గీతోపనిషత్తు - 66

🌹. గీతోపనిషత్తు - 66 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍀 4. పరిణామము -మృత్యువును దాటుటకు అనంతుడైన ఆదిశేషువు యోగవిద్య నందించెను. భగవంతుని ఆదేశము కూడ అందరును యోగులు కావలెననియె. కలియుగమున అజ్ఞానవశమై ఇతర మతము లేర్పడి, జీవునకు పునర్జన్మలు లేవని, ఒకే జన్మమని ప్రచారమున్నది. ఇది అజ్ఞానము. 🍀

📚. 4. జ్ఞానయోగము - 4 📚

బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున |
తా న్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప || 5

సృష్టియందు జీవులకు పునర్జన్మ లుండునని, కొందరు వాటి నెరుగుదురని, కొందరెరుగరని ఒక సత్యమును భగవానుడు ప్రతిపాదించినాడు. తనకును, అర్జునునకు అనేక జన్మలు గడచినవని, తానన్నిటిని ఎరుగుదునని, అర్జునుడెరుగడని తెలుపుటలో పై సత్య మున్నది. జన్మలు గడచుచున్నను తానెవరో తెలిసియున్నవారు యోగులు, ఋషులు, సిద్ధులు.

తెలియని వారు అజ్ఞానులు. అజ్ఞానులు మృత్యువుతో సమస్తమును మరతురు. యోగులు మృత్యువును దాటుట తెలిసినవారు. కనుక వారికన్ని జన్మలును జ్ఞప్తి యందుండును. వీరినే చిరంజీవులని కూడ అందురు.

మృత్యువును దాటుటకు అనంతుడైన ఆదిశేషువు యోగవిద్య నందించెను. భగవంతుని ఆదేశము కూడ అందరును యోగులు కావలెననియె. కలియుగమున అజ్ఞానవశమై ఇతర మతము లేర్పడి, జీవునకు పునర్జన్మలు లేవని, ఒకే జన్మమని ప్రచారమున్నది. ఇది అజ్ఞానము.

జీవుని స్వభావములో దైవీ ప్రకృతి ఏర్పడుటకు పరిణామ మార్గమొకటి కలదు. ఈ పరిణామ మార్గమున జీవులు పాశవిక ప్రవృత్తి నుండి మానవతా ప్రవృత్తిలోనికి పెరుగుదురు. అటు పైన దైవీ ప్రవృత్తిలోనికి పెరుగు సందర్భమున యోగవిద్యా ప్రవేశము కలుగును. యోగ విద్యయందు పరిపూర్ణత చెంది జీవుడు మృత్యువును దాటి అమరుడై భూమి మీద యుండును.

అట్టి జీవుని భూసురులందురు. అట్టివారు బ్రహ్మోపాసన చేయుచు బ్రహ్మమును పొందుదురు. అనగా బ్రహ్మమే వారి రూపమున వుండును. వీరినే బ్రహ్మర్షులందురు. వీరు జీవులకు తరణోపాయము చూపించుచు సద్గురు పరంపరగ నేర్పడి యున్నారు.

వశిష్ఠ అగస్త్యులట్టి వారు. శ్రీకృష్ణుడు అట్టి యోగీశ్వరుల గమ్యము. అతనికి సృష్ట్యాది నుండి జరుగుచున్న జీవుల కథ తెలిసియున్నది. అతడికి అర్జునుని యొక్క పూర్వజన్మలు తెలియుటలో ఆశ్చర్యము లేదు. సద్గురువులకు కూడ జీవుల పూర్వజన్మల అవగాహన యుండును. వాని ననుసరించియే వారు జీవులకు హితము కలిగించు చుందురు. ఇది యొక సత్యము.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

03 Nov 2020

శ్రీ శివ మహా పురాణము - 263

🌹 . శ్రీ శివ మహా పురాణము - 263 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴

62. అధ్యాయము - 17

🌻.సతీ వరప్రాప్తి - 2 🌻

చిక్కని కాటుక కాంతి గల సతి స్ఫటికమువలె ప్రకాశించు దేహముగల శివుని సమీపములో చంద్రుని ప్రక్కన మేఘపంక్తి వలె భాసిల్లెను(20).అపుడా దాక్షాయణీ మిక్కిలి ప్రసన్నురాలై భక్త వత్సలుడగు శివునకు చేతులు జోడించి అనేక నమస్కారములను చేసి, ఆయనతో నిట్లనెను (21).

సతి ఇట్లు పలికెను -

దేవదేవా! మహాదేవ! ప్రభూ! జగత్పాలకా! నా తండ్రికి తెలుపుడు జేసి నన్ను యథావిధిగా వివాహమాడి స్వీకరించుము (22).

బ్రహ్మ ఇట్లు పలికెను -

భక్త వత్సలుడగు మహేశ్వరుడు సతీ దేవి యొక్క ఈ మాటను విని, ఆమెను ప్రేమతో చూచి 'అటులనే అగుగాక!'అని పలికెను (23). దాక్షాయణి కూడా శంభునకు నమస్కరించి భక్తితో విన్నవించి ఆజ్ఞను పొంది ప్రేమతో ఆనందముతో నిండిన మనస్సుగలదై తల్లి వద్దకు వెళ్లెను (24).

శివుడు కూడా హిమవత్పర్వత మైదానములోని తన ఆశ్రమములో ప్రవేశించి, దాక్షాయణి వియోగముచే అతి కష్టముతో ధ్యానమును చేయ మొదలిడెను (25). వృషభధ్వజుడగు శంభుడు మనస్సును నియంత్రించుకొనెను. ఓ దేవర్షీ! ఆయన లౌకిక ప్రవృత్తి నాశ్రయించి, మనస్సులో నన్ను తలంచెను (26).

త్రిశూలి, మహేశ్వరుడు నగు హరుడు నన్ను స్మరించగా ఆయన యొక్క సిద్ధిచే ప్రేరితుడనై నేను ఆయన ముందు వెంటనే నిలబడితిని (27). వత్సా! శివుడు సతీవియోగముతో హిమవత్పర్వతముయొక్క మైదానములో ఉండెను. నేను సరస్వతితో గూడి అచటకు చేరుకుంటిని (28). ఓ దేవర్షీ! సతీదేవి యందు దృఢమైన ప్రేమగల ఆ శంభు ప్రభుడు ఉత్కంఠతో గూడి యుండెను సరస్వతితో గూడి వచ్చిన నన్ను చూచి ఆయన ఇట్లు పలికెను (29).

శంభుడు ఇట్లు పలికెను -

హే బ్రహ్మన్‌! నేను వివాహము చేసుకొనగోరి స్వార్ధ పరుడనైనాను. ఇప్పుడు నాకు స్వార్థచించనయే నా స్వభావమన్నట్లు తోచుచున్నది (30). దక్షుని కుమార్తె యగు సతి నన్ను భక్తితో ఆరాధించెను. ఆమె చేసిన నందా వ్రతము యొక్క ప్రభావముచే ఆమెకు నేను వరమునిచ్చితిని (31).

హే బ్రహ్మన్‌! 'నాకు భర్తవు కమ్ము' అని ఆమె వరమును నానుండి కోరెను. నేను ఎంతయూ సంతసించి యుంటిని. 'నా భర్యవు కమ్ము' అని అంటిని (32). అపుడు దక్షపుత్రియగు ఆ సతీ దేవి నాతో నిట్లనెను. హే జగత్ర్పభో! నా తండ్రికి నివేదించి నన్ను స్వీకరించుము (33).

హే బ్రహ్మన్‌! ఆమె భక్తిచే సంతసిల్లిన నేను దానికి కూడా అంగీకరించితిని. ఓ బ్రహ్మా! ఆమె తన భవనమునకు తల్లి వద్దకు వెళ్లెను. నేనిచటకు వచ్చితిని (34). కావున నీవు నా ఆజ్ఞచే దక్షుని గృహమునకు వెళ్లుము. దక్షుడు నాకు ఆ కన్యను వివాహములో శీఘ్రముగా ఇచ్చు తీరున దక్షునకు నచ్చ జెప్పుము (35). నాకు ఈ సతీవియోగము నుండి విముక్తి కలుగు ఉపాయము ననుష్ఠింపుము. నీవు అన్ని విద్యల యందు దిట్టవు. ఆ దక్షని ఒప్పించుము (36).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

03 Nov 2020

భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 151

🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 151 🌹

🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. నారద మహర్షి - 25
🌻

ఆ తరువాత ధర్మరాజు స్వర్గానికి వెళ్ళినప్పుడు, ఆయనకు మిత్రులకంటే శత్రువులే ముందర కనబడ్డారు. అప్పుడు నారదుని స్మరించగానే, ఆయ్న ప్రత్యక్షమై, “ఓ ధర్మరాజా! నువ్వు ఒక చిన్న విషయం తెలుసుకోవాలి. ఇక్కడ వారు నీకు శత్రువులుకారు. ఇక్కడ దుఃఖపడ్డావంటే అది నీ అజ్ఞానమే. ఇది ఇంకా నీలో ఉండటంచేతనే వీళ్ళు నీకిలా కనబడుతున్నారు.

భూలోకంలో ఉన్న శత్రుభావం ఆ శరీరాలు పోగానే పోతుంది. ఆ శరీరాలకు, ఆ అహంకారాలు మాత్రమే శత్రువులుకాని, జీవాత్మకు శతృత్వం ఉండదు. అది అక్కడతోతే నశిస్తుంది” అన్నాడు.

రామాయణంలోకూడా రాముడు ఈ మాటను లక్షమణుడికి చెప్పాడు. రావణుడు మృతుడైన తరువాత, రాముడు లక్ష్మణుడితో, “లక్ష్మణా! ఆయన శరీరాన్ని సగౌరవంగా లంకకు పంపించే ఏర్పాట్లు చెయ్యి. ఆయన గొప్ప పండితుడు, బరాహ్మణుడు. వేదవేదాగములు చదువుకున్నవాడు. మహాతపస్వి. సాక్షాత్తు ఈశ్వరుణ్ణి మెప్పించి ప్రసన్నుణ్ణీచేసుకుని దర్శనం చేసుకున్న మహా వరప్రసాది. ఆయాన్ సామాన్యుడు కాడు. మనకంటే అనేక విధాల పూజ్యుడు” అన్నాడు.

అప్పుడు లక్ష్మణుడు ఆయనతో, “శ్రీరామచంద్ర ప్రభూ! ఆయన శరీరాన్ని సగౌరవంగా లంకకౌ పంపించమన్నావు! ఆయన మనకు శత్రువు. మనను అవమానించి బాధించాడు కదా! అటువంటివాడిని నేను ఎలా సగౌరవంగా పంపుతాను?” అన్నాడు.

అందుకు రాముడు, “శత్రుత్వాలు మృత్యువు తోటే పోతాయి. శత్రుత్వం ఇద్దరిమధ్యన ఉన్నప్పుడు, ఇద్దరూ మృతి చెందితేనే శతృత్వంపోతుందని అనుకోరాదు. వాళ్ళలో ఒక్కళ్ళు చనిపోయినా శతృత్వం పోయినట్లే! ఆ ఇద్దరిలో బ్రతికిఉన్నవాడి మనస్సులో పోయిన వాడి యడల శతృత్వం ఉండకూడదు.

శతృవు నశించిన తరువాత, శతృత్వం నీ ఒక్కడి హృదయంలోనే ఉండటంచేత అది నీకే నరకహేతువు అవుతుంది. ద్వేషించతగిన వస్తువు నశించింది. ద్వేషం ఆ తరువాతకూడా ఇంకా అతడిలో ఉంటే, అది నరకహేతువు.

కాబట్టి ఆ దృష్టితో చూస్తే రావణడు మనకు శత్రువు కానేరడు. ఆయన ఈ దేహాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. కాబట్టి శత్రువేలేడు మనకు. ప్రస్తుతం, పూజ్యుడైన బ్రాహ్మణ రూపంలో సగౌరవంగా జాగ్రత్తగా ఆయనను పంపించు” అన్నాడు.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

03 Nov 2020

శివగీత - 105 / The Siva-Gita - 105

🌹. శివగీత - 105 / The Siva-Gita - 105 🌹

🌴. పరమేశ్వరుడు - శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. 🌴

📚. ప్రసాద్ భరద్వాజ

అధ్యాయము 14

🌻. పంచ కోశో పాసన - 1 🌻

శ్రీరామ ఉవాచ :-

భగవన్ ! యదితే రూపం - సచ్చిదానంద విగ్రహమ్,

నిష్కలం నిష్క్రియం శాంతం -నిరవధ్యం నిరంజనమ్. 1

సర్వ ధర్మ విహీనం చ - మనో వాచామగో చర మ్,

సర్వ్యాపిన మాత్మాన - మీక్షతే సర్వత స్థ్సితమ్ 2

ఆత్మ విద్యాత పోమూలం - తద్బ్ర హ్మో పనిషత్పరమ్,

అమూర్తం సర్వ భూతాత్మా - కారం కారణ కారణమ్ 3

యత్త దదేశ్య(?) మగ్రాహ్యం - తద్గ్రాహ్యం వా కధం భవేత్,

అత్రో పాయ మజా వాన - స్తేన భిన్నోస్మి శంకర ! 4

శృణు రామ ! ప్రవక్ష్యామి - తత్రో పాయం మహా భుజ !,

సగుణో పాస నాభిస్తు - చిత్తై కాగ్ర్యం విధాయచ. 5

శ్రీరాముడు ప్రశ్నించు చున్నాడు: ఓ భగవంతుడా! జ్ఞానానంద మాయమై ఆశములు లేక క్రియలు లేక దోషములు లేక శాంతమై సామాన్య ధర్మ హీనమై వాచామ గోచరమై సర్వ

వయాపియై యుండి ఆత్మ విద్యాత పంబులకు మొదల్కొని బ్రహ్మోపనిషత్తుల కంటెను పరంబైన అమూర్తమైన సమస్త భూత స్వరూపంబయ్యు నిట్టిదని నిరూపించుటకును, గ్రహించు టకును, వీలు లేని దైన యెడల దానిని తెల్సి కొనుట కెట్లు సాధ్య పడును? ఉపాయమేమిటో తెలియక ఖిన్నుడ నైతిని ( ఉపాయము చెప్పుము).

శ్రీ భాగావాను ఉవాచ! ( శివుడు ఆదేశించు చున్నాడు) రామా ! ఉపాయమును వివరించెదను వినుము. సగుణో పాసనము చేతనే మొట్ట మొదట చిత్తై కాగ్రతను నేర్చి స్తూలారుంధతీ న్యాయమున పిదప వాని యందు చిత్తమును ప్రవర్తింప చేయవలెను.

(స్తూలారుందతి న్యాయమనగా ప్రక్కనున్న నేదో ఒక గొప్ప నక్షత్రమును మొదట చూపి పిదప క్రమముగా నిజమైన సూక్ష్మముగా నున్న అరుంధతీ నక్షత్రమును చూపుత ) అట్లుగానే నిర్గుణ పరబ్రహ్మను తెలిసి కొనుటకు ముందు సగుణో పాసనము చేత చిత్తై కాగ్రత మాని నిర్గుణుడను, పూర్వోక్త లక్షణ లక్షితుండనగు నన్ను తెల్సి కొనవలయును.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🌹 The Siva-Gita - 105 🌹

🌴. Dialogue between Rama and Lord Siva 🌴

✍️ Ayala somayajula.
📚. Prasad Bharadwaj

Chapter 14
🌻 Panchakoshopasana - 1
🌻

Sri Rama said: O Bhagawan! How is it possible to realize the Atman (self) which is pure knowledge & bliss, which is partless, which is blemishless, which is serene, which is beyond all dharmas, which is beyond all senses, which is all pervading, which is even beyond the limits of upanishads, and which is formless? Sri Bhagawan said: Rama! Listen to the methods of realizing such Atman.

By doing Sagunopasana (worship of god in form), one should learn concentration. Then as like as Sthoolarundhati viewing rule, one should establish himself in the inward concentration and realize the Nirguna Brahman who is myself only having the qualities stated by you earlier.

N.B:­ Sthoolarundhati viewing means, in Hindu marriages, the couple has to see the Arundhati star in the sky. But that star remains so small that at a glance it doesn't become visible.

So, the priest first shows the couple a brightly visible star calling it as Arundhati and later tells them the original Arundhati star's location. So, this way one has to focus on God with a form, and gain the necessary concentration, purification of mind etc.

qualities and then only one can become inwardly focussed and realize the Brahman which is the Atman itself.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

03 Nov 2020

భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 90

🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 90 🌹

✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. భగవంతుని 7వ పాత్ర - సాధు పురుషులు, మహాపురుషులు, సత్పురుషులు, ముముక్షువులు - 12
🌻

384. ముడు-నాలుగు భూమికల మధ్య :

ఆధ్యాత్మిక యానములో మూడు నాలుగు భూమికల మధ్యనున్న స్థితి మహా ప్రమాదకరమైనది.అది సాధకులను మంత్రముగ్దులను గావించు ఆకర్షణలతో నిండియుండును. దీనిని ముకామ్-ఏ-హైరత్ అందురు.

