శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 545 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 545 - 2


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 545 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 545 - 2 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 111. పుణ్యకీర్తిః, పుణ్యలభ్యా, పుణ్యశ్రవణ కీర్తనా ।
పులోమజార్చితా, బంధమోచనీ, బంధురాలకా ॥ 111 ॥ 🍀

🌻 545. ‘పులోమజార్చితా’ - 2 🌻


రాక్షస పత్నులు కూడ దైవము చేతిలో తమ పతులు సంహరింప కుండునట్లు శ్రీమాత ప్రార్థనలు సలిపిరి. సావిత్రీదేవి శ్రీమాతను పూజించి తన భర్తను మరణము నుండి కాపాడు కొనినది. ద్రౌపతీ దేవి కూడ అట్లే యొనర్చినది. ఇట్లెన్నియో యుదంతములు కలవు. సంఘమునందు స్త్రీకి గౌరవము భర్తను బట్టియే. భర్తకు ఔన్నత్యము కలుగుటకు, ఆయురారోగ్యములు కలుగుటకు, ఐశ్వర్యము కలుగుటకు శ్రీమాతను పూజించు స్త్రీలు పుణ్యసతులు. వారిదే ఐశ్వర్యము.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 545 - 2 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️ Prasad Bharadwaj

🌻 111. Punyakirtih punyalabhya punyashravana kirtana
pulomajarchita bandhamochani bandhuralaka ॥111 ॥ 🌻

🌻 545. 'Pulomazarchita' - 2 🌻


Even the wives of demons prayed to Srimata that their husbands should not be killed by the lord. Savitri Devi worshiped Shrimata and saved her husband from death. Draupati Devi also did the same. There are many such stories. A woman's respect in society depends on her husband. Women who worship Sri Mata for their husband's eminence, longevity and wealth are virtuous women. Theirs is wealth.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


సిద్దేశ్వరయానం - 64 Siddeshwarayanam - 64


🌹 సిద్దేశ్వరయానం - 64 🌹

💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐

🏵 శిష్యురాలు భైరవీ బ్రాహ్మణి 🏵


యోగేశ్వరి ఇలా తీర్థయాత్రలలో క్షేత్ర కేంద్రీకృత తపస్సులో దాదాపు 40 సంవత్సరాలు గడిచిపోయినవి. గురువర్యులు ఇచ్చిన వరంవల్ల వయసు పైనబడ్డా ముసలి తనం రాలేదు. తనసంచారంలో భాగంగా కాశీ, బృందావనం మాత్రం తరుచుగా వెళ్ళి అక్కడ ఎక్కువ కాలం గడిపేది. కాశీలోని శవశివకాళీ మందిరంలో ధ్యానం చేస్తున్నపుడు తానే కాళినన్న తాదాత్మ్య భావన కలిగేది. అక్కడికి దగ్గరలో ఉన్న తారాపీఠంలో గాని, వటుక భైరవ మందిరానికి దగ్గరగా ఉన్న కామాఖ్య కాళి ఆలయంలో కాని ధ్యానం చేస్తే, అరుణ సుందరి అయిన మూర్తిగా తారా లక్షణాలుకల కాళి కనిపించేది. అంతః ప్రేరణవల్ల మళ్ళీ వంగదేశం సంచారం చేస్తూ భిన్న ప్రదేశములలో తటస్థించిన ఇద్దరు యువకులకు తాంత్రిక సాధనలు కొన్ని అభ్యసింప చేసింది. వారికి చిన్న చిన్న శక్తులు కొన్ని లభించినవి. ఒక యువకుడు కావాలనుకొన్నపుడు తన శరీరంలోనుండి కాంతి పుంజాలను ఎంతదూరమైనా ప్రసరింపచేయ గలిగేవాడు. మరొక వ్యక్తికి అదృశ్యుడయ్యేశక్తి వచ్చింది. ఈ శక్తులను దుర్వినియోగం చేయవద్దని వారిని హెచ్చరించి తనదోవన తాను సంచారానికి బయలు దేరింది.

