENTER WITHIN - For DISCIPLES 🍀*
✍️. ANNIE BESANT and LEADBEATER
📚. Prasad Bharadwaj

CHAPTER 4 - THE 3rd RULE
🌻 Kill out desire of comfort. - Be happy as those are who live for happiness. - 3 🌻

207. C.W.L. – This rule does not mean that people may not be comfortable, though many have taken it in that sense. Yogis, hermits and monks have taken similar statements in other scriptures in that way, but it is absolutely wrong and foolish. 

Some monks in the Middle Ages wore hair shirts; and some Indian yogis sit on spikes and sleep in the hottest weather in the midst of a circle of fire, all with the object of making themselves uncomfortable. That is, the result of choosing one text and running it to death. It is particularly stated in the Bhagavad-Gita that those who torture the body torture the Divine One seated in that body, and their way is not the way of progress.

So this rule does not mean that we may not be comfortable, but simply that we must never let our desire for comfort stand in the way of any work which we have to do. If to do what ought to be done will cause us great discomfort, we must not on that account refrain from doing it.

208. To make ourselves unnecessarily uncomfortable only puts difficulty in our way. People talk much about the virtue of suffering and the extent to which progress is made through it; but if we look at the cold facts we shall find that the progress is made after the suffering is past. It is not actual suffering itself which causes the progress, but in many cases that wakens a man to conditions which otherwise he would not have sufficiently noted.

 It sometimes weeds out of him qualities which made progress difficult for him, but it is only after the suffering is over that the progress is made, because only then is he in a fit state of mind to attend to higher things.

209. We must not think that there is any virtue in making ourselves uncomfortable. On the contrary, when the physical body is comfortable we are much better able to think of higher things. Yet I have known people who would persist in doing it. For example, in India where meditation is best understood, it happens to be the custom to sit cross-legged. 

I have known scores of white people who would weary themselves out and even cause themselves pain by trying to follow the Indian custom in meditation, not understanding that that is merely an outer detail and the Indian only adopts that position because he has been accustomed to it from childhood. 

It is exceedingly futile for people who are not accustomed to it to force themselves into what is to them a position of discomfort. Patanjali’s direction is to take a posture “easy and pleasant”.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 178 🌹*
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. మార్కండేయ మహర్షి - 4 🌻*

26. క్షమవల్ల మహత్తు, వస్తాయి. కానీ క్రోధంవల్ల ఉన్నశక్తులు నశిస్తాయి. ఏముంది? ఒకడికి అపకారం, అపచారం చేస్తాడు. అంతకన్నా చేయగలిగింది ఏముంది? దానివల్ల అది పొందినవాడికి కర్మక్షయం అవుతుంది. పాపక్షయం అవుతుంది. కాని క్రోధంవల్ల తపస్సే క్షయం అవుతుంది. వివేకి ఎప్పుడూ తన తపస్సును వ్యర్థం చేసుకోడు.

27. తనకు అపచారం చేసినవాడినికూడా సిక్షించకుండా వదిలిపెడతాడు. ఎందుచేతనంటే, పాపానికి ఫలం ఎలాగూ ఈ ప్రపంచంలో ఉండనే ఉంది. తనెందుకు తన తపస్సును వ్యర్థంచేసుకోవాలి? పాపంచేసినవాడే ఫలం అనుభవిస్తాడు. వివేకం అంటే ఇదే.

28. “గృహస్థులయొక్క ధర్మములేవి? కొడుకులు తల్లితండ్రుల విషయంలో ఎట్లాంటిభక్తి, ధర్మములు కలిగి ఉండాలి?” అని ధర్మరాజు అడిగాడు. “తల్లిదండ్రులమీద భక్తి, ధర్మార్థములందు ఆసక్తి, ఈ రెండే పుత్రులకు ఉండాలి” అని చెప్పాడు.