చాలామంది ఈ ప్రమాద పరిస్థితినుండి దాటి ముందుకు నాల్గవ భూమికకు పోవుదురు.

సాధకుడు ఇచ్చట ఒకసారి ఆగినచో, అతడు ఆ స్థితినుండి బయటపడుట దుస్సాధ్యము. ఇతడు ఈ స్థితి నుండి తప్పించుకొని బయటపడి ముందుకు వెళ్లని యడల అతని ప్రగతి అంతటితో నిలిచిపోవును. కొన్ని సమయములందు, రోజుల తరబడి లేక, నెలల తరబడి లేక, సంవత్సరముల తరబడికూడా అతడు అట్లే నిలిచిపోగలడు.

ఈ స్థితియందు చిక్కుకున్న సాధకుడు ముందుకు పోలేడు, వెనుకకు రాలేడు. అతడు భౌతికమందు గానీ సూక్ష్మమందుగాని ఎరుక లేకుండును.

అతను స్పృహలేని వాడను చెప్పుటకు వీలులేదు.ఎందుచేతననగా, అతడు చిక్కుకొనియున్న అసమ్మోహిత స్థితియందు స్పృహకలవాడైవున్నాడు కాన జీవన్మృతుడై ఉన్నాడు.

సాధకుడు ఈ స్థితియందు చిక్కుకొని ప్రారంభములో అతడు శారీరకంగా ఏస్థితియందుఉండునో. అనగా ఏ భంగిమలో ఉండునో అదే భంగిమలో ప్రతిమవలె అట్లే ఉండిపోవును. ఆ విధముగా కన్పించిననూ వాస్తవంగా సామాన్యుని కంటే ఉత్సాహవంతుడై యుండును.

ఈ స్థితి యందున్నవాడు బయటపడవలెనన్నచో అతనికి మరణమైననూ సంభవించవలెను. లేదా ఏ సద్గురువు యొక్క సహాయమైనను కావలెను. అప్ప్పటి వరకూ అతడు అట్లే యుండును.

ఈతనిని సద్గురువు వెనుకకు మూడవ భూమికకు తీసుకుని పొవును, లేదా ముందుకు నాలుగవ భూమికకు త్రోసివేయును.

చాలా అరుదుగా ఈ స్థితియందున్న సాధకుడు భగవదనుగ్రహము వలన, ప్రమాద రూపములో 5వ భూమికకు 6వ భూమికకు మధ్య ఇదేమాదిరి వాసీకరణ స్ధితిలోనికి ముందుకు లాగబడును.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

03 Nov 2020

శ్రీ విష్ణు సహస్ర నామములు - 53 / Sri Vishnu Sahasra Namavali - 53

🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 53 / Sri Vishnu Sahasra Namavali - 53 🌹

నామము - భావము

📚. ప్రసాద్ భరద్వాజ

🌻. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 🌻

🌻 53. ఉత్తరో గోపతిర్గోప్తా జ్ఞానగమ్యః పురాతనః |
శరీర భూతభృద్ భోక్తా కపీంద్రో భూరిదక్షిణః ‖ 53 ‖

చిత్త నక్షత్రం 1వ పాద శ్లోకం

🍀. 494) ఉత్తర: -
అందరికంటెను అధికుడై, ఉత్తముడైనవాడు.

🍀. 495) గోపతి: -
గోవులను పాలించువాడు.

🍀. 496) గోప్తా -
సర్వులను సంరక్షించువాడు.

🍀. 497) జ్ఞానగమ్య: -
జ్ఞానము చేతనే తెలియబడినవాడు.

🍀. 498) పురాతన: -
సృష్టికి పూర్వమే వున్నవాడు.

🍀. 499) శరీరభూతభృత్ -
శరీరముల నుత్పన్నము చేయు పంచభూతములను పోషించువాడు.

🍀. 500) భోక్తా -
అనుభవించువాడు.

🍀. 501) కపీంద్ర: -
వానరులకు ప్రభువైనవాడు.

🍀. 502) భూరిదక్షిణ: -
యజ్ఞ సమయములలో విశేషముగా దక్షిణ లిచ్చువాడు.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Vishnu Sahasra Namavali - 53🌹

Name - Meaning

📚 Prasad Bharadwaj

🌻 OM NARAYANAYA VIDMAHE VASUDEVAYA DHIMAHI । TANNO VISHNU PRACHODAYAT ॥ 🌻

Sloka for Chitta 1st Padam

🌻 53. uttarō gōpatirgōptā jñānagamyaḥ purātanaḥ |
śarīrabhūtabhṛdbhōktā kapīndrō bhūridakṣiṇaḥ || 53 ||

🌻 494. Uttaraḥ:
One who is Uttirna or liberated from Samsara.

🌻 495. Gōpatiḥ:
Krishna who tends the cattle in the form of a Gopa. One who is the master of the earth.

🌻 496. Gōptā:
One who is the protector of all beings.

🌻 497. Jñānagamyaḥ:
The Lord cannot be known through Karma or a combination of Karma and Jyana.

🌻 498. Purātanaḥ:
One who is not limited by time and who existed before anything else.

🌻 499. Śarīrabhūtabhṛd:
One who is the master of the five Bhutas (elements) of which the body is made.

🌻 500. Bhōktā:
One who protects. Or one who is the enjoyer of infinite bliss.

🌻 501. Kapīndraḥ:
Kapi means Varah (boar). The word means, the Lord who is Indra and also one who manifested as Varaha or the Boar in one of the incarnations.

🌻 502. Bhūridakṣiṇaḥ:
One to whom numerous Dakshinas or votive offerings are made in Yajnas.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

03 Nov 2020

విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 86, 87 / Vishnu Sahasranama Contemplation - 86, 87

🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 86, 87 / Vishnu Sahasranama Contemplation - 86, 87 🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻 86. శరణం, शरणं, Śaraṇaṃ 🌻

ఓం శరణాయ నమః | ॐ शरणाय नमः | OM Śaraṇāya namaḥ

శ్రియతే ఇతి శరణమ్ ఆశ్రయించబడును. ఆర్తుల ఆర్తిని పోగొట్టువాడుగావున భక్తులచే పరమాత్మ ఆశ్రయించబడును.

:: పోతన భాగవతము - రెండవ స్కందము ::

ఉ. సర్వఫల ప్రదాతయును, సర్వశరణ్యుఁడు, సర్వశక్తుఁడున

సర్వజగత్ప్రసిద్ధుఁడును, సర్వగతుం డగు చక్రపాణి యీ

సర్వశరీరులున్ విగమసంగతిఁ జెంది విశీర్యమాణులై

పర్వినచో నభంబుగతి బ్రహ్మము దాఁ జెడకుండు నెప్పుడున్‍.

ఆ భగవంతుడు అందరికీ అన్ని ఫలాలు ఇచ్చేవాడు. అందరికీ శరణు పొందదగినవాడు. అన్ని శక్తులూ గలవాడు. అన్ని లోకాలలోనూ ప్రసిద్ధి పొందినవాడు. అంతటా వ్యాపించినవాడు. సుదర్శనమనే చక్రం ధరించిన బ్రహ్మస్వరూపుడైన ఆ దేవుడు, తక్కిన ఈ సమస్త ప్రాణులూ చిక్కి స్రుక్కి శిథిలమై అంతరించిపోయిన కల్పాంత కాలంలో గూడా ఆకాశంలాగా తానొక్కడూ చెక్కుచెదరకుండా నిర్వికారుడై నిలిచి ఉంటాడు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION - 86🌹

📚. Prasad Bharadwaj

🌻 86. Śaraṇaṃ 🌻

OM Śaraṇāya namaḥ

Śriyate iti śaraṇam / श्रियते इति शरणम् One who removes the sorrows of those in distress.

Śrīmad Bhāgavata - Canto 2, Chapter 4

Vicakṣaṇā yaccaraṇopasādanātsaṅgaṃ vyudasyobhayato’ntarātmanaḥ,

Vindanti hi brahmagatiṃ gataklamāstasmai subhadraśravase namo namaḥ. (16)

:: श्रीमद्भागवते द्वितीयस्कन्धे चतुर्थोऽध्यायः ::

विचक्षणा यच्चरणोपसादनात्सङ्गं व्युदस्योभयतोऽन्तरात्मनः ।

विन्दन्ति हि ब्रह्मगतिं गतक्लमास्तस्मै सुभद्रश्रवसे नमो नमः ॥ १६ ॥

Let me offer my respectful obeisances again and again unto the all-auspicious Lord Śrī Kṛṣṇa. The highly intellectual, simply by surrendering unto His lotus feet, are relieved of all attachments to present and future existences and without difficulty progress toward spiritual existence.

🌻 🌻 🌻 🌻 🌻

Source Sloka

सुरेशश्शरणं शर्म विश्वरेताः प्रजाभवः ।अहस्संवत्सरो व्यालः प्रत्ययस्सर्वदर्शनः ॥ १० ॥

సురేశశ్శరణం శర్మ విశ్వరేతాః ప్రజాభవః ।అహస్సంవత్సరో వ్యాళః ప్రత్యయస్సర్వదర్శనః ॥ ౧౦ ॥

Sureśaśśaraṇaṃ śarma viśvaretāḥ prajābhavaḥ ।Ahassaṃvatsaro vyālaḥ pratyayassarvadarśanaḥ ॥ 10 ॥

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 87 / Vishnu Sahasranama Contemplation - 87 🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻 87. శర్మ, शर्म, Śarma 🌻

ఓం శర్మణే నమః | ॐ शर्मणे नमः | OM Śarmaṇe namaḥ

పరమానందరూపత్వాద్ బ్రహ్మ శర్మేతి కథ్యతే పరమాత్ముడు పరమానంద రూపుడుకావున ఆతడే ఈ శబ్దముచే తెలుపబడుచున్నాడు. శర్మ అనగా సుఖము.

:: పోతన భాగవతము - దశమ స్కందము, శ్రీ కృష్ణావతార ఘట్టము ::

క. ఏ నిన్ను నఖిలదర్శను, జ్ఞానానందస్వరూపు సంతతు నపరా

దీనుని మాయాదూరుని, సూనునిఁగాఁ గంటి, నిట్టి చోద్యము గలదే?

(అప్పుడే జన్మించిన శ్రీ కృష్ణుని జూచి వసుదేవుడు) స్వామీ! నీవు సమస్త సృష్టినీ నీయందు దర్శింప జేస్తావు. జ్ఞానమూ, ఆనందమూ ఒక్కటై నీ రూపం కట్టుకున్నాయి. నీవు శాశ్వతుడవు. ఎవరి అదుపాజ్ఞలకు నీవు లొంగవలసిన పనిలేదు. మాయ నిన్ను అంటలేక దూరంగా తొలగిపోతుంది. ఇటువంటి నిన్ను నేను కుమారుడుగా కన్నానట! ఇలాంటి చోద్యం ఎక్కడైనా ఉన్నదా?

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION - 87🌹

📚. Prasad Bharadwaj

🌻 87. Śarma 🌻

OM Śarmaṇe namaḥ

Paramānaṃdarūpatvād brahma śarmeti kathyate / परमानंदरूपत्वाद् ब्रह्म शर्मेति कथ्यते As He is of the nature of supreme bliss, He is Śarma.

Śrīmad Bhāgavata - Canto 7, Chapter 8

Adyaitaddharinararūpamadbhutaṃ te dr̥ṣtaṃ naḥ śaraṇada sarvalokaśarma,

So’yaṃ te vidhikara īśa vipraśaptastasyedaṃ nidhanamanugrahāya vidmaḥ. (56)

:: श्रीमद्भागवते सप्तमस्कन्धे आष्टमोऽध्यायः ::

अद्यैतद्धरिनररूपमद्भुतं ते दृष्तं नः शरणद सर्वलोकशर्म ।

सोऽयं ते विधिकर ईश विप्रशप्तस्तस्येदं निधनमनुग्रहाय विद्मः ॥ ५६ ॥

The associates of Lord Viṣṇu in Vaikuṇṭha offered this prayer: O Lord, our supreme giver of shelter, today we have seen Your wonderful form as Lord Nṛsiḿhadeva, meant for the good fortune of all the world. O Lord, we can understand that Hiraṇyakaśipu was the same Jaya who engaged in Your service but was cursed by brāhmaṇas and who thus received the body of a demon. We understand that his having now been killed is Your special mercy upon him.

🌻 🌻 🌻 🌻 🌻

Source Sloka

सुरेशश्शरणं शर्म विश्वरेताः प्रजाभवः ।अहस्संवत्सरो व्यालः प्रत्ययस्सर्वदर्शनः ॥ १० ॥

సురేశశ్శరణం శర్మ విశ్వరేతాః ప్రజాభవః ।అహస్సంవత్సరో వ్యాళః ప్రత్యయస్సర్వదర్శనః ॥ ౧౦ ॥

Sureśaśśaraṇaṃ śarma viśvaretāḥ prajābhavaḥ ।Ahassaṃvatsaro vyālaḥ pratyayassarvadarśanaḥ ॥ 10 ॥

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

Facebook, WhatsApp & Telegram groups, WordPress:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/

03 Nov 2020

శ్రీ దేవీ మహత్యము - దుర్గా సప్తశతి - 23 / Sri Devi Mahatyam - Durga Saptasati - 23

🌹. శ్రీ దేవీ మహత్యము - దుర్గా సప్తశతి - 23 / Sri Devi Mahatyam - Durga Saptasati - 23 🌹

✍️. మల్లికార్జున శర్మ
📚. ప్రసాద్ భరద్వాజ

అధ్యాయము 6

🌻.ధూమ్రలోచన వధ - 1
🌻

1-2. ఋషి పలికెను : దేవి పలికిన ఈ మాటలు విని కోపంతో ఆ దూత మరలవచ్చి ఆ మాటలను సవిస్తరంగా రక్కసులటేనికి తెలిపాడు.

3–4. అంతట దూత చెప్పిన ఆ మాటలను విని అసురరాజు మిక్కిలి కోపంతో దైత్యాధిపుడైన ధూమ్రలోచనునితో ఇలా చెప్పాడు: “ఓ ధూమ్రలోచనా! నీవు నీ సైన్యసమేతుడవై త్వరితంగా వెళ్లి ఆ దుష్టురాలిని బలాత్కారంగా వెండ్రుకలు పట్టుకొని లాగి, భయంతో శరీరం స్వాధీనం తప్పునల్గొనర్చి, ఇచటికి తీసుకురా.

5. "ఇతరుడు ఎవడైనా ఆమెను రక్షించడానికి నిలువబడినచో, వాడు వేలుపైనా, యక్షుడైనా, గంధర్వుడైనా వాడిని చంపు.”

6-7. ఋషి పలికెను : శుంభునిచే ఇలా ఆజ్ఞాపించబడి ఆ దైత్యుడు ధూమ్రలోచనుడు అంతట అరువైవేల మంది అసురులతో కూడి శీఘ్రంగా వెళ్ళాడు.

8. మంచుకొండపై కూర్చొని ఉన్న ఆ దేవిని చూసి, "శుంభనిశుంభుల వద్దకు రమ్ము” అని గట్టిగా అరచిచెప్పాడు.

9. "నీవు ఇప్పుడు నా ప్రభువు వద్దకు ప్రీతితో రాకపోతే, నిన్ను బలాత్కారంగా వెండ్రుకలు పట్టుకుని ఈడ్చి, భయంతో ఒడలిపై స్వాధీనం తప్పేటట్లు చేసి, కొనిపోతాను.”

10-11. దేవి పలికెను : “నీవు అసురపతిచేత పంపబడ్డావు; బలం గలవాడవు; సైన్యసమేతుడవు. నీ విట్లు నన్ను బలాత్కారంగా కొనిపోతే, నిన్ను నేను ఏం చేయగలను?”

12-13. ఋషి పలికెను :

ఇలా పలుకగా ఆ అసురుడు ధూమ్రలోచనుడు ఆమె వైపునకు పరుగెత్తాడు. అంబిక అంతట హుంకారమాత్రం (“హుం” అని గర్జించుట) చేత అతనిని భస్మీకరించింది.

14. అంతట ఆ అసుర మహాసైన్యం క్రోధంతో అంబికపై వాడియమ్ములను, భల్లములను, గండ్రగొడ్డండ్లను కురిపించారు.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Sri Devi Mahatyam - Durga Saptasati - 23 🌹

✍️. P. R. Ramachander
📚 Prasad Bharadwaj

CHAPTER 6:

🌻 The Slaying of Dhumralochana - 1
🌻

The Rishi said:

1-2. The messenger, filled with indignation on hearing the words the Devi, returned and related them in detail to the king of the daityas.

3-4. Then the asura monarch, enraged on hearing that report from his messenger, told Dhumralocana, a chieftain of the daityas: 'O Dhumralocana, hasten together with your army and fetch here by force that shrew, distressed when dragged by her hair.

5. 'Or if any one else stands up as her saviours, let him be slain, be he a god, a yaksa or a gandharva.' The Rishi said:

6-7. Then the asura Dhuralocana, commanded thus by Shumbha, went forth quickly, accompanied by sixty thousand asuras.

