శ్రీ కృష్ణ బోధనలు - 3 Teachings of Sri Krishna - 3
🌹. శ్రీ కృష్ణ బోధనలు - 3 🌹
📚. ప్రసాద్ భరధ్వాజ.
భవిష్యత్తుకు ఇంకొక పేరే సంఘర్షణ. అది అసంపూర్ణంగా మిగిలి పోతే ఆ హృదయం భవిష్యత్ ప్రణాళికలు వేస్తుంది. భవిష్యత్తులో తన కోరిక నెరవేరుతుందని అనుకొని కలలు కంటూ వుంటుంది. కానీ జీవితం రానున్న భవిష్యత్తులోనూ లేదు, గతంలోనూ లేదు. జీవితమన్నది ఈ క్షణంలోనే వుంటుంది.
అనగా ఈ క్షణంలో అనుభవించేదే జీవితానుభవం. మనకి ఈ సంగతి తెలసినప్పటికి, ఈ చిన్న సూత్రాన్ని కూడా అర్థం చేసుకోలేము. గత స్మృతుల వలయంలో చిక్కుకొని కొట్టుమిట్టాడుతూ ఉంటాము, లేదా రానున్న భవిష్యత్తు కోసం ప్రణాళికలు వేసుకుంటూ వుంటాముై, కానీ జీవితం....... జీవితం గడిచిపోతుంది.
ఈ సత్యం మన మనస్సులో నాటుకు పోవాలి. భవిష్యత్తును చూడనూ లేము, రానున్న భవిష్యత్తును నిర్మించనూ లేము. మనం కేవలం ధైర్య సాహసాలతో భవిష్యత్తును ఆలింగనం చేసుకోగలం. స్వాగతం పలుకగలం ఆ భవిష్యత్తుకు. అలా చేస్తే జీవితంలోని ప్రతి క్షణం చైతన్యంతో నిండిపోదా ? మీరే ఆలోచించండి.....
🌹 🌹 🌹 🌹 🌹
20 Dec 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment