20-DECEMBER-2021 సోమవారం MESSAGES

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam, 19, డిసెంబర్ 2021 సోమవారం, ఇందు వాసరే 🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 131 / Bhagavad-Gita - 131 3-12🌹*
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 528 / Vishnu Sahasranama Contemplation - 528 🌹
4) 🌹 DAILY WISDOM - 206🌹 
5) 🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 45 🌹
6) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 1112 🌹
7) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 331 / Sri Lalitha Chaitanya Vijnanam - 331 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శుభ సోమవారం మిత్రులందరికీ 🌹*
*ఇందు వాసరే, 20, డిసెంబర్‌ 2021*
*మీకు ఈ రోజు అంతా కాలం అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*

*🍀. రుద్ర నమక స్తోత్రం -3 🍀*

*తయాభిచాకశీహి త్వం తనువా మా ముమాపతే!*
*ఘోరయా తనువాచాపి రుద్రాద్యాపాపకాశినీ!!5!!*
*యా తయా మృడయ స్వామిన్ సదా శంతమయా ప్రభో!*
*గిరిశంత మహారుద్ర హస్తే యా మిషు మస్తవే!!6!!*

🌻 🌻 🌻 🌻 🌻

విక్రమ సంవత్సరం: 2078 ఆనంద
శఖ సంవత్సరం: 1943 ప్లవ,
దక్షిణాయణం, హేమంత ఋతువు,
మృగశిర మాసం
తిథి: కృష్ణ పాడ్యమి 12:37:50 వరకు 
తదుపరి కృష్ణ విదియ
నక్షత్రం: ఆర్ద్ర 19:46:25 వరకు 
తదుపరి పునర్వసు
యోగం: శుక్ల 10:58:54 వరకు 
తదుపరి బ్రహ్మ
కరణం: కౌలవ 12:35:50 వరకు
వర్జ్యం: 02:18:12 - 04:05:40
దుర్ముహూర్తం: 12:35:46 - 13:20:09 
మరియు 14:48:54 - 15:33:16
రాహు కాలం: 08:03:59 - 09:27:11
గుళిక కాలం: 13:36:47 - 14:59:59
యమ గండం: 10:50:23 - 12:13:35
అభిజిత్ ముహూర్తం: 11:51 - 12:35
అమృత కాలం: 08:34:20 - 10:21:48
సూర్యోదయం: 06:40:47
సూర్యాస్తమయం: 17:46:24
వైదిక సూర్యోదయం: 06:44:41
వైదిక సూర్యాస్తమయం: 17:42:29
చంద్రోదయం: 18:44:28
చంద్రాస్తమయం: 07:31:47
సూర్య సంచార రాశి: ధనుస్సు
చంద్ర సంచార రాశి: జెమిని
కాలదండ యోగం - మృత్యు భయం 
19:46:25 వరకు తదుపరి ధూమ్ర 
యోగం - కార్య భంగం, సొమ్ము నష్టం 
పండుగలు : ఆరుద్ర దర్శనం, 
Arudra Darshan
🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam 
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీమద్భగవద్గీత -131 / Bhagavad-Gita - 131 🌹*
*✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. తృతీయ అధ్యాయము - కర్మ యోగము - 12 🌴*

*12. ఇష్టాన్ భోగాన్ హి దేవా దాస్యన్తే యజ్ఞభావితా: |*
*తైర్దాత్తానప్రదాయైభ్యో యో భుజ్ఞ్కే స్తేన ఏవ స: ||*

🌷. తాత్పర్యం :
*వివిధ జీవనావశ్యకములను ఒనగూర్చు దేవతలు యజ్ఞముచే సంతృప్తి నొంది మీకు కావలసినవన్నియును ఒసంగుదురు. వాటిని ఆ దేవతలకు అర్పింపకయే తాను అనుభవించువాడు నిక్కముగా చోరుడే యగును.*

🌷. భాష్యము :
దేవదేవుడైన విష్ణువు తరపున జీవితావష్యకములైనవాటిని సమకూర్చుటకు అధీకృతులైనట్టివారే దేవతలు. కావున వారిని విధిపూర్వకమగు యజ్ఞముచే సంతృప్తిపరుపవలెను. వేదములందు పలుదేవతల కొరకు పలువిధములైన యజ్ఞములు తెలుపబడినను అవియన్నియును అంత్యమున దేవదేవునకే అర్పింపబడును. శ్రీకృష్ణభగవానుని గూర్చి తెలియనివానికే దేవతాయజ్ఞము ఆదేశించబడినది. 