ఒకనాడు కలకత్తాలో గంగానది మీద పడవలో వెళ్ళి ఎదురుగా రాణీరాసమణీదేవి కట్టించిన దక్షిణేశ్వరకాళీ మందిరం వైపునడిచింది. అక్కడికి యాత్రికులుగా వచ్చిన సన్యాసులకు దేవాలయ అధికారులు వసతి భోజన సౌకర్యాలు ఏర్పాటు చేస్తారని విని ఉన్నది. గుడివైపు నడుస్తుండగా ఒక యువకుడు ఆమెను ఎదురుగా వచ్చి "మా మామయ్య మిమ్ములను తీసుకురమ్మన్నాడు. రండి". అని ఆహ్వానించాడు. అక్కడ ఆమెకు పరిచితులెవరూ లేరు. మీ మామయ్య ఎవరు? ఎందుకు పిలుస్తున్నాడని అడగకుండా, సరే,పద అని ఆతని వెంబడి నడిచింది. ఆ యువకుడు గుడి పూజారి అయిన గదాధరుని దగ్గరకు తీసుకువెళ్ళాడు.

గదాధరుని చూడగానే తను అతని కోసమే వచ్చానని స్ఫురణకల్గింది. "నాయనా! నీవు ఇక్కడ ఉన్నావా! నీ కోసమే వెతుకుతూ వస్తున్నాను" అన్నది. గదాధరుడు కూడా అలానా? తల్లీ చాలా సంతోషము రా. అని మర్యాద చేసి సుఖాసనాసీనురాలిని చేశాడు.బాగా పరిచయమున్న వ్యక్తి తో మాట్లాడుతున్నట్లుగా గదాధరుడు తాను చేస్తున్న కాళీసాధన గురించి చెప్పి, తన అనుభవాలను చెప్పటం మొదలుపెట్టాడు. గదాధరుని మేనల్లుడు, ఆమెను ఆహ్వానించి తీసుకు వచ్చిన హృదయ్ ఆ దృశ్యాన్ని దిగ్భ్రాంతితో చూస్తున్నాడు. వారిద్దరూ చిరకాల పరిచితులవలె మాట్లాడుకుంటున్నారు. వారికి పూర్వపరిచయం లేదని తనకు తెలుసు. అద్భుత సౌందర్యంతో దివ్యతేజస్సుతో కాషాయంబరధారిణి యైన ఈ సన్యాసిని ఎవరు? ఆమె తన మేనమామను, గుడిపూజారిని నాయనా ! అని చిన్న పిల్లవానిగా పిలిచి మాట్లాడుతున్నది. తన మామ కూడ ఆమెను 'అమ్మా' అని తల్లివలె మాట్లాడుతున్నాడు. చూడటానికి ఇద్దరూ సమవయస్కులుగా ఉన్నారు. అతడికి ఏమీ అర్ధంకాలేదు. మామ సూచనను అనుసరించి ఆమెకు వసతి మొదలైన సౌకర్యాలు ఏర్పాటు చేయటం కోసం అతడు అవతలికి వెళ్ళాడు. గుడికి దగ్గరలో ఉన్న పంచవటిలో తాను చేసిన సాధనలను పొందిన దర్శనాలను, అనుభవాలను ఆమెకు విశదీకరించి చెప్పి "అమ్మా! నీవు చాలాగొప్పదానవు, సిద్ధురాలివి. నాకు కలిగిన ఈ అనుభవాలను విన్నవారు చాలా మంది మనః కల్పిత భ్రాంతులని కొట్టి వేస్తున్నారు. మరి కొందరు నన్ను పిచ్చివానిగా జమకడుతున్నారు. వీనిలో ఏది నిజమో నీవు చెప్పు అమ్మా” అని పసివాని వలె ఆమెను గదాధరుడు అభ్యర్థించాడు.

యోగేశ్వరి "నాయనా! నీవు పొందిన దర్శనాలు అనుభవాలు అన్నీ సుసత్యాలు. జగన్మాత అయిన కాళి నీకు ప్రసాదించిన అనుగ్రహ చిహ్నాలు. వాటి సత్యాన్ని గురించి నీవు సందేహించవలసిన పనిలేదు. కాదనే వారి సంగతి ఇక నేను చూచుకొంటాను. నీవు నిశ్చింతగా ఉండు" అన్నది.

