1) 🌹 16, MAY 2023 TUESDAY మంగళవారం, భౌమ వాసరే, నిత్య పంచాంగము Daily Panchangam🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 371 / Bhagavad-Gita - 371 🌹 🌴 9వ అధ్యాయము - రాజవిద్యా రాజగుహ్య యోగం / Chapter 9 - Raja Vidya Raja Guhya Yoga - 33 వ శ్లోకము 🌴
4) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 218 / Agni Maha Purana - 218 🌹
🌻. కూపవాపీతటాకాది ప్రతిష్ఠా కథనము. - 2 / Mode of consecration of tanks and ponds (kūpa-pratiṣṭhā) - 2 🌻
4) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 083 / DAILY WISDOM - 083 🌹
🌻 23. జ్ఞానమంతా సంపూర్ణత నుంచే వచ్చింది / 23. All Knowledge is from the Absolute 🌻
5) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 348 🌹
6) 🌹. శివ సూత్రములు - 85 / Siva Sutras - 85 🌹
🌻 2-04. గర్భే చిత్త వికాసో' విశిష్ట విద్యా స్వప్నః - 1 / 2-04. garbhe cittavikāso'viśistavidyāsvapnah - 1🌻
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 16, మే, May 2023 పంచాగము - Panchagam 🌹*
*శుభ మంగళవారం, Tuesday, భౌమ వాసరే*
*మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ*
*🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు 🌻*
*🍀. శ్రీ ఆంజనేయ సహస్రనామ స్తోత్రం - 4 🍀*
*07. ప్లవంగమః కపిశ్రేష్ఠో జ్యేష్ఠో వేద్యో వనేచరః |*
*బాలో వృద్ధో యువా తత్త్వం తత్త్వగమ్యః సఖా హ్యజః*
*08. అంజనాసూనురవ్యగ్రో గ్రామస్యాంతో ధరాధరః |*
*భూర్భువఃస్వర్మహర్లోకో జనోలోకస్తపోఽవ్యయః*
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నేటి సూక్తి : పరమాత్మతో సంయోగం - అంతరాత్మ పరమాత్మతో సంయోగం చెందినప్పుడు దానికిక వియోగ ముండదు. అసంయోగమే వియోగం. పరమాత్మతో ఈ సంయోగానుభూతి ఏకత్వంలో నానాత్వం వంటిది. లేక, పూర్ణంలో అంశం వంటిది. సముద్రంలో నీటికణం కలిసిపోవడం వంటిది కాదు. 🍀*
🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్,
వసంత ఋతువు, ఉత్తరాయణం,
వైశాఖ మాసం
తిథి: కృష్ణ ద్వాదశి 23:37:38
వరకు తదుపరి కృష్ణ త్రయోదశి
నక్షత్రం: ఉత్తరాభద్రపద
08:15:48 వరకు తదుపరి రేవతి
యోగం: ప్రీతి 23:15:09 వరకు
తదుపరి ఆయుష్మాన్
కరణం: కౌలవ 12:19:54 వరకు
వర్జ్యం: -
దుర్ముహూర్తం: 08:19:20 - 09:11:09
రాహు కాలం: 15:26:47 - 17:03:56
గుళిక కాలం: 12:12:30 - 13:49:38
యమ గండం: 08:58:12 - 10:35:21
అభిజిత్ ముహూర్తం: 11:47 - 12:37
అమృత కాలం: 03:37:48 - 05:10:12
సూర్యోదయం: 05:43:54
సూర్యాస్తమయం: 18:41:05
చంద్రోదయం: 03:14:47
చంద్రాస్తమయం: 15:43:52
సూర్య సంచార రాశి: వృషభం
చంద్ర సంచార రాశి: మీనం
యోగాలు: సిద్ది యోగం - కార్య
సిధ్ధి , ధన ప్రాప్తి 08:15:48 వరకు
తదుపరి శుభ యోగం - కార్య జయం
దిశ శూల: ఉత్తరం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణా త్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీమద్భగవద్గీత - 371 / Bhagavad-Gita - 371 🌹*
*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*
*🌴. 9వ అధ్యాయము - రాజవిద్యా రాజగుహ్య యోగం - 33 🌴*
*33. కిం పునర్బ్రాహ్మణా: పుణ్యా భక్తా రాజర్షయస్తథా |*
*అనిత్యమసుఖం లోకమిమం ప్రాప్య భజస్వమామ్ ||*
🌷. తాత్పర్యం :
*ఇక ధర్మాత్ములైన బ్రాహ్మణుల గూర్చియు, భక్తుల గూర్చియు, రాజర్షుల గూర్చియు వేరుగా చెప్పవలెనా! అందుచే అనిత్యమును, అసుఖమును అగు ఈ లోకమునకు వచ్చియున్నందున నా ప్రేమయుక్తసేవలో నియుక్తుడవగుము.*
