శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 361-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 361-2



🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 361-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 361-2 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 79. తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రికా ।
తరుణీ, తాపసారాధ్యా, తనుమధ్యా, తమోఽపహా ॥ 79 ॥ 🍀

🌻 361-2. 'తమోపహా'🌻


రాగ ద్వేషములు, కామక్రోధములు, లోభమోహములు, మద మాత్సర్యములు ద్వంద్వములు. వీని నుండి బైటపడుటకు ఒక్కటే ఉపాయ మున్నది. దైవమే తానని, దైవమే సమస్తమని, నిజమున కేదియూ దైవముకన్న వేరు కాదని, వున్నది దైవమే యని తా నుండుట భ్రాంతియే యని తెలియుట. ఇట్లు తెలిసిననూ మరపు కలుగును.

అట్లు మరుపు కలుగ కుండుటకు శ్రీమాత అనుగ్రహ ముండవలెను. తెలిసిననూ మరపు కలుగుట మాయ. శ్రీమాత 'మహామాయా' అని స్తుతింపబడు చుండును. జ్ఞానులకు కూడ మాయను కల్పింప గలదు. అపుడు వారజ్ఞానమున పడుదురు. అజ్ఞానము కలిగించునది, తొలగించునది కూడ శ్రీమాతయే. ఆమె అనుగ్రహమే నిత్యము కోరవలసినది. అనుగ్రహమున్న చోట అజ్ఞానము హరింపబడును.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 361-2 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️. Acharya Ravi Sarma
📚. Prasad Bharadwaj

🌻 79. Tapatrayagni santapta samahladana chandrika
Tatuni tapasaradhya tanumadhya tamo-paha ॥ 79 ॥ 🌻

🌻 361. Tamopahā तमोपहा 🌻


Tamas means ignorance and its main components are mental darkness, ignorance, illusion, error. Tamo guṇa is one of the three guṇa-s. An ignorant person is said to have tamo guṇa.

There is a beautiful explanation for ignorance or darkness in Īśā Upaniṣad (verse 9). “Those who mechanically perform rituals go into darkness which is like being blind. But, those who merely worship God go into deeper darkness”. Mundane worship never gives result. Any worship for material prosperity or personal upliftment will never be rewarded. Such men are called ignorant. She is said to remove this ignorance.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


06 Apr 2022

No comments:

Post a Comment