🍀 13, JANUARY 2023 FRIDAY ALL MESSAGES శుక్రవారం, బృగు వాసర సందేశాలు 🍀

🌹🍀 13, JANUARY 2023 FRIDAY ALL MESSAGES శుక్రవారం, బృగు వాసర సందేశాలు 🍀🌹
1) 🌹 13, JANUARY 2023 FRIDAY,శుక్రవారం, బృగు వాసరే - నిత్య పంచాంగము Daily Panchangam🌹
2) 🌹 కపిల గీత - 118 / Kapila Gita - 118 🌹 🌴 3. ప్రకృతి పురుషుల వివేకము వలన మోక్షప్రాప్తి - 02 / 3. Salvation due to wisdom of Nature and Jeeva - 02 🌴
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 710 / Vishnu Sahasranama Contemplation - 710 🌹 🌻710. సర్వాఽసునిలయః, सर्वाऽसुनिलयः, Sarvā'sunilayaḥ🌻
4) 🌹 . శ్రీ శివ మహా పురాణము - 671 / Sri Siva Maha Purana - 671 🌹 🌻. గణాలకు అధిపతిగా పట్టాభిషేకం - గణేశుని వ్రత వర్ణనము - 9 / Gaṇeśa crowned as the chief of Gaṇas - Description of Ganesha Vrata - 9 🌻
5) 🌹 ఓషో రోజువారీ ధ్యానములు - 292 / Osho Daily Meditations - 292 🌹 🍀 292. ముసుగులు / 292. MASKS 🍀
6) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 424 / Sri Lalitha Chaitanya Vijnanam - 424 🌹 🌻 424. 'తత్త్యాసనా' / 424. 'Tattyasana' 🌻

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹13, జనవరి, January 2023 పంచాగము - Panchagam 🌹*
*శుభ శుక్రవారం, భృగు వాసరే, Friday*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని దైవాన్నర్థిస్తూ*
*ప్రసాద్ భరద్వాజ*

*🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు 🌻*

*🍀. శ్రీ మహాలక్ష్మీ సుప్రభాతం -27 🍀*

*27. ఘనభీకరకష్ట వినాశకరి నిజభక్తదరిద్ర ప్రణాశకరి ।*
*ఋణమోచని పావని సౌఖ్యకరి శరణం శరణం ధనలక్ష్మి నమః ॥*

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : దైవంతో పూర్తైక్యం చెందడమే సాధకునికి చరమలక్ష్యం కావాలి. ఈ ఐక్యానుభవం కొందరు తమ అంతరాత్మలో, కొందరు తమ మనఃకోశంలో, కొందరు తమ ప్రాణకోశంలో మాత్రమే పొందడం కద్దు. కాని, అన్నకోశ, విజ్ఞాన కోశాల్లో సైతం దానిని పొందగలిగి నప్పుడే దానికి పూర్ణత్వం.🍀*

🌷🌷🌷🌷🌷

శుభకృత్‌, హేమంత ఋతువు,
దక్షిణాయణం, పౌష్య మాసం
తిథి: కృష్ణ షష్టి 18:18:49 వరకు
తదుపరి కృష్ణ సప్తమి
నక్షత్రం: ఉత్తర ఫల్గుణి 16:36:05
వరకు తదుపరి హస్త
యోగం: శోభన 12:45:12 వరకు
తదుపరి అతిగంధ్
 కరణం: వణిజ 18:13:48 వరకు
వర్జ్యం: 25:34:18 - 27:16:50
దుర్ముహూర్తం: 09:03:13 - 09:47:58
మరియు 12:46:56 - 13:31:41
రాహు కాలం: 11:00:40 - 12:24:34
గుళిక కాలం: 08:12:53 - 09:36:47
యమ గండం: 15:12:21 - 16:36:15
అభిజిత్ ముహూర్తం: 12:02 - 12:46
అమృత కాలం: 08:45:00 - 10:29:40
సూర్యోదయం: 06:48:59
సూర్యాస్తమయం: 18:00:09
చంద్రోదయం: 23:17:39
చంద్రాస్తమయం: 10:58:40
సూర్య సంచార రాశి: ధనుస్సు
చంద్ర సంచార రాశి: కన్య
యోగాలు: శుభ యోగం - కార్య జయం
16:36:00 వరకు తదుపరి అమృత
యోగం - కార్య సిధ్ది

🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. కపిల గీత - 118 / Kapila Gita - 118🌹*
*🍀. కపిల దేవహూతి సంవాదం 🍀*
*✍️. శ్రీమాన్ క.రామానుజాచార్యులు, 📚. ప్రసాద్‌ భరధ్వాజ*

*🌴 3. ప్రకృతి పురుషుల వివేకము వలన మోక్షప్రాప్తి - 02 🌴*

*02. స ఏష యర్హి ప్రకృతేర్గుణేష్వభివిషజ్జతే|*
*అహంక్రియా విముఢాత్మా కర్తాస్మీత్యభిమన్యతే॥*

*కాని, ఆ జీవుడు ప్రకృతి గుణములతో మమేకమైనప్పుడు, అహంకారముతో మోహితుడై *నేనే కర్తను* అని భావించుకొనును.*

* "నేను చేస్తున్నాను" అని ఎందుకు అనుకుంటున్నాడు? ఆ అనుకునే "నేను" అసలు నేను కాదు. ప్రకృతి గుణములలో చిక్కుకున్నప్పుడు అహంకారముతో కప్పి వేయబడతాడు. దానితో "నేనే కర్త" అనుకుంటాడు. అసలు కర్తను చూడలేకపోతాడు. అది వేరు (ప్రకృతి వేరు) నేను వేరు అనే జ్ఞానాన్ని కోల్పోతాడు. ఆ ప్రకృతి ఈ ఆత్మను కప్పివేస్తోంది. అప్పుడు నేను కర్తనూ, అనే భావానికి వస్తాడు జీవుడు. ఈ కారణముతోనే మనసుతో సంసారములో మునుగుతాడు. పాపం ఎంత దోషమో పుణ్యమూ అంతే దోషం. పుణ్యం వస్తే స్వర్గానికి వెళ్ళి మళ్ళీ పుట్టాలి.*

*సశేషం..*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Kapila Gita - 118 🌹*
*🍀 Conversation of Kapila and Devahuti 🍀*
*📚 Prasad Bharadwaj*

*🌴 3. Salvation due to wisdom of Nature and Jeeva - 02 🌴*

*02. sa eṣa yarhi prakṛter guṇeṣv abhiviṣajjate*
*ahaṅkriyā-vimūḍhātmā kartāsmīty abhimanyate*

*When the soul is under the spell of material nature and false ego, identifying his body as the self, he becomes absorbed in material activities, and by the influence of false ego he thinks that he is the proprietor of everything.*

*Actually the conditioned soul is forced to act under the pressure of the modes of material nature. The living entity has no independence. When he is under the direction of the Supreme Personality of Godhead he is free, but when, under the impression that he is satisfying his senses, he engages in sense gratificatory activities, he is actually under the spell of material nature.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 710 / Vishnu Sahasranama Contemplation - 710🌹*

*🌻710. సర్వాఽసునిలయః, सर्वाऽसुनिलयः, Sarvā'sunilayaḥ🌻*

*ఓం సర్వాసునిలయాయ నమః | ॐ सर्वासुनिलयाय नमः | OM Sarvāsunilayāya namaḥ*

*సర్వ ఏవాసవః ప్రాణా నిలీయన్తే జనార్దనే ।*
*యస్మిన్ జీవాత్మకే స్థానే సర్వాసునిలయస్సహి ॥*

*సర్వ ప్రాణములును జీవరూపమగు ఏ ఆశ్రయమునందు మిక్కిలిగా లయమును పొందియుండునో ఆతడు అనగా జీవుడు సర్వాఽసునిలయః అనబడును. ఇట్టి జీవుడును పరమాత్ముడే.*

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 710🌹*

*🌻710. Sarvā'sunilayaḥ🌻*

*OM Sarvāsunilayāya namaḥ*

सर्व एवासवः प्राणा निलीयन्ते जनार्दने ।
यस्मिन् जीवात्मके स्थाने सर्वासुनिलयस्सहि ॥

*Sarva evāsavaḥ prāṇā nilīyante janārdane,*
*Yasmin jīvātmake sthāne sarvāsunilayassahi.*

*He in whom all asus or prāṇas find their abode as the jīvātma is Sarvā'sunilayaḥ. He who appears as the jīva is also in essence of the paramātma.*

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
भूतावासो वासुदेवः सर्वासुनिलयोऽनलः ।दर्पहा दर्पदोऽदृप्तो दुर्धरोऽथापराजितः ॥ ७६ ॥
భూతావాసో వాసుదేవః సర్వాసునిలయోఽనలః ।దర్పహా దర్పదోఽదృప్తో దుర్ధరోఽథాపరాజితః ॥ 76 ॥
Bhūtāvāso vāsudevaḥ sarvāsunilayo’nalaḥ,Darpahā darpado’dr‌pto durdharo’thāparājitaḥ ॥ 76 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 671 / Sri Siva Maha Purana - 671 🌹* 
*✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. రుద్రసంహితా-కుమార ఖండః - అధ్యాయము - 18 🌴*
*🌻. గణాలకు అధిపతిగా పట్టాభిషేకం - గణేశుని వ్రత వర్ణనము - 9 🌻*

పార్వతి కోపమును విడనాడగానే శివుడు ఆమెను పూర్వము నందు వలెనే ప్రేమతో ఆదరించెను (70). శివుడు ఆత్మారాముడైన పరబ్రహ్మయే అయిన భక్తుల కార్యమును నెరవేర్చి లోకములకు హితమును చేయగోరి వివిధ సుఖముల ననుభవించెను (71). నేను, విష్ణువు పార్వతీ పరమేశ్వరులను భక్తితో సేవించి, శివును అనుమతిని పొంది మా ధామములకు చేరుకొంటిమి (72).