మనుజుని వివిధ గుణములు ననుసరించి వివిధ యజ్ఞములు వేదము లందు ప్రతిపాదింప బడినవి. వివిధ దేవతార్చనములు కూడా అదే విధముగా గుణముల ననుసరించియే తెలుపబడినవి. ఉదాహరణమునకు మాంసభక్షకులకు ప్రకృతి యొక్క ఘోరరూపమైన కాళికాదేవి పూజా ఆదేశింపబడినది. ఆ దేవత యెదుట పశుబలియు తెలుపబడినది. 

కాని సత్వగుణములో నున్నవారికి మాత్రము విష్ణుభగవానుని దివ్యారచనము ఉద్దేశింపబడినది. క్రమముగా ఆధ్యాత్మికస్థితిని పొందుటకే ఈ యజ్ఞములన్నియును ఉన్నవి. పంచమాహా యజ్ఞములని తెలియబడు ఐదు యజ్ఞములు మాత్రము సాధారణజనులకు అత్యంత అవశ్యకములై యున్నవి.

అయినను మానవులకు అవసరమైనట్టి జీవనావశ్యకములన్నియు శ్రీకృష్ణభగవానుని ప్రతినిధులైన దేవతలచే సమకూర్చబడునని ప్రతియొక్కరు ఎరుగవలెను. ఎవ్వరును వాటిని సృష్టింపలేరు. జీవితావసరములైన ఉష్ణము, కాంతి, నీరు, వాయువు వంటివి కూడా మానవునిచే సృష్టింపబడలేదు. శ్రీకృష్ణభగవానుడు లేనిదే సూర్యకాంతి, చంద్రకాంతి, వర్షము, గాలి వంటివి కలుగవు. అవి లేనిదే ఎవ్వరును జీవింపలేరు. 

అనగా మన జీవితము ఆ భగవానుడు కరుణతో సమకూర్చువాని పైననే ఆధారపడియున్నది. అవియన్నియును దేవతలచే ఒసగబడుచున్నవి. లభించిన వానిని సద్వినియోగ పరచుకొని ఆనందముతో ఆరోగ్యవంతులై, అత్మానుభవమును గూర్చి చింతించు జీవితలక్ష్యమైన జీవనసంఘర్షణ నుండి ముక్తిని సాధింతురనెడి ఉద్దేశ్యము చేతనే వారట్లు మనకు సర్వమును ఒసగుచున్నారు. అట్టి జీవితలక్ష్యము యజ్ఞనిర్వాహణచే సిద్ధించుచున్నది. 

కాని మానవజన్మ లక్ష్యమును మరచి, భగవానుని ప్రతినిదులచే ఒసగబడినవాటిని కేవలము ఇంద్రియప్రీతి కొరకే వినియోగించి భౌతికత్వమునందే మరింతగా బద్ధులమైనచో (అది సృష్టిప్రయోజనమెన్నడును కాదు) మనము చోరులుగా పరిగణింపబడి ప్రకృతి నియమములచే శిక్షింపబడుడుము. 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 Bhagavad-Gita as It is - 119 🌹*
*✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada*
*📚 Prasad Bharadwaj*

*🌴 Chapter 3 - Karma Yoga - 12 🌴*

*12. iṣṭān bhogān hi vo devā dāsyante yajña-bhāvitāḥ 
*tair dattān apradāyaibhyo yo bhuṅkte stena eva saḥ*

🌷Translation :
*In charge of the various necessities of life, the demigods, being satisfied by the performance of yajña [sacrifice], will supply all necessities to you. But he who enjoys such gifts without offering them to the demigods in return is certainly a thief.*

🌷 Purport :
The demigods are authorized supplying agents on behalf of the Supreme Personality of Godhead, Viṣṇu. Therefore, they must be satisfied by the performance of prescribed yajñas. In the Vedas, there are different kinds of yajñas prescribed for different kinds of demigods, but all are ultimately offered to the Supreme Personality of Godhead. For one who cannot understand what the Personality of Godhead is, sacrifice to the demigods is recommended.

