శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 435 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 435 - 2
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 435 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 435 - 2 🌹
🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 93. కుశలా, కోమలాకారా, కురుకుళ్ళా, కులేశ్వరీ ।
కుళకుండాలయా, కౌళ మార్గతత్పర సేవితా ॥ 93 ॥ 🍀
🌻 435. 'కోమలాకారా’ - 2 🌻
పుష్పముల యందు, లేత చిగుళ్ళ యందు, పసిబిడ్డల యందు ఆకర్షణ ఎక్కువగ గోచరించును. పదార్థము ముదిరిన కొలది ప్రకాశము మరుగున పడును. అట్టి సమయమున ఆకర్షణగ లేకపోగా వికారము హెచ్చై యుండును. కోమలమగు రూపము కనబడినపుడు ఆ రూపమును శ్రీమాత అస్థిత్వముగ భావించుట అభ్యసించ వలెను. అట్టి రూపమందలి గుణము కూడ నిర్మలమైనచో అది యుత్తమ మగు స్థితి. గుణ రూపముల యందలి సౌకుమార్యము శ్రీమాత వైభవమని తెలియవలెను. రూప సౌందర్యము కలవారు కొందరు, గుణ సౌందర్యము కలవారు కొందరు, గుణ రూప సౌందర్య మున్నచోట వైభవ ముండును. రామకృష్ణాదులు అట్టివారు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 435 - 2 🌹
Contemplation of 1000 Names of Sri Lalitha Devi
✍️ Prasad Bharadwaj
🌻 93. Kushala komalakara kurukulla kuleshvari
Kulakundalaya kaolamarga tatpara sevita ॥ 93 ॥ 🌻
🌻 435. 'Komalakara' - 1 🌻
In flowers, in tender shoots, in babies, the attraction is more noticeable. As the matter progresses, the brightness fades. At that time it is not attractive but the ugly. When a delicate form appears, one should practice thinking of that form as the existence of Sri Mata. If the quality of that form is also pure, then it is the best state. It should be known that the gentleness of the qualities is the glory of the Srimata. There are some who have beauty of form, some who have beauty of quality. Beauty of form and quality brings glory. People Ramakrishna are such.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment