మాస్టర్ ఆర్. కె. ప్రజ్ఞా కుసుమాలు

🌹. మాస్టర్ ఆర్. కె. ప్రజ్ఞా కుసుమాలు 🌹




🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


🌹 . మాస్టర్ ఆర్. కె. ప్రజ్ఞా కుసుమాలు – 1 🌹
✍️. సద్గురు మారెళ్ల శ్రీ రామకృష్ణ
📚. ప్రసాద్ భరద్వాజ

ఇప్పుడున్న ఆధ్యాత్మికత అధ్యాత్మికత కాదు. ఏ ధర్మము కూడ మిమ్మల్ని ఆధ్యాత్మికత వైపు తీసుకు వెళ్ళటం లేదు. చనిపోయిన వాళ్ళను బతికించటం ఆధ్యాత్మికత కాదు. నీకు చావు లేదు అని చెప్పగలగటం ఆధ్యాత్మికత.

శారీరకమయినటువంటి ఆసనాల ద్వార మీరు అధ్యాత్మికతను పొందలేరు.
🌹 🌹 🌹 🌹 🌹

🌹 PRAJNA KUSUMALU – 1 🌹

✍️ Sadguru Sri Marella Sri Rama krishna 🙏
📚. Prasad Bharadwaja

Existing spirituality is not spirituality. There is no Right virtue that leads you to spirituality. Waking dead to living is not spirituality. Real spirituality to be able to say that you have no Death

You cannot attain spirituality by physical Asanaas alone
🌹 🌹 🌹 🌹 🌹 🌹



🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


🌹ఆర్. కె. ప్రజ్ఞా కుసుమాలు – 2 🌹
✍️ సద్గురు మారెళ్ల శ్రీ రామకృష్ణ 🙏
📚. ప్రసాద్ భరద్వాజ

గురువు ఎప్పుడు అర్ధం కాడు శిష్యుడుకి. గురువు యొక్క గొప్పతనం ఏ శిష్యుడు ఎప్పుడూ అర్ధం చేసుకోలెడు.

గురువే స్వయంగ శిష్యుడుని వెతుక్కుంటాడు తప్ప శిష్యుడు గురువును వెతుక్కునే ప్రక్రియ అసలు లేనే లేదు.
🌹 🌹 🌹 🌹 🌹

🌹 R. K. PRAJNA KUSUMALU – 2 🌹

✍️ Sadguru Marella Sri Ramakrishna
📚. Prasad Bharadwaja

The disciple can’t know a Master in his True Sense. No disciple can ever understand the Greatness of a Master.

Master himself seeks and find a disciple. There is no actual process of finding a Master by Disciple.
🌹 🌹 🌹 🌹 🌹 🌹



🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


🌹మస్టర్ ఆర్. కె. ప్రజ్ఞా కుసుమాలు – 3 🌹
✍️ సద్గురు మారెళ్ల శ్రీ రామకృష్ణ
📚. ప్రసాద్ భరద్వాజ

గురువు శిష్యుడు ఏమి ఇచ్చాడు అని చూడడు ఏ భావంతో ఇచ్చాడు అని చూస్తాడు. శిష్యుడు తన పరిమిత సర్వస్వం ఇచ్చేస్తే గురువు తన పూర్ణ సర్వస్వం ఇచ్చేస్తాడు.

శిష్యుడు ఒక అడుగు ముందుకు వేస్తే గురువు 100 అదుగులు ముందుకు వేస్తాడు. గురువుకి ఇచ్చే దక్షిణ చాలా ముఖ్యమైనది. శిష్యుడు ఇచ్చిన దక్షిణకు ప్రతిఫలంగా గురువు శిష్యుడుకు 100 రెట్లు ఇస్తాడు.
🌹 🌹 🌹 🌹 🌹

🌹Master RK PRAJNA KUSUMALU – 3 🌹
Sadguru Marella Sri Ramakrishna
📚. Prasad Bharadwaja

The Master does not see what the disciple gives, but sees what the Bhavana behind it. If the disciple gives his limited all, the Master gives his all in his totality

The disciple takes one step forward and the Master come 100 steps. The dakshina giving to master is very important. The master gives the disciple 100 times in return for the dakshina given by the disciple.
🌹 🌹 🌹 🌹 🌹



🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


🌹. మాస్టర్ ఆర్. కె. ప్రజ్ఞా కుసుమాలు – 4 🌹
✍️. సద్గురు మారెళ్ల శ్రీ రామకృష్ణ
📚. ప్రసాద్ భరద్వాజ

హిమాలయాలలో ఉన్న ఋషులకు అనంతమయిన శక్తి ఉన్నప్పటికీ కూడ వాళ్ళ కార్యక్రమాలకు ఆచరణ యోగ్యమయిన రూపు ఇవ్వలేక పోతున్నారు అంటే వాళ్ళకు స్థూల శరీరం లేదు కనుక. అందుకని వాళ్ళు స్థూల శరీర దారులతో సంబంధం పెట్టుకుంటారు.

వాళ్ళు చెప్పినటువంటి విషయాలు మార్చకుండ ఆ దేశకాల పరిస్థితులకు అనుగుణంగ మనుషులకు అవగాహన అయ్యే విధంగ చెప్పగలిగే వ్యక్తులను ఎన్నుకుంటారు. అలాంటి వారు వాళ్ళ ఇద్దరికి మధ్య వారధిగ పని చేస్తు గురువులాగ రూపొందుతూ ఉంటారు.
🌹 🌹 🌹 🌹 🌹

🌹Master RK PRAJNA KUSUMALU – 4 🌹
Sadguru Marella Sri Ramakrishna
📚. Prasad Bharadwaja

Though the Himalayan Rushis have infinite power, they are unable to give a physical shape to their work, because they have no gross body. That’s why they come in contact with gross Human beings.

They choose people who are capable to convey their teachings to make human population aware without changing them and formulated according present time space.

These choosen ones are the persons working as a bridge between the two, and preparing them self’s as higher reality Master’s
🌹 🌹 🌹 🌹 🌹



🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


🌹మస్టర్ ఆర్.కె ప్రజ్ఞా కుసుమాలు – 5 🌹
✍️ సద్గురు మారెళ్ల శ్రీ రామకృష్ణ
📚. ప్రసాద్ భరద్వాజ

ప్రపంచంలో అపవిత్రం కాని వస్తువు అగ్ని. ఆ పవిత్రత అనే లక్షణాన్ని శుచి అనే లక్షణంతో కూడ చెపుతాము. శుచి యొక్క పవిత్రత మీకు రావాలంటే పసుపు రంగును ఎక్కువుగా ఉపయోగించుకోవాలి.

పసుపు రంగు కల ఆలోచనలు మీకు రావాలి. పసుపు రంగు కల గుణాలు ఎక్కువ అయ్యాయో లేదో తెలియాలంటే మనలో సూక్ష్మ దృష్టి ఎక్కువ అవ్వాలి.
🌹 🌹 🌹 🌹 🌹

🌹Master RK PRAJNA KUSUMALU – 5 🌹
Sadguru Marella Sri Ramakrishna
📚. ప్రసాద్ Bharadwaja

The most sacred thing in the world is fire. We attribute that purity to the virtue Suchi. If you want to give yourself the purity of clean, then you should use yellow.

Yellow color ideas should come to you. If we want to know whether the properties of the yellow color are increased or not we need to have more settle understanding and to be more vigilant.
🌹 🌹 🌹 🌹 🌹



🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


🌹. మాస్టర్ ఆర్.కె. ప్రజ్ఞా కుసుమాలు – 6 🌹
✍️ సద్గురు మారెళ్ల శ్రీ రామకృష్ణ
📚. ప్రసాద్ భరద్వాజ

అగ్నిలో 3 రకాలు పావక, పవమాన, శుచి. పావక అగ్ని స్థూల జగత్తుకి సంబందించింది. పవమాన సూక్ష్మ జగత్తుకి సంబంధించినది, లేనిది మనం పొందటం పవమాన అగ్ని.

శుచి అగ్నిలో శిష్యుడు ప్రకృతి యొక్క నియమాలను ఉల్లఘించి గురువు యొక్క నియమాలలోకి వెళ్ళిపోతాడు.”
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Master Rk PRAJNA KUSUMALU – 6 🌹
✍️ Sadguru Marella Sri Ramakrishna
📚 Prasad Bharadwaj

There are there types of fires in manifestation.
Pavaka, Pavamana, Suchi.
Pavaka fire belongs to the physical world. Pavamana fire belongs to subtle world. What we don’t have, achieving that is Pavamana Fire.

