🌹 26, FEBRUARY 2023 SUNDAY ALL MESSAGES ఆదివారం, భాను వాసర సందేశాలు 🌹

🍀🌹 26, FEBRUARY 2023 SUNDAY ALL MESSAGES ఆదివారం, భాను వాసర సందేశాలు 🌹🍀
1) 🌹 26, FEBRUARY 2023 SUNDAY, ఆదివారం, భానువాసరే, నిత్య పంచాంగము Daily Panchangam🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 332 / Bhagavad-Gita -332 🌹 🌴 8వ అధ్యాయము - అక్షరబ్రహ్మ యోగం / Akshara Brahma Yoga - 22 వ శ్లోకము 🌴
4) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 179 / Agni Maha Purana - 179 🌹 🌻. లింగమానాదివ్యక్తావ్యక్త లక్షణములు - 6 / The dimensions of different varieties of the Liṅga - 6 🌻
4) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 044 / DAILY WISDOM - 044 🌹 🌻 13. మన దేవుడు ఎవరో మనం తప్పక తెలుసుకోవాలి / 13. We Must Know Who is Our God 🌻
5) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 309 🌹
6) 🌹. శివ సూత్రములు - 46 / Siva Sutras - 46 🌹 
🌻 15. హృదయే చిత్తసంఘటాత్‌ దృశ్య స్వప దర్శనం - 2 / 15. Hṛdaye cittasaṃghaṭṭād dṛśyasvā padarśanam - 2 🌻

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹26, ఫిబ్రవరి, February 2023 పంచాగము - Panchagam 🌹*
*శుభ ఆదివారం, Sunday, భాను వాసరే*
*మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ*

*🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు 🌻*

*🍀. సూర్య మండల స్త్రోత్రం - 10 🍀*

10. యన్మండలం విశ్వసృజం ప్రసిద్ధం | 
ఉత్పత్తి రక్ష ప్రలయ ప్రగల్భమ్ |
యస్మిన్ జగత్సంహరతేఽఖిలం చ | 
పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : ప్రతి భౌతిక వస్తువు నందూ ఒకానొక చైతన్యం ఉన్నది. దానిని మనం ధ్యాసగోచరం చేసుకోవచ్చును. ఇండ్లు, మోటారు కార్లు, కుర్చీలు, బల్లలు మొదలైన ప్రతి వస్తువుకూ ఒక రకమైన వ్యక్తిత్వం ఉన్నది. మన పూర్వులకు అది తెలుసు. అందుచేతనే వారు వాటి అధిష్ఠాన చైతన్యాన్ని దర్శించ గలిగేవారు.🍀* 

🌷🌷🌷🌷🌷

శుభకృత్‌, శిశిర ఋతువు,
ఉత్తరాయణం, ఫాల్గుణ మాసం
తిథి: శుక్ల-సప్తమి 25:00:59 వరకు
తదుపరి శుక్ల-అష్టమి
నక్షత్రం: కృత్తిక 29:19:35 వరకు
తదుపరి రోహిణి
యోగం: ఇంద్ర 16:26:40 వరకు
తదుపరి వైధృతి
కరణం: గార 12:38:00 వరకు
వర్జ్యం: 16:39:00 - 18:20:20
దుర్ముహూర్తం: 16:47:32 - 17:34:31
రాహు కాలం: 16:53:24 - 18:21:31
గుళిక కాలం: 15:25:18 - 16:53:24
యమ గండం: 12:29:05 - 13:57:11
అభిజిత్ ముహూర్తం: 12:06 - 12:52
అమృత కాలం: 26:47:00 - 28:28:20
మరియు 27:51:52 - 29:35:56
సూర్యోదయం: 06:36:38
సూర్యాస్తమయం: 18:21:31
చంద్రోదయం: 10:53:21
చంద్రాస్తమయం: 00:16:00
సూర్య సంచార రాశి: కుంభం
చంద్ర సంచార రాశి: మేషం
యోగాలు: ధూమ్ర యోగం - కార్య
భంగం, సొమ్ము నష్టం 29:19:35 వరకు
తదుపరి ధాత్రి యోగం - కార్య జయం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. శ్రీమద్భగవద్గీత - 332 / Bhagavad-Gita - 332 🌹*
*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. 8వ అధ్యాయము - అక్షరబ్రహ్మ యోగం - 22 🌴*

*22. పురుష: స పర: పార్థ భక్త్యా లభ్యస్త్యనన్యయా |*
*యస్యాన్త:స్థాని భూతాని యేన సర్వమిదం తతమ్ ||*

🌷. తాత్పర్యం :
*సర్వులకన్నను అధికుడైన దేవదేవుడు అనన్యభక్తి చేతనే పొందబడును. అతడు తన ధామమునందు నిలిచియున్నను సర్వవ్యాపియై యున్నాడు మరియు అతని యందే సమస్తము స్థితిని కలిగియున్నది.*

🌷. భాష్యము :
పరమగమ్యస్థానము పరమపురుషుడైన శ్రీకృష్ణుని ధామమే యని ఇచ్చట స్పష్టముగా తెలుపబడినది. 

అది పునరావృత్తిరహితముగు స్థానము. అట్టి ధామమును బ్రహ్మసంహిత “ఆనందచిన్మయరసము” అని వర్ణించినది. అనగా అచ్చట ప్రతిదియు దివ్యానందపూర్ణమై యుండును. అచ్చట వైవిధ్యమంతయు ఆధ్యాత్మిక ఆనందపూర్ణమేగాని భౌతికము కాదు. 