According to the different material qualities of the persons concerned, different types of yajñas are recommended in the Vedas. Worship of different demigods is also on the same basis – namely, according to different qualities. For example, the meat-eaters are recommended to worship the goddess Kālī, the ghastly form of material nature, and before the goddess the sacrifice of animals is recommended. But for those who are in the mode of goodness, the transcendental worship of Viṣṇu is recommended. 

But ultimately all yajñas are meant for gradual promotion to the transcendental position. For ordinary men, at least five yajñas, known as pañca-mahā-yajña, are necessary.
🌹 🌹 🌹 🌹 🌹
#భగవద్గీత #BhagavadGita #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 528 / Vishnu Sahasranama Contemplation - 528 🌹*
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻528. నన్దః, नन्दः, Nandaḥ (అనన్దః, अनन्दः, Anandaḥ)🌻*

*ఓం నన్దాయ నమః | ॐ नन्दाय नमः | OM Nandāya namaḥ*

*నన్దః, नन्दः, Nandaḥ (అనన్దః, अनन्दः, Anandaḥ)*

*మహావిష్ణుస్ససమృద్ధః సర్వాభిరుపపత్తిభిః ।*
*నన్ద ఇత్యుచ్యతే సద్భిర్వేదవిద్యావిశారదైః ॥*
*నన్దస్సుఖం వైషయికం నాస్త్యనన్ద ఇతీర్యతే ।*
*యో వై భూమా తత్సుఖమిత్యాదిశ్రుతిసమీరణాత్ ॥*

*'నన్దః' - అన్ని విధములగు సిద్ధులచే నిండియుండును. ఇచట 'నందనః' మరియూ 'అనందః' అను విభాగమునైన చేయవచ్చును. అపుడు, 'అనన్దః' అను నామమునకు - ఎవనికి శబ్దాది విషయములననుభవించుటచే కలుగు ఆనందము ఉండదో అట్టివాడు అను అర్థము చెప్పవచ్చును.*

:: ఛాన్దోగ్యోపనిషత్ - సప్తమః ప్రపాఠకః, త్రయోవింశః ఖణ్డః ::
యోవై భూమా తత్సుఖం నాల్పే సుఖ మస్తి భూమైవ సుఖం ।
భూమాత్వేన విజిజ్ఞాసితవ్య ఇతి భూమానం భగవో విజిజ్ఞాస ఇతి ॥ 1 ॥

*భూమా (అనగా గొప్పది, బ్రహ్మము, ఆత్మ) అనునదియే సుఖము. అల్పమైనదానియందు సుఖము ఉండదు. కావున భూమయే సుఖము. ఆ గొప్పదియగు ఆత్మనే తెలిసికొనవలయును... (పరమ మహత్పరిణమముతో నిండియుండు పరమాత్ముడు తానే సుఖస్వరూపుడు కావున ఆతనికి ఇతరములనుండి సుఖమును పొందవలసిన పనియే లేదు).*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 528🌹*
📚. Prasad Bharadwaj

*🌻528. Anandaḥ)🌻*

*OM Nandāya namaḥ*

महाविष्णुस्ससमृद्धः सर्वाभिरुपपत्तिभिः ।
नन्द इत्युच्यते सद्भिर्वेदविद्याविशारदैः ॥
नन्दस्सुखं वैषयिकं नास्त्यनन्द इतीर्यते ।
यो वै भूमा तत्सुखमित्यादिश्रुतिसमीरणात् ॥

Mahāviṣṇussasamr‌ddhaḥ sarvābhirupapattibhiḥ,
Nanda ityucyate sadbhirvedavidyāviśāradaiḥ.
Nandassukhaṃ vaiṣayikaṃ nāstyananda itīryate,
Yo vai bhūmā tatsukhamityādiśrutisamīraṇāt.

