శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 135 , 136 / Sri Lalitha Chaitanya Vijnanam - 135, 136

🌹. శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రము - 72 / Sri Lalitha Sahasra Nama Stotram - 72 🌹
ప్రసాద్ భరద్వాజ


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 135 , 136 / Sri Lalitha Chaitanya Vijnanam - 135, 136 🌹
సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀. పూర్తి శ్లోకము :

నిర్లేపా, నిర్మలా, నిత్యా, నిరాకారా, నిరాకులా |
నిర్గుణా, నిష్కళా, శాంతా, నిష్కామా, నిరుపప్లవా ‖ 44 ‖


🌻135. 'నిర్మలా'🌻

అజ్ఞానపూరితమగు మలము లేనిది శ్రీలలిత అని అర్థము.

మలము లంటనిది శ్రీలలిత. సృష్టికార్యమంతయు అగ్నికార్యమే. అందువలన ప్రతి ఆవరణమునందు చేతలతోపాటు మలినముకూడ యుండును. నిప్పు ఉన్న చోట పొగయుండును. పొగచూరు యుండును. అద్దమున్నచోట దుమ్ము పట్టును. వంట చేసిన పాత్రకు మసి పట్టును.

ఆహారముగాను జీవులకు మలమూత్రాదు లేర్పడును. శరీరమునకు, పంచేంద్రియములకు, మనస్సునకు, బుద్ధి, అహంకారములకు కూడ మలినము సోకుచునుండును.

ఎచ్చట జ్ఞానమను అగ్ని యుండునో అచ్చట అజ్ఞానమను పొగకూడ యుండును. ఈ అజ్ఞానమును ప్రతి నిత్యము తొలగించుకొనుట సాధన. తొలగించుకొననిచో మలమునకు బలమేర్పడును.

మలములు బలపడినచో మరణానుభూతి కూడ యుండును. అన్ని స్థితులయందలి మలినములు నిత్యము తొలగించు కొనుటయే సాధన. దీపపు కాంతి నిశ్చలముగా నిలబడుటకు గాజు చిమ్నీ వాడుచుందుము. చిమ్నీని శుభ్రముగా తుడుచుకొననిచో దీపము గోచరించదుకదా! అట్లే తనయందలి మలినములను నిర్మూలించుకొనని వానికి తాను జ్యోతి స్వరూపుడనని తెలియదు.

అట్టి నిర్మూలనమునకు శ్రీలలిత ఉపాసనమును వినియోగించు కొనవలెను.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 135 🌹
1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj


🌻Nirmalā निर्मला (135)🌻

Mala means dirt arising out of impure matter, where the afflicted mental state of an empirical individual is disabled by his own impurity causing attachment to actions viz saṁsāra. She is without such dirt. In the last nāma impurity arising out of mind was discussed and in this nāma impurities arising out of matter is being discussed.

It is to be recalled that mind and matter is Śaktī. Mala is a sense of imperfection that leads to ignorance about the soul and hampers the free expression of the Supreme Self. This ignorance is caused by ego which is called mala or ānava-mala.

This nāma says that if one gets out of attachments towards matter by dissolving his ego, knowledge is attained. Presence of mala causes avidyā (ignorance) which leads to confusion, dirt and darkness. This darkness can be dispelled by meditating on Her, thereby acquiring knowledge.

It is interesting to note that all the nāma-s that talk about nirguṇa Brahman either directly or indirectly refer to meditation.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 136 / Sri Lalitha Chaitanya Vijnanam - 136 🌹
సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀. పూర్తి శ్లోకము :

నిర్లేపా, నిర్మలా, నిత్యా, నిరాకారా, నిరాకులా |
నిర్గుణా, నిష్కళా, శాంతా, నిష్కామా, నిరుపప్లవా ‖ 44 ‖


🌻136. 'నిత్యా' 🌻

సృష్టి, స్థితి, ప్రళయ కాలములయందు యుండునది శ్రీదేవి అని అర్థము.