🌷. భాష్యము :
*భౌతికజగమున జనులలో పలువర్గములున్నను వాస్తవమునకు వారెవ్వరికినీ ఈ జగము సుఖకరమైన ప్రదేశము కాదు. కనుకనే “అనిత్యమ్ అసుఖం లోకమ్” అని స్పష్టముగా తెలుపబడినది. అనగా ఈ భౌతికజగత్తు అశాశ్వతము, దుఃఖపూర్ణమునై సజ్జనుడైనవాడు నివసించుటకు యోగ్యము కాకున్నది. ఈ జగము శ్రీకృష్ణభగవానునిచే అశాశ్వతమైనదిగను మరియు దుఃఖపూర్ణముగను ప్రకటింపబడగా, కొందరు తత్త్వవేత్తలు (ముఖ్యముగా మయావాదులు) దీనిని మిథ్యగా వర్ణింతురు. కాని గీత ప్రకారము జగత్తు ఆశాశ్వతమే గాని మిథ్య కాదు. మిథ్యత్వము మరియు అనిత్యత్వముల నడుమ భేదము కలదు. భౌతికజగము అశాశ్వతము. కాని దీనికి పరమైన వేరొకజగము నిత్యమైనది. అలాగుననే ఈ జగము దుఃఖపూర్ణము. కాని దీనికి పరమైన జగము నిత్యమైనది మరియు ఆనందపూర్ణమైనది.*
*అర్జునుడు రాజర్షుల వంశములో జన్మించినట్టివాడు. అతనికి సైతము “నా భక్తియోగమును చేపట్టి శీఘ్రమే నా ధామమును చేరుము” అని శ్రీకృష్ణుడు ఉపదేశమొసగియుండెను. అనగా దుఃఖపూర్ణము మరియు ఆశాశ్వతమైన ఈ లోకముననే ఎవ్వరును నిలిచిపోరాదు. ప్రతియొక్కరు శ్రీకృష్ణభగవానుని ఆశ్రయించి నిత్యానందమును పొందవలెను. అన్ని తరగతుల జనుల సమస్యలు పరిష్కరింపబడుటకు ఆ దేవదేవుని భక్తియోగమే ఏకైక విధానము. కనుక ప్రతియొక్కరు కృష్ణభక్తిరసభావనము అలవరచుకొని తమ జీవితమును పూర్ణము కావించుకొనవలెను.*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Bhagavad-Gita as It is - 371 🌹*
*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*
*🌴 Chapter 9 - Raja Vidya Raja Guhya Yoga - 33 🌴*
*33. kiṁ punar brāhmaṇāḥ puṇyā bhaktā rājarṣayas tathā*
*anityam asukhaṁ lokam imaṁ prāpya bhajasva mām*
🌷 Translation :
*How much more this is so of the righteous brāhmaṇas, the devotees and the saintly kings. Therefore, having come to this temporary, miserable world, engage in loving service unto Me.*
🌹 Purport :
*In this material world there are classifications of people, but, after all, this world is not a happy place for anyone. It is clearly stated here, anityam asukhaṁ lokam: this world is temporary and full of miseries, not habitable for any sane gentleman. This world is declared by the Supreme Personality of Godhead to be temporary and full of miseries. Some philosophers, especially Māyāvādī philosophers, say that this world is false, but we can understand from Bhagavad-gītā that the world is not false; it is temporary. There is a difference between temporary and false. This world is temporary, but there is another world, which is eternal. This world is miserable, but the other world is eternal and blissful.*
*Arjuna was born in a saintly royal family. To him also the Lord says, “Take to My devotional service and come quickly back to Godhead, back home.” No one should remain in this temporary world, full as it is with miseries. Everyone should attach himself to the bosom of the Supreme Personality of Godhead so that he can be eternally happy. The devotional service of the Supreme Lord is the only process by which all problems of all classes of men can be solved. Everyone should therefore take to Kṛṣṇa consciousness and make his life perfect.*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 218 / Agni Maha Purana - 218 🌹*
