5-July-2020 messages

*🌹. సద్గురువుల దృష్టి, స్పర్శ, అనుగ్రహం సదా మనమందరి మీదా ఉండాలి అని కోరుకుంటూ, వారికి సహాయ పడగలిగేలా మన జీవితం ఉండాలనే సంకల్పంతో ప్రార్ధిస్తూ అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. 🌹* 
 *🙏. ప్రసాద్ భరద్వాజ*


1) 🌹 శ్రీమద్భగవద్గీత - 418 / Bhagavad-Gita - 418 🌹
2) 🌹. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము - 206 / Sripada Srivallabha Charithamrutham - 206 🌹
3) 🌹. శ్రీ ఆర్యా ద్విశతి - 70 🌹
4) 🌹. దాశరధి శతకము - పద్య స్వరూపం - 48 / Dasarathi Satakam - 49 🌹
5) 🌹 The Masters of Wisdom - The Journey Inside - 109 🌹
6) 🌹. నారద భక్తి సూత్రాలు - 26 🌹 
7) 🌹. పంచకోశములు - మనోమయకోశము 🌹
8) 🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 86🌹 
9) 🌹. శ్రీ మాణిక్ ప్రభు చరితామృతము - 57 / SHRI MANIK PRABHU - HIS LIFE AND MISSION - 57 🌹 
10) 🌹. సౌందర్య లహరి - 33 / Soundarya Lahari - 33 🌹
11) 🌹. శ్రీమద్భగవద్గీత - 332 / Bhagavad-Gita - 332 🌹
12) 
13) 
14) 
15) 
16) 
17) 
18) 
19) 
20) 


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🌹. శ్రీమద్భగవద్గీత - 418 / Bhagavad-Gita - 418 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 11వ అధ్యాయము - విశ్వరూప సందర్శన యోగం - 26, 27 🌴

26. అమీ చ త్వాం ధృతరాష్ట్రస్య పుత్రా:
సర్వే సహైవావనిపాలసఙ్ఘై: |
భీష్మో ద్రోణ: సూతపుత్రస్తథాసౌ
సహాస్మదీయైరపి యోధముఖ్యై: ||

27. వక్త్రాణి తే త్వరమాణా విశన్తి
దంష్ట్రాకరాలాని భయానకాని |
కేచిద్విలగ్నా దశనాన్తరేషు
సందృశ్యన్తే చూర్ణితైరుత్తమాఙ్గై: ||

🌷. తాత్పర్యం : 


🌷. భాష్యము : 

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 418 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 11 - Viswaroopa Sandarsana Yoga - 26 , 27 🌴

26. amī ca tvāṁ dhṛtarāṣṭrasya putrāḥ
sarve sahaivāvani-pāla-saṅghaiḥ
bhīṣmo droṇaḥ sūta-putras tathāsau
sahāsmadīyair api yodha-mukhyaiḥ

27. vaktrāṇi te tvaramāṇā viśanti
daṁṣṭrā-karālāni bhayānakāni
kecid vilagnā daśanāntareṣu
sandṛśyante cūrṇitair uttamāṅgaiḥ

🌷 Translation : 
All the sons of Dhṛtarāṣṭra, along with their allied kings, and Bhīṣma, Droṇa, Karṇa – and our chief soldiers also – are rushing into Your fearful mouths. And some I see trapped with heads smashed between Your teeth.

🌹 Purport :
In a previous verse the Lord promised to show Arjuna things he would be very interested in seeing. 

Now Arjuna sees that the leaders of the opposite party (Bhīṣma, Droṇa, Karṇa and all the sons of Dhṛtarāṣṭra) and their soldiers and Arjuna’s own soldiers are all being annihilated. 

This is an indication that after the death of nearly all the persons assembled at Kurukṣetra, Arjuna will emerge victorious. It is also mentioned here that Bhīṣma, who is supposed to be unconquerable, will also be smashed. 

So also Karṇa. Not only will the great warriors of the other party like Bhīṣma be smashed, but some of the great warriors of Arjuna’s side also.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


🌹. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము - 206 / Sripada Srivallabha Charithamrutham - 206 🌹
✍️. శ్రీ మల్లాది గోవింద దీక్షితులు
📚. ప్రసాద్ భరద్వాజ 

అధ్యాయం 36
🌻. విచిత్ర దాంపత్యం (మాతంగి) 🌻

🌻. అందెలరవళి 🌻

మాకు బహుమతిగా ఇచ్చిన కాలి అందెలను తీసుకొని మా ప్రయాణం సాగించాము. మేము నడుస్తున్నంత మేర మధురమైన ఆ అందెలరవళి మా మనసులను పరవ శింపచేసి ఏదో తెలియని దివ్యశక్తి అనాహతం నుండి ఇతర చక్రాలలోకి, అన్ని నాడులకు ప్రవహించి మాలో నూతన శక్తిని కలుగచేసింది. 

మేము గ్రామపు పొలిమేరల దగ్గరకు చేరాము. ఊరు చివర చండాల కులానికి సంబంధించిన వాళ్ళు నివసించే చోట ఒక ఆశ్రమాన్ని చూసి ఆశ్చర్య పోయాము. ఆశ్రమం దగ్గరకు చేరగానే అందెలరవళి ఆగి పోయింది. 

