శ్రీ కృష్ణ బోధనలు - 3 Teachings of Sri Krishna - 3
🌹. శ్రీ కృష్ణ బోధనలు - 3 🌹
📚. ప్రసాద్ భరధ్వాజ.
భవిష్యత్తుకు ఇంకొక పేరే సంఘర్షణ. అది అసంపూర్ణంగా మిగిలి పోతే ఆ హృదయం భవిష్యత్ ప్రణాళికలు వేస్తుంది. భవిష్యత్తులో తన కోరిక నెరవేరుతుందని అనుకొని కలలు కంటూ వుంటుంది. కానీ జీవితం రానున్న భవిష్యత్తులోనూ లేదు, గతంలోనూ లేదు. జీవితమన్నది ఈ క్షణంలోనే వుంటుంది.
అనగా ఈ క్షణంలో అనుభవించేదే జీవితానుభవం. మనకి ఈ సంగతి తెలసినప్పటికి, ఈ చిన్న సూత్రాన్ని కూడా అర్థం చేసుకోలేము. గత స్మృతుల వలయంలో చిక్కుకొని కొట్టుమిట్టాడుతూ ఉంటాము, లేదా రానున్న భవిష్యత్తు కోసం ప్రణాళికలు వేసుకుంటూ వుంటాముై, కానీ జీవితం....... జీవితం గడిచిపోతుంది.
ఈ సత్యం మన మనస్సులో నాటుకు పోవాలి. భవిష్యత్తును చూడనూ లేము, రానున్న భవిష్యత్తును నిర్మించనూ లేము. మనం కేవలం ధైర్య సాహసాలతో భవిష్యత్తును ఆలింగనం చేసుకోగలం. స్వాగతం పలుకగలం ఆ భవిష్యత్తుకు. అలా చేస్తే జీవితంలోని ప్రతి క్షణం చైతన్యంతో నిండిపోదా ? మీరే ఆలోచించండి.....
🌹 🌹 🌹 🌹 🌹
20 Dec 2021
శ్రీకృష్ణ బోధనలు - 2 Sri Krishna Talks - 2
🌹. శ్రీకృష్ణ బోధనలు - 2 🌹
🌻. హే కృష్టా, పరమాత్మ దర్శనం కాకుండా నేను సమర్పణ ఎలా చేయగలను? 🌻
🍀. ఆశ, క్రోధము, కోరికలు అహంకారము, గతం ఇటువంటివి వాటితో కళ్లకు గంతలు కట్టుకున్న వాడికి పరమాత్మ దర్శనం సాధ్యం కాదు. చీకటి గదిలో కూర్చున్న వ్యక్తి సూర్యుని చూడాలి అంటే, అతనికి ఏం చెప్తాం? గది నుండి బయటకు వచ్చి ఆకాశం క్రింద నిలబడమని చెబుతాము కదా. 🍀
🎤. శ్రీకృష్ణ భగవాన్
📚. ప్రసాద్ భరధ్వాజ
🌹Sri Krishna Talks - 2 🌹
🌻 Krishna, How can I do surrender with out the Darsan of Parmathma? 🌻
🍀 Without letting go of Desires, anger, ego and ambition you can't see the Supreme God. If a person wish to see the Sun while sitting in a dark room, we ask him to come outside and stand under Open space to see the Sun. 🍀
-🎤. Sri Krishna Bhagavan
🌹 🌹 🌹 🌹 🌹
శ్రీ కృష్ణ బోధనలు - 1 Teachings of Sri Krishna - 1
🌹. విశ్వాసం సడలే సంఘటనలు జరిగే సమయంలో ప్రతి మనిషి ఇది గుర్తుంచుకోవాలి. కాలం మనిషి ఏర్పరిచిన మార్గాలలో నడవదు. కాలం నిర్ధేశించిన మార్గంలో మనిషి నడవాలి. ఇదే నియతి. 🙏🌹
-🎤. శ్రీకృష్ణ భగవాన్
శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 331 / Sri Lalitha Chaitanya Vijnanam - 331
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 331 / Sri Lalitha Chaitanya Vijnanam - 331 🌹
🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 74. కళావతీ, కళాలాపా, కాంతా, కాదంబరీప్రియా ।
వరదా, వామనయనా, వారుణీమదవిహ్వలా ॥ 74 ॥ 🍀
🌻 331. 'వరదా' 🌻
వరముల నొసగునది శ్రీమాత అని అర్థము. సృష్టి సమస్తమును పరిపాలించునది శ్రీమాతయే కదా! బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు కూడ ఆమె వరముల నిచ్చుచున్నది. విపత్కర పరిస్థితులలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సైతము ఆమెను ప్రార్ధించి వరములు పొందిరి. నారద మహర్షి శ్రీమాత ఎట్టి వరప్రదాతయో అద్భుతముగ తెలిపినాడు. శ్రీమాత హస్తము ఎప్పుడునూ వరద ముద్రలోనే వుండునని, అది ఆమె సహజమగు ముద్రయని కీర్తించినాడు.
రాక్షసులైననూ, దేవతలైననూ శ్రీమాతకు సమానమే. భక్తితో కోరిన వారికి వరదానము చేయుటయే అమ్మవంతు. వరములు కోరు జీవులందరి కోరికలను తీర్చు వాత్సల్యమూర్తి ఆమె. తొమ్మిది రోజులు శ్రీమాతను భక్తి శ్రద్ధలతో పూజించిన వారికి శ్రీమాత వరము నొసగునని వరాహ పురాణము పేర్కొనుచున్నది. శ్రీమాత నుద్దేశించి తొమ్మిది దినములు సమాధిలో నుండు సిద్ధులకు శాశ్వతముగ తన సాన్నిధ్యము నిచ్చునని పురాణములు తెలుపుచున్నవి.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 331 🌹
Contemplation of 1000 Names of Sri Lalitha Devi
✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj
🌻 74. Kalavati kalalapa kanta kadanbari priya
Varada vamanayana varunimadavihvala ॥ 74 ॥ 🌻
🌻 331. Varadā वरदा (331) 🌻
The one who grants boons. In Viṣṇu Sahasranāma nāma 330 is also Varadā. Granting boons is the general quality of all Gods and Goddesses. In certain forms of Gods and Goddesses the right palm is used as a gesture of granting boons. There is a special significance for this nāma. She does not grant boons through Her palms. Her sacred feet give boons. She is kāmadāyinī (nāma 63). Otherwise nāma 83 will not have any meaning. The significance of this nāma is further strengthened by nāma 117.
Saundarya Laharī (verse 4) perfectly describes this nāma. It says, “You are the refuge of all the worlds! All gods except you vouchsafe protection to devotees and grant their desires by gestures of their hands. You alone do not show varada and abhaya gestures. It is so because Your feet are by themselves powerful to protect those in the grip of fear and grant more that what is desired for by devotees.” Such niceties describe the ease with which She grants boons. It is also said that She is to be worshipped by concentration (through meditation) on ninth lunar day (navami) when She becomes the giver of boons to all the worlds.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
20 Dec 2021
నిర్మల ధ్యానాలు - ఓషో - 112
🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 112 🌹
✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ
🍀. సాధారణంగా వ్యక్తి ఉనికిని చుట్టుముట్టిన సౌందర్యం పట్ల స్పృహతో వుండడు. కేవలం వికారం పట్ల స్పృహతో వుంటాడు. కారణం మనసెపుడూ మరిచిపోతుంది. గాయాల్ని లెక్క పెడుతుంది. దీవెనల్ని విస్మరిస్తుంది. మనసు మార్గం అలాంటిది. 🍀
ధ్యానం నీ కోసం రెండు పనులు చేస్తుంది. నీ చుట్టూ వున్న సౌందర్యం పట్ల నీకు స్పృహ కలిగిస్తుంది. దాని పట్ల నువ్వు సున్నితంగా స్పందించేట్లు చేస్తుంది. రెండోది నిన్ను సౌందర్యభరితం చేస్తుంది. నీలో ఒక దయాతరంగాన్ని లేపుతుంది. నీ కళ్ళు ఎంతగా దయతో నిండి వుంటాయంటే సమస్త అస్తిత్వం సౌందర్యంతో నిండిపోతుంది. మనం సౌందర్యం నిండిన అస్తిత్వం నించీ దోసిళ్ళతో దాన్ని తాగాలి. మనలోకి ఆ సౌందర్యం ప్రవేశించడానికి మనం అనుమతించాలి. సాధారణంగా వ్యక్తి ఉనికిని చుట్టుముట్టిన సౌందర్యం పట్ల స్పృహతో వుండడు. కేవలం వికారం పట్ల స్పృహతో వుంటాడు. కారణం మనసెపుడూ మరిచిపోతుంది. గాయాల్ని లెక్కపెడుతుంది. దీవెనల్ని విస్మరిస్తుంది. మనసు మార్గం అలాంటిది.