8. On seeing the Devi stationed on the snowy mountain, he asked her aloud, 'Come to the presence of Shumbha and Nishumbha.

9. 'If you will not go to my lord with pleasure now, here I take you by force, distressed when dragged by your hair.' The Devi said:

10-11. 'You are sent by the lord of the asuras, mighty yourself and accompanied by an army. If you thus take me by force, then what can I do to you?'

The Rishi said:

12-13. Thus told, the asura Dhumralocana rushed towards her and thereupon Ambika reduced him to ashes with a mere heave of the sound 'hum'

14. Then the great army of asuras became enraged and showered on Ambika sharp arrows, javelins, and axes.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

Facebook, WhatsApp & Telegram groups, WordPress:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/

03 Nov 2020

కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 92

🌹. కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 92 🌹

✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. ఆత్మను తెలుసుకొను విధము -22 🌻

దైవీహ్యేషా గుణమయాయి మమ మాయా దురత్యయా |

మామేవ యే ప్రపద్యన్తే మాయామేతాం తరన్తి తే ||

బాబూ! నీలో ఉన్నటువంటి ఇంద్రియాలను పరిగెత్తిస్తున్నటువంటి, త్రిగుణాత్మకమైనటువంటి, ప్రకృతి సంబంధమైన మాయ అతిక్రమింప రానిది. అని ఒక పక్క చెబుతూనే ఏమంటున్నాడు? నేను ప్రకృతికి అతీతుడను. పరమాత్మ ప్రకృతికి అతీతుడు. మాయకు అతీతుడు. మోహానికి అతీతడు. మోక్ష స్వరూపుడు.

కాబట్టి నువ్వు పరమాత్మని గనుక పట్టుకున్నట్లయితే “మాం అను స్మరణ్‌” - నేనే కదా అనేక చోట్ల వస్తుంది. ‘మమ ఆశ్రయ’ - నన్నే పట్టుకో! ఆ పరమాత్మనే గనుక నీవు భక్తితో ఆశ్రయించినట్లయితే, విశ్వాసంతో ఆశ్రయించినట్లయితే, ఆత్మబలంతో గనుక నీవు ఆశ్రయించినట్లయితే, ధైర్యంతో ఆశ్రయించినట్లయితే, స్థైర్యంతో ఆశ్రయించినట్లయితే, వివేకంతో ఆశ్రయించినట్లయితే, విజ్ఞానంతో ఆశ్రయించినట్లయితే నీవు ఆ మాయ నుంచి ముక్తుడవు అయ్యేటువంటి అవకాశం లభిస్తుంది. జనన మరణ రాహిత్యం లభించేటువంటి అవకాశం లభిస్తుంది ఈ జన్మలోనే!

బహునాం జన్మనామంతే జానవాన్మాం ప్రపద్యతే |

వాసుదేవః సర్వమితి స మహాత్మా సుదుర్లభః ||

ఉన్నదంతా వాసుదేవ వ్యూహమే! ఉన్నదంతా వాసుదేవ స్వరూపమే! అనేటటువంటి బుద్ధి ఎప్పటికో గానీ కలగడం లేదు. నిశ్చలమైనటువంటి బుద్ధిలో మాత్రమే అటువంటి లక్షణం కలుగుతుంది. నీవున్నావు, నేనున్నాను అందరూ ఉన్నారు. అనేకత్వంగా ఉంది. జగత్తు అంతా అనేకంగా ఉంది. ఈ అనేకత్వం అంతా నేను భోగ్యంగా అనుభవించవచ్చు. అనేటటువంటి భోగి, భోగ్య లక్షణం మనలో బలంగా ఉన్నంత సేపు ఆ జగత్‌ భావన, జీవభావన బలంగా ఉంటుంది.

గుణధర్మం బలంగా ఉంటుంది. చాలామంది ఏమనుకుంటూ ఉంటారంటే, ఏమీ చేయకుండా ఉంటే ఇవన్నీ సాధ్యమౌతాయండి. ఏమైనా చేస్తూ ఉంటే, ఇవేమీ సాధ్యం కావండీ! చేస్తూ ఇలా ఉండడం కుదరదు. విరమించేసి, ఏ పని చేయకుండా ఓ మూల ముక్కు మూసుకుని, జపం చేసుకుంటూ, తపం చేసుకుంటూ కూర్చుంటే మాత్రమే సాధ్యం అనుకుంటారు అన్నమాట. అది ఎట్లా సాధ్యమో, అసాధ్యమో క్రింద వివరిస్తున్నారు.

స్థూలములైన ఇంద్రియముల నుండి సూక్ష్మాతి సూక్ష్మమైన పరమాత్మను తెలుసుకొను విధానము చెప్పబడుచున్నది. ఇంద్రియములు గోళకములకన్నా సూక్ష్మమైనవి. నేత్రము అనగానే మనకు కనిపించునది స్థూలమైన గోళకము. నేత్రేంద్రియము, నేత్ర గోళమునకు అంతరంగముగా, సూక్ష్మముగా ఉన్నది.

అటులనే ఇంద్రియముల కన్న వానికి కారణమగు శబ్దాది తన్మాత్రలు సూక్ష్మం. శబ్దాది తన్మాత్రల కన్న మనస్సు సూక్ష్మం. మనసు కన్న బుద్ధి, బుద్ధి కన్న మహత్ తత్వం సూక్ష్మం. మహత్‌ తత్త్వం కన్న అవ్యక్తం సూక్ష్మం. అవ్యక్తం కన్న పురుషుడు [పరమాత్మ] సూక్ష్మం. పురుషుని కంటే సూక్ష్మమైనది మరియొకటి లేదు. అదియే అంతిమము. అదియే పరమావధి.

ఈ రకంగా స్థూలపరిధి నుండి, బుద్ధిని సూక్ష్మం దిశగా నడపాలి. ఈ రకమైనటువంటి విచారణ చేయాలి. ఈ రకమైన గుర్తింపు రావాలి. ఈ రకమైనటువంటి భావనా బలం రావాలి. ఈ రకమైనటువంటి వివేకం రావాలి. ఈ రకమైనటువంటి విజ్ఞానం రావాలి. ఇది రోజువారీ జీవితంలో ప్రతీ ఒక్కరూ విచారణ ద్వారా పొందవలసినటువంటి సత్యము. దీనికి వేరే మార్గం లేదు. ఏమిటట అది? అంటే,

“నవ రంధ్ర కాయమన్నా... నిన్ను నట్టేట ముంచునోరన్నా” - విద్యా సాగర్ స్వామి

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

Facebook, WhatsApp & Telegram groups, WordPress:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/

03 Nov 2020

శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 96 / Sri Gajanan Maharaj Life History - 96

🌹. శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 96 / Sri Gajanan Maharaj Life History - 96 🌹

✍️. దాసగణు స్వామి
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. 19వ అధ్యాయము - 4 🌻

మీఇద్దరి ప్రవర్తనలూకూడా వేరుగా ఉన్నాయి, మరిమీరు ఆయనని మీసోదరుడు ఎలా అంటున్నారు ? దయచేసి నాకు విసదీకరించండి అని బాలా అన్నాడు. బాలా నువ్వు మంచిప్రశ్న వేసావు అని శ్రీమహారాజు అన్నారు. 

భగవంతుడుని చేరేందుకు మూడు మార్గాలు ఉన్నాయి. ఇవి అన్నీకూడా నిన్ను ఆత్మజ్ఞానం అనే ఊరుకి తీసుకు వెళతాయి. అవి వేరువేరుగా కనపడి చూసేవాళ్ళని కలవర పెడతాయి. శుభ్రంగా ఉండడం, పట్టుపంచ కట్టుకోవడం, ఎవరినీ ముట్టుకోకుండా ఉండడం రోజూ మూడుసార్లు పూజలు చేయడం, ఉపవాసం ఉండి నిష్టగా, క్రమశిక్షణగా విధులు పాటించడం వంటి వ్యవహారాలు కర్మమార్గానికి సంబంధించినవి. 

ఎవరయితే ఇవి పాటిస్తారో వాళ్ళే నిజమయిన జ్ఞానంఉన్న నిష్టాపరులు. ఈక్రమంలో ఏవిధంగా అయినా వక్రించినా, విశ్మరించినా కర్మమార్గంనుండి వంచితుడవుతాడు. ఈమార్గంలో అతను చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరినీ మాటలతో నైనా నొప్పించరాదు. 

భక్తిమార్గం ఎన్నుకున్న వారికి మనసు స్ఫటికంలా నిష్కల్మషంగా ఉండాలి. ఒక్కచెడు ఆలోచన ఛాయ వచ్చనా వారు భక్తిరహస్యం నుండి వంచితులవుతారు. క్షమ, ప్రేమ, నిరాడంబరత ఖచ్చితంగా తోడుగా ఉండాలి. అతనికి వేదశా స్త్రీలు వినడం, పూజించడం మీద నమ్మకంఉండి నిరంతరం హరినామస్మరణ చెయ్యాలి. ఇవి భక్తిమార్గానికి అవసరమయిన నియమాలు. వీటిని సాధనచేసిన వారు శ్రీహరిని కలుస్తారు. 

నిజానికి ఆత్మజ్ఞానానికి ఇది అత్యంత సులభమయిన మార్గం, కానీ ఆకాశం ఎలా అయితే మనకళ్ళకు దగ్గర ఉన్నట్టు కనిపిస్తుందో, ఇది పాటించడం, సాధనచెయ్యడం కర్మమార్గం కంటే కష్టమయినది. ఇప్పుడు యోగమార్గం గురించి విను: యోగమార్గం మిగిలిన రెండిటికంటే కూడా ఎక్కువగా ప్రచలితమైనది, కానీ ఇది మనలోనే ఇమిడిఉంది. 

యోగమార్గం సాధన చేస్తున్నవారికి బయటనుండి ఏదీ అవసరంలేదు. ప్రపంచంలో ఏమయితే ఉన్నాయో అవిఅన్నీ మనలోనే మనం చూడవచ్చు. అలాలోపల ఉన్నవాటి సహాయంతో మనం యోగమార్గాన్ని అనుసరించాలి. దీనికోసం రేచక, కుంభక ఆసనాలు గూర్చి తెలియడం అవసరం మరియు ఇద, పింగళ నాడులగూర్చి, ధౌతి, ముద్రాతతక్ గూర్చి జ్ఞానం అవసరం. 

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Sri Gajanan Maharaj Life History - 96 🌹 

✍️. Swamy Dasaganu 
📚. Prasad Bharadwaj

🌻 Chapter 19 - part 4 
🌻

Shri Gajanan Maharaj said, Bala you have asked a good question. There are three paths to reach God. All of them take you to the ‘town’ of self realization. They appear to be different and so confuse the onlooker. Rituals of ‘Karma Marga’ are to keep clean, wear silk dhotis, not to touch anybody, offering of worship three times a day, fasting and observance of rituals in a strict, disciplined manner. 

One who observes these things is a real learned orthodox. Any deviation or omission in this discipline will deprive him of the ‘Karma Marga’. He has got to be careful while treading this path; he should not hurt others even by words. For those pursuing the ‘Bhakti Marga’ their mind should be crystal clear. 

Even a shadow of an unclean thought will deprive them of all the Bhakti rahasya. Compassion, love and modesty must be thier accompaniments. They should have faith in listening to scriptures and worship, and must continuously chant the name of Hari (God). These are the requirements of the ‘Bhakti Marga’ and those, who practice it, will meet Shri Hari. 

In fact it is the easiest way of self realization, but practising it is even more difficult than ‘Karma Marga’, like the sky which appears to be so close to our eyes. Now listen to the principles of the ‘Yoga Marga’. The spread of the ‘Yoga Marga’ is far bigger than the former two, but it is within us. The person practising ‘Yoga Marga’ requires no paraphernalia from the outside. 

Whatever is in the universe can be found within ourselves, and with the help of those things, within us, we should follow the ‘Yoga Marga’. For that purpose it is necessary to know the various Asanas namely ‘Rechak’, ‘Kumbhak’, the knowledge of ‘Ida’ and ‘Pingala’ veins, Dhouti and Mudra Tratak. 

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

Facebook, WhatsApp & Telegram groups, WordPress:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/

03 Nov 2020

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 68, 69 / Sri Lalitha Chaitanya Vijnanam - 68, 69

🌹. శ్రీ లలితా సహస్ర స్తోత్రము - 38 🌹

🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 68, 69 / Sri Lalitha Chaitanya Vijnanam - 68, 69 🌹

సహస్ర నామముల తత్వ విచారణ
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀. పూర్తి శ్లోకము :

చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృతా

గేయచక్ర రథారూఢ మంత్రిణీ పరిసేవితా

🌻 68. 'చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృతా' 🌻

చక్రరాజమను రథము నధిరోహించిన శ్రీదేవి యని, రథమునందామె చుట్టును సర్వాయుధములు పరివృతమై అలంకరింప బడినవని అర్థము.

శ్రీ చక్రమే రథము. అది చక్రరాజము, రథరాజము. చక్రమనగ తిరుగుచు త్రిప్పునది. రథమనగా ముందుకు సాగునది. అమ్మ,

సృష్టి చక్రమును త్రిప్పుచు జీవులనందు తిరుగాడ చేయుచున్నది. సర్వలోకములందు జీవుల కదలిక ఆమె కదలికయే. సృష్టిచక్రము త్రిప్పుచుండగ జీవులందు తిరుగాడుచుందురు. రథమునకు పురోగమనము తిరోగమనము గలవు. రథమందలి ఆయుధములన్నియు, సృష్టియందు దుష్ట శిక్షణకు, శిష్ట రక్షణకు యేర్పడి యున్నవి.

అంతియే కాదు, సమస్తమైన ఆత్మజ్ఞాన ఆయుధములు కూడ అందున్నవి. యోగ సాధన లన్నియు గానుపోవు వున్నత స్థానము శ్రీ చక్రమే. శ్రీ చక్ర రథమును చేరినవాడు శుద్ధ విద్యయందు ప్రవేశించును. శుద్ధ విద్యయందు జగత్తును చైతన్యమయముగ చూచుట నియమము.

అట్లు చూచినచో తనపై తనకు ఈశత్వము కలుగును. ఈశత్వమున చేరిన జీవుడు దానియందే సాధనా బలమున స్థిరబడినచో సదాశివుని పాదములను స్పృశించిన వాడగును. క్రమశః సదాశివత్వమును పొందును. అప్పుడు తానే బ్రహ్మమని తెలియును. విశ్వమంతా తానే నిండియున్నాడని తెలియును. అట్లు తెలియుటయే శుద్ధవిద్య.

తెలియక పోవుట వలన భేదబుద్ధి కలుగును. భేదబుద్ధి అవిద్య, శ్రీచక్రము రథరాజమని కూడ తెలుపబడినది. ఈ రథమునకు ధ్వజము ఆనందము. దీనికి తొమ్మిది కోణములు కలవు. అవియే నవావరణములు. అమ్మ మరియొక రథము ఏడు కోణములతో నుండును. దానిని అమ్మ అధిష్ఠించినపుడు అమ్మ పేరు 'మంత్రిణి'.

అమ్మకు మరియొక రథము కలదు. దానికి ఐదు కోణములు కలవు. దానిని అమ్మ అధిష్ఠించినపుడు అమ్మను 'ప్రాణి' అందురు. ఈ మూడు చక్రములు మూడు లోకముల వలె ప్రకాశించుచున్నవి. అందు ఉత్తమోత్తమమైనది. శ్రీచక్రమని తెలియవలెను. వీని వివరణములు

ముందు నామములతో యింకను తెలియబడును.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 68 🌹
1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj

68. Cakrarāja- rathārūḍha- sarvāyudha-pariṣkṛtā चक्रराज-रथारूढ-सर्वायुध-परिष्कृता (68)

Cakrarāja is the chariot of Lalitāmbikā in which She travels along with all types of weapons. Weapons mean the ways of attaining suddhavidyā or pure knowledge which is called the knowledge of the Brahman.

This chariot consists of nine tiers. There are other two chariots that accompany this Cakrarāja the details of which will be discussed in the next two nāma-s. This Cakrarāja is said to mean the Śrī Cakra, the place of Lalitāmbikā. Pariṣkṛtā means adorned.

A brief knowledge of Śrī Cakrā becomes a necessity to understand this nāma.

Śrī Cakrā consists of nine partitions or angles broadly divided into five Śaktī cakra-s and four Śiva cakra-s. The triangles facing upwards are called Śiva cakra-s, and the triangles facing down are Śaktī cakra-s. Śrī Cakrā contains forty four triangles in which forty three goddesses (44th is Lalitai) and seventy nine yoginī-s (demi-goddesses) live.

All the gods and goddesses are said to reside in Śrī Cakra and that is why it is said that one can perform pūja to any god/goddess in Śrī Cakra. The nāma 996 Śrī Cakrārāja nilayā confirms Her domicile in Śrī Cakra.

Cakrarāja also means the six cakra-s (mūlādhārā to ājña). Ratha means base or foundation. Arūḍha means control and sarvāyudha means pure knowledge which is called suddhavidyā. The six cakra-s form the foundation to attain pure knowledge through which mind can be controlled in the sixth cakra.

