🌹 22, JUNE 2024 SATURDAY ALL MESSAGES శనివారం, భాను వాసర సందేశాలు🌹

🍀🌹 22, JUNE 2024 SATURDAY ALL MESSAGES శనివారం, భాను వాసర సందేశాలు🌹🍀
🌹 ఏరువాక జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి పౌర్ణమి శుభాకాంక్షలు అందరికి 🌹
1) 🌹. శ్రీమద్భగవద్గీత - 544 / Bhagavad-Gita - 544 🌹
🌴. 13వ అధ్యాయము - క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం - ప్రకృతి, పురుషుడు, చైతన్యము - 55 / Chapter 13 - Kshetra Kshtrajna Vibhaga Yoga - Nature, the Enjoyer and Consciousness - 55 🌴
3) 🌹 సిద్దేశ్వరయానం - 86 🌹
🏵 స్వామి విశుద్ధానంద - 1 🏵
4) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 549 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 549 - 1 🌹 
🌻 549. 'విద్యా' - 1 / 549. 'Vidya' - 1 🌻

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 ఏరువాక జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి పౌర్ణమి శుభాకాంక్షలు అందరికి 🌹*
*ప్రసాద్ భరద్వాజ*

*జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి. ఏరువాక పున్నమి. కృషిక పున్నమి. ఏరువాక పౌర్ణమి అనేక నామాలతో ఈ పండుగను ఈ ఉత్సవాన్ని మనం నిర్వహించు కుంటున్నాం. ముఖ్యంగా వ్యవసాయదారులకు ఈ పండుగ పెట్టింది పేరు. ఏరువాక అనగానే ప్రయాణం చేయడం అనే అర్థాన్ని మనకు స్ఫురిస్తాయి. ఏరు అంటే పంటపొలాలు, నాగలి అని అర్థం వుంది. నాగలితో కృషిక క్రియకు ఉపక్రమించడం ఏరువాక అని అర్థం. అంటే దుక్కి దున్నడం. ఈ రోజు వ్యవసాయదారులు తమ సంరక్షణలో వుండే జంతువులను అనగా వృషభాలను చక్కగా కడిగి కొమ్ములకు రంగులు వేసి అలంకరించి వాటితో పాటుగా నాగలిని ఒక భుజంపై పట్టుకొని ఇతర వ్యవసాయ పనిముట్లను తీసుకొని వ్యవసాయ క్రియకి ఉపక్రమించడం ఈరోజు ఆరంభం చేస్తారు. కనుక దీనిని ఏరువాక పున్నమి అని పేరు.*

*ఈ ఏరువాక పున్నమికి సీతాయజ్ఞము అని పేరు పెట్టింది విష్ణుపురాణము. "మంత్ర యజ్ఞా పరా విప్రాః" - అంటే బ్రాహ్మణులు మంత్రాదులు జపం చేయడంలో యజ్ఞం వలె ఆ దీక్షతో, లక్ష్యంతో వ్యవహరిస్తారు. అలాగే కర్షకులు సీతా యజ్ఞము - సీత అంటే నాగలి. నాగలితో దుక్కి దున్నుతూ వ్యవసాయాన్ని ఆరంభించి పంటలు పండిస్తారు. ఇది వారికి యజ్ఞంతో సమానం. అని వివరిస్తుంది విష్ణుపురాణం.*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 544 / Bhagavad-Gita - 544 🌹*
*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. 14వ అధ్యాయము - గుణత్రయ విభాగ యోగము - ప్రకృతి త్రిగుణములు - 20 🌴*

*20. గుణానేతానతీత్య త్రీన్ దేహీ దేహసముద్భవాన్ |*
*జన్మమృత్యుజరాదు:ఖైర్విముక్తోమృతమశ్నుతే ||*

*🌷. తాత్పర్యం : దేహధారియగు జీవుడు దేహముతో కూడియున్న ఈ త్రిగునములను దాటగాలిగినప్పడు జనన, మరణ, వార్ధక్యక్యముల నుండియు మరియు వాని దు:ఖముల నుండియు విడివడి ఈ జన్మమునందే అమృతత్వమును పొందును.*