ఓ నారదా! మహర్షీ! పూజనీయా!నీవు పార్వతీ పరమేశ్వరుల కీర్తిని గానము చేసి వారి వద్ద సెలవు తీసుకొని నీ భవనమునకు చేరుకొంటివి (73). నేనీ తీరున నీవు ప్రశ్నించగా పార్వతీ పరమేశ్వరుల యశస్సునకు విఘ్నేశ్వరుని కీర్తిని జోడించి సాదరముగా సర్వమును వివరించితిని (74) ఎవడైతే మనస్సును బాగుగా లగ్నము చేసి ఈ రమపవిత్ర గాథను వినునో, వాడు మంగళములనన్నింటినీ పొంది మంగళములకు నిధానమగును (75). పుత్రుడు లేని వారికి పుత్రుడు కలుగును. భార్యను గోరువాడు భార్యను పొందును. సంతానమును గోరువాడు సంతానమును పొందును (76).

రోగి ఆరోగ్యవంతుడగును. దురదృష్ట వంతుడు భాగ్యవంతుడగును. పోయిన పుత్రుని, ధనమును పొందును. స్త్రీ పరదేశమునందున్న భర్తను తిరిగి పొందును (77). శోకముతో బాధపడువాని శోకము తొలగిపోవును. దీనిలో సందేహము లేదు. ఈ గణేశోపాఖ్యానము ఎవని గృహము నందుండునో (78), వాడు నిత్యమంగళముగా నుండుననుటలో సందేహము లేదు. ప్రయాణకాలమునందు, పర్వదినముల యందు ఎవడైతే దీనిని సావదాన చిత్తుడై వినునో, వాడు గణశుని అనుగ్రహముచే ఇష్టఫలములనన్నింటినీ పొందును (79).

శ్రీ శివమహాపురాణములో రుద్ర సంహితయందలి కుమార ఖండలో గణశవ్రత వర్ణనమనే పదునెనిమిదవ అధ్యాయము ముగిసినది (79).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 SRI SIVA MAHA PURANA - 671🌹*
*✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj *

*🌴 Rudra-saṃhitā (4): Kumara-khaṇḍa - CHAPTER 18 🌴*

*🌻 Gaṇeśa crowned as the chief of Gaṇas - Description of Ganesha Vrata - 9 🌻*

70. When Pārvatī became free from fury, Śiva and Pārvatī behaved as before.

71. With a desire for the welfare of the worlds, the great deity relaxing in his own soul and engaged in the activities of the devotees conferred different kinds of happiness.

72. Both Viṣṇu and I took leave of Śiva and after paying homage to both Pārvatī and Śiva returned to our abodes.

73. O holy sage Nārada, after singing the glory of Pārvatī and Śiva and taking leave of them you too returned to your abode.

74. Thus requested by you, I have narrated the glorious story of Pārvatī and Śiva along with that of Gaṇeśa with great reverence.

75. Whoever hears this narrative auspiciously with pure mind shall have everything auspicious and be the abode of auspiciousness.

76. The childless will get a son, the indigent wealth; the seeker of a wife will get a wife and the seeker of issues will get children.

77. The sick will regain health; the miserable will have good fortune. The sonless, impoverished, banished wife will be reunited with her husband.

78-79. The sorrowing will be relieved of sorrow, undoubtedly. The house that contains this story shall certainly be auspicious. He who listens to this narrative at the time of travel or on holy occasions, with a pure mind shall get all desires, thanks to the grace of lord Gaṇeśa.

Continues....
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 292 / Osho Daily Meditations - 292 🌹*
*✍️. ప్రసాద్ భరద్వాజ*

*🍀 292. ముసుగులు 🍀*

*🕉. మీరు ఏమి చేస్తున్నా, కేవలం స్పృహతో ఉండండి. మీరు ముసుగు ధరించినట్లయితే, స్పృహతో ఉండండి; తెలిసి ధరించండి. ఇది తెలియకుండా జరిగే విషయం కాకూడదు. 🕉*

*మీరు విచారంగా ఉన్నారనుకోండి. అలాంటప్పుడు ఎవరైనా మీ వద్దకు వచ్చినప్పుడు కూడా మీరు విచారాన్ని కొనసాగిస్తే, మీరు అతనిని కూడా బాధ పెట్టిన వారవుతారు. మీ విచారానికి అతను ఏమీ చేయలేదు కదా. అతను ఏ విధంగానూ దానికి అర్హత పొందలేదు, కాబట్టి అతన్ని అనవసరంగా విచారించేలా చేయడం ఎందుకు? మీరు చిరునవ్వుతో మాట్లాడండి మరియు ఇది కేవలం ఒక ముసుగు అని బాగా తెలుసుకుని మీరు దానిని నిర్వహించండి. మీ స్నేహితుడు వెళ్లిన తర్వాత మీరు మళ్లీ విచారంగా ఉండండి. అది కేవలం సామాజిక లాంఛనమే. మీరు దీన్ని స్పృహతో ఉపయోగిస్తే సమస్య లేదు. మీకు గాయం ఉంటే, అందరికీ వెళ్లి చూపించాల్సిన అవసరం లేదు; అది వారి వ్యవహారం కాదు. మీ గాయం గురించి వారి మనస్సులలో ఎందుకు దుఃఖం సృష్టించాలి? మీరు ప్రదర్శించే వారిగా ఎందుకు ఉండాలి? అది అక్కడ ఉండనివ్వండి; దానిని జాగ్రత్తగా చూసుకోండి. గాయాన్ని నయం చేయడానికి ప్రయత్నించండి.*