నువ్వు ధ్యానంలోకి అడుగుపెట్టిన క్షణం, నువ్వు నిశ్శబ్దంలోకి అడుగుపెట్టిన క్షణం మరింత విశ్రాంతి పొందుతావు. మరింతగా నీ అస్తిత్వంలో స్థిరపడతావు. అప్పుడు నువ్వు హఠాత్తుగా వృక్షాల సౌందర్యం పట్ల, మేఘాల అందం పట్ల, మనుషుల సౌందర్యం పట్ల స్పృహతో వుంటావు. ప్రతిదీ సౌందర్యభరితమే. కారణం ప్రతిదీ దైవత్వంతో నిండివుంది. బండలు కూడా దైవత్వాన్ని నింపుకొని వున్నాయి. దైవత్వం లేనిదేదీ లేదు. ఒకసారి నువ్వు ఈ సౌంధర్య కోణాల్ని అనుభూతి చెందడం ఆరంభిస్తే నువ్వు సంగీతంతో, కవిత్వంతో, నాట్యంతో, ఉత్సవంతో ప్రేమతో నిండిపోతావు. నువ్వు అందంతో నిండిపోతావు. ధగధగలాడతావు. అది నీలో ప్రతి ఒక్కరికీ కనబడుతుంది. ఒకరు ఆ సౌందర్యాన్ని నీలో చూడాలనుకుంటే అది కనిపిస్తుంది. కానీ జనం కళ్ళు మూసుకుని వుంటారు. అందువల్ల చూడలేరు.
సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
20 Dec 2021
మైత్రేయ మహర్షి బోధనలు - 45
🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 45 🌹
✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻 33. నిరాదరణ 🌻
సమస్త సృష్టియు పరంపరాగతముగ లోకములను, లోకేశులను, లోకస్థులను ఏర్పరచుకొని యున్నది. సృష్టికి మూలసూత్రమే పరంపర. నారాయణుని నుండి చతుర్ముఖుడు, చతుర్ముఖుని నుండి సమస్త లోకములు ఉద్భవించుట తెలిసిన విషయమే. సృష్టి యందు ఊర్ధ్వలోకములు, అధోలోకములకు ఆధారము. క్రింది లోకముల వారు పైలోకముల వారిని గౌరవించుట, పూజించుట, మన్నించుట సృష్టి యందు సహజ ధర్మము. సమస్త సృష్టి ధర్మములు అవ్యక్తము నుండి సూక్ష్మ లోకములలోనికి, అచటి నుండి స్థూల లోకములలోనికి అవ తరణము చెందు చున్నవి. సృష్టి యందు ఊర్ధ్వలోకముల వారు అధో లోకముల వారిని ఆదరించుట వలననూ, అధోలోకముల వారు ఊర్ధ్వలోకముల వారిని మన్నించుట వలననూ సృష్టికార్యము నిరాటంకముగ సాగుచుండును.
ఈ పరంపరాగత ధర్మములు మానవులకు కూడా లభించినవి. తల్లిదండ్రులను, గురువులను, పెద్దలను పిన్నలు గౌరవించుట, పిన్నలను పెద్దలు ఆదరించుట ఈ ధర్మస్వరూపమే. ఏ సంఘముననై ననూ యీ సూత్రము చెడినచో, ఆ సంఘము పతనము చెందుట ఖాయము. పతనము చెందిన మానవ సంఘములకు ప్రేమతో, ఆదరముతో, మరల యీ ధర్మ సూత్రములను బోధించుట, అందించుట- తత్ఫలితముగ మానవ జాతికి తోడ్పడుట మా గురుపరంపర యొక్క కార్యక్రమము. గురువులను నిరాకరించిన సాంప్రదాయమున సృజనాత్మక శక్తి నశించగలదు. సృజనాత్మక శక్తి నశించిన జాతికి పురోగతి లేదు.
సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹
20 Dec 2021
విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 528 / Vishnu Sahasranama Contemplation - 528
🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 528 / Vishnu Sahasranama Contemplation - 528 🌹
📚. ప్రసాద్ భరద్వాజ
🌻528. నన్దః, नन्दः, Nandaḥ (అనన్దః, अनन्दः, Anandaḥ)🌻
ఓం నన్దాయ నమః | ॐ नन्दाय नमः | OM Nandāya namaḥ
నన్దః, नन्दः, Nandaḥ (అనన్దః, अनन्दः, Anandaḥ)
మహావిష్ణుస్ససమృద్ధః సర్వాభిరుపపత్తిభిః ।
నన్ద ఇత్యుచ్యతే సద్భిర్వేదవిద్యావిశారదైః ॥
నన్దస్సుఖం వైషయికం నాస్త్యనన్ద ఇతీర్యతే ।
యో వై భూమా తత్సుఖమిత్యాదిశ్రుతిసమీరణాత్ ॥
'నన్దః' - అన్ని విధములగు సిద్ధులచే నిండియుండును. ఇచట 'నందనః' మరియూ 'అనందః' అను విభాగమునైన చేయవచ్చును. అపుడు, 'అనన్దః' అను నామమునకు - ఎవనికి శబ్దాది విషయములననుభవించుటచే కలుగు ఆనందము ఉండదో అట్టివాడు అను అర్థము చెప్పవచ్చును.
:: ఛాన్దోగ్యోపనిషత్ - సప్తమః ప్రపాఠకః, త్రయోవింశః ఖణ్డః ::
యోవై భూమా తత్సుఖం నాల్పే సుఖ మస్తి భూమైవ సుఖం ।
భూమాత్వేన విజిజ్ఞాసితవ్య ఇతి భూమానం భగవో విజిజ్ఞాస ఇతి ॥ 1 ॥
భూమా (అనగా గొప్పది, బ్రహ్మము, ఆత్మ) అనునదియే సుఖము. అల్పమైనదానియందు సుఖము ఉండదు. కావున భూమయే సుఖము. ఆ గొప్పదియగు ఆత్మనే తెలిసికొనవలయును... (పరమ మహత్పరిణమముతో నిండియుండు పరమాత్ముడు తానే సుఖస్వరూపుడు కావున ఆతనికి ఇతరములనుండి సుఖమును పొందవలసిన పనియే లేదు).
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 528🌹
📚. Prasad Bharadwaj
🌻528. Anandaḥ)🌻
OM Nandāya namaḥ
महाविष्णुस्ससमृद्धः सर्वाभिरुपपत्तिभिः ।
नन्द इत्युच्यते सद्भिर्वेदविद्याविशारदैः ॥
नन्दस्सुखं वैषयिकं नास्त्यनन्द इतीर्यते ।
यो वै भूमा तत्सुखमित्यादिश्रुतिसमीरणात् ॥
Mahāviṣṇussasamrddhaḥ sarvābhirupapattibhiḥ,
Nanda ityucyate sadbhirvedavidyāviśāradaiḥ.
Nandassukhaṃ vaiṣayikaṃ nāstyananda itīryate,
Yo vai bhūmā tatsukhamityādiśrutisamīraṇāt.
Nandaḥ - Rich with all things to be attained. Or Anandaḥ - He who does not need to seek sensory and such pleasures from anything.
:: छान्दोग्योपनिषत् - सप्तमः प्रपाठकः, त्रयोविंशः खण्डः ::
योवै भूमा तत्सुखं नाल्पे सुख मस्ति भूमैव सुखं ।
भूमात्वेन विजिज्ञासितव्य इति भूमानं भगवो विजिज्ञास इति ॥ १ ॥
Chāndogyopaniṣat - Chapter 7, Section 23
Yovai bhūmā tatsukhaṃ nālpe sukha masti bhūmaiva sukhaṃ,
Bhūmātvena vijijñāsitavya iti bhūmānaṃ bhagavo vijijñāsa iti. 1.
The infinite is bliss. There is no bliss in anything finite. One must desire to understand that which is infinite... (Since He himself is bliss, there is nothing else from which He can seek pleasure).