*🌷. భాష్యము : సంపూర్ణ కృష్ణభక్తిభావనలో ప్రస్తుత దేహమునందే మనుజుడు ఏ విధముగా ఆధ్యాత్మికస్థితిలో నిలువగలడో ఈ శ్లోకమున వివరింపబడినది. “దేహే” యను పదమునకు దేహధారి యని భావము. అనగా జీవుడు దేహధారియైనను ఆధ్యాత్మికజ్ఞానమునందు పురోగతిని బడయుట ద్వారా త్రిగుణముల ప్రభావము నుండి బయటపడగలడు. దేహత్యాగము పిమ్మట నిక్కముగా భగవద్దామమునకు చేరనున్నందున అతడు ప్రస్తుత దేహమునందే ఆధ్యాత్మికజీవన ఆనందమును అనుభవింపగలడు.*

*ఆధ్యాత్మికకానందమును అతడు ప్రస్తుత దేహమునందు అనుభవించుననుట నిశ్చయమైన విషయము. అనగా కృష్ణభక్తిభావనలో నొనరింపబడు భక్తియుత సేవ భౌతికసంపర్కము నుండి ముక్తికి చిహ్నమై యున్నది. ఈ విషయము రాబోవు అష్టాదశాధ్యాయమున వివరింపబడును. అనగా త్రిగుణముల ప్రభావము నుండి మనుజుడు బయటపడినపుడు భక్తియుతసేవ యందు ప్రవేశించును.*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 544 🌹*
*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*

*🌴 Chapter 14 - Gunatraya Vibhaga Yoga - Nature, 3 Gunas - 20 🌴*

*20. guṇān etān atītya trīn dehī deha-samudbhavān*
*janma-mṛtyu-jarā-duḥkhair vimukto ’mṛtam aśnute*

*🌷 Translation : When the embodied being is able to transcend these three modes associated with the material body, he can become free from birth, death, old age and their distresses and can enjoy nectar even in this life.*

*🌹 Purport : How one can stay in the transcendental position, even in this body, in full Kṛṣṇa consciousness, is explained in this verse. The Sanskrit word dehī means “embodied.” Although one is within this material body, by his advancement in spiritual knowledge he can be free from the influence of the modes of nature. He can enjoy the happiness of spiritual life even in this body because, after leaving this body, he is certainly going to the spiritual sky.*

*But even in this body he can enjoy spiritual happiness. In other words, devotional service in Kṛṣṇa consciousness is the sign of liberation from material entanglement, and this will be explained in the Eighteenth Chapter. When one is freed from the influence of the modes of material nature, he enters into devotional service.*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 సిద్దేశ్వరయానం - 86 🌹*
*💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐*
   
*🏵 స్వామి విశుద్ధానంద - 1 🏵*

*శ్లో || ఆరక్త జిహ్వాం వికటోగ్ర దంష్ట్రాం శూన్యాంబరాం సుందర భీషణాంగీం కర త్రిశూలం గళముండమాలాం కాళీం కరాళీం సతతం భజామి.*
*అని స్తుతిస్తూ పరమాత్మస్వామి కాళీపూజ చేస్తున్నాడు. పూజానంతరం వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలిచ్చి సందర్శకుల కోసం ఒక గదిలో కూర్చున్నారు. వ్యక్తిగత సమస్యల పరిష్కారానికి, మంత్రోపదేశం తీసుకోటానికి వివిధ కారణాలతో జనం వస్తున్నారు. ఇంతలో ఒక శిష్యుడు వచ్చి "గురువుగారూ! ఈ కాశిలో ప్రసిద్ధులైన యోగి విశుద్ధానందులవారు వచ్చారు" అని మనవి చేశాడు.*

