🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 90 🌹
✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. భగవంతుని 7వ పాత్ర - సాధు పురుషులు, మహాపురుషులు, సత్పురుషులు, ముముక్షువులు - 12 🌻
384. ముడు-నాలుగు భూమికల మధ్య :
ఆధ్యాత్మిక యానములో మూడు నాలుగు భూమికల మధ్యనున్న స్థితి మహా ప్రమాదకరమైనది.అది సాధకులను మంత్రముగ్దులను గావించు ఆకర్షణలతో నిండియుండును. దీనిని ముకామ్-ఏ-హైరత్ అందురు.
చాలామంది ఈ ప్రమాద పరిస్థితినుండి దాటి ముందుకు నాల్గవ భూమికకు పోవుదురు.
సాధకుడు ఇచ్చట ఒకసారి ఆగినచో, అతడు ఆ స్థితినుండి బయటపడుట దుస్సాధ్యము. ఇతడు ఈ స్థితి నుండి తప్పించుకొని బయటపడి ముందుకు వెళ్లని యడల అతని ప్రగతి అంతటితో నిలిచిపోవును. కొన్ని సమయములందు, రోజుల తరబడి లేక, నెలల తరబడి లేక, సంవత్సరముల తరబడికూడా అతడు అట్లే నిలిచిపోగలడు.
ఈ స్థితియందు చిక్కుకున్న సాధకుడు ముందుకు పోలేడు, వెనుకకు రాలేడు. అతడు భౌతికమందు గానీ సూక్ష్మమందుగాని ఎరుక లేకుండును.
అతను స్పృహలేని వాడను చెప్పుటకు వీలులేదు.ఎందుచేతననగా, అతడు చిక్కుకొనియున్న అసమ్మోహిత స్థితియందు స్పృహకలవాడైవున్నాడు కాన జీవన్మృతుడై ఉన్నాడు.
సాధకుడు ఈ స్థితియందు చిక్కుకొని ప్రారంభములో అతడు శారీరకంగా ఏస్థితియందుఉండునో. అనగా ఏ భంగిమలో ఉండునో అదే భంగిమలో ప్రతిమవలె అట్లే ఉండిపోవును. ఆ విధముగా కన్పించిననూ వాస్తవంగా సామాన్యుని కంటే ఉత్సాహవంతుడై యుండును.
ఈ స్థితి యందున్నవాడు బయటపడవలెనన్నచో అతనికి మరణమైననూ సంభవించవలెను. లేదా ఏ సద్గురువు యొక్క సహాయమైనను కావలెను. అప్ప్పటి వరకూ అతడు అట్లే యుండును.
ఈతనిని సద్గురువు వెనుకకు మూడవ భూమికకు తీసుకుని పొవును, లేదా ముందుకు నాలుగవ భూమికకు త్రోసివేయును.
చాలా అరుదుగా ఈ స్థితియందున్న సాధకుడు భగవదనుగ్రహము వలన, ప్రమాద రూపములో 5వ భూమికకు 6వ భూమికకు మధ్య ఇదేమాదిరి వాసీకరణ స్ధితిలోనికి ముందుకు లాగబడును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
03 Nov 2020
No comments:
Post a Comment