భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 151


🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 151 🌹

🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ


🌻. నారద మహర్షి - 25
🌻

ఆ తరువాత ధర్మరాజు స్వర్గానికి వెళ్ళినప్పుడు, ఆయనకు మిత్రులకంటే శత్రువులే ముందర కనబడ్డారు. అప్పుడు నారదుని స్మరించగానే, ఆయ్న ప్రత్యక్షమై, “ఓ ధర్మరాజా! నువ్వు ఒక చిన్న విషయం తెలుసుకోవాలి. ఇక్కడ వారు నీకు శత్రువులుకారు. ఇక్కడ దుఃఖపడ్డావంటే అది నీ అజ్ఞానమే. ఇది ఇంకా నీలో ఉండటంచేతనే వీళ్ళు నీకిలా కనబడుతున్నారు.

భూలోకంలో ఉన్న శత్రుభావం ఆ శరీరాలు పోగానే పోతుంది. ఆ శరీరాలకు, ఆ అహంకారాలు మాత్రమే శత్రువులుకాని, జీవాత్మకు శతృత్వం ఉండదు. అది అక్కడతోతే నశిస్తుంది” అన్నాడు.

రామాయణంలోకూడా రాముడు ఈ మాటను లక్షమణుడికి చెప్పాడు. రావణుడు మృతుడైన తరువాత, రాముడు లక్ష్మణుడితో, “లక్ష్మణా! ఆయన శరీరాన్ని సగౌరవంగా లంకకు పంపించే ఏర్పాట్లు చెయ్యి. ఆయన గొప్ప పండితుడు, బరాహ్మణుడు. వేదవేదాగములు చదువుకున్నవాడు. మహాతపస్వి. సాక్షాత్తు ఈశ్వరుణ్ణి మెప్పించి ప్రసన్నుణ్ణీచేసుకుని దర్శనం చేసుకున్న మహా వరప్రసాది. ఆయాన్ సామాన్యుడు కాడు. మనకంటే అనేక విధాల పూజ్యుడు” అన్నాడు.

అప్పుడు లక్ష్మణుడు ఆయనతో, “శ్రీరామచంద్ర ప్రభూ! ఆయన శరీరాన్ని సగౌరవంగా లంకకౌ పంపించమన్నావు! ఆయన మనకు శత్రువు. మనను అవమానించి బాధించాడు కదా! అటువంటివాడిని నేను ఎలా సగౌరవంగా పంపుతాను?” అన్నాడు.

అందుకు రాముడు, “శత్రుత్వాలు మృత్యువు తోటే పోతాయి. శత్రుత్వం ఇద్దరిమధ్యన ఉన్నప్పుడు, ఇద్దరూ మృతి చెందితేనే శతృత్వంపోతుందని అనుకోరాదు. వాళ్ళలో ఒక్కళ్ళు చనిపోయినా శతృత్వం పోయినట్లే! ఆ ఇద్దరిలో బ్రతికిఉన్నవాడి మనస్సులో పోయిన వాడి యడల శతృత్వం ఉండకూడదు.

శతృవు నశించిన తరువాత, శతృత్వం నీ ఒక్కడి హృదయంలోనే ఉండటంచేత అది నీకే నరకహేతువు అవుతుంది. ద్వేషించతగిన వస్తువు నశించింది. ద్వేషం ఆ తరువాతకూడా ఇంకా అతడిలో ఉంటే, అది నరకహేతువు.

కాబట్టి ఆ దృష్టితో చూస్తే రావణడు మనకు శత్రువు కానేరడు. ఆయన ఈ దేహాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. కాబట్టి శత్రువేలేడు మనకు. ప్రస్తుతం, పూజ్యుడైన బ్రాహ్మణ రూపంలో సగౌరవంగా జాగ్రత్తగా ఆయనను పంపించు” అన్నాడు.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


03 Nov 2020

No comments:

Post a Comment