సప్తమాధ్యాయమున తెలుపబడినట్లు అచ్చట ప్రకటితమగు సర్వము శ్రీకృష్ణభగవానుని ఆధ్యాత్మికశక్తికి సంబంధించినదే గావున అచ్చటి వైవిధ్యము ఆ భగవానుని విస్తారమే అయి యున్నది. 

ఇక భౌతికజగమునకు సంబంధించినంత వరకు అతడు స్వధామమునందే సదా నిలిచియున్నను తన భౌతికశక్తి ద్వారా సర్వత్రా వ్యాపించియుండును. అనగా శ్రీకృష్ణభగవానుడు తన ఆధ్యాత్మికశక్తి మరియు భౌతికశక్తుల ద్వారా ఆధ్యాత్మిక, భౌతికముల యందంతటను నిలిచియుండును. 

“యస్యాన్త:స్థాని” యనగా సర్వము అతని యందే నిలిచియున్నదని భావము. అనగా ప్రతిదియు అతని ఆధ్యాత్మికశక్తియందో లేక భౌతికశక్తియందో నిలిచియుండును. ఈ రెండుశక్తుల ద్వారానే ఆ దేవదేవుడు సర్వవ్యాపియై యున్నాడు.

“భక్త్యా” అను పదము ద్వారా ఇట స్పష్టముగా సూచింపబడినట్లు దివ్యమైన కృష్ణలోకమునందు గాని, అసంఖ్యాకములుగా నున్న వైకుంటలోకములందు గాని ప్రవేశుంచుట కేవలము భక్తి ద్వారానే సాధ్యము కాగలదు. భగవద్దామమును పొందుటకు ఇతరమైన ఏ పద్దతియు సహకరింపదు. 

అట్టి ధామము మరియు భగవానుని గోపాలతాపన్యుపనిషత్తు (3.2) “ఏకోవశీ సర్వగ: కృష్ణ:” యని వర్ణించినది. అనగా ఆ దివ్యధామమున శ్రీకృష్ణనామాంకితుడైన దేవదేవుడు ఒక్కడే కలడు. అతడు దివ్యకరుణాపూర్ణుడు. ఒక్కనిగానే స్థితుడై యున్నప్పటికిని ఆ దేవదేవుడు కోట్లాది సంపూర్ణరూపములలో విస్తరించియుండును. 

నిశ్చలముగా నిలిచియున్నను ఫలములను, పుష్పములను, పత్రములను కలిగయుండెడి వృక్షముతో అట్టి దేవదేవుని వేదములు పోల్చుచున్నవి. శ్రీకృష్ణుని సంపూర్ణాంశములైన వైకుంఠాధిపతులు చతుర్బాహులు కలిగి పురుషోత్తముడు, త్రివిక్రముడు, శ్రీధరుడు, వాసుదేవుడు, దామోదరుడు, జనార్ధనుడు, నారాయణుడు, వామనుడు, పద్మనాభుడు అది పలునామములతో పిలువబడుదురు.
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 332 🌹*
*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*

*🌴 Chapter 8 - Akshara Brahma Yoga - 22 🌴*

*22 . puruṣaḥ sa paraḥ pārtha bhaktyā labhyas tv ananyayā*
*yasyāntaḥ-sthāni bhūtāni yena sarvam idaṁ tatam*

🌷 Translation : 
*The Supreme Personality of Godhead, who is greater than all, is attainable by unalloyed devotion. Although He is present in His abode, He is all-pervading, and everything is situated within Him.*

🌹 Purport :
It is here clearly stated that the supreme destination, from which there is no return, is the abode of Kṛṣṇa, the Supreme Person. The Brahma-saṁhitā describes this supreme abode as ānanda-cinmaya-rasa, a place where everything is full of spiritual bliss. 

All the variegatedness manifest there is of the quality of spiritual bliss – nothing there is material. 

That variegatedness is expanded as the spiritual expansion of the Supreme Godhead Himself, for the manifestation there is totally of the spiritual energy, as explained in Chapter Seven. 

As far as this material world is concerned, although the Lord is always in His supreme abode, He is nonetheless all-pervading by His material energy. 

So by His spiritual and material energies He is present everywhere – both in the material and in the spiritual universes. 

Yasyāntaḥ-sthāni means that everything is sustained within Him, within either His spiritual or material energy. The Lord is all-pervading by these two energies.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 179 / Agni Maha Purana - 179 🌹*
*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ*
*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*
*ప్రథమ సంపుటము, అధ్యాయము - 54*

*🌻. లింగమానాదివ్యక్తావ్యక్త లక్షణములు - 6 🌻*

ఇపుడు ముఖలింగమును గూర్చి వినుము. పూజాభాగమును. మూర్తిపూజ, అగ్నిపూజ, పదపూజ అని మూడు విధములుగ కల్పించుకొనవలెను. వెనుకటివలె ద్వాదశాంశమును విడచి, ఆరుభాగముల ద్వారా ఆరు స్థానములను అభివ్యక్తము చేయవలెను. శిరస్సు ఎత్తుగానుండనట్లు, లలాట-నాసికా-మఖ-చిబుక-కంఠములు స్పష్టముగ కనబడునట్లు చేయవలెను. నాలుగు అంళములచే రెండుభుజములను, నేత్రములను ఏర్పరుపవలెను. ప్రతిమాప్రమాణానుసారము హస్తము ముకులాకారముగా ఏర్పరచి, విస్తారములోని ఎనిమిదవ అంశముచే నాలుగుముఖములను ఏర్పరుపవలెను. అన్ని ప్రక్కలనుండియు సమముగ ఉండవలెను. ఇంతవరకు చతుర్ముఖ లింగమును గూర్చి చెప్పితిని; ఇపుడు త్రిముఖలింగమును గూర్చి చెప్పదను: వినుము.

