గురువు యొక్క ప్రాముఖ్యత - అజ్ఞానపు చీకటి నుండి దైవిక కాంతికి ప్రయాణం (The Importance of a Guru: A Journey from Darkness to Divine Light)


https://youtu.be/U2gwKNIGfqg


🌹🎥 గురువు యొక్క ప్రాముఖ్యత - అజ్ఞానపు చీకటి నుండి దైవిక కాంతికి ప్రయాణం 🎥🌹


ఈ వీడియోలో, మేము గురు-శిష్యుల సంబంధం యొక్క లోతైన ప్రాముఖ్యతను అన్వేషిస్తాము, ఇది షరతులు లేని దైవిక ప్రేమ మరియు జ్ఞానంతో పాతుకుపోయిన బంధం. దైవిక సంకల్పం ద్వారా నియమించబడిన ఒక గురువు మనలను అజ్ఞానం అనే చీకటి నుండి జ్ఞానం మరియు స్వేచ్ఛ యొక్క శాశ్వతమైన వెలుగులోకి ఎలా నడిపిస్తాడో కనుగొనండి. మేము ఈ సంబంధం యొక్క పవిత్ర సారాంశాన్ని పరిశోధించేటప్పుడు మాతో చేరండి మరియు అది మీ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ఎలా మార్చగలదో తెలుసుకోండి.

🌹🌹🌹🌹🌹

The Importance of a Guru: A Journey from Darkness to Divine Light


https://youtu.be/zJhfOyl3B80


🌹 🎥 The Importance of a Guru: A Journey from Darkness to Divine Light 🎥🌹


In this video, we explore the profound significance of the guru-disciple relationship, a bond rooted in unconditional divine love and wisdom. Discover how a guru, appointed by divine will, leads us from the darkness of ignorance to the eternal light of wisdom and freedom. Join us as we delve into the sacred essence of this relationship and learn how it can transform your spiritual journey.

🌹🌹🌹🌹🌹

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 552 - 6 / Sri Lalitha Chaitanya Vijnanam - 552 - 6


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 552 - 6 / Sri Lalitha Chaitanya Vijnanam - 552 - 6 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 112. విమర్శరూపిణీ, విద్యా, వియదాది జగత్ప్రసూః ।
సర్వవ్యాధి ప్రశమనీ, సర్వమృత్యు నివారిణీ ॥ 112 ॥ 🍀

🌻 552. 'సర్వమృత్యు నివారిణీ' - 6 🌻


తారణవిద్య నెఱిగిన వాడు దేహములను ధరించుచు, కర్తవ్యములను నిర్వర్తించుచు, దేహములను త్యజించుచూ ఆరోహణ క్రమమున సాగుచు నుండును. ఇట్టి వారినే మృత్యుంజయులని, చిరంజీవులని పేర్కొందురు. ఆర్య సంప్రదాయమున ఋషుల గ్రంథములు మృత్యువును దాటమని మానవులను నిర్దేశించును. మృత్యువును గూర్చిన జ్ఞానము ప్రధానముగ నేర్చి పిమ్మట ఎన్ని విద్యలు నేర్చిననూ అవి సార్థకములు. లేనిచో ఎంత నేర్చిననూ అది నిరర్ధకమే. భగవద్గీత, భాగవతము, కఠోపనిషత్తు, సావిత్రీ ఉపాఖ్యానము వంటివి మృత్యువు స్వరూప స్వభావములను వివరించుచూ మృత్యువును దాటు ఉపాయములను అందించినవి.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 552 - 6 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️ Prasad Bharadwaj

🌻 112. Vimarsharupini vidya viyadadi jagatprasuh
sarvavyadhi prashamani sarvamrutyu nivarini ॥112 ॥ 🌻