When disciple enters Into Suchi fire, he overcomes nature laws and enters in to laws of Guru Chaitanya.
🌹 🌹 🌹 🌹 🌹



🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


🌹మాస్టర్ ఆర్. కె. ప్రజ్ఞా కుసుమాలు – 7 🌹
✍ సద్గురు మారెళ్ల శ్రీ రామకృష్ణ
📚. ప్రసాద్ భరద్వాజ

బాహ్య పరిస్థితులు ఎలా ఉన్నా మీలో ఉన్న శాంతి చెదరకుండా ఉండటానికి ప్రయత్నం చేస్తూ ఉండండి.

ప్రతీ రోజు 3 సార్లు శాంతి మంత్రం చేస్తున్నపుడు భావ పూర్వకంగా చెయ్యండి. ఒకటి స్థూల జగత్తులో శాంతి. రెండు సూక్ష్మ జగత్తులో శాంతి. మూడు కారణ జగత్తులో శాంతి.
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Master Rk PRAJNA KUSUMALU – 7 🌹
✍ Sadguru Marella Sri Ramakrishna
📚 Prasad Bharadwaj

Keep trying to keep the peace within you no matter what the external circumstances may be.

Do the Shanthi Matram 3 times daily. while chanting that strongly feel the Peace. One Shanthi in the gross world. Two Shanthi in subtle worlds. Three Shanthi in a cause world..
🌹 🌹 🌹 🌹 🌹



🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


🌹మాస్టర్ ఆర్.కె. ప్రజ్ఞా కుసుమాలు – 8 🌹
🌴 పాఠం తర్వాత పాఠం – అదే ప్రకృతి నియతి 🌴
✍️ మాస్టర్ మారెళ్ల శ్రీ రామకృష్ణ
📚. ప్రసాద్ భరద్వాజ

ప్రకృతిలో నువ్వు నేర్చుకున్న పాఠం ఇంకొకరికి చెప్పినప్పుడే నీకు కొత్త పాఠం చెప్పబడుతుంది. అర్హత బట్టే ఫలితాలు ఉంటాయి తప్ప భగవంతుడు కానీ, గురువు కానీ నువ్వు అడగడం వలన ఫలితాలు ఇవ్వరు.

🌹Master RK PRAJNA KUSUMALU – 8 🌹
🌴 Lesson after lesson – It’s the law of Nature🌴
✍️ Master Marella Sri Ramakrishna
📚. Prasad Bharadwaj

When you tell someone what you learned in nature, you will be told a new lesson. Unless you qualify Results will not be there. By mere asking the Lord or Master will not give you results.
🌹 🌹 🌹 🌹 🌹 🌹



🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


🌹ప్రజ్ఞా కుసుమాలు – 9 🌹
✍ సద్గురు మారెళ్ల శ్రీ రామకృష్ణ
📚. ప్రసాద్ భరద్వాజ

యోగి కులములో పుట్టడం చాలా దుర్లభము. లక్ష్యము వైపుకి ఏకాగ్రతతో పని చెయ్యగలిగటము అనగా రుచి, నీతి కల్గి ఉండటము. ఉత్తాన పాదుడు నుండీ ధృవ నక్షత్రానికి వెళ్ళటానికి అంటే బుధ్ది మీద ఉన్న ధృవ సూర్య నక్షత్రాలను ఉపయోగించుకుని, ద్వాదశ రాశి చక్రాన్ని తనలో తాను చూసుకుని బయట ఉన్నదంతా తనలోనే ఉన్నది అని వాసుదేవ సర్వమితి అనే సాధనా స్ధితికి చేరుకోవాలంటె ధృవుని కధ అర్ధము చేసుకోవాలి.

అందులోనే సూర్యుడి కధ కూడా ఉన్నది. సోమ రసాన్ని విశ్వకర్మ అని కూడా అనవచ్చు. సూర్యుడి యొక్క అనంత శక్తి ధారలు సూర్య గ్రహముగా మారినప్పుడు 7 శక్తి ధారలుగా మాత్రమే ఉపయోగించుకోవచ్చు. సుషుమ్న, హరికేశ, విశ్వకర్మ, విశ్వత్రయాచస్, సన్నద్ధ, సర్వావసు, స్వరాత్ అను 7 సూర్యుని యొక్క కిరణాలు.

