శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 391 -1 / Sri Lalitha Chaitanya Vijnanam - 391 - 1

🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 391 -1 / Sri Lalitha Chaitanya Vijnanam - 391 - 1🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 85. నిత్యక్లిన్నా, నిరుపమా, నిర్వాణ సుఖదాయినీ ।
నిత్యా, షోడశికారూపా, శ్రీకంఠార్ధ శరీరిణీ ॥ 85 ॥ 🍀

🌻 391. 'నిత్యా షోడశికారూపా' - 1 🌻

పదునారు దేవతల రూపమున భాసించెడిది శ్రీమాత అని అర్థము. కామేశ్వరి మొదలు త్రిపురసుందరి వరకు గల పదహారు దేవతలు నిత్యాదేవత లని పిలువబడుదురు. పదిహేను అంగములుగ పదిహేను దేవతలును, వాటికి మూలముగ శ్రీమాత పదహారవదిగా వెలుగొందు చుండును. నిత్యము అట్లే వెలుగొందు చుండును.

'నిత్య' అనగా శాశ్వతమైనది. వికల్పము లేనిది. ఈ పదహారు దేవతలును, పదహారు కళలుగ చంద్రుని నుండి తిథులద్వారా మనలను అనుగ్రహించు చుందురు. అమావాస్య నుండి పౌర్ణమి అంతము వరకు గల తిథులు పదహారు. పదహారు తిథుల యందు వ్యక్తావక్త స్వరూపిణి యగు శ్రీమాత పూర్ణమే అయిననూ చూచువారిని బట్టి వెలుగు నీడలు ఉన్నట్లు గోచరించును. చంద్రుడు వెలుగు భాగము వ్యక్త స్వరూపము. వెలగని భాగము అవ్యక్త స్వరూపము.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 391 - 1 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️. Acharya Ravi Sarma
📚. Prasad Bharadwaj

🌻 85. Nityaklinna nirupama nirvana sukhadaeini
Nitya shodashika rupa shree kantardha sharirini ॥ 85 ॥ 🌻

🌻 391. Nityā-ṣoḍaśikā-rūpā नित्या-षोडशिका-रूपा -1 🌻

This is a reference to the sixteen deities representing sixteen lunar days and they are worshipped in Śrī Cakra. The sixteenth deity is Lalitāmbikā Herself. These fifteen deities are said to represent fifteen bīja-s of Pañcadaśī mantra and Lalitāmbikā as the sixteenth deity representing ṣodaśī mantra. ṣodaśī mantra has sixteen bīja-s, the additional bīja being श्रीं (śrīṁ), the Lakṣmī bīja. ṣodaśī mantra is considered as the most powerful mantra of all. This is the mantra meant only for the final liberation.

ṣodaśī also refers to a type of sacrifice called agniṣṭoma, a fire ritual where the performer maintains the sacred fire, the offering is the Soma, the deities to whom, the offering is made are Indra and other gods. The number of priests required is sixteen, the ceremonies continue for five days. This is based on strange mantra-s, full of interpolations, which are not found in Rig Veda, though they are referred in Śrautra Sūtra-s and Brāhmaṇa-s of Rig Veda and also occur in Sāma Veda and Atharva Veda. Both chants and recitations are complex and are considered particularly sacred and powerful.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

30 Jul 2022

ఓషో రోజువారీ ధ్యానాలు - 221. ఆత్మ యొక్క చీకటి రాత్రి / Osho Daily Meditations - 221. DARK NIGHT OF THE SOUL

🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 221 / Osho Daily Meditations - 221 🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🍀 221. ఆత్మ యొక్క చీకటి రాత్రి 🍀

🕉. మనమందరం సంతోషంగా ఉండటం మరియు నవ్వడం మరియు జోక్ చేయడం ఎలాగో నేర్చుకుంటాము. అలా సమాజమంతా ఉల్లాసంగా సాగిపోతుంది. కానీ ప్రతి ఒక్కరూ తమలో ఒక లోతైన, చీకటి రాత్రిని మోస్తున్నారు మరియు దాని గురించి ఎవరికీ తెలియదు. 🕉

మీరు ధ్యాన స్థితిలోకి ప్రవేశించినప్పుడు, మీరు మొదట ఆత్మ యొక్క ఈ చీకటి రాత్రిలోకి ప్రవేశిస్తారు. మీరు దాని గుండా వెళ్ళగలిగితే - మరియు దాని గుండా వెళ్ళడానికి ఎటువంటి ఇబ్బంది లేదు - అప్పుడు మీరు అనుభవిస్తున్న సంతోషం నిజం కాదని మీరు మొదటిసారి తెలుసుకుంటారు. తప్పుడు సంతోషం పోతుంది మరియు నిజమైన దుఃఖం వస్తుంది. నిజమైన విచారం తర్వాత మాత్రమే నిజమైన ఆనందం బయటపడుతుంది. అప్పుడు మీకు తెలుస్తుంది అసలైన దుఃఖం కంటే తప్పుడు సంతోషం మరింత ఘోరంగా ఉందని. ఎందుకంటే కనీసం ఆ దుఃఖంలోనైనా వాస్తవం ఉంటుంది. మీరు నిజంగా మరియు హృదయపూర్వకంగా విచారంగా ఉంటే, ఆ విచారం మిమ్మల్ని సుసంపన్నం చేస్తుంది. ఇది మీకు లోతును, అంతర్దృష్టిని ఇస్తుంది. ఇది జీవితం గురించి మరియు దాని అనంతమైన అవకాశాల గురించి మరియు మానవ మనస్సు యొక్క పరిమితుల గురించి మీకు తెలిసేలా చేస్తుంది. మానవ స్పృహ యొక్క చిన్నతనం చుట్టూ ఉన్న అనంతం, ఎల్లప్పుడూ మరణంతో చుట్టుముట్టబడిన దుర్బలమైన జీవితం.

