శ్రీ శివ మహా పురాణము - 887 / Sri Siva Maha Purana - 887


🌹 . శ్రీ శివ మహా పురాణము - 887 / Sri Siva Maha Purana - 887 🌹

✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 40 🌴

🌻. శంఖచూడ వధ - 2 🌻


నీవు క్షణకాలములో బ్రహ్మాండమును అన్ని విధములుగా నాశనము చేయ సమర్థుడవు. ఓ ఈశ్వరా! ప్రస్తుతములో ఒక దానవుడగు శంఖచూడుని మాట చెప్పునదేమున్నది? (10) అయిననూ ప్రభువగు నీవు వేదమర్యాదను నశింప చేయరాదు. ఓ మహాదేవా! ఆ విషయమును విని, దానిని సత్యముగను సఫలముగను చేయుము (11). ఈతని చేతియందు మిక్కిలి ఉగ్రమగు విష్ణువు యొక్క శ్రేష్ఠకవచము, మరియు ఈతని భార్యకు పాతివ్రత్యము ఉన్నంతవరకు (12). ఈ శంఖచూడునకు వృద్ధాప్యము, మరణము లేవని బ్రహ్మ పలికి యున్నాడు. ఓ శంకరా! నాథా! ఆ మాటను నిలబెట్టుము (13). ఈ ఆకాశవాణిని విని అపుడు శివుడు సరే యని పలికెను. ఆయన సంకల్పము మేరకు అచటకు విచ్చేసిన విష్ణువును సత్పురుషులకు శరణ్యుడగు శంకరుడు ఆదేశించెను (14). మాయావులలో శ్రేష్ఠుడగు విష్ణువు ముసలి బ్రాహ్మణ వేషమును వేసుకొని, అపుడు శంఖచూడుని సమీపించి ఆతనితో నిట్లనెను (15).

వృద్ధబ్రాహ్మణుడిట్లు పలికెను - ఓ దానవరాజా! ఇపుడు నీవద్దకు వచ్చిన నాకు భిక్షనిమ్ము. నీవు దీనులయందు ప్రేమగలవాడవు. నా కోరికను నేను ముందుగా బయట పెట్టను. నీవు అంగీకరించిన తరువాత చెప్పెదను. అపుడు నీవు మాటను నెలబెట్టుకొనగలవు (16, 17). ప్రసన్నమగు ముఖము, కన్నులు గల ఆ చక్రవర్తి సరే అనెను. ఆ మోసగాడగు విష్ణువు 'నేను కవచమును కోరుచున్నాను' అని పలికెను (18).


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹




🌹 SRI SIVA MAHA PURANA - 887 🌹

✍️ J.L. SHASTRI, 📚. Prasad Bhadwaj

🌴 Rudra-saṃhitā (5): Yuddha-khaṇḍa - CHAPTER 40 🌴

🌻 Śaṅkhacūḍa is slain - 2 🌻


10. O Śiva, by all means, you are competent to destroy the entire universe in a trice. What doubt then in regard to a single Dānava Śaṅkhacūḍa?

11. Still, the limit imposed by the Vedas should not be disregarded by you, the lord. O great god, listen to that. Make it truthful and fruitful.

12-13. O lord Śiva, it has been mentioned by Brahmā, that, as long as he wears the armour of Viṣṇu and as long as his wife maintains the marital fidelity, Śaṅkhacūḍa has neither death nor old age. Please make those words truthful.’

14. On hearing this celestial voice, Śiva said “So be it”. Viṣṇu came there at the wish of Śiva. Śiva, who is the goal of the good, commanded him.

15. Then, in the guise of an old brahmin, Viṣṇu, the foremost of those who wield magic, approached Śaṅkhacūḍa and told him.


The aged brahmin said:—

16-17. “O lord of Dānavas, give me the alms for which I have come to you. I shall not say openly what I wish to have from you who are favourably disposed to the distressed. I shall tell you when you have promised me first.

18. With face and eyes indicating pleasure the king replied affirmatively. Then the deceptive Viṣṇu in the form of a brahmin said—“I am the suppliant for your armour.”


Continues....

🌹🌹🌹🌹🌹


No comments:

Post a Comment