భూత, భవిష్యత్, వర్తమానకాలముల యందుండునది, ఎప్పుడునూ వుండునది. పరాశక్తిగను, పరాప్రకృతిగను, అన్ని కాలములయందును శ్రీలలిత ఉన్నది.

ఉండుట, లేకుండుట అనునవి అవగాహనను బట్టియేగాని, అసలు సత్యము గాదు. స్థూలముగ నున్నవి కనబడ నపుడు లేవనుకొందుము. స్థూలమున కవతరించినపుడు వున్నది అనుకొందుము. ఇది స్థూలమగు అవగాహన మాత్రమే.

స్థూలము నుండి సూక్ష్మమునకు, సూక్ష్మమునుండి స్థూలమునకు అవరోహణ, ఆరోహణ క్రమములలో సృష్టి మొత్తమూ ఎప్పుడునూ వుండనే వున్నది.

అందలి జీవులు కూడ ఎప్పుడూ ఉండనే ఉన్నారు. 'ఉన్నది పోదు, లేనిది రాదు' అని శ్రీకృష్ణుడు గీతయందు బోధించినాడు. విత్తనము రూపమున మహత్తరమగు వృక్షముండును. వృక్షము రూపమున విత్తనముండును. విత్తనము వృక్షమైనపుడు, విత్తనము గోచరింపదు. కాని మరల విత్తనము వృక్షము కాగలదు.

అట్లే సమస్త జీవులును సూక్ష్మములోనికి పోవుచూ, స్థూలములోనికి వచ్చుచూ నుందురు. ఏదోనొక స్థితిలో వస్తువుండును గాని లేకుండుట యుండదు. ఇది సత్యము.

దీనిని దర్శించుట ఋషులకే సాధ్యము. స్థూల దృష్టిగలవారికి సాధ్యము కాదు.

శ్రీలలిత పరాశక్తిగను, పరమాత్మికగ నున్నపుడును, తనకు తానే చోటువలె ఉండును. ఆత్మ ప్రేరణలచేత ఆమె నవావరణలను సృష్టించుచు నుండును. అది ఆమె నిశ్వాశ. మరల సృష్టిని తన లోనికి ఇముడ్చుకొనును. ఆది ఆమె ఉచ్ఛ్వాస. ఇన్ని లోకముల సృష్టియు ఇట్లు ఉండుట లేకుండుటగా భాసించుచు నుండును. వీటన్నిటికిని ఆమె ఆధారము. ఆమె ఎప్పుడును ఉండునది.

స్థితి భేదముల కావల ఉండునది. అవస్థితులు లేనిది అగుటచే, నిత్య అని పిలువబడుచున్నది. ఆమె ఉద్భవించుట దేవతల కార్యమునకు సహకరించుటయే. ఉన్నది ఉద్భవించును కాని, లేనిది ఉద్భవించదు కదా! ఇది తెలిసినవారు ఋషులు. తెలియనివారు కూడా నిత్యులే కాని, నిత్యులమని తెలియదు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 136 🌹
1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj


🌻Nityā नित्या (136)🌻

Nitya means eternal and without changes. As nirguṇa Brahman is being discussed, one of the qualities of the Brahman is explained here.

Bṛhadāraṇyaka Upaniṣad (IV.v.14) describes the Brahman as “the Self is indeed immutable and indestructible”. Brahman is beyond changes and exists everywhere, omnipresent.

Nitya-s are the fifteen deities representing fifteen lunar days. They are worshipped while worshipping Śrī Cakra. Each of these deities has mūla mantra and is capable of giving different siddhi-s.

{Further reading on Nitya-s: Nitya is said to be the highest object of worship and the ultimate philosophical principle in kula system.

The world kula stands for Śaktī. Apart from the fifteen nitya-s, sixteenth nitya is Lalitāmbikā Herself, who is also known as Mahā Tripurasundarī.

Out of these nitya-s, the last three nitya-s are more concerned with internal worship. There are nine tantra-s that deal with these nitya-s. It is also said that the power of Śaktī is known as nitya.]

Continues...

🌹 🌹 🌹 🌹 🌹



08 Dec 2020

No comments:

Post a Comment