మీరు నిజంగా విచారంగా ఉన్నప్పుడు ఈ విషయాలన్నీ మీకు తెలుస్తాయి. జీవితం అంటే జీవితం మాత్రమే కాదు, అది మరణం కూడా అని మీరు తెలుసుకుంటారు. మీరు నిజంగా సంతోషంగా ఉండాలనుకుంటే, కేవలం నటిస్తూ, సంతోషంగా ఉండటం అనే ఆట ఆడకండి. దురదృష్టం వచ్చినప్పుడు, త్వరలో అది చీకటిగా మారుతుందని, అది తీవ్రంగా మారుతుందని మీరు చూస్తారు. కానీ రాత్రి చీకటిగా ఉన్నప్పుడు, ఉదయం చాలా దగ్గరగా ఉంటుంది. ఒకసారి మీరు పోరాటాన్ని ఆపితే, మీరు దానిని అంగీకరించిన తర్వాత, అది మీకు నిశ్శబ్దాన్ని, లోతైన శృతిని ఇస్తుంది. వాస్తవానికి ఇది విచారంగా ఉంటుంది, కానీ ఇది అందంగా కూడా ఉంటుంది. రాత్రికి కూడా దాని స్వంత అందం ఉంది మరియు రాత్రి అందాలను చూడలేని వారు చాలా కోల్పోతారు.

కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Osho Daily Meditations - 221 🌹

📚. Prasad Bharadwaj

🍀 221. DARK NIGHT OF THE SOUL 🍀

🕉. We all learn how to be happy and to laugh and joke. That's how the whole society goes on a merry-go-round. But everybody is carrying a deep, dark night within them, and nobody is even aware of it.. 🕉

When you enter a meditative state you will first enter this dark night of the soul. If you can pass through it-and there is no difficulty in passing through it-then for the first time you will become aware that your happiness was not true. False happiness will go and real sadness will come, and only after real sadness will real happiness surface. Then you will know that the false happiness was even worse than the real sadness, because at least in that sadness there is a reality. If you are sad-but truly and sincerely sad-that sadness will enrich you. It gives you a depth, an insight. It makes you aware of life and its infinite possibilities and of the limits of the human mind, the smallness of human consciousness encountering the infinity all around, the fragile life always surrounded by death.

When you are really sad you become aware of all these things. You become aware that life is not just life-it is death too. If you really want to be happy, don't just go on pretending, playing the game of being happy. As unhappiness comes, soon you will see that it will darken, it will become intense. But when the night is dark, the morning is very close. Once you stop fighting, once you accept it, it will give you a silence, a deep humming. Of course it is sad, but it is beautiful. Even the night has its own beauty, and those who cannot see the beauty of the night will miss much.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

30 Jul 2022

శ్రీ శివ మహా పురాణము - 602 / Sri Siva Maha Purana - 602

🌹 . శ్రీ శివ మహా పురాణము - 602 / Sri Siva Maha Purana - 602 🌹

✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్రసంహితా-కుమార ఖండః - అధ్యాయము - 05 🌴

🌻. కుమారాభిషేకము - 4 🌻

మంగళకరుడు, పరమేశ్వరుడు, స్నేహ స్వరూపుడు అగు శివుడు ప్రసన్నుడై ప్రేమతో కుమారుని కౌగిలించు కొని శిరస్సుపై ముద్ధిడెను (28). మిక్కిలి తొందరతో కూడిన పార్వతి గుహుని కౌగిలించుకొని ప్రేమతో నిండిన హృదయము గలదైస్తన్యము నిచ్చెను (29). అపుడు దేవతలు భార్యలతో గూడి ఆనందముతో నీరాజనమిచ్చిరి. ఆకాశము జయఘోషతో నిండి పోయెను (30). ఋషులు వేదధ్వనితో, గాయకులు గానము చేయుచూ అనేకులు వాద్యములతో కుమారుని వద్దకు విచ్చేసిరి (31).

భవానీ పతియగు మహేశ్వరుడు అపుడు దివ్యకాంతులతోవెలు గొందు చున్న కుమారుని తన తొడపై కూర్చుండ బెట్టుకొనెను. కుమారుడు కూర్చుండుటచే సాక్షాత్తు శివుడు శోభను పొంది పుత్రుడు గలవారిలో శ్రేష్ఠుడాయెను (32). మహాసుఖమును పొందిన కుమారుడు శివుని ఆజ్ఞచే మహోత్సాహ వంతులగు తన గణములతో మరియు దేవతలతో గూడి శివుని మందిరమునకు విచ్చేసెను (33). దేవతోత్తములు చుట్టు వారియుండగా, ఋషులు నమస్కరించు చుండగా ఒక్కచోటనున్న ఆ ఇద్దరు దంపతులు అపుడెంతయో ప్రకాశించిరి (34). కుమారుడు శివుని ఒడిలో ఆనందముతో నాడు కొనెను. శివుని కంఠము నందున్న వాసుకిని చేతులతో పీడించెను (35).

దయానిధియగు శంభుడు దయా దృష్టితో బాలుని చూచి నవ్వి గిరిజతో ఆ విషయమును చెప్పెను. శివుడు లీలచేత ఆ ఆకారమును ధరించెను (36). అపుడు పార్వతీ సమేతుడు, జగత్తునకు ఏకైక బంధువు, సర్వవ్యాపి, ముల్లోకములకు ఏకైక ప్రభుడు అగు మహేశ్వర భగవానుడు మహానందమును పొంది చిరునవ్వులను వెదజల్లెను. ప్రేమచే కంఠము బొంగురుపోవుట వలన ఆయన ఏమియూ మాటలాడలేదు (37).