( సశేషం )

🌹🌹🌹🌹🌹


శ్రీ శివ మహా పురాణము - 887 / Sri Siva Maha Purana - 887


🌹 . శ్రీ శివ మహా పురాణము - 887 / Sri Siva Maha Purana - 887 🌹

✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 40 🌴

🌻. శంఖచూడ వధ - 2 🌻


నీవు క్షణకాలములో బ్రహ్మాండమును అన్ని విధములుగా నాశనము చేయ సమర్థుడవు. ఓ ఈశ్వరా! ప్రస్తుతములో ఒక దానవుడగు శంఖచూడుని మాట చెప్పునదేమున్నది? (10) అయిననూ ప్రభువగు నీవు వేదమర్యాదను నశింప చేయరాదు. ఓ మహాదేవా! ఆ విషయమును విని, దానిని సత్యముగను సఫలముగను చేయుము (11). ఈతని చేతియందు మిక్కిలి ఉగ్రమగు విష్ణువు యొక్క శ్రేష్ఠకవచము, మరియు ఈతని భార్యకు పాతివ్రత్యము ఉన్నంతవరకు (12). ఈ శంఖచూడునకు వృద్ధాప్యము, మరణము లేవని బ్రహ్మ పలికి యున్నాడు. ఓ శంకరా! నాథా! ఆ మాటను నిలబెట్టుము (13). ఈ ఆకాశవాణిని విని అపుడు శివుడు సరే యని పలికెను. ఆయన సంకల్పము మేరకు అచటకు విచ్చేసిన విష్ణువును సత్పురుషులకు శరణ్యుడగు శంకరుడు ఆదేశించెను (14). మాయావులలో శ్రేష్ఠుడగు విష్ణువు ముసలి బ్రాహ్మణ వేషమును వేసుకొని, అపుడు శంఖచూడుని సమీపించి ఆతనితో నిట్లనెను (15).

వృద్ధబ్రాహ్మణుడిట్లు పలికెను - ఓ దానవరాజా! ఇపుడు నీవద్దకు వచ్చిన నాకు భిక్షనిమ్ము. నీవు దీనులయందు ప్రేమగలవాడవు. నా కోరికను నేను ముందుగా బయట పెట్టను. నీవు అంగీకరించిన తరువాత చెప్పెదను. అపుడు నీవు మాటను నెలబెట్టుకొనగలవు (16, 17). ప్రసన్నమగు ముఖము, కన్నులు గల ఆ చక్రవర్తి సరే అనెను. ఆ మోసగాడగు విష్ణువు 'నేను కవచమును కోరుచున్నాను' అని పలికెను (18).


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹




🌹 SRI SIVA MAHA PURANA - 887 🌹

✍️ J.L. SHASTRI, 📚. Prasad Bhadwaj

🌴 Rudra-saṃhitā (5): Yuddha-khaṇḍa - CHAPTER 40 🌴

🌻 Śaṅkhacūḍa is slain - 2 🌻


10. O Śiva, by all means, you are competent to destroy the entire universe in a trice. What doubt then in regard to a single Dānava Śaṅkhacūḍa?

11. Still, the limit imposed by the Vedas should not be disregarded by you, the lord. O great god, listen to that. Make it truthful and fruitful.

12-13. O lord Śiva, it has been mentioned by Brahmā, that, as long as he wears the armour of Viṣṇu and as long as his wife maintains the marital fidelity, Śaṅkhacūḍa has neither death nor old age. Please make those words truthful.’

14. On hearing this celestial voice, Śiva said “So be it”. Viṣṇu came there at the wish of Śiva. Śiva, who is the goal of the good, commanded him.

15. Then, in the guise of an old brahmin, Viṣṇu, the foremost of those who wield magic, approached Śaṅkhacūḍa and told him.


The aged brahmin said:—

16-17. “O lord of Dānavas, give me the alms for which I have come to you. I shall not say openly what I wish to have from you who are favourably disposed to the distressed. I shall tell you when you have promised me first.

