1) 🌹 02, NOVEMBER 2023 THURSDAY గురువారం, బృహస్పతి వాసరే, నిత్య పంచాంగము Daily Panchangam🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 451 / Bhagavad-Gita - 451 🌹
🌴. 11వ అధ్యాయము - విశ్వరూప సందర్శన యోగం - 37 / Chapter 11 - Viswaroopa Sandarsana Yoga - 37 🌴
🌹. శ్రీ శివ మహా పురాణము - 807 / Sri Siva Maha Purana - 807 🌹
🌻. పాతివ్రత్య భంగము - 5 / Outraging the modesty of Vṛndā - 5 🌻
3) 🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 64 / Osho Daily Meditations - 64 🌹
🍀 64. ప్రామాణికత / 64. AUTHENTICITY 🍀
4) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 497, 498 / Sri Lalitha Chaitanya Vijnanam - 497, 498 🌹
🌻 497. 'వజ్రాదికాయుధోపేత’, 498. 'డామర్యాదిబిరావృతా' / 497. vajradikayudhopeta, 498. dayaryadibhiravruta 🌻
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 02, నవంబరు, NOVEMBER 2023 పంచాంగము - Panchangam 🌹*
*శుభ గురువారం, బృహస్పతి వాసరే, Thursday*
*మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ*
*🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు 🌻*
*🍀. శ్రీ దత్తాత్రేయ సహస్రనామ స్తోత్రం - 27 🍀*
*53. మూత్రస్పర్శో మలస్పర్శోజాతిహీనః సుజాతికః |*
*అభక్ష్యభక్షో నిర్భక్షో జగద్వందితదేహవాన్*
*54. భూషణో దూషణసమః కాలాకాలో దయానిధిః |*
*బాలప్రియో బాలరుచిర్బాలవానతిబాలకః*
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నేటి సూక్తి : రెండు దశలు - యోగానుభూతిలో రెండు దశలున్నాయి. సాధకుడు బయటకు యితరుల వలెనే ప్రవర్తిస్తూ వున్నా లోపల ఏ వృత్తులూ లేక యుండెడి మౌనస్థితి ఒకదశ, లోపల నూతన చేతన యొకటి ప్రబుద్ధమై, జ్ఞానం, ఆనందం, ప్రేమ మొదలైన ఆధ్యాత్మిక అనుభవాలతో కూడిన అంతః ప్రవృత్తులున్న సమయంలో కూడా ఆ మౌనస్థితికి భంగం కలుగని దశ రెండవది. సాధకుల అంతశ్చేతనా వికాసానికి ఈ రెండూ కావలసినవే. 🍀*
🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్,
శరద్ ఋతువు, దక్షిణాయణం,
ఆశ్వీయుజ మాసం
తిథి: కృష్ణ పంచమి 21:53:16
వరకు తదుపరి కృష్ణ షష్టి
నక్షత్రం: ఆర్ద్ర 29:58:16 వరకు
తదుపరి పునర్వసు
యోగం: శివ 13:12:16 వరకు
తదుపరి సిధ్ధ
కరణం: కౌలవ 09:33:11 వరకు
వర్జ్యం: 13:29:21 - 15:10:45
దుర్ముహూర్తం: 10:04:33 - 10:50:32
మరియు 14:40:26 - 15:26:24
రాహు కాలం: 13:25:43 - 14:51:55
గుళిక కాలం: 09:07:05 - 10:33:17
యమ గండం: 06:14:40 - 07:40:52
అభిజిత్ ముహూర్తం: 11:37 - 12:21
అమృత కాలం: 19:24:15 - 21:05:39
మరియు 29:22:00 - 31:06:00
సూర్యోదయం: 06:14:40
సూర్యాస్తమయం: 17:44:20
చంద్రోదయం: 21:35:44
చంద్రాస్తమయం: 10:27:27
సూర్య సంచార రాశి: తుల
చంద్ర సంచార రాశి: జెమిని
యోగాలు: కాల యోగం - అవమానం
29:58:16 వరకు తదుపరి సిద్ది యోగం
- కార్య సిధ్ధి , ధన ప్రాప్తి
దిశ శూల: దక్షిణం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీమద్భగవద్గీత - 451 / Bhagavad-Gita - 451 🌹*
*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*
*🌴. 11వ అధ్యాయము - విశ్వరూప సందర్శన యోగం - 37 🌴*
*37. కస్మాచ్చ తే న నమేరన్మహాత్మన్ గరీయ సే బ్రహ్మణోప్యాథికర్త్రే |*
*అనన్త దేవేశ జగన్నివాస త్వమక్షరం సదసత్తత్పరం యత్ ||*