🌻 552. 'Sarvamrutyu Nivarini' - 6 🌻

A person who is skilled in Taranavidya wears body, performs duties, renounces body and proceeds in the ascension. These people are called Mrityunjayas and Chiranjeevis. In the Aryan tradition, the texts of the sages instruct humans to transcend death. After primarily gaining the knowledge about death, subsequently gaining other knowledge is beneficial. Without it, no matter how much you learn, it is meaningless. Bhagavad Gita, Bhagavata, Kathopanishad, Savitri Upakhyana explain the nature of death and provide ways to overcome death.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


సిద్దేశ్వరయానం - 112 Siddeshwarayanam - 112

🌹 సిద్దేశ్వరయానం - 112 🌹

💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐

🏵 యోగులు - సూక్ష్మశరీరులు - 8 🏵


లలితా సహస్రనామ పారాయణం చేయటంలో మా పరమగురువులు త్రివిక్రమ రామానందభారతీస్వామి చాలా సమర్థులు. వారి కంఠం చాలా శ్రావ్యంగా ఉండి వారు శ్లోకంగాని పద్యంగాని చదివే బాణి చాలా ఆకర్షణీయంగా ఉండేది. ఆ నామావళిని ఆయన చేత చదివించి రికార్డు చేసి పీఠంలో ఉంచారు. ఆయన లలితాదేవి అర్చన చేసేటపుడు 1970 సంవత్సరం ప్రాంతంలో నేను స్వయంగా విన్నాను కూడా. 1960 ప్రాంతంలో మొదటిసారి సన్యాసదీక్ష తీసుకొందామన్న సంకల్పం కలిగి వారిని కోరటం, వారంగీకరించటం రెండూ జరిగినాయి. కానీ, మా తల్లిదండ్రులు ఇంటి పెద్దకొడుకు ఇంత చిన్నవయస్సులో సన్యాసం తీసుకోవటానికి వీలులేదని పట్టు పట్టటంతో అప్పుడు ఆగిపోయింది. మళ్ళీ నలభైసంవత్సరాల తరువాత అది సమకూరింది. వైరాగ్య సంస్కార సంపద పెంపొందిన నా శ్రీమతి అంగీకరించడం వల్ల, సహకరించడం వల్ల ఆశ్రమ స్వీకారం సుగమము అయింది. ఆరువందల సంవత్సరాల క్రింద బృందావనధామంలో నివసించిన ఆ భక్తురాలు ఆ నాడు కాళీసిద్ధునిగా ఉన్న నాపై పెంచుకొన్న మమకారం తరువాత వచ్చిన రెండు జన్మల అనుబంధానికి కారణమయింది.

ఇటీవల ఉజ్జయినీలో కాళీదర్శనానికి వెళ్ళినపుడు, నగరదేవత మందిరాలను చూస్తూ ఊరి బయటున్న ఒక గణపతి ఆలయానికి వెళ్ళితే అక్కడ త్రివిక్రమరామానంద భారతీస్వామివారి సూక్ష్మదేహం కనిపించింది. వారు కాశీకి అప్పుడప్పుడు వెళ్ళినట్లు తెలుసుకానీ ఉజ్జయిని వచ్చిన సంగతి తెలియదు. ఆ స్థలంతో వారికి ఏ అనుబంధమున్నదో ! సిద్ధులకు వారికి సంబంధించిన ప్రదేశాల మీద మమకారం ఉండడం అక్కడికి తరచుగా వారు వస్తూ ఉండటం నేను గమనించాను. కుర్తాళంతో మౌనస్వామికే కాదు మరికొందరు సిద్ధులకు కూడా అనుబంధం ఉండటం ఇటీవల తెలియవచ్చింది. మహనీయులుగా పేరు చెందిన మహావతార్ బాబా ఇటీవల సిద్ధేశ్వరీ మందిరంలో దర్శనమిచ్చినపుడు ఆయన నన్ను అనుగ్రహించాడని అనుకొన్నాను. తరువాత కుర్తాళంతో ఆయనకు ఉన్న అనుబంధ విశేషాలు తెలిసినవి. క్రీస్తు శకము మూడవ శతాబ్దంలో కుర్తాళం వచ్చి 48 రోజులు తపస్సు చేసి అగస్త్యమహర్షి దర్శనం సాధించి మహాసిద్ధునిగా పరిణామం చెందిన సంఘటన, మౌనస్వామితో ఆయనకు ఉన్న అనుబంధం తెలిసి ఆశ్చర్యపడ్డాను.