18. With face and eyes indicating pleasure the king replied affirmatively. Then the deceptive Viṣṇu in the form of a brahmin said—“I am the suppliant for your armour.”


Continues....

🌹🌹🌹🌹🌹


శ్రీమద్భగవద్గీత - 533: 14వ అధ్., శ్లో 09 / Bhagavad-Gita - 533: Chap. 14, Ver. 09

 

🌹. శ్రీమద్భగవద్గీత - 533 / Bhagavad-Gita - 533 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 14వ అధ్యాయము - గుణత్రయ విభాగ యోగము - ప్రకృతి త్రిగుణములు - 9 🌴

09. సత్త్వం సుఖే సంజయతి రజ: కర్మణి భారత |
జ్ఞానమావృత్య తు తమ: ప్రమాదే సంజయత్యుత ||


🌷. తాత్పర్యం : ఓ భరతవంశస్థుడా! సత్త్వ గుణము మనుజుని సౌఖ్యమునందు బంధించును, రజోగుణము అతనిని కామ్యకర్మమునందు బంధించును, తమోగుణము జ్ఞానమును కప్పివేయుట ద్వారా బుద్ధిహీనత యందు అతనిని బంధించును.

🌷. భాష్యము : తత్త్వవేత్తగాని, విజ్ఞానశాస్త్రవేత్తగాని లేదా విద్యనొసగు అధ్యాపకుడుగాని తన జ్ఞానరంగమందు నియుక్తుడై తద్ద్వారా సంతృప్తుడై యుండునట్లు, సత్త్వగుణము నందున్నవాడు తన కర్మచే లేదా జ్ఞానసముపార్జనా యత్నముచే తృప్తుడై యుండును. రజోగుణము నందున్నవాడు కామ్యకర్మల యందు రతుడై శక్త్యానుసారముగా ధనమును కూడబెట్టును. పిదప అట్టి ధనమును సత్కార్యములకై వినియోగించుటకు అతడి కొన్నిమార్లు వైద్యశాలలను నిర్మించుట, ధర్మసంస్థలకు దానమిచ్చుట వంటి కర్మల నొనరించుచుండును. ఇట్టి కార్యములన్నియును రజోగుణము నందున్నవాని లక్షణములు. ఇక తమోగుణలక్షణము మనుజుని జ్ఞానమును కప్పివేయుట. అట్టి తమోగుణము నందు మనుజుడు ఏది ఒనరించినను అది అతనికిగాని, ఇతరులకుగాని మేలును చేయజాలదు.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 533 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 14 - Gunatraya Vibhaga Yoga - Nature, 3 Gunas - 09 🌴

09. sattvaṁ sukhe sañjayati rajaḥ karmaṇi bhārata
jñānam āvṛtya tu tamaḥ pramāde sañjayaty uta


🌷 Translation : O son of Bharata, the mode of goodness conditions one to happiness; passion conditions one to fruitive action; and ignorance, covering one’s knowledge, binds one to madness.

🌹 Purport : A person in the mode of goodness is satisfied by his work or intellectual pursuit, just as a philosopher, scientist or educator may be engaged in a particular field of knowledge and may be satisfied in that way. A man in the mode of passion may be engaged in fruitive activity; he owns as much as he can and spends for good causes. Sometimes he tries to open hospitals, give to charity institutions, etc. These are signs of one in the mode of passion. And the mode of ignorance covers knowledge. In the mode of ignorance, whatever one does is good neither for him nor for anyone.

🌹 🌹 🌹 🌹 🌹


🌹 23, MAY 2024 THURSDAY ALL MESSAGES గురువారం, బృహస్పతి వాసర సందేశాలు🌹

🍀🌹 23, MAY 2024 THURSDAY ALL MESSAGES గురువారం, బృహస్పతి వాసర సందేశాలు🌹🍀
1) 🌹. శ్రీమద్భగవద్గీత - 533 / Bhagavad-Gita - 533 🌹
🌴. 13వ అధ్యాయము - క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం - ప్రకృతి, పురుషుడు, చైతన్యము - 44 / Chapter 13 - Kshetra Kshtrajna Vibhaga Yoga - Nature, the Enjoyer and Consciousness - 44 🌴
2) 🌹. శ్రీ శివ మహా పురాణము - 887 / Sri Siva Maha Purana - 887 🌹
🌻. శంఖచూడుని వధ - 2 / The annihilation of Śaṅkhacūḍa - 2 🌻
3) 🌹 సిద్దేశ్వరయానం - 63 🌹
4) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 545 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 545 - 2 🌹 
🌻 545. ‘పులోమజార్చితా’ - 2 / 545. 'Pulomazarchita' - 2 🌻