*స్వామివారి అనుమతితో ఆయనవచ్చి నమస్కరించారు. అతిథి మర్యాదల తరువాత వారి కోరికతో కొంతసేవు ఏకాంత సమావేశం ఏర్పాటు చేయబడింది.*
*విశుద్ధానంద: స్వామివారూ! మీరు కాళీదేవతానుగ్రహం వల్ల ఎన్నో అద్భుత శక్తులు సాధించారని త్రైలింగస్వామి వంటి దీర్ఘకాలజీవి కూడా మీరంటే ఎంతో గౌరవం చూపిస్తారని విన్నాను. నేను సామాన్యంగా ఎవరినీ చూడటానికి వెళ్ళను. కానీ ఎందుకో మిమ్ము దర్శించాలని అనిపించి వచ్చాను.*

*పరమాత్మ: ఆ అనిపించటానికి కారణం చెపుతాను. కవికుల గురువైన కాళిదాసు ఇలా పలికాడు.*
*శ్లో || రమ్యాణి వీక్ష్య మధురాంశ్చ నిశమ్య శబ్దాన్ పర్యుత్సుకోభవతి యత్సుఖితో2పిజంతుః*
*తచ్చేతసా స్మరతి నూన మబోధపూర్వం భావస్థిరాణి జననాంతర సౌహృదాని.*
*అందమైన దృశ్యాలు చూచి, మధురమైన శబ్దాలు విని సుఖానుభూతిలో ఉన్నవాడు ఒక్కసారి ఊహించని యేదో మానసిక సంచలనానికి లోనవుతాడు. అంతరాంతరాలలో పూర్వజన్మకు సంబంధించిన అనుభవాలు స్మృతికి రావడమే కారణం.*

*విశుద్ధానంద: అదియేదో తెలుసుకోవాలని కుతూహలం కలుగు తున్నది.*
*పరమాత్మ: సహజమే. కాళిదాస మహాకవి చెప్పిన జననాంతర సౌహృదం మనమధ్య ఉన్నది. నూటయాభై సంవత్సరాల క్రింద మనం ముగ్గురం మిత్రులము హిమాలయాలలో కలిసి తపస్సు చేసాము. మూడవ మిత్రుడు తేజోమయమైన సిద్ధశరీరాన్ని సాధించి సిద్ధాశ్రమంలో ఉన్నాడు. మీరు కూడా మహాతపయోగి అనుగ్రహం వల్ల ఖండ యోగాది విద్యలు కొన్ని సాధించారు. ఏవాసననైనా సృష్టించగల గంధవాహ విద్య సిద్ధించింది. అన్నిటికంటే మహనీయమైన మృతసంజీవనీ శక్తి - మరణించిన వారిని బ్రతికించేవిద్య లభించింది. అయితే మీకు క్రియాశక్తి వికసించినంతగా జ్ఞానశక్తి వికసించలేదు.*
*విశుద్ధానంద: స్వామీ! యెవరికీ తెలియని నా రహస్యాలను మీరు చూస్తూనే చెప్పారు. ఇంతటి సిద్ధులను నేను ఇంతవరకు చూడలేదు.*

*పరమాత్మ: నీ మిత్రులలోనూ అసామాన్యులున్నారు. స్వామి నిఖిలేశ్వరానంద, స్వామి శివచిదానందవంటివారు. వారిలో శివచిదానంద నాకు ఎక్కువ ఆప్తుడు. నాలుగు వేలయేండ్ల నుండి ఆప్తుడు. తపస్సు చేసి గురుకృపవల్ల మీరు సాధించినవి సామాన్యమైనవి కావు. దేవకార్య నిర్వహణకు సిద్ధగురువులచే ఎంపిక చేయబడినవారం మనమంతా. కాలప్రభావం వల్ల కలి ప్రభావంవల్ల శిథిలమై శీర్ణమై పీడితమవుతున్న హిందూ సమాజంలో చైతన్యాన్ని కలిగించటానికి మనవంతు కర్తవ్యం మనం చేయాలి. అందుకే మహా గురువులు మనకు కొన్ని శక్తులనిచ్చారు.*