అలానే ఇటీవల అరుణాచలం వెళ్ళినపుడు రమణమహర్షి ఆశ్రమంలో కొద్దిసేపు ధ్యానం చేసినపుడు అక్కడికి కావ్యకంఠగణపతి ముని, ఒక స్వాతంత్ర సమర యోధుడు సూక్ష్మదేహాలు రావటం గమనించాను. గణపతిముని, మహర్షిభక్తుడు కనుక ఆయన సూక్ష్మశరీరం అక్కడ సంచరించటంలో ఆశ్చర్యం లేదు కానీ, ఆ స్వాతంత్ర సమర యోధుడు సాక్ష్మశరీరం అక్కడకు ఎందుకు రావాలి ? అప్పుడు కావ్యకంఠుడు చెప్పిన ఒక అంశం గుర్తుకు వచ్చింది. బానిసతనంలో మగ్గుతున్న భారతదేశాన్ని చైతన్యవంతం చేసి స్వాతంత్ర్యమును సముపార్జించటానికి సిద్ధమండలానికి చెందినవారు కొందరు దిగి వచ్చారని వారిలో ఒకరని తన ఉమాసహస్ర గ్రంథంలో ఆయన తెలియచేశారు. అదే విధంగా ఇటీవల అమెరికాలో బోస్టన్ నగరంలో ఉన్నప్పుడు పరమహంస యోగానంద దర్శన మివ్వటం జరిగింది. కాశీలో స్వామి విశుద్ధానంద ఆశ్రమానికి వెళ్ళి ఆయన సాధన చేసిన నవముండి ఆసన సమీపంలో ధ్యానం చేసినపుడు ఆయన సిద్ధశరీరం గోచరించింది. ఈ సిద్ధులంతా నాతో జన్మాంతర అనుబంధం కలవారే కావటం విశేషం.


( సశేషం )

🌹🌹🌹🌹🌹


శ్రీమద్భగవద్గీత - 557: 15వ అధ్., శ్లో 06 / Bhagavad-Gita - 557: Chap. 15, Ver. 06

 

🌹. శ్రీమద్భగవద్గీత - 557 / Bhagavad-Gita - 557 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 15వ అధ్యాయము - పురుషోత్తమ యోగము - 06 🌴

06. న తద్ భాసయతే సూర్యో న శశాఙ్కో న పావక: |
యద్గత్వా న నివర్తన్తే తద్ధామ పరమం మమ ||


🌷. తాత్పర్యం : అట్టి నా దివ్యధామము సూర్యునిచే గాని, చంద్రునిచేగాని లేదా అగ్ని విద్యుత్తులచే గాని ప్రకాశింపజేయబడదు. దానిని చేరినవారు తిరిగి ఈ భౌతిక జగమునకు మరలిరారు.

🌷. భాష్యము : కృష్ణలోకముగా (గోలోకబృందావనము) తెలియబడు దేవదేవుడైన శ్రీకృష్ణుని ధామము (ఆధ్యాత్మికజగము) ఇచ్చట వర్ణింపబడినది. ఆధ్యాత్మికలోకములన్నియును స్వయంప్రకాశమానములు కనుక ఆధ్యాత్మికజగత్తు నందు సూర్యకాంతి, చంద్రకాంతి, అగ్ని, విద్యుత్తుల అవసరము లేదు. ఈ విశ్వములో సూర్యుడొక్కడే స్వయం ప్రకాశమానుడు. కాని ఆధ్యాత్మికజగత్తులోని లోకములన్నియు స్వయం ప్రకాశమానములే. వైకుంఠలోకములుగా పిలువబడు ఆ లోకముల ప్రకాశమాన కాంతియే బ్రహ్మజ్యోతి యనబడు తేజోమయ ఆకాశమును రూపొందించును.

