A Living Master . . .



A living master is bound to happen to the person who is in search of truth, who wants to know the meaning of life, who wants to go to the innermost core of his being, who wants to know the depth and the height of existence. He will have to hold hands with a master.

The master is one who has already known. The master is one who has been to the other shore and has come to this shore to show you the path. But only a master can show the path - a living master, remember.


11 Mar 2022

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 355-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 355-1


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 355-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 355-1 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 78. భక్తిమత్-కల్పలతికా, పశుపాశ విమోచనీ ।
సంహృతాశేష పాషండా, సదాచార ప్రవర్తికా ॥ 78 ॥ 🍀


🌻 355-1. 'సంహృతాశేష పాషండా' 🌻


శేషము లేకుండ పాషండులను నశింప జేయునది శ్రీమాత అని అర్థము. పాషండత్వము కరడుగట్టిన అజ్ఞానము. ఇట్టి వారికి జ్ఞానము బోధించిననూ రుచింపదు. వీరు జ్ఞానమునం దరుచి, అజ్ఞానము నందు రుచి కలిగియుందురు. ధర్మము, శాస్త్రము, సదాచారము వంటి విషయముల యందు ఏవగింపు కలిగి యుందురు. కేవలము ఆహార నిద్రా మైథునాదులలో మునిగి యుందురు. వాని విషయమున కూడ అశుచి మెండుగ నుండును. చేయకూడని పనులయందు ఆసక్తి మెండుగ నుండును. వితండ వాదములు చేయుచు పెద్దలను అవమానించుచు వికృతముగ ప్రవర్తించు చుందురు.

ప్రస్తుతము భరత ప్రజలను కలిధర్మము ఆక్రమించి యున్నది. రహదారులలోను, వాక్కుల యందు, విద్యాలయముల యందు కూడ యువతీ యువకులు స్వేచ్ఛ పేరున చాలా వికృతముగ ప్రవర్తించు చున్నారు. సిగ్గు, ల లేక సదాచారమును వర్ణించి అడ్డగోలుగ ప్రవర్తించు చున్నారు. ఇది అంతయూ పాషండ తత్వమే.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 355-1 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️. Acharya Ravi Sarma
📚. Prasad Bharadwaj

🌻 78. Bhaktimatkalpalatika pashupasha vimochani
Sanhruta sheshapashanda sadachara pravartika ॥ 78 ॥ 🌻


🌻 355-1. Saṃhṛtāśeṣa-pāṣaṇḍā संहृताशेष-पाषण्डा 🌻


She is referred in this nāma as the destroyer of heretics. Heretics are those who do not follow the principles laid down by Veda-s. Fourteen places (which include the four Veda-s and their extensions are referred to as the principle domains of dharma.

Those men who cross the boundaries of the principles of dharma are called pāṣaṇḍa or heresy. She destroys all those who act against the principles of Veda-s.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


11 Mar 2022

ఓషో రోజువారీ ధ్యానాలు - 151. విమర్శ / Osho Daily Meditations - 151. CRITICISM


🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 151 / Osho Daily Meditations - 151 🌹

📚. ప్రసాద్ భరద్వాజ్

🍀 151. విమర్శ 🍀


🕉. మీరు దేనినైనా విమర్శించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు, దానికి సానుకూల ప్రత్యామ్నాయంగా మీరు ఏమి ఇవ్వబోతున్నారో మొదట నిర్ణయించుకోండి. 🕉

మీ విమర్శకు ప్రత్యామ్నాయం గురించి మీరు ఆలోచించ లేకపోతే, వేచి ఉండండి. విమర్శలు చేయవద్దు, ఎందుకంటే అది వ్యర్థం. సరైన ఔషధం ఎక్కడ ఉంది అని చెప్పకుండా ఈ ఔషధం సరైనది కాదని మీరు చెబితే, మీరు చెప్పింది నిజమే అయినా అది సరైనదిగా మారదు. విమర్శలు ఎప్పుడూ విప్లవాన్ని కలిగించవు. సానుకూల కార్యక్రమంలో భాగంగా మాత్రమే విమర్శలు బాగుంటాయి.