*శ్లో || దుర్భర దురూహ పీడనాందూనిబద్ధ శిథిల హిందూ సమాజ సంస్కృతి సమగ్ర శక్తి సంధాన నవవికాస ప్రదాన ధర్మదీక్షైక కంకణ ధారి నేను.*
*మీరు కూడా ఆ మార్గంలో దీక్షా కంకణం ధరించి ముందుకు సాగండి.*
*( సశేషం )*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 549 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam  - 549 - 1 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁*

*🍀 112. విమర్శరూపిణీ, విద్యా, వియదాది జగత్ప్రసూః ।*
*సర్వవ్యాధి ప్రశమనీ, సర్వమృత్యు నివారిణీ ॥ 112 ॥ 🍀*

*🌻 549. 'విద్యా' - 1 🌻*

*జ్ఞాన స్వరూపమైనది శ్రీమాత అని అర్ధము. విద్య అనగా తెలియవలసినది మరియు తెలియదగినది. ఏది తెలిసిన అన్నియును తెలియునో అదియే విద్య. అదియే వేదము. శ్రీమాతను వేదస్వరూపిణి, వేదమాత అని కూడ ప్రశంసింతురు. నిరాకారము అనిర్వచనీయము అగు బ్రహ్మము ఆమెగా ప్రకాశించును. ఆమెను తెలిసినపుడే బ్రహ్మమును తెలియుట జరుగును. తెలియుట అనగా శ్రీమాతమే. ఆమె వలననే ఆమెను తెలియుట కూడ జరుగును. కనుక ఆమె ఆరాధనము తప్ప అన్య మార్గము లేదు.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam  - 549 - 1 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️ Prasad Bharadwaj*

*🌻 112. Vimarsharupini vidya viyadadi jagatprasuh*
*sarvavyadhi prashamani sarvamrutyu nivarini  ॥112 ॥ 🌻*

*🌻 549. 'Vidya' - 1 🌻*

*Meaning that Srimata is the embodiment of knowledge. Education means something that is to known and is knowable. Knowledge is that when known, there's nothing remains to know. That is Veda. Srimata is also praised as Vedasvarupini and Vedamata. The formless indefinable Brahma shines as her. Brahma is known only when she is known. To know is Sri Mata. It is because of her that she is known. So there is no other way but to worship her.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
#నిత్యసందేశములు #DailyMessages 
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
https://t.me/+9zDjTpPe_PQzMWVl
https://t.me/Sivasutras
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/bhagavadgeethaa/
https://t.me/AgniMahaPuranam
https://t.me/+LmH1GyjNXXlkNDRl
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages3
https://www.kooapp.com/profile/Prasad_Bharadwaj
https://www.threads.net/@prasad.bharadwaj

శ్రీమద్భగవద్గీత - 544: 14వ అధ్., శ్లో 20 / Bhagavad-Gita - 544: Chap. 14, Ver. 20

 

🌹. శ్రీమద్భగవద్గీత - 544 / Bhagavad-Gita - 544 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 14వ అధ్యాయము - గుణత్రయ విభాగ యోగము - ప్రకృతి త్రిగుణములు - 20 🌴

20. గుణానేతానతీత్య త్రీన్ దేహీ దేహసముద్భవాన్ |
జన్మమృత్యుజరాదు:ఖైర్విముక్తోమృతమశ్నుతే ||

🌷. తాత్పర్యం : దేహధారియగు జీవుడు దేహముతో కూడియున్న ఈ త్రిగునములను దాటగాలిగినప్పడు జనన, మరణ, వార్ధక్యక్యముల నుండియు మరియు వాని దు:ఖముల నుండియు విడివడి ఈ జన్మమునందే అమృతత్వమును పొందును.

🌷. భాష్యము : సంపూర్ణ కృష్ణభక్తిభావనలో ప్రస్తుత దేహమునందే మనుజుడు ఏ విధముగా ఆధ్యాత్మికస్థితిలో నిలువగలడో ఈ శ్లోకమున వివరింపబడినది. “దేహే” యను పదమునకు దేహధారి యని భావము. అనగా జీవుడు దేహధారియైనను ఆధ్యాత్మికజ్ఞానమునందు పురోగతిని బడయుట ద్వారా త్రిగుణముల ప్రభావము నుండి బయటపడగలడు. దేహత్యాగము పిమ్మట నిక్కముగా భగవద్దామమునకు చేరనున్నందున అతడు ప్రస్తుత దేహమునందే ఆధ్యాత్మికజీవన ఆనందమును అనుభవింపగలడు.