The five psychic cakra-s represent the five basic elements and the ājña cakra represents mind. Therefore to control the basic elements and the mind, pure knowledge becomes essential.

When cakra-s are controlled, siddhi-s are attained. When we discuss about suddhavidyā let us also know what Śiva Sutra (I.21) says. It says ‘śuddhavidyodayāccakreśatva siddhiḥ’.

This means that only through suddhavidyā (pure knowledge), mastery can be attained over śakti-s. Śaktī-s here means the cakra-s. When one is able to attain mastery over the cakra-s, through the pure knowledge, he can attain the state of Śiva.

State of Śiva means oneness with Śiva. In this stage except Śiva nothing exists. Possibly this could mean that he sees everything and everybody as Śiva. This stage is called oneness with universal consciousness.

Suddhavidyā is possible only if māyā goes. Kṛṣṇa says in Bhagavad Gīta “all sacrifice of work culminates in transcendental knowledge”. The word transcendental means the knowledge of the Supreme. The ultimate meaning is that when mastery over the cakra-s and mind is attained, there is nothing one needs to do except to be with the Brahman always.

One has to really admire Vāc Devi-s about their knowledge of expressing the secrets of Self-realization in such a subtle way.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 69 / Sri Lalitha Chaitanya Vijnanam - 69 🌹
సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀. పూర్తి శ్లోకము :

చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృతా

గేయచక్ర రథారూఢ మంత్రిణీ పరిసేవితా

🌻 69. 'గేయచక్ర రథారూఢ మంత్రిణీ పరిసేవితా' 🌻

గేయ చక్రము అను రథము నధిరోహించిన శ్రీదేవి అని భావము.

శ్రీచక్రరాజము తొమ్మిది కోణములు లేక పర్వములు కలిగియుండును. అది చక్రరాజము, దాని తర్వాతి చక్రమే గేయచక్రము.

దాని కోణములు లేదా పర్వములు ఏడు అని తెలుపబడినవి. చక్రము నధిష్ఠించిన దేవత శ్యామల. ఈమె చుట్టును పరివేష్టితమై యుండు శక్తి మంత్రిణి. మంత్రిణి యనగా మంత్ర శక్త్యానుభవము. సర్వమంత్రముల అనుభవము.

శ్యామలాదేవిని ఉపాసించినచో సర్వమంత్ర సిద్ధి కలుగునని తంత్రశాస్త్రము తెలుపుచున్నది. శ్రీ చక్రము పరదేవతకి సంబంధించినది కాగ, గేయచక్రము పూర్ణమైన నేను అను భావమును ఎరుగచేయును. బ్రహ్మమునే నేను అని తెలియుట పూర్ణమైన నేను భావము. దీనిని 'బ్రహ్మై వాహం' (బ్రహ్మ ఏవ అహం) అందురు.

అనగా పరతత్త్వ మున్నది, తా నున్నాడు. అదియే, తానుగ వున్నాడు అని తెలియుట. ఇది ఆత్మానుభవ స్థితి. ఇది పరాశక్తితో, బుద్ధిని అను సంధానము చేయుట వలన తెలియనగును.

శ్రీ చక్ర స్థితియందు తాను పరతత్త్వమున ఇమిడిపోవును. గేయచక్ర స్థితియందు పరతత్త్వమే తానుగ నున్నట్లు యుండును. ఈ స్థితి తన యందలి ఏడు లోకముల స్వామిత్వమును ఎరిగిన స్థితి. అట్టివానిని యోగీశ్వరు డందురు.

తొమ్మిది పర్వములను అధిష్ఠించిన స్థితి. యోగేశ్వర స్థితి. అమ్మ యోగేశ్వరి. ఆమెయే శ్రీకృష్ణుడగుటచే అతనిని యోగేశ్వరుడు అందురు. యోగీశ్వరులకు స్వామియే యోగేశ్వరుడు. శ్రీ లలిత, శ్రీకృష్ణుడు ఒకటియే అని పెద్దల అనుభవము. అది శ్రీ చక్రరాజ స్థితి.

"లలిత స్కంధము, కృష్ణమూలము” అని భాగవతమున తెలుపబడినది. గేయచక్రము జీవుని ఈశ్వరస్థితి. పరమేశ్వరుడే జీవుల యందీశ్వరుడుగ నున్నాడు. ఈ స్థితి యోగీశ్వరుని స్థితి. ఈ స్థితి యందు అమ్మను 'శ్యామల' అందురు.

శ్రీరాముడు శ్యామలమూర్తి యని, శ్రీకృష్ణుడు లలితామూర్తియని తెలుపుటలో రహస్యమేమన శ్రీరాముడు పరిపూర్ణ మానవుడని, శ్రీకృష్ణుడు పరతత్త్వమని తెలియజేయుట. గేయచక్రము సవితృమండల చక్రముకాగ, శ్రీచక్రము దానికిని ఆధారభూతమగు చక్రము.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 69 🌹
1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj

69. Geyacakra- rathārūḍha- mantriṇī-parisevitā गेयचक्र-रथारूढ-मन्त्रिणी-परिसेविता (69)

In the previous nāma it is seen that two chariots always accompany the Cakrarāja chariot. Out of the two, the first one is being discussed here, which is called Geyacakra chariot.

This is the chariot of Mantrinī Devi who is also called Śyamalā Devi, about whom we have discussed in nāma10. Mantrinī Devi who owns geycakra worships Her is the literal meaning. As Mantrinī is one of Her ministers, Mantrinī Devi holds Lalitai in high esteem and chooses to worship Her. Worshipping is different from respecting.

We have seen that there are seventy nine yoginī-s in Śrī Cakrā. yoginī-s are the great worshippers of Lalitāmbikā. These yoginī-s are also called mantrinī-s (different from Mantrinī or Śyamalā Devi). They are the masters of Śrī Vidyā rituals. This nāma could possibly mean the Śrī Vidyā worship by these yoginī-s. Geya also means important. Geyacakra means important cakra, which is Śrī Cakra.

Those who meditate Her in Śrī Cakrā attain mantra siddhi easily. Such a person who attained siddhi is called mantrinī. She is worshipped by those who attained mantra siddhi of Pañcadaśī or ṣodaśī as these are the two main mantra-s of Lalitāmbikā. The importance of worshipping Śrī Cakrā is emphasized here. Human body is compared to Śrī Cakrā in many scriptures.

The nine partitions of Śrī Cakrā are compared to nine parts of our body - the orifice in the crown cakra is head, ājña cakra is forehead, viśuddhi cakra is neck, anāhata cakra is heart, maṇipūra cakra is navel, the hip (possibly includes both svādhiṣṭhāna and mūlādhāra cakra-s) and thighs and the feet. It is pertinent to note that the divine energy enters our body through the orifice in the sahasrārā and excess energy if any is grounded through our feet.

Śiva Sūtra (II.3) talks about the secret of mantra-s. The illuminating “I” consciousness existing as an essential constituent of various mantra-s (like Pañcadaśī and ṣodaśī), whose essence is the knowledge of realizing the Brahman, is the secret of mantra.

Therefore mantra-s are not just the combination of letters, but the Śaktī Herself. Hence these letters are called Mātṛka (Mātṛka means coming from or belonging to a mother. Please refer nāma 1 Śrī Mātā, the Supreme Mother). In the initial stages of spirituality, chanting of mantra-s is considered essential.

In this nāma, the importance of mantra and considering our own body as one with Śrī Cakra are emphasized. Considering our body as the one with Śrī Cakra means that She is not different from us, the main principle of Self-realization.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

03 Nov 2020

3-November-2020 Messages

 1) 🌹 శ్రీమద్భగవద్గీత - 535 / Bhagavad-Gita - 535🌹
2) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 86, 87 / Vishnu Sahasranama Contemplation - 86, 87 🌹
3) 🌹 Sripada Srivallabha Charithamrutham - 323 🌹
5) 🌹. కఠోపనిషత్ వివరణ - చలాచలభోధ - 92 🌹
6) 🌹 Guru Geeta - Datta Vaakya - 111 🌹
7) 🌹. గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 98 / Gajanan Maharaj Life History - 98🌹
8) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 68, 69 / Sri Lalita Chaitanya Vijnanam - 68, 69🌹
9) *🌹. శ్రీ లలితా సహస్ర స్తోత్రము - 38 🌹*
10) 🌹. శ్రీమద్భగవద్గీత - 450 / Bhagavad-Gita - 450 🌹

11) 📚. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 66 📚
12) 🌹. శివ మహా పురాణము - 264 🌹
13) 🌹 Light On The Path - 20 🌹
14) 🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 151🌹
15) 🌹. శివగీత - 105 / The Siva-Gita - 105🌹* 
17) 🌹 Seeds Of Consciousness - 214 🌹   
16) 🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 90🌹
18) 🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 53 / Sri Vishnu Sahasranama - 53🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీమద్భగవద్గీత - 535 / Bhagavad-Gita - 535 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. 15వ అధ్యాయము - పురుషోత్తమ యోగము - 20 🌴*

20. ఇతి గుహ్యతమం శాస్త్రమిదముక్తం మయానఘ |
ఏతద్ బుద్ధ్వా బుద్ధిమాన్ స్యాత్క్రుత కృత్యశ్చ భారత ||

🌷. తాత్పర్యం : 
ఓ పాపరహితుడా! వేదములందలి అత్యంత రహస్యమైన ఈ భాగమును నీకిప్పుడు నేను వెల్లడించితిని. దీనిని అవగాహన చేసికొనినవాడు బుద్ధిమంతుడు కాగలడు. అతని ప్రయత్నములు పూర్ణవిజయమును బడయగలవు.

🌷. భాష్యము :
సమస్త శాస్త్రముల సారాంశమిదియేనని శ్రీకృష్ణభగవానుడు ఇచ్చట స్పష్టముగా వివరించుచున్నాడు. అతడు తెలిపిన ఈ విషయములను ప్రతియెక్కరు యథాతథముగా స్వీకరింపవలసియున్నది. 

ఆ విధముగా మనుజుడు బుద్ధిమంతుడును, ఆధ్యాత్మికజ్ఞానము నందు పూర్ణుడును కాగలడు. అనగా దేవదేవుడైన శ్రీకృష్ణుని ఈ తత్త్వమును అవగాహనము చేసికొని, అతని భక్తియోగమున నిలుచుట ద్వారా ప్రతియొక్కరు త్రిగుణకల్మషము నుండి బయటపడగలరు. వాస్తవమునకు భక్తియోగమనునది ఆధ్యాత్మికావగాహన విధానము. భక్తియుక్తసేవ యున్న చోట భౌతికల్మషము నిలువలేదు. ఆధ్యాత్మికత్వమును కూడియుండుట వలన భక్తియుక్తసేవ మరియు భగవానుడు అనెడి అంశముల నడుమ భేదముండదు. 

వాస్తవమునకు శుద్ధభక్తి శ్రీకృష్ణభగవానుని అంతరంగశక్తి యొక్క ఆధ్వర్యముననే జరుగును. భగవానుడు సూర్యుడైనచో అజ్ఞానము అంధకారము వంటిది. సూర్యుడున్నచోట అంధకారమనెడి ప్రశ్నయే ఉదయించనట్లు, ప్రామాణికుడగు ఆధ్యాత్మికగురువు నేతృత్వమున ఒనరింపబడు భక్తియుతసేవ యున్నచోట అజ్ఞానమనెడి ప్రశ్నయే కలుగదు.

శ్రీమద్భగవద్గీత యందలి “పురుషోత్తమ యోగము” అను పంచదశాధ్యాయమునకు భక్తివేదాంతభాష్యము సమాప్తము.    
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 535 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

*🌴 Chapter 15 - Purushothama Yoga - 20 🌴*

20. iti guhya-tamaṁ śāstram
idam uktaṁ mayānagha
etad buddhvā buddhimān syāt
kṛta-kṛtyaś ca bhārata

🌷 Translation : 
This is the most confidential part of the Vedic scriptures, O sinless one, and it is disclosed now by Me. Whoever understands this will become wise, and his endeavors will know perfection.

🌹 Purport :
The Lord clearly explains here that this is the substance of all revealed scriptures. And one should understand this as it is given by the Supreme Personality of Godhead. Thus one will become intelligent and perfect in transcendental knowledge. In other words, by understanding this philosophy of the Supreme Personality of Godhead and engaging in His transcendental service, everyone can become freed from all contaminations of the modes of material nature. Devotional service is a process of spiritual understanding. 

Wherever devotional service exists, the material contamination cannot coexist. Devotional service to the Lord and the Lord Himself are one and the same because they are spiritual; devotional service takes place within the internal energy of the Supreme Lord. The Lord is said to be the sun, and ignorance is called darkness. Where the sun is present, there is no question of darkness. Therefore, whenever devotional service is present under the proper guidance of a bona fide spiritual master, there is no question of ignorance.

Thus end the Bhaktivedanta Purports to the Fifteenth Chapter of the Śrīmad Bhagavad-gītā in the matter of Puruṣottama-yoga, the Yoga of the Supreme Person.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 Sripada Srivallabha Charithamrutham - 323 🌹*
✍️ Satya prasad
📚. Prasad Bharadwaj

Chapter 47
*🌻 The fun filled play of the player of the world drama - 1 🌻*

Venkata Subbamamba said, ‘Kannaiah! It was a long time since you had eaten milk, curd, cream and butter. I would like to feed you with my own hands.’  

Sripada said, ‘Ammamma! Certainly you can feed me. I am very much tired. I knew that you were bringing milk, curd, cream and butter when you started. They would get spoiled in the journey of many days.  

Bound by your affectionate love, I have brought you here quickly so that those things do not get spoiled. Ammamma! See how much I had to struggle. Was it an ordinary thing to pull 18 carts single handedly for many miles?  

My whole body is aching. See the blebs on my hands.” She saw Sripada’s hands and was surprised. Really Sripada’s hands were having blebs. Venkata Subbamamba applied butter to His hands. Hot water fomentation was also done. 

 Where is the end for the fun filled leelas of the conductor of world drama? Rajamamba said, ‘Bangaru kanna! I made halva which you like very much. I brought it in a silver bowel. Come near me, My Dear! I will feed you a little with my hands.’ The three grand mothers of Sripada fed Him the halwa.  

The halwa was not exhausting, however much was eaten. Sripada conducted this ‘fun’ for a long time. Sripada said, ‘My grand mothers may be having love on me. But will I not get sick if I take this much halwa? Are you doing the correct thing?’  

After questioning like this, Sripada fed the halwa to His brothers, sisters and their husbands with His own hands. A farmer Venkaiah was there among those who came from Peethikapuram. Sripada gave Datta deekshas in his house only.  

Venkaiah was also fed with halwa by Sripada with His own hands and later he was told to distribute it to the cart drivers, horses and the remaining others.  

He gave that silver bowel to Venkaiah as gift. Appala Raju Sharma prayed, “My Dear! Bangaru! Pardon me if I did anything wrong not knowing that you were Datta Prabhu.”  

Sripada said, ‘Father! I am your child. How can a child pardon father! What a wonder! You should shower affection on me as your son. Always desire my welfare.’

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 86, 87 / Vishnu Sahasranama Contemplation - 86, 87 🌹*
📚. ప్రసాద్ భరద్వాజ 

*🌻 86. శరణం, शरणं, Śaraṇaṃ 🌻*

*ఓం శరణాయ నమః | ॐ शरणाय नमः | OM Śaraṇāya namaḥ*

శ్రియతే ఇతి శరణమ్ ఆశ్రయించబడును. ఆర్తుల ఆర్తిని పోగొట్టువాడుగావున భక్తులచే పరమాత్మ ఆశ్రయించబడును.

:: పోతన భాగవతము - రెండవ స్కందము ::
ఉ. సర్వఫల ప్రదాతయును, సర్వశరణ్యుఁడు, సర్వశక్తుఁడున
     సర్వజగత్ప్రసిద్ధుఁడును, సర్వగతుం డగు చక్రపాణి యీ
     సర్వశరీరులున్ విగమసంగతిఁ జెంది విశీర్యమాణులై
     పర్వినచో నభంబుగతి బ్రహ్మము దాఁ జెడకుండు నెప్పుడున్‍.

ఆ భగవంతుడు అందరికీ అన్ని ఫలాలు ఇచ్చేవాడు. అందరికీ శరణు పొందదగినవాడు. అన్ని శక్తులూ గలవాడు. అన్ని లోకాలలోనూ ప్రసిద్ధి పొందినవాడు. అంతటా వ్యాపించినవాడు. సుదర్శనమనే చక్రం ధరించిన బ్రహ్మస్వరూపుడైన ఆ దేవుడు, తక్కిన ఈ సమస్త ప్రాణులూ చిక్కి స్రుక్కి శిథిలమై అంతరించిపోయిన కల్పాంత కాలంలో గూడా ఆకాశంలాగా తానొక్కడూ చెక్కుచెదరకుండా నిర్వికారుడై నిలిచి ఉంటాడు.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION - 86🌹*
📚. Prasad Bharadwaj 

*🌻 86. Śaraṇaṃ 🌻*

* OM Śaraṇāya namaḥ*

Śriyate iti śaraṇam / श्रियते इति शरणम् One who removes the sorrows of those in distress.