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 533 / Bhagavad-Gita - 533 🌹*
*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. 14వ అధ్యాయము - గుణత్రయ విభాగ యోగము - ప్రకృతి త్రిగుణములు - 9 🌴*

*09. సత్త్వం సుఖే సంజయతి రజ: కర్మణి భారత |*
*జ్ఞానమావృత్య తు తమ: ప్రమాదే సంజయత్యుత ||*

*🌷. తాత్పర్యం : ఓ భరతవంశస్థుడా! సత్త్వ గుణము మనుజుని సౌఖ్యమునందు బంధించును, రజోగుణము అతనిని కామ్యకర్మమునందు బంధించును, తమోగుణము జ్ఞానమును కప్పివేయుట ద్వారా బుద్ధిహీనత యందు అతనిని బంధించును.*

*🌷. భాష్యము : తత్త్వవేత్తగాని, విజ్ఞానశాస్త్రవేత్తగాని లేదా విద్యనొసగు అధ్యాపకుడుగాని తన జ్ఞానరంగమందు నియుక్తుడై తద్ద్వారా సంతృప్తుడై యుండునట్లు, సత్త్వగుణము నందున్నవాడు తన కర్మచే లేదా జ్ఞానసముపార్జనా యత్నముచే తృప్తుడై యుండును. రజోగుణము నందున్నవాడు కామ్యకర్మల యందు రతుడై శక్త్యానుసారముగా ధనమును కూడబెట్టును. పిదప అట్టి ధనమును సత్కార్యములకై వినియోగించుటకు అతడి కొన్నిమార్లు వైద్యశాలలను నిర్మించుట, ధర్మసంస్థలకు దానమిచ్చుట వంటి కర్మల నొనరించుచుండును. ఇట్టి కార్యములన్నియును రజోగుణము నందున్నవాని లక్షణములు. ఇక తమోగుణలక్షణము మనుజుని జ్ఞానమును కప్పివేయుట. అట్టి తమోగుణము నందు మనుజుడు ఏది ఒనరించినను అది అతనికిగాని, ఇతరులకుగాని మేలును చేయజాలదు.*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 533 🌹*
*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*

*🌴 Chapter 14 - Gunatraya Vibhaga Yoga - Nature, 3 Gunas - 09 🌴*

*09. sattvaṁ sukhe sañjayati rajaḥ karmaṇi bhārata*
*jñānam āvṛtya tu tamaḥ pramāde sañjayaty uta*

*🌷 Translation : O son of Bharata, the mode of goodness conditions one to happiness; passion conditions one to fruitive action; and ignorance, covering one’s knowledge, binds one to madness.*

*🌹 Purport : A person in the mode of goodness is satisfied by his work or intellectual pursuit, just as a philosopher, scientist or educator may be engaged in a particular field of knowledge and may be satisfied in that way. A man in the mode of passion may be engaged in fruitive activity; he owns as much as he can and spends for good causes. Sometimes he tries to open hospitals, give to charity institutions, etc. These are signs of one in the mode of passion. And the mode of ignorance covers knowledge. In the mode of ignorance, whatever one does is good neither for him nor for anyone.*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 887 / Sri Siva Maha Purana - 887 🌹* 
*✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 40 🌴*