ఆధ్యాత్మికకానందమును అతడు ప్రస్తుత దేహమునందు అనుభవించుననుట నిశ్చయమైన విషయము. అనగా కృష్ణభక్తిభావనలో నొనరింపబడు భక్తియుత సేవ భౌతికసంపర్కము నుండి ముక్తికి చిహ్నమై యున్నది. ఈ విషయము రాబోవు అష్టాదశాధ్యాయమున వివరింపబడును. అనగా త్రిగుణముల ప్రభావము నుండి మనుజుడు బయటపడినపుడు భక్తియుతసేవ యందు ప్రవేశించును.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 544 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 14 - Gunatraya Vibhaga Yoga - Nature, 3 Gunas - 20 🌴

20. guṇān etān atītya trīn dehī deha-samudbhavān
janma-mṛtyu-jarā-duḥkhair vimukto ’mṛtam aśnute

🌷 Translation : When the embodied being is able to transcend these three modes associated with the material body, he can become free from birth, death, old age and their distresses and can enjoy nectar even in this life.

🌹 Purport : How one can stay in the transcendental position, even in this body, in full Kṛṣṇa consciousness, is explained in this verse. The Sanskrit word dehī means “embodied.” Although one is within this material body, by his advancement in spiritual knowledge he can be free from the influence of the modes of nature. He can enjoy the happiness of spiritual life even in this body because, after leaving this body, he is certainly going to the spiritual sky.

But even in this body he can enjoy spiritual happiness. In other words, devotional service in Kṛṣṇa consciousness is the sign of liberation from material entanglement, and this will be explained in the Eighteenth Chapter. When one is freed from the influence of the modes of material nature, he enters into devotional service.

🌹 🌹 🌹 🌹 🌹


సిద్దేశ్వరయానం - 86 Siddeshwarayanam - 86


🌹 సిద్దేశ్వరయానం - 86 🌹

💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐

🏵 స్వామి విశుద్ధానంద - 1 🏵

శ్లో || ఆరక్త జిహ్వాం వికటోగ్ర దంష్ట్రాం శూన్యాంబరాం సుందర భీషణాంగీం కర త్రిశూలం గళముండమాలాం కాళీం కరాళీం సతతం భజామి.


అని స్తుతిస్తూ పరమాత్మస్వామి కాళీపూజ చేస్తున్నాడు. పూజానంతరం వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలిచ్చి సందర్శకుల కోసం ఒక గదిలో కూర్చున్నారు. వ్యక్తిగత సమస్యల పరిష్కారానికి, మంత్రోపదేశం తీసుకోటానికి వివిధ కారణాలతో జనం వస్తున్నారు. ఇంతలో ఒక శిష్యుడు వచ్చి "గురువుగారూ! ఈ కాశిలో ప్రసిద్ధులైన యోగి విశుద్ధానందులవారు వచ్చారు" అని మనవి చేశాడు.

స్వామివారి అనుమతితో ఆయనవచ్చి నమస్కరించారు. అతిథి మర్యాదల తరువాత వారి కోరికతో కొంతసేవు ఏకాంత సమావేశం ఏర్పాటు చేయబడింది.

విశుద్ధానంద: స్వామివారూ! మీరు కాళీదేవతానుగ్రహం వల్ల ఎన్నో అద్భుత శక్తులు సాధించారని త్రైలింగస్వామి వంటి దీర్ఘకాలజీవి కూడా మీరంటే ఎంతో గౌరవం చూపిస్తారని విన్నాను. నేను సామాన్యంగా ఎవరినీ చూడటానికి వెళ్ళను. కానీ ఎందుకో మిమ్ము దర్శించాలని అనిపించి వచ్చాను.

