శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 361-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 361-2



🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 361-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 361-2 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 79. తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రికా ।
తరుణీ, తాపసారాధ్యా, తనుమధ్యా, తమోఽపహా ॥ 79 ॥ 🍀

🌻 361-2. 'తమోపహా'🌻


రాగ ద్వేషములు, కామక్రోధములు, లోభమోహములు, మద మాత్సర్యములు ద్వంద్వములు. వీని నుండి బైటపడుటకు ఒక్కటే ఉపాయ మున్నది. దైవమే తానని, దైవమే సమస్తమని, నిజమున కేదియూ దైవముకన్న వేరు కాదని, వున్నది దైవమే యని తా నుండుట భ్రాంతియే యని తెలియుట. ఇట్లు తెలిసిననూ మరపు కలుగును.

అట్లు మరుపు కలుగ కుండుటకు శ్రీమాత అనుగ్రహ ముండవలెను. తెలిసిననూ మరపు కలుగుట మాయ. శ్రీమాత 'మహామాయా' అని స్తుతింపబడు చుండును. జ్ఞానులకు కూడ మాయను కల్పింప గలదు. అపుడు వారజ్ఞానమున పడుదురు. అజ్ఞానము కలిగించునది, తొలగించునది కూడ శ్రీమాతయే. ఆమె అనుగ్రహమే నిత్యము కోరవలసినది. అనుగ్రహమున్న చోట అజ్ఞానము హరింపబడును.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 361-2 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️. Acharya Ravi Sarma
📚. Prasad Bharadwaj

🌻 79. Tapatrayagni santapta samahladana chandrika
Tatuni tapasaradhya tanumadhya tamo-paha ॥ 79 ॥ 🌻

🌻 361. Tamopahā तमोपहा 🌻


Tamas means ignorance and its main components are mental darkness, ignorance, illusion, error. Tamo guṇa is one of the three guṇa-s. An ignorant person is said to have tamo guṇa.

There is a beautiful explanation for ignorance or darkness in Īśā Upaniṣad (verse 9). “Those who mechanically perform rituals go into darkness which is like being blind. But, those who merely worship God go into deeper darkness”. Mundane worship never gives result. Any worship for material prosperity or personal upliftment will never be rewarded. Such men are called ignorant. She is said to remove this ignorance.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


06 Apr 2022

ఓషో రోజువారీ ధ్యానాలు - 164. ప్రేమ యొక్క రసవాదం / Osho Daily Meditations - 164. THE ALCHEMY OF LOVE



🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 164 / Osho Daily Meditations - 164 🌹

📚. ప్రసాద్ భరద్వాజ్

🍀 164. ప్రేమ యొక్క రసవాదం 🍀


🕉. ప్రేమ దైవికమైనది. భూమిపై ఏదైనా దైవంగా ఉంటే, అది ప్రేమయే. ప్రేమ మిగతా అన్నింటినీ దైవీకరిస్తుంది. ప్రేమ అనేది జీవితానికి నిజమైన రసవాదం, ఎందుకంటే అది మూల లోహాన్ని బంగారంగా మారుస్తుంది. 🕉

ప్రపంచంలోని దాదాపు అన్ని భాషలలో చాలా పురాతన కథలు ఉన్నాయి. ఎవరో కప్పను ముద్దుపెట్టు కుంటారని మరియు కప్ప యువరాజుగా మారుతుందనే లాంటివి. కప్ప శపించ బడింది; అతను కేవలం తనపై ముద్దుల వర్షం కురిపించే వరకు వేచి ఉన్నాడు. ప్రేమ వచ్చి తనలో మార్పు వస్తుందని ఎదురు చూస్తున్నాడు. ప్రేమ రూపాంతరం చెందుతుంది - అదే ఆ కథలన్నింటికీ సందేశం. కథలు అందంగా, చాలా సూచనాత్మకంగా, ప్రతీకాత్మకంగా ఉన్నాయి. జంతువును మనిషిగా మార్చేది ప్రేమ మాత్రమే; కాకపోతే మనుషులకు, ఇతర జంతువులకు తేడా ఉండదు.