ఇంతలో ఆశ్రమం నుండి 60ఏండ్ల తేజస్వి అయిన మహర్షి, 30ఏళ్ళ ఒక యోగినీ మాత బయటకు వచ్చారు. మమ్మల్ని సాదరంగా లోపలకు తీసుకొని వెళ్ళి తాను పీఠికాపుర వాస్తవ్యుడనని, మొదటి పేరు వేదాంత శర్మ అని, ప్రస్తుతము బంగారయ్యప్ప అని పిలవబడు తున్నానని, ఆమె బంగారమ్మ అనే చర్మకారస్త్రీ అని, మాతంగి ఉపాసకులమని మాతో చెప్పారు. 

మాకంతా అయోమయంగా ఉంది. వారు బ్రాహ్మణులు, ఆ స్త్రీ మాదిగ కాంత, ఇది ఏమి దాంపత్యం? అని మనసులో ఒక సందేహం. మాకు కందమూలాలు, పండ్లు ఇచ్చాక వారి వృత్తాంతాన్ని ఇలా చెప్పారు:

🌻. వేదాంతశర్మ కథనం 🌻

“నేను పీఠికాపురంలో ఉన్నపుడు మూడుమార్లు వివాహం చేసుకున్నాను. కాని ముగ్గురు భార్యలూ మరణించారు. శ్రీపాదులు నాతో హాస్యంగా, ‘తాతా! నేను చూపిన మామ్మని వివాహం చేసుకోకుండా, ధర్మపత్నిగా మాత్రం స్వీకరిస్తే ఉత్తమ జన్మని ప్రసాదిస్తాను,’ అంటుండేవారు. 

పీఠికాపురంలోనే బంగారయ్య, బంగారమ్మ అనే చర్మకార దంపతులు ఉండేవారు. వారిద్దరికి శ్రీపాదులపై మక్కువ ఎక్కువ. ఒకరోజు ఉన్నట్లుండి శ్రీపాదులు చర్మపాదుకలు కావాలని కోరారు. బ్రాహ్మణులు చెక్కపాదుకలను ధరించాలే కాని చర్మ పాదుకలు ధరించ కూడదని ఇంటిలోని వారు నిరాకరించారు.  

శ్రీపాదులు యధేచ్ఛ గా అన్ని కులాలవారి ఇంటికి వెళ్ళుతుండేవారు. ఆ రోజు శ్రీపాదులు ఉన్నట్లుండి బంగారమ్మ వాళ్ళింట్లో ప్రత్యక్ష మయ్యారు వారి కొలతలు తీసుకున్నాక, ‘ప్రభూ! నా చర్మం ఒలిచి మీ చెప్పులు కుట్టాలని ఉంది,’ అని బంగారమ్మ తన కోరికను వ్యక్తం చేసింది. వారు నవ్వి అంతర్ధాన మయ్యారు. 

వాళ్ళ ఇంట్లో ఉన్న ఆవు చనిపోయింది, దాని చర్మంతో చెప్పులజత తయారయింది. అదే సమయంలో పీఠికా పురంలోని బ్రాహ్మణులు ఒక వేదాంత గోష్ఠిని ఏర్పాటు చేసారు. గోష్ఠికి ఎవరెవరిని ఆహ్వానించాలో నిర్ణయించే బాధ్యత నాపై పడింది. 

శ్రీపాదులు ఉపనయనం అయ్యాక ఒక్కరోజు కూడా వేదం నేర్చుకోలేదు, కాని ఎక్కడ నుండి ఏ పన్నమును చెప్పమన్న చెప్పి దాన్ని విశ్లేషించే వారు. అందుచేత వారు ధర్మసూత్రాలను ఎలా విశ్లేషిస్తారో వినాలన్న కుతూహలంతో నేను వారిని కూడా ఆహ్వా నించాను. 

అయితే, శ్రీపాదులు సభలో ధర్మ విరుద్ధంగా మాట్లాడితే ఆ వంకన రాజశర్మ, బాపనార్యుల కుటుంబాలను వెలి వేయవచ్చు అనేదే అసలు ఈ గోష్ఠిని ఏర్పాటు చేయడంలోని బ్రాహ్మణుల ముఖ్య ఉద్దేశం.  

సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Sripada Srivallabha Charithamrutham - 206 🌹
✍️ Satya prasad
📚. Prasad Bharadwaj 

CHAPTER 20
🌴. The Story of Vissavadhanulu Description of Sripada’s divine auspicious form - 13 🌴

🌻 There is no end to my avathar - 3 🌻

Later Sripada said, ‘both of you cross the river Krishna and go to the other side. You go to ‘Maanchaala’ village. The village Goddess of ‘Maanchaala’ will bless you.  

After receiving that Mother’s blessings you come back to Kurungadda. Know that I will be always watching you wherever you are and however far you are.

In future Maanchaala village will become world famous. It will become famous because of the presence of the live Samadhi of a Maha Purusha.  

Just like there is a gross Peethikapuram, there is a subtle Peethikapuram also. That is Swarna Peethikapuram’. It is established in the light aura surrounding My gross body.  

People who get my grace will have their ‘chaitanyam’ established in Swarna Peethikapuram whether they belong to any ‘Yugam’, any country or any time. This thing is known to all who have ‘yoga drishti’ (yoga vision).  

People who are able to earn a place in Swarna Peethikapuram for their ‘jeeva chaitanyam’, are blessed. I will be behind them in birth after birth and protect them. 

My Dear! Shankar Bhatt! After many hundreds of years, Maha Samsthanam will be established in my name, in my maternal grandfather’s house.  

My ‘padukas’ will be installed under the shade of an Oudumber tree. My idol, the idol of my previous avathar, and the idol of my next avathar will be also installed.  

I am giving you ‘divine vision’ (Divya Drishti). Look!’. ‘Saying so, He touched me and Gurucharana between eye brows. We were blessed looking at that beautiful sight.  