*Nandaḥ - Rich with all things to be attained. Or Anandaḥ - He who does not need to seek sensory and such pleasures from anything.*

:: छान्दोग्योपनिषत् - सप्तमः प्रपाठकः, त्रयोविंशः खण्डः ::
योवै भूमा तत्सुखं नाल्पे सुख मस्ति भूमैव सुखं ।
भूमात्वेन विजिज्ञासितव्य इति भूमानं भगवो विजिज्ञास इति ॥ १ ॥

Chāndogyopaniṣat - Chapter 7, Section 23
Yovai bhūmā tatsukhaṃ nālpe sukha masti bhūmaiva sukhaṃ,
Bhūmātvena vijijñāsitavya iti bhūmānaṃ bhagavo vijijñāsa iti. 1.

*The infinite is bliss. There is no bliss in anything finite. One must desire to understand that which is infinite... (Since He himself is bliss, there is nothing else from which He can seek pleasure).*

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
अजो महार्हस्स्वाभाव्यो जितामित्रः प्रमोदनः ।आनन्दो नन्दनोऽनन्दस्सत्यधर्मा त्रिविक्रमः ॥ ५६ ॥

అజో మహార్హస్స్వాభావ్యో జితామిత్రః ప్రమోదనః ।ఆనన్దో నన్దనోఽనన్దస్సత్యధర్మా త్రివిక్రమః ॥ 56 ॥

Ajo mahārhassvābhāvyo jitāmitraḥ pramodanaḥ,Ānando nandano’nandassatyadharmā trivikramaḥ ॥ 56 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹
#విష్ణుసహస్రనామతత్వవిచారణ #VishnuSahasranamacontemplation #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://t.me/vishnusahasranaam
www.facebook.com/groups/vishnusahasranaam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 DAILY WISDOM - 206 🌹*
*🍀 📖 The Spiritual Import of the Mahabharata and the Bhagavadgita 🍀*
*📝 Swami Krishnananda*
*📚. Prasad Bharadwaj*

*🌻 24. The Absolute is All-pervading 🌻*

*The Absolute Almighty pervades every nook and corner of the universe. Every nook and cranny is permeated by the presence of the Supreme Being. The consciousness of the presence of the Almighty inseparably in every little thing in the whole of creation is the ultimate constitutional dharma. It is the central constitution of the cosmos, and all local and provincial laws follow from it.*

*Political laws, social laws, family laws, personal laws, physical laws, psychological laws, and what not—all these are expressions according to the requirement of the particular state of affairs of that eternal deciding factor which is the presence of one common Being everywhere, equally, unanimously, perpetually in everything. The presence of God is defined here as an invisible presence, an unmanifested existence—avyakta-murtina. It is not a gross, visible, sensory presence.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#DailyWisdom #SwamiKrishnananda
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. Daily satsang Wisdom 🌹 
www.facebook.com/groups/dailysatsangwisdom/
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 45 🌹* 
*✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్*
* సేకరణ : ప్రసాద్ భరద్వాజ*

*🌻 33. నిరాదరణ 🌻*

*సమస్త సృష్టియు పరంపరాగతముగ లోకములను, లోకేశులను, లోకస్థులను ఏర్పరచుకొని యున్నది. సృష్టికి మూలసూత్రమే పరంపర. నారాయణుని నుండి చతుర్ముఖుడు, చతుర్ముఖుని నుండి సమస్త లోకములు ఉద్భవించుట తెలిసిన విషయమే. సృష్టి యందు ఊర్ధ్వలోకములు, అధోలోకములకు ఆధారము. క్రింది లోకముల వారు పైలోకముల వారిని గౌరవించుట, పూజించుట, మన్నించుట సృష్టి యందు సహజ ధర్మము. సమస్త సృష్టి ధర్మములు అవ్యక్తము నుండి సూక్ష్మ లోకములలోనికి, అచటి నుండి స్థూల లోకములలోనికి అవ తరణము చెందు చున్నవి. సృష్టి యందు ఊర్ధ్వలోకముల వారు అధో లోకముల వారిని ఆదరించుట వలననూ, అధోలోకముల వారు ఊర్ధ్వలోకముల వారిని మన్నించుట వలననూ సృష్టికార్యము నిరాటంకముగ సాగుచుండును.*