*🌷. తాత్పర్యం : ఓ మహాత్మా! బ్రహ్మదేవుని కంటేను ఘనమైనవాడా! నీవే ఆది సృష్టికర్తవు. అట్టి నీకు వారెందులకు నమస్సులు అర్పింపరు? ఓ అనంతా! దేవదేవా! జగన్నివాసా! నీవు అక్షయమగు మూలమువు, సర్వకారణకారణుడవు, ఈ భౌతికసృష్టికి అతీతుడవు.*
*🌷. భాష్యము : శ్రీకృష్ణుడు సర్వులచే ఆరాధనీయుడని ఈ ప్రణామములను అర్పించుట ద్వారా అర్జునుడు సూచించుచున్నాడు. అతడే సర్వవ్యాపి మరియు సర్వాత్మలకు ఆత్మయై యున్నాడు. అర్జునుడు శ్రీకృష్ణుని “మహాత్మా” అని సంభోదించినాడు. అనగా ఆ భగవానుడు మహోదాత్తుడు మరియు అప్రమేయుడని భావము. అలాగుననే అతని శక్తి మరియు ప్రభావముచే ఆవరింపబడనిది ఏదియును జగత్తు నందు లేదని “అనంత” అను పదము సూచించుచున్నది. దేవతల నందరిని నియమించుచు అతడు వారికన్నను అధికుడై యున్నాడనుటయే “దేవేశ” అను పదపు భావము. సమస్త విశ్వమునకు ఆధారమతడే. అతని కన్నను అధికులెవ్వరును లేనందున సిద్ధులు మరియు శక్తిమంతులైన దేవతలందరు శ్రీకృష్ణభగవానునికి నమస్సులు గూర్చుట యుక్తముగా నున్నదని అర్జునుడు భావించెను. శ్రీకృష్ణుడు బ్రహ్మదేవుని సృష్టించినందున, అతడు బ్రహ్మ కన్నను ఘనుడని అర్జునుడు ప్రత్యేకముగ పేర్కొనబడినాడు.*
*శ్రీకృష్ణుని ప్రధాన విస్తృతియైన గర్భోదకశాయి విష్ణువు నాభికమలమున బ్రహ్మదేవుని జన్మము కలిగెను. కనుక బ్రహ్మ, బ్రహ్మ నుండి ఉద్భవించిన శివుడు మరియు ఇతర సర్వదేవతలు శ్రీకృష్ణభగవానునకు గౌరవపూర్వక వందనములను అర్పించవలసియున్నది. ఆ రీతిగనే బ్రహ్మరుద్రాది దేవతలు శ్రీకృష్ణభగవానునకు నమస్సులు గూర్తురని శ్రీమద్భాగవతమున తెలుపబడినది. ఈ భౌతికసృష్టి నశ్వరమైనను శ్రీకృష్ణభగవానుడు దానికి అతీతుడై యున్నందున “అక్షరం” అను పదము మిగుల ప్రాధాన్యమును సంతరించుకొన్నది. అతడు సర్వకారణకారణుడు. తత్కారణమున అతడు భౌతికప్రకృతి యందలి బద్ధజీవులందరి కన్నను మరియు స్వయము భౌతికసృష్టి కన్నను అత్యంత ఉన్నతుడై యున్నాడు. కనుకనే శ్రీకృష్ణభగవానుడు పరమపురుషుడై యున్నాడు.*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Bhagavad-Gita as It is - 451 🌹*
*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*
*🌴 Chapter 11 - Viswaroopa Sandarsana Yoga - 37 🌴*
*37. kasmāc ca te na nameran mahātman garīyase brahmaṇo ’py ādi-kartre*
*ananta deveśa jagan-nivāsa tvam akṣaraṁ sad-asat tat paraṁ yat*
*🌷 Translation : O great one, greater even than Brahmā, You are the original creator. Why then should they not offer their respectful obeisances unto You? O limitless one, God of gods, refuge of the universe! You are the invincible source, the cause of all causes, transcendental to this material manifestation.*
*🌹 Purport : By this offering of obeisances, Arjuna indicates that Kṛṣṇa is worshipable by everyone. He is all-pervading, and He is the Soul of every soul. Arjuna is addressing Kṛṣṇa as mahātmā, which means that He is most magnanimous and unlimited. Ananta indicates that there is nothing which is not covered by the influence and energy of the Supreme Lord, and deveśa means that He is the controller of all demigods and is above them all. He is the shelter of the whole universe. Arjuna also thought that it was fitting that all the perfect living entities and powerful demigods offer their respectful obeisances unto Him, because no one is greater than Him. Arjuna especially mentions that Kṛṣṇa is greater than Brahmā because Brahmā is created by Him.*