Śrīmad Bhāgavata - Canto 2, Chapter 4
Vicakṣaṇā yaccaraṇopasādanātsaṅgaṃ vyudasyobhayato’ntarātmanaḥ,
Vindanti hi brahmagatiṃ gataklamāstasmai subhadraśravase namo namaḥ. (16)

:: श्रीमद्भागवते द्वितीयस्कन्धे चतुर्थोऽध्यायः ::
विचक्षणा यच्चरणोपसादनात्सङ्गं व्युदस्योभयतोऽन्तरात्मनः ।
विन्दन्ति हि ब्रह्मगतिं गतक्लमास्तस्मै सुभद्रश्रवसे नमो नमः ॥ १६ ॥

Let me offer my respectful obeisances again and again unto the all-auspicious Lord Śrī Kṛṣṇa. The highly intellectual, simply by surrendering unto His lotus feet, are relieved of all attachments to present and future existences and without difficulty progress toward spiritual existence.

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
सुरेशश्शरणं शर्म विश्वरेताः प्रजाभवः ।अहस्संवत्सरो व्यालः प्रत्ययस्सर्वदर्शनः ॥ १० ॥

సురేశశ్శరణం శర్మ విశ్వరేతాః ప్రజాభవః ।అహస్సంవత్సరో వ్యాళః ప్రత్యయస్సర్వదర్శనః ॥ ౧౦ ॥

Sureśaśśaraṇaṃ śarma viśvaretāḥ prajābhavaḥ ।Ahassaṃvatsaro vyālaḥ pratyayassarvadarśanaḥ ॥ 10 ॥

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 87 / Vishnu Sahasranama Contemplation - 87 🌹*
📚. ప్రసాద్ భరద్వాజ 

*🌻 87. శర్మ, शर्म, Śarma 🌻*

*ఓం శర్మణే నమః | ॐ शर्मणे नमः | OM Śarmaṇe namaḥ*

పరమానందరూపత్వాద్ బ్రహ్మ శర్మేతి కథ్యతే పరమాత్ముడు పరమానంద రూపుడుకావున ఆతడే ఈ శబ్దముచే తెలుపబడుచున్నాడు. శర్మ అనగా సుఖము.

:: పోతన భాగవతము - దశమ స్కందము, శ్రీ కృష్ణావతార ఘట్టము ::
క. ఏ నిన్ను నఖిలదర్శను, జ్ఞానానందస్వరూపు సంతతు నపరా
    దీనుని మాయాదూరుని, సూనునిఁగాఁ గంటి, నిట్టి చోద్యము గలదే?

(అప్పుడే జన్మించిన శ్రీ కృష్ణుని జూచి వసుదేవుడు) స్వామీ! నీవు సమస్త సృష్టినీ నీయందు దర్శింప జేస్తావు. జ్ఞానమూ, ఆనందమూ ఒక్కటై నీ రూపం కట్టుకున్నాయి. నీవు శాశ్వతుడవు. ఎవరి అదుపాజ్ఞలకు నీవు లొంగవలసిన పనిలేదు. మాయ నిన్ను అంటలేక దూరంగా తొలగిపోతుంది. ఇటువంటి నిన్ను నేను కుమారుడుగా కన్నానట! ఇలాంటి చోద్యం ఎక్కడైనా ఉన్నదా?

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION - 87🌹*
📚. Prasad Bharadwaj 

*🌻 87. Śarma 🌻*

*OM Śarmaṇe namaḥ*

Paramānaṃdarūpatvād brahma śarmeti kathyate / परमानंदरूपत्वाद् ब्रह्म शर्मेति कथ्यते As He is of the nature of supreme bliss, He is Śarma.

Śrīmad Bhāgavata - Canto 7, Chapter 8
Adyaitaddharinararūpamadbhutaṃ te dr̥ṣtaṃ naḥ śaraṇada sarvalokaśarma,
So’yaṃ te vidhikara īśa vipraśaptastasyedaṃ nidhanamanugrahāya vidmaḥ. (56)

:: श्रीमद्भागवते सप्तमस्कन्धे आष्टमोऽध्यायः ::
अद्यैतद्धरिनररूपमद्भुतं ते दृष्तं नः शरणद सर्वलोकशर्म ।
सोऽयं ते विधिकर ईश विप्रशप्तस्तस्येदं निधनमनुग्रहाय विद्मः ॥ ५६ ॥

The associates of Lord Viṣṇu in Vaikuṇṭha offered this prayer: O Lord, our supreme giver of shelter, today we have seen Your wonderful form as Lord Nṛsiḿhadeva, meant for the good fortune of all the world. O Lord, we can understand that Hiraṇyakaśipu was the same Jaya who engaged in Your service but was cursed by brāhmaṇas and who thus received the body of a demon. We understand that his having now been killed is Your special mercy upon him.

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
सुरेशश्शरणं शर्म विश्वरेताः प्रजाभवः ।अहस्संवत्सरो व्यालः प्रत्ययस्सर्वदर्शनः ॥ १० ॥

సురేశశ్శరణం శర్మ విశ్వరేతాః ప్రజాభవః ।అహస్సంవత్సరో వ్యాళః ప్రత్యయస్సర్వదర్శనః ॥ ౧౦ ॥

Sureśaśśaraṇaṃ śarma viśvaretāḥ prajābhavaḥ ।Ahassaṃvatsaro vyālaḥ pratyayassarvadarśanaḥ ॥ 10 ॥

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ దేవీ మహత్యము - దుర్గా సప్తశతి - 23 / Sri Devi Mahatyam - Durga Saptasati - 23 🌹*
✍️. మల్లికార్జున శర్మ 
📚. ప్రసాద్ భరద్వాజ 

*అధ్యాయము 6*
*🌻.ధూమ్రలోచన వధ - 1 🌻*

1-2. ఋషి పలికెను : దేవి పలికిన ఈ మాటలు విని కోపంతో ఆ దూత మరలవచ్చి ఆ మాటలను సవిస్తరంగా రక్కసులటేనికి తెలిపాడు.

3–4. అంతట దూత చెప్పిన ఆ మాటలను విని అసురరాజు మిక్కిలి కోపంతో దైత్యాధిపుడైన ధూమ్రలోచనునితో ఇలా చెప్పాడు: “ఓ ధూమ్రలోచనా! నీవు నీ సైన్యసమేతుడవై త్వరితంగా వెళ్లి ఆ దుష్టురాలిని బలాత్కారంగా వెండ్రుకలు పట్టుకొని లాగి, భయంతో శరీరం స్వాధీనం తప్పునల్గొనర్చి, ఇచటికి తీసుకురా.

5. "ఇతరుడు ఎవడైనా ఆమెను రక్షించడానికి నిలువబడినచో, వాడు వేలుపైనా, యక్షుడైనా, గంధర్వుడైనా వాడిని చంపు.”

6-7. ఋషి పలికెను : శుంభునిచే ఇలా ఆజ్ఞాపించబడి ఆ దైత్యుడు ధూమ్రలోచనుడు అంతట అరువైవేల మంది అసురులతో కూడి శీఘ్రంగా వెళ్ళాడు. 

8. మంచుకొండపై కూర్చొని ఉన్న ఆ దేవిని చూసి, "శుంభనిశుంభుల వద్దకు రమ్ము” అని గట్టిగా అరచిచెప్పాడు.

9. "నీవు ఇప్పుడు నా ప్రభువు వద్దకు ప్రీతితో రాకపోతే, నిన్ను బలాత్కారంగా వెండ్రుకలు పట్టుకుని ఈడ్చి, భయంతో ఒడలిపై స్వాధీనం తప్పేటట్లు చేసి, కొనిపోతాను.”

10-11. దేవి పలికెను : “నీవు అసురపతిచేత పంపబడ్డావు; బలం గలవాడవు; సైన్యసమేతుడవు. నీ విట్లు నన్ను బలాత్కారంగా కొనిపోతే, నిన్ను నేను ఏం చేయగలను?”

12-13. ఋషి పలికెను : 
ఇలా పలుకగా ఆ అసురుడు ధూమ్రలోచనుడు ఆమె వైపునకు పరుగెత్తాడు. అంబిక అంతట హుంకారమాత్రం (“హుం” అని గర్జించుట) చేత అతనిని భస్మీకరించింది.

14. అంతట ఆ అసుర మహాసైన్యం క్రోధంతో అంబికపై వాడియమ్ములను, భల్లములను, గండ్రగొడ్డండ్లను కురిపించారు.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Devi Mahatyam - Durga Saptasati - 23 🌹*
✍️. P. R. Ramachander
📚 Prasad Bharadwaj

*CHAPTER 6:* 
*🌻 The Slaying of Dhumralochana - 1 🌻*

 The Rishi said:

1-2. The messenger, filled with indignation on hearing the words the Devi, returned and related them in detail to the king of the daityas.

3-4. Then the asura monarch, enraged on hearing that report from his messenger, told Dhumralocana, a chieftain of the daityas: 'O Dhumralocana, hasten together with your army and fetch here by force that shrew, distressed when dragged by her hair.

5. 'Or if any one else stands up as her saviours, let him be slain, be he a god, a yaksa or a gandharva.' The Rishi said:

6-7. Then the asura Dhuralocana, commanded thus by Shumbha, went forth quickly, accompanied by sixty thousand asuras.

8. On seeing the Devi stationed on the snowy mountain, he asked her aloud, 'Come to the presence of Shumbha and Nishumbha.

9. 'If you will not go to my lord with pleasure now, here I take you by force, distressed when dragged by your hair.' The Devi said:

10-11. 'You are sent by the lord of the asuras, mighty yourself and accompanied by an army. If you thus take me by force, then what can I do to you?' 

The Rishi said: 
 12-13. Thus told, the asura Dhumralocana rushed towards her and thereupon Ambika reduced him to ashes with a mere heave of the sound 'hum'

14. Then the great army of asuras became enraged and showered on Ambika sharp arrows, javelins, and axes. 

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 92 🌹*
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్ 
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. ఆత్మను తెలుసుకొను విధము -22 🌻*

దైవీహ్యేషా గుణమయాయి మమ మాయా దురత్యయా |
మామేవ యే ప్రపద్యన్తే మాయామేతాం తరన్తి తే ||

        బాబూ! నీలో ఉన్నటువంటి ఇంద్రియాలను పరిగెత్తిస్తున్నటువంటి, త్రిగుణాత్మకమైనటువంటి, ప్రకృతి సంబంధమైన మాయ అతిక్రమింప రానిది. అని ఒక పక్క చెబుతూనే ఏమంటున్నాడు? నేను ప్రకృతికి అతీతుడను. పరమాత్మ ప్రకృతికి అతీతుడు. మాయకు అతీతుడు. మోహానికి అతీతడు. మోక్ష స్వరూపుడు. 

కాబట్టి నువ్వు పరమాత్మని గనుక పట్టుకున్నట్లయితే “మాం అను స్మరణ్‌” - నేనే కదా అనేక చోట్ల వస్తుంది. ‘మమ ఆశ్రయ’ - నన్నే పట్టుకో! ఆ పరమాత్మనే గనుక నీవు భక్తితో ఆశ్రయించినట్లయితే, విశ్వాసంతో ఆశ్రయించినట్లయితే, ఆత్మబలంతో గనుక నీవు ఆశ్రయించినట్లయితే, ధైర్యంతో ఆశ్రయించినట్లయితే, స్థైర్యంతో ఆశ్రయించినట్లయితే, వివేకంతో ఆశ్రయించినట్లయితే, విజ్ఞానంతో ఆశ్రయించినట్లయితే నీవు ఆ మాయ నుంచి ముక్తుడవు అయ్యేటువంటి అవకాశం లభిస్తుంది. జనన మరణ రాహిత్యం లభించేటువంటి అవకాశం లభిస్తుంది ఈ జన్మలోనే!

బహునాం జన్మనామంతే జానవాన్మాం ప్రపద్యతే |
వాసుదేవః సర్వమితి స మహాత్మా సుదుర్లభః ||

        ఉన్నదంతా వాసుదేవ వ్యూహమే! ఉన్నదంతా వాసుదేవ స్వరూపమే! అనేటటువంటి బుద్ధి ఎప్పటికో గానీ కలగడం లేదు. నిశ్చలమైనటువంటి బుద్ధిలో మాత్రమే అటువంటి లక్షణం కలుగుతుంది. నీవున్నావు, నేనున్నాను అందరూ ఉన్నారు. అనేకత్వంగా ఉంది. జగత్తు అంతా అనేకంగా ఉంది. ఈ అనేకత్వం అంతా నేను భోగ్యంగా అనుభవించవచ్చు. అనేటటువంటి భోగి, భోగ్య లక్షణం మనలో బలంగా ఉన్నంత సేపు ఆ జగత్‌ భావన, జీవభావన బలంగా ఉంటుంది. 

గుణధర్మం బలంగా ఉంటుంది. చాలామంది ఏమనుకుంటూ ఉంటారంటే, ఏమీ చేయకుండా ఉంటే ఇవన్నీ సాధ్యమౌతాయండి. ఏమైనా చేస్తూ ఉంటే, ఇవేమీ సాధ్యం కావండీ! చేస్తూ ఇలా ఉండడం కుదరదు. విరమించేసి, ఏ పని చేయకుండా ఓ మూల ముక్కు మూసుకుని, జపం చేసుకుంటూ, తపం చేసుకుంటూ కూర్చుంటే మాత్రమే సాధ్యం అనుకుంటారు అన్నమాట. అది ఎట్లా సాధ్యమో, అసాధ్యమో క్రింద వివరిస్తున్నారు.

        స్థూలములైన ఇంద్రియముల నుండి సూక్ష్మాతి సూక్ష్మమైన పరమాత్మను తెలుసుకొను విధానము చెప్పబడుచున్నది. ఇంద్రియములు గోళకములకన్నా సూక్ష్మమైనవి. నేత్రము అనగానే మనకు కనిపించునది స్థూలమైన గోళకము. నేత్రేంద్రియము, నేత్ర గోళమునకు అంతరంగముగా, సూక్ష్మముగా ఉన్నది.

 అటులనే ఇంద్రియముల కన్న వానికి కారణమగు శబ్దాది తన్మాత్రలు సూక్ష్మం. శబ్దాది తన్మాత్రల కన్న మనస్సు సూక్ష్మం. మనసు కన్న బుద్ధి, బుద్ధి కన్న మహత్ తత్వం సూక్ష్మం. మహత్‌ తత్త్వం కన్న అవ్యక్తం సూక్ష్మం. అవ్యక్తం కన్న పురుషుడు [పరమాత్మ] సూక్ష్మం. పురుషుని కంటే సూక్ష్మమైనది మరియొకటి లేదు. అదియే అంతిమము. అదియే పరమావధి.

        ఈ రకంగా స్థూలపరిధి నుండి, బుద్ధిని సూక్ష్మం దిశగా నడపాలి. ఈ రకమైనటువంటి విచారణ చేయాలి. ఈ రకమైన గుర్తింపు రావాలి. ఈ రకమైనటువంటి భావనా బలం రావాలి. ఈ రకమైనటువంటి వివేకం రావాలి. ఈ రకమైనటువంటి విజ్ఞానం రావాలి. ఇది రోజువారీ జీవితంలో ప్రతీ ఒక్కరూ విచారణ ద్వారా పొందవలసినటువంటి సత్యము. దీనికి వేరే మార్గం లేదు. ఏమిటట అది? అంటే,
“నవ రంధ్ర కాయమన్నా... నిన్ను నట్టేట ముంచునోరన్నా” - విద్యా సాగర్ స్వామి 

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 Guru Geeta - Datta Vaakya - 111 🌹*
✍️ Sadguru Ganapathi Sachidananda
📚. Prasad Bharadwaj
104

We discussed so far that there are two kinds of hearts. One is the Guru heart, and the other is the human heart. The elders also refer to them as the spiritual heart and the material heart. 

The spiritual heart is on the right side of the body, while the material heart is on the left. The heart on the right has no bones or flesh. That is why it is spiritual heart. It is just ether, it has nothing, filled with emptiness. These hearts are in the form of lotuses. The Guru makes these hearts bloom. 

The Guru is himself the sun and the knowledge that comes from him is his light. 
However, unlike regular sunlight that diminishes at the end of each day due to which the blossoming lotus fades and closes each day, the light from the Guru is eternal. The lotus that blooms due to 
this light never fades or shrivels.

The Guru is the sun that makes the hearts of the disciples blossom. He is the embodiment of knowledge and auspiciousness. Obeisance to such a Guru. We should always offer salutations to such 
a Guru.

Sloka:
Upayopeya rupaya sadupaya pradarsine | Anirvacyaya vacyaya sivaya gurave namah ||

Obeisance to Guru who is the idea and also the desired objective of that idea, who gives good thoughts and ideas to his disciples and who is beyond description, who deserves all praise, and who is Siva himself.