కాబట్టి మొదట సానుకూల కార్యక్రమం గురించి నిర్ణయించుకోండి, ఆపై, ఆ కార్యక్రమంపై నిఘా ఉంచండి, అప్పుడు విమర్శించండి. అప్పుడు మీ విమర్శ, మీరు విమర్శించే వారిచే చాలా విలువైనది అని ప్రశంసించ బడుతుంది. దీనివల్ల ఎవరూ బాధపడరు. ఎందుకంటే మీరు విమర్శిస్తున్నప్పుడు, మీరు నిరంతరం కొంత సానుకూల ప్రత్యామ్నాయాన్ని దృష్టిలో ఉంచుకుని, ఆపై ఏదో ప్రతిపాదిస్తున్నారు కనుక.

కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹





🌹 Osho Daily Meditations - 151 🌹

📚. Prasad Bharadwaj

🍀 151. CRITICISM 🍀

🕉 Whenever you are ready to criticize something, first decide what you are going to give as a positive alternative to it. 🕉


If you can't think of an alternative to your criticism, wait. Don't make the criticism, because it is futile. If you say that this medicine is not right, maybe you are right, but then where is the right medicine? Criticism never brings revolution. Criticism is good as part of a positive program.

So first decide about the positive program and then, keeping an eye on the positive program, criticize. Then your criticism will be very valuable, appreciated even, by those whom you are criticizing. Nobody will feel offended by it, because while you are criticizing, you are continuously keeping some positive alternative in mind and then proposing something.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


11 Mar 2022

మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 162


🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 162 🌹

✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. విషువత్ - 2 🌻


సంవత్సరాదిని నిర్ణయించుటకు వేదఋషులు ఒక పుల్లను పాతి దాని నీడను కొలిచి ఈ దినమును స్థాపించెడి వారు. ఈ బిందువు నుండి సమస్త ఖగోళ గణితములను లెక్కించెడివారు. ఈ బిందువు ప్రతి సంవత్సరము భూమధ్యరేఖపై కొంచెము వెనుకకు నడుచు చుండును. ఈ నడచుటనే "గవామయము" అను యజ్ఞముగా వేద ఋషులు గుర్తించిరి. ఈ బిందువుతోపాటు సంవత్సరాది కూడ వెనుకకు నడచు చుండును. దీనినే కాలస్వరూపుడగు శంకరుడు మృగరూపమైన యజ్ఞమును వేటాడుటగా కవులు వర్ణించిరి.

'నల్లలేడి యందు దృష్టి నిలిపి వింటియందెక్కు పెట్టిన బాణమును చూచుకొనుచున్న నీవు మృగము వెంట పరుగెత్తుచున్న పినాకపాణి వలె నున్నావు.' అని కాళిదాస కృతమగు శాకుంతల నాటకమున మాతలి దుష్యంతుని ప్రశంసించును. నాటకము మొత్తము నందును చాంద్ర సంవత్సరము యొక్క కథ అంతర్వాహినిగా నడచును. కనుకనే దుష్యంతుడు చాంద్రవంశపు రాజుగా చమత్కరింపబడెను.

ఈ బిందువునకై భూమధ్యరేఖ ఖండింపబడుటకు కావలసిన సూర్యగతి‌ ధ్రువుని కాలముననే పుట్టినది.


....✍🏼 మాస్టర్ ఇ.కె.🌻

🌹 🌹 🌹 🌹 🌹


11 Mar 2022

శ్రీ శివ మహా పురాణము - 532 / Sri Siva Maha Purana - 532


🌹 . శ్రీ శివ మహా పురాణము - 532 / Sri Siva Maha Purana - 532 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి

📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴

అధ్యాయము - 47

🌻.శివుని అంతఃపుర ప్రవేశము - 2 🌻


ఇంతలో జ్యోతిశ్శాస్త్ర పండితుడగు గర్గుడు పర్వతరాజగు హిమవంతుని వద్దకు వచ్చి ఇట్లనెను (13).

ఓ పర్వత రాజా! హిమాలయా! స్వామీ! ప్రభూ! కాళీపతియగు శంభుని పాణి గ్రహణము కొరకు నీ మందిరమునకు దోడ్కొని రమ్ము(14).


బ్రహ్మ ఇట్లు పనికెను-

కన్యా దానమునకు సమయ మాసన్నమైనది గుర్తించి గర్గుడు నివేదించగా అపుడు హిమవంతుడు మనస్సులో చాల సంతసించెను (15). అపుడు ఆ హిమవంతుడు పర్వతులను, బ్రాహ్మణులను, మరియు ఇతరులను శివుని తీసుకొని వచ్చుట కొరకై ఆనందముతో పంపెను (16). ఆపర్వతులు మరియు బ్రాహ్మణులు మంగళ ద్రవ్యములన్నిటినీ చేతుల యందు పట్టుకొని ఉత్సాహముతో మహేశ్వరుడు నివసించిన స్ధానమునకు వెళ్లిరి(17). అపుడచట వాద్య ఘోష, విస్తారమగు వేదఘోష మరియు గీతములతో నృత్యములతో మహోత్సాహము వర్ధిల్లెను(18).