వాస్తవమునకు ఆ కాంతి కృష్ణలోకమైన గోలోక బృందావనము నుండియే బయల్వెడలుచున్నది. ఆ తేజపు అతికొద్దిభాగము మహత్తత్త్వముచే (భౌతిక జగము) కప్పుబడినను మిగిలిన భాగమంతయు వైకుంఠములని పిలువబడు ఆధ్యాత్మిక లోకములచే నిండి యుండును. ఆ లోకములలో ముఖ్యమైనదే గోలోక బృందావనము. అంధకారబంధురమైన ఈ భౌతికజగము నందున్నంత కాలము జీవుడు బద్ధజీవనమును గడిపినను, మిథ్యాసంసారవృక్షమును ఖండించుట ద్వారా ఆధ్యాత్మికలోకమును చేరినంతనే ముక్తుడగును. అటు పిమ్మట అతడు ఈ భౌతికజగమునకు తిరిగివచ్చు అవకాశమే లేదు. బద్ధజీవనమున జీవుడు తనను తాను భౌతికజగమునకు ప్రభువుగా తలచినను, ముక్తస్థితిలో మాత్రము ఆధ్యాత్మికజగమును చేరి శ్రీకృష్ణభగవానునికి సహచరుడై నిత్యానందమును, నిత్యజీవనమును, సంపూర్ణజ్ఞానమును పొందును.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 557 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 15 - Purushothama Yoga - 06 🌴

06. na tad bhāsayate sūryo na śaśāṅko na pāvakaḥ
yad gatvā na nivartante tad dhāma paramaṁ mama

🌷 Translation : That supreme abode of Mine is not illumined by the sun or moon, nor by fire or electricity. Those who reach it never return to this material world.

🌹 Purport : The spiritual world, the abode of the Supreme Personality of Godhead, Kṛṣṇa – which is known as Kṛṣṇaloka, Goloka Vṛndāvana – is described here. In the spiritual sky there is no need of sunshine, moonshine, fire or electricity, because all the planets are self-luminous. We have only one planet in this universe, the sun, which is self-luminous, but all the planets in the spiritual sky are self-luminous. The shining effulgence of all those planets (called Vaikuṇṭhas) constitutes the shining sky known as the brahma-jyotir. Actually, the effulgence is emanating from the planet of Kṛṣṇa, Goloka Vṛndāvana.

Part of that shining effulgence is covered by the mahat-tattva, the material world. Other than this, the major portion of that shining sky is full of spiritual planets, which are called Vaikuṇṭhas, chief of which is Goloka Vṛndāvana. As long as a living entity is in this dark material world, he is in conditional life, but as soon as he reaches the spiritual sky by cutting through the false, perverted tree of this material world, he becomes liberated. Then there is no chance of his coming back here. In his conditional life, the living entity considers himself to be the lord of this material world, but in his liberated state he enters into the spiritual kingdom and becomes an associate of the Supreme Lord. There he enjoys eternal bliss, eternal life, and full knowledge.