Sloka:
Karya karana rupaya rupa rupaya te sada | Apramye svarupaya sivaya gurave namah ||

Obeisance to Guru who is the cause and the effect, who is of attributes and who has no attributes at all, whose form cannot be imagined and who is Siva himself.

Datta Sadguru is filled with an abundance of these qualities. So, let’s learn of a few miracles that Datta Sadguru showed in this aspect.

Lord Datta’s magnanimity in uplifting disciples is unparalleled. Like sunlight, the Lord’s grace completely submerges the disciple. But, his ways of testing his disciples are very unique. He has a new tests each day. His tests are beyond imagination of people, beyond imagination of even Nature.  

In some instances, they may be delightful, in others there may be deep spiritual secrets embedded. In some stories, the ones that are visible to us, people wonder why he behaves strangely. 

Take Swamiji for instance. So many people make fun of him behind his back saying, “He has nothing better to do, he is crazy” . Some others say he’s doing it for humor, to make people laugh. But, a real devotee who can sit steadily and think carefully about the actions of the Guru can understand the great spiritual significance in those actions.

 Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 96 / Sri Gajanan Maharaj Life History - 96 🌹*
✍️. దాసగణు స్వామి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. 19వ అధ్యాయము - 4 🌻*

మీఇద్దరి ప్రవర్తనలూకూడా వేరుగా ఉన్నాయి, మరిమీరు ఆయనని మీసోదరుడు ఎలా అంటున్నారు ? దయచేసి నాకు విసదీకరించండి అని బాలా అన్నాడు. బాలా నువ్వు మంచిప్రశ్న వేసావు అని శ్రీమహారాజు అన్నారు. 

భగవంతుడుని చేరేందుకు మూడు మార్గాలు ఉన్నాయి. ఇవి అన్నీకూడా నిన్ను ఆత్మజ్ఞానం అనే ఊరుకి తీసుకు వెళతాయి. అవి వేరువేరుగా కనపడి చూసేవాళ్ళని కలవర పెడతాయి. శుభ్రంగా ఉండడం, పట్టుపంచ కట్టుకోవడం, ఎవరినీ ముట్టుకోకుండా ఉండడం రోజూ మూడుసార్లు పూజలు చేయడం, ఉపవాసం ఉండి నిష్టగా, క్రమశిక్షణగా విధులు పాటించడం వంటి వ్యవహారాలు కర్మమార్గానికి సంబంధించినవి. 

ఎవరయితే ఇవి పాటిస్తారో వాళ్ళే నిజమయిన జ్ఞానంఉన్న నిష్టాపరులు. ఈక్రమంలో ఏవిధంగా అయినా వక్రించినా, విశ్మరించినా కర్మమార్గంనుండి వంచితుడవుతాడు. ఈమార్గంలో అతను చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరినీ మాటలతో నైనా నొప్పించరాదు. 

భక్తిమార్గం ఎన్నుకున్న వారికి మనసు స్ఫటికంలా నిష్కల్మషంగా ఉండాలి. ఒక్కచెడు ఆలోచన ఛాయ వచ్చనా వారు భక్తిరహస్యం నుండి వంచితులవుతారు. క్షమ, ప్రేమ, నిరాడంబరత ఖచ్చితంగా తోడుగా ఉండాలి. అతనికి వేదశా స్త్రీలు వినడం, పూజించడం మీద నమ్మకంఉండి నిరంతరం హరినామస్మరణ చెయ్యాలి. ఇవి భక్తిమార్గానికి అవసరమయిన నియమాలు. వీటిని సాధనచేసిన వారు శ్రీహరిని కలుస్తారు. 

నిజానికి ఆత్మజ్ఞానానికి ఇది అత్యంత సులభమయిన మార్గం, కానీ ఆకాశం ఎలా అయితే మనకళ్ళకు దగ్గర ఉన్నట్టు కనిపిస్తుందో, ఇది పాటించడం, సాధనచెయ్యడం కర్మమార్గం కంటే కష్టమయినది. ఇప్పుడు యోగమార్గం గురించి విను: యోగమార్గం మిగిలిన రెండిటికంటే కూడా ఎక్కువగా ప్రచలితమైనది, కానీ ఇది మనలోనే ఇమిడిఉంది. 

యోగమార్గం సాధన చేస్తున్నవారికి బయటనుండి ఏదీ అవసరంలేదు. ప్రపంచంలో ఏమయితే ఉన్నాయో అవిఅన్నీ మనలోనే మనం చూడవచ్చు. అలాలోపల ఉన్నవాటి సహాయంతో మనం యోగమార్గాన్ని అనుసరించాలి. దీనికోసం రేచక, కుంభక ఆసనాలు గూర్చి తెలియడం అవసరం మరియు ఇద, పింగళ నాడులగూర్చి, ధౌతి, ముద్రాతతక్ గూర్చి జ్ఞానం అవసరం. 

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Gajanan Maharaj Life History - 96 🌹* 
✍️. Swamy Dasaganu 
📚. Prasad Bharadwaj

*🌻 Chapter 19 - part 4 🌻*

Shri Gajanan Maharaj said, Bala you have asked a good question. There are three paths to reach God. All of them take you to the ‘town’ of self realization. They appear to be different and so confuse the onlooker. Rituals of ‘Karma Marga’ are to keep clean, wear silk dhotis, not to touch anybody, offering of worship three times a day, fasting and observance of rituals in a strict, disciplined manner. 

One who observes these things is a real learned orthodox. Any deviation or omission in this discipline will deprive him of the ‘Karma Marga’. He has got to be careful while treading this path; he should not hurt others even by words. For those pursuing the ‘Bhakti Marga’ their mind should be crystal clear. 

Even a shadow of an unclean thought will deprive them of all the Bhakti rahasya. Compassion, love and modesty must be thier accompaniments. They should have faith in listening to scriptures and worship, and must continuously chant the name of Hari (God). These are the requirements of the ‘Bhakti Marga’ and those, who practice it, will meet Shri Hari. 

In fact it is the easiest way of self realization, but practising it is even more difficult than ‘Karma Marga’, like the sky which appears to be so close to our eyes. Now listen to the principles of the ‘Yoga Marga’. The spread of the ‘Yoga Marga’ is far bigger than the former two, but it is within us. The person practising ‘Yoga Marga’ requires no paraphernalia from the outside. 

Whatever is in the universe can be found within ourselves, and with the help of those things, within us, we should follow the ‘Yoga Marga’. For that purpose it is necessary to know the various Asanas namely ‘Rechak’, ‘Kumbhak’, the knowledge of ‘Ida’ and ‘Pingala’ veins, Dhouti and Mudra Tratak. 

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 68, 69 / Sri Lalitha Chaitanya Vijnanam - 68, 69 🌹*
*సహస్ర నామముల తత్వ విచారణ*
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ 
మూల మంత్రము : 
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀. పూర్తి శ్లోకము :*
*చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృతా*
*గేయచక్ర రథారూఢ మంత్రిణీ పరిసేవితా*

*🌻 68. 'చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృతా' 🌻*

చక్రరాజమను రథము నధిరోహించిన శ్రీదేవి యని, రథమునందామె చుట్టును సర్వాయుధములు పరివృతమై అలంకరింప బడినవని అర్థము.

శ్రీ చక్రమే రథము. అది చక్రరాజము, రథరాజము. చక్రమనగ తిరుగుచు త్రిప్పునది. రథమనగా ముందుకు సాగునది. అమ్మ,
సృష్టి చక్రమును త్రిప్పుచు జీవులనందు తిరుగాడ చేయుచున్నది. సర్వలోకములందు జీవుల కదలిక ఆమె కదలికయే. సృష్టిచక్రము త్రిప్పుచుండగ జీవులందు తిరుగాడుచుందురు. రథమునకు పురోగమనము తిరోగమనము గలవు. రథమందలి ఆయుధములన్నియు, సృష్టియందు దుష్ట శిక్షణకు, శిష్ట రక్షణకు యేర్పడి యున్నవి. 

అంతియే కాదు, సమస్తమైన ఆత్మజ్ఞాన ఆయుధములు కూడ అందున్నవి. యోగ సాధన లన్నియు గానుపోవు వున్నత స్థానము శ్రీ చక్రమే. శ్రీ చక్ర రథమును చేరినవాడు శుద్ధ విద్యయందు ప్రవేశించును. శుద్ధ విద్యయందు జగత్తును చైతన్యమయముగ చూచుట నియమము. 

అట్లు చూచినచో తనపై తనకు ఈశత్వము కలుగును. ఈశత్వమున చేరిన జీవుడు దానియందే సాధనా బలమున స్థిరబడినచో సదాశివుని పాదములను స్పృశించిన వాడగును. క్రమశః సదాశివత్వమును పొందును. అప్పుడు తానే బ్రహ్మమని తెలియును. విశ్వమంతా తానే నిండియున్నాడని తెలియును. అట్లు తెలియుటయే శుద్ధవిద్య. 

తెలియక పోవుట వలన భేదబుద్ధి కలుగును. భేదబుద్ధి అవిద్య, శ్రీచక్రము రథరాజమని కూడ తెలుపబడినది. ఈ రథమునకు ధ్వజము ఆనందము. దీనికి తొమ్మిది కోణములు కలవు. అవియే నవావరణములు. అమ్మ మరియొక రథము ఏడు కోణములతో నుండును. దానిని అమ్మ అధిష్ఠించినపుడు అమ్మ పేరు 'మంత్రిణి'. 

అమ్మకు మరియొక రథము కలదు. దానికి ఐదు కోణములు కలవు. దానిని అమ్మ అధిష్ఠించినపుడు అమ్మను 'ప్రాణి' అందురు. ఈ మూడు చక్రములు మూడు లోకముల వలె ప్రకాశించుచున్నవి. అందు ఉత్తమోత్తమమైనది. శ్రీచక్రమని తెలియవలెను. వీని వివరణములు
ముందు నామములతో యింకను తెలియబడును. 

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 68 🌹*
*1000 Names of Sri Lalitha Devi* 
✍️. Ravi Sarma 
📚. Prasad Bharadwaj

*68. Cakrarāja- rathārūḍha- sarvāyudha-pariṣkṛtā* *चक्रराज-रथारूढ-सर्वायुध-परिष्कृता (68)*

Cakrarāja is the chariot of Lalitāmbikā in which She travels along with all types of weapons. Weapons mean the ways of attaining suddhavidyā or pure knowledge which is called the knowledge of the Brahman.  

This chariot consists of nine tiers. There are other two chariots that accompany this Cakrarāja the details of which will be discussed in the next two nāma-s. This Cakrarāja is said to mean the Śrī Cakra, the place of Lalitāmbikā. Pariṣkṛtā means adorned.

A brief knowledge of Śrī Cakrā becomes a necessity to understand this nāma. 

Śrī Cakrā consists of nine partitions or angles broadly divided into five Śaktī cakra-s and four Śiva cakra-s. The triangles facing upwards are called Śiva cakra-s, and the triangles facing down are Śaktī cakra-s. Śrī Cakrā contains forty four triangles in which forty three goddesses (44th is Lalitai) and seventy nine yoginī-s (demi-goddesses) live.  

All the gods and goddesses are said to reside in Śrī Cakra and that is why it is said that one can perform pūja to any god/goddess in Śrī Cakra. The nāma 996 Śrī Cakrārāja nilayā confirms Her domicile in Śrī Cakra.

Cakrarāja also means the six cakra-s (mūlādhārā to ājña). Ratha means base or foundation. Arūḍha means control and sarvāyudha means pure knowledge which is called suddhavidyā. The six cakra-s form the foundation to attain pure knowledge through which mind can be controlled in the sixth cakra. 

The five psychic cakra-s represent the five basic elements and the ājña cakra represents mind. Therefore to control the basic elements and the mind, pure knowledge becomes essential.  

When cakra-s are controlled, siddhi-s are attained. When we discuss about suddhavidyā let us also know what Śiva Sutra (I.21) says. It says ‘śuddhavidyodayāccakreśatva siddhiḥ’.   

This means that only through suddhavidyā (pure knowledge), mastery can be attained over śakti-s. Śaktī-s here means the cakra-s. When one is able to attain mastery over the cakra-s, through the pure knowledge, he can attain the state of Śiva.  

State of Śiva means oneness with Śiva. In this stage except Śiva nothing exists. Possibly this could mean that he sees everything and everybody as Śiva. This stage is called oneness with universal consciousness.  

Suddhavidyā is possible only if māyā goes. Kṛṣṇa says in Bhagavad Gīta “all sacrifice of work culminates in transcendental knowledge”. The word transcendental means the knowledge of the Supreme. The ultimate meaning is that when mastery over the cakra-s and mind is attained, there is nothing one needs to do except to be with the Brahman always.

One has to really admire Vāc Devi-s about their knowledge of expressing the secrets of Self-realization in such a subtle way.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 69 / Sri Lalitha Chaitanya Vijnanam - 69 🌹*
*సహస్ర నామముల తత్వ విచారణ*
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ 
మూల మంత్రము : 
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀. పూర్తి శ్లోకము :*
*చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృతా*
*గేయచక్ర రథారూఢ మంత్రిణీ పరిసేవితా*

*🌻 69. 'గేయచక్ర రథారూఢ మంత్రిణీ పరిసేవితా' 🌻*

గేయ చక్రము అను రథము నధిరోహించిన శ్రీదేవి అని భావము.

శ్రీచక్రరాజము తొమ్మిది కోణములు లేక పర్వములు కలిగియుండును. అది చక్రరాజము, దాని తర్వాతి చక్రమే గేయచక్రము.

దాని కోణములు లేదా పర్వములు ఏడు అని తెలుపబడినవి. చక్రము నధిష్ఠించిన దేవత శ్యామల. ఈమె చుట్టును పరివేష్టితమై యుండు శక్తి మంత్రిణి. మంత్రిణి యనగా మంత్ర శక్త్యానుభవము. సర్వమంత్రముల అనుభవము. 

శ్యామలాదేవిని ఉపాసించినచో సర్వమంత్ర సిద్ధి కలుగునని తంత్రశాస్త్రము తెలుపుచున్నది. శ్రీ చక్రము పరదేవతకి సంబంధించినది కాగ, గేయచక్రము పూర్ణమైన నేను అను భావమును ఎరుగచేయును. బ్రహ్మమునే నేను అని తెలియుట పూర్ణమైన నేను భావము. దీనిని 'బ్రహ్మై వాహం' (బ్రహ్మ ఏవ అహం) అందురు.

అనగా పరతత్త్వ మున్నది, తా నున్నాడు. అదియే, తానుగ వున్నాడు అని తెలియుట. ఇది ఆత్మానుభవ స్థితి. ఇది పరాశక్తితో, బుద్ధిని అను సంధానము చేయుట వలన తెలియనగును. 

శ్రీ చక్ర స్థితియందు తాను పరతత్త్వమున ఇమిడిపోవును. గేయచక్ర స్థితియందు పరతత్త్వమే తానుగ నున్నట్లు యుండును. ఈ స్థితి తన యందలి ఏడు లోకముల స్వామిత్వమును ఎరిగిన స్థితి. అట్టివానిని యోగీశ్వరు డందురు.  

తొమ్మిది పర్వములను అధిష్ఠించిన స్థితి. యోగేశ్వర స్థితి. అమ్మ యోగేశ్వరి. ఆమెయే శ్రీకృష్ణుడగుటచే అతనిని యోగేశ్వరుడు అందురు. యోగీశ్వరులకు స్వామియే యోగేశ్వరుడు. శ్రీ లలిత, శ్రీకృష్ణుడు ఒకటియే అని పెద్దల అనుభవము. అది శ్రీ చక్రరాజ స్థితి. 

"లలిత స్కంధము, కృష్ణమూలము” అని భాగవతమున తెలుపబడినది. గేయచక్రము జీవుని ఈశ్వరస్థితి. పరమేశ్వరుడే జీవుల యందీశ్వరుడుగ నున్నాడు. ఈ స్థితి యోగీశ్వరుని స్థితి. ఈ స్థితి యందు అమ్మను 'శ్యామల' అందురు. 

శ్రీరాముడు శ్యామలమూర్తి యని, శ్రీకృష్ణుడు లలితామూర్తియని తెలుపుటలో రహస్యమేమన శ్రీరాముడు పరిపూర్ణ మానవుడని, శ్రీకృష్ణుడు పరతత్త్వమని తెలియజేయుట. గేయచక్రము సవితృమండల చక్రముకాగ, శ్రీచక్రము దానికిని ఆధారభూతమగు చక్రము.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 69 🌹*
*1000 Names of Sri Lalitha Devi* 
✍️. Ravi Sarma 
📚. Prasad Bharadwaj

*69. Geyacakra- rathārūḍha- mantriṇī-parisevitā* *गेयचक्र-रथारूढ-मन्त्रिणी-परिसेविता (69)*

In the previous nāma it is seen that two chariots always accompany the Cakrarāja chariot. Out of the two, the first one is being discussed here, which is called Geyacakra chariot.  

This is the chariot of Mantrinī Devi who is also called Śyamalā Devi, about whom we have discussed in nāma10. Mantrinī Devi who owns geycakra worships Her is the literal meaning. As Mantrinī is one of Her ministers, Mantrinī Devi holds Lalitai in high esteem and chooses to worship Her. Worshipping is different from respecting. 