*మీకు గాయం వుంటే వైద్యుడికి చూపించండి కానీ, రోడ్డు మీద వెళ్లే ప్రతి ఒక్కరికీ చూపించాల్సిన పనిలేదు. కేవలం స్పృహతో ఉండండి. జీవితంలో ఒక వ్యక్తి చాలా ముసుగులు ఉపయోగించాలి; అవి సామరస్యకర్తలుగా పనిచేస్తాయి. ఎవరో వచ్చి హలో అన్నారు అనుకోండి. మీరు వెంటనే మీ సమస్యలన్నీ ఆమెకు చెప్పడం ప్రారంభిస్తే ఎలా. ఆమె మీరు ఎలా ఉన్నారని అడగలేదు; ఆమె కేవలం హలో చెబుతోంది. ఆలా పలకిరించిన దానికి ఇప్పుడు ఒక గంట ఆమె మీ సోది వినాలి. అది చాలా ఎక్కువ భారం అవుతుంది వారికి! తదుపరి సారి ఆమె హలో కూడా చెప్పదు; ఆమె తప్పించు కుంటుంది. జీవితంలో చాలా మర్యాద పూర్వక చర్యలు అవసరం అవుతాయి, ఎందుకంటే మీరు ఒంటరిగా లేరు కనుక. మీరు సమాజం యొక్క అధికారిక నమూనాల ప్రకారం జీవించక పోతే, మీరు మీ కోసం మరింత కష్టాలను సృష్టించు కుంటారు. అంతకంటే మరేమీ కాదు.*
 
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Osho Daily Meditations - 292 🌹*
*📚. Prasad Bharadwaj*

*🍀 292. MASKS 🍀*

*🕉. Whatever you are doing, just be conscious. If you are wearing a mask, be conscious; wear it knowingly. It should not be an automatic thing. 🕉*

*If you are in a sad mood and somebody comes and you remain sad, you will make him sad too. And he has not done anything. He has not deserved it in any way, so why make him sad unnecessarily? You smile and talk, and you just manage, knowing well that this is a mask. When your friend goes you become sad again. That was just a social formality. If you use it consciously there is no problem. If you have a wound, there is no need to go and show it to everybody; it is none of their affair. Why create misery in their minds about your wound? Why be an exhibitionist? Let it be there; take care of it, try to heal it.*

*Show it to the doctor, but there is no need to show it to every passerby on the road. Just be conscious. One has to use many masks; they function as lubricants. Somebody comes and asks how you are, and you start telling her all your problems. She did not ask for it; she was just saying hello. Now for one hour she has to listen to you. That will be too much! Next time she will not even say hello; she will escape. In life many formalities are needed, because you are not alone and if you don't live according to the formal patterns of the society, you will create more misery for yourself, nothing else.*
  
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 424 / Sri Lalitha Chaitanya Vijnanam - 424 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀 91. తత్త్వాసనా, తత్త్వమయీ, పంచకోశాంతరస్థితా ।*
*నిస్సీమమహిమా, నిత్యయౌవనా, మదశాలినీ ॥ 91 ॥🍀*

*🌻 424. 'తత్త్యాసనా' 🌻* 

*తత్త్వమే ఆసనముగా గలది శ్రీమాత అని అర్థము. శ్రీమాత శివునితో గూడి తత్త్వము నధిష్ఠించి యుండును. ఆమె అర్ధనారి. అతడు అర్ధనారీశ్వరుడు. ప్రకృతి పురుషుడు నిరువురునూ కలసి సృష్టియందు ఈశ్వరత్వము వహింతురు. సృష్టిని అధిష్ఠించి యుందురు. వారు సహజముగ నుండు స్థితి తత్. అదియే వారి ఆసనము. అక్కడనుండియే వారు సర్వలోకములకు వ్యాపింతురు. సర్వము నందు నిండి యుందురు. ఉత్కృష్టమగు యోగులకు సహస్రారమున ఈ అనుభూతి యుండును.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 424 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️ Prasad Bharadwaj*

*🌻 91. Tatvasana tatvamaei panchakoshantarah sdhita*
*Nisima mahima nitya-yaovana madashalini ॥ 91🌻*