అపుడు జగన్నాధుడగు శంభుడు లోకాచారము ననుసరించి ఆనందమయుతో కార్తికుని సుందరమగు రత్నసింహాసనముపై కూర్చుండబెట్టెను (38). సర్వతీర్థముల జలములు రత్నములు పొదిగిన వంద ఘటములలో నుండెను. వేదమంత్రములచే పవిత్రములైన ఆ జలములతో శివుడు ఆనందముతో కుమారుని అభిషేకించెను (39).

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

🌹 SRI SIVA MAHA PURANA - 602🌹

✍️ J.L. SHASTRI
📚. Prasad Bharadwaj

🌴 Rudra-saṃhitā (4): Kumara-khaṇḍa - CHAPTER 05 🌴

🌻 Kārttikeya is crowned - 4 🌻

28. Embracing him with love, Śiva kissed Kumāra on the head. He, the cause of great affection, was highly delighted.

29. Embracing him in great excitement and melting with love, Pārvatī suckled him at her breasts.

30. The Nīrājana rite was performed by the delighted gods in the company of their wives.

31. The sages adored Kumāra with the Vedic chants, the musicians by singing songs, and others by playing upon musical instruments.

32. Placing Kumāra shining with brilliant lustre on his lap Pārvatī shone with glory as the greatest among women who carried sons.

33. At the bidding of Śiva, Kumāra in the company of his Gaṇas came to Śiva’s abode. He felt very happy in the company of jubilant gods.

34. The couple shone simultaneously being saluted by the sages and surrounded by the important gods.

35. Kumāra delightedly played about in the lap of Śiva. He teased Vāsuki[2] round Śiva’s neck with his hands.

36. Seeing that sportive act with his merciful vision, lord Śiva spoke about it to Pārvatī laughingly.

37. Seeing the gentle smile of Kumāra, lord Śiva and Pārvatī attained great joy. The lord, the sole ruler of the worlds and kinsman of the universe uttered nothing with his throat choked through affection.

38. Then Śiva, the lord of the universe, following the worldly convention delightedly placed Kārttikeya on a beautiful gemset throne.

39. With hundreds of gemset pots filled with the waters of holy centres sanctified by Vedic mantras he performed his ceremonial ablution joyously.

Continues....

🌹🌹🌹🌹🌹

30 Jul 2022

శ్రీ మదగ్ని మహాపురాణము - 86 / Agni Maha Purana - 86

🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 86 / Agni Maha Purana - 86 🌹

✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ

శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.
ప్రథమ సంపుటము, అధ్యాయము - 29

🌻. సర్వతోభద్ర మండల విధి - 3 🌻

ఇంతవరకును పదునారేసి కోష్ఠములతో ఏర్పడు రెండువలదల ఏబదిఆరు కోష్ఠములు గల మండలము వర్ణింపబడినది. ఇతర మండలనిర్మాణము కూడ ఈ విధముగనే చేయవచ్చును. పండ్రెం డేసి కోష్ఠములచే నూటనలభైనాలుగు కోష్ఠకముల మండలము ఏర్పడును. దానిలో కూడు మధ్యనున్న ముప్పదియారు పదముల (కోష్ఠముల)చే కమల మేర్పడును. దీనిలో వీథి ఉండదు.

ఒక పంక్తి పీఠమునకై ఏర్పరుపబడును. మిగిలిన రెండు పంక్తులచే, వెనుక చెప్పన విధమున, ద్వారశోభలు కల్పిలంపబడును. ఒక హస్తము ప్రమాణము గల మండలమునందు కమలక్షేత్రము పండ్రెండు అంగుళముల ప్రమాణముతో నుండును. రెండు హస్తములు ప్రమాణము గల మండలమునందు కమలస్థానము ఒక హస్తము వెడల్పు-పొడవులతో నుండును. ఈ విధముగా ప్రమాణమును పెంచుచు ద్వారాదులతో మండలనిర్మాణము చేయవలెను.

రెండు హస్తముల ప్రమాణము గల పీఠరహిత మగు చతురస్రమండలమునందు చక్రాకారకమలమును నిర్మించవలెను. పద్మార్థము తొమ్మిది అంగుళము లుండును. నాభి మూడు అంగుళములు. ఎనిమిది అంగుళముల ఆకులు, నాలుగు అంగుళముల నేమి ఏర్పరుపవలెను. క్షేత్రమును మూడు భాగములుగ విభజించి, మరల లోపలినుండి ఒక్కొక్కదానిని రెండేసి భాగములు చేయవలెను. లోపల నున్న ఐదు కోష్ఠములను తుడిచివేసి వాటిపై ఆకులు నిర్మింపవలెను.

ఈ ఆకులు ఇందీవరదళాకారములో గాని, మాతులింగ ఫలాకారములో గాని, కమలదళాకారమలో గాని ఉండవచ్చును. లేదా వాటి ఆకారమును తమ ఇచ్ఛ ప్రకారము చేయవచ్చును. ఆకుల సంధుల మధ్యదారముంచి, దానిని వెలుపల నున్న నేమి (చక్రాంతము) వరకు లాగి, నాలుగు వైపుల త్రిప్పవలెను. ఆకుయొక్క సంధియందు దారమునుంచి దాని మూలభాగమును త్రిప్పవలెను. ఆకు మధ్యస్థానమునందు దారము ఉంచి ఆ మధ్యభాగము నలువైపులకును సమముగా దారము త్రిప్పవలెను. ఈ విధముగా త్రిప్పగా మాతులుంగాకారము గల ఆకు లేర్పడును.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Agni Maha Purana - 86 🌹

✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj

Chapter 29

🌻 Mode of worshipping Hari in the figure called Sarvatobhadra - 3 🌻

19. In this way, sixteen compartments are formed and in the same manner another circle is formed. In the (figure having) twelve compartments a lotus figure with thirty-six petals (is drawn).

20. As before one line is drawn at each door for beautification. In the circular altar of one cubit a lotus should be drawn (having) twelve finger-breadth.

21. A door should be drawn of the measure of two cubits by one cubit. The altar should be a square. The disc of the lotus should be of two cubits.