His ‘will’ was most powerful. His leelas were most wonderful.  

While we were starting, He said, ‘A person with the ‘amsa’ of vashista will come as ‘pujari’ (priest) to my samsthan.’

 End of Chapter 20

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 86 🌹
✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు 
సంకలనము : వేణుమాధవ్ 
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. *చేయవలసినది- చేయదలచినది - 2* 🌻

ఇతర దేశాలలో వేదాధ్యయనం చేస్తూన్న వారు కొన్ని లక్షల మంది ఉన్నారు‌ ఏదో ఒక రకంగా ప్రొద్దున్నే రోజూ కాస్సేపు గుణగుణలాడి దేవుని దగ్గర సణిగినట్లుగా చేసి ఆఫీసుకి పోయినట్లుగా కాక వారు చాలా నిష్ఠగా చేస్తూ ఉన్నారు‌. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం గాయత్ర్తీ మంత్రం ప్రపంచశాంతికై చేస్తూన్న వాళ్ళు ఉన్నారు. 

ప్రపంచ శాంతికై, ఒక దేశానికి మరొక దేశానికి మధ్య యుద్ధం రాకుండా ఉండటం కొరకు, ప్రపంచంలోని మానవజాతి శాంతిగా ఉండాలి, పరస్పరం ఒకరికొకరు సమన్వయంతో ఉండాలి అనే దృష్టితో అహోరాత్రాలు నమకచమకాలు చేస్తూన్నవారు, ప్యారిస్ లో, లండను లో, కొన్ని వేల మంది ఇప్పటికి 6 సంవత్సరాల నుండి చేస్తున్నారు‌ (1980-82 నాటికి) అఖండమైన నామజపం కూడా ఇప్పుడు చెప్పిన దేశాలలోను మరియు న్యూయార్కులోను కొన్ని వేల మంది ఉన్నారు. ఈ విధంగా అఖండ నామజపం కూడా (24 గంటలు) 6 సంవత్సరాల నుండి నడుస్తున్నది. 

ఇదంతా దేనికండీ అనగా ప్రపంచశాంతికై ఈ మహా యజ్ఞ నిర్వహణ జరుగుతోంది. అయితే ఇంతగా మనం భారతదేశంలో మనం చేస్తున్నమా? మనం మళ్ళీ వాళ్ళను (పాశ్చాత్యులను) చూసి నేర్చుకొనే రోజులు వస్తున్నాయి. 

Masters బ్రహ్మ విద్య అందరికీ అర్థమయ్యేటట్లు చేయటం కోసం, Madam Blavetsky అనే ఆమె ద్వారా "గుప్త విద్య" (Secret Doctrine) అను దానిని సరహస్యంగా ప్రయోగోపసంహార పూర్వకంగా ఇచ్చారు. 

అటుపైన 20వ శతాబ్దిలో 1934-35 సంవత్సరాల నుండి అఖండంగా ఒక 35 సంవత్సరాలు ఏలిస్ ఏ బెయిలీ అను ఆమె ద్వారా 24 సంపుటాలుగా బ్రహ్మవిద్య మళ్ళీ ప్రసాదింపబడినది‌. 

ఇతర దేశాలను ఈ విషయమున గమనించినచో, ఈ గ్రంథముల అధ్యయనము అఖండ బ్రహ్మ విద్యా పారీణత తత్వపరిషత్తులు, గోష్ఠులు మొదలయినవి ఇంగ్లండ్, ఫ్రాన్స్, బెల్జియం, స్విట్జర్లాండ్, హాలండ్, నెదర్లాండ్స్ లోని ఇతర దేశాలలో మనకు చక్కగా కనిపిస్తాయి. 

ఏ దేశానికి వెళ్లినా, బ్రహ్మ విద్యను అనుష్ఠిస్తున్న వాళ్ళు భగవద్గీతను పారాయణం చేస్తూన్న వాళ్ళు, వేదం ఉపనిషత్తులు అనుష్ఠానం చేస్తున్న వాళ్ళు కనిపిస్తారు...
....✍ *మాస్టర్ ఇ.కె.*🌻
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


🌹 The Masters of Wisdom - The Journey Inside - 109 🌹
🌴 The Aquarian AGE - 5 🌴
✍️ Master E. Krishnamacharya
📚 . Prasad Bharadwaj

🌻 Multiplication and Acceleration 🌻

In order to act quickly for humanity, Master CVV decided to multiply into 1000 channels and prepare 1000 mediums for the transmission of the energy. They should serve humanity in a cycle of 240 years. 

These mediums receive valuable scientific information to elaborate the consciousness of mankind. It began with a very small group and has now become global, as predicted. 

It is expected that all who follow the path of Master CVV will be transformed into mediums for the transmission of energy. His scientific way of working will first be known in the West. 

The Aquarian Energy will go first to Europe, then to South America and North America and then return to India. This is how it has happened. 

India could not receive the energy immediately because it was too burdened with its traditions and the energy could not be accepted so easily there.

Since 1910 there has been a tremendous acceleration of activity on the planet. 

Since the descent of the Aquarian Energy, every decade we experience the progress of an earlier century. All the electronics that have been created are due to the action of this energy. 

Master CVV demonstrated 18 times on himself and his disciples the transcending of death. He said, “In the future you will live more in the etheric body than in a body of flesh and blood.” 

The Master distributed the Aquarian Energy for 11 years, 11 months and 7 days until May 12, 1922, when he left the physical body as announced, but continued to work through his mediums. 