చతుర్ముఖలింగముకంటె త్రిముఖలింగమునకు చెవులు, పాదములు అధికము. లలాటాదులను వెనుకటివలెనే ఏర్పరుపవలెను. నాలుగు అంశలతో రెండు భుజములను నిర్మింపవలెను. వాటి వెనుక భాగము దృఢముగా నుండవలెను. విస్తారముయొక్క ఎనిమిదవ అంశమునందు మూడు ముఖములును స్పష్టముగ కనబడవలెను. (ఏక ముఖ లింగము):- ఏకముఖమును తూర్పువైపున నిర్మింపవలెను. దాని నేత్రములు సౌమ్యముగా నుండవలెను. దాని లలాట-నాసికా-ముఖ-కంఠములు పైకి ఉబికి యుండవలెను. బాహువిస్తారములో ఐదవ అంశముచే పైన చెప్పిన అవయముల నిర్మాణము జరుగవలెను. దానిని బాహురహితముగ నిర్మింపవలెను. ఈ ఏకముఖలింగమునందు విస్తారములో ఆరవ అంశమునందు. ముఖ నిర్మాణము హితకరమని చెప్పబడినది. ముఖయుక్తములగు అన్ని లింగము శిరోభాగములును త్రపుషాకారములో గాని, కుక్కుటాండాకారముగాని ఉండవలెను.

అగ్నిమహాపురాణమునందు లింగమానాదివ్యక్తావ్యక్త లక్షణమును ఏబదినాల్గవ అధ్యాయము సమాప్తము.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Agni Maha Purana - 179 🌹*
*✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj *

*Chapter 54*
*🌻The dimensions of different varieties of the Liṅga - 6 🌻*

41. Listen then to (the description of forms having) four or three faces or one face and mukhaliṅga. The part to be worshipped is to be made set with nine parts.

42-43. Having left out twelve parts for the arms and eyes, as before, the head, forehead, nose, face, chin, neck are then to be made. Having covered by the hands, the arms and eyes (are made) with four parts proportionate to the measurement of image.

44. The face should be made equal to one-eighth part of the breadth. I have described the four-faced form. Listen! The three-faced form is described now.

45. The ear and feet are made. One has to mark the forehead etc. for that. Then the arms should be made with four parts quite strong.

46. The projection of the frontispiece (should be) one-eighth of the breadth. One face has to be made such as to have beautiful eye on the eastern side.

47. It should be made round at the forehead, nose, face and neck. By one-fifth from the arm one should make it round. less by one’s arm length.

48. It is good to have the projections in the frontispiece as one-sixth of the breadth for all the mukhaliṅgas whether it is trapuṣa or kukkuṭa (?)

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 44 / DAILY WISDOM - 44 🌹*
*🍀 📖. యోగా యొక్క తత్వశాస్త్రం నుండి 🍀*
*✍️. ప్రసాద్ భరద్వాజ*

*🌻 13. మన దేవుడు ఎవరో మనం తప్పక తెలుసుకోవాలి 🌻*

*ఆధ్యాత్మిక అన్వేషకులు భగవంతుని వెంబడిస్తారు. ఇది అందరికీ బాగా తెలిసినదే. అయితే మన దేవుడు ఎవరో మనం తెలుసుకోవాలి. మన పరిణామం యొక్క ప్రస్తుత స్థితిని పరిపూర్ణత వైపు తీసుకువెళ్లే ప్రతిరూపం దేవుడు. మనల్ని పరిపూర్ణం చేయగలిగేది ఏదైనా మన దేవుడే. మనం అసంపూర్ణంగా ఉండేందుకు అనుమతించే ఏదీ మనల్ని సంతృప్తి పరచదు. మన వ్యక్తిత్వాన్ని పరిపూర్ణత వైపు తీసుకువెళ్ళేది ఏదైనా, దానిని మన అవసరంగా భావించాలి. గొప్ప మనస్తత్వవేత్తలైన పతంజలి వంటి ఉపాధ్యాయులు విద్యార్థులకు ముఖ్యమైన సూచనను అందించారు.*

*మనం ఎంత అంతర్గతంగా వెళ్తామో, బాహ్యంగా మార్గనిర్దేశకత్వం యొక్క అవసరం అంత ఎక్కువగా ఉంటుంది. ఒకరు బయటకి బాగానే కనిపిస్తారు. వారికి ఇతరుల నుండి ఎలాంటి సహాయం అవసరమని భావించకపోవచ్చు. కానీ అంతర్గత శక్తులను అణచివేయడం మరియు నిర్వహించడం చాలా కష్టం. అవి ఆవేశపూరితమైనవి, నియంత్రించలేనివి. ఈ రకమైన కోరికలను గ్రంథాలను విశ్లేశాత్మకంగా అధ్యయనం చేయడం, సత్సంగం, ఏకాంతం మరియు స్వీయ-పరిశోధనను అత్యంత ఉత్కృష్టంగా పాటించడం ద్వారా మాత్రమే నియంత్రించగలరు.*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 DAILY WISDOM - 44 🌹*
*🍀 📖 Philosophy of Yoga 🍀*
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj

*🌻 13. We Must Know Who is Our God 🌻*

*Spiritual seekers are certainly after God. This is very well known. But we must know who is our God. God is the fulfilling counterpart of the present state of our evolution. Anything that is capable of making us complete is our God. Anything that allows us to remain partial is not going to satisfy us. That which completes our personality in any manner, in any degree of its expression, is to be considered as our necessity, and teachers like Patanjali, who were great psychologists, have taken note of this important suggestion to be imparted to students.*

*The more internal we go, the greater is the need we will feel for guidance outwardly. One may look all right and not feel the need for any kind of assistance from others. But the internal forces are more difficult to subdue and handle. They are impetuous, uncontrollable. The desires which are of this character have to be sublimated with a great analytical understanding by the study of scriptures, resort to holy company, isolation and self-investigation, and methods of this nature.*

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 309 🌹*
*✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ*

*🍀. ప్రేమ అన్నది నీకు కొత్త కోణాన్ని యిస్తుంది. అది నిన్ను మరింత సౌందర్యభరితంగా మారుస్తుంది. నీకు తెలియని యితర విషయాల పట్ల నీకు స్పృహ కలిగిస్తుంది. మనుషుల ప్రతి చలనం పట్ల నిన్ను చైతన్యవంతుణ్ణి చేస్తుంది. 🍀*

*ప్రేమ కవిత్వానికి చెందిన అత్యున్నతరూపం. కవిత్వమంటే కవితలు రాయడం కాదు. కవిత్వ జీవితాన్ని అనుభవించనివాడు కూడా కవిత్వం రాయవచ్చు. కవితల్ని రాయడానికి టెక్నిక్ అవసరం. అతను టెక్నీషియన్ కావచ్చు. కవి కావాల్సిన పన్లేదు. వందమంది కవుల్లో తొంభయి తొమ్మిది మంది టెక్నిషియన్లే. అది ప్రతి కళకీ వర్తిస్తుంది. చిత్రకారులు, శిల్పులు యిలా అందర్లో వంద మందిలో తొంభయి తొమ్మిది మంది టెక్నీషియన్లే.*

*నిజమైన కవి కవితలు రాయాల్సిన పన్లేదు. అతను రాయవచ్చు. రాయకపోవచ్చు. చిత్రకారుడు, శిల్పి తదితర కళాకారులూ అంతే. వాళ్ళు రాగరంజితమయిన జీవితాల్తో వెలిగిపోతారు. శిల్పం శిల్పిగా, సంగీతం సంగీతకారుడిగా, చిత్రకళ చిత్రకారుడుగా మారతాయి. కళలో జీవించడమంటే అదే. నేను ప్రేమ అన్నది కవిత్వం అనడంలో అర్థమది. అది నీకు కొత్త కోణాన్ని యిస్తుంది. అది నిన్ను మరింత సౌందర్యభరితంగా మారుస్తుంది. నీకు తెలియని యితర విషయాల పట్ల నీకు స్పృహ కలిగిస్తుంది. మనుషుల ప్రతి చలనం పట్ల నిన్ను చైతన్యవంతుణ్ణి చేస్తుంది. ప్రతివ్యక్తిలో అసాధారణ ప్రతిభ వుంది. ప్రతిమనిషి ఒక గొప్ప కథ, గొప్ప నవల ప్రతిమనిషి తనకు తను ఒక ప్రపంచం.*

*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. శివ సూత్రములు - 046 / Siva Sutras - 046 🌹*
*🍀. శివ ఆగమ తత్వశాస్త్రం యొక్క సూత్రములు 🍀*
*1- శాంభవోపాయ*
 *✍️. ప్రసాద్‌ భరధ్వాజ*

*🌻 15. హృదయే చిత్తసంఘటాత్‌ దృశ్య స్వప దర్శనం - 2 🌻*
*🌴. మనస్సును దాని కేంద్రములో ఉంచడం ద్వారా అవగాహన చేసుకొను శూన్యతను గ్రహించ వచ్చు.🌴*

*మనస్సు చైతన్యంతో కలిసినప్పుడు, అది స్వచ్ఛంగా ఉండాలి, లేకపోతే చైతన్యం కూడా అపవిత్రమౌతుంది. ఆధ్యాత్మిక పురోగతిలో అపవిత్ర చైతన్యానికి ఉపయోగం లేదు. ఆధ్యాత్మికత యొక్క ముఖ్యమైన సూత్రం పరమాత్మతో ఏకత్వాన్ని స్థాపించగల సామర్థ్యం. ఒక యోగి మరియు సాధకుల మధ్య వ్యత్యాసం ఒకరి అంకితభావం మరియు సాధన (అభ్యాసం).*

*స్వప అనే పదాన్ని శివుడు ఎంచుకున్నాడు, కారణం లేకుండా కాదు. ఈ సందర్భంలో, svāpa శూన్యం అనే ఉద్దేశ్యంతో ఉపయోగించబడుతుంది. స్వప యొక్క సాహిత్యపరమైన అర్థం సూత్రం 9లో చర్చించబడిన కలలు కనే స్థితి. కలలు కనే స్థితిలో మరియు అంతకు మించి, వస్తుమయ ప్రపంచం యొక్క అనుభవం వేరు చేయబడి, అనుభూతి చెందే వారు మరియు అనుభవం , రెండూ లేని శూన్య స్థితికి దారి తీస్తుంది.*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Siva Sutras - 046 🌹*
*🍀Aphorisms of philosophy of Shiva āgama 🍀*
Part 1 - Sāmbhavopāya
*✍️. Acharya Ravi Sarma, 📚. Prasad Bharadwaj*

