శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 552 - 6 / Sri Lalitha Chaitanya Vijnanam - 552 - 6


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 552 - 6 / Sri Lalitha Chaitanya Vijnanam - 552 - 6 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 112. విమర్శరూపిణీ, విద్యా, వియదాది జగత్ప్రసూః ।
సర్వవ్యాధి ప్రశమనీ, సర్వమృత్యు నివారిణీ ॥ 112 ॥ 🍀

🌻 552. 'సర్వమృత్యు నివారిణీ' - 6 🌻


తారణవిద్య నెఱిగిన వాడు దేహములను ధరించుచు, కర్తవ్యములను నిర్వర్తించుచు, దేహములను త్యజించుచూ ఆరోహణ క్రమమున సాగుచు నుండును. ఇట్టి వారినే మృత్యుంజయులని, చిరంజీవులని పేర్కొందురు. ఆర్య సంప్రదాయమున ఋషుల గ్రంథములు మృత్యువును దాటమని మానవులను నిర్దేశించును. మృత్యువును గూర్చిన జ్ఞానము ప్రధానముగ నేర్చి పిమ్మట ఎన్ని విద్యలు నేర్చిననూ అవి సార్థకములు. లేనిచో ఎంత నేర్చిననూ అది నిరర్ధకమే. భగవద్గీత, భాగవతము, కఠోపనిషత్తు, సావిత్రీ ఉపాఖ్యానము వంటివి మృత్యువు స్వరూప స్వభావములను వివరించుచూ మృత్యువును దాటు ఉపాయములను అందించినవి.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 552 - 6 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️ Prasad Bharadwaj

🌻 112. Vimarsharupini vidya viyadadi jagatprasuh
sarvavyadhi prashamani sarvamrutyu nivarini ॥112 ॥ 🌻

🌻 552. 'Sarvamrutyu Nivarini' - 6 🌻

A person who is skilled in Taranavidya wears body, performs duties, renounces body and proceeds in the ascension. These people are called Mrityunjayas and Chiranjeevis. In the Aryan tradition, the texts of the sages instruct humans to transcend death. After primarily gaining the knowledge about death, subsequently gaining other knowledge is beneficial. Without it, no matter how much you learn, it is meaningless. Bhagavad Gita, Bhagavata, Kathopanishad, Savitri Upakhyana explain the nature of death and provide ways to overcome death.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


No comments:

Post a Comment