సూక్ష్మ జగత్తులో నాలుగు దిశలు, స్థూల జగత్తులో నాలుగు దిశలు 8 కలిపి అష్టాక్షరీ మంత్రము సూర్యుడిది. అది “ఘృణి సూర్య ఆదిత్య ఓం”
🌹 🌹 🌹 🌹 🌹



🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


🌹ప్రజ్ఞా కుసుమాలు – 10 🌹
✍ సద్గురు మారెళ్ల శ్రీ రామకృష్ణ
📚. ప్రసాద్ భరద్వాజ

చంద్రుడు మన సౌరకుటంబములోని వాడు కాదు, చంద్రుని కిరణాలు సూర్యకిరణాల రిఫ్లెక్షన్ కాదు, కాస్మిక్ కాన్సియస్నెస్ లో ఏ యజ్ఞ విధానము ద్వారా ఋషులు సోమరసాన్ని ప్రసరింప చెయ్యగలిగారో అది పృధ్వి పైకి నెప్టూన్ ద్వారా, చంద్రుడి ద్వారా వస్తాయి.

చంద్రుడి నుంచి వచ్చే కిరణాలు భౌతిక జీవితములోని సృష్టి కార్యక్రమాలకి ఉపయోగ పడతాయి. ఆధ్యాత్మిక ద్విజత్వము నెప్చూన్ అనే ఇంద్రగ్రహము ద్వారా కల్గుతుంది. లలితా అమ్మవారి తలపై ఉండే చంద్రుడు ఆధ్యాత్మిక చంద్రుడు.

మంగళవారము నాడు సూర్యోదయ కాలములో విశిష్టమైన కిరణాలు భూమి మీదకి ప్రసరింపబడతాయి. (సూర్యోదయానికి 10 నిమిషాలు ముందు, తరువాత) ఆ సమయములో కుజగ్రహ దోష నివారణకు కాషాయ రంగు వర్ణాన్ని ఊహించుకోగలిగితే 7 రోజులలో ఆ దోషము పోతుంది.

కుజుడు శక్తిధారలు (యురేనస్) వరుణుడి శక్తిధారల్తో కలిసినప్పుడూ శంబళ ఏర్పడుతుంది. “శ ర వ ణ భ వ” అను అక్షరాలను జపించటము వలన ధైర్య సాహసములు మనలో అభివృధ్ధి చెందుతాయి.

మాట్లాడలేనివారికి బుధవారము నాడు మన ఆజ్ఞా చక్రము నుండి రోగి స్వరపేటిక పైకి కాపర్ సల్ఫేట్ కలర్ ను ప్రసరింపచేస్తే వారికి చక్కటి వాక్కు వస్తుంది.

కుజ గ్రహము ఋషి పేరు అగస్త్యుడు, బుధ గ్రహము ఋషి నారదుడు.
🌹 🌹 🌹 🌹 🌹



🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

 

🌹 మాస్టర్ ఆర్. కె. ప్రజ్ఞా కుసుమాలు – 11 🌹
✍ సద్గురు మారెళ్ల శ్రీ రామకృష్ణ
📚. ప్రసాద్ భరద్వాజ

మానవ జీవితంలో సగం కాలం మనం నిద్రకే ఉపయోగిస్తున్నాం. మిగిలిన సగం కాలాన్ని వ్యర్ధం చేసుకోకుండా కాలాన్ని నిరంతరం సవ్యమయిన పని కోసం ఉపయోగించుకోండి అనేటటువంటి ప్రిన్సిపల్ మనం సూర్యుడు దగ్గర నుండి నేర్చుకోవాలి. సూర్యుడి యొక్క మొదటి ప్రిన్సిపల్ పంక్చుయాలిటీ రెండవ లక్షణం రెగ్యులారిటి. సూర్యోపాసన చేసే వాళ్ళు ఇవి నేర్చుకోవాలి.