We have seen that there are seventy nine yoginī-s in Śrī Cakrā. yoginī-s are the great worshippers of Lalitāmbikā. These yoginī-s are also called mantrinī-s (different from Mantrinī or Śyamalā Devi). They are the masters of Śrī Vidyā rituals. This nāma could possibly mean the Śrī Vidyā worship by these yoginī-s. Geya also means important. Geyacakra means important cakra, which is Śrī Cakra. 

 Those who meditate Her in Śrī Cakrā attain mantra siddhi easily. Such a person who attained siddhi is called mantrinī. She is worshipped by those who attained mantra siddhi of Pañcadaśī or ṣodaśī as these are the two main mantra-s of Lalitāmbikā. The importance of worshipping Śrī Cakrā is emphasized here. Human body is compared to Śrī Cakrā in many scriptures.  

The nine partitions of Śrī Cakrā are compared to nine parts of our body - the orifice in the crown cakra is head, ājña cakra is forehead, viśuddhi cakra is neck, anāhata cakra is heart, maṇipūra cakra is navel, the hip (possibly includes both svādhiṣṭhāna and mūlādhāra cakra-s) and thighs and the feet. It is pertinent to note that the divine energy enters our body through the orifice in the sahasrārā and excess energy if any is grounded through our feet.

Śiva Sūtra (II.3) talks about the secret of mantra-s. The illuminating “I” consciousness existing as an essential constituent of various mantra-s (like Pañcadaśī and ṣodaśī), whose essence is the knowledge of realizing the Brahman, is the secret of mantra. 

 Therefore mantra-s are not just the combination of letters, but the Śaktī Herself. Hence these letters are called Mātṛka (Mātṛka means coming from or belonging to a mother. Please refer nāma 1 Śrī Mātā, the Supreme Mother). In the initial stages of spirituality, chanting of mantra-s is considered essential. 

In this nāma, the importance of mantra and considering our own body as one with Śrī Cakra are emphasized. Considering our body as the one with Śrī Cakra means that She is not different from us, the main principle of Self-realization.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీమద్భగవద్గీత - 450 / Bhagavad-Gita - 450 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. 12వ అధ్యాయము -భక్తియోగము -06, 07 🌴*

06. యే తు సర్వాణి కర్మాణి మయి సన్న్యస్య మత్పతా: |
అనన్యేనైవ యోగేన మాం ధ్యాయన్తే ఉపాసతే ||

07. తేషామహం సముద్ధ ర్తా మృత్యుసంసారసాగరాత్ |
భవామి న చిరాత్పార్థ మయ్యావేశిచేతసామ్ ||

🌷. తాత్పర్యం : 
కాని ఓ పార్థా! సర్వకర్మలను నాకు అర్పించి అన్యచింతలేక నాకు భక్తులై, మనస్సును నా యందే లగ్నము చేసి సదా నన్ను ధ్యానించుచు, నా భక్తియుత సేవలో నన్ను అర్చించెడివారిని శీఘ్రమే జనన, మరణమను సంసారసాగరము నుండి ఉద్ధరింతును.

🌷. భాష్యము : 
పరమభాగ్యుశాలురైన భక్తులు శ్రీకృష్ణభగవానునిచే అతిశీఘ్రముగా భవసాగరము నుండి తరింపజేయబడుదురని ఇచ్చట స్పష్టముగా తెలుపబడినది.

 భగవానుడు అత్యంత ఘనుడని మరియు జీవుడు అతనికి సేవకుదనియు తెలిసికొనగలిగే జ్ఞానమునకు శుద్ధభక్తియోగమున మనుజుడు అరుదెంచును. శ్రీకృష్ణభగవానునికి సేవను గూర్చుటయే జీవుని నిజధర్మము. అతడట్లు చేయనిచో మాయను సేవింపవలసివచ్చును.

పూర్వము తెలుపబడినట్లు భక్తియోగము చేతనే శ్రీకృష్ణభగవానుఇ సంపూర్ణతత్త్వము అవగతము కాగలదు. కనుక ప్రతియొక్కరు పూర్ణముగా భక్తియుతులు కావలెను. కృష్ణుని పొందు నిమిత్తమై అతని యందే మనస్సును పూర్ణముగా లగ్నము చేయవలెను.

 కృష్ణుని కొరకే కర్మనొనరింపవలెను. కర్మయేదైనను సరియే దానిని కేవలము కృష్ణుని కొరకే ఒనరింపవలెను. భక్తియోగము ప్రమాణమదియే. దేవదేవుని సంతృప్తిపరచుటకన్నను అన్యమైనదేదియును భక్తుడు సాధింపగోరడు.

 శ్రీకృష్ణుని ప్రియమును గూర్చుటయే తన జీవితకార్యముగా భావించెడి అతడు ఆ భగవానుని సంతృప్తికొరకు కురుక్షేత్ర రణరంగమునందలి అర్జునుని వలె దేనినైనను త్యాగము చేయగలడు. అట్టి ఈ భక్తియోగము యొక్క పద్ధతి అత్యంత సులభమైనది. 

మనుజుడు తన కార్యములను ఒనరించును, అదే సమయమున హరే కృష్ణ హర కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే / హరే రామ హరే రామ రామ రామ హరే హరే యను మహామంత్రము జపించవలెను. 

అట్టి మహామంత్రోచ్చారణము అతనిని దేవదేవుడైన శ్రీకృష్ణుని వైపునకు ఆకర్షితుని చేయును.

ఆ విధముగా నియుక్తుడైన శుద్ధభక్తుని శీఘ్రమే భవసాగరము నుండి ఉద్ధరింతునని శ్రీకృష్ణుడు ఇచ్చట ప్రతిజ్ఞ చేయుచున్నాడు.

*🌹 Bhagavad-Gita as It is - 450 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

*🌴 Chapter 12 - Devotional Service - 06, 07 🌴*

06. ye tu sarvāṇi karmāṇi
mayi sannyasya mat-parāḥ
ananyenaiva yogena
māṁ dhyāyanta upāsate

07. teṣām ahaṁ samuddhartā
mṛtyu-saṁsāra-sāgarāt
bhavāmi na cirāt pārtha
mayy āveśita-cetasām

🌷 Translation : 
But those who worship Me, giving up all their activities unto Me and being devoted to Me without deviation, engaged in devotional service and always meditating upon Me, having fixed their minds upon Me, O son of Pṛthā – for them I am the swift deliverer from the ocean of birth and death.

🌹 Purport :
It is explicitly stated here that the devotees are very fortunate to be delivered very soon from material existence by the Lord. 

In pure devotional service one comes to the realization that God is great and that the individual soul is subordinate to Him. His duty is to render service to the Lord – and if he does not, then he will render service to māyā.

As stated before, the Supreme Lord can be appreciated only by devotional service. Therefore, one should be fully devoted. One should fix his mind fully on Kṛṣṇa in order to achieve Him. 

One should work only for Kṛṣṇa. It does not matter in what kind of work one engages, but that work should be done only for Kṛṣṇa. That is the standard of devotional service. 

The devotee does not desire any achievement other than pleasing the Supreme Personality of Godhead. His life’s mission is to please Kṛṣṇa, and he can sacrifice everything for Kṛṣṇa’s satisfaction, just as Arjuna did in the Battle of Kurukṣetra. 

The process is very simple: one can devote himself in his occupation and engage at the same time in chanting Hare Kṛṣṇa, Hare Kṛṣṇa, Kṛṣṇa Kṛṣṇa, Hare Hare/ Hare Rāma, Hare Rāma, Rāma Rāma, Hare Hare. 

Such transcendental chanting attracts the devotee to the Personality of Godhead.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

Join and Share 
🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹
https://t.me/SriMataChaitanyam

Join and Share చైతన్య విజ్ఞానం Chaitanya Vijnanam 
https://www.facebook.com/groups/465726374213849/

*🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram group 🌹*
https://t.me/ChaitanyaVijnanam

🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram Channel 🌹
https://t.me/Spiritual_Wisdom

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. గీతోపనిషత్తు - 66 🌹*
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

*🍀 4. పరిణామము -మృత్యువును దాటుటకు అనంతుడైన ఆదిశేషువు యోగవిద్య నందించెను. భగవంతుని ఆదేశము కూడ అందరును యోగులు కావలెననియె. కలియుగమున అజ్ఞానవశమై ఇతర మతము లేర్పడి, జీవునకు పునర్జన్మలు లేవని, ఒకే జన్మమని ప్రచారమున్నది. ఇది అజ్ఞానము. 🍀*

*📚. 4. జ్ఞానయోగము - 4 📚*

బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున |
తా న్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప || 5

సృష్టియందు జీవులకు పునర్జన్మ లుండునని, కొందరు వాటి నెరుగుదురని, కొందరెరుగరని ఒక సత్యమును భగవానుడు ప్రతిపాదించినాడు. తనకును, అర్జునునకు అనేక జన్మలు గడచినవని, తానన్నిటిని ఎరుగుదునని, అర్జునుడెరుగడని తెలుపుటలో పై సత్య మున్నది. జన్మలు గడచుచున్నను తానెవరో తెలిసియున్నవారు యోగులు, ఋషులు, సిద్ధులు. 

తెలియని వారు అజ్ఞానులు. అజ్ఞానులు మృత్యువుతో సమస్తమును మరతురు. యోగులు మృత్యువును దాటుట తెలిసినవారు. కనుక వారికన్ని జన్మలును జ్ఞప్తి యందుండును. వీరినే చిరంజీవులని కూడ అందురు. 

మృత్యువును దాటుటకు అనంతుడైన ఆదిశేషువు యోగవిద్య నందించెను. భగవంతుని ఆదేశము కూడ అందరును యోగులు కావలెననియె. కలియుగమున అజ్ఞానవశమై ఇతర మతము లేర్పడి, జీవునకు పునర్జన్మలు లేవని, ఒకే జన్మమని ప్రచారమున్నది. ఇది అజ్ఞానము. 

జీవుని స్వభావములో దైవీ ప్రకృతి ఏర్పడుటకు పరిణామ మార్గమొకటి కలదు. ఈ పరిణామ మార్గమున జీవులు పాశవిక ప్రవృత్తి నుండి మానవతా ప్రవృత్తిలోనికి పెరుగుదురు. అటు పైన దైవీ ప్రవృత్తిలోనికి పెరుగు సందర్భమున యోగవిద్యా ప్రవేశము కలుగును. యోగ విద్యయందు పరిపూర్ణత చెంది జీవుడు మృత్యువును దాటి అమరుడై భూమి మీద యుండును. 

అట్టి జీవుని భూసురులందురు. అట్టివారు బ్రహ్మోపాసన చేయుచు బ్రహ్మమును పొందుదురు. అనగా బ్రహ్మమే వారి రూపమున వుండును. వీరినే బ్రహ్మర్షులందురు. వీరు జీవులకు తరణోపాయము చూపించుచు సద్గురు పరంపరగ నేర్పడి యున్నారు. 

వశిష్ఠ అగస్త్యులట్టి వారు. శ్రీకృష్ణుడు అట్టి యోగీశ్వరుల గమ్యము. అతనికి సృష్ట్యాది నుండి జరుగుచున్న జీవుల కథ తెలిసియున్నది. అతడికి అర్జునుని యొక్క పూర్వజన్మలు తెలియుటలో ఆశ్చర్యము లేదు. సద్గురువులకు కూడ జీవుల పూర్వజన్మల అవగాహన యుండును. వాని ననుసరించియే వారు జీవులకు హితము కలిగించు చుందురు. ఇది యొక సత్యము.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 263 🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴* 
62. అధ్యాయము - 17

*🌻.సతీ వరప్రాప్తి - 2 🌻*

చిక్కని కాటుక కాంతి గల సతి స్ఫటికమువలె ప్రకాశించు దేహముగల శివుని సమీపములో చంద్రుని ప్రక్కన మేఘపంక్తి వలె భాసిల్లెను(20).అపుడా దాక్షాయణీ మిక్కిలి ప్రసన్నురాలై భక్త వత్సలుడగు శివునకు చేతులు జోడించి అనేక నమస్కారములను చేసి, ఆయనతో నిట్లనెను (21).

సతి ఇట్లు పలికెను -

దేవదేవా! మహాదేవ! ప్రభూ! జగత్పాలకా! నా తండ్రికి తెలుపుడు జేసి నన్ను యథావిధిగా వివాహమాడి స్వీకరించుము (22).

బ్రహ్మ ఇట్లు పలికెను -

భక్త వత్సలుడగు మహేశ్వరుడు సతీ దేవి యొక్క ఈ మాటను విని, ఆమెను ప్రేమతో చూచి 'అటులనే అగుగాక!'అని పలికెను (23). దాక్షాయణి కూడా శంభునకు నమస్కరించి భక్తితో విన్నవించి ఆజ్ఞను పొంది ప్రేమతో ఆనందముతో నిండిన మనస్సుగలదై తల్లి వద్దకు వెళ్లెను (24). 

శివుడు కూడా హిమవత్పర్వత మైదానములోని తన ఆశ్రమములో ప్రవేశించి, దాక్షాయణి వియోగముచే అతి కష్టముతో ధ్యానమును చేయ మొదలిడెను (25). వృషభధ్వజుడగు శంభుడు మనస్సును నియంత్రించుకొనెను. ఓ దేవర్షీ! ఆయన లౌకిక ప్రవృత్తి నాశ్రయించి, మనస్సులో నన్ను తలంచెను (26).

త్రిశూలి, మహేశ్వరుడు నగు హరుడు నన్ను స్మరించగా ఆయన యొక్క సిద్ధిచే ప్రేరితుడనై నేను ఆయన ముందు వెంటనే నిలబడితిని (27). వత్సా! శివుడు సతీవియోగముతో హిమవత్పర్వతముయొక్క మైదానములో ఉండెను. నేను సరస్వతితో గూడి అచటకు చేరుకుంటిని (28). ఓ దేవర్షీ! సతీదేవి యందు దృఢమైన ప్రేమగల ఆ శంభు ప్రభుడు ఉత్కంఠతో గూడి యుండెను సరస్వతితో గూడి వచ్చిన నన్ను చూచి ఆయన ఇట్లు పలికెను (29).

శంభుడు ఇట్లు పలికెను -

హే బ్రహ్మన్‌! నేను వివాహము చేసుకొనగోరి స్వార్ధ పరుడనైనాను. ఇప్పుడు నాకు స్వార్థచించనయే నా స్వభావమన్నట్లు తోచుచున్నది (30). దక్షుని కుమార్తె యగు సతి నన్ను భక్తితో ఆరాధించెను. ఆమె చేసిన నందా వ్రతము యొక్క ప్రభావముచే ఆమెకు నేను వరమునిచ్చితిని (31). 

హే బ్రహ్మన్‌! 'నాకు భర్తవు కమ్ము' అని ఆమె వరమును నానుండి కోరెను. నేను ఎంతయూ సంతసించి యుంటిని. 'నా భర్యవు కమ్ము' అని అంటిని (32). అపుడు దక్షపుత్రియగు ఆ సతీ దేవి నాతో నిట్లనెను. హే జగత్ర్పభో! నా తండ్రికి నివేదించి నన్ను స్వీకరించుము (33).

హే బ్రహ్మన్‌! ఆమె భక్తిచే సంతసిల్లిన నేను దానికి కూడా అంగీకరించితిని. ఓ బ్రహ్మా! ఆమె తన భవనమునకు తల్లి వద్దకు వెళ్లెను. నేనిచటకు వచ్చితిని (34). కావున నీవు నా ఆజ్ఞచే దక్షుని గృహమునకు వెళ్లుము. దక్షుడు నాకు ఆ కన్యను వివాహములో శీఘ్రముగా ఇచ్చు తీరున దక్షునకు నచ్చ జెప్పుము (35). నాకు ఈ సతీవియోగము నుండి విముక్తి కలుగు ఉపాయము ననుష్ఠింపుము. నీవు అన్ని విద్యల యందు దిట్టవు. ఆ దక్షని ఒప్పించుము (36).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 LIGHT ON THE PATH - 20 🌹*
*🍀 For those WHO DESIRE TO ENTER WITHIN - For DISCIPLES 🍀*
✍️. ANNIE BESANT and LEADBEATER
📚. Prasad Bharadwaj

CHAPTER 3 - THE FIRST RULE
*🌻 Kill out. ... - 3 🌻*

82. I can testify that the method of substitution works very much better, for I have tried both. It is a sort of moral ju jutsu whereby you employ the force of the hostile power to help you. You do not so much attack the foe as concentrate all your attention on the opposite virtue. If for example, a man is inclined to be readily upset and disturbed, he should not fight hard against that, but instead should think constantly of calmness, of peace and philosophy.

Presently that thought will become established by habit, and he will find that the old worry and lack of calmness have passed away without his making a desperate fight. If he surrounds himself with thought-forms such as “Do not be irritable,” and so on, they are still of the colour of irritability, and they react undesirably on him. But if he thinks strongly, “Be calm, be gentle, be peaceful,” he sets up vibrations appropriate to and productive of peace and harmony. 