He has settled in the ether around the planet and can be invoked as Aquarian Energy through the sound key CVV.

🌻 🌻 🌻 🌻 🌻 🌻 🌻 
Sources used: Master K.P. Kumar: The Aquarian Master. Div. seminar notes/ Master E. Krishnamacharya: Spiritual Astrology.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


🌹. శ్రీ ఆర్యా ద్విశతి - 70 🌹
🌻. శ్రీ లలితా స్తవరత్న వైజ్ఞానిక ధ్యాన యోగము 🌻
✍️. విరచితం : భగవాన్ శ్రీ క్రోధభట్టారక (దుర్వాస మహర్షి)
📚. ప్రసాద్ భరద్వాజ

శ్రీసర్వసిద్ధి విఖ్యాతేఽస్మిం
శ్చక్రేఽప్యతి రహస్య యోగిన్యః I
త్రిపురామ్బికేతి విఖ్యాతాయుక్తా
సా పాతు మాం సదాదేవీ II 145 II

కామేశ్వరీ గృహోపరి
వలయే వివిధ మను సమ్ప్రదాయజ్ఞాః I
చత్వారో యంగనాధాః
జయన్తు మిత్రేశ పూర్వకా గురవః II 146 II

నాథ భవనోపరిష్ఠా
న్నానా రత్న చయ మేదురే పీఠే I
కామేశ్వర్యాద్యా నిత్యాః
కలయన్తు ముదం తిథి స్వరూపిణ్యః II 147 II

నిత్యా సదనస్యోపరి
నీలమణీ నివహ విరచితే ధిష్ణ్యే I
కుశలం షడఙ్గధేవ్యః
కలయన్త్వస్మాక ముత్తరళ నేత్రాః II 148 II

సదనస్యోపరి తాసాం
సర్వానన్దమయ నామకే బిన్దౌ I
పఙ్చ బ్రహ్మవికారం
మఞ్చం ప్రణమామి మణి గణాకీర్ణమ్ II 149 II

పరితో మణిమఞ్చస్య
ప్రలమ్బమానా నియన్త్రితా పాశైః I
మాయామయీ యవనికా
మమ దురితం హరతు మేచకచ్ఛాయా II 150 II

మఞ్చస్యోపరి లమ్బ
న్మల్లీ పున్నాగ మాలికా భరితమ్ I
హరిగోపమయ వితానం
హరితా దాలస్య మనిశ మస్మాకమ్ II 151 II

పర్యఙ్కస్య భజామః
పాదాన్ బిమ్బామ్బుదేన్దు హేమ రుచః I
అజ-హరి-రుద్రేశ మయా
ననలాసుర మారుతేశ కోణస్థాన్ II 152 II

సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


🌹. దాశరధి శతకము - పద్య స్వరూపం - 49 / Dasarathi Satakam - 49 🌹
పద్యము - భావము 
📚. ప్రసాద్ భరద్వాజ

🌻 97వ పద్యము : 
శ్రీయుతజానకీరమణ చిన్నయరూప రమేశరామ నా
రాయణ పాహిపాహియని బ్రస్తుతిఁ జేసితి నామనంబునం
బాయక కిల్బిషవ్రజ వి పాటనమందఁగ జేసి సత్కళా
దాయి ఫలంబునాకియవె దాశరథీ కరుణాపయోనిధీ

🌻. భావము : 
నిన్ను నేను జానకీపతీ! లక్ష్మీ వల్లభా! సంపద ప్రదాతా, చిన్మయ రూపా, రామా, నారాయణా అని అన్ని సమయములందు విడువక స్తోత్రము చేయుచుండును. దానికి ఫలముగా నీవు నా హృదయమునందు ఎల్లవేళలా కొలువు దీరుము. నా పాపములను నశింపజేయుము. నాకు ముక్తి నిమ్ము.

🌻. 98వ పద్యము : 
ఎంతటిపుణ్యమో శబరి యెంగిలిగొంటివి వింతగాదె నీ
మంతన మెట్టిదో యుడుత మైనిక రాగ్ర నఖాంకురంబులన్
సంతసమందఁ జేసితివి సత్కులజన్మము లేమి లెక్క వే
దాంతముగాదె నీ మహిమ దాశరథీ కరుణాపయోనిధీ

🌻. భావము : 
శబరి ఎంగిలి పళ్ళు తిని, ఉడుత సహాయమునకు మెచ్చి దాని శరీరమున నీ గోటిచారలు గీసి, వారిని జీవన్ముక్తులు చేసిన నీ దయ నన్ను తప్పక రక్షించును. తక్కువ జన్మలకే మోక్షమొసంగిన నీకు ఉత్తమ జన్మలకు ముక్తిని ఒసగుట కష్టము కాదు. నీ మహత్యము నా లాంటి వారికి తెలియరాని వేదాంతమే కదా?

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

🌹 Dasarathi Satakam - 49 🌹
Sloka and Meaning 
📚. Prasad Bharadwaj
 
🌻 97th Poem : 
SrIyutajAnakIramaNa cinmayarUpa ramESarAma nA 
rAyaNa pAhipAhiyani brastuti jEsiti nAmanaMbunan 
bAyaka kilbiShavraja vi pATanamaMdaga jEsi satkaLA 
dAyi PalaMbunAkiDave dASarathI karuNApayOnidhI

🌻 Meaning : 
O Consort of Lakshmi! Beloved of Janaki! Embodiment of knowledge! Rama! Narayana! I meditated on you for protection. Please stay in my mind and root out the sins I have accumulated and bless me with fruitful results.