22. Half the lotus is drawn with nine (finger breadth), the navel with three, the radius with eight (breadth), the circumference with four.

23. Having divided the ground into three parts, an inner figure is marked with two (breadth). For the sake of accomplishing (one’s object) one has to mark the five vowels inside and the radii.

24. Then according to his desire, one has to draw figures of the petals of lotus or citron leaves or of the shape of lotus leaves.

25. Having fixed at the junction of the radius and having moved around the outer circumference and having stationed in the middle link line one has to move upto the root of the radius.

26. The middle fire-producing stick is moved equally stationing in the middle of the radius. Some more figures resembling citron leaves are drawn in this way for the sake of accomplishment.

Continues....

🌹 🌹 🌹 🌹 🌹

30 Jul 2022

కపిల గీత - 47 / Kapila Gita - 47

🌹. కపిల గీత - 47 / Kapila Gita - 47🌹

🍀. కపిల దేవహూతి సంవాదం 🍀

✍️. శ్రీమాన్ కందాడై రామానుజాచార్యులు
📚. ప్రసాద్‌ భరధ్వాజ

2వ అధ్యాయము

🌴. సృష్టి తత్వం - 3 🌴

47. అనాదిరాత్మా పురుషో నిర్గుణః ప్రకృతేః పరః
ప్రత్యగ్ధామా స్వయంజ్యోతిర్విశ్వం యేన సమన్వితమ్

ఆత్మ స్వయం జ్యోతి - స్వప్రకాశం. ఆత్మ ప్రత్యక్ధామ. ఆత్మతోటే సకల చరాచర ప్రపంచం వ్యాపించి ఉంది. పుట్టే గిట్టే వాటితో ఉండి కూడా ఈ అత్మ పుట్టదు చావదు. పుణ్య పాపములనే నిమిత్తములతో వాటిని అనుభవించడానికి ఏ శరీరం కావాలో దాన్ని పొందుతుంది. ఆత్మ ఇతరములనూ చూపుతుంది, ఇతరులకూ చూపుతుంది, తనను తనను తనకు తెలుపుతుంది, తనను మనకు తెలుపుతుంది. ఈ లక్షణం ఆత్మకు మాత్రమే ఉంది. ప్రకృతికి లేదు.

సశేషం..

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Kapila Gita - 47 🌹

🍀 Conversation of Kapila and Devahuti 🍀
✍️ Swami Prabhupada. 📚 Prasad Bharadwaj

🌴 Fundamental Principles of Material Nature - 3 🌴

47. aniidir iitmii puru so nirgup,aprakrte para
pratyag-dhiimii svayam-jyotir visvam yena samanvitam

The Supreme Personality of Godhead is the Supreme Soul, and He has no beginning. He is transcendental to the material modes of nature and beyond the existence of this material world. He is perceivable everywhere because He is self-effulgent, and by His self-effulgent luster the entire creation is maintained.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

30 Jul 2022

30 Jul 2022 Daily Panchang నిత్య పంచాంగము

🌹30, July 2022 పంచాగము - Panchagam 🌹

శుభ శనివారం, Saturday, స్థిర వాసరే

మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ

ప్రసాద్ భరద్వాజ

🌻. పండుగలు మరియు పర్వదినాలు : బలభధ్ర జయంతి, Bhala Bhadra Jayanthi 🌻

🍀. శ్రీ శని అష్టోత్తరశతనామ స్తోత్రం - 1 🍀

1. శనైశ్చరాయ శాంతాయ సర్వాభీష్టప్రదాయినే
శరణ్యాయ వరేణ్యాయ సర్వేశాయ నమో నమః

2. సౌమ్యాయ సురవంద్యాయ సురలోకవిహారిణే
సుఖాసనోపవిష్టాయ సుందరాయ నమో నమః

🌻 🌻 🌻 🌻 🌻

🍀. నేటి సూక్తి : భగవానుని పై నీకు అనన్య ప్రేమ ఉన్న కారణాన, భగవానుకు కూడా ఇతరుల కంటె నిన్నే అధికంగా ప్రేమించాలన్న భావం నీలో ఉత్పన్నం కావచ్చు. కాని అలా ఆ పేక్షించడం క్రమవిరుద్ధం. 🍀

🌷🌷🌷🌷🌷

శుభకృత్‌ సంవత్సరం, శ్రావణ మాసం

దక్షిణాయణం, వర్ష ఋతువు

తిథి: శుక్ల విదియ 27:01:38 వరకు

తదుపరి శుక్ల తదియ

నక్షత్రం: ఆశ్లేష 12:13:12 వరకు

తదుపరి మఘ

యోగం: వ్యతీపాత 19:01:40 వరకు

తదుపరి వరియాన

కరణం: బాలవ 14:11:44 వరకు

వర్జ్యం: 25:17:00 - 27:01:32

దుర్ముహూర్తం: 07:38:05 - 08:29:47

రాహు కాలం: 09:08:33 - 10:45:30

గుళిక కాలం: 05:54:41 - 07:31:37

యమ గండం: 13:59:22 - 15:36:19

అభిజిత్ ముహూర్తం: 11:57 - 12:47

అమృత కాలం: 10:27:20 - 12:13:00

సూర్యోదయం: 05:54:41

సూర్యాస్తమయం: 18:50:11

చంద్రోదయం: 07:03:25

చంద్రాస్తమయం: 20:13:05

సూర్య సంచార రాశి: కర్కాటకం

చంద్ర సంచార రాశి: కర్కాటకం

మానస యోగం - కార్య లాభం 12:13:12

వరకు తదుపరి పద్మ యోగం

- ఐశ్వర్య ప్రాప్తి

🌻 🌻 🌻 🌻 🌻

🍀. నిత్య ప్రార్థన 🍀

వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ

నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా

యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా

తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం

తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ

విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.