ఒకే తేడా, సాధ్యమయ్యే తేడా ప్రేమ మాత్రమే. మీరు ప్రేమ ద్వారా ఎంత ఎక్కువగా జీవిస్తారో, అంటే ప్రేమగా జీవిస్తారో, అప్పుడు మీలో మానవత్వం పుడుతుంది. అంతిమ రస బిందువు అది. ఒకరు ప్రేమగా మారినప్పుడు అతీతుడు అవుతాడు. జంతువు మాత్రమే కాదు, మానవుడు కూడా. అప్పుడు దైవంగా, దేవుడుగా మారతారు. మానవ ఎదుగుదల అంతా ప్రేమ ఎదుగుదల. ప్రేమ లేకుంటే మనం జంతువులం. ప్రేమతో మనం మనుషులం. మరియు ప్రేమ మీ సహజ జీవిగా, మీ రుచిగా మారినప్పుడు, మీరు దేవుడు.

కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Osho Daily Meditations - 164 🌹

📚. Prasad Bharadwaj

🍀 164. THE ALCHEMY OF LOVE 🍀


🕉 Love is divine. If anything is divine on the earth, it is love and love also makes everything else divine. Love is the true alchemy of life, because it transforms base metal into gold. 🕉

There are ancient stories, many stories in almost all the languages of the world, that somebody kisses a frog and the frog becomes a prince. The frog had been cursed; he was simply waiting for some kiss to be showered on him. He was waiting for love to come and transform him. Love transforms-that is the message of all those stories. The stories are beautiful, very indicative, symbolic. It is only love that transforms the animal into the human; otherwise there is no difference between humans and other animals.

The only difference, the possible difference, is love. And the more you live through love, as love, the more humanity is born in you. The ultimate, the omega point, is when one has become love. Then not only is the animal transcended, even the human is transcended. Then one is divine, one is God. The whole of human growth is love's growth. Without love we are animals. With love we are human. And when love has become your natural being, your very flavor, you are God.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


06 Apr 2022

మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 175

🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 175 🌹

✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. మోక్షము - వినాశము - 1 🌻


నా పనులు అని వేరుగా కొన్నిటిని ఏర్పరుచుకొని నెరవేర్చు చుండుటయే అహంకారము. అహంకారము దేవుని పనికి సమర్పణమైనపుడు జన్మ సమస్తము చక్కగా నిర్వహింపబడును. అదియే మోక్షము. అట్లుగాక అహంకారమునకు సొంత పని అని వేరుగా ఏర్పడినచో దురహంకారమగును. దానివలన అసురత్వము , వినాశము కలుగును.

హిమాలయములలోని నదీ ప్రవాహములలో మంచుగడ్డలు పుట్టి , తేలుచు ప్రయాణము చేసి , కరగిపోవుచుండును. పుట్టుట, కరగిపోవుట అను స్థితులకు ముందు , తర్వాత ఆ ప్రవాహముండును. మంచుగడ్డ కట్టుకొనునపుడు దాని లోపల ప్రవాహజలమే గడ్డకట్టి యుండును. అట్లే దేహముల యందు నారాయణుడును.

.... ✍🏼 మాస్టర్ ఇ.కె.🌻

🌹🌹🌹🌹🌹

06 Apr 2022

శ్రీ శివ మహా పురాణము - 545 / Sri Siva Maha Purana - 545



🌹 . శ్రీ శివ మహా పురాణము - 545 / Sri Siva Maha Purana - 545 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః - అధ్యాయము - 49 🌴

🌻. బ్రహ్మ మోహితుడగుట - 5 🌻


దేవదేవా! మహాదేవా! కరుణా సముద్రా! ప్రభూ! సర్వమునకు సర్వ విధములుగా నీవే కర్తవు, భర్తవు, హర్తవు (41).

త్రాటికి అధీనములో నుండి నడిచే ఎద్దులు వలే ఈ చరా చర జగత్తు అంతా నీ సంకల్పమునకు లోబడి నడచు చున్నదని నేను తెలుసుకున్నాను. ఈ విశిష్టజ్ఞానము నాకు కలిగినది (42). నేను ఇట్లు పలికి చేతులు జోడించి నమస్కరించితిని. విష్ణువు మొదలగు ఇతరులు కూడా అందరు ఆ మహేశ్వరుని స్తుతించిరి (43).