🌻 98th Poem : 
eMtaTipuNyamO Sabari yeMgiligoMTivi viMtagAde nI 
maMtana meTTidO yuDuta maini karAgra naKAMkuraMbulan 
saMtasamaMda jEsitivi satkulajanmamu lEmi lekka vE 
dAMtamugAde nI mahima dASarathI karuNApayOnidhI

🌻 Meaning : 
How pious is Sabari whom you blessed by eating a fruit tasted by her prior to giving to you? How fortunate is the squirrel whom you blessed with your finger nails touching its body and leaving a permanent impression on its body? One can understand your greatness (mahattwamu) by learning the essence of vedas and not by being born in a high caste.

Continues... 
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


🌹. నారద భక్తి సూత్రాలు - 26 🌹 
✍️. సద్గురు శ్రీ విజ్ఞాన స్వరూప్ కోసూరి మురళీకృష్ణ, అచల గురు పీఠము. 
📚. ప్రసాద్ భరద్వాజ 
ప్రథమాధ్యాయం - సూత్రము - 15

🌻. 15. తల్లక్షణాని వాచ్యంతే నానా మత భేదాత్‌ - 3 🌻

   8. ఆర్ధ్రత చెందిన హృదయమే పరాభక్తి స్వరూపం. అనగా అతడి మనసు అతడి హృదయంలో విలీనమైంది. ఇక మనసనేది లేదు. 

తిరిగి మనసును పుట్టించే హృదయం భగవన్మయమైనందున, అది లోక వృత్తులనుండి విడుదలై ఉన్నది. అలౌకికమైనట్టి పరమానందమే పరాభక్తి.

        9. రూపగోస్వామి ప్రకారం కర్మ జ్ఞానాదుల చేత ఆవరింపబడ కుండా ఉన్నప్పుడు, అతడిలో ఏ స్థిరమైన భగవదానందానుభవముంటుందో అదే పరాభక్తి అవుతుంది. 

కర్మ జ్ఞానాదులచేత ఆవరింపబడినవాడు జీవుడు గనుక, పరాభక్తిలో జీవభావం నశిస్తుంది. అన్ని విధాలైన ఆవరణ దోషాలు నశిస్తే, మిగిలేది స్థిరరూప పరమానందానుభవమే. అదే పరాభక్తి.

      10. భగవత్సాక్షాత్కారమే పరాభక్తి. సాక్షాత్కారమన్నా అపరోక్షాను భవమన్నా, ఆ భగవంతునితో ఐక్యతానుసాంధానరూప పరమానందమే. ఇదే సాయుజ్యం అనబడుతుంది.

            11. యమునాచార్యుల ప్రకారం, భగవద్వియోగ భయమే పరాభక్తి అవుతుంది. 

చిన్న పిల్లలు భయపడినప్పుడు తల్లిని కౌగిలించుకొని బయటి వస్తువుల ద్వారా కలిగిన భయం నుండి విడుదలై తల్లియందు ఏలాగున సేద తీరుతారో, అదే విధంగా భక్తుడు భగవంతునిలో చేరి నిర్భయుడౌతాడు. 

భగవంతుని నుండి వేరవడానికి భయపడతాడని చెప్పడంలో అర్థం భగవంతునితో మమేకమౌతాడని చెప్పడమే అవుతుంది.

            ఈ విధంగా పరాభక్తి లక్షణాలను వారి వారి అనుభవాలను బట్టి అనేక మతస్థులు, స్వానుభవపరులు వివరించారు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


🌹. పంచకోశములు - విజ్ఞానమయ కోశము 🌹 
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
చలాచల బోధ... 
📚. ప్రసాద్ భరద్వాజ

బుద్ధి+ జ్ఞానేంద్రియములు ఐదింటిని కలిపి విజ్ఞానమయ కోశము అని అంటారు. 
 
విజ్ఞానమయకోశము కర్తృస్వభావము కలిగినటువంటిది. ఈ కర్తృత్వము వలననే కర్మలను నేను చేయుచున్నాను అను భావనకు లోనగుట ,కర్మలన్నింటి ఫలములు తన ఖాతాలో జమ అగుట , వాటిని సుఖదుఃఖ రూపములో అనుభవించుట, సంసారమునందు, జనన మరణ చక్రమునందు బంధించబడుట జరుగుచున్నది.
 
దేహముతో తాదాత్మ్యం చెందిన అహంభావనయే విజ్ఞానమయకోశము.
 
మూడు అవస్థలు ఈ విజ్ఞానమయకోశమునకే. తన కర్మ ఫలములను అనుభవించాలి అను కోరికయే విజ్ఞానమయుడను మేల్కొనేటట్లు చేస్తుంది. 

విజ్ఞానమయకోశమునే జీవుడు అంటారు. మనస్సు కేవలము కరణము లేక పనిముట్టు , కనుక జీవత్వబ్రాంతి నుండి విడిపించు బోధ అంతయు విజ్ఞానమయకోశమునకే చేయబడుతుంది.
 
ఆత్మను కర్తగా భావించుట వలన విజ్ఞానమయము కోశము అగుచున్నది.
 
విజ్ఞానమయకోశము ఒకప్పుడు వినేవానిగాను, మరొకప్పుడు చూచేవానిగాను. నిరంతరము మార్పు చెందుతూ ఉంటుంది. పరిణామము లేక ఏక రీతిగా ఉండునది ఆత్మ.కనుక విజ్ఞానమయకోశము ఆత్మ కాదు.
 
దేహముతో తాదాత్మ్యం చెందిన అహంభావన విజ్ఞానమయకోశము. కనుక పరిమితము. ఆత్మ సర్వవ్యాపకము.కనుక విజ్ఞానమయకోశము ఆత్మ కాదు.
 