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
अजो महार्हस्स्वाभाव्यो जितामित्रः प्रमोदनः ।आनन्दो नन्दनोऽनन्दस्सत्यधर्मा त्रिविक्रमः ॥ ५६ ॥
అజో మహార్హస్స్వాభావ్యో జితామిత్రః ప్రమోదనః ।ఆనన్దో నన్దనోఽనన్దస్సత్యధర్మా త్రివిక్రమః ॥ 56 ॥
Ajo mahārhassvābhāvyo jitāmitraḥ pramodanaḥ,Ānando nandano’nandassatyadharmā trivikramaḥ ॥ 56 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
20 Dec 2021
20-DECEMBER-2021 సోమవారం MESSAGES
1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam, 19, డిసెంబర్ 2021 సోమవారం, ఇందు వాసరే 🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 131 / Bhagavad-Gita - 131 3-12🌹*
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 528 / Vishnu Sahasranama Contemplation - 528 🌹
4) 🌹 DAILY WISDOM - 206🌹
5) 🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 45 🌹
6) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 1112 🌹
7) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 331 / Sri Lalitha Chaitanya Vijnanam - 331 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శుభ సోమవారం మిత్రులందరికీ 🌹*
*ఇందు వాసరే, 20, డిసెంబర్ 2021*
*మీకు ఈ రోజు అంతా కాలం అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*
*🍀. రుద్ర నమక స్తోత్రం -3 🍀*
*తయాభిచాకశీహి త్వం తనువా మా ముమాపతే!*
*ఘోరయా తనువాచాపి రుద్రాద్యాపాపకాశినీ!!5!!*
*యా తయా మృడయ స్వామిన్ సదా శంతమయా ప్రభో!*
*గిరిశంత మహారుద్ర హస్తే యా మిషు మస్తవే!!6!!*
🌻 🌻 🌻 🌻 🌻
విక్రమ సంవత్సరం: 2078 ఆనంద
శఖ సంవత్సరం: 1943 ప్లవ,
దక్షిణాయణం, హేమంత ఋతువు,
మృగశిర మాసం
తిథి: కృష్ణ పాడ్యమి 12:37:50 వరకు
తదుపరి కృష్ణ విదియ
నక్షత్రం: ఆర్ద్ర 19:46:25 వరకు
తదుపరి పునర్వసు
యోగం: శుక్ల 10:58:54 వరకు
తదుపరి బ్రహ్మ
కరణం: కౌలవ 12:35:50 వరకు
వర్జ్యం: 02:18:12 - 04:05:40
దుర్ముహూర్తం: 12:35:46 - 13:20:09
మరియు 14:48:54 - 15:33:16
రాహు కాలం: 08:03:59 - 09:27:11
గుళిక కాలం: 13:36:47 - 14:59:59
యమ గండం: 10:50:23 - 12:13:35
అభిజిత్ ముహూర్తం: 11:51 - 12:35
అమృత కాలం: 08:34:20 - 10:21:48
సూర్యోదయం: 06:40:47
సూర్యాస్తమయం: 17:46:24
వైదిక సూర్యోదయం: 06:44:41
వైదిక సూర్యాస్తమయం: 17:42:29
చంద్రోదయం: 18:44:28
చంద్రాస్తమయం: 07:31:47
సూర్య సంచార రాశి: ధనుస్సు
చంద్ర సంచార రాశి: జెమిని
కాలదండ యోగం - మృత్యు భయం
19:46:25 వరకు తదుపరి ధూమ్ర
యోగం - కార్య భంగం, సొమ్ము నష్టం
పండుగలు : ఆరుద్ర దర్శనం,
Arudra Darshan
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam
Join and Share
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీమద్భగవద్గీత -131 / Bhagavad-Gita - 131 🌹*
*✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద*
*📚. ప్రసాద్ భరద్వాజ*
*🌴. తృతీయ అధ్యాయము - కర్మ యోగము - 12 🌴*
*12. ఇష్టాన్ భోగాన్ హి దేవా దాస్యన్తే యజ్ఞభావితా: |*
*తైర్దాత్తానప్రదాయైభ్యో యో భుజ్ఞ్కే స్తేన ఏవ స: ||*
🌷. తాత్పర్యం :
*వివిధ జీవనావశ్యకములను ఒనగూర్చు దేవతలు యజ్ఞముచే సంతృప్తి నొంది మీకు కావలసినవన్నియును ఒసంగుదురు. వాటిని ఆ దేవతలకు అర్పింపకయే తాను అనుభవించువాడు నిక్కముగా చోరుడే యగును.*
🌷. భాష్యము :
దేవదేవుడైన విష్ణువు తరపున జీవితావష్యకములైనవాటిని సమకూర్చుటకు అధీకృతులైనట్టివారే దేవతలు. కావున వారిని విధిపూర్వకమగు యజ్ఞముచే సంతృప్తిపరుపవలెను. వేదములందు పలుదేవతల కొరకు పలువిధములైన యజ్ఞములు తెలుపబడినను అవియన్నియును అంత్యమున దేవదేవునకే అర్పింపబడును. శ్రీకృష్ణభగవానుని గూర్చి తెలియనివానికే దేవతాయజ్ఞము ఆదేశించబడినది.
మనుజుని వివిధ గుణములు ననుసరించి వివిధ యజ్ఞములు వేదము లందు ప్రతిపాదింప బడినవి. వివిధ దేవతార్చనములు కూడా అదే విధముగా గుణముల ననుసరించియే తెలుపబడినవి. ఉదాహరణమునకు మాంసభక్షకులకు ప్రకృతి యొక్క ఘోరరూపమైన కాళికాదేవి పూజా ఆదేశింపబడినది. ఆ దేవత యెదుట పశుబలియు తెలుపబడినది.
కాని సత్వగుణములో నున్నవారికి మాత్రము విష్ణుభగవానుని దివ్యారచనము ఉద్దేశింపబడినది. క్రమముగా ఆధ్యాత్మికస్థితిని పొందుటకే ఈ యజ్ఞములన్నియును ఉన్నవి. పంచమాహా యజ్ఞములని తెలియబడు ఐదు యజ్ఞములు మాత్రము సాధారణజనులకు అత్యంత అవశ్యకములై యున్నవి.
అయినను మానవులకు అవసరమైనట్టి జీవనావశ్యకములన్నియు శ్రీకృష్ణభగవానుని ప్రతినిధులైన దేవతలచే సమకూర్చబడునని ప్రతియొక్కరు ఎరుగవలెను. ఎవ్వరును వాటిని సృష్టింపలేరు. జీవితావసరములైన ఉష్ణము, కాంతి, నీరు, వాయువు వంటివి కూడా మానవునిచే సృష్టింపబడలేదు. శ్రీకృష్ణభగవానుడు లేనిదే సూర్యకాంతి, చంద్రకాంతి, వర్షము, గాలి వంటివి కలుగవు. అవి లేనిదే ఎవ్వరును జీవింపలేరు.
అనగా మన జీవితము ఆ భగవానుడు కరుణతో సమకూర్చువాని పైననే ఆధారపడియున్నది. అవియన్నియును దేవతలచే ఒసగబడుచున్నవి. లభించిన వానిని సద్వినియోగ పరచుకొని ఆనందముతో ఆరోగ్యవంతులై, అత్మానుభవమును గూర్చి చింతించు జీవితలక్ష్యమైన జీవనసంఘర్షణ నుండి ముక్తిని సాధింతురనెడి ఉద్దేశ్యము చేతనే వారట్లు మనకు సర్వమును ఒసగుచున్నారు. అట్టి జీవితలక్ష్యము యజ్ఞనిర్వాహణచే సిద్ధించుచున్నది.
కాని మానవజన్మ లక్ష్యమును మరచి, భగవానుని ప్రతినిదులచే ఒసగబడినవాటిని కేవలము ఇంద్రియప్రీతి కొరకే వినియోగించి భౌతికత్వమునందే మరింతగా బద్ధులమైనచో (అది సృష్టిప్రయోజనమెన్నడును కాదు) మనము చోరులుగా పరిగణింపబడి ప్రకృతి నియమములచే శిక్షింపబడుడుము.
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Bhagavad-Gita as It is - 119 🌹*
*✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada*
*📚 Prasad Bharadwaj*
*🌴 Chapter 3 - Karma Yoga - 12 🌴*
*12. iṣṭān bhogān hi vo devā dāsyante yajña-bhāvitāḥ
*tair dattān apradāyaibhyo yo bhuṅkte stena eva saḥ*
🌷Translation :
*In charge of the various necessities of life, the demigods, being satisfied by the performance of yajña [sacrifice], will supply all necessities to you. But he who enjoys such gifts without offering them to the demigods in return is certainly a thief.*
🌷 Purport :
The demigods are authorized supplying agents on behalf of the Supreme Personality of Godhead, Viṣṇu. Therefore, they must be satisfied by the performance of prescribed yajñas. In the Vedas, there are different kinds of yajñas prescribed for different kinds of demigods, but all are ultimately offered to the Supreme Personality of Godhead. For one who cannot understand what the Personality of Godhead is, sacrifice to the demigods is recommended.
According to the different material qualities of the persons concerned, different types of yajñas are recommended in the Vedas. Worship of different demigods is also on the same basis – namely, according to different qualities. For example, the meat-eaters are recommended to worship the goddess Kālī, the ghastly form of material nature, and before the goddess the sacrifice of animals is recommended. But for those who are in the mode of goodness, the transcendental worship of Viṣṇu is recommended.
But ultimately all yajñas are meant for gradual promotion to the transcendental position. For ordinary men, at least five yajñas, known as pañca-mahā-yajña, are necessary.