*🌻 15. Hṛdaye cittasaṃghaṭṭād dṛśyasvā padarśanam - 2 🌻*
*🌴. By fixing the mind on its core one can comprehend perceivable emptiness.🌴*

*When the mind conjoins with the essence of consciousness, it has to be pure, as otherwise the consciousness also gets afflicted. An afflicted consciousness is of no use in spiritual progression. The essential principle of spirituality is one’s ability to establish oneness with the Supreme. The difference between a yogi and an aspirant is one’s dedication and sādhanā (practice).*

*The word svāpa is chosen by Shiva is not without reasoning. In this context, svāpa is used with the intent to mean void. Literal meaning of svāpa is the state of dreaming that has been discussed in sūtrā 9. In the dreaming state and beyond, the experience of the objective world is disconnected leading to state of void where there is neither experiment nor experience.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
#నిత్యసందేశములు #DailyMessages 
Join and Share 
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages2
https://chaitanyavijnanam.tumblr.com/
https://www.kooapp.com/profile/Prasad_Bharadwaj

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 435 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 435 - 2


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 435 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 435 - 2 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 93. కుశలా, కోమలాకారా, కురుకుళ్ళా, కులేశ్వరీ ।
కుళకుండాలయా, కౌళ మార్గతత్పర సేవితా ॥ 93 ॥ 🍀

🌻 435. 'కోమలాకారా’ - 2 🌻


పుష్పముల యందు, లేత చిగుళ్ళ యందు, పసిబిడ్డల యందు ఆకర్షణ ఎక్కువగ గోచరించును. పదార్థము ముదిరిన కొలది ప్రకాశము మరుగున పడును. అట్టి సమయమున ఆకర్షణగ లేకపోగా వికారము హెచ్చై యుండును. కోమలమగు రూపము కనబడినపుడు ఆ రూపమును శ్రీమాత అస్థిత్వముగ భావించుట అభ్యసించ వలెను. అట్టి రూపమందలి గుణము కూడ నిర్మలమైనచో అది యుత్తమ మగు స్థితి. గుణ రూపముల యందలి సౌకుమార్యము శ్రీమాత వైభవమని తెలియవలెను. రూప సౌందర్యము కలవారు కొందరు, గుణ సౌందర్యము కలవారు కొందరు, గుణ రూప సౌందర్య మున్నచోట వైభవ ముండును. రామకృష్ణాదులు అట్టివారు.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 435 - 2 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️ Prasad Bharadwaj

🌻 93. Kushala komalakara kurukulla kuleshvari
Kulakundalaya kaolamarga tatpara sevita ॥ 93 ॥ 🌻

🌻 435. 'Komalakara' - 1 🌻


In flowers, in tender shoots, in babies, the attraction is more noticeable. As the matter progresses, the brightness fades. At that time it is not attractive but the ugly. When a delicate form appears, one should practice thinking of that form as the existence of Sri Mata. If the quality of that form is also pure, then it is the best state. It should be known that the gentleness of the qualities is the glory of the Srimata. There are some who have beauty of form, some who have beauty of quality. Beauty of form and quality brings glory. People Ramakrishna are such.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹

Osho Daily Meditations - 313. A KNACK / ఓషో రోజువారీ ధ్యానాలు - 313. ఒక నేర్పు


🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 313 / Osho Daily Meditations - 313 🌹

✍️. ప్రసాద్ భరద్వాజ

🍀 313. ఒక నేర్పు 🍀

🕉. నిజమైన ధ్యానంలో ఒక నేర్పు ఉంటుంది. అది అభ్యసించే కళ కాదు. ఆకస్మిక నిశ్శబ్దంలో పడే నేర్పు. మీరు గమనిస్తే, ఇరవై నాలుగు గంటల్లో, ప్రతిరోజూ, మీరు స్వయంచాలకంగా నిశ్శబ్దంలో పడిపోయే కొన్ని క్షణాలు కనిపిస్తాయి. ఈ క్షణాలు వాటంతట అవే వస్తాయి; కానీ మనం వాటిని గమనించడం లేదు. 🕉

ఎవరైనా తెలుసుకోవలసిన మొదటి విషయం ఏమిటంటే జీవితంలో సహజ నిశ్శబ్ద క్షణాలు ఎప్పుడు వస్తాయి అని. అవి వచ్చినప్పుడు, మీరు చేస్తున్నదంతా ఆపండి. నిశ్శబ్దంగా కూర్చోండి మరియు ఆ క్షణంతో ప్రవహించండి. అవి సహజమైనవి. కొన్ని కిటికీలు ఎప్పుడూ వాటంతట అవే తెరుచుకుంటాయి, కానీ మనం చాలా పనులలో నిమగ్నమై ఉన్నాం. కిటికీ తెరుచుకోవడం మరియు గాలి లోపలికి రావడం మరియు సూర్యుడు చొచ్చుకు పోవడాన్ని మనం గమనించము. కాబట్టి చూడండి ... మీరు సుదీర్ఘమైన, గాఢమైన నిద్ర తర్వాత తాజాగా ఉన్నప్పుడు ఉదయాన్ని చూడండి. సూర్యుడు ఉదయిస్తున్నాడు. ప్రపంచం ఇప్పుడే మేల్కొంటోంది మరియు పక్షులు పాడటం ప్రారంభించాయి. ఆ క్షణం మిమ్మల్ని చుట్టుముట్టినట్లు అనిపిస్తే, మీలో ఒక పారవశ్య స్థతి కలుగుతుంది. దానితో ఉండండి.