విజ్ఞానమయకోశ వ్యాపారము సాక్షికి తెలియబడుచున్నది. నాకు తెలియబడేది నేను కాదు కనుక విజ్ఞానమయకోశము నేను కాదు .
 
సుషుప్తిలోనికి వెళ్ళినప్పుడు కర్తృత్వము లేదు.సర్వ కాల సర్వ అవస్థల యందు ఉండునది ఆత్మ. కనుక విజ్ఞానమయకోశము ఆత్మ కాదు.
 
నేను వ్యవహరించే సమయమున
నేను బుద్ధిమంతుడను , నేను బుద్ధిహీనుడను
నేను నడుస్తున్నాను, నేను వింటున్నాను
అని ఇంద్రియ, బుద్ధి వ్యాపారములను దేహముతో తాదాత్మ్యం వలన నేను (ఆత్మ)కు ఆపాదిస్తున్నాము.
 
ప్రారబ్ధవశమున జీవితకాలమున జరుగవలసిన సంఘటనలు , కలుగవలసిన సుఖదుఃఖ అనుభవములు కలుగుచుండగా అవన్నియు నేను చేయుచున్నాను, నేను అనుభవిస్తున్నాను అను కర్తృత్వ, భోక్త్రుత్వముతో కూడిన జీవ భావమునకు లోనగుచున్నాము.
 
వీటన్నింటికి విలక్షణమైన సాక్షిస్వరూపుడను నేను.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🌹. శ్రీ మాణిక్ ప్రభు చరితామృతము - 57 / SHRI MANIK PRABHU - HIS LIFE AND MISSION - 57 🌹
🌻. చతుర్థ దత్తావతారము 🌻 
 📚. సేకరణ : ప్రసాద్ భరద్వాజ 

🌸 . బ్రహ్మచైతన్య గోంద్ వలేకర్ 🌸

      ప్రభు కృపాకటాక్షం కోసం అనేకమంది సంతులు, మహంతులు, యోగులు, ఫకీరులు మాణిక్ నగర్ కు వస్తూండేవారు. సమర్ధ రామదాసు సంప్రదాయంలోని భక్తి యుతులైన బ్రహ్మచైతన్య గోంద్ వలేకర్ చిన్న వయస్సులో సద్గురువులను వెతుక్కుంటూ మాణిక్ నగర్ కీ వచ్చారు.

   'అక్కల్ కోట నుండి బ్రహ్మచైతన్య మహారాజ్ బయలుదేరి మాణిక్ ప్రభు దర్శనం కోసం హుమానాబాద్ కి వెళ్లారు. ఈయన ఏ రోజైతే మాణిక్ నగర్ కి వస్తున్నారో ఆరోజు మాణిక్ ప్రభు ఊరి బయట ఎదురుచూస్తూ కూర్చున్నారు.' భోజన సమయం కావడం వలన శిష్య బృందం ప్రభువును భోజనానికి రమ్మని పిలిచారు. 

"అరె! భోజనం ఏమిటి? రోజూ భోజనం చేస్తాము కానీ, ఈరోజు నా సోదరుడు వస్తారు, దాని ముందు మీ భోజనం ఒక లెక్కా అన్నారు. బ్రహ్మచైతన్య గారు వచ్చిన తర్వాత ఇంటికి తీసుకువెళ్లి కొన్నిరోజులు తర్వాత తిరిగి పంపించారు.

 🌸 1857 స్వాతంత్ర్య సంగ్రామం 🌸

   1857వ సంవత్సరములో ఉత్తర భారతంలో బ్రిటిష్ వారికి విరుద్ధంగా నానాసాహెబ్ పేష్వా, ఝాన్సీరాణి లక్ష్మీబాయి, తాంత్యా తోపే మొదలైన వారు పోరాడారు. నిజాములకు, బ్రిటిష్ వారికి మైత్రి ఉండడం వలన దక్షిణ భారతదేశంలో ఈ విషయంపై ఏ ప్రభావం చూపలేదు. కానీ ప్రభు యొక్క కీర్తి విని నానాసాహెబ్ పేష్వా తన పని నిర్విఘ్నంగా జరగడానికి ప్రభు ఆశీర్వాదం, సహాయం లభించాలని రంగారావు అనే మనిషితో రహస్యంగా పత్రాన్ని ప్రభు వద్దకు పంపించారు.

    ఆయన ప్రభు వద్దకు వచ్చి ఆ పత్రాన్ని ఇచ్చి మాటల రూపంలో కూడా నివేదించారు. ప్రభు ప్రేమతో రంగారావుని ఎనిమిది రోజులు మాణిక్ నగర్ లో ఉంచి, చివరికి ప్రసాదంతో పాటు సంగ్రామం కోసం చాలా ధనాన్ని ఇచ్చి "నానాకు నా తరపు నుండి చెప్పండి, కార్యం విజయవంతం కావడానికి ఇంకా చాలా సమయం ఉన్నా కూడా మీ ప్రయత్నాన్ని ఆపవద్దు. విజయవంతం చేయడానికి దత్త ప్రభు సమర్ధులై ఉన్నారు" అని చెప్పారు.

దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర 🙏
🌹🌹🌹🌹🌹

🌹 SHRI MANIK PRABHU - HIS LIFE AND MISSION - 57 🌹
✍️. Nagesh D. Sonde
📚. Prasad Bharadwaj

🌻 15. Shri Siddharaj Manik Prabhu (1939 – 2009) - 3 🌻

In the humble opinion of the writer, Shri Siddharaj Manik Prabhu represented the essential characteristics of Shri Dakshinamurti, who through his very silence instructed each one of his disciples to perceive, hear, reflect and meditate upon the Self, which is Truth.  