🌹 🌹 🌹 🌹 🌹
#భగవద్గీత #BhagavadGita #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 528 / Vishnu Sahasranama Contemplation - 528 🌹*
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻528. నన్దః, नन्दः, Nandaḥ (అనన్దః, अनन्दः, Anandaḥ)🌻*
*ఓం నన్దాయ నమః | ॐ नन्दाय नमः | OM Nandāya namaḥ*
*నన్దః, नन्दः, Nandaḥ (అనన్దః, अनन्दः, Anandaḥ)*
*మహావిష్ణుస్ససమృద్ధః సర్వాభిరుపపత్తిభిః ।*
*నన్ద ఇత్యుచ్యతే సద్భిర్వేదవిద్యావిశారదైః ॥*
*నన్దస్సుఖం వైషయికం నాస్త్యనన్ద ఇతీర్యతే ।*
*యో వై భూమా తత్సుఖమిత్యాదిశ్రుతిసమీరణాత్ ॥*
*'నన్దః' - అన్ని విధములగు సిద్ధులచే నిండియుండును. ఇచట 'నందనః' మరియూ 'అనందః' అను విభాగమునైన చేయవచ్చును. అపుడు, 'అనన్దః' అను నామమునకు - ఎవనికి శబ్దాది విషయములననుభవించుటచే కలుగు ఆనందము ఉండదో అట్టివాడు అను అర్థము చెప్పవచ్చును.*
:: ఛాన్దోగ్యోపనిషత్ - సప్తమః ప్రపాఠకః, త్రయోవింశః ఖణ్డః ::
యోవై భూమా తత్సుఖం నాల్పే సుఖ మస్తి భూమైవ సుఖం ।
భూమాత్వేన విజిజ్ఞాసితవ్య ఇతి భూమానం భగవో విజిజ్ఞాస ఇతి ॥ 1 ॥
*భూమా (అనగా గొప్పది, బ్రహ్మము, ఆత్మ) అనునదియే సుఖము. అల్పమైనదానియందు సుఖము ఉండదు. కావున భూమయే సుఖము. ఆ గొప్పదియగు ఆత్మనే తెలిసికొనవలయును... (పరమ మహత్పరిణమముతో నిండియుండు పరమాత్ముడు తానే సుఖస్వరూపుడు కావున ఆతనికి ఇతరములనుండి సుఖమును పొందవలసిన పనియే లేదు).*
*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 528🌹*
📚. Prasad Bharadwaj
*🌻528. Anandaḥ)🌻*
*OM Nandāya namaḥ*
महाविष्णुस्ससमृद्धः सर्वाभिरुपपत्तिभिः ।
नन्द इत्युच्यते सद्भिर्वेदविद्याविशारदैः ॥
नन्दस्सुखं वैषयिकं नास्त्यनन्द इतीर्यते ।
यो वै भूमा तत्सुखमित्यादिश्रुतिसमीरणात् ॥
Mahāviṣṇussasamrddhaḥ sarvābhirupapattibhiḥ,
Nanda ityucyate sadbhirvedavidyāviśāradaiḥ.
Nandassukhaṃ vaiṣayikaṃ nāstyananda itīryate,
Yo vai bhūmā tatsukhamityādiśrutisamīraṇāt.
*Nandaḥ - Rich with all things to be attained. Or Anandaḥ - He who does not need to seek sensory and such pleasures from anything.*
:: छान्दोग्योपनिषत् - सप्तमः प्रपाठकः, त्रयोविंशः खण्डः ::
योवै भूमा तत्सुखं नाल्पे सुख मस्ति भूमैव सुखं ।
भूमात्वेन विजिज्ञासितव्य इति भूमानं भगवो विजिज्ञास इति ॥ १ ॥
Chāndogyopaniṣat - Chapter 7, Section 23
Yovai bhūmā tatsukhaṃ nālpe sukha masti bhūmaiva sukhaṃ,
Bhūmātvena vijijñāsitavya iti bhūmānaṃ bhagavo vijijñāsa iti. 1.
*The infinite is bliss. There is no bliss in anything finite. One must desire to understand that which is infinite... (Since He himself is bliss, there is nothing else from which He can seek pleasure).*
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
अजो महार्हस्स्वाभाव्यो जितामित्रः प्रमोदनः ।आनन्दो नन्दनोऽनन्दस्सत्यधर्मा त्रिविक्रमः ॥ ५६ ॥
అజో మహార్హస్స్వాభావ్యో జితామిత్రః ప్రమోదనః ।ఆనన్దో నన్దనోఽనన్దస్సత్యధర్మా త్రివిక్రమః ॥ 56 ॥
Ajo mahārhassvābhāvyo jitāmitraḥ pramodanaḥ,Ānando nandano’nandassatyadharmā trivikramaḥ ॥ 56 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
#విష్ణుసహస్రనామతత్వవిచారణ #VishnuSahasranamacontemplation #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://t.me/vishnusahasranaam
www.facebook.com/groups/vishnusahasranaam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 DAILY WISDOM - 206 🌹*
*🍀 📖 The Spiritual Import of the Mahabharata and the Bhagavadgita 🍀*
*📝 Swami Krishnananda*
*📚. Prasad Bharadwaj*
*🌻 24. The Absolute is All-pervading 🌻*
*The Absolute Almighty pervades every nook and corner of the universe. Every nook and cranny is permeated by the presence of the Supreme Being. The consciousness of the presence of the Almighty inseparably in every little thing in the whole of creation is the ultimate constitutional dharma. It is the central constitution of the cosmos, and all local and provincial laws follow from it.*
*Political laws, social laws, family laws, personal laws, physical laws, psychological laws, and what not—all these are expressions according to the requirement of the particular state of affairs of that eternal deciding factor which is the presence of one common Being everywhere, equally, unanimously, perpetually in everything. The presence of God is defined here as an invisible presence, an unmanifested existence—avyakta-murtina. It is not a gross, visible, sensory presence.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#DailyWisdom #SwamiKrishnananda
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌹. Daily satsang Wisdom 🌹
www.facebook.com/groups/dailysatsangwisdom/
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://pyramidbook.in/Chaitanyavijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 45 🌹*
*✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్*
* సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🌻 33. నిరాదరణ 🌻*
*సమస్త సృష్టియు పరంపరాగతముగ లోకములను, లోకేశులను, లోకస్థులను ఏర్పరచుకొని యున్నది. సృష్టికి మూలసూత్రమే పరంపర. నారాయణుని నుండి చతుర్ముఖుడు, చతుర్ముఖుని నుండి సమస్త లోకములు ఉద్భవించుట తెలిసిన విషయమే. సృష్టి యందు ఊర్ధ్వలోకములు, అధోలోకములకు ఆధారము. క్రింది లోకముల వారు పైలోకముల వారిని గౌరవించుట, పూజించుట, మన్నించుట సృష్టి యందు సహజ ధర్మము. సమస్త సృష్టి ధర్మములు అవ్యక్తము నుండి సూక్ష్మ లోకములలోనికి, అచటి నుండి స్థూల లోకములలోనికి అవ తరణము చెందు చున్నవి. సృష్టి యందు ఊర్ధ్వలోకముల వారు అధో లోకముల వారిని ఆదరించుట వలననూ, అధోలోకముల వారు ఊర్ధ్వలోకముల వారిని మన్నించుట వలననూ సృష్టికార్యము నిరాటంకముగ సాగుచుండును.*
*ఈ పరంపరాగత ధర్మములు మానవులకు కూడా లభించినవి. తల్లిదండ్రులను, గురువులను, పెద్దలను పిన్నలు గౌరవించుట, పిన్నలను పెద్దలు ఆదరించుట ఈ ధర్మస్వరూపమే. ఏ సంఘముననై ననూ యీ సూత్రము చెడినచో, ఆ సంఘము పతనము చెందుట ఖాయము. పతనము చెందిన మానవ సంఘములకు ప్రేమతో, ఆదరముతో, మరల యీ ధర్మ సూత్రములను బోధించుట, అందించుట- తత్ఫలితముగ మానవ జాతికి తోడ్పడుట మా గురుపరంపర యొక్క కార్యక్రమము. గురువులను నిరాకరించిన సాంప్రదాయమున సృజనాత్మక శక్తి నశించగలదు. సృజనాత్మక శక్తి నశించిన జాతికి పురోగతి లేదు.*
*సశేషం.....*
🌹 🌹 🌹 🌹 🌹
#మైత్రేయమహర్షిబోధనలు #MaitreyaMaharshi #సద్గురుపార్వతీకుమార్ #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
భారతీయ మహర్షుల బోధనలు Maharshula Wisdom
www.facebook.com/groups/maharshiwisdom/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 112 🌹*
*✍️. సౌభాగ్య*
*📚. ప్రసాద్ భరద్వాజ*
*🍀. సాధారణంగా వ్యక్తి ఉనికిని చుట్టుముట్టిన సౌందర్యం పట్ల స్పృహతో వుండడు. కేవలం వికారం పట్ల స్పృహతో వుంటాడు. కారణం మనసెపుడూ మరిచిపోతుంది. గాయాల్ని లెక్క పెడుతుంది. దీవెనల్ని విస్మరిస్తుంది. మనసు మార్గం అలాంటిది. 🍀*
*ధ్యానం నీ కోసం రెండు పనులు చేస్తుంది. నీ చుట్టూ వున్న సౌందర్యం పట్ల నీకు స్పృహ కలిగిస్తుంది. దాని పట్ల నువ్వు సున్నితంగా స్పందించేట్లు చేస్తుంది. రెండోది నిన్ను సౌందర్యభరితం చేస్తుంది. నీలో ఒక దయాతరంగాన్ని లేపుతుంది. నీ కళ్ళు ఎంతగా దయతో నిండి వుంటాయంటే సమస్త అస్తిత్వం సౌందర్యంతో నిండిపోతుంది. మనం సౌందర్యం నిండిన అస్తిత్వం నించీ దోసిళ్ళతో దాన్ని తాగాలి. మనలోకి ఆ సౌందర్యం ప్రవేశించడానికి మనం అనుమతించాలి. సాధారణంగా వ్యక్తి ఉనికిని చుట్టుముట్టిన సౌందర్యం పట్ల స్పృహతో వుండడు. కేవలం వికారం పట్ల స్పృహతో వుంటాడు. కారణం మనసెపుడూ మరిచిపోతుంది. గాయాల్ని లెక్కపెడుతుంది. దీవెనల్ని విస్మరిస్తుంది. మనసు మార్గం అలాంటిది.*
*నువ్వు ధ్యానంలోకి అడుగుపెట్టిన క్షణం, నువ్వు నిశ్శబ్దంలోకి అడుగుపెట్టిన క్షణం మరింత విశ్రాంతి పొందుతావు. మరింతగా నీ అస్తిత్వంలో స్థిరపడతావు. అప్పుడు నువ్వు హఠాత్తుగా వృక్షాల సౌందర్యం పట్ల, మేఘాల అందం పట్ల, మనుషుల సౌందర్యం పట్ల స్పృహతో వుంటావు. ప్రతిదీ సౌందర్యభరితమే. కారణం ప్రతిదీ దైవత్వంతో నిండివుంది. బండలు కూడా దైవత్వాన్ని నింపుకొని వున్నాయి. దైవత్వం లేనిదేదీ లేదు. ఒకసారి నువ్వు ఈ సౌంధర్య కోణాల్ని అనుభూతి చెందడం ఆరంభిస్తే నువ్వు సంగీతంతో, కవిత్వంతో, నాట్యంతో, ఉత్సవంతో ప్రేమతో నిండిపోతావు. నువ్వు అందంతో నిండిపోతావు. ధగధగలాడతావు. అది నీలో ప్రతి ఒక్కరికీ కనబడుతుంది. ఒకరు ఆ సౌందర్యాన్ని నీలో చూడాలనుకుంటే అది కనిపిస్తుంది. కానీ జనం కళ్ళు మూసుకుని వుంటారు. అందువల్ల చూడలేరు.*