పరమాత్మ: ఆ అనిపించటానికి కారణం చెపుతాను. కవికుల గురువైన కాళిదాసు ఇలా పలికాడు.

శ్లో || రమ్యాణి వీక్ష్య మధురాంశ్చ నిశమ్య శబ్దాన్ పర్యుత్సుకోభవతి యత్సుఖితో2పిజంతుః

తచ్చేతసా స్మరతి నూన మబోధపూర్వం భావస్థిరాణి జననాంతర సౌహృదాని.

అందమైన దృశ్యాలు చూచి, మధురమైన శబ్దాలు విని సుఖానుభూతిలో ఉన్నవాడు ఒక్కసారి ఊహించని యేదో మానసిక సంచలనానికి లోనవుతాడు. అంతరాంతరాలలో పూర్వజన్మకు సంబంధించిన అనుభవాలు స్మృతికి రావడమే కారణం.

విశుద్ధానంద: అదియేదో తెలుసుకోవాలని కుతూహలం కలుగు తున్నది.

పరమాత్మ: సహజమే. కాళిదాస మహాకవి చెప్పిన జననాంతర సౌహృదం మనమధ్య ఉన్నది. నూటయాభై సంవత్సరాల క్రింద మనం ముగ్గురం మిత్రులము హిమాలయాలలో కలిసి తపస్సు చేసాము. మూడవ మిత్రుడు తేజోమయమైన సిద్ధశరీరాన్ని సాధించి సిద్ధాశ్రమంలో ఉన్నాడు. మీరు కూడా మహాతపయోగి అనుగ్రహం వల్ల ఖండ యోగాది విద్యలు కొన్ని సాధించారు. ఏవాసననైనా సృష్టించగల గంధవాహ విద్య సిద్ధించింది. అన్నిటికంటే మహనీయమైన మృతసంజీవనీ శక్తి - మరణించిన వారిని బ్రతికించేవిద్య లభించింది. అయితే మీకు క్రియాశక్తి వికసించినంతగా జ్ఞానశక్తి వికసించలేదు.

విశుద్ధానంద: స్వామీ! యెవరికీ తెలియని నా రహస్యాలను మీరు చూస్తూనే చెప్పారు. ఇంతటి సిద్ధులను నేను ఇంతవరకు చూడలేదు.

పరమాత్మ: నీ మిత్రులలోనూ అసామాన్యులున్నారు. స్వామి నిఖిలేశ్వరానంద, స్వామి శివచిదానందవంటివారు. వారిలో శివచిదానంద నాకు ఎక్కువ ఆప్తుడు. నాలుగు వేలయేండ్ల నుండి ఆప్తుడు. తపస్సు చేసి గురుకృపవల్ల మీరు సాధించినవి సామాన్యమైనవి కావు. దేవకార్య నిర్వహణకు సిద్ధగురువులచే ఎంపిక చేయబడినవారం మనమంతా. కాలప్రభావం వల్ల కలి ప్రభావంవల్ల శిథిలమై శీర్ణమై పీడితమవుతున్న హిందూ సమాజంలో చైతన్యాన్ని కలిగించటానికి మనవంతు కర్తవ్యం మనం చేయాలి. అందుకే మహా గురువులు మనకు కొన్ని శక్తులనిచ్చారు.

శ్లో || దుర్భర దురూహ పీడనాందూనిబద్ధ శిథిల హిందూ సమాజ సంస్కృతి సమగ్ర శక్తి సంధాన నవవికాస ప్రదాన ధర్మదీక్షైక కంకణ ధారి నేను.

మీరు కూడా ఆ మార్గంలో దీక్షా కంకణం ధరించి ముందుకు సాగండి.