Yajnavalkya had commended to his wife Maitreyi, “Verily, O Maitreyi, it is the Self that is to be seen, heard of, reflected on and meditated upon” (Brihad Aranyak Upanishad II.4.5). 

In following the ancient instructions, Shreeji did not find any dichotomy between the vision of the ancient Vedic Seers and the modern scientists. To him, it did not appear strange that when the first atomic bomb was exploded in Nevada, the Atomic Scientist should exclaim quoting the words of Gita: 

 “If the light of thousand suns were to blaze forth all at once in the sky, that might resemble the splendour of that Exalted Being” (XI.12).  

Many of the famous scientists and physicists have bordered between scepticism and belief in an unseen, unknowable Reality which they have not been able to explain. The entire outlook of Shreeji, therefore, represented the ideal of samatvam, equanimity. 

 He would neither be perturbed with unpleasant invitation nor would he be elated with rapturous reception. His patience and humility was the hallmark of his personality.  

His spiritual capacity was shrouded in his childlike simplicity. He was as keen a participant in philosophical discussion as he was in Cricket and other mundane activities.  

Brihad Aranyak Upanishad talks of the ideal knower of Brahman. “Let a Brahman (the knower of Brahman), after he has done with learning, desire to live as a child. When he has done both with the state of childhood and with learning, then he becomes a silent spectator.  

Having done with both meditative and non-meditative states, then he becomes a Brahman (knower of Brahman)” (III.5.1).

For one who is inculcated in Shri Datta Sampradaya, Shreeji appeared like an Avadhoota, taking life as it came and observing the activities of the world as a Stithaprajna. He identified himself so much with Shri Manik Prabhu that it was common for him to say, “Shri Manik Prabhu’s Will prevails…”  

He had nothing of his own, needed nothing for himself. He had the simplicity of Shri Manik Prabhu as well as the grandeur of the Seat which he occupied.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


🌹. సౌందర్య లహరి - 33 / Soundarya Lahari - 33 🌹
📚. ప్రసాద్ భరద్వాజ 

33 వ శ్లోకము

🌴. ధనవంతుడు అగుటకు, ఐశ్వర్యము కొరకు 🌴

శ్లో: 33. స్మరం యోనిం లక్ష్మీం త్రితయ మిదమాదౌ తవ మనో 
ర్నిధాయైకే నిత్యే నిరవధి మహాభోగరసికాఃl 
భజన్తి త్వాం చిన్తామణి గుణ నిబద్ధాక్ష వలయాః 
శివాగ్నౌ జుహ్వన్త సురభిఘృతధారా హుతిశతైఃll 
 
🌻. తాత్పర్యము : 
అమ్మా ! ఆద్యంతము లేని ఓ జననీ నీ మంత్రమునకు మొదట కామరాజ, భువనేశ్వరి, లక్ష్మీ బీజములు అగు క్లీం, హ్రీం, శ్రీం లను చేర్చి అంతులేని నిత్య సుఖానుభవమును పొందిన సాధుపుంగవులు కొందఱు చింతా రత్న హారముల చేత కట్టబడిన జపమాలికలు ధరించి త్రికోణ నిలయమగు బైండవ స్థానమునందు కామధేనువు యొక్క నేతి ధారలను సహస్ర సంఖ్యలచే నిన్ను సేవించు చున్నారు కదా ! 

🌻. జప విధానం - నైవేద్యం :
ఈ శ్లోకమును 1000 సార్లు ప్రతి రోజు 45 రోజులు జపం చేస్తూ, క్షీరాన్నము, తేనె నివేదించినచో సర్వ సంపదలను, 10 రెట్లు ఐశ్వర్యము పొందును అని చెప్పబడింది.
🌹 🌹 🌹 🌹 🌹 

🌹 Soundarya Lahari - 33 🌹
📚. Prasad Bharadwaj 

Sloka 33

🌴 Richness, and All Benificial 🌴

33. Smaram yonim lakshmim trithayam idam adau tava manor Nidhay'aike nitye niravadhi-maha-bhoga-rasikah; Bhajanti tvam chintamani-guna-nibaddh'aksha-valayah Sivagnau juhvantah surabhi-ghrta-dhara'huti-sataih.

🌻 Translation :
Oh, mother who is ever present, those who realize the essence, of the limitless pleasure of the soul you give, and who add the seed letter iim of the god of love, the seed letter hrim of the goddess Bhuavaneswari, and the seed letter srim of the goddess Lakshmi, which are the three letter triad,wear the garland of the gem of thoughts, and offer oblations to the fire in triangle of Shiva, with the pure scented ghee of the holy cow, Kamadhenu, several times and worship you.

🌻 Chanting procedure and Nivedyam (offerings to the Lord) :   

If one chants this verse 1000 times each day for 45 days, offering, milk rice and honey prasadam, it is said that one would be able to get Riches and attain all benefits.(would get 10 times more than what you actually possess).

🌻 BENEFICIAL RESULTS:
Amassing of much wealth. 
 