వాద్యముల శబ్దమును విని శంకరుని గణములు,దేవతలు ,ఋషులు అందరు ఒక్కసారిగా ఆనందముతో లేచి నిలబడిరి (19). ఆనందముతో నిండిన మనస్సు గల వారందరు వారిలో వారు ఇట్లు మాటలాడు కొనిరి. శివుని దోడ్కొని వెళ్లుటకై ఇచటకు పర్వతులు వచ్చు చున్నారు (20). పాణి గ్రహణ ముహూర్తము చాల తొందరగా ఆసన్నమైనది. మనందరికి మహాభాగ్యము సంపన్న మైనదని భావించుచున్నాము(21).మనము చాల ధన్యులము. సందేహము లేదు. ఏలయన,లోకములకు మంగళములను కలిగించే పార్వతీ పరమేశ్వరుల వివాహమును పరమానందముతో చూడబోయెదము(22).


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹




🌹 SRI SIVA MAHA PURANA - 532 🌹

✍️ J.L. SHASTRI
📚. Prasad Bharadwaj

🌴 Rudra-saṃhitā (3): Pārvatī-khaṇḍa - CHAPTER 47 🌴

🌻 The ceremonious entry of Śiva - 2 🌻


13. In the meantime Garga, a great expert in the science of astrology, spoke to Himavat, the lord of mountains.

Garga said:—

14. O Himavat, O lord, O father of Pārvatī, now fetch Śiva to your palace for the marriage rites.

Brahmā said:—

15. On realising that the auspicious time for the marriage rites had been intimated by Garga, the mountain rejoiced much.

16. With the desire to bring Śiva there, the mountain gladly sent mountains, brahmins and others.

17. The mountains and brahmins with auspicious holy objects in their hands jubilantly went to the place where lord Śiva stood.

18. Then the sound of the Vedic chants, musical instruments, songs and dances jubilantly arose there.

19. On hearing the loud sound of musical instruments trumpets etc. the attendants of Śiva simultaneously got up joyously along with the gods and sages.

20. With great joy m their minds they said to one another—“O here come the mountains to take Śiva over there!

21. The auspicious hour for marriage rites has come. We consider that our fortune is imminent.

22. Indeed we are highly blessed as to witness the marriage ceremony of Śiva and Pārvatī, highly portentous of the good fortune of all the worlds.”


Continues....

🌹🌹🌹🌹🌹


11 Mar 2022

గీతోపనిషత్తు -334


🌹. గీతోపనిషత్తు -334 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము - 28-1 📚


🍀 28-1. సన్యాస యోగము - సన్యాస యోగమనగా కర్మఫలములను సన్యసించుట, కర్మములను సన్యసించుట కాదు. కర్తవ్యకర్మలను నిర్వర్తించుచు అందుండి ఏర్పడు ఫలములను సన్యసింపవలెను. ఫలముల యందాసక్తితో కర్మము నిర్వర్తించువారు బద్దులగుచునే యుందురు. ఫలాసక్తి లేక నిత్యనైమిత్తిక కర్మలను నిర్వర్తించు చుండుటచే జీవుడు స్థితప్రజ్ఞు డగును. ఇదియే నిష్కామ కర్మయోగము లేక కర్మఫల సన్యాస యోగము. 🍀


28. శుభాశుభఫలై రేవం మోక్ష్యసే కర్మబంధనైః |
సన్న్యాసయోగయుక్తాత్మా విముక్తో మా ముపైష్యసి ||

🌻. తాత్పర్యము : పై విధముగ సర్వమును నాకు సమర్పణ చేసుకొనిన వానికి పాపపుణ్య ఫలముల బంధము విడువబడును. నాతో సమ్య జ్ఞాన యోగమున సమస్తము నుండి విముక్తి చెంది నన్ను పొందిన వాడగును.

🌻. వివరణము : ఈ శ్లోకమున ప్రధానముగ రెండు విషయములు భగవానుడు తెలియజేయు చున్నాడు.

1. సన్యాస యోగము. 2. కర్మబంధము నుండి విముక్తి.

సన్యాస యోగమనగా కర్మఫలములను