🌹 🌹 🌹 🌹 🌹


🌹 30, JULY 2024 TUESDAY ALL MESSAGES మంగళవారం, భౌమ వాసర సందేశాలు🌹

🍀🌹 30, JULY 2024 TUESDAY ALL MESSAGES మంగళవారం, భౌమ వాసర సందేశాలు🌹🍀
1) 🌹. శ్రీమద్భగవద్గీత - 557 / Bhagavad-Gita - 557 🌹
🌴. 15వ అధ్యాయము - పురుషోత్తమ యోగము - 06 / Chapter 15 - Purushothama Yoga - 06 🌴
3) 🌹 సిద్దేశ్వరయానం - 112 🌹
 🏵 యోగులు - సూక్ష్మశరీరులు - 8 🏵 
4) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 552 - 6 / Sri Lalitha Chaitanya Vijnanam - 552 - 6 🌹 
🌻 552. 'సర్వమృత్యు నివారిణీ' - 6 / 552. 'Sarvamrutyu Nivarini' - 6 🌻
5) 🌹🎥 గురువు యొక్క ప్రాముఖ్యత - అజ్ఞానపు చీకటి నుండి దైవిక కాంతికి ప్రయాణం 🎥🌹
6) 🌹 The Importance of a Guru: A Journey from Darkness to Divine Light 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹🎥 గురువు యొక్క ప్రాముఖ్యత - అజ్ఞానపు చీకటి నుండి దైవిక కాంతికి ప్రయాణం 🎥🌹*

*ఈ వీడియోలో, మేము గురు-శిష్యుల సంబంధం యొక్క లోతైన ప్రాముఖ్యతను అన్వేషిస్తాము, ఇది షరతులు లేని దైవిక ప్రేమ మరియు జ్ఞానంతో పాతుకుపోయిన బంధం. దైవిక సంకల్పం ద్వారా నియమించబడిన ఒక గురువు మనలను అజ్ఞానం అనే చీకటి నుండి జ్ఞానం మరియు స్వేచ్ఛ యొక్క శాశ్వతమైన వెలుగులోకి ఎలా నడిపిస్తాడో కనుగొనండి. మేము ఈ సంబంధం యొక్క పవిత్ర సారాంశాన్ని పరిశోధించేటప్పుడు మాతో చేరండి మరియు అది మీ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ఎలా మార్చగలదో తెలుసుకోండి.*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 🎥 The Importance of a Guru: A Journey from Darkness to Divine Light 🎥🌹*
*In this video, we explore the profound significance of the guru-disciple relationship, a bond rooted in unconditional divine love and wisdom. Discover how a guru, appointed by divine will, leads us from the darkness of ignorance to the eternal light of wisdom and freedom. Join us as we delve into the sacred essence of this relationship and learn how it can transform your spiritual journey.*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 557 / Bhagavad-Gita - 557 🌹*
*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. 15వ అధ్యాయము - పురుషోత్తమ యోగము - 06 🌴*

*06. న తద్ భాసయతే సూర్యో న శశాఙ్కో న పావక: |*
*యద్గత్వా న నివర్తన్తే తద్ధామ పరమం మమ ||*

*🌷. తాత్పర్యం : అట్టి నా దివ్యధామము సూర్యునిచే గాని, చంద్రునిచేగాని లేదా అగ్ని విద్యుత్తులచే గాని ప్రకాశింపజేయబడదు. దానిని చేరినవారు తిరిగి ఈ భౌతిక జగమునకు మరలిరారు.*

*🌷. భాష్యము : కృష్ణలోకముగా (గోలోకబృందావనము) తెలియబడు దేవదేవుడైన శ్రీకృష్ణుని ధామము (ఆధ్యాత్మికజగము) ఇచ్చట వర్ణింపబడినది. ఆధ్యాత్మికలోకములన్నియును స్వయంప్రకాశమానములు కనుక ఆధ్యాత్మికజగత్తు నందు సూర్యకాంతి, చంద్రకాంతి, అగ్ని, విద్యుత్తుల అవసరము లేదు. ఈ విశ్వములో సూర్యుడొక్కడే స్వయం ప్రకాశమానుడు. కాని ఆధ్యాత్మికజగత్తులోని లోకములన్నియు స్వయం ప్రకాశమానములే. వైకుంఠలోకములుగా పిలువబడు ఆ లోకముల ప్రకాశమాన కాంతియే బ్రహ్మజ్యోతి యనబడు తేజోమయ ఆకాశమును రూపొందించును.*