🌹🌹🌹🌹🌹

🍀 30 - JULY - 2022 SATURDAY ALL MESSAGES శనివారం, స్థిర వాసర సందేశాలు 🍀

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam 30, శనివారం, జూలై 2022 స్థిర వాసరే  Saturday 🌹
2) 🌹 కపిల గీత - 47 / Kapila Gita - 47 🌹 సృష్టి తత్వము - 3
3) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 86 / Agni Maha Purana - 86 🌹
4) 🌹. శివ మహా పురాణము - 602 / Siva Maha Purana -602 🌹
5) 🌹 ఓషో రోజువారీ ధ్యానములు - 221 / Osho Daily Meditations - 221 🌹
6) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 391-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 391-1 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹30, July 2022 పంచాగము - Panchagam  🌹*
*శుభ శనివారం, Saturday, స్థిర వాసరే*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*

*🌻. పండుగలు మరియు పర్వదినాలు :  బలభధ్ర జయంతి, Bhala Bhadra Jayanthi 🌻*

*🍀. శ్రీ శని అష్టోత్తరశతనామ స్తోత్రం - 1 🍀*

*1. శనైశ్చరాయ శాంతాయ సర్వాభీష్టప్రదాయినే*
*శరణ్యాయ వరేణ్యాయ సర్వేశాయ నమో నమః*
*2. సౌమ్యాయ సురవంద్యాయ సురలోకవిహారిణే*
*సుఖాసనోపవిష్టాయ సుందరాయ నమో నమః*

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి :  భగవానుని పై నీకు అనన్య ప్రేమ ఉన్న కారణాన, భగవానుకు కూడా ఇతరుల కంటె నిన్నే అధికంగా ప్రేమించాలన్న భావం నీలో ఉత్పన్నం కావచ్చు. కాని అలా ఆ పేక్షించడం క్రమవిరుద్ధం. 🍀*

🌷🌷🌷🌷🌷

శుభకృత్‌ సంవత్సరం, శ్రావణ మాసం
దక్షిణాయణం, వర్ష ఋతువు
తిథి:  శుక్ల విదియ 27:01:38 వరకు
తదుపరి శుక్ల తదియ
నక్షత్రం: ఆశ్లేష 12:13:12 వరకు
తదుపరి మఘ
యోగం: వ్యతీపాత 19:01:40 వరకు
తదుపరి వరియాన
కరణం: బాలవ 14:11:44 వరకు
వర్జ్యం: 25:17:00 - 27:01:32
దుర్ముహూర్తం: 07:38:05 - 08:29:47
రాహు కాలం: 09:08:33 - 10:45:30
గుళిక కాలం: 05:54:41 - 07:31:37
యమ గండం: 13:59:22 - 15:36:19
అభిజిత్ ముహూర్తం: 11:57 - 12:47
అమృత కాలం: 10:27:20 - 12:13:00
సూర్యోదయం: 05:54:41
సూర్యాస్తమయం: 18:50:11
చంద్రోదయం: 07:03:25
చంద్రాస్తమయం: 20:13:05
సూర్య సంచార రాశి: కర్కాటకం
చంద్ర సంచార రాశి: కర్కాటకం
మానస యోగం - కార్య లాభం 12:13:12
వరకు తదుపరి పద్మ యోగం
- ఐశ్వర్య ప్రాప్తి

🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో  నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*
*విద్యాబలం  దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. కపిల గీత - 47 / Kapila Gita - 47🌹*
*🍀. కపిల దేవహూతి సంవాదం 🍀*
✍️. శ్రీమాన్ కందాడై రామానుజాచార్యులు
*📚. ప్రసాద్‌ భరధ్వాజ*
2వ అధ్యాయము

*🌴. సృష్టి తత్వం  - 3 🌴*

*47. అనాదిరాత్మా పురుషో నిర్గుణః ప్రకృతేః పరః*
*ప్రత్యగ్ధామా స్వయంజ్యోతిర్విశ్వం యేన సమన్వితమ్*

*ఆత్మ స్వయం జ్యోతి - స్వప్రకాశం. ఆత్మ ప్రత్యక్ధామ. ఆత్మతోటే సకల చరాచర ప్రపంచం వ్యాపించి ఉంది. పుట్టే గిట్టే వాటితో ఉండి కూడా ఈ అత్మ పుట్టదు చావదు. పుణ్య పాపములనే నిమిత్తములతో వాటిని అనుభవించడానికి ఏ శరీరం కావాలో దాన్ని పొందుతుంది. ఆత్మ ఇతరములనూ చూపుతుంది, ఇతరులకూ చూపుతుంది, తనను తనను తనకు తెలుపుతుంది, తనను మనకు తెలుపుతుంది.  ఈ లక్షణం ఆత్మకు మాత్రమే ఉంది. ప్రకృతికి లేదు.*

*సశేషం..*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Kapila Gita - 47 🌹*
*🍀 Conversation of Kapila and Devahuti 🍀*
*✍️  Swami Prabhupada.   📚 Prasad Bharadwaj*

*🌴 Fundamental Principles of Material Nature - 3 🌴*

*47. aniidir iitmii puru so nirgup,aprakrte para*
*pratyag-dhiimii svayam-jyotir visvam yena samanvitam*

*The Supreme Personality of Godhead is the Supreme Soul, and He has no beginning. He is transcendental to the material modes of nature and beyond the existence of this material world. He is perceivable everywhere because He is self-effulgent, and by His self-effulgent luster the entire creation is maintained.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 86 / Agni Maha Purana - 86 🌹*
*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚.  ప్రసాద్ భరద్వాజ*
*శ్రీ గణేశాయ నమః  ఓం నమో భగవతే వాసుదేవాయ.*
*ప్రథమ సంపుటము, అధ్యాయము - 29*

*🌻.  సర్వతోభద్ర మండల విధి - 3 🌻*

ఇంతవరకును పదునారేసి కోష్ఠములతో ఏర్పడు రెండువలదల ఏబదిఆరు కోష్ఠములు గల మండలము వర్ణింపబడినది. ఇతర మండలనిర్మాణము కూడ ఈ విధముగనే చేయవచ్చును. పండ్రెం డేసి కోష్ఠములచే నూటనలభైనాలుగు కోష్ఠకముల మండలము ఏర్పడును. దానిలో కూడు మధ్యనున్న ముప్పదియారు పదముల (కోష్ఠముల)చే కమల మేర్పడును. దీనిలో వీథి ఉండదు.