*🌻 424. 'Tattyasana' 🌻*

*It means that Sri Mata is seated in Wisdom (Tattva). She along with Lord Shiva preside over the Principles of Wisdom. She is Ardhanari. He is Ardhanarishwar. She and Shiva, as Nature and consciousness preside over the Lordship of the creation. They are exalting the creation. Tat is their natural state of being. That is their seat. From there they are omnipresent in all the worlds. Everything is filled with Them. Great yogis experience this feeling in the Great Lotus chakra.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
#నిత్యసందేశములు #DailyMessages 
Join and Share 
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages
https://chaitanyavijnanam.tumblr.com/
https://www.kooapp.com/profile/Prasad_Bharadwaj

Siva Sutras - 024 - 7. Jāgratsvapnasuṣuptabhede turyābhogasambhavaḥ. - 4 / శివ సూత్రములు - 024 - 7. జాగ్రత్ స్వప్న సుషుప్త భేదే తుర్యాభోగ సంభవః. - 4


🌹. శివ సూత్రములు - 024 / Siva Sutras - 024 🌹

🍀. శివ ఆగమ తత్వశాస్త్రం యొక్క సూత్రములు 🍀

1- శాంభవోపాయ

✍️. ప్రసాద్‌ భరధ్వాజ

🌻 7. జాగ్రత్ స్వప్న సుషుప్త భేదే తుర్యాభోగ సంభవః. - 4 🌻

🌴. మెలకువ (జాగ్రత్), స్వప్న (స్వప్న), గాఢమైన నిద్ర (సుషుప్త) వంటి విభిన్న స్థితులలో కూడా నాల్గవ స్థితి తుర్య యొక్క పారవశ్యం, ఆనందం ఉంది. 🌴


చైతన్యం యొక్క నాల్గవ స్థితి ఎల్లప్పుడూ మూడు ప్రాపంచిక స్థాయి చైతన్య స్థాయిలలో సాక్షిగా ఉంటుంది. ఇది కేవలం ఒక సమయంలో మాత్రమే ప్రబలంగా ఉండే మొదటి మూడు స్థాయి చైతన్యాలకు భిన్నంగా ఉంటుంది. ఒకరు మెలకువగా ఉన్నప్పుడు నిద్రపోలేడు, కలలు కంటున్నప్పుడు మెలకువగా ఉండలేడు మరియు గాఢనిద్రలో ఉన్నప్పుడు మెలకువగా ఉండలేడు, కలలు కనలేడు.

కానీ, మాయచే కప్పబడినందువల్ల ఈ తురీయ స్థితి మొదటి మూడు చైతన్య భూమికల్లో ఉన్నప్పటికీ దానిని ఎవరూ గుర్తించలేరు. ఇది ధ్యానం యొక్క ఉన్నత దశలలో మాత్రమే గ్రహించబడుతుంది. ధ్యానం యొక్క ప్రాథమిక దశలు శివ సాక్షాత్కారానికి కేవలం సరైన పునాదిని వేస్తాయి.


కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Siva Sutras - 024 🌹

🍀Aphorisms of philosophy of Shiva āgama 🍀

Part 1 - Sāmbhavopāya

✍️. Acharya Ravi Sarma, 📚. Prasad Bharadwaj

🌻 7. Jāgratsvapnasuṣuptabhede turyābhogasambhavaḥ. - 4 🌻

🌴. During different states of consciousness as waking (jāgrat), dreaming (svapna), profound sleep (suṣupta), there is the delight and enjoyment of the Fourth State Turya 🌴


The fourth state of consciousness is always present in all the men as a witness in all the three mundane levels of consciousness. This is in contrast to the first three level of consciousness that prevails one at a time. When one is awake, he cannot sleep, when one is dreaming he cannot be awake and when one is in the state of deep sleep, he can neither be awake nor dream.

But, turya is present in the first three states of consciousness, sheathed by māyā, thereby making it unrealizable. This can be realised only in the advanced stages of meditation. Preliminary stages of meditation merely formulate groundwork and lay proper foundation for the realisation of Shiva.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹

నిర్మల ధ్యానాలు - ఓషో - 287


🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 287 🌹

✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ

🍀. సమశృతిలో సాగగలగడమే సంతోషం. అస్తిత్వం నించీ వేరు కావడమే దుఃఖం. కేంద్రానికి నువ్వు చేరినపుడు ధర్మమంటే తెలుస్తుంది. ధ్యానమొక్కటే కేంద్రాన్ని చేరు మార్గం. 🍀


అస్తిత్వతత్వాన్ని అవగాహన చేసుకోవడమన్నది ముఖ్యమయిన సంగతి. దాని వల్ల మనం దాంతో సమశృతిలో సాగగలం. సమశృతిలో సాగగలగడమే సంతోషం. అస్తిత్వం నించీ వేరుకావడమే దుఃఖం. నువ్వు రూపాంతరం చెందడమంటే సత్యం పట్ల, ప్రకృతి పట్ల స్పృహతో వుండడం. అట్లా స్పృహతో వుండటమంటే లోపలికి ప్రయాణించడమే. మొదట నీ కేంద్రాన్ని నువ్వు గుర్తించాలి. నువ్వు నీ కేంద్రాన్ని గుర్తించిన క్షణం అస్తిత్వ కేంద్రాన్ని కూడా గుర్తిస్తావు. ఆ రెండూ వేరు కాదు.