*వాస్తవమునకు ఆ కాంతి కృష్ణలోకమైన గోలోక బృందావనము నుండియే బయల్వెడలుచున్నది. ఆ తేజపు అతికొద్దిభాగము మహత్తత్త్వముచే (భౌతిక జగము) కప్పుబడినను మిగిలిన భాగమంతయు వైకుంఠములని పిలువబడు ఆధ్యాత్మిక లోకములచే నిండి యుండును. ఆ లోకములలో ముఖ్యమైనదే గోలోక బృందావనము. అంధకారబంధురమైన ఈ భౌతికజగము నందున్నంత కాలము జీవుడు బద్ధజీవనమును గడిపినను, మిథ్యాసంసారవృక్షమును ఖండించుట ద్వారా ఆధ్యాత్మికలోకమును చేరినంతనే ముక్తుడగును. అటు పిమ్మట అతడు ఈ భౌతికజగమునకు తిరిగివచ్చు అవకాశమే లేదు. బద్ధజీవనమున జీవుడు తనను తాను భౌతికజగమునకు ప్రభువుగా తలచినను, ముక్తస్థితిలో మాత్రము ఆధ్యాత్మికజగమును చేరి శ్రీకృష్ణభగవానునికి సహచరుడై నిత్యానందమును, నిత్యజీవనమును, సంపూర్ణజ్ఞానమును పొందును.*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 557 🌹*
*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*

*🌴 Chapter 15 - Purushothama Yoga - 06 🌴*

*06. na tad bhāsayate sūryo na śaśāṅko na pāvakaḥ*
*yad gatvā na nivartante tad dhāma paramaṁ mama*

*🌷 Translation : That supreme abode of Mine is not illumined by the sun or moon, nor by fire or electricity. Those who reach it never return to this material world.*

*🌹 Purport : The spiritual world, the abode of the Supreme Personality of Godhead, Kṛṣṇa – which is known as Kṛṣṇaloka, Goloka Vṛndāvana – is described here. In the spiritual sky there is no need of sunshine, moonshine, fire or electricity, because all the planets are self-luminous. We have only one planet in this universe, the sun, which is self-luminous, but all the planets in the spiritual sky are self-luminous. The shining effulgence of all those planets (called Vaikuṇṭhas) constitutes the shining sky known as the brahma-jyotir. Actually, the effulgence is emanating from the planet of Kṛṣṇa, Goloka Vṛndāvana.*

*Part of that shining effulgence is covered by the mahat-tattva, the material world. Other than this, the major portion of that shining sky is full of spiritual planets, which are called Vaikuṇṭhas, chief of which is Goloka Vṛndāvana. As long as a living entity is in this dark material world, he is in conditional life, but as soon as he reaches the spiritual sky by cutting through the false, perverted tree of this material world, he becomes liberated. Then there is no chance of his coming back here. In his conditional life, the living entity considers himself to be the lord of this material world, but in his liberated state he enters into the spiritual kingdom and becomes an associate of the Supreme Lord. There he enjoys eternal bliss, eternal life, and full knowledge.*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 సిద్దేశ్వరయానం - 112 🌹*
*💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐*