*Brahmā is born out of the lotus stem grown from the navel abdomen of Garbhodaka-śāyī Viṣṇu, who is Kṛṣṇa’s plenary expansion; therefore Brahmā and Lord Śiva, who is born of Brahmā, and all other demigods must offer their respectful obeisances. It is stated in Śrīmad-Bhāgavatam that the Lord is respected by Lord Śiva and Brahmā and similar other demigods. The word akṣaram is very significant because this material creation is subject to destruction but the Lord is above this material creation. He is the cause of all causes, and being so, He is superior to all the conditioned souls within this material nature as well as the material cosmic manifestation itself. He is therefore the all-great Supreme.*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 . శ్రీ శివ మహా పురాణము - 807 / Sri Siva Maha Purana - 807 🌹*
*✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ*
*🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 23 🌴*
*🌻. పాతివ్రత్య భంగము - 5 🌻*
*సనత్కుమారుడిట్ల పలికెను- ఓ మునీ! మాయాపులందరిలో అగ్రగణ్యుడగు విష్ణువు ఆ ముని రూపములో నున్న వాడై ఆమె భర్తను బ్రతికించి వెంటనే అంతర్హితుడాయెను (36). వానిచే జీవింపచేయబడి లేచి నిలబడిన ఆ సముద్రనందనుడు వెంటనే బృందను కౌగిలించుకొని ప్రీతితో నిండిన మనస్సు గలవాడై ఆమె ముఖమును ముద్దాడెను (37). అపుడ బృందకూడా భర్తను గాంచి ఆనందముతో నిండిన మనస్సు గలదై శోకమునంతనూ విడనాడెను. ఆమె తన మనస్సులో ఆ వృత్తాంతము ఒక స్వప్నము వంటిదని భావించెను (38). ప్రసన్నమగు హృదయముగల ఆమె మనస్సులో కోర్కెలు చెలరేగెను. ఆమె ఆతనితో గూడి ఆ వనమధ్యములోనున్నదై అనేక దినములు రమించెను (39). ఒకనాడు విహారము అయిన తరువాత ఆతడు విష్ణువు అని గుర్తించి బృంద క్రోధముతో కూడినదై ఆతనిని నిందిస్తూ ఇట్లు పలికెను (40).*
*బృంద ఇట్లు పలికెను - ఓయీ హరీ! పరభార్యను ఈ తీరున కాంక్షించే నీ శీలమునకు నిందయగు గాక! తాపసుని వేషములో కనబడిన మాయావివి నీవే నని నేను చక్కగా గుర్తు పట్టినాను (41).
*సనత్కుమారుడిట్లు పలికెను - ఓ వ్యాసా! పాతివ్రత్య పరాయణురాలగు ఆమె ఇట్లు పలికి మిక్కిలి కోపమును పొందినదై తన తేజస్సును ప్రదర్శిస్తూ కేశవుని శపించెను (42). ఓరీ! అధమాధమా! దైత్యశత్రూ! పరుల ధర్మమును చెడగొట్టు వాడా! మాయావీ! నేను ఇచ్చే, విషములన్నింటి కంటే తీక్‌ష్ణతరమైన శాపమును స్వీకరించుము (43).*
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 SRI SIVA MAHA PURANA - 807 🌹*
*✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj *
*🌴 Rudra-saṃhitā (4): Yuddha-khaṇḍa - CHAPTER 23 🌴*
*🌻 Outraging the modesty of Vṛndā - 5 🌻*
Sanatkumāra said:—
36. After saying this and restoring him to life, O sage, that sage who was Viṣṇu the foremost among those who wield illusion vanished from the scene.