సూర్యుడు, చంద్రుడు, అగ్ని ఈ మూడు పదాలు లేకుండా భారతీయ ఆధ్యాత్మికత లేనే లేదు. ఈ సూర్య చంద్రులు అగ్నిని మన శరీరంలొ ఏ విధంగా ఉపయోగించు కోవాలో తెలుసుకుంటూ దాన్ని బాహ్య జగత్తులోకి ప్రతి క్షేపించు కోవడమే మహాయజ్ఞములు ద్వార మహా ప్రాణ కుండలిని యొక్క మంధనము.
🌹 🌹 🌹 🌹 🌹



🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


🌹 మాస్టర్ ఆర్. కె. ప్రజ్ఞా కుసుమాలు – 12 🌹
✍ సద్గురు మారెళ్ల శ్రీ రామకృష్ణ
📚. ప్రసాద్ భరద్వాజ

పుట్టినటువంటి బాలుడు ఎటువంటి లక్ష్యాన్ని, ఎటువంటి గమ్యాన్ని చేరుకోగలడో సంకేతంగా ప్రకృతిలో సూచించ గలిగేటటు వంటిది పేరు పెట్టగలగడం.

పేరు పెట్టిన తరువాత ఆ చిరంజీవి అటువంటి లక్ష్యాన్ని చేరుకోవడంలో సమాజం యొక్క, కుటుంబం యొక్క, తల్లితండ్రుల యొక్క ఎంత యోగ దానం ఉంటుదో నిర్ణయించుకొనే అవకాశం నామకరణ సంస్కారం వలన వస్తుంది.”
🌹 🌹 🌹 🌹 🌹



🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

 

🌹 మాస్టర్ ఆర్. కె. ప్రజ్ఞా కుసుమాలు – 13 🌹
✍ సద్గురు మారెళ్ల శ్రీ రామకృష్ణ
📚. ప్రసాద్ భరద్వాజ

శ్వాసపై దృష్టిని నిరంతరము ఉంచుకోవాలి. గాయత్రీ మంత్రము, శ్వాసను అర్ధం చేసుకునే ప్రయత్నము చెయ్యండి.

పుట్టిన దగ్గర నుంచి మళ్ళీ శరీరము వదిలేవరకు అజపా గాయత్రీ నిరంతరము ప్రతి మనిషి ప్రతి జీవిలోను శ్వాస ద్వారా జరుగుతూనే ఉంటుంది. అధ్యాత్మిక జగత్తులోకి ప్రవేశించటమే చాలా కష్టము, అందులో అడుగు పెట్టేవాళ్ళే చాలా తక్కువ, అక్కడకి వచ్చే వాళ్ళు చాలా మటుకు వాళ్ళ సమస్యల నివారణకే వస్తారు కానీ, నిజమైన అధ్యాత్మికతను తెలుసుకునేందుకు వచ్చే వాళ్ళను వేళ్ళ మీద లెక్క పెట్టవచ్చు.
🌹 🌹 🌹 🌹 🌹



🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

 

🌹 మాస్టర్ ఆర్. కె. ప్రజ్ఞా కుసుమాలు – 14 🌹
✍ సద్గురు మారెళ్ల శ్రీ రామకృష్ణ
📚. ప్రసాద్ భరద్వాజ

మేధా యజ్ఞములు అతి ఉన్నతమైన యజ్ఞములు. అవి – సరమేధము, నర మేధము, గోమేధము & అశ్వమేధ యజ్ఞము. అశ్వమేధ యజ్ఞము అన్నింటి కంటే ఉత్తమమైన యజ్ఞము.

శ్రేష్టమైనటు వంటి పురుషార్ధము చెయ్యగలిగే వ్యక్తుల సముదాయము అధ్భుతమైనటు వంటి మహత్తరమైనటు వంటి శ్రేష్టమైనటు వంటి ఆలోచనలను కార్యరూపము దాల్చటానికి చేసే సామూహిక ప్రయత్నాన్ని అశ్వమేధ యజ్ఞము, వశిష్ఠ విశ్వామిత్రుల సంయోగము అని కూడా అంటారు.
🌹 🌹 🌹 🌹 🌹

 


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


🌹 మాస్టర్ ఆర్. కె. ప్రజ్ఞా కుసుమాలు – 15 🌹
✍ సద్గురు మారెళ్ల శ్రీ రామకృష్ణ
📚. ప్రసాద్ భరద్వాజ

యజ్ఞము సనాతన భారతీయ సంస్కృతికి, లేదా దేవ సంస్కృతికి మూల స్థంభము.