*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ*
*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*
*ప్రథమ సంపుటము, అధ్యాయము - 64*
*🌻. కూపవాపీతటాకాది ప్రతిష్ఠా కథనము. - 2 🌻*
*"సముద్రజ్యేష్ఠాః" ఇత్యాదిమంత్రముతో పూర్వకలశజలముచేతను, "సముద్రం గచ్ఛ" ఇత్యాదిమంత్రముతో అగ్నేయకలశస్థిత గంగాజలముచేతను. "సోమో ధేనుమ్" ఇత్యాదిమంత్రముతో దక్షిణకలశస్థితి వర్షాజలము చేతను, "దేవీరాప," ఇత్యాదిమంత్రముతో నైరృతికలశస్థితి నిర్ఘర జలముచేతమ, ''పఞ్చ నద్యః'' ఇత్యాదిమంత్రముతో పశ్చిమకలశస్థిత నదీజలము చేతను, "ఉద్భిద్భ్యః" ఇత్యాదిమంత్రముతో ఉత్తరకలశస్థితోద్భిజ్జ జలముచేతను, పావమానీ ఋక్కులతో ఈశాన్యకలశస్థిత తీర్థజలముచేతను వరుణునకు అభిషేకము చేయవలెను.*
*పిమ్మట యజమానుడు 'అపోహిష్ఠా' మంత్రముతో పంగనవ్యముల చేతను, 'హిరణ్యవర్ణామ్' ఇత్యాదిమంత్రముతో స్వర్ణజలముచేతను, "ఆపో అస్మాన్" అను మంత్రముచే వర్షాజలముచేతను, వ్యాహృతులతో కూపజలముచేతను, "అపో దేవీః" ఇత్యాదిమంత్రముతో తడాగజలముచేతను, తోరణమునందున్న వరుణ కలశజలముచేతను వరుణునికి స్నానము చేయించవలెను. కొండకాలవల జలము నింపిన ఎనుబది యొక్క కలశములలోని జలముచే "వరుణస్యోత్తమ్భనమసి" ఇత్యాది మంత్రము పఠించుచు స్నానము చేయించవలెను. "త్వం నో అగ్నే వరుణస్య" ఇత్యాదిమంత్రముతో అర్ఘ్యప్రదానము చేయవలెను. వ్యాహృతుల నుచ్చరించుచు మధుపర్కమును, "జృహస్పతే అతియదర్యో" ఇత్యాది మంత్రముతో, వస్త్రముతో, వస్త్రములను, "ఇమం మే వరుణ" ఇత్యాది మంత్రముతో పవిత్రకమును, ప్రణవ ముచ్చరించుచు ఉత్తరీయమును సమర్పింపవలెను.*
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Agni Maha Purana - 218 🌹*
*✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj *
*Chapter 64*
*🌻Mode of consecration of tanks and ponds (kūpa-pratiṣṭhā) - 2 🌻*
11. Having invoked lustre in them the priest should be offered a golden cow. (The image of) Varuṇa should be consecrated with the (waters of the) pitcher on the east with (the recitation of) samudrajyeṣṭhā.[7]
12-13. The waters of the Ganges should be poured with (the mantra) samudraṃ gaccha[8], rain waters with somo dhenum[9], water from waterfalls with devīrāpa[10], the water of the masculine rivers with pañca nadyaḥ[11], the spring water with udbhid[12], the waters from sacred places with pāvamānī[13], the pañcagavya (the five things from a cow) with āpo hi ṣṭhā[14] and from the golden (pitcher) with hiraṇyavarṇām[15].
14. (The image should be bathed) with rain water with āpo asmā[16], with well waters [i.e., kūpa] with the vyāhṛtis (bhuḥ, bhuvaḥ, suvaḥ). (Image of) Varuṇa should be consecrated with the waters of the tank with varuṇādbhiḥ[18].
15. Waters from the hills (should be poured) with (the mantra) āpo devī[19] and then with the waters from eighty-one pitchers. Then (the image) should be bathed with varuṇasya[19] and waters for sipping (should be given) with tvanno varuṇa[20].