*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌹 ఓషో బోధనలు - Osho Teachings 🌹
https://t.me/ChaitanyaVijnanam
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://pyramidbook.in/Chaitanyavijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 331 / Sri Lalitha Chaitanya Vijnanam - 331 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*మూల మంత్రము :*
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*
*🍀 74. కళావతీ, కళాలాపా, కాంతా, కాదంబరీప్రియా ।*
*వరదా, వామనయనా, వారుణీమదవిహ్వలా ॥ 74 ॥ 🍀*
*🌻 331. 'వరదా' 🌻*
*వరముల నొసగునది శ్రీమాత అని అర్థము. సృష్టి సమస్తమును పరిపాలించునది శ్రీమాతయే కదా! బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు కూడ ఆమె వరముల నిచ్చుచున్నది. విపత్కర పరిస్థితులలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సైతము ఆమెను ప్రార్ధించి వరములు పొందిరి. నారద మహర్షి శ్రీమాత ఎట్టి వరప్రదాతయో అద్భుతముగ తెలిపినాడు. శ్రీమాత హస్తము ఎప్పుడునూ వరద ముద్రలోనే వుండునని, అది ఆమె సహజమగు ముద్రయని కీర్తించినాడు.*
*రాక్షసులైననూ, దేవతలైననూ శ్రీమాతకు సమానమే. భక్తితో కోరిన వారికి వరదానము చేయుటయే అమ్మవంతు. వరములు కోరు జీవులందరి కోరికలను తీర్చు వాత్సల్యమూర్తి ఆమె. తొమ్మిది రోజులు శ్రీమాతను భక్తి శ్రద్ధలతో పూజించిన వారికి శ్రీమాత వరము నొసగునని వరాహ పురాణము పేర్కొనుచున్నది. శ్రీమాత నుద్దేశించి తొమ్మిది దినములు సమాధిలో నుండు సిద్ధులకు శాశ్వతముగ తన సాన్నిధ్యము నిచ్చునని పురాణములు తెలుపుచున్నవి.*
*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 331 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*
*✍️. Ravi Sarma *
*📚. Prasad Bharadwaj*
*🌻 74. Kalavati kalalapa kanta kadanbari priya*
*Varada vamanayana varunimadavihvala ॥ 74 ॥ 🌻*
*🌻 331. Varadā वरदा (331) 🌻*
*The one who grants boons. In Viṣṇu Sahasranāma nāma 330 is also Varadā. Granting boons is the general quality of all Gods and Goddesses. In certain forms of Gods and Goddesses the right palm is used as a gesture of granting boons. There is a special significance for this nāma. She does not grant boons through Her palms. Her sacred feet give boons. She is kāmadāyinī (nāma 63). Otherwise nāma 83 will not have any meaning. The significance of this nāma is further strengthened by nāma 117.*
*Saundarya Laharī (verse 4) perfectly describes this nāma. It says, “You are the refuge of all the worlds! All gods except you vouchsafe protection to devotees and grant their desires by gestures of their hands. You alone do not show varada and abhaya gestures. It is so because Your feet are by themselves powerful to protect those in the grip of fear and grant more that what is desired for by devotees.” Such niceties describe the ease with which She grants boons. It is also said that She is to be worshipped by concentration (through meditation) on ninth lunar day (navami) when She becomes the giver of boons to all the worlds.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#శ్రీలలితాసహస్రనామచైతన్యవిజ్ఞానము #SriLalithaChaitanyaVijnanam #లలితాసహస్రనామములు #LalithaSahasranama
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
19-DECEMBER-2021 ఆదివారం MESSAGES
1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam 19, ఆది వారం, డిసెంబర్ 2021 భాను వాసరే 🌹
🌹. మార్గశిర మాస పౌర్ణమి, కోరల పౌర్ణమి విశిష్టత 🌹
🌹. అన్నపూర్ణ జయంతి విశిష్టత 🌹
2) 🌹. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 293 🌹
3) 🌹. శివ మహా పురాణము - 492🌹
4) 🌹 వివేక చూడామణి - 169 / Viveka Chudamani - 169🌹
5)🌹. మాస్టర్ ఇ.కె సందేశాలు -121🌹
6) 🌹 Osho Daily Meditations - 110 🌹
7) 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 169 / Sri Lalitha Sahasra Namaavali - Meaning - 169🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శుభ ఆదివారం మిత్రులందరికీ 🌹*
*భాను వాసరే, 19, డిసెంబర్ 2021*
*మీకు ఈ రోజు అంతా కాలం అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*
*🍀. శ్రీ అన్నపూర్ణా స్తోత్రం 🍀*
నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్యరత్నాకరీ
నిర్ధూతాఖిలఘోరపావనకరీ ప్రత్యక్షమాహేశ్వరీ |
ప్రాలేయాచలవంశపావనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ || ౧ ||
🌻 🌻 🌻 🌻 🌻
విక్రమ సంవత్సరం: 2078 ఆనంద
శఖ సంవత్సరం: 1943 ప్లవ,
దక్షిణాయణం, హేమంత ఋతువు,
మృగశిర మాసం
తిథి: పూర్ణిమ 10:06:56 వరకు
తదుపరి కృష్ణ పాడ్యమి
నక్షత్రం: మృగశిర 16:53:07
వరకు తదుపరి ఆర్ద్ర
యోగం: శుభ 10:09:44
వరకు తదుపరి శుక్ల
కరణం: బవ 10:04:56 వరకు
వర్జ్యం: 26:17:33 - 28:05:05
దుర్ముహూర్తం: 16:17:10 - 17:01:33
రాహు కాలం: 16:22:43 - 17:45:55
గుళిక కాలం: 14:59:30 - 16:22:43
యమ గండం: 12:13:06 - 13:36:18
అభిజిత్ ముహూర్తం: 11:51 - 12:35
అమృత కాలం: 06:57:54 - 08:46:06
సూర్యోదయం: 06:40:16
సూర్యాస్తమయం: 17:45:55
వైదిక సూర్యోదయం: 06:44:10
వైదిక సూర్యాస్తమయం: 17:42:01
చంద్రోదయం: 17:53:52
చంద్రాస్తమయం: 06:39:58
సూర్య సంచార రాశి: ధనుస్సు
చంద్ర సంచార రాశి: జెమిని
సౌమ్య యోగం - సర్వ సౌఖ్యం
16:53:07 వరకు తదుపరి ధ్వాoక్ష
యోగం - ధన నాశనం, కార్య హాని
పండుగలు : అన్నపూర్ణ జయంతి,
Annapurna Jayanti
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam
Join and Share
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. మార్గశిర పౌర్ణమి - కోరల పౌర్ణమి విశిష్టత 🌹*
*📚. ప్రసాద్ భరద్వాజ*
*పురాణాల ప్రకారం చిత్రగుప్తుడి సోదరి 'కోరల' పేరు మీద ఈ పౌర్ణమిని జరుపుకుంటారు.*
*మన హిందూ సంప్రదాయంలో పౌర్ణమికి ఎంతో విశేషమైన స్థానం ఉంది. పౌర్ణమి రోజు దేవతలు కూడా ఎన్నో శుభకార్యాలు చేస్తారు. పౌర్ణమి రోజు చేసే పూజలు అందరి దేవతలకు చేసినట్టే. మార్గశిర మాసంలో వచ్చే ఈ పౌర్ణమిని కోరల పౌర్ణమి అంటారు. ప్రతి సంవత్సరం మార్గశిర పౌర్ణమి రోజు కోరల పౌర్ణమిని జరుపుకుంటారు.*
*హిందూ పురాణాల ప్రకారం కార్తీక పౌర్ణమి నుండి మార్గశిర పౌర్ణమి వరకు యమధర్మ రాజు తన కోరలు తెరుచుకొని ఉంటాడు , అందువల్ల అనేక రకాల వ్యాధులు , అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. దానికి కృతజ్ఞతగా ఈ మార్గశిర పౌర్ణమి రోజు యమధర్మరాజును ఆరాధిస్తారు.*
*ఈ మార్గశిర పౌర్ణమిని కోరల పున్నమి లేదా నరక పౌర్ణమి అని పిలుస్తారు. ఈ రోజు కోరల అమ్మవారిని పూజిస్తారు కనుక కోరల పౌర్ణమి అని పేరు వచ్చింది. కోరల అమ్మవారు సాక్షాత్తు చిత్రగుప్తుడి సోదరి. మార్గశిర పౌర్ణమి రోజున చిత్రగుప్తుడు తన చెల్లెలి ఇంటికి వస్తాడు. అన్నయ్య చిత్రగుప్తుడు ఇంటికి రావటంతో చెల్లెలు కోరల ఆనందంతో ఘనమైన విందును ఏర్పాటు చేస్తుంది.*
*చిత్రగుప్తుడు చెల్లెలిని ఆశీర్వదిస్తూ మార్గశిర పౌర్ణమి రోజు ఎవరైతే కోరలను పూజిస్తారో వారికీ నరక బాధలు అపమృత్యు భయం ఉండదని కోరలకు చిత్రగుప్తుడు వరం ఇస్తాడు. చిత్రగుప్తుడిపై గల అభిమానంతో ఆయన మాట నెరవేరేలా తాను కూడా సహకరిస్తానని యమధర్మరాజు సమర్థించాడు. అప్పటి నుంచి మార్గశిర పౌర్ణమి రోజున కోరలమ్మను పూజించటం ప్రారంభం అయింది.*
*కోరలమ్మకు మినప రొట్టెను నైవేద్యంగా సమర్పించాలి. మార్గశిర పౌర్ణమి సాయంత్రం మినప రొట్టె తయారుచేసి చిన్న ముక్కను కొరికి కుక్కలకు వేయాలి. కోరల పౌర్ణమి రోజు చంద్రుణ్ణి పూజించాలి. చంద్ర వ్రతం చేయాలనీ పురాణాలు చెపుతున్నాయి. మార్గశిర పౌర్ణమి రోజు కోరలమ్మను పూజిస్తే ఆమె అనుగ్రహం కలిగి నరక బాధలు, అపమృత్యు భయాలు తొలగి పోతాయి.*
🌹 🌹 🌹 🌹 🌹
Join and Share
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. అన్నపూర్ణ జయంతి , ప్రాముఖ్యత , వ్రత కథ 🌹*
*ప్రసాద్ భరధ్వాజ*
అన్నపూర్ణ వ్రతం హిందువుల ముఖ్యమైన పండుగ. ఈ భూమి మీద ఉన్న ప్రతి జీవరాశికి ఆహారం అవసరం. ఆ ఆహారానికి ప్రతీకగా హిందూ దేవత అయిన అన్నపూర్ణ దేవికి అంకితం చేయబడింది.