మనలోనూ, ప్రకృతిలోనూ ఉన్న మాలిన్యాలను తొలగించి, అపసవ్యతలను తిరిగి సవ్యముగా మార్చడానికి యజ్ఞములు దోహదపడతాయి. దైవీ సంస్కృతి వైపుకు మనల్ని తీసుకు వెళ్లడంలో ప్రధాన భూమిక యజ్ఞములదే.

యజ్ఞ ధూమం వలన వాయు పరిశుద్ధతయే కాకుండ అక్కడ ఉన్న స్థలము, పృధ్వి, జలము అన్నీ పరిశుద్ధ మవుతాయి. అంతే కాక మానవశరీరం లో రోగనిరోధక అణువుల పెరుగుదల ఉంటుంది అందువలన అతని ఆరోగ్యము బాగుపడుతుంది.

యజ్ఞధూమం యొక్క సాత్విక లక్షణాలు మేఘంలో జొరబడి వర్షించి భూమి మీద ఉన్న అన్నంలో సత్వగుణ పరిమాణాన్ని పెంచుతాయి.
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


🌹 మాస్టర్ ఆర్. కె. ప్రజ్ఞా కుసుమాలు – 16 🌹
✍ సద్గురు మారెళ్ల శ్రీ రామకృష్ణ
📚. ప్రసాద్ భరద్వాజ

భువనేశ్వరి సాధనని నారదుడు చేసాడు. ఈ వామమార్గ పధ్ధతిలో నాభి వద్ద ఏకాగ్రతతో సంయమనం చేయగలిగిన వ్యక్తీ తన శరీరం యెుక్క నిర్మాణం పూర్తిగా అర్ధం చేసుకోగలడు.

ఎక్కడ ఎలా ప్రవర్తించాలి అనేటటువంటి జ్ఞానము నాభి నుంచి వస్తుంది.
🌹 🌹 🌹 🌹 🌹



🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


🌹 మాస్టర్ ఆర్. కె. ప్రజ్ఞా కుసుమాలు – 17 🌹
✍ సద్గురు మారెళ్ల శ్రీ రామకృష్ణ
📚. ప్రసాద్ భరద్వాజ

దివ్య మేధస్సు, దివ్య పురుషార్ధాన్ని జాగృతము చేసి వాటిని కలిపి రాష్ట్ర స్థాయిలో యజ్ఞీయ జీవిత విధానాన్ని పాటించే, మరియు వ్యక్తి వ్యక్తిని జోడొంచే అసామానమైన ప్రక్రియే అశ్వమేధ యజ్ఞము.

ఆధ్యాత్మిక జీవితములో ప్రతి క్షణము పరీక్షే. అననుకూల పరిస్ధితులను అనుకూలముగా మార్చుకొనుట, మృత్యువుకు భయపడకుండా ఉండుట అనే లక్షణాలు ప్రతి సాధకుడు జీర్ణించుకొని తీరాలి. మనస్సు బుధ్ధి చిత్తములను సరిగ్గా అర్ధము చేసుకొనుట వలన మాత్రమే సూర్య విజ్ఞానాన్ని అర్ధము చేసుకొనవలెను.
🌹 🌹 🌹 🌹 🌹



🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


🌹. మాస్టర్ ఆర్. కె. ప్రజ్ఞా కుసుమాలు – 18 🌹
✍. సద్గురు మారెళ్ల శ్రీ రామకృష్ణ
📚. ప్రసాద్ భరద్వాజ

ప్రాణమయ కోశ జాగరణ అంటే ఒక వైపు సంకల్పం జాగృతం అవ్వాలి ఇంకో వైపు ఆకర్షణ జాగృతం అవ్వాలి. ఆకర్షణ ఎక్కడ ఉంటుదో అక్కడే సంకల్పము ఉంటుంది. ఒక వస్తువు పొందాలి అనే ఆకర్షణ ఉంటే దాన్ని సాధించి తీరాలి అనే సంకల్పము వస్తుంది. ఘర్షణ ఎక్కడ జరుగుతుందో అక్కడ శక్తి ఉత్పాదమవుతుంది.