37. Jalandhara thus revived to life by him stood up. Delighted in mind he embraced Vṛndā and kissed her face.
38. On seeing her husband, Vṛndā too was delighted. She forgot her sorrow. She considered everything a dream.
39. Delighted in the heart and with all the dormant passions kindled up, she sported with him for many days in the middle of that forest.
40. Once at the end of the sexual intercourse she realised that it was Viṣṇu. Vṛndā rebuked him angrily and spoke thus.
Vṛndā said:—
41. Fie on this misdeed of Viṣṇu in outraging the modesty of another man’s wife. I have now realised you as the wielder of illusion, appearing in the guise of an ascetic.
Sanatkumāra said:—
42. O Vyāsa, saying thus in great anger she showed her brilliant powers as a staunch chaste lady by cursing Viṣṇu.
43. “O base foe of the Daityas, defiler of other people’s virtue, O wicked one, take this curse from me, greater in force than all persons.
Continues....
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 64 / Osho Daily Meditations - 64 🌹*
*✍️. ప్రసాద్ భరద్వాజ*
*🍀 64. ప్రామాణికత 🍀*
*🕉. ఏదైనా ఎదగకూడదని మీరు కోరుకున్నప్పుడు, దానికి మీ విముఖత చూపించండి మరియు అది దానంతట అదే చనిపోతుంది. నీరు పోయకుండా నిర్లక్ష్యం చేసిన మొక్క లాగా ఎండిపోయి చనిపోతుంది. కాబట్టి మీరు ఏదైనా మోసపూరితమైనది చూసినప్పుడు, దానిని పక్కన పెట్టండి. 🕉*
*మీరు చిరునవ్వు నవ్వుతున్నా, నవ్వుదామనుకున్నా అది తెచ్చి పెట్టుకున్నదని మీరు గ్రహించిన వెంటనే దానిని అపేయండి. మర్యాద కోసమైనా సరే దానిని కొనసాగించ వద్దు. మీ పెదాలను విశ్రాంతి తీసుకోనీయండి. అవతలి వ్యక్తికి, అది కల్పిత చిరునవ్వు అని వారికి చెప్పి క్షమించమని అడగండి. నిజమైన చిరునవ్వు వస్తే సరే; అది కాకపోతే, అది కూడా సరే. నీవు ఏమి చేయగలవు? వస్తే వస్తుంది; అది రాకపోతే, అది రాదు. దానిని బలవంతం చేయలేము. సామాజిక మర్యాదల నుండి బయటపడాలని నేను చెప్పడం లేదు. కానీ ఎరుకతో ఉండండి అని చెప్తున్నాను. మీరు కపటంగా ఉండవలసి వస్తే, దాని పట్ల స్పృహతో ఉండండి. ఎదుటి వ్యక్తి మీ యజమాని కనుక మీరు నవ్వాలి, అది కపట నవ్వయినా పూర్తి స్పృహతో తెలిసి నవ్వండి.*
*ఆ కపటమైన నవ్వుతో యజమానిని మోసపోనివ్వండి. కానీ మీ చిరునవ్వుతో మీరు మోసపోకూడదు, అదే అసలు విషయం. మీరు సృహలో లేకుండా నవ్వినా, యజమాని మోసపోక పోవచ్చు, ఎందుకంటే యజమానులను మోసం చేయడం కష్టం. కానీ మీరు మోసపోవచ్చు. మీరు మీ వెన్ను తట్టుకుని, నేను చాలా మంచివాడిని, మంచి అబ్బాయి అని అనుకుంటారు. కానీ అక్కడ మిమ్మల్మి మీరు మోసగించు కుంటారు. అది వద్దు. కాబట్టి కొన్నిసార్లు మరీ ముఖ్యం అయితే అలా చేయవచ్చు. ఎందుకంటే ఇది అవసరం కావచ్చు; జీవితం సంక్లిష్టమైనది మరియు మీరు ఒంటరిగా లేరు; మీరు చేయవలసినవి చాలా ఉంటాయి, ఎందుకంటే మొత్తం సమాజం ఈ బూటకపు నటన మీదే నిలబడి ఉంది. అట్లాంటప్పుడు మీరు స్పృహతో దానిలో ఉండండి. కానీ మీరు మీరుగా ఉండగలిగన మీ సంబంధాలలో మాత్రం ఇటువంటి మోసపూరిత నటనను అనుమతించవద్దు.*
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Osho Daily Meditations - 64 🌹*
📚. Prasad Bharadwaj
*🍀 64. AUTHENTICITY 🍀*
*🕉 When you want something not to grow, just keep your back to it and it dies if its own accord. Just like a plant that is neglected, not watered, it withers away and dies. So whenever you see something that is phony, just put it aside. 🕉*