హిందీలో 'అన్నా' అనే పదానికి 'ఆహారం' అని అర్ధం , 'పూర్ణ' 'మొత్తాన్ని' ఊహించబడినది.
అన్నపూర్ణ జయంతి ఒక శుభమైన మరియు పురాతనకాలం నుండి జరుపుకుంటున్న హిందూ పండగ.
ఈ పండుగను ఆహారాన్ని ప్రసాదించే అన్నపూర్ణేశ్వరికి చిహ్నంగా జరుపుకుంటారు. ఈ రోజు అన్నపూర్ణ జయంతి సందర్భంగా పండగ జరుపుకోవడమే కాదు , ఆ దేవతను ప్రశంసిపబడుతారు.
ఈ రోజు జీవనాధారమైన అన్నపూర్ణ దేవత పుట్టింది. పార్వతి దేవికి మరో రూపం అన్నపూర్ణ అంటారు. మీరు ఈ పవిత్ర దినోత్సవాన్ని జరుపుకోవాలని మరియు అన్నపూర్ణ దేవత ఆశీర్వాదం పొందాలనుకుంటే , అన్నపూర్ణ వ్రతం చేయాలి.
అన్నపూర్ణ జయంతిని ఆచార హిందూ షెడ్యూల్‌లో 'మార్గశీర్ష' నెల 'పూర్ణిమ' (పౌర్ణమి రోజు) లో జరుపుకుంటారు. ఈ గుర్తింపు ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం డిసెంబర్లో వస్తుంది. ఈ రోజున హిందువులు అన్నపూర్ణ దేవిని పూర్తి నిబద్ధతతో , భక్తితో పూజిస్తారు. మహిళలు తప్పనిసరిగా ఈ వ్రతం రోజున పూజలు ఆచారాలను పాటిస్తారు.
పశ్చిమ బెంగాల్ భూభాగంతో సహా భారతదేశంలోని తూర్పు ప్రాంతాలలో సాంప్రదాయకంగా అన్నపూర్ణ జయంతిని జరుపుకుంటారు , అన్నపూర్ణ జయంతి హిందూ నెల *'చైత్ర'లో కనిపిస్తుంది. దక్షిణ భారత అభయారణ్యాలలో అధికభాగంలో , అన్నపూర్ణ దేవిని శుభ దుర్గా నవరాత్రి వేడుకల 'చతుర్థి' (నాల్గవ రోజు) లో పూజిస్తారు. ప్రత్యేక పూజలు మరియు ఆచారాలతో , అన్నపూర్ణ వ్రతాన్ని స్త్రీలు జరుపుకుంటారు. వారణాసి , కర్ణాటక మరియు మధ్యప్రదేశ్ లో అనేక అన్నపూర్ణ దేవత ఆలయాలు ఉన్నాయి.
*🍀. అన్నపూర్ణ వ్రత కథ*
హిందూ ఇతిహాసాలు సూచించినట్లుగా , భూమి నుండి ఆహారం క్షీణించడం ప్రారంభించినప్పుడు , బ్రహ్మ మరియు విష్ణువులతో పాటు అందరు దేవుళ్ళు పరమ శివుడికి విజ్ఞప్తి చేశారు. ఆ సమయంలో పార్వతి దేవి మార్గాశిర్షా నెలలోని 'పూర్ణిమ' లో అన్నపూర్ణ దేవతగా అవతరించింది మరియు భూమిపై ఆహారాన్ని ఆశీర్వదించింది.
ఆ సమయం నుండి, ఈ రోజు అన్నపూర్ణ జయంతి అని ప్రశంసించబడింది.
అమ్మవారి అలంకారం అన్నపూర్ణాదేవి. 'అన్నపూర్ణే , సదా పూర్ణే శంకర ప్రాణవల్లభే' అంటూ కొలిచే ఈ అమ్మ మన అందరికీ ఇంటిలో కొదువ లేకుండా ధాన్యాన్ని సమకూర్చే దేవత. లోకాలకు క్షుదార్తి తీర్చే మాతృస్వరూపమే ఈ అన్నపూర్ణాదేవి. శివుడంతటివాడికే అమ్మయై భిక్ష వేసింది.
ఆమె సంతానంలాటి మనందరం సుఖసంతోషాలతో విలసిల్లాలని మనలను కరుణిస్తుంది. ఈరోజు అన్నదానం చేయడం విశేషం. అన్ని దానాల్లోకి అన్నదానం విశేషమైన ఫలితాన్నితాన్నిస్తుంది. ఆహారానికి శక్తి ఉంటుంది. శక్తితో కూడుకున్న ఆహారమే మన శరీరం అవుతుంది. మన మనస్సు కూడా ఆహారంయొక్క స్వరూపమే.
ఆహారాలు 3 రకాలుగా ఉంటాయి. సాత్విక , రాజస , తామసాలు.
శక్తిలేని ఆహారాన్ని మనం స్వీకరించం. అన్నపూర్ణగా కొలిచే అమ్మవారిలో అన్ని ధాన్యాలలోను అలాగే తినే ఆహార పదార్థాలలో ఉండేటటువంటి అంతఃశక్తిని కొలిచే విధానాన్ని ఈ నవరాత్రులలో గుర్తుచేసుకోవడం. ఉపనిషత్తులు…. అన్నమే బ్రహ్మగా వర్ణించాయి.
(అన్నం బ్రహ్మేతి వ్యజానాత్) అన్నం వలన సకల భూతాలు ఉద్భవిస్తున్నాయని చెప్పాయి. అటువంటి అన్నాన్ని నిందించడం , పరీక్షించడం , వదిలిపెట్టడం వంటి పాపకార్యాలుగా శాస్త్రాలన్నీ చెపుతున్నాయి. శక్తి స్వరూపమైన ఈ అన్నం ఉపేక్షించి వదిలిపెట్టడం ద్వారా మనకు లభించకుండా పోతుందనేది భారతీయుల సంప్రదాయం. అందువల్ల పూర్ణ శక్తివంతమైన ఆహారాన్ని (అన్నాన్ని) స్వీకరించి దాన్ని దైవంగా ఆరాధించే సంప్రదాయం ఈ నవరాత్రుల్లో మనకు కనిపిస్తుంది.
సాత్వికమైన హిత , మిత ఆహారాలు భగవంతునికి చేరువ కావడానికి తోడ్పడతాయని అందరు ఆధ్యాత్మిక వేత్తలు చెపుతున్నమాటే.