భరతుడు పేరు మీదనే ఈ దేశము ఆవీర్భవించింది. భరతుడు మహా యజ్ఞాల ద్వారానే ఈ దేశాన్ని తపోభూమిగా మార్చాడు. ఎక్కడ ఎక్కడ మహా యజ్ఞాలు జరిగాయొ అక్కడ అక్కడ తీర్ధాలు స్థాపించబడ్డాయి. మన సమస్యలను తీర్చెటటువంటి క్షేత్రాలను తీర్దములు అని పేరు పెట్టారు. యిప్పుడు తీర్ధస్థలాలు కూడా వాటి శక్తిని కోల్పోయే పరిస్ధితి వచ్చింది.
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


🌹. మాస్టర్ ఆర్. కె. ప్రజ్ఞా కుసుమాలు – 19 🌹
✍. సద్గురు మారెళ్ల శ్రీ రామకృష్ణ
📚. ప్రసాద్ భరద్వాజ

మానవజాతి లక్ష్యము : ప్రస్తుత కాలములో 2100 సంవత్సరములోపు మొత్తము మానవజాతి 3 డైమెన్షన్ ప్రపంచమునుండి 4 డైమెన్షన్లోకి ప్రవేశించగలగాలి. ఇది సవితా ధ్యానము & గాయత్రీ మంత్రము వలన అత్యంత సునాయాసముగా సాధించవచ్చు.

పండిత శ్రీ రామ శర్మ గురుదేవులు తమ తప: శక్తి ద్వారా మానవత్వాని బీజరూపంలో అంతరిక్షమునందు భద్రపరచారు. కానీ మానవజాతి తన పోకడను మార్చుకోకపోతే భూమిపై వారి మనుగడ ప్రశ్నార్ధకముగా మారే పరిస్ధితులు ఉన్నాయి. పృధ్విపై స్వర్గావతరణలో భాగముగా ప్రస్తుతపు విద్యా విధనములోను, బ్యాంకింగ్ వ్యవస్థలోనూ, వైద్య విధానములోను అనూహ్యమైన మార్పులు వస్తాయి. విద్యా విధానములో చేతనత్వ విజ్ఞానము ప్రముఖపాత్ర వహిస్తుంది. పెరిగిన కమ్యూనికేషన్ వ్యవస్థ వలన బ్యాంకింగ్ మరియు వైద్య రంగాలూ పూర్తిగా ఉన్నత స్ధితికి తగిన విధముగా పరిణితి చెందుతాయి.

మానవులు ప్రతి రోజూ కొంత సమయాన్ని తమ చేతనత్వాని వికసింపచేసుకునేందుకు కేటాయించుకొనుట తప్పనిసరి. ప్రతి మానవునిలోని మానవత్వము జాగృతమైతే కానీ ప్రస్తుతము ఎదుర్కొంటున్న సమస్యలనుండి మానవజాతి బయటపడలేదు, మానవులు దేవ మానవులుగా మారటము వారి తక్షణ కర్తవ్యము.

వసుధైక కుటుంబకము, పృధ్విపై స్వర్గావతరణ అను తమ గురుదేవుల కలే తమ కల, మన అందరి కల కూడ కావాలి.
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


🌹. మాస్టర్ ఆర్. కె. ప్రజ్ఞా కుసుమాలు – 20 🌹
✍. సద్గురు మారెళ్ల శ్రీ రామకృష్ణ
📚. ప్రసాద్ భరద్వాజ

శ్రీకృష్ణుడు శరీరం వదిలనప్పటి నుండి సత్రయాగం జరుగుతోంది హిమాలయాలలో. ఆ ప్రదేశాన్ని శంబల అంటారు.

ఈ సత్రయాగం జరుగుతున్న చోట వాళ్ళు ఏమి చేస్తున్నారు అంటె ఎక్కడెక్కడ మానవజాతి అస్త్ర విధ్యని మర్చి పోయెటటువంటి పరిస్థితి ఏర్పడుతుందొ అక్కడక్కడ ఒక మహా పురుషుడిని పుట్టించి ఈ విద్య నాశన మయి పోకుండ చూస్తూ వస్తున్నారు.
🌹 🌹 🌹 🌹 🌹



🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



No comments:

Post a Comment