ఒక పంక్తి పీఠమునకై ఏర్పరుపబడును. మిగిలిన రెండు పంక్తులచే, వెనుక చెప్పన విధమున, ద్వారశోభలు కల్పిలంపబడును. ఒక హస్తము ప్రమాణము గల మండలమునందు కమలక్షేత్రము పండ్రెండు అంగుళముల ప్రమాణముతో నుండును. రెండు హస్తములు ప్రమాణము గల మండలమునందు కమలస్థానము ఒక హస్తము వెడల్పు-పొడవులతో నుండును. ఈ విధముగా ప్రమాణమును పెంచుచు ద్వారాదులతో మండలనిర్మాణము చేయవలెను.

రెండు హస్తముల ప్రమాణము గల పీఠరహిత మగు చతురస్రమండలమునందు చక్రాకారకమలమును నిర్మించవలెను. పద్మార్థము తొమ్మిది అంగుళము లుండును. నాభి మూడు అంగుళములు. ఎనిమిది అంగుళముల ఆకులు, నాలుగు అంగుళముల నేమి ఏర్పరుపవలెను. క్షేత్రమును మూడు భాగములుగ విభజించి, మరల లోపలినుండి ఒక్కొక్కదానిని రెండేసి భాగములు చేయవలెను. లోపల నున్న ఐదు కోష్ఠములను తుడిచివేసి వాటిపై ఆకులు నిర్మింపవలెను.

ఈ ఆకులు ఇందీవరదళాకారములో గాని, మాతులింగ ఫలాకారములో గాని, కమలదళాకారమలో గాని ఉండవచ్చును. లేదా వాటి ఆకారమును తమ ఇచ్ఛ ప్రకారము చేయవచ్చును. ఆకుల సంధుల మధ్యదారముంచి, దానిని వెలుపల నున్న నేమి (చక్రాంతము) వరకు లాగి, నాలుగు వైపుల త్రిప్పవలెను. ఆకుయొక్క సంధియందు దారమునుంచి దాని మూలభాగమును త్రిప్పవలెను. ఆకు మధ్యస్థానమునందు దారము ఉంచి ఆ మధ్యభాగము నలువైపులకును సమముగా దారము త్రిప్పవలెను. ఈ విధముగా త్రిప్పగా మాతులుంగాకారము గల ఆకు లేర్పడును.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Agni Maha Purana - 86 🌹*
*✍️ N. Gangadharan  📚. Prasad Bharadwaj *

*Chapter 29*
*🌻 Mode of worshipping Hari in the figure called Sarvatobhadra - 3 🌻*

19. In this way, sixteen compartments are formed and in the same manner another circle is formed. In the (figure having) twelve compartments a lotus figure with thirty-six petals (is drawn).

20. As before one line is drawn at each door for beautification. In the circular altar of one cubit a lotus should be drawn (having) twelve finger-breadth.

21. A door should be drawn of the measure of two cubits by one cubit. The altar should be a square. The disc of the lotus should be of two cubits.

22. Half the lotus is drawn with nine (finger breadth), the navel with three, the radius with eight (breadth), the circumference with four.

23. Having divided the ground into three parts, an inner figure is marked with two (breadth). For the sake of accomplishing (one’s object) one has to mark the five vowels inside and the radii.

24. Then according to his desire, one has to draw figures of the petals of lotus or citron leaves or of the shape of lotus leaves.

25. Having fixed at the junction of the radius and having moved around the outer circumference and having stationed in the middle link line one has to move upto the root of the radius.

26. The middle fire-producing stick is moved equally stationing in the middle of the radius. Some more figures resembling citron leaves are drawn in this way for the sake of accomplishment.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 602 / Sri Siva Maha Purana - 602 🌹*
✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి  📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్రసంహితా-కుమార ఖండః  - అధ్యాయము - 05 🌴*
*🌻. కుమారాభిషేకము  - 4 🌻*

మంగళకరుడు, పరమేశ్వరుడు, స్నేహ స్వరూపుడు అగు శివుడు ప్రసన్నుడై ప్రేమతో కుమారుని కౌగిలించు కొని శిరస్సుపై ముద్ధిడెను (28). మిక్కిలి తొందరతో కూడిన పార్వతి గుహుని కౌగిలించుకొని ప్రేమతో నిండిన హృదయము గలదైస్తన్యము నిచ్చెను (29). అపుడు దేవతలు భార్యలతో గూడి ఆనందముతో నీరాజనమిచ్చిరి. ఆకాశము జయఘోషతో నిండి పోయెను (30). ఋషులు వేదధ్వనితో, గాయకులు గానము చేయుచూ అనేకులు వాద్యములతో కుమారుని వద్దకు విచ్చేసిరి (31).

భవానీ పతియగు మహేశ్వరుడు అపుడు దివ్యకాంతులతోవెలు గొందు చున్న కుమారుని తన తొడపై కూర్చుండ బెట్టుకొనెను. కుమారుడు కూర్చుండుటచే సాక్షాత్తు శివుడు శోభను పొంది పుత్రుడు గలవారిలో శ్రేష్ఠుడాయెను (32). మహాసుఖమును పొందిన కుమారుడు శివుని ఆజ్ఞచే మహోత్సాహ వంతులగు తన గణములతో మరియు దేవతలతో గూడి శివుని మందిరమునకు విచ్చేసెను (33). దేవతోత్తములు చుట్టు వారియుండగా, ఋషులు నమస్కరించు చుండగా ఒక్కచోటనున్న ఆ ఇద్దరు దంపతులు అపుడెంతయో ప్రకాశించిరి (34). కుమారుడు శివుని ఒడిలో ఆనందముతో నాడు కొనెను. శివుని కంఠము నందున్న వాసుకిని చేతులతో పీడించెను (35).