( సశేషం )

🌹🌹🌹🌹🌹


శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 549 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 549 - 1


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 549 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 549 - 1 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 112. విమర్శరూపిణీ, విద్యా, వియదాది జగత్ప్రసూః ।
సర్వవ్యాధి ప్రశమనీ, సర్వమృత్యు నివారిణీ ॥ 112 ॥ 🍀

🌻 549. 'విద్యా' - 1 🌻


జ్ఞాన స్వరూపమైనది శ్రీమాత అని అర్ధము. విద్య అనగా తెలియవలసినది మరియు తెలియదగినది. ఏది తెలిసిన అన్నియును తెలియునో అదియే విద్య. అదియే వేదము. శ్రీమాతను వేదస్వరూపిణి, వేదమాత అని కూడ ప్రశంసింతురు. నిరాకారము అనిర్వచనీయము అగు బ్రహ్మము ఆమెగా ప్రకాశించును. ఆమెను తెలిసినపుడే బ్రహ్మమును తెలియుట జరుగును. తెలియుట అనగా శ్రీమాతమే. ఆమె వలననే ఆమెను తెలియుట కూడ జరుగును. కనుక ఆమె ఆరాధనము తప్ప అన్య మార్గము లేదు.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 549 - 1 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️ Prasad Bharadwaj

🌻 112. Vimarsharupini vidya viyadadi jagatprasuh
sarvavyadhi prashamani sarvamrutyu nivarini ॥112 ॥ 🌻

🌻 549. 'Vidya' - 1 🌻


Meaning that Srimata is the embodiment of knowledge. Education means something that is to known and is knowable. Knowledge is that when known, there's nothing remains to know. That is Veda. Srimata is also praised as Vedasvarupini and Vedamata. The formless indefinable Brahma shines as her. Brahma is known only when she is known. To know is Sri Mata. It is because of her that she is known. So there is no other way but to worship her.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹

Happy Eruvaka Jyestha Shuddha Poornami Full Moon to all - ఏరువాక జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి పౌర్ణమి శుభాకాంక్షలు అందరికి


🌹 ఏరువాక జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి పౌర్ణమి శుభాకాంక్షలు అందరికి 🌹

ప్రసాద్ భరద్వాజ


జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి. ఏరువాక పున్నమి. కృషిక పున్నమి. ఏరువాక పౌర్ణమి అనేక నామాలతో ఈ పండుగను ఈ ఉత్సవాన్ని మనం నిర్వహించు కుంటున్నాం. ముఖ్యంగా వ్యవసాయదారులకు ఈ పండుగ పెట్టింది పేరు. ఏరువాక అనగానే ప్రయాణం చేయడం అనే అర్థాన్ని మనకు స్ఫురిస్తాయి. ఏరు అంటే పంటపొలాలు, నాగలి అని అర్థం వుంది. నాగలితో కృషిక క్రియకు ఉపక్రమించడం ఏరువాక అని అర్థం. అంటే దుక్కి దున్నడం. ఈ రోజు వ్యవసాయదారులు తమ సంరక్షణలో వుండే జంతువులను అనగా వృషభాలను చక్కగా కడిగి కొమ్ములకు రంగులు వేసి అలంకరించి వాటితో పాటుగా నాగలిని ఒక భుజంపై పట్టుకొని ఇతర వ్యవసాయ పనిముట్లను తీసుకొని వ్యవసాయ క్రియకి ఉపక్రమించడం ఈరోజు ఆరంభం చేస్తారు. కనుక దీనిని ఏరువాక పున్నమి అని పేరు.

ఈ ఏరువాక పున్నమికి సీతాయజ్ఞము అని పేరు పెట్టింది విష్ణుపురాణము. "మంత్ర యజ్ఞా పరా విప్రాః" - అంటే బ్రాహ్మణులు మంత్రాదులు జపం చేయడంలో యజ్ఞం వలె ఆ దీక్షతో, లక్ష్యంతో వ్యవహరిస్తారు. అలాగే కర్షకులు సీతా యజ్ఞము - సీత అంటే నాగలి. నాగలితో దుక్కి దున్నుతూ వ్యవసాయాన్ని ఆరంభించి పంటలు పండిస్తారు. ఇది వారికి యజ్ఞంతో సమానం. అని వివరిస్తుంది విష్ణుపురాణం.

🌹🌹🌹🌹🌹