నేను దీనముగా చేసిన శుద్ధమగు ప్రార్ధనను, విష్ణువు మొదలగు వారందరి ప్రార్థనను విని అపుడు మహేశ్వరుడు ప్రసన్నుడాయెను (44). ప్రీతిని బొందిన మనస్సు గల ఆయన నాకు ఆభయమును వరముగా నొసంగెను. ఓ మునీ! అందరు అధిక సుఖమును పొందిరి. నేను మహానందమును పొందితిని (45).

శ్రీ శివ మహాపురాణములోని రుద్ర సంహితయందు పార్వతీ ఖండలో విది మోహితుడగటు అనే నలభై తొమ్మిదవ అధ్యాయము ముగిసినది (49).


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹




🌹 SRI SIVA MAHA PURANA - 545 🌹

✍️ J.L. SHASTRI
📚. Prasad Bharadwaj

🌴 Rudra-saṃhitā (3): Pārvatī-khaṇḍa - CHAPTER 49 🌴

🌻 The delusion of Brahmā - 5 🌻


42. After knowing that Śiva favourably disposed to His devotees can do everything and dispel the pride of the wicked, I eulogised Him, the lord of all.

43. O great God, O lord of gods, the ocean of mercy, you are the creator, the sustainer and the annihilator of everything.

44. It is at your will that the entire world including the mobile and immobile is kept checked as the bulls amongst a series of cows.

45. After saying so I bowed to Him with palms joined in reverence. Viṣṇu and others too eulogised lord Śiva.

46. On hearing the piteous eulogies made by me as well as by Viṣṇu and others lord Śiva became delighted.

47. He granted me the boon of fearlessness delightedly. All were happy, O sage, and I rejoiced much.


Continues....

🌹🌹🌹🌹🌹


06 Apr 2022

గీతోపనిషత్తు -347


🌹. గీతోపనిషత్తు -347 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము - 32 📚

🍀 32-1. తత్వదర్శనులు - గుణమును బట్టి వర్ణాశ్రమ ధర్మములుండగ, జన్మమును బట్టి వర్ణాశ్రమ ధర్మములు నిర్ణయించుట కరడుగట్టిన అజ్ఞానము. భగవద్గీత ఇట్టి సంఘ దురాచారమును ఎండగట్టును మరియు ఖండించును. 🍀

32. మాం హి పార్థ వ్యపాశ్రిత్య యే2 పి స్యుః పాపయోనయః I
స్త్రియో వైశ్యాస్తథా శూద్రాస్తే పి యాంతి పరాం గతిమ్ ॥

తాత్పర్యము : అనన్యభక్తి మార్గమున నన్నాశ్రయించు వారు నిశ్చయముగ నన్నే పొందుచున్నారు. అట్టివారు స్త్రీలైనను, వైశ్యులైనను, శూద్రులైనను అంతర మేమియు ఉండదు.

వివరణము : సంఘము నందు అనేకానేక దురాచారములు వర్తించుచు నుండును. దురవగాహన పాతుకొనిపోయి ఉండును. జన్మమును బట్టి సంఘమున శ్రేణులు ఏర్పడుచు నుండును. ఉత్తమ కులము, నిమ్న కులము అను భేదములు తరముల తరబడి జాతిని పీడించుచు నుండును. సభ్య సంఘము లందు ఇట్టి అసభ్య వర్తనములు తాండవము చేయుచు నుండును.

గుణమును బట్టి వర్ణాశ్రమ ధర్మములుండగ, జన్మమును బట్టి వర్ణాశ్రమ ధర్మములు నిర్ణయించుట కరడుగట్టిన అజ్ఞానము. బ్రాహ్మణ క్షత్రియ పురుషులే మోక్షమున కర్హులనియు, స్త్రీలు, వైశ్యులు, శూద్రులు, ఇతర జాతివారు అనర్హులనియు లోకమున అధికార వర్గములు స్థిరపరచి పామరులను కొల్లగొట్టు కొనుచు, జీవించుచు నుందురు. భగవద్గీత ఇట్టి సంఘ దురాచారమును ఎండగట్టును మరియు ఖండించును.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


06 Apr 2022