నిర్మల ధ్యానాలు - ఓషో - 287


🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 287 🌹

✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ

🍀. సమశృతిలో సాగగలగడమే సంతోషం. అస్తిత్వం నించీ వేరు కావడమే దుఃఖం. కేంద్రానికి నువ్వు చేరినపుడు ధర్మమంటే తెలుస్తుంది. ధ్యానమొక్కటే కేంద్రాన్ని చేరు మార్గం. 🍀


అస్తిత్వతత్వాన్ని అవగాహన చేసుకోవడమన్నది ముఖ్యమయిన సంగతి. దాని వల్ల మనం దాంతో సమశృతిలో సాగగలం. సమశృతిలో సాగగలగడమే సంతోషం. అస్తిత్వం నించీ వేరుకావడమే దుఃఖం. నువ్వు రూపాంతరం చెందడమంటే సత్యం పట్ల, ప్రకృతి పట్ల స్పృహతో వుండడం. అట్లా స్పృహతో వుండటమంటే లోపలికి ప్రయాణించడమే. మొదట నీ కేంద్రాన్ని నువ్వు గుర్తించాలి. నువ్వు నీ కేంద్రాన్ని గుర్తించిన క్షణం అస్తిత్వ కేంద్రాన్ని కూడా గుర్తిస్తావు. ఆ రెండూ వేరు కాదు.

మనం పైపైన మాత్రమే వ్యతిరేకంగా వుంటాం. వేరుగా వుంటాం. కేంద్రంలో అందరం ఒకటే. చెట్లు, పర్వతాలు, జనం, జంతువులు నక్షత్రాలు ఒకటే. కేంద్రానికి నువ్వు చేరినపుడు తావో అంటే, ధర్మమంటే తెలుస్తుంది. ధ్యానమొక్కటే కేంద్రాన్ని చేరు మార్గం. తప్పని సరి అవసరం ధ్యానం. నువ్వు ధ్యానాన్ని తెలుసుకుంటే అన్నీ తెలుసుకుంటావు.


సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹

No comments:

Post a Comment