ఆ శక్తిని నిరంతరం ఉపాసిస్తూ ఆ ఆహారంలోని అమ్మవారిని నమస్కరించుకోవడం ఈ నవరాత్రుల్లో అన్నపూర్ణాదేవి అవతార విశేషం. అన్నపూర్ణాదేవి దగ్గర అపరిమిత శక్తితో కూడుకున్న ఆహార భిక్షను స్వీకరించడమే తీసుకున్న భిక్షకు నమస్కారం తెలియజేయడమే ఈ ప్రత్యేక పూజకు ఫలితం.
అమ్మవారు లేత గోధుమరంగు (హాఫ్ వైట్) చీర ధరించి భక్తులను అనుగ్రహిస్తుంది. అదేవిధంగా ఈరోజు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించే పదార్థం కొబ్బరి అన్నం. ఇది వాతాన్ని హరిస్తుంది. శ్రమను పోగొడుతుంది. గుండె నీరసాన్ని తగ్గిస్తుంది. కఫ , పైత్యములను తగ్గిస్తుంది. నేత్ర రోగాలను నయం చేస్తుంది. శరీర కాంతిని పెంచుతుంది. కడుపులో తాపాన్ని పోగొడుతుంది. కిడ్ని వ్యాధుల్ని కూడా నివారిస్తుంది.
*🌻. అన్నపూర్ణ వ్రత ఆచారాలు:*
ఈ రోజున చేసే ఆచారాలన్నీ దశల వారీగా ప్రస్తావించబడ్డాయి.
హిందూ భక్తులు తమ ఇంటిలో పూజా వేడుకలు చేస్తారు. ఒక చిన్న మండపం తయారు చేసి , మరియు అన్నపూర్ణ దేవత యొక్క చిహ్నం పూజ స్థలంలో ఉంచబడుతుంది.
అన్నపూర్ణ జయంతి నాడు దేవతను 'షోడశోపాచార్' తో పూజిస్తారు. భక్తులు అన్నపూర్ణ దేవికి 'అన్నాభిషేకం' అర్పించినట్లు తెలుస్తోంది.
అన్నపూర్ణ దేవిని సంతృప్తి పరచడానికి మరియు ఆమె ఆశీర్వాదం తీసుకోవడానికి స్త్రీలు అన్నపూర్ణ జయంతి జరుపుకోవడానికి ఉత్సాహంగా ఉంటారు. రోజు గడుస్తున్న కొద్దీ వారు ఏమీ తినరు , త్రాగరు. అన్నపూర్ణ దేవతను పూజించిన తరువాత , రాత్రి సమయంలో ఉపవాసం తీర్చుకుంటారు.
అన్నపూర్ణ దేవి అష్టకం పఠనం ఈ రోజున చాలా ఆశీర్వాదంగా భావించబడుతుందని నమ్ముతారు.
. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
🙏లకా సమస్తా సుఖినోభవన్తు!🙏
🌹 🌹 🌹 🌹 🌹
Join and Share
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. గీతోపనిషత్తు -293🌹*
*✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము 📚*
శ్లోకము 17-4
*🍀 17-4. ప్రణవ స్వరూపుడు - భగవంతుని ప్రప్రథమ నామ రూపములు ఓంకారముగ ఋషులు దర్శించిరి. మరియొక ఉదాహరణముగ “మూడు వేదములు నేనే" అని దైవము పలికినాడు. ఋక్, సామ, యజుర్వేదములు మూడు ప్రధానమగు వేదములు. ఉచ్చారణ, ప్రాణ స్పందనము, కర్మ నిర్వహణము సృష్టి యందుకల మూల త్రికోణము. మన యందు సంకల్ప ముచ్చరింపబడగ, దానిని ప్రాణ బలముతో, బుద్ధి బలముతో నిర్వర్తించు చుందుము. ఇందు సంకల్పము ఋగ్వేదము. తాళ లయాత్మకముగ సాగు ప్రాణస్పందనము సామ వేదము. బుద్ధి బలముతో సంకల్పమును ప్రాణశక్తి సహాయమున నిర్వర్తించుట యజుర్వేదము. 🍀*
*పితా హమస్య జగతో మాతా ధాతా పితామహః |*
*వేద్యం పవిత్ర మోంకార ఋక్సామ యజురేవ చ || 17*
*తాత్పర్యము : ఈ జగత్తునకు తండ్రిని నేనే. తల్లి, తండ్రి, తాత కూడ నేనే. ఓంకారము నేనే. అన్నిటి యందు తెలిసికొనదగినది నేనే. పవిత్ర పదార్థముగ నున్నది నేనే. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము నేనే.*
*వివరణము : నామము రూపము లేని భగవతత్త్వమునకు ఓంకారము ప్రథమనాదము. అందలి నాదము ప్రథమ రూపము. భగవంతుని ప్రప్రథమ నామ రూపములు ఓంకారముగ ఋషులు దర్శించిరి. మరియొక ఉదాహరణముగ “మూడు వేదములు నేనే" అని దైవము పలికినాడు. ఋక్, సామ, యజుర్వేదములు మూడు ప్రధానమగు వేదములు. ఉచ్చారణ, ప్రాణ స్పందనము, కర్మ నిర్వహణము సృష్టి యందుకల మూల త్రికోణము.*
*మన యందు సంకల్ప ముచ్చరింపబడగ, దానిని ప్రాణ బలముతో, బుద్ధి బలముతో నిర్వర్తించు చుందుము. ఇందు సంకల్పము ఋగ్వేదము. తాళ లయాత్మకముగ సాగు ప్రాణస్పందనము సామ వేదము. బుద్ధి బలముతో సంకల్పమును ప్రాణశక్తి సహాయమున నిర్వర్తించుట యజుర్వేదము. ఈ మూడును నిత్యము మన యందు జరుగుచు నుండును. సంకల్పములు మనయందు అవతరించుచు నుండును. వానిని ప్రాణబలము, బుద్ధిబలముతో నిర్వర్తించుచు నుందుము. సంకల్పము ఇచ్ఛాశక్తి స్వరూపము. ప్రాణము జ్ఞానశక్తి స్వరూపము. బుద్ధి క్రియాశక్తి స్వరూపము. ఓంకారము రూపమున ఈ మూడింటికిని బలము కూర్చి ఈశ్వరుడు సృష్టి నిర్వహణము చేయుచున్నాడు.*
*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
#గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 . శ్రీ శివ మహా పురాణము - 492 🌹*
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
*🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴*
అధ్యాయము - 39
*🌻. శివుని యాత్ర - 2 🌻*
ఓ మునిశ్రేష్ఠా! తరువాత శంభుడు హర్షముతో నిండిన మనస్సుగలవాడై లోకాచారమును ప్రదర్శించువాడై శుభవచనములతో ఆనందమును కలిగిస్తూ నీతో నిట్లనెను (12).
ఓ మునిశ్రేష్ఠా! నేను నీకు చెప్పెదను. నీవిపుడు ప్రీతితో వినుము. నీవు గొప్ప భక్తులలో అగ్రగణ్యుడవు, నాకు ప్రియుడవు. కావుననే నీకు చెప్పుచున్నాను (13). పార్వతీదేవి నీ ఆదేశముచే గొప్ప తపస్సును చేసినది. నేను సంతోషించి ఆమెను వివాహమాడెదనని వరము నిచ్చితిని (14). భక్తికి వశుడనయ్యే నేను ఆమెను వివాహమాడెదను. ఈ కార్యమును సప్తర్షులు సాధించినారు. వారు వివాహ లగ్నమును కూడా నిర్ణయించినారు (15). ఓ నారదా! ఈ నాటి నుండి ఏడవనాడు వివాహము సంపన్నము కాగలదు. నేను లోకాచారము ననుసరించి గొప్ప ఉత్సవమును చేయగలను (16).
బ్రహ్మ ఇట్లు పలికెను-
ఓ కుమారా! శంకర పరమాత్మ యొక్క ఆ మాటను విని, ప్రసన్నమగు మనస్సు గల నీవు ఆ ప్రభునకు నమస్కరించి ఇట్లు పలికితివి (17).
నారదుడిట్లు పలికెను -
ఇది నీ వ్రతము. నీవు భక్తులకు అధీనుడవని చెప్పెదరు. పార్వతియొక్క మనస్సులోని కోరికను తీర్చి నీవు మంచి పనిని చేసితివి (18). హే విభో! నీవు నన్ను నీ సేవకునిగా తలంచి, నాకు తగిన కార్యమునందు నియోగించుము. నాయందు దయను చూపుము. నీకు నమస్కారమగును గాక! (19)
బ్రహ్మ ఇట్లు పలికెను-
ఓ మహర్షీ! నీవు ఇట్లు పలుకగా, భక్తవత్సలుడగు శివశంకరుడు ప్రసన్నమగు మనస్సు గలవాడై సాదరముగా నీతో నిట్లనెను (20).