*ఈ పరంపరాగత ధర్మములు మానవులకు కూడా లభించినవి. తల్లిదండ్రులను, గురువులను, పెద్దలను పిన్నలు గౌరవించుట, పిన్నలను పెద్దలు ఆదరించుట ఈ ధర్మస్వరూపమే. ఏ సంఘముననై ననూ యీ సూత్రము చెడినచో, ఆ సంఘము పతనము చెందుట ఖాయము. పతనము చెందిన మానవ సంఘములకు ప్రేమతో, ఆదరముతో, మరల యీ ధర్మ సూత్రములను బోధించుట, అందించుట- తత్ఫలితముగ మానవ జాతికి తోడ్పడుట మా గురుపరంపర యొక్క కార్యక్రమము. గురువులను నిరాకరించిన సాంప్రదాయమున సృజనాత్మక శక్తి నశించగలదు. సృజనాత్మక శక్తి నశించిన జాతికి పురోగతి లేదు.*

*సశేషం.....*
🌹 🌹 🌹 🌹 🌹
#మైత్రేయమహర్షిబోధనలు #MaitreyaMaharshi #సద్గురుపార్వతీకుమార్ #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
భారతీయ మహర్షుల బోధనలు Maharshula Wisdom 
www.facebook.com/groups/maharshiwisdom/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 112 🌹*
*✍️. సౌభాగ్య*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🍀. సాధారణంగా వ్యక్తి ఉనికిని చుట్టుముట్టిన సౌందర్యం పట్ల స్పృహతో వుండడు. కేవలం వికారం పట్ల స్పృహతో వుంటాడు. కారణం మనసెపుడూ మరిచిపోతుంది. గాయాల్ని లెక్క పెడుతుంది. దీవెనల్ని విస్మరిస్తుంది. మనసు మార్గం అలాంటిది. 🍀*

*ధ్యానం నీ కోసం రెండు పనులు చేస్తుంది. నీ చుట్టూ వున్న సౌందర్యం పట్ల నీకు స్పృహ కలిగిస్తుంది. దాని పట్ల నువ్వు సున్నితంగా స్పందించేట్లు చేస్తుంది. రెండోది నిన్ను సౌందర్యభరితం చేస్తుంది. నీలో ఒక దయాతరంగాన్ని లేపుతుంది. నీ కళ్ళు ఎంతగా దయతో నిండి వుంటాయంటే సమస్త అస్తిత్వం సౌందర్యంతో నిండిపోతుంది. మనం సౌందర్యం నిండిన అస్తిత్వం నించీ దోసిళ్ళతో దాన్ని తాగాలి. మనలోకి ఆ సౌందర్యం ప్రవేశించడానికి మనం అనుమతించాలి. సాధారణంగా వ్యక్తి ఉనికిని చుట్టుముట్టిన సౌందర్యం పట్ల స్పృహతో వుండడు. కేవలం వికారం పట్ల స్పృహతో వుంటాడు. కారణం మనసెపుడూ మరిచిపోతుంది. గాయాల్ని లెక్కపెడుతుంది. దీవెనల్ని విస్మరిస్తుంది. మనసు మార్గం అలాంటిది.*

*నువ్వు ధ్యానంలోకి అడుగుపెట్టిన క్షణం, నువ్వు నిశ్శబ్దంలోకి అడుగుపెట్టిన క్షణం మరింత విశ్రాంతి పొందుతావు. మరింతగా నీ అస్తిత్వంలో స్థిరపడతావు. అప్పుడు నువ్వు హఠాత్తుగా వృక్షాల సౌందర్యం పట్ల, మేఘాల అందం పట్ల, మనుషుల సౌందర్యం పట్ల స్పృహతో వుంటావు. ప్రతిదీ సౌందర్యభరితమే. కారణం ప్రతిదీ దైవత్వంతో నిండివుంది. బండలు కూడా దైవత్వాన్ని నింపుకొని వున్నాయి. దైవత్వం లేనిదేదీ లేదు. ఒకసారి నువ్వు ఈ సౌంధర్య కోణాల్ని అనుభూతి చెందడం ఆరంభిస్తే నువ్వు సంగీతంతో, కవిత్వంతో, నాట్యంతో, ఉత్సవంతో ప్రేమతో నిండిపోతావు. నువ్వు అందంతో నిండిపోతావు. ధగధగలాడతావు. అది నీలో ప్రతి ఒక్కరికీ కనబడుతుంది. ఒకరు ఆ సౌందర్యాన్ని నీలో చూడాలనుకుంటే అది కనిపిస్తుంది. కానీ జనం కళ్ళు మూసుకుని వుంటారు. అందువల్ల చూడలేరు.*