*If you are just about to smile, then suddenly you realize that it would be phony, stop, even in the middle of the smile; relax your lips and ask the person to excuse you. Tell them it was a phony smile, and you are sorry. If a real smile comes, then it is okay; if it doesn't, then that is also okay. What can you do? If it comes, it comes; if it doesn't come, it doesn't. One cannot force it. I'm not saying to just get out of the social formalities. I am saying be watchful, and if you have to be false, be it consciously, Knowing that this person is your boss and you have to smile, smile consciously, knowing well that it is phony.*
*Let the boss be deceived- you should not be deceived by your smile, that's the point. If you smile unconsciously, the boss may not be deceived, because it is difficult to deceive bosses-but you may be deceived. You will pat yourself on the back and think you were perfectly good, such a good boy-but there you are missing. So if sometimes you trunk it is necessary-because it may be necessary; life is complex and you are not alone; there are many things that you have to do because the whole society exists on phoniness-then be phony consciously. But in your relationships where you can be true, don't allow phoniness.*
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
. *🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 497, 498 / Sri Lalitha Chaitanya Vijnanam - 497, 498 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*
*🍀 102. మణిపూరాబ్జ నిలయా, వదనత్రయ సంయుతా ।*
*వజ్రాధికాయుధోపేతా, డామర్యాదిభి రావృతా ॥ 102 ॥ 🍀*
*🌻 497. 'వజ్రాదికాయుధోపేత’ 🌻*
*వజ్రము మొదలగు ఆయుధములతో కూడినది శ్రీమాత అని అర్థము. వజ్రము, దండము, శక్తి, అభయము దాల్చిన చతుర్భుజిగా భావన చేయవలెను.*
*🌻 498. 'డామర్యాదిబిరావృతా' 🌻*
*డమరుకము ఆదిగా గల భీకర శబ్దములతో పరివేష్టించి యుండునది శ్రీమాత అని అర్ధము. పశుజనులకు భయభీతులు కలిగించుటకు శ్రీమాత డమరుక మొకటి చాలును. ఆ శబ్దమున దుష్టుల గుండెలు పగుల గలవు. శిష్టులకు అభయము కలిగించుచు దుష్టులకు భయము కలిగించునది. యిచ్చటి శ్రీమాత. డామరి మొదలగునవి పది శక్తులుగ వివరింపబడినవి. ఇవి భీకర శబ్ద కారకములు.*
*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 497, 498 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*
*✍️ Prasad Bharadwaj*
*🌻102. Manipurabja nilaya vadanatraya sanyuta
vajradikayudhopeta dayaryadibhiravruta ॥ 102 ॥ 🌻*
*🌻 497. vajradikayudhopeta 🌻*
*Srimata has Vajra and other weapons. Vajra, Danda, Shakti and Abhaya should be thought of as a quadrilateral.*
*🌻 498. dayaryadibhiravruta 🌻*
*Srimata is surrounded by fierce sounds like the Damaruka. The damaruka is sufficient to strike fear in the animalistic people. The hearts of the wicked can break at that sound. Here Srimata is a source of security to the virtuous and a source of fear to the wicked. There are ten powers described as Damari etc. These cause fierce sounds.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Join and Share
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
https://t.me/+9zDjTpPe_PQzMWVl
https://t.me/Sivasutras
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/bhagavadgeethaa/
https://t.me/AgniMahaPuranam
https://t.me/+LmH1GyjNXXlkNDRl
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages2
https://chaitanyavijnanam.tumblr.com/
https://prasadbharadwaj.wixsite.com/lalithasahasranama
https://www.threads.net/@prasad.bharadwaj