29. బ్రహ్మదేవుడు పూర్వం ఏడుగురు ఋషులను సృష్టించాడు. తరువాత తనను అరాధిస్తూ ఉండమని వాళ్ళతో బ్రహ్మదేవుడు చెప్పాడు. మరీచాదులైన ఆ మునులు బ్రహ్మ మాట వినక, అంతఃకరణలో పరమేశ్వరుడిని గురించి తపస్సుచేసారు. ఇది ప్రవృత్తి, నివృత్తుల విషయం. బ్రహ్మ తనను ఆరాధించమనడంలో అర్థం, వారిని ప్రవృత్తిమార్గంలో నిలుపటానికి, కాని వాళ్ళు నివృత్తిమార్గంలో మహేశ్వరుడిని అంతఃకరణలో ఆరాధించారు. 

30. అందుకు బ్రహ్మదేవుడికి ఆగ్రహంవచ్చి, “మీ బ్రహ్మవిజ్ఞాన శక్తులు ఏవైతో ఉన్నాయో అవి నశించుగాక!” అని వాళ్ళను శప్తుల్ని చేసాడు. వాళ్ళాల్లో జ్ఞానాన్ని ఆయన హరించాడు. “ఆ తరువాత వాళ్ళు ప్రవృత్తిమార్గంలో వివాహాలూ చేసుకున్నారు. పుత్రులను కన్నారు. స్వర్గస్థులయినారు. అజ్ఞానంరాగానే మృత్యువు ఆవరించింది వాళ్ళను. 

31. పృత్యువు – అవిద్య, అజ్ఞానం యొక్క లక్షణం. స్వర్గానికి వెళ్ళి భూలోకంలో తమ కొడుకులు క్రమంతప్పకుండా తమకు శ్రాద్ధాలు పెడుతుంటే చూచి ఆనందించటం వాళ్ళకు అలవాటయింది. చనిపోయిన తరువాత తమకు పుత్రులు శ్రాద్ధాదిక్రియలు విర్వర్తించటంవల్ల వాళ్ళకు ఆనందం. మొత్తం అవిద్య యొక్క లక్షణములే ఇవి! బ్రహ్మశాపమే అదంతా. ఆ శ్రాద్ధానందంలో వాళ్ళు సుఖంగా ఉన్నారు. 

32. అసలు వాళ్ళు దేవతలకు తండ్రులు. మొత్తమొదట బ్రహ్మ సంతానంగా పుట్టారు. తరువాత దేవతలు వాళ్ళనుంచే పుట్టారు. అంటే దేవతలకు కూడా వాళ్ళు తంద్రుల లాంటివాళ్ళు. ఆ ఏడుగురిలో అమూర్తులు ముగ్గురు, సమూర్తులు నలుగురు. అంటే రూపంకలిగినవాళ్ళు నలుగురు. రూపం లేనివాళ్ళు ముగ్గురు. వీళ్ళను దేవతలు కూడా గౌరవించటం జరుగుతూ ఉంటుంది ఎప్పుడూనూ.

33. వాళ్ళు అలాగ మూడుయుగాలు ఉంటారు. ఆ తరువాత బ్రహ్మజ్ఞానం కొరకు జన్మిస్తారు. క్రమక్రమంగా వాళ్ళు ఇక్కడ పుట్టినతరువాత, సాంఖ్య మతాల్లో కొంతకలం ఉన్నతరువాత, పునరావృత్తిలేనటువంటి జ్ఞానమార్గంలో యోగసిద్ధి పొందుతారు. అంతేకాక, వాళ్ళు తమ యోగబలంతో – యోగసాధన చేసె భక్తులు, మోక్షమార్గాన్వేషకులు ఎవర్యితే ఉన్నారో, వాళ్ళకు యోగాభివృద్ధినిస్తారు.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 Seeds Of Consciousness - 242 🌹*
✍️ Nisargadatta Maharaj 
 Nisargadatta Gita 
📚. Prasad Bharadwaj

*🌻 91. The borderline between 'I am' (beingness) and 'I am not' (non-beingness) is the precise location where the intellect subsides. It's the 'Maha-yoga' state. Be there! 🌻*

Your arrival at the 'I am' in its wordless and pure state is the first thing to achieve. 