మనం పైపైన మాత్రమే వ్యతిరేకంగా వుంటాం. వేరుగా వుంటాం. కేంద్రంలో అందరం ఒకటే. చెట్లు, పర్వతాలు, జనం, జంతువులు నక్షత్రాలు ఒకటే. కేంద్రానికి నువ్వు చేరినపుడు తావో అంటే, ధర్మమంటే తెలుస్తుంది. ధ్యానమొక్కటే కేంద్రాన్ని చేరు మార్గం. తప్పని సరి అవసరం ధ్యానం. నువ్వు ధ్యానాన్ని తెలుసుకుంటే అన్నీ తెలుసుకుంటావు.


సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹

DAILY WISDOM - 22 - 22. Truth Transcends . . . / నిత్య ప్రజ్ఞా సందేశములు - 22 - 22. సత్యం సర్వజ్ఞత . . .


🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 22 / DAILY WISDOM - 22 🌹

🍀 📖 సంపూర్ణమైన సాక్షాత్కారం నుండి 🍀

✍️. ప్రసాద్ భరద్వాజ

🌻 22. సత్యం సర్వజ్ఞత మరియు సర్వశక్తి ఆలోచనలను అధిగమిస్తుంది 🌻


మీ ఇష్ట దైవమే అత్యున్నతం అని సంతృప్తి చెందడం సాధ్యం కాదు. అయితే ప్రపంచ ఆలోచనా సరళికి భిన్నంగా ఆలోచించకూడదనుకునే వారికి ఇది అసంతృప్తి కలిగించవచ్చు. అస్తిత్వంతో ఏకత్వము సాధించాలనుకునే అభిరుచిని కలిగి ఉన్న సాధకునికి పరిణామ క్రమంలో సహజంగా ఎదుగుతూ నెమ్మదిగా ఒక స్థాయి తర్వాత ఒకటిగా పైకి ఎదిగేటంత ఓపిక ఉండదు.

అత్యున్నతమైన శాస్త్రీయ మనస్సు ఎల్లప్పుడూ పూర్ణత్వానికి అనుసంధానమై ఉంటుంది. పూర్ణత్వం లో పెద్ద భాగానికి కూడా కాదు. దాని ప్రకారం, ఉనికిలో వేర్పాటువాదం అనేది అశాస్త్రీయమైనది మరియు అజ్ఞాన భావన. సత్యం, తన సార్వత్రిక కారణంగా, సర్వజ్ఞత మరియు సర్వసమర్థత యొక్క ఆలోచనలను సైతం అధిగమిస్తుంది. ఎందుకంటే ఇవి పూర్ణత్వంపై కొన్ని పరిమితులను ఊహిస్తాయి.


కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹



🌹 DAILY WISDOM - 22 🌹

🍀 📖 The Realisation of the Absolute 🍀

📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj

🌻 22. Truth Transcends Ideas of Omniscience and Omnipotence 🌻


It is not possible to rest contented that a personal God is the ultimate Reality, however displeasing this may be to those who do not want to dispense with thinking in terms of the categories of the world. The philosopher-aspirant who is possessed of a flaming passion for integrating himself in Existence does not have the dull patience to linger on with the slow process of progressive self-transcendence through the channels of the different degrees of reality.

The highest scientific mind always tries to cling to the Whole, and not to even the biggest part, for, according to it, partiteness in existence is illogical and an ignorant conception. Truth, dependent on its own Self, transcends even the ideas of omniscience and omnipotence, for these involve relations which are a limitation on the Absolute.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹



శ్రీ మదగ్ని మహాపురాణము - 157 / Agni Maha Purana - 15


🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 157 / Agni Maha Purana - 157 🌹

✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ

శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.

ప్రథమ సంపుటము, అధ్యాయము - 49

🌻. మత్స్యాది దశావతార ప్రతిమా లక్షణములు - 2 🌻


శ్రీరాముని విగ్రహము ధనుర్భాణఖడ్గశంఖములతో ఒప్పారు చుండును. లేదా ఆతనికి రెండు భుజములు మాత్రమే ఉండవచ్చును. బలరాముడు గదను, నాగలిని ధరింపవలెను. లేదా అతనికి నాలుగు భజములుండవచ్చును. అతనిపై ఎడమచేతిలో నాగలి, క్రింది చేతిలో అందమైన శంఖము, పై కుడిచేతిలో ముసలము, క్రిందచేతిలో సుదర్శన చక్రము ఉండవలెను.

బుద్ధుడు శాంత స్వరూపముతో, వరద-అభయముద్రలు ధరించి, ఉన్నతమైన పద్మాసనముపై కూర్చుండవలెను.

తెల్లని శరీరవర్ణముతో, పొడవైన చెవులతో, అందమైన పీతవస్త్రముచే కప్పబడి యుండవలెను. కల్కి ధనుస్తూణీరములను ధరించి, మ్లేచ్ఛులను సంహరించు బ్రాహ్మణుడు.లేదా అతని విగ్రహమును గుఱ్ఱముపై ఎక్కి నాలుగు చేతులలో ఖడ్గ-శంఖ-చక్ర-గదలను ధరించి ఉండవలెను.