నిశ్శబ్దంగా చెట్టు కింద, నది ఒడ్డున, లేదా మీ గదిలో కూర్చోండి. ఏమీ చేయకండి. ఆ స్థితిని ఆదరించండి. దానిని పొడిగించడానికి ప్రయత్నించవద్దు. ఒక్కసారి ఇందులోని నేర్పు తెలిస్తే అది మరింత ఎక్కువవుతుంది. అప్పుడు మీరు దానితో ఒక రకమైన సామరస్యానికి లోనవుతారు. నిశ్శబ్దం, ప్రశాంతత, నిశ్చలత అని పిలువబడే ఆ స్థితికి మరియు మీకు మధ్య ప్రేమ వ్యవహారం మొదలవుతుంది. బంధం మరింత లోతుగా మరియు లోతుగా మారుతుంది. ఇది ఎల్లప్పుడూ ఉంటుంది. చివరగా, అంతిమంగా మీరు ఎప్పుడైనా ఒక క్షణం కళ్ళు మూసుకుని దానిని చూడవచ్చు; అది అక్కడ ఉంది. మీరు దీన్ని దాదాపుగా తాకవచ్చు. కానీ అది ఒక నేర్పు, కళ కాదు. మీరు దానిని నేర్చుకోలేరు: మీరు దానిని గ్రహించాలి.


కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Osho Daily Meditations - 313 🌹

📚. Prasad Bharadwaj

🍀 313. A KNACK 🍀


🕉. Real meditation consists if a knack, not an art-the knack of falling into spontaneous silence. If you watch, in twenty-four hours, every day, you will find a few moments in which you are falling automatically into silence. These moments come on their own; it is just that we have not watched. 🕉

The first thing to be aware of is when these silent moments come. And when they come, simply stop all that you are doing. Sit silently, and flow with the moment. And they do come-they are natural. A few windows always open on their own, but we are so occupied that we never notice that the window has opened and the breeze is coming in and the sun has penetrated; we are so occupied with our work. So watch ... early in the morning when you are fresh after a long, deep sleep, and the world is just awakening and the birds have started singing and the sun is rising. If you feel a moment surrounding you, a space growing in you, just fall into it.

Sit silently under a tree, by the side of the river, or in your room, and just be ... nothing to be done. Just cherish that space-and don't try to prolong it. Once you have known the knack of it, it will come more and more. Then you start falling into a kind of harmony with it. A love affair starts between you and that space called silence, serenity, tranquility, stillness. And the bond becomes deeper and deeper. Finally, ultimately, it is always there. You can always close your eyes for a moment and look at it; it is there. You can almost touch it-- it becomes tangible. But it is a knack, not an art. You cannot learn it: You have to imbibe it.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹

శ్రీ శివ మహా పురాణము - 692 / Sri Siva Maha Purana - 692


🌹 . శ్రీ శివ మహా పురాణము - 692 / Sri Siva Maha Purana - 692 🌹

✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 02 🌴

🌻. శివ స్తుతి - 5 🌻


వర్ణములలో బ్రాహ్మణుడవు నీవే. ఓ శంకరా! మానవులలో రాజువు నీవే. ముక్తిని ఇచ్చే పుణ్యక్షేత్రములలోకాశీ నీవే. క్షేత్రములలో ప్రయాగ క్షేత్రము నీవే (37). ఓ మహేశ్వరా! శిలలన్నింటిలో స్ఫటికము నీవే. పుష్పములలో కమలము నీవే పర్వతములలో హిమవంతుడవు నీవే (38). లోకవ్యవహారములలో వాగ్రూపమగు వ్యవహారము నీవే. కవులలో (ద్రష్టలలో) భార్గవుడవు నీవే. పక్షులలో శరభుడవు నీవే. హింసించే మృగములలో సింహము నీవే (39). ఓ వృషభధ్వజా! శిలలలో శాలగ్రామశిల నీవే. పూజింపదగిన రూపములన్నింటిలో నర్మదా లింగము నీవే (40).

ఓ పరమేశ్వరా! పశువులలో నందీశ్వరుడను వృషభము నీవే. వేదములలో ఉపనిషత్తులు నీ స్వరూపమే. యజ్ఞము చేయు యజమానులకు సోమరసము నీవే (41). తపింపజేయు వారిలో అగ్నివి నీవే. శివభక్తులలో అచ్యుతుడవు నీవే. పురాణములలో భారతము నీవే. అక్షరములలో మకారము నీవే (42).

బీజమంత్రములలో ఓంకారము నీవే. భయంకరమగు వాటిలో విషము నీవే. వ్యాపకములలో ఆకాశము నీవే. ఆత్మలలో పరమాత్మవు నీవే (43). ఇంద్రియములలో మనస్సు నీవే. దానములలో ఆభయదానము నీవే. పవిత్రము చేయువాటిలో జలము నీవే. జీవనము నిచ్చు వాటిలో అమృతము నీవే (44). లాభములలో పుత్రలాభము నీవే. వేగము గలవాటిలో వాయువు నీవే. నిత్యకర్మలన్నిటి యందు సంధ్యోపాసన నీవే (45). క్రతువులలో అశ్వమేధము నీవే. యుగములలో సత్యయుగము నీవే. నక్షత్రములన్నింటిలో పుష్యానక్షత్రము నీవే. తిథులలో అమావాస్యవు నీవే (46).


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹




🌹 SRI SIVA MAHA PURANA - 692🌹

✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj

🌴 Rudra-saṃhitā (4): Yuddha-khaṇḍa - CHAPTER 02 🌴

🌻 The Prayer of the gods - 5 🌻


37. Among the four castes you are the brahmin. O Śiva, among men you are the king. Among holy centres of salvation you are Kāśī. Among the sacred rivers you are the supreme sacred river.