*🏵 యోగులు - సూక్ష్మశరీరులు - 8 🏵*

*లలితా సహస్రనామ పారాయణం చేయటంలో మా పరమగురువులు త్రివిక్రమ రామానందభారతీస్వామి చాలా సమర్థులు. వారి కంఠం చాలా శ్రావ్యంగా ఉండి వారు శ్లోకంగాని పద్యంగాని చదివే బాణి చాలా ఆకర్షణీయంగా ఉండేది. ఆ నామావళిని ఆయన చేత చదివించి రికార్డు చేసి పీఠంలో ఉంచారు. ఆయన లలితాదేవి అర్చన చేసేటపుడు 1970 సంవత్సరం ప్రాంతంలో నేను స్వయంగా విన్నాను కూడా. 1960 ప్రాంతంలో మొదటిసారి సన్యాసదీక్ష తీసుకొందామన్న సంకల్పం కలిగి వారిని కోరటం, వారంగీకరించటం రెండూ జరిగినాయి. కానీ, మా తల్లిదండ్రులు ఇంటి పెద్దకొడుకు ఇంత చిన్నవయస్సులో సన్యాసం తీసుకోవటానికి వీలులేదని పట్టు పట్టటంతో అప్పుడు ఆగిపోయింది. మళ్ళీ నలభైసంవత్సరాల తరువాత అది సమకూరింది. వైరాగ్య సంస్కార సంపద పెంపొందిన నా శ్రీమతి అంగీకరించడం వల్ల, సహకరించడం వల్ల ఆశ్రమ స్వీకారం సుగమము అయింది. ఆరువందల సంవత్సరాల క్రింద బృందావనధామంలో నివసించిన ఆ భక్తురాలు ఆ నాడు కాళీసిద్ధునిగా ఉన్న నాపై పెంచుకొన్న మమకారం తరువాత వచ్చిన రెండు జన్మల అనుబంధానికి కారణమయింది.*

*ఇటీవల ఉజ్జయినీలో కాళీదర్శనానికి వెళ్ళినపుడు, నగరదేవత మందిరాలను చూస్తూ ఊరి బయటున్న ఒక గణపతి ఆలయానికి వెళ్ళితే అక్కడ త్రివిక్రమరామానంద భారతీస్వామివారి సూక్ష్మదేహం కనిపించింది. వారు కాశీకి అప్పుడప్పుడు వెళ్ళినట్లు తెలుసుకానీ ఉజ్జయిని వచ్చిన సంగతి తెలియదు. ఆ స్థలంతో వారికి ఏ అనుబంధమున్నదో ! సిద్ధులకు వారికి సంబంధించిన ప్రదేశాల మీద మమకారం ఉండడం అక్కడికి తరచుగా వారు వస్తూ ఉండటం నేను గమనించాను. కుర్తాళంతో మౌనస్వామికే కాదు మరికొందరు సిద్ధులకు కూడా అనుబంధం ఉండటం ఇటీవల తెలియవచ్చింది. మహనీయులుగా పేరు చెందిన మహావతార్ బాబా ఇటీవల సిద్ధేశ్వరీ మందిరంలో దర్శనమిచ్చినపుడు ఆయన నన్ను అనుగ్రహించాడని అనుకొన్నాను. తరువాత కుర్తాళంతో ఆయనకు ఉన్న అనుబంధ విశేషాలు తెలిసినవి. క్రీస్తు శకము మూడవ శతాబ్దంలో కుర్తాళం వచ్చి 48 రోజులు తపస్సు చేసి అగస్త్యమహర్షి దర్శనం సాధించి మహాసిద్ధునిగా పరిణామం చెందిన సంఘటన, మౌనస్వామితో ఆయనకు ఉన్న అనుబంధం తెలిసి ఆశ్చర్యపడ్డాను.*