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Agni Maha Purana - 157 🌹

✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj

Chapter 49

🌻Characteristics of forms of ‘Fish’ etc. of Viṣṇu - 2 🌻


6. (The figure of) Rama should have the bow, arrow, sword, conch or two hands or may have four arms holding a mace and. plough.

7. The plough may be provided on the left half (upper arm) and the auspicious conch on the lower arm. The mace may be provided on the right half (upper arm) and the auspicious disc on the lower arm.

8. The figure of Buddha (should be made) as calm, having long ears, white complexion, wearing a cloth, and seated on a lotus with its petals upwards and as conferring favour and protection.

9. (The figure of) Kalki is (to be represented as) a twice-born endowed with a bow and quiver and as destroying the foreigners. Or (he should be represented as) seated on the horse and endowed with a sword, conch, disc and arrow.


Continues....

🌹 🌹 🌹 🌹 🌹




శ్రీమద్భగవద్గీత - 310: 07వ అధ్., శ్లో 30 / Bhagavad-Gita - 310: Chap. 07, Ver. 30

 

🌹. శ్రీమద్భగవద్గీత - 310 / Bhagavad-Gita - 310 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 7 వ అధ్యాయము - జ్ఞానయోగం - 30 🌴

30. సాధిభూతాధి దైవం మాం సాధియజ్ఞం చ యే విదు: |
ప్రయాణకాలే ఆపి చ మాం తే విదుర్యుక్తచేతస: ||


🌷. తాత్పర్యం :

నా యందు సంలగ్నమైన చిత్తము కలిగిన వారు దేవదేవుడనైన నన్నే భౌతికజగత్తును, సర్వదేవతలను, సమస్త యజ్ఞములను నియమించు వానిగా తెలిసికొని మరణ సమయ మందును నన్ను (దేవదేవుడు) అవగాహనతో ఎరిగి యుందురు.

🌷. భాష్యము :

కృష్ణభక్తిరసభావన యందు వర్తించు జనులు దేవదేవుడైన శ్రీకృష్ణుని సంపూర్ణముగా అవగాహనము చేసికొను మార్గము నుండి ఎన్నడును వైదొలగురు. శ్రీకృష్ణభగవానుడు ఈ విధముగా జగత్తును మరియు దేవతలను కూడా నడుపువాడై యున్నాడో కృష్ణభక్తిరసభావాన యొక్క దివ్యసాంగత్యము ద్వారా మనుజుడు తెలిసికొనగలడు. కృష్ణభక్తిభావనతో గల దివ్యసాహచర్యము ద్వారా క్రమముగా అతడు దేవదేవుని యందు విశ్వాసమును పొందును. అటువంటి కృష్ణభక్తిరసభావితుడు మరణసమయమున కూడా మరువబోడు. ఆ విధముగా సహజముగనే అతడు కృష్ణలోకమగు గోలోకబృందావనమును చేరగలడు.

ఏ విధముగా మనుజుడు సంపూర్ణ కృష్ణభక్తిపరాయణుడు కాగలడో ఈ సప్తమాధ్యాయము ప్రత్యేకముగా వివరించినది.

కృష్ణభక్తిరస భావనను తిరిగి పొందుటకు మానవజన్మము చక్కని అవకాశమనియు, కనుక దానిని దేవదేవుని నిర్హేతుక కరుణను పొందుటకు సంపూర్ణముగా ఉపయోగించ వలెననియు అంతట అతడు నిశ్చయముగా తెలిసి కొనుము. ఆర్తుడు, జిజ్ఞాసువు, అర్థార్థి, బ్రహ్మజ్ఞానము, పరమాత్మజ్ఞానము, జన్మమృత్యు జరావ్యాధుల నుండి ముక్తి మరియు దేవదేవుడైన శ్రీకృష్ణునికి భక్తియుక్తసేవ లనెడి పలు అంశములు ఈ అధ్యాయమున చర్చించబడినవి. భక్తితో శ్రవణ, కీర్తనములను చేయుట యందు దివ్యానందమును పొందుచు ఆ విధముగా చేయుట వలన తన లక్ష్యములన్నియును సిద్ధించునన్న విశ్వాసమును పొందును ఆ విధముగా చేయుట వలన తన లక్ష్యములన్నియును సిద్ధించునన్న విశ్వాసమును పొందును.

అతని అట్టి నిశ్చయాత్మక శ్రద్ధయే “దృఢవ్రతము” అని పిలువబడును. అదియే భక్తియోగమునకు నాంది యని సర్వశాస్త్రములు వచించుచున్నవి. భగవద్గీత యందలి ఈ సప్తమాధ్యాయము అటువంటి శ్రద్ధ యొక్క సారాంశమై యున్నది.