దయానిధియగు శంభుడు దయా దృష్టితో బాలుని చూచి నవ్వి గిరిజతో ఆ విషయమును చెప్పెను. శివుడు లీలచేత ఆ ఆకారమును ధరించెను (36). అపుడు పార్వతీ సమేతుడు, జగత్తునకు ఏకైక బంధువు, సర్వవ్యాపి, ముల్లోకములకు ఏకైక ప్రభుడు అగు మహేశ్వర భగవానుడు మహానందమును పొంది చిరునవ్వులను వెదజల్లెను. ప్రేమచే కంఠము బొంగురుపోవుట వలన ఆయన ఏమియూ మాటలాడలేదు (37).

అపుడు జగన్నాధుడగు శంభుడు లోకాచారము ననుసరించి ఆనందమయుతో కార్తికుని సుందరమగు రత్నసింహాసనముపై కూర్చుండబెట్టెను (38). సర్వతీర్థముల జలములు రత్నములు పొదిగిన వంద ఘటములలో నుండెను. వేదమంత్రములచే పవిత్రములైన ఆ జలములతో శివుడు ఆనందముతో కుమారుని అభిషేకించెను (39).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 SRI SIVA MAHA PURANA - 602🌹*
*✍️  J.L. SHASTRI*
*📚. Prasad Bharadwaj *

*🌴 Rudra-saṃhitā (4): Kumara-khaṇḍa - CHAPTER  05 🌴*

*🌻 Kārttikeya is crowned - 4 🌻*

28. Embracing him with love, Śiva kissed Kumāra on the head. He, the cause of great affection, was highly delighted.

29. Embracing him in great excitement and melting with love, Pārvatī suckled him at her breasts.

30. The Nīrājana rite was performed by the delighted gods in the company of their wives.

31. The sages adored Kumāra with the Vedic chants, the musicians by singing songs, and others by playing upon musical instruments.

32. Placing Kumāra shining with brilliant lustre on his lap Pārvatī shone with glory as the greatest among women who carried sons.

33. At the bidding of Śiva, Kumāra in the company of his Gaṇas came to Śiva’s abode. He felt very happy in the company of jubilant gods.

34. The couple shone simultaneously being saluted by the sages and surrounded by the important gods.

35. Kumāra delightedly played about in the lap of Śiva. He teased Vāsuki[2] round Śiva’s neck with his hands.

36. Seeing that sportive act with his merciful vision, lord Śiva spoke about it to Pārvatī laughingly.

37. Seeing the gentle smile of Kumāra, lord Śiva and Pārvatī attained great joy. The lord, the sole ruler of the worlds and kinsman of the universe uttered nothing with his throat choked through affection.

38. Then Śiva, the lord of the universe, following the worldly convention delightedly placed Kārttikeya on a beautiful gemset throne.

39. With hundreds of gemset pots filled with the waters of holy centres sanctified by Vedic mantras he performed his ceremonial ablution joyously.

Continues....
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 221 / Osho Daily Meditations  - 221 🌹*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🍀 221. ఆత్మ యొక్క చీకటి రాత్రి 🍀*

*🕉. మనమందరం సంతోషంగా ఉండటం మరియు నవ్వడం మరియు జోక్ చేయడం ఎలాగో నేర్చుకుంటాము. అలా సమాజమంతా ఉల్లాసంగా సాగిపోతుంది. కానీ ప్రతి ఒక్కరూ తమలో ఒక లోతైన, చీకటి రాత్రిని మోస్తున్నారు మరియు దాని గురించి ఎవరికీ తెలియదు. 🕉*
 
*మీరు ధ్యాన స్థితిలోకి ప్రవేశించినప్పుడు, మీరు మొదట ఆత్మ యొక్క ఈ చీకటి రాత్రిలోకి ప్రవేశిస్తారు. మీరు దాని గుండా వెళ్ళగలిగితే - మరియు దాని గుండా వెళ్ళడానికి ఎటువంటి ఇబ్బంది లేదు - అప్పుడు మీరు అనుభవిస్తున్న సంతోషం నిజం కాదని మీరు మొదటిసారి తెలుసుకుంటారు. తప్పుడు సంతోషం పోతుంది మరియు నిజమైన దుఃఖం వస్తుంది. నిజమైన విచారం తర్వాత మాత్రమే నిజమైన ఆనందం బయటపడుతుంది. అప్పుడు మీకు తెలుస్తుంది అసలైన దుఃఖం కంటే తప్పుడు సంతోషం మరింత ఘోరంగా ఉందని. ఎందుకంటే కనీసం ఆ దుఃఖంలోనైనా వాస్తవం ఉంటుంది. మీరు  నిజంగా మరియు హృదయపూర్వకంగా విచారంగా ఉంటే, ఆ విచారం మిమ్మల్ని సుసంపన్నం చేస్తుంది. ఇది మీకు లోతును, అంతర్దృష్టిని ఇస్తుంది. ఇది జీవితం గురించి మరియు దాని అనంతమైన అవకాశాల గురించి మరియు మానవ మనస్సు యొక్క పరిమితుల గురించి మీకు తెలిసేలా చేస్తుంది. మానవ స్పృహ యొక్క చిన్నతనం చుట్టూ ఉన్న అనంతం, ఎల్లప్పుడూ మరణంతో చుట్టుముట్టబడిన దుర్బలమైన జీవితం.*