*🌻. శంఖచూడ వధ - 2 🌻*

*నీవు క్షణకాలములో బ్రహ్మాండమును అన్ని విధములుగా నాశనము చేయ సమర్థుడవు. ఓ ఈశ్వరా! ప్రస్తుతములో ఒక దానవుడగు శంఖచూడుని మాట చెప్పునదేమున్నది? (10) అయిననూ ప్రభువగు నీవు వేదమర్యాదను నశింప చేయరాదు. ఓ మహాదేవా! ఆ విషయమును విని, దానిని సత్యముగను సఫలముగను చేయుము (11). ఈతని చేతియందు మిక్కిలి ఉగ్రమగు విష్ణువు యొక్క శ్రేష్ఠకవచము, మరియు ఈతని భార్యకు పాతివ్రత్యము ఉన్నంతవరకు (12). ఈ శంఖచూడునకు వృద్ధాప్యము, మరణము లేవని బ్రహ్మ పలికి యున్నాడు. ఓ శంకరా! నాథా! ఆ మాటను నిలబెట్టుము (13). ఈ ఆకాశవాణిని విని అపుడు శివుడు సరే యని పలికెను. ఆయన సంకల్పము మేరకు అచటకు విచ్చేసిన విష్ణువును సత్పురుషులకు శరణ్యుడగు శంకరుడు ఆదేశించెను (14). మాయావులలో శ్రేష్ఠుడగు విష్ణువు ముసలి బ్రాహ్మణ వేషమును వేసుకొని, అపుడు శంఖచూడుని సమీపించి ఆతనితో నిట్లనెను (15).*

*వృద్ధబ్రాహ్మణుడిట్లు పలికెను - ఓ దానవరాజా! ఇపుడు నీవద్దకు వచ్చిన నాకు భిక్షనిమ్ము. నీవు దీనులయందు ప్రేమగలవాడవు. నా కోరికను నేను ముందుగా బయట పెట్టను. నీవు అంగీకరించిన తరువాత చెప్పెదను. అపుడు నీవు మాటను నెలబెట్టుకొనగలవు (16, 17). ప్రసన్నమగు ముఖము, కన్నులు గల ఆ చక్రవర్తి సరే అనెను. ఆ మోసగాడగు విష్ణువు 'నేను కవచమును కోరుచున్నాను' అని పలికెను (18).*

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 SRI SIVA MAHA PURANA - 887 🌹*
*✍️ J.L. SHASTRI, 📚. Prasad Bhadwaj *

*🌴 Rudra-saṃhitā (5): Yuddha-khaṇḍa - CHAPTER 40 🌴*

*🌻 Śaṅkhacūḍa is slain - 2 🌻*

10. O Śiva, by all means, you are competent to destroy the entire universe in a trice. What doubt then in regard to a single Dānava Śaṅkhacūḍa?

11. Still, the limit imposed by the Vedas should not be disregarded by you, the lord. O great god, listen to that. Make it truthful and fruitful.

12-13. O lord Śiva, it has been mentioned by Brahmā, that, as long as he wears the armour of Viṣṇu and as long as his wife maintains the marital fidelity, Śaṅkhacūḍa has neither death nor old age. Please make those words truthful.’

14. On hearing this celestial voice, Śiva said “So be it”. Viṣṇu came there at the wish of Śiva. Śiva, who is the goal of the good, commanded him.

15. Then, in the guise of an old brahmin, Viṣṇu, the foremost of those who wield magic, approached Śaṅkhacūḍa and told him.

The aged brahmin said:—
16-17. “O lord of Dānavas, give me the alms for

which I have come to you. I shall not say openly what I wish to have from you who are favourably disposed to the distressed. I shall tell you when you have promised me first.

18. With face and eyes indicating pleasure the king replied affirmatively. Then the deceptive Viṣṇu in the form of a brahmin said—“I am the suppliant for your armour.”

