శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 331 / Sri Lalitha Chaitanya Vijnanam - 331


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 331 / Sri Lalitha Chaitanya Vijnanam - 331 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 74. కళావతీ, కళాలాపా, కాంతా, కాదంబరీప్రియా ।
వరదా, వామనయనా, వారుణీమదవిహ్వలా ॥ 74 ॥ 🍀

🌻 331. 'వరదా' 🌻

వరముల నొసగునది శ్రీమాత అని అర్థము. సృష్టి సమస్తమును పరిపాలించునది శ్రీమాతయే కదా! బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు కూడ ఆమె వరముల నిచ్చుచున్నది. విపత్కర పరిస్థితులలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సైతము ఆమెను ప్రార్ధించి వరములు పొందిరి. నారద మహర్షి శ్రీమాత ఎట్టి వరప్రదాతయో అద్భుతముగ తెలిపినాడు. శ్రీమాత హస్తము ఎప్పుడునూ వరద ముద్రలోనే వుండునని, అది ఆమె సహజమగు ముద్రయని కీర్తించినాడు.

రాక్షసులైననూ, దేవతలైననూ శ్రీమాతకు సమానమే. భక్తితో కోరిన వారికి వరదానము చేయుటయే అమ్మవంతు. వరములు కోరు జీవులందరి కోరికలను తీర్చు వాత్సల్యమూర్తి ఆమె. తొమ్మిది రోజులు శ్రీమాతను భక్తి శ్రద్ధలతో పూజించిన వారికి శ్రీమాత వరము నొసగునని వరాహ పురాణము పేర్కొనుచున్నది. శ్రీమాత నుద్దేశించి తొమ్మిది దినములు సమాధిలో నుండు సిద్ధులకు శాశ్వతముగ తన సాన్నిధ్యము నిచ్చునని పురాణములు తెలుపుచున్నవి.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 331 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj

🌻 74. Kalavati kalalapa kanta kadanbari priya
Varada vamanayana varunimadavihvala ॥ 74 ॥ 🌻

🌻 331. Varadā वरदा (331) 🌻

The one who grants boons. In Viṣṇu Sahasranāma nāma 330 is also Varadā. Granting boons is the general quality of all Gods and Goddesses. In certain forms of Gods and Goddesses the right palm is used as a gesture of granting boons. There is a special significance for this nāma. She does not grant boons through Her palms. Her sacred feet give boons. She is kāmadāyinī (nāma 63). Otherwise nāma 83 will not have any meaning. The significance of this nāma is further strengthened by nāma 117.

Saundarya Laharī (verse 4) perfectly describes this nāma. It says, “You are the refuge of all the worlds! All gods except you vouchsafe protection to devotees and grant their desires by gestures of their hands. You alone do not show varada and abhaya gestures. It is so because Your feet are by themselves powerful to protect those in the grip of fear and grant more that what is desired for by devotees.” Such niceties describe the ease with which She grants boons. It is also said that She is to be worshipped by concentration (through meditation) on ninth lunar day (navami) when She becomes the giver of boons to all the worlds.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


20 Dec 2021

No comments:

Post a Comment