16-17. The madhuparka[21] should be given) with the vyāhṛtis,[22] clothes with bṛhaspat[23], pavitra with varuṇa[24], the upper garment with praṇava (Om).
Flowers etc. chowrie, mirror, umbrella, fan and banner should be offered to (the image of) Varuṇa with (the mantra) yadvāruṇya[25].
18. The image should be raised up with the principal mantra (saying) ‘Rise up’ and the preliminary consecration is made that night. The presence of divinity is accomplished by varuṇaṃ ca[26]. It should be worshipped with yadvāruṇya.[27]
19-20. Life should be infused into the image with the principal mantra and should again be worshipped with perfume etc. Having worshipped it well in the shed as before after having offered twigs etc. into the fire pits with (the recitation of the praṇava) the first word of the Vedas, four cows should be milched. in the four directions. Then gruel of barley should be prepared, and offered to the fire.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 83 / DAILY WISDOM - 83 🌹*
*🍀 📖. బృహదారణ్యక ఉపనిషత్తు నుండి 🍀*
*✍️. ప్రసాద్ భరద్వాజ*
*🌻 23. జ్ఞానమంతా సంపూర్ణత నుంచే వచ్చింది 🌻*
*సంపూర్ణత యొక్క జ్ఞానం లేకుండా, చిన్న విషయాలు కూడా అర్థం చేసుకోలేము. జ్ఞానమంతా సర్వోత్కృష్టమైన పరమాత్మలో ఒక పాక్షిక అంశం. పరమాత్మ స్వయంగా జ్ఞానం. ఇక్కడ జ్ఞానం అంటే విషయాల యొక్క సమాచారం కాదు. విషయాల యొక్క అస్తిత్వం. ఇక్కడ అస్తిత్వం, జ్ఞానము ఒకటే.*
*కాబట్టి, ప్రస్తావించదగిన ఏదైనా జ్ఞానం అనేది సర్వోత్కృష్టమైన జ్ఞానంలో ఒక రేఖ, అంశం మాత్రమే. ప్రపంచంలోని అత్యున్నత మేధావులను కూడా ఆ శాశ్వతమైన జ్ఞానపు కిరణంతో పోల్చలేము. ప్రతిదీ దాని నుండే వస్తుంది.*
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 DAILY WISDOM - 83 🌹*
*🍀 📖 The Brihadaranyaka Upanishad 🍀*
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj
*🌻 23. All Knowledge is from the Absolute 🌻*
*Without the knowledge of the Absolute, not even the smallest of things can be understood. All knowledge is a partial aspect of the Supreme Absolute, which is Knowledge Itself. It is not knowledge in the sense of an information about things, but the very existence of all things which is inseparable from the knowledge of things.*
*And so, any knowledge or wisdom that is worth mentioning is a fraction, a spark, a ray, of the Supreme Absolute. Even the highest geniuses of the world cannot be compared with a ray of that eternal profundity of knowledge. Everything comes from that.*
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 348 🌹*
*✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ*
*🍀. నువ్వు ఈ క్షణం జన్మించినట్లు, ఇప్పుడే జీవించడం ఆరంభించినట్లు మొదలుపెట్టాలి. గతాన్ని మరచిపో. అది విషాదకరం. దాంతో బాధపడకు దాన్నించీ బయటపడి తాజాగా ఆరంబించు. 🍀*
*మంచి మానవ సమాజంలో మనం ప్రతి పసిబిడ్డకు 'నీ దగ్గర ప్రేమ, ఆనందం, సత్యం వీటికి సంబంధించిన బీజాలు వున్నాయి. అయితే అవి బీజాలు మాత్రమే. నీ సమస్త జీవితం వాటిని నాటడానికి ప్రయత్నించాలి. అవి పెరిగేలా చేసే కళను అభ్యసించాలి. వాటి ఫలాల కోసం ఎదురుచూడాలి. వాటి పుష్పాలకోసం ప్రార్థనాపూర్వకంగా ఎదురుచూడాలి. సరయిన రుతువు కోసం ఎదురుచూడాలి' అని చెప్పాలి. మనం యిక్కడ చేస్తున్నదదే.*