38. Among all stones, you are the crystal, O great god, among the flowers you are the lotus; among mountains you are Himavat.

39. Among all activities you are the speech; among poets you are Bhārgava. Among birds you are the eight-legged Śarabha. Among beasts of prey you are the lion.

40. O bull-bannered deity, among rocks you are Śālagrāma; among the forms of worship you are Narmadā Liṅga.

41. Among animals, you are the bull Nandīśvara, O lord Śiva. Among Vedic texts you are in the form of Upaniṣads; Among the sacrificers you are the cool-rayed moon.

42. Among the burning ones, you are the fire, among the devotees of Śiva, you are Viṣṇu, among Purāṇas you are Bharata; among the letters of the alphabet you are the letter Ma2.

43. Among the Bījamantras you are the Praṇava; among the terrible ones you are poison; among the pervading ones you are the firmament; among the Ātmans you are the supreme Ātman.

44. Among the sense-organs you are the mind; among the charitable gifts you are the gift of freedom from fear; among the sanctifying and life-giving agents you are considered the waters.

45. Among all acquisitions you are the acquisition of sons; among those with velocity you are the wind; among the routine sacred rites you are the Sandhyā worship.

46. Among sacrifices you are the horse-sacrifice. Among the Yugas you are the Kṛta yuga; among the asterisms you are Puṣya; among the Tithis you are Amāvāsyā.


Continues....

🌹🌹🌹🌹🌹


విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 731 / Vishnu Sahasranama Contemplation - 731


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 731 / Vishnu Sahasranama Contemplation - 731🌹

🌻731. తద్, तद्, Tad🌻

ఓం తస్మై నమః | ॐ तस्मै नमः | OM Tasmai namaḥ


తనోతీతి బ్రహ్మతదిత్యుచ్యతే విబుధోత్తమైః ।
ఓం తత్సతిది నిర్దేశ ఇతి గీతా ప్రమాణతః ॥

విస్తారము నందునది. విస్తారము నందిచునది. బ్రహ్మము తానే ప్రపంచ రూపమున వృద్ధినందును. ప్రాణులను వృద్ధినందిచును. 'ఓం తత్సదితి నిర్దేశో బ్రహ్మణ స్త్రివిధః స్మృతః' (శ్రీమద్భగవద్గీత 17.23) - 'బ్రహ్మమునకు సంబంధించిన నిర్దేశము అనగా పరమాత్మ శబ్దముతో నిర్దేశము ఓం - తత్ - సత్ అని మూడు విధములనుండునని విద్వాంసులచే తలచబడుచున్నది.'


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 731🌹

🌻731. Tad🌻

OM Tasmai namaḥ


तनोतीति ब्रह्मतदित्युच्यते विबुधोत्तमैः ।
ॐ तत्सतिदि निर्देश इति गीता प्रमाणतः ॥

Tanotīti brahmatadityucyate vibudhottamaiḥ,
Oṃ tatsatidi nirdeśa iti gītā pramāṇataḥ.

Tanoti means pervades; So, Brahman which envelops the entire universe vide the Lord's statement 'ॐ तत्सदिति निर्देशो ब्रह्मण स्त्रिविधः स्मृतः / Oṃ tatsaditi nirdeśo brahmaṇa strividhaḥ smr‌taḥ' (Śrīmad Bhagavad Gīta 17.23) - 'The indicatory syllables of Brahman are threefold as Om Tat Sat.'

🌻 🌻 🌻 🌻 🌻


Source Sloka

एकोनैकस्सवः कः किं यत्तत्पदमनुत्तमम् ।
लोकबन्धुर्लोकनाथो माधवो भक्तवत्सलः ॥ ७८ ॥

ఏకోనైకస్సవః కః కిం యత్తత్పదమనుత్తమమ్ ।
లోకబన్ధుర్లోకనాథో మాధవో భక్తవత్సలః ॥ 78 ॥

Ekonaikassavaḥ kaḥ kiṃ yattatpadamanuttamam,
Lokabandhurlokanātho mādhavo bhaktavatsalaḥ ॥ 78 ॥



Continues....

🌹 🌹 🌹 🌹🌹




కపిల గీత - 139 / Kapila Gita - 139


🌹. కపిల గీత - 139 / Kapila Gita - 139 🌹

🍀. కపిల దేవహూతి సంవాదం 🍀

✍️. శ్రీమాన్ క.రామానుజాచార్యులు, 📚. ప్రసాద్‌ భరధ్వాజ

🌴 3. ప్రకృతి పురుషుల వివేకము వలన మోక్షప్రాప్తి - 23 🌴


23. జ్ఞానేన దృష్టతత్త్వేన వైరాగ్యేణ బలీయసా|
తపోయుక్తేన యోగేన తీవ్రేణాత్మసమాధినా॥

తాత్పర్యము : చిత్తము యొక్క ఏకాగ్రత వలనను, పురుషుని యొక్క ప్రకృతి (అజ్ఞానము) క్రమక్రమముగా క్షీణించి, పూర్తిగా తొలగిపోవును.