Continues....
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 సిద్దేశ్వరయానం - 64 🌹*

*💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐*
   
*🏵 శిష్యురాలు భైరవీ బ్రాహ్మణి 🏵*

*యోగేశ్వరి ఇలా తీర్థయాత్రలలో క్షేత్ర కేంద్రీకృత తపస్సులో దాదాపు 40 సంవత్సరాలు గడిచిపోయినవి. గురువర్యులు ఇచ్చిన వరంవల్ల వయసు పైనబడ్డా ముసలి తనం రాలేదు. తనసంచారంలో భాగంగా కాశీ, బృందావనం మాత్రం తరుచుగా వెళ్ళి అక్కడ ఎక్కువ కాలం గడిపేది. కాశీలోని శవశివకాళీ మందిరంలో ధ్యానం చేస్తున్నపుడు తానే కాళినన్న తాదాత్మ్య భావన కలిగేది. అక్కడికి దగ్గరలో ఉన్న తారాపీఠంలో గాని, వటుక భైరవ మందిరానికి దగ్గరగా ఉన్న కామాఖ్య కాళి ఆలయంలో కాని ధ్యానం చేస్తే, అరుణ సుందరి అయిన మూర్తిగా తారా లక్షణాలుకల కాళి కనిపించేది. అంతః ప్రేరణవల్ల మళ్ళీ వంగదేశం సంచారం చేస్తూ భిన్న ప్రదేశములలో తటస్థించిన ఇద్దరు యువకులకు తాంత్రిక సాధనలు కొన్ని అభ్యసింప చేసింది. వారికి చిన్న చిన్న శక్తులు కొన్ని లభించినవి. ఒక యువకుడు కావాలనుకొన్నపుడు తన శరీరంలోనుండి కాంతి పుంజాలను ఎంతదూరమైనా ప్రసరింపచేయ గలిగేవాడు. మరొక వ్యక్తికి అదృశ్యుడయ్యేశక్తి వచ్చింది. ఈ శక్తులను దుర్వినియోగం చేయవద్దని వారిని హెచ్చరించి తనదోవన తాను సంచారానికి బయలు దేరింది.*

*ఒకనాడు కలకత్తాలో గంగానది మీద పడవలో వెళ్ళి ఎదురుగా రాణీరాసమణీదేవి కట్టించిన దక్షిణేశ్వరకాళీ మందిరం వైపునడిచింది. అక్కడికి యాత్రికులుగా వచ్చిన సన్యాసులకు దేవాలయ అధికారులు వసతి భోజన సౌకర్యాలు ఏర్పాటు చేస్తారని విని ఉన్నది. గుడివైపు నడుస్తుండగా ఒక యువకుడు ఆమెను ఎదురుగా వచ్చి "మా మామయ్య మిమ్ములను తీసుకురమ్మన్నాడు. రండి". అని ఆహ్వానించాడు. అక్కడ ఆమెకు పరిచితులెవరూ లేరు. మీ మామయ్య ఎవరు? ఎందుకు పిలుస్తున్నాడని అడగకుండా, సరే,పద అని ఆతని వెంబడి నడిచింది. ఆ యువకుడు గుడి పూజారి అయిన గదాధరుని దగ్గరకు తీసుకువెళ్ళాడు.*

*గదాధరుని చూడగానే తను అతని కోసమే వచ్చానని స్ఫురణకల్గింది. "నాయనా! నీవు ఇక్కడ ఉన్నావా! నీ కోసమే వెతుకుతూ వస్తున్నాను" అన్నది. గదాధరుడు కూడా అలానా? తల్లీ చాలా సంతోషము రా. అని మర్యాద చేసి సుఖాసనాసీనురాలిని చేశాడు.బాగా పరిచయమున్న వ్యక్తి తో మాట్లాడుతున్నట్లుగా గదాధరుడు తాను చేస్తున్న కాళీసాధన గురించి చెప్పి, తన అనుభవాలను చెప్పటం మొదలుపెట్టాడు. గదాధరుని మేనల్లుడు, ఆమెను ఆహ్వానించి తీసుకు వచ్చిన హృదయ్ ఆ దృశ్యాన్ని దిగ్భ్రాంతితో చూస్తున్నాడు. వారిద్దరూ చిరకాల పరిచితులవలె మాట్లాడుకుంటున్నారు. వారికి పూర్వపరిచయం లేదని తనకు తెలుసు. అద్భుత సౌందర్యంతో దివ్యతేజస్సుతో కాషాయంబరధారిణి యైన ఈ సన్యాసిని ఎవరు? ఆమె తన మేనమామను, గుడిపూజారిని నాయనా ! అని చిన్న పిల్లవానిగా పిలిచి మాట్లాడుతున్నది. తన మామ కూడ ఆమెను 'అమ్మా' అని తల్లివలె మాట్లాడుతున్నాడు. చూడటానికి ఇద్దరూ సమవయస్కులుగా ఉన్నారు. అతడికి ఏమీ అర్ధంకాలేదు. మామ సూచనను అనుసరించి ఆమెకు వసతి మొదలైన సౌకర్యాలు ఏర్పాటు చేయటం కోసం అతడు అవతలికి వెళ్ళాడు. గుడికి దగ్గరలో ఉన్న పంచవటిలో తాను చేసిన సాధనలను పొందిన దర్శనాలను, అనుభవాలను ఆమెకు విశదీకరించి చెప్పి "అమ్మా! నీవు చాలాగొప్పదానవు, సిద్ధురాలివి. నాకు కలిగిన ఈ అనుభవాలను విన్నవారు చాలా మంది మనః కల్పిత భ్రాంతులని కొట్టి వేస్తున్నారు. మరి కొందరు నన్ను పిచ్చివానిగా జమకడుతున్నారు. వీనిలో ఏది నిజమో నీవు చెప్పు అమ్మా” అని పసివాని వలె ఆమెను గదాధరుడు అభ్యర్థించాడు.*