*లోపలలి ఫలసాయానికి మనం చేస్తున్న ప్రయోగం. ఇప్పటి దాకా మీరు చేసింది పొరపాటు అభిప్రాయాల ఆధారంగా చేసిందే. యిప్పుడు మనం ఆ దురభిప్రాయాల్ని దూరం చెయ్యాలి. వాటిని తుడిచేయ్యడం మొదలు పెట్టాలి. నువ్వు ఈ క్షణం జన్మించినట్లు, ఇప్పుడే జీవించడం ఆరంభించినట్లు మొదలుపెట్టాలి. గతాన్ని మరచిపో. లెక్కపెట్టకు. అది నీకు ఏమీ యివ్వలేదు. అది విషాదకరం. దాంతో బాధపడకు దాన్నించీ బయటపడి తాజాగా ఆరంబించు.*
*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శివ సూత్రములు - 085 / Siva Sutras - 085 🌹*
*🍀. శివ ఆగమ తత్వశాస్త్రం యొక్క సూత్రములు 🍀*
*2వ భాగం - శక్తోపాయ*
*✍️. ప్రసాద్ భరధ్వాజ*
*🌻 2-04. గర్భే చిత్త వికాసో' విశిష్ట విద్యా స్వప్నః - 1 🌻*
*🌴. మాయతో నిండిన మలినమైన శరీరంలో చిత్తం వికసించినప్పుడు, పరిమిత శక్తులతో కూడిన స్వప్నం లాంటి అస్పష్టమైన జ్ఞానం పుడుతుంది. 🌴*
*గర్భః - ముందు ఉన్న అజ్ఞానం. ఈ అజ్ఞానానికి కారణం మాయ లేదా భ్రమ; చిత్త –మనస్సు; వికాస - సంతృప్తి; అవిశిష్ట - విశిష్ట అంటే శ్రేష్ఠమైనది మరియు అ అనే ఉపసర్గతో విశిష్ట అర్థం వ్యతిరేకించబడుతుంది. కాబట్టి అవిశిష్ట అంటే తక్కువది; విద్యా – జ్ఞానం; స్వప్నః - కల.*
*ద్వంద్వవాదంచే ప్రభావితమైన ఒక రోగగ్రస్తమైన మనస్సు అధమ జ్ఞానానికి కారణం, దీనిని ప్రథమ అజ్ఞానం అంటారు. జ్ఞానం రెండు రకాలుగా ఉంటుంది. రెండూ మనస్సు యొక్క రంగంలో విశద పరుస్తాయి. ఎందుకంటే ఏదైనా అనుభవం మనస్సులో మాత్రమే జరుగుతుంది. కాబట్టి ఆధ్యాత్మిక పురోగతిలో మనస్సు ప్రధాన కారకంగా పరిగణించబడుతుంది. ఒకటి ఆధ్యాత్మిక మనస్సు మరియు మరొకటి ప్రాపంచిక మనస్సు. ఈ రెండింటినీ వేరుచేసే ముఖ్యమైన అంశం నిర్ద్వంద్వత్వం.*
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Siva Sutras - 085 🌹*
*🍀Aphorisms of philosophy of Shiva āgama 🍀*
Part 2 - Śāktopāya.
*✍️. Acharya Ravi Sarma, 📚. Prasad Bharadwaj*
*🌻 2-04. garbhe cittavikāso'viśistavidyāsvapnah - 1 🌻*
*🌴. From the flowering of the chitta in an impure body which is filled with maya, there arises dreamlike indistinct knowledge with limited powers. 🌴*
*garbhaḥ - foundational ignorance. The cause of this ignorance is māyā or illusion; citta –mind; vikāsa – satisfaction; aviśiṣṭa - viśiṣṭa means excellent and by prefixing a, the meaning of viśiṣṭa is negated. Therefore aviśiṣṭa means inferior; vidyā – knowledge; svapnaḥ - dream.*
*An afflicted mind influenced by dualism is the cause for inferior knowledge which is referred as foundational ignorance. Knowledge is of two kinds and both unfold in the arena of mind as any experience can happen only in the mind. Therefore mind is considered as the cardinal factor in spiritual progression. One is the spiritual mind and another is the mundane mind. The essential factor that distinguishes the two is non-dualism.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Join and Share
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
https://t.me/+9zDjTpPe_PQzMWVl
https://t.me/Sivasutras
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/bhagavadgeethaa/
https://t.me/AgniMahaPuranam
https://t.me/+LmH1GyjNXXlkNDRl
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages2
https://chaitanyavijnanam.tumblr.com/
https://prasadbharadwaj.wixsite.com/lalithasahasranama