వ్యాఖ్య : పరమాత్మ ఆత్మగా ఉన్న జీవాత్మే ఆత్మ స్వరూపం అని తెలుసుకున్న వాడు, తనకు ఆత్మగా ఉన్న పరమత్మను జేరతాడు. అలాంటి వాడిని ప్రకృతి మళ్ళీ పట్టుకోదు. ఆత్మసాక్షాత్కారమూ, ఆత్మ స్వరూప జ్ఞ్యానము, స్వస్వరూప జ్ఞ్యానమూ, పరమాత్మ ప్రాప్తి, ఈ నాలిగిటిలో ఏదో ఒకటి పొందేంత వరకే ప్రకృతి మనని అంటిపెట్టుకుని ఉంటుంది. ఇందులో ఏ ఒక్కటి కలిగినా, ప్రకృతి విడిచిపెడుతుంది. అంటే పరమాత్మ ఆత్మగా ఉన్న జీవాత్మ అనే జ్ఞ్యానం భగవంతుని అనుగ్రహముతో కలగాలి. అది కలగాలంటే పరమాత్మను ఆరాధించాలి.


సశేషం..

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Kapila Gita - 139 🌹

🍀 Conversation of Kapila and Devahuti 🍀

📚 Prasad Bharadwaj

🌴 3. Salvation due to wisdom of Nature and Jeeva - 23 🌴


23. prakṛtiḥ puruṣasyeha dahyamānā tv ahar-niśam
tiro-bhavitrī śanakair agner yonir ivāraṇiḥ

MEANING : The influence of material nature has covered the living entity, and thus it is as if the living entity were always in a blazing fire. But by the process of seriously discharging devotional service, this influence can be removed, just as wooden sticks which cause a fire are themselves consumed by it.

PURPORT : Fire is conserved in wooden sticks, and when circumstances are favorable, the fire is ignited. But the wooden sticks which are the cause of the fire are also consumed by the fire if it is properly dealt with. Similarly, the living entity's conditional life of material existence is due to his desire to lord it over material nature and due to his envy of the Supreme Lord. Thus his main diseases are that he wants to be one with the Supreme Lord or he wants to become the lord of material nature. The karmīs try to utilize the resources of material nature and thus become its lord and enjoy sense gratification, and the jñānīs, the salvationists, who have become frustrated in enjoying the material resources, want to become one with the Supreme Personality of Godhead or merge into the impersonal effulgence. These two diseases are due to material contamination. Material contamination can be consumed by devotional service because in devotional service these two diseases, namely the desire to lord it over material nature and the desire to become one with the Supreme Lord, are absent. Therefore the cause of material existence is at once consumed by the careful discharge of devotional service in Kṛṣṇa consciousness.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹



25 Feb 2023 Daily Panchang నిత్య పంచాంగము


🌹 25, ఫిబ్రవరి, February 2023 పంచాగము - Panchagam 🌹

శుభ శనివారం, Saturday, స్థిర వాసరే

మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ

🌻. పండుగలు మరియు పర్వదినాలు : స్కంద షష్టి, Skanda Sashti🌻

🍀. శ్రీ స్వర్ణాకర్షణ భైరవ స్తోత్రం - 9 🍀


17. నమో మహాభైరవాయ శ్రీరూపాయ నమో నమః |
ధనాధ్యక్ష నమస్తుభ్యం శరణ్యాయ నమో నమః

18. నమః ప్రసన్నరూపాయ హ్యాదిదేవాయ తే నమః |
నమస్తే మంత్రరూపాయ నమస్తే రత్నరూపిణే

🌻 🌻 🌻 🌻 🌻


🍀. నేటి సూక్తి : భౌతిక వస్తువులపై ఆధిపత్య మంటే, వాటిని సమృద్ధిగా కలిగి వుండి నిర్లక్ష్యంగా పారవేస్తూ తొండరగా పాడుచెయ్యడం అని అర్ధం కానేరదు. కడు జాగరూకతతోనే కాక సంయమంతో వాటిని సద్వినియోగ పరచుకో గలిగినప్పుడే వాటిపై నీకు ఆధిపత్యం కుదిరినట్లు. 🍀


🌷🌷🌷🌷🌷


శుభకృత్‌, శిశిర ఋతువు,

ఉత్తరాయణం, ఫాల్గుణ మాసం

తిథి: శుక్ల షష్టి 24:21:23 వరకు

తదుపరి శుక్ల-సప్తమి

నక్షత్రం: భరణి 28:00:56 వరకు

తదుపరి కృత్తిక

యోగం: బ్రహ్మ 17:17:22 వరకు

తదుపరి ఇంద్ర

కరణం: కౌలవ 12:24:21 వరకు

వర్జ్యం: 13:15:48 - 14:53:56

దుర్ముహూర్తం: 08:11:08 - 08:58:04

రాహు కాలం: 09:33:16 - 11:01:15

గుళిక కాలం: 06:37:17 - 08:05:16

యమ గండం: 13:57:14 - 15:25:14

అభిజిత్ ముహూర్తం: 12:06 - 12:52

అమృత కాలం: 23:04:36 - 24:42:44

మరియు 26:47:00 - 28:28:20

సూర్యోదయం: 06:37:17

సూర్యాస్తమయం: 18:21:13

చంద్రోదయం: 10:11:50

చంద్రాస్తమయం: 23:20:22

సూర్య సంచార రాశి: కుంభం

చంద్ర సంచార రాశి: మేషం

యోగాలు: ధ్వాo క్ష యోగం - ధన

నాశనం, కార్య హాని 28:00:56 వరకు

తదుపరి ధ్వజ యోగం - కార్య సిధ్ధి

✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి

🌻 🌻 🌻 🌻 🌻



🍀. నిత్య ప్రార్థన 🍀

వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ

నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా

యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా

తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం

తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ

విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.

🌹🌹🌹🌹🌹