గీతోపనిషత్తు - 93


🌹. గీతోపనిషత్తు - 93 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


🍀 26 - 6 . ప్రాణాయామ యజ్ఞము - ప్రాణవాయువు ముక్కు పుటముల నుండి భ్రూమధ్యము వరకు ప్రవేశించి, అచటి నుండి వాయునాళము ద్వారా ఉపిరితిత్తుల వరకు వ్యాపించి యుండును. ప్రాణ వాయువును పూర్ణముగ పీల్చుట చాల ముఖ్యము. పరిపూర్ణముగ శ్వాసను పీల్చుట వలన ఎన్నియో రోగముల నరికట్టవచ్చును. 🍀

📚. 4. జ్ఞానయోగము - 29, 30 📚

Part 6

పంచప్రాణములు దేహమున ఈ క్రింది భాగములలో పనిచేయుచున్నవి.

🌷 1. ప్రాణవాయువు: 🌷

ఇది శ్వాస ద్వారా పీల్చబడుచున్నది. ముక్కుపుటముల నుండి ఉదర వితానము క్రింది భాగము వరకు ఈ వాయువు పనిచేయు చుండును.

కావున కనుబొమల నుండి ఉదర వితానము వరకు గల శరీర భాగములు, వాని స్వస్థత ఈ వాయువు బలమునకు సంబంధించి యున్నవి. ప్రాణవాయువు బలముగ స్వీకరింపబడుచున్నచో ఈ శరీర భాగమంతయు ప్రాణబలముతో కూడిన అస్వస్థతను దరిచేరనీయదు.

ప్రాణవాయువు ముక్కు పుటముల నుండి భ్రూమధ్యము వరకు ప్రవేశించి, అచటి నుండి వాయునాళము ద్వారా ఉపిరితిత్తుల వరకు వ్యాపించి యుండును.

ప్రాణవాయువును పూర్ణముగ పీల్చుట చాల ముఖ్యము. సామాన్యముగ జీవులు వారు పీల్చగలిగిన శక్తిలో నాలుగవ వంతు మాత్రమే పీల్చుదురని పరిశోధనలు తెలుపుచున్నవి.

పరిపూర్ణముగ శ్వాసను పీల్చుట వలన ఎన్నియో రోగముల నరికట్టవచ్చును. సత్సాధకుడు శ్వాసావయవముల నన్నింటిని పరిశుభ్రముగను, ఆరోగ్యముగను ఉంచుకొనుటకు జాగరూకత వహించి యుండవలెను.

అనగా ముక్కు, గొంతు, శ్వాసనాళము, ఊపిరితిత్తులు. వీటియందు తరచు జలుబు చేయుట, దగ్గు వచ్చుట ఇత్యాదివి కలుగకుండ శ్రద్ధ వహించవలెను. మూలసూత్రము- 'బాగుగ గాలి పీల్చుటయే.'

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


08 Dec 2020


No comments:

Post a Comment