శ్రీ శివ మహా పురాణము - 545 / Sri Siva Maha Purana - 545



🌹 . శ్రీ శివ మహా పురాణము - 545 / Sri Siva Maha Purana - 545 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః - అధ్యాయము - 49 🌴

🌻. బ్రహ్మ మోహితుడగుట - 5 🌻


దేవదేవా! మహాదేవా! కరుణా సముద్రా! ప్రభూ! సర్వమునకు సర్వ విధములుగా నీవే కర్తవు, భర్తవు, హర్తవు (41).

త్రాటికి అధీనములో నుండి నడిచే ఎద్దులు వలే ఈ చరా చర జగత్తు అంతా నీ సంకల్పమునకు లోబడి నడచు చున్నదని నేను తెలుసుకున్నాను. ఈ విశిష్టజ్ఞానము నాకు కలిగినది (42). నేను ఇట్లు పలికి చేతులు జోడించి నమస్కరించితిని. విష్ణువు మొదలగు ఇతరులు కూడా అందరు ఆ మహేశ్వరుని స్తుతించిరి (43).

నేను దీనముగా చేసిన శుద్ధమగు ప్రార్ధనను, విష్ణువు మొదలగు వారందరి ప్రార్థనను విని అపుడు మహేశ్వరుడు ప్రసన్నుడాయెను (44). ప్రీతిని బొందిన మనస్సు గల ఆయన నాకు ఆభయమును వరముగా నొసంగెను. ఓ మునీ! అందరు అధిక సుఖమును పొందిరి. నేను మహానందమును పొందితిని (45).

శ్రీ శివ మహాపురాణములోని రుద్ర సంహితయందు పార్వతీ ఖండలో విది మోహితుడగటు అనే నలభై తొమ్మిదవ అధ్యాయము ముగిసినది (49).


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹




🌹 SRI SIVA MAHA PURANA - 545 🌹

✍️ J.L. SHASTRI
📚. Prasad Bharadwaj

🌴 Rudra-saṃhitā (3): Pārvatī-khaṇḍa - CHAPTER 49 🌴

🌻 The delusion of Brahmā - 5 🌻


42. After knowing that Śiva favourably disposed to His devotees can do everything and dispel the pride of the wicked, I eulogised Him, the lord of all.

43. O great God, O lord of gods, the ocean of mercy, you are the creator, the sustainer and the annihilator of everything.

44. It is at your will that the entire world including the mobile and immobile is kept checked as the bulls amongst a series of cows.

45. After saying so I bowed to Him with palms joined in reverence. Viṣṇu and others too eulogised lord Śiva.

46. On hearing the piteous eulogies made by me as well as by Viṣṇu and others lord Śiva became delighted.

47. He granted me the boon of fearlessness delightedly. All were happy, O sage, and I rejoiced much.


Continues....

🌹🌹🌹🌹🌹


06 Apr 2022

No comments:

Post a Comment