Now, after you have arrived here you have to dwell or stay here, this will be possible only after repeated attempts. Beware! This is a very slippery place! The pull of the mind or intellect is very strong, it cannot bear the 'I am' very long. 

But once you stabilize there, the intellect, without disappearing, does so, too. It is only after stabilizing in the 'I am' for a prolonged period that a moment will come when, quite spontaneously, you will also know 'I am not'. 

This is the border zone and the precise location where the intellect subsides and you are in a state of 'not-knowing'. This is called the 'Maha-yoga' or the 'Great-yoga', the union of 'being' and 'non-being' that is difficult to come by, hence 'Great'.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 117 🌹*
✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. సర్వశూన్య స్థితి యందు ఎరుక - 2 🌻*

487. నిర్వాణ స్థితిలో, భగవంతుడు 'చైతన్యము' యొక్క పాత్రను వహించుచున్నాడని దాని భావము.

488. అభావము నుండి పుట్టిన సంస్కారములే, సమస్త అనుభవములకు కారణము కాబట్టి ఇచ్చట మనస్సు దాని సమస్త సంస్కారములతో సహితముగా నశించి పోయినది. పరిమిత "అహమ్" యొక్క మిథ్యానుభవములు కూడా అదృశ్యమైనవి.

489. ఈ దివ్యశున్యత్వము, సత్యస్థితి నుండి పుట్టినదే గాని మాయ నుండి పుట్టినది కాదు. 

490. అభావమైన మాయాసృష్టి అదృశ్యమైన తక్షణమే "అహంబ్రహ్మాస్మి" (నేను భగవంతుడను) అనెడు భగవదనుభూతి కలుగుటకు ఒక్క క్షణమునకు ముందుగానే, యీ దివ్య ప్రపూర్ణ పరమ శూన్యస్థితి యొక్క అనుభవము కలుగును.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 81 / Sri Vishnu Sahasra Namavali - 81 🌹*
*నామము - భావము*
📚. ప్రసాద్ భరద్వాజ 

*🌷. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 🌷*

*ఉత్తరాషాడ నక్షత్ర ప్రధమ పాద శ్లోకం*

*🍀 81. తేజో వృషో ద్యుతిధరః సర్వశస్త్ర భృతాం వరః|*
*ప్రగ్రహో నిగ్రహో వ్యగ్రో నైకశృంగో గదాగ్రజః|| 🍀*

🍀 757) తేజోవృష: - సూర్యతేజముతో నీటిని వర్షించువాడు.

🍀 758) ద్యుతిధర: - 
కాంతివంతమైన శరీరమును ధరించినవాడు.

🍀 759) సర్వ శస్త్ర భృతాంవర: - 
శస్త్రములను ధరించినవారిలో శ్రేష్ఠుడైనవాడు.

🍀 760) ప్రగ్రహ: - 
ఇంద్రియములనెడి అశ్వములను తన అనుగ్రహము అనెడి పగ్గముతో కట్టివేయువాడు.

🍀 761) నిగ్రహ: - 
సమస్తమును నిగ్రహించువాడు.

🍀 762) వ్యగ్ర: - 
భక్తులను తృప్తి పరుచుటలో సదా నిమగ్నమై ఉండువాడు.

🍀 763) నైకశృంగ: - 
అనేక కొమ్ములు గలవాడు, భగవానుడు.

🍀 764) గదాగ్రజ: - 
గదుడను వానికి అన్న.

సశేషం.... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 Vishnu Sahasra Namavali - 81 🌹*
*Name - Meaning*
📚 Prasad Bharadwaj

*🌷 OM NARAYANAYA VIDMAHE VASUDEVAYA DHIMAHI । TANNO VISHNU PRACHODAYAT ॥ 🌷*

*Sloka for Utarashada 1st Padam*

🌻 *tejōvṛṣō dyutidharaḥ sarvaśastrabhṛtāṁ varaḥ |*
*pragrahō nigrahō vyagrō naikaśṛṅgō gadāgrajaḥ || 81 || 🌻*