*యోగేశ్వరి "నాయనా! నీవు పొందిన దర్శనాలు అనుభవాలు అన్నీ సుసత్యాలు. జగన్మాత అయిన కాళి నీకు ప్రసాదించిన అనుగ్రహ చిహ్నాలు. వాటి సత్యాన్ని గురించి నీవు సందేహించవలసిన పనిలేదు. కాదనే వారి సంగతి ఇక నేను చూచుకొంటాను. నీవు నిశ్చింతగా ఉండు" అన్నది.*
*( సశేషం )*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 545 - 2  / Sri Lalitha Chaitanya Vijnanam  - 545 - 2 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁*

*🍀 111. పుణ్యకీర్తిః, పుణ్యలభ్యా, పుణ్యశ్రవణ కీర్తనా ।*
*పులోమజార్చితా, బంధమోచనీ, బంధురాలకా ॥ 111 ॥ 🍀*

*🌻 545. ‘పులోమజార్చితా’ - 2 🌻*

*రాక్షస పత్నులు కూడ దైవము చేతిలో తమ పతులు సంహరింప కుండునట్లు శ్రీమాత ప్రార్థనలు సలిపిరి. సావిత్రీదేవి శ్రీమాతను పూజించి తన భర్తను మరణము నుండి కాపాడు కొనినది. ద్రౌపతీ దేవి కూడ అట్లే యొనర్చినది. ఇట్లెన్నియో యుదంతములు కలవు. సంఘమునందు స్త్రీకి గౌరవము భర్తను బట్టియే. భర్తకు ఔన్నత్యము కలుగుటకు, ఆయురారోగ్యములు కలుగుటకు, ఐశ్వర్యము కలుగుటకు శ్రీమాతను పూజించు స్త్రీలు పుణ్యసతులు. వారిదే ఐశ్వర్యము.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam  - 545 - 2 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️ Prasad Bharadwaj*

*🌻 111. Punyakirtih punyalabhya punyashravana kirtana*
*pulomajarchita bandhamochani bandhuralaka ॥111 ॥ 🌻*

*🌻 545. 'Pulomazarchita' - 2 🌻*

*Even the wives of demons prayed to Srimata that their husbands should not be killed by the lord. Savitri Devi worshiped Shrimata and saved her husband from death. Draupati Devi also did the same. There are many such stories. A woman's respect in society depends on her husband. Women who worship Sri Mata for their husband's eminence, longevity and wealth are virtuous women. Theirs is wealth.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
#నిత్యసందేశములు #DailyMessages 
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
https://t.me/+9zDjTpPe_PQzMWVl
https://t.me/Sivasutras
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/bhagavadgeethaa/
https://t.me/AgniMahaPuranam
https://t.me/+LmH1GyjNXXlkNDRl
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages3
https://www.kooapp.com/profile/Prasad_Bharadwaj
https://www.threads.net/@prasad.bharadwaj