*అలానే ఇటీవల అరుణాచలం వెళ్ళినపుడు రమణమహర్షి ఆశ్రమంలో కొద్దిసేపు ధ్యానం చేసినపుడు అక్కడికి కావ్యకంఠగణపతి ముని, ఒక స్వాతంత్ర సమర యోధుడు సూక్ష్మదేహాలు రావటం గమనించాను. గణపతిముని, మహర్షిభక్తుడు కనుక ఆయన సూక్ష్మశరీరం అక్కడ సంచరించటంలో ఆశ్చర్యం లేదు కానీ, ఆ స్వాతంత్ర సమర యోధుడు సాక్ష్మశరీరం అక్కడకు ఎందుకు రావాలి ? అప్పుడు కావ్యకంఠుడు చెప్పిన ఒక అంశం గుర్తుకు వచ్చింది. బానిసతనంలో మగ్గుతున్న భారతదేశాన్ని చైతన్యవంతం చేసి స్వాతంత్ర్యమును సముపార్జించటానికి సిద్ధమండలానికి చెందినవారు కొందరు దిగి వచ్చారని వారిలో ఒకరని తన ఉమాసహస్ర గ్రంథంలో ఆయన తెలియచేశారు. అదే విధంగా ఇటీవల అమెరికాలో బోస్టన్ నగరంలో ఉన్నప్పుడు పరమహంస యోగానంద దర్శన మివ్వటం జరిగింది. కాశీలో స్వామి విశుద్ధానంద ఆశ్రమానికి వెళ్ళి ఆయన సాధన చేసిన నవముండి ఆసన సమీపంలో ధ్యానం చేసినపుడు ఆయన సిద్ధశరీరం గోచరించింది. ఈ సిద్ధులంతా నాతో జన్మాంతర అనుబంధం కలవారే కావటం విశేషం.*

*( సశేషం )*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 552 - 6 / Sri Lalitha Chaitanya Vijnanam  - 552 - 6 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁*

*🍀 112. విమర్శరూపిణీ, విద్యా, వియదాది జగత్ప్రసూః ।*
*సర్వవ్యాధి ప్రశమనీ, సర్వమృత్యు నివారిణీ ॥ 112 ॥ 🍀*

*🌻 552. 'సర్వమృత్యు నివారిణీ' - 6 🌻*

*తారణవిద్య నెఱిగిన వాడు దేహములను ధరించుచు, కర్తవ్యములను నిర్వర్తించుచు, దేహములను త్యజించుచూ ఆరోహణ క్రమమున సాగుచు నుండును. ఇట్టి వారినే మృత్యుంజయులని, చిరంజీవులని పేర్కొందురు. ఆర్య సంప్రదాయమున ఋషుల గ్రంథములు మృత్యువును దాటమని మానవులను నిర్దేశించును. మృత్యువును గూర్చిన జ్ఞానము ప్రధానముగ నేర్చి పిమ్మట ఎన్ని విద్యలు నేర్చిననూ అవి సార్థకములు. లేనిచో ఎంత నేర్చిననూ అది నిరర్ధకమే. భగవద్గీత, భాగవతము, కఠోపనిషత్తు, సావిత్రీ ఉపాఖ్యానము వంటివి మృత్యువు స్వరూప స్వభావములను వివరించుచూ మృత్యువును దాటు ఉపాయములను అందించినవి.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam  - 552 - 6 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️ Prasad Bharadwaj*

*🌻 112. Vimarsharupini vidya viyadadi jagatprasuh*
*sarvavyadhi prashamani sarvamrutyu nivarini  ॥112 ॥ 🌻*

*🌻 552. 'Sarvamrutyu Nivarini' - 6 🌻*

*A person who is skilled in Taranavidya wears body, performs duties, renounces body and proceeds in the ascension. These people are called Mrityunjayas and Chiranjeevis. In the Aryan tradition, the texts of the sages instruct humans to transcend death. After primarily gaining the knowledge about death, subsequently gaining other knowledge is beneficial. Without it, no matter how much you learn, it is meaningless. Bhagavad Gita, Bhagavata, Kathopanishad, Savitri Upakhyana explain the nature of death and provide ways to overcome death.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
#నిత్యసందేశములు #DailyMessages 
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom YouTube FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
https://t.me/+9zDjTpPe_PQzMWVl
https://t.me/Sivasutras
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/bhagavadgeethaa/
https://t.me/AgniMahaPuranam
https://t.me/+LmH1GyjNXXlkNDRl
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages3
https://www.threads.net/@prasad.bharadwaj