*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹 ఓషో బోధనలు - Osho Teachings 🌹
https://t.me/ChaitanyaVijnanam 
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 331 / Sri Lalitha Chaitanya Vijnanam - 331 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*మూల మంత్రము :*
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀 74. కళావతీ, కళాలాపా, కాంతా, కాదంబరీప్రియా ।*
*వరదా, వామనయనా, వారుణీమదవిహ్వలా ॥ 74 ॥ 🍀*

*🌻 331. 'వరదా' 🌻* 

*వరముల నొసగునది శ్రీమాత అని అర్థము. సృష్టి సమస్తమును పరిపాలించునది శ్రీమాతయే కదా! బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు కూడ ఆమె వరముల నిచ్చుచున్నది. విపత్కర పరిస్థితులలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సైతము ఆమెను ప్రార్ధించి వరములు పొందిరి. నారద మహర్షి శ్రీమాత ఎట్టి వరప్రదాతయో అద్భుతముగ తెలిపినాడు. శ్రీమాత హస్తము ఎప్పుడునూ వరద ముద్రలోనే వుండునని, అది ఆమె సహజమగు ముద్రయని కీర్తించినాడు.*

*రాక్షసులైననూ, దేవతలైననూ శ్రీమాతకు సమానమే. భక్తితో కోరిన వారికి వరదానము చేయుటయే అమ్మవంతు. వరములు కోరు జీవులందరి కోరికలను తీర్చు వాత్సల్యమూర్తి ఆమె. తొమ్మిది రోజులు శ్రీమాతను భక్తి శ్రద్ధలతో పూజించిన వారికి శ్రీమాత వరము నొసగునని వరాహ పురాణము పేర్కొనుచున్నది. శ్రీమాత నుద్దేశించి తొమ్మిది దినములు సమాధిలో నుండు సిద్ధులకు శాశ్వతముగ తన సాన్నిధ్యము నిచ్చునని పురాణములు తెలుపుచున్నవి.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 331 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️. Ravi Sarma *
*📚. Prasad Bharadwaj*

*🌻 74. Kalavati kalalapa kanta kadanbari priya*
*Varada vamanayana varunimadavihvala ॥ 74 ॥ 🌻*

*🌻 331. Varadā वरदा (331) 🌻*

*The one who grants boons. In Viṣṇu Sahasranāma nāma 330 is also Varadā. Granting boons is the general quality of all Gods and Goddesses. In certain forms of Gods and Goddesses the right palm is used as a gesture of granting boons. There is a special significance for this nāma. She does not grant boons through Her palms. Her sacred feet give boons. She is kāmadāyinī (nāma 63). Otherwise nāma 83 will not have any meaning. The significance of this nāma is further strengthened by nāma 117.*

*Saundarya Laharī (verse 4) perfectly describes this nāma. It says, “You are the refuge of all the worlds! All gods except you vouchsafe protection to devotees and grant their desires by gestures of their hands. You alone do not show varada and abhaya gestures. It is so because Your feet are by themselves powerful to protect those in the grip of fear and grant more that what is desired for by devotees.” Such niceties describe the ease with which She grants boons. It is also said that She is to be worshipped by concentration (through meditation) on ninth lunar day (navami) when She becomes the giver of boons to all the worlds.* 

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#శ్రీలలితాసహస్రనామచైతన్యవిజ్ఞానము #SriLalithaChaitanyaVijnanam #లలితాసహస్రనామములు #LalithaSahasranama
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

No comments:

Post a Comment