*మీరు నిజంగా విచారంగా ఉన్నప్పుడు ఈ విషయాలన్నీ మీకు తెలుస్తాయి. జీవితం అంటే జీవితం మాత్రమే కాదు, అది మరణం కూడా అని మీరు తెలుసుకుంటారు. మీరు నిజంగా సంతోషంగా ఉండాలనుకుంటే, కేవలం నటిస్తూ, సంతోషంగా ఉండటం అనే ఆట ఆడకండి. దురదృష్టం వచ్చినప్పుడు, త్వరలో అది చీకటిగా మారుతుందని, అది తీవ్రంగా మారుతుందని మీరు చూస్తారు. కానీ రాత్రి చీకటిగా ఉన్నప్పుడు, ఉదయం చాలా దగ్గరగా ఉంటుంది. ఒకసారి మీరు పోరాటాన్ని ఆపితే, మీరు దానిని అంగీకరించిన తర్వాత, అది మీకు నిశ్శబ్దాన్ని, లోతైన శృతిని ఇస్తుంది. వాస్తవానికి ఇది విచారంగా ఉంటుంది, కానీ ఇది అందంగా కూడా ఉంటుంది. రాత్రికి కూడా దాని స్వంత అందం ఉంది మరియు రాత్రి అందాలను చూడలేని వారు చాలా కోల్పోతారు.*
 
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Osho Daily Meditations  - 221 🌹*
*📚. Prasad Bharadwaj*

*🍀 221. DARK NIGHT OF THE SOUL 🍀*

*🕉. We all learn how to be happy and to laugh and joke. That's how the whole society goes on a merry-go-round. But everybody is carrying a deep, dark night within them, and nobody is even aware of it.. 🕉*
 
*When you enter a meditative state you will first enter this dark night of the soul. If you can pass through it-and there is no difficulty in passing through it-then for the first time you will become aware that your happiness was not true. False happiness will go and real sadness will come, and only after real sadness will real happiness surface. Then you will know that the false happiness was even worse than the real sadness, because at least in that sadness there is a reality. If you are sad-but truly and sincerely sad-that sadness will enrich you. It gives you a depth, an insight. It makes you aware of life and its infinite possibilities and of the limits of the human mind, the smallness of human consciousness encountering the infinity all around, the fragile life always surrounded by death.*

*When you are really sad you become aware of all these things. You become aware that life is not just life-it is death too. If you really want to be happy, don't just go on pretending, playing the game of being happy. As unhappiness comes, soon you will see that it will darken, it will become intense. But when the night is dark, the morning is very close. Once you stop fighting, once you accept it, it will give you a silence, a deep humming. Of course it is sad, but it is beautiful. Even the night has its own beauty, and those who cannot see the beauty of the night will miss much.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 391 -1 / Sri Lalitha Chaitanya Vijnanam  - 391 - 1🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁*

*🍀  85. నిత్యక్లిన్నా, నిరుపమా, నిర్వాణ సుఖదాయినీ ।*
*నిత్యా, షోడశికారూపా, శ్రీకంఠార్ధ శరీరిణీ ॥ 85 ॥ 🍀*

*🌻 391.  'నిత్యా షోడశికారూపా' - 1 🌻*

*పదునారు దేవతల రూపమున భాసించెడిది శ్రీమాత అని అర్థము. కామేశ్వరి మొదలు త్రిపురసుందరి వరకు గల పదహారు దేవతలు నిత్యాదేవత లని పిలువబడుదురు. పదిహేను అంగములుగ పదిహేను దేవతలును, వాటికి మూలముగ శ్రీమాత పదహారవదిగా వెలుగొందు చుండును. నిత్యము అట్లే వెలుగొందు చుండును.*

*'నిత్య' అనగా శాశ్వతమైనది. వికల్పము లేనిది. ఈ పదహారు దేవతలును, పదహారు కళలుగ చంద్రుని నుండి తిథులద్వారా మనలను అనుగ్రహించు చుందురు. అమావాస్య నుండి పౌర్ణమి అంతము వరకు గల తిథులు పదహారు. పదహారు తిథుల యందు వ్యక్తావక్త స్వరూపిణి యగు శ్రీమాత పూర్ణమే అయిననూ చూచువారిని బట్టి వెలుగు నీడలు ఉన్నట్లు గోచరించును. చంద్రుడు వెలుగు భాగము వ్యక్త స్వరూపము. వెలగని భాగము అవ్యక్త స్వరూపము.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam  - 391 - 1 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*
*✍️. Acharya Ravi Sarma *
*📚. Prasad Bharadwaj*

*🌻 85. Nityaklinna nirupama nirvana sukhadaeini*
*Nitya shodashika rupa shree kantardha sharirini ॥ 85 ॥ 🌻*

*🌻 391. Nityā-ṣoḍaśikā-rūpā नित्या-षोडशिका-रूपा  -1 🌻*

*This is a reference to the sixteen deities representing sixteen lunar days and they are worshipped in Śrī Cakra.  The sixteenth deity is Lalitāmbikā Herself.  These fifteen deities are said to represent fifteen bīja-s of Pañcadaśī mantra and Lalitāmbikā as the sixteenth deity representing ṣodaśī mantra.  ṣodaśī mantra has sixteen bīja-s, the additional bīja being श्रीं (śrīṁ), the  Lakṣmī bīja. ṣodaśī mantra is considered as the most powerful mantra of all.  This is the mantra meant only for the final liberation.*

*ṣodaśī also refers to a type of sacrifice called agniṣṭoma, a fire ritual where the performer  maintains the sacred fire, the offering is the Soma, the deities to whom, the offering is made are Indra and other gods. The number of priests required is sixteen, the ceremonies continue for five days. This is based on strange mantra-s, full of interpolations, which are not found in Rig Veda, though they are referred in Śrautra Sūtra-s and Brāhmaṇa-s of Rig Veda and also occur in Sāma Veda and Atharva Veda.  Both chants and recitations are complex and are considered particularly sacred and powerful.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