🌻 Literal results:
Enjoying rich and luxurious life. Attaining a priceless jewel, unlimited supply of rich and nutritious food.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


🌹. శ్రీమద్భగవద్గీత - 332 / Bhagavad-Gita - 332 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 9వ అధ్యాయము - రాజవిద్యా రాజగుహ్య యోగం - 13 🌴

13. మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితా: |
భజన్త్యనన్యమనసో జ్ఞాత్వా భూతాదిమవ్యయమ్ ||

🌷. తాత్పర్యం :
ఓ పృథాకుమారా! భ్రాంతులు కానటువంటి మహాత్ములు మాత్రము దైవీప్రకృతిని ఆశ్రయించియుందురు. వారు నన్ను ఆదియును, అవ్యయుడును అగు దేవదేవునిగా నెరిగియుండుటచే నా భక్తియుతసేవలో సంపూర్ణముగా నిమగ్నులై యుందురు.

🌷. భాష్యము : 
మహాత్ములైనవారి వర్ణనము ఈ శ్లోకమున స్పష్టముగా ఒసగబడినది. దైవీప్రకృతిలో స్థితిని పొందియుండుటయే మహాత్ముల ప్రథమ లక్షణము. అతడెన్నడును భౌతికప్రకృతికి లోబడియుండడు. 

అది ఎట్లు సాధ్యమనెడి విషయము సప్తమాధ్యాయమున ఇదివరకే వివరింపబడినది. దేవదేవుడైన శ్రీకృష్ణుని శరణము నొందినవాడు శీఘ్రమే భౌతికప్రకృతి యొక్క అధీనము నుండి ముక్తి నొందగలడు. అదియే మహాత్ముని నిజమైన యోగ్యత. 

కనుక మనుజుడు తన ఆత్మను ఆ భగవానుని అధీనము చేసినంతనే భౌతికప్రకృతి అదుపు నుండి ముక్తుడు కాగాలడన్నది ప్రాథమికసూత్రము. తటస్థశక్తియైన జీవుడు భౌతికశక్తి నుండి విడివడినంతనే ఆధ్యాత్మికశక్తి నేతృత్వమునకు మరియు నిర్దేశమునకు వచ్చును. 

అట్టి ఆధ్యాత్మికప్రకృతి నిర్దేశమే “దైవీప్రకృతి” యని పిలువబడుచున్నది. అనగా శ్రీకృష్ణభగవానునికి శరణమునొంది ఆ విధముగా పురోగతి నొందినపుడు మనుజుడు “మహాత్ముడు” అనెడి స్థాయిని పొందగలడు.

శ్రీకృష్ణుడే ఆదిపురుషుడు మరియు సర్వకారణములకు కారణమని సంపూర్ణముగా తెలిసియున్నందున మహాత్ముడైనవాడు తన మనస్సును కృష్ణునిపై నుండి ఇతరము వైపునకు మళ్ళింపడు. ఈ విషయమున ఎట్టి సందేహము లేదు. మహాత్ములైన శుద్ధభక్తుల సాంగత్యము వలననే అట్టి మహాత్ముడు రూపొందగలడు. 

శుద్ధభక్తులైనవారు చతుర్భుజ మహావిష్ణువు వంటి శ్రీకృష్ణుని ఇతర రూపములందును ఆకర్షితులుగాక కేవలము అతని ద్విభుజరూపమునందే అనురాగమును, ఆకర్షణను కలిగియుందురు. 

కృష్ణుని ఇతర రూపముల యెడ గాని, ఇతర దేవతల యెడగాని, మనుజుల యెడగాని వారెన్నడును ఆకర్షుతులు కారు. సంపూర్ణ భక్తిభావనలో కృష్ణుని పైననే ధ్యానము నిలిపి, ఆ కృష్ణభక్తిరసభావనలో వారు నిశ్చితమైన కృష్ణసేవ యందు సదా నియుక్తులై యుందురు.
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 332 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 9 - Raja Vidya Raja Guhya Yoga - 13 🌴

13 . mahātmānas tu māṁ pārtha
daivīṁ prakṛtim āśritāḥ
bhajanty ananya-manaso
jñātvā bhūtādim avyayam

🌷 Translation : 
O son of Pṛthā, those who are not deluded, the great souls, are under the protection of the divine nature. They are fully engaged in devotional service because they know Me as the Supreme Personality of Godhead, original and inexhaustible.

🌹 Purport :
In this verse the description of the mahātmā is clearly given. The first sign of the mahātmā is that he is already situated in the divine nature. 

He is not under the control of material nature. And how is this effected? That is explained in the Seventh Chapter: one who surrenders unto the Supreme Personality of Godhead, Śrī Kṛṣṇa, at once becomes freed from the control of material nature. That is the qualification. 

One can become free from the control of material nature as soon as he surrenders his soul to the Supreme Personality of Godhead. That is the preliminary formula. Being marginal potency, as soon as the living entity is freed from the control of material nature, he is put under the guidance of the spiritual nature. 

The guidance of the spiritual nature is called daivī prakṛti, divine nature. So when one is promoted in that way – by surrendering to the Supreme Personality of Godhead – one attains to the stage of great soul, mahātmā.

The mahātmā does not divert his attention to anything outside Kṛṣṇa, because he knows perfectly well that Kṛṣṇa is the original Supreme Person, the cause of all causes. There is no doubt about it. Such a mahātmā, or great soul, develops through association with other mahātmās, pure devotees. 

Pure devotees are not even attracted by Kṛṣṇa’s other features, such as the four-armed Mahā-viṣṇu. They are simply attracted by the two-armed form of Kṛṣṇa. 

They are not attracted to other features of Kṛṣṇa, nor are they concerned with any form of a demigod or of a human being. 

They meditate only upon Kṛṣṇa in Kṛṣṇa consciousness. They are always engaged in the unswerving service of the Lord in Kṛṣṇa consciousness.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