We do not want to set one vice to fight another vice, but we want to ignore all these things and work up the opposite virtue; by doing that the effect will be just as good and we shall achieve it with far less trouble.

83. We say: “Kill out desire,” but not, “Kill out emotion.”1 The higher emotions must be encouraged always, and the stronger they are the better. Especially is this true of love and devotion, which one should deliberately cultivate. 

When a man feels a great rush of such an emotion as these his aura expands: his astral body becomes perhaps ten times its normal size in the case of the ordinary person, and much more than that when the man really knows how to use his higher vehicles. When the great paroxysm of feeling is over the aura contracts again, but not exactly to what it was before; having been much stretched it remains at least a little larger than before. 

The first effect of the expansion is a rarefaction of the astral body, but it very speedily draws in more astral matter to fill the larger space, so as to make it up to about its normal density.

85. The astral body is definitely needed in order that by means of it one may be able to sympathize with people, and also because of its function as a reflector of the buddhic body. In the case of a developed person there is no colour in his astral body except what is mirrored from the higher planes; it only reflects and shows the most delicate tints of colour.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 151 🌹*
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. నారద మహర్షి - 25 🌻*

ఆ తరువాత ధర్మరాజు స్వర్గానికి వెళ్ళినప్పుడు, ఆయనకు మిత్రులకంటే శత్రువులే ముందర కనబడ్డారు. అప్పుడు నారదుని స్మరించగానే, ఆయ్న ప్రత్యక్షమై, “ఓ ధర్మరాజా! నువ్వు ఒక చిన్న విషయం తెలుసుకోవాలి. ఇక్కడ వారు నీకు శత్రువులుకారు. ఇక్కడ దుఃఖపడ్డావంటే అది నీ అజ్ఞానమే. ఇది ఇంకా నీలో ఉండటంచేతనే వీళ్ళు నీకిలా కనబడుతున్నారు. 

భూలోకంలో ఉన్న శత్రుభావం ఆ శరీరాలు పోగానే పోతుంది. ఆ శరీరాలకు, ఆ అహంకారాలు మాత్రమే శత్రువులుకాని, జీవాత్మకు శతృత్వం ఉండదు. అది అక్కడతోతే నశిస్తుంది” అన్నాడు.

రామాయణంలోకూడా రాముడు ఈ మాటను లక్షమణుడికి చెప్పాడు. రావణుడు మృతుడైన తరువాత, రాముడు లక్ష్మణుడితో, “లక్ష్మణా! ఆయన శరీరాన్ని సగౌరవంగా లంకకు పంపించే ఏర్పాట్లు చెయ్యి. ఆయన గొప్ప పండితుడు, బరాహ్మణుడు. వేదవేదాగములు చదువుకున్నవాడు. మహాతపస్వి. సాక్షాత్తు ఈశ్వరుణ్ణి మెప్పించి ప్రసన్నుణ్ణీచేసుకుని దర్శనం చేసుకున్న మహా వరప్రసాది. ఆయాన్ సామాన్యుడు కాడు. మనకంటే అనేక విధాల పూజ్యుడు” అన్నాడు. 

అప్పుడు లక్ష్మణుడు ఆయనతో, “శ్రీరామచంద్ర ప్రభూ! ఆయన శరీరాన్ని సగౌరవంగా లంకకౌ పంపించమన్నావు! ఆయన మనకు శత్రువు. మనను అవమానించి బాధించాడు కదా! అటువంటివాడిని నేను ఎలా సగౌరవంగా పంపుతాను?” అన్నాడు. 

అందుకు రాముడు, “శత్రుత్వాలు మృత్యువు తోటే పోతాయి. శత్రుత్వం ఇద్దరిమధ్యన ఉన్నప్పుడు, ఇద్దరూ మృతి చెందితేనే శతృత్వంపోతుందని అనుకోరాదు. వాళ్ళలో ఒక్కళ్ళు చనిపోయినా శతృత్వం పోయినట్లే! ఆ ఇద్దరిలో బ్రతికిఉన్నవాడి మనస్సులో పోయిన వాడి యడల శతృత్వం ఉండకూడదు. 

శతృవు నశించిన తరువాత, శతృత్వం నీ ఒక్కడి హృదయంలోనే ఉండటంచేత అది నీకే నరకహేతువు అవుతుంది. ద్వేషించతగిన వస్తువు నశించింది. ద్వేషం ఆ తరువాతకూడా ఇంకా అతడిలో ఉంటే, అది నరకహేతువు. 

కాబట్టి ఆ దృష్టితో చూస్తే రావణడు మనకు శత్రువు కానేరడు. ఆయన ఈ దేహాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. కాబట్టి శత్రువేలేడు మనకు. ప్రస్తుతం, పూజ్యుడైన బ్రాహ్మణ రూపంలో సగౌరవంగా జాగ్రత్తగా ఆయనను పంపించు” అన్నాడు.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శివగీత - 105 / The Siva-Gita - 105 🌹*
 *🌴. పరమేశ్వరుడు - శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. 🌴*
📚. ప్రసాద్ భరద్వాజ 

అధ్యాయము 14
*🌻. పంచ కోశో పాసన - 1 🌻*

శ్రీరామ ఉవాచ :-
భగవన్ ! యదితే రూపం - సచ్చిదానంద విగ్రహమ్,
నిష్కలం నిష్క్రియం శాంతం -నిరవధ్యం నిరంజనమ్. 1
సర్వ ధర్మ విహీనం చ - మనో వాచామగో చర మ్,
సర్వ్యాపిన మాత్మాన - మీక్షతే సర్వత స్థ్సితమ్ 2
ఆత్మ విద్యాత పోమూలం - తద్బ్ర హ్మో పనిషత్పరమ్,
అమూర్తం సర్వ భూతాత్మా - కారం కారణ కారణమ్ 3
యత్త దదేశ్య(?) మగ్రాహ్యం - తద్గ్రాహ్యం వా కధం భవేత్,
అత్రో పాయ మజా వాన - స్తేన భిన్నోస్మి శంకర ! 4
శృణు రామ ! ప్రవక్ష్యామి - తత్రో పాయం మహా భుజ !,
సగుణో పాస నాభిస్తు - చిత్తై కాగ్ర్యం విధాయచ. 5

శ్రీరాముడు ప్రశ్నించు చున్నాడు: ఓ భగవంతుడా! జ్ఞానానంద మాయమై ఆశములు లేక క్రియలు లేక దోషములు లేక శాంతమై సామాన్య ధర్మ హీనమై వాచామ గోచరమై సర్వ 
వయాపియై యుండి ఆత్మ విద్యాత పంబులకు మొదల్కొని బ్రహ్మోపనిషత్తుల కంటెను పరంబైన అమూర్తమైన సమస్త భూత స్వరూపంబయ్యు నిట్టిదని నిరూపించుటకును, గ్రహించు టకును, వీలు లేని దైన యెడల దానిని తెల్సి కొనుట కెట్లు సాధ్య పడును? ఉపాయమేమిటో తెలియక ఖిన్నుడ నైతిని ( ఉపాయము చెప్పుము). 

శ్రీ భాగావాను ఉవాచ! ( శివుడు ఆదేశించు చున్నాడు) రామా ! ఉపాయమును వివరించెదను వినుము. సగుణో పాసనము చేతనే మొట్ట మొదట చిత్తై కాగ్రతను నేర్చి స్తూలారుంధతీ న్యాయమున పిదప వాని యందు చిత్తమును ప్రవర్తింప చేయవలెను. 

 (స్తూలారుందతి న్యాయమనగా ప్రక్కనున్న నేదో ఒక గొప్ప నక్షత్రమును మొదట చూపి పిదప క్రమముగా నిజమైన సూక్ష్మముగా నున్న అరుంధతీ నక్షత్రమును చూపుత ) అట్లుగానే నిర్గుణ పరబ్రహ్మను తెలిసి కొనుటకు ముందు సగుణో పాసనము చేత చిత్తై కాగ్రత మాని నిర్గుణుడను, పూర్వోక్త లక్షణ లక్షితుండనగు నన్ను తెల్సి కొనవలయును.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹  

*🌹 The Siva-Gita - 105 🌹*
*🌴. Dialogue between Rama and Lord Siva 🌴*
✍️ Ayala somayajula. 
📚. Prasad Bharadwaj

Chapter 14
*🌻 Panchakoshopasana - 1 🌻*

Sri Rama said: O Bhagawan! How is it possible to realize the Atman (self) which is pure knowledge & bliss, which is partless, which is blemishless, which is serene, which is beyond all dharmas, which is beyond all senses, which is all pervading, which is even beyond the limits of upanishads, and which is formless? Sri Bhagawan said: Rama! Listen to the methods of realizing such Atman.  

By doing Sagunopasana (worship of god in form), one should learn concentration. Then as like as Sthoolarundhati viewing rule, one should establish himself in the inward concentration and realize the Nirguna Brahman who is myself only having the qualities stated by you earlier.

N.B:­ Sthoolarundhati viewing means, in Hindu marriages, the couple has to see the Arundhati star in the sky. But that star remains so small that at a glance it doesn't become visible. 

So, the priest first shows the couple a brightly visible star calling it as Arundhati and later tells them the original Arundhati star's location. So, this way one has to focus on God with a form, and gain the necessary concentration, purification of mind etc.  

qualities and then only one can become inwardly focussed and realize the
Brahman which is the Atman itself.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 Seeds Of Consciousness - 214 🌹*
✍️ Nisargadatta Maharaj 
 Nisargadatta Gita 
📚. Prasad Bharadwaj

63. Before you occurred to yourself as 'I am' you were the highest: Parabrahman. Now, until the impurity of 'I am the body' disappears stay put in the 'I am' quietude.

You will have to apply your mind and go back to the moment when you first came to know that 'you are' or the 'I am' appeared on you. Now just wait here prior to this what were you? Go back further prior to conception what or where you were. Nothing! That's it! You were the highest, the Absolute or the Parabrahman. 

It's only this total absence that doesn't require anything, is formless, free and above all. On this stateless state appeared the 'I am' and it caught hold of the body and believed 'I am the body'. 

This very idea is an impurity, do away with it and abide in the stillness and silence of the pure 'I am' without words, only then do you stand a chance of reaching your true identity.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 90 🌹*
✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ 

*🌻. భగవంతుని 7వ పాత్ర - సాధు పురుషులు, మహాపురుషులు, సత్పురుషులు, ముముక్షువులు - 12 🌻*

384. ముడు-నాలుగు భూమికల మధ్య :

ఆధ్యాత్మిక యానములో మూడు నాలుగు భూమికల మధ్యనున్న స్థితి మహా ప్రమాదకరమైనది.అది సాధకులను మంత్రముగ్దులను గావించు ఆకర్షణలతో నిండియుండును. దీనిని ముకామ్-ఏ-హైరత్ అందురు.

చాలామంది ఈ ప్రమాద పరిస్థితినుండి దాటి ముందుకు నాల్గవ భూమికకు పోవుదురు.

సాధకుడు ఇచ్చట ఒకసారి ఆగినచో, అతడు ఆ స్థితినుండి బయటపడుట దుస్సాధ్యము. ఇతడు ఈ స్థితి నుండి తప్పించుకొని బయటపడి ముందుకు వెళ్లని యడల అతని ప్రగతి అంతటితో నిలిచిపోవును. కొన్ని సమయములందు, రోజుల తరబడి లేక, నెలల తరబడి లేక, సంవత్సరముల తరబడికూడా అతడు అట్లే నిలిచిపోగలడు.

ఈ స్థితియందు చిక్కుకున్న సాధకుడు ముందుకు పోలేడు, వెనుకకు రాలేడు. అతడు భౌతికమందు గానీ సూక్ష్మమందుగాని ఎరుక లేకుండును.

అతను స్పృహలేని వాడను చెప్పుటకు వీలులేదు.ఎందుచేతననగా, అతడు చిక్కుకొనియున్న అసమ్మోహిత స్థితియందు స్పృహకలవాడైవున్నాడు కాన జీవన్మృతుడై ఉన్నాడు.

సాధకుడు ఈ స్థితియందు చిక్కుకొని ప్రారంభములో అతడు శారీరకంగా ఏస్థితియందుఉండునో. అనగా ఏ భంగిమలో ఉండునో అదే భంగిమలో ప్రతిమవలె అట్లే ఉండిపోవును. ఆ విధముగా కన్పించిననూ వాస్తవంగా సామాన్యుని కంటే ఉత్సాహవంతుడై యుండును.

ఈ స్థితి యందున్నవాడు బయటపడవలెనన్నచో అతనికి మరణమైననూ సంభవించవలెను. లేదా ఏ సద్గురువు యొక్క సహాయమైనను కావలెను. అప్ప్పటి వరకూ అతడు అట్లే యుండును.

ఈతనిని సద్గురువు వెనుకకు మూడవ భూమికకు తీసుకుని పొవును, లేదా ముందుకు నాలుగవ భూమికకు త్రోసివేయును.

చాలా అరుదుగా ఈ స్థితియందున్న సాధకుడు భగవదనుగ్రహము వలన, ప్రమాద రూపములో 5వ భూమికకు 6వ భూమికకు మధ్య ఇదేమాదిరి వాసీకరణ స్ధితిలోనికి ముందుకు లాగబడును.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 53 / Sri Vishnu Sahasra Namavali - 53 🌹*
*నామము - భావము*
📚. ప్రసాద్ భరద్వాజ 

*🌻. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 🌻*

*🌻 53. ఉత్తరో గోపతిర్గోప్తా జ్ఞానగమ్యః పురాతనః |*
*శరీర భూతభృద్ భోక్తా కపీంద్రో భూరిదక్షిణః ‖ 53 ‖*

*చిత్త నక్షత్ర ప్రధమ పాద శ్లోకం*

🍀. 494) ఉత్తర: - 
అందరికంటెను అధికుడై, ఉత్తముడైనవాడు.

🍀. గోపతి: - 
గోవులను పాలించువాడు.

🍀. గోప్తా - 
సర్వులను సంరక్షించువాడు.

🍀. జ్ఞానగమ్య: - 
జ్ఞానము చేతనే తెలియబడినవాడు.

🍀. పురాతన: - 
సృష్టికి పూర్వమే వున్నవాడు.

🍀. శరీరభూతభృత్ - 
శరీరముల నుత్పన్నము చేయు పంచభూతములను పోషించువాడు.

🍀. భోక్తా - 
అనుభవించువాడు.

🍀. కపీంద్ర: - 
వానరులకు ప్రభువైనవాడు.

🍀. 502) భూరిదక్షిణ: - 
యజ్ఞ సమయములలో విశేషముగా దక్షిణ లిచ్చువాడు.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 Vishnu Sahasra Namavali - 53🌹*
*Name - Meaning*
📚 Prasad Bharadwaj

*🌻 OM NARAYANAYA VIDMAHE VASUDEVAYA DHIMAHI । TANNO VISHNU PRACHODAYAT ॥ 🌻*

*🌻 53. uttarō gōpatirgōptā jñānagamyaḥ purātanaḥ |*
*śarīrabhūtabhṛdbhōktā kapīndrō bhūridakṣiṇaḥ || 53 ||*

🌻 Uttaraḥ: 
One who is Uttirna or liberated from Samsara.

🌻 Gōpatiḥ: 
Krishna who tends the cattle in the form of a Gopa. One who is the master of the earth.

🌻 Gōptā: 
One who is the protector of all beings.

🌻 Jñānagamyaḥ: 
The Lord cannot be known through Karma or a combination of Karma and Jyana.

🌻 Purātanaḥ: 
One who is not limited by time and who existed before anything else.

🌻 Śarīrabhūtabhṛd: 
One who is the master of the five Bhutas (elements) of which the body is made.

🌻 Bhōktā: 
One who protects. Or one who is the enjoyer of infinite bliss.

🌻 Kapīndraḥ: 
Kapi means Varah (boar). The word means, the Lord who is Indra and also one who manifested as Varaha or the Boar in one of the incarnations. Or it signifies His Rama incarnation in which He played the role of the master of the monkeys.

🌻 Bhūridakṣiṇaḥ: 
One to whom numerous Dakshinas or votive offerings are made in Yajnas.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

Join and Share
*🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram group 🌹*
https://t.me/ChaitanyaVijnanam
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram Channel 🌹
https://t.me/Spiritual_Wisdom
Join and Share 
🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹
https://t.me/SriMataChaitanyam
JOIN, SHARE విష్ణు సహస్రనామ స్తోత్రము / Vishnu Sahasranama group. 
https://t.me/vishnusahasra
Like and Share 
https://www.facebook.com/విష్ణు-సహస్ర-నామ-తత్వ-విచారణ-Vishnu-Sahasranama-111069880767259/
🌹. దత్త చైతన్యము Datta Chaitanya 🌹
https://t.me/joinchat/Aug7pkulz9hgXzvrPfoVaA
🌹 చైతన్య విజ్ఞానం Chaitanya Vijnanam 🌹 
https://www.facebook.com/groups/465726374213849/
JOIN 🌹. SEEDS OF CONSCIOUSNESS 🌹
https://t.me/Seeds_Of_Consciousness

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