శ్రీమద్భగవద్గీత యందలి “భగవద్విజ్ఞానము” అను సప్తమాధ్యాయమునకు భక్తివేదాంతభాష్యము సమాప్తము.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 310 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 7 - Jnana Yoga - 30 🌴

30. sādhibhūtādhidaivaṁ māṁ sādhiyajñaṁ ca ye viduḥ
prayāṇa-kāle ’pi ca māṁ te vidur yukta-cetasaḥ


🌷 Translation :

Those in full consciousness of Me, who know Me, the Supreme Lord, to be the governing principle of the material manifestation, of the demigods, and of all methods of sacrifice, can understand and know Me, the Supreme Personality of Godhead, even at the time of death.

🌹 Purport :

Persons acting in Kṛṣṇa consciousness are never deviated from the path of entirely understanding the Supreme Personality of Godhead. In the transcendental association of Kṛṣṇa consciousness, one can understand how the Supreme Lord is the governing principle of the material manifestation and even of the demigods. Gradually, by such transcendental association, one becomes convinced of the Supreme Personality of Godhead, and at the time of death such a Kṛṣṇa conscious person can never forget Kṛṣṇa. Naturally he is thus promoted to the planet of the Supreme Lord, Goloka Vṛndāvana.

This Seventh Chapter particularly explains how one can become a fully Kṛṣṇa conscious person. The beginning of Kṛṣṇa consciousness is association of persons who are Kṛṣṇa conscious.

Human form of life is an opportunity to regain Kṛṣṇa consciousness and that it should be fully utilized to attain the causeless mercy of the Supreme Lord. Many subjects have been discussed in this chapter: the man in distress, the inquisitive man, the man in want of material necessities, knowledge of Brahman, knowledge of Paramātmā, liberation from birth, death and diseases, and worship of the Supreme Lord. Determined faith is called dṛḍha-vrata, and it is the beginning of bhakti-yoga, or transcendental loving service. That is the verdict of all scriptures. This Seventh Chapter of the Bhagavad-gītā is the substance of that conviction.

Thus end the Bhaktivedanta Purports to the Seventh Chapter of the Śrīmad Bhagavad-gītā in the matter of Knowledge of the Absolute.

🌹 🌹 🌹 🌹 🌹


12 Jan 2023 Daily Panchang నిత్య పంచాంగము


🌹12, జనవరి, January 2023 పంచాగము - Panchagam 🌹

శుభ గురువారం, బృహస్పతి వాసరే, Thursday

మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ

ప్రసాద్ భరద్వాజ

🌺. పండుగలు మరియు పర్వదినాలు : లేవు 🌺

🍀. శ్రీ హయగ్రీవ స్తోత్రము - 23 🍀


23. సంచింతయామి ప్రతిభాదశాస్థాన్
సంధుక్షయంతం సమయప్రదీపాన్
విజ్ఞానకల్పద్రుమపల్లవాభం
వ్యాఖ్యానముద్రా మధురం కరం తే ॥

🌻 🌻 🌻 🌻 🌻


🍀. నేటి సూక్తి : సంపూర్ణవిముక్తి - నీలోని ఏ అంశం ప్రపంచానికి చెంది వున్నా, ప్రపంచం వలన నీకు బాధలు తప్పవు. సర్వాత్మనా సంపూర్ణంగా నీవు దైవానికి చెంది వున్నప్పుడే నీకు సంపూర్ణ విముక్తి. 🍀

🌷🌷🌷🌷🌷


శుభకృత్, హేమంత ఋతువు,

దక్షిణాయణం, పౌష్య మాసం

తిథి: కృష్ణ పంచమి 16:38:47

వరకు తదుపరి కృష్ణ షష్టి

నక్షత్రం: పూర్వ ఫల్గుణి 14:25:12

వరకు తదుపరి ఉత్తర ఫల్గుణి

యోగం: సౌభాగ్య 12:32:08 వరకు

తదుపరి శోభన

కరణం: తైతిల 16:34:47 వరకు

వర్జ్యం: 22:16:18 - 24:01:02

దుర్ముహూర్తం: 10:32:24 - 11:17:07

మరియు 15:00:40 - 15:45:23

రాహు కాలం: 13:48:01 - 15:11:51

గుళిక కాలం: 09:36:31 - 11:00:21

యమ గండం: 06:48:51 - 08:12:41

అభిజిత్ ముహూర్తం: 12:02 - 12:46

అమృత కాలం: 07:20:12 - 09:06:24

సూర్యోదయం: 06:48:51

సూర్యాస్తమయం: 17:59:31

చంద్రోదయం: 22:29:09

చంద్రాస్తమయం: 10:25:14

సూర్య సంచార రాశి: ధనుస్సు

చంద్ర సంచార రాశి: సింహం

యోగాలు: గద యోగం - కార్య హాని,

చెడు 14:25:12 వరకు తదుపరి

మతంగ యోగం - అశ్వ లాభం

🌻 🌻 🌻 🌻 🌻


🍀. నిత్య ప్రార్థన 🍀

వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ

నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా

యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా

తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం

తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ

విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.

🌹🌹🌹🌹🌹