శివుడిట్లు పలికెను-
ఓ మునీ! విష్ణువు మొదలగు దేవతలను, మునులను, సిద్ధులను మరియు ఇతరులనందరినీ కూడా నామాటగా తప్పని సరిగా నీవు ఆహ్వానించుము (21). అందరు నా శాసనమునందలి ఆదరముతో ఉత్సాహవంతులై సర్వశోభలను కలిగియున్నవారై భార్యపుత్రులతో పరివారముతో గూడా ప్రీతితో వచ్చెదరు గాక! (22) ఓ మునీ! దేవతలు మొదలగు వారు ఎవరైతే ఈ వివాహమహోత్సవమునకు హాజరు కారో, వారిని నేను నా వారు అని భావించలేను (23).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#శివమహాపురాణము #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
https://pyramidbook.in/Chaitanyavijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. వివేక చూడామణి - 169 / Viveka Chudamani - 169 🌹*
*✍️ రచన : పేర్నేటి గంగాధర రావు*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍀. 32. నేను బ్రహ్మాన్ని తెలుసుకొన్నవాడిని -16 🍀*
*551. ఆత్మను తెలుసుకొన్న వ్యక్తి శరీర జ్ఞానమును కోల్పోయి, జ్ఞానేంద్రియ వస్తు సముదాయము వెంట తిరుగుచున్నప్పటికి, ప్రారబ్దము వలన తాను అనుభవించుచున్న అట్టి వస్తువుల వలన పొందే ఆనందములకు అతీతముగా అతడు తన శరీరమును కేవలము సాక్షి మాదిరిగా, మానసికమైన కదలికలు లేకుండా జీవిస్తుంటాడు. ఏవిధముగా అయితే కుమ్మరి తన చక్రమును ఇరుసు మీద త్రిప్పుచున్నాడో అలాగా.*
*552. యోగి తాను తన జ్ఞానేంద్రియాలను తత్ సంబంధమైన వస్తువులపై మరల్చ కుండా వాటికి అతీతముగా సంబంధము లేని ప్రేక్షకుని వలె గమనిస్తుంటాడు. అతనికి తన పనుల ఫలితముల మీద ఎట్టి దృష్టి ఉండదు. ఎందువలనంటే తన మనస్సు పూర్తిగా వాటిపై విముక్తి చెంది తాను అనుభవిస్తున్న జ్ఞానామృతములో నిమగ్నమై ఉంటుంది.*
*553. ఎవరైతే ఈ వస్తువు తనకు అవసరమా, అనవసరమా అని తలచకుండా, ధ్యానములోని వస్తు సముదాయమును గమనించుచున్నట్లు సాక్షిగా తానే బ్రహ్మముగా, శివునిగా, బ్రహ్మజ్ఞానులలో తానే ఉత్తమునిగా భావిస్తుంటాడు.*
* సశేషం....*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 VIVEKA CHUDAMANI - 169 🌹*
*✍️ Sri Adi Shankaracharya, Swami Madhavananda*
*📚 Prasad Bharadwaj*
*🌻 32. I am the one who knows Brahman -16 🌻*
*551. The man of realisation, bereft of the body-idea, moves amid sense-enjoyments like a man subject to transmigration, through desires engendered by the Prarabdha work. He himself, however, lives unmoved in the body, like a witness, free from mental oscillations, like the pivot of the potter’s wheel.*
*552. He neither directs the sense-organs to their objects nor detaches them from these, but stays like an unconcerned spectator. And he has not the least regard for the fruits of actions, his mind being thoroughly inebriated with drinking the undiluted elixir of the Bliss of the Atman.*
*553. He who, giving up all considerations of the fitness or otherwise of objects of meditation, lives as the Absolute Atman, is verily Shiva Himself, and he is the best among the knowers of Brahman.*
*Continues....*
🌹 🌹 🌹 🌹 🌹
#వివేకచూడామణి #VivekaChudamani #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌹. వివేకచూడామణి Viveka Chudamani 🌹
https://t.me/vivekchudamani
www.facebook.com/groups/vivekachudamani/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 VIVEKA CHUDAMANI - 169 🌹*
*✍️ Sri Adi Shankaracharya, Swami Madhavananda*
*📚 Prasad Bharadwaj*
*🌻 32. I am the one who knows Brahman -16 🌻*
*551. The man of realisation, bereft of the body-idea, moves amid sense-enjoyments like a man subject to transmigration, through desires engendered by the Prarabdha work. He himself, however, lives unmoved in the body, like a witness, free from mental oscillations, like the pivot of the potter’s wheel.*
*552. He neither directs the sense-organs to their objects nor detaches them from these, but stays like an unconcerned spectator. And he has not the least regard for the fruits of actions, his mind being thoroughly inebriated with drinking the undiluted elixir of the Bliss of the Atman.*
*553. He who, giving up all considerations of the fitness or otherwise of objects of meditation, lives as the Absolute Atman, is verily Shiva Himself, and he is the best among the knowers of Brahman.*
*Continues....*
🌹 🌹 🌹 🌹 🌹
#వివేకచూడామణి #VivekaChudamani #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌹. వివేకచూడామణి Viveka Chudamani 🌹
https://t.me/vivekchudamani
www.facebook.com/groups/vivekachudamani/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 121 🌹*
*✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు*
*సంకలనము : వేణుమాధవ్*
*📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🌻. లోకోద్ధరణము- లోక కల్యాణము - 6 🌻*
*లోక కల్యాణమునకై పనిచేయుట సత్యమునందు జీవించుట అనియు, లోకోద్ధరణమునకై పనిచేయుట భ్రాంతిలో జీవించుట అనియు గ్రహించితిమి. అయినచో లోక కల్యాణమునకై పనిచేయుట వలన నాకేమి లభించును? అను ప్రశ్న కలి ప్రేరితుడై, జీవితమును వ్యాపారముగా మార్చుకొన్న వాని యందు ఉదయించును.*
*లోక కల్యాణమునకై ప్రకృతి, అందలి ఆకాశము, గాలి, నీరు, సూర్యచంద్రులు, నేల పని చేయుచుండుట మనకు కనపడుతున్న సత్యము. వీరికే పై ప్రశ్న పుట్టినచో ఈ జగత్తు యొక్క గమనము లేదు, మానవుని మనుగడ లేదు. ప్రకృతిని అనుసరించుటయే మానవుని కర్తవ్యము. దీనినే యజ్ఞార్థ కర్మ అందురు. ఇదియే నరజాతికి భద్రత చేకూర్చు భవ్యపథము.*
.....✍️ *మాస్టర్ ఇ.కె.*🌻
🌹 🌹 🌹 🌹 🌹
#మాస్టర్‌ఇకెసందేశములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌷. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు 🌷
www.facebook.com/groups/masterek/
https://t.me/ChaitanyaVijnanam
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 Osho Daily Meditations - 110 🌹*
*📚. Prasad Bharadwaj*
*🍀 110. BRAHMACHARYA IS MUST FOR HIGHER PATH 🍀*
*🕉 People have forgotten completely that Brahmacharya is must for the merger with the Higher. That happens when you are simply living together in deep love, in deep reverence, in prayer. 🕉*
*When physical energy is not sexually involved, it rises to higher altitudes. It can reach to the very ultimate, to samadhi, awakening. But people have forgotten completely. They think that sex is the end. But sex is only the beginning. Whenever you love someone, make it a point to first lie together in deep love, and you will reach to subtler and deeper orgasms.*
*That's how, by and by, real celibacy arises. What we call in India brahmacbarya, real celibacy, is not against sex: It is higher than sex. Whatever sex can give, it gives, but it gives more also. So when you know how to use your energy on such a high level, who bothers about the lower spaces? Nobody! I'm not saying to drop sex. I am saying sometimes to allow yourself pure, loving spaces where sex is not a concern. Otherwise you are pulled back to earth, and you can never fly into the sky.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌹 ఓషో బోధనలు - Osho Teachings 🌹
https://t.me/ChaitanyaVijnanam
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://pyramidbook.in/Chaitanyavijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 169 / Sri Lalita Sahasranamavali - Meaning - 169 🌹*
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ
*🍀 169. సవ్యాపసవ్య మార్గస్థా, సర్వాపద్వి నివారిణీ ।*
*స్వస్థా, స్వభావమధురా, ధీరా, ధీర సమర్చితా ॥ 169 ॥ 🍀*
🍀 909. సవ్యాపసవ్యమార్గస్థా :
వామ, దక్షిణ మార్గములలో పూజింపబడునది
🍀 910. సర్వాపద్వినివారిణీ :
అన్ని ఆపదలను నివారించునది
🍀 911. స్వస్థా :
మార్పులేకుండా ఉండునది
🍀 912. స్వభావమధురా :
సహజమైన మధురస్వభావము కలది
🍀 913. ధీరా :
ధైర్యము కలది
🍀 914. ధీరసమర్చితా :
ధీరస్వభావము కలవారిచే ఆరాధింప బడునది
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 169 🌹*
📚. Prasad Bharadwaj
*🌻 169. Savyapasavyamargasdha sarva padvi nivarini*
*Svasdha svabhavamadhura dhira dhirasamarchita ॥ 169 ॥ 🌻*
🌻 909 ) Savyapa savya margastha - She who is birth, death and living or She who likes the priestly and tantric methods
🌻 910 ) Sarva apadvi nivarini - She who removes all dangers
🌻 911 ) Swastha - She who has everything within her or She who is peaceful
🌻 912 ) Swabhava madura - She who is by nature sweet
🌻 913 ) Dheera - She who is courageous
🌻 914 ) Dheera samarchida - She who is being worshipped by the courageous
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#లలితాసహస్రనామములు #LalithaSahasranam
#PrasadBhardwaj
🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/ https://mymandir.page.link/wdh7G
https://t.me/ChaitanyaVijnanam
www.facebook.com/groups/chaitanyavijnanam/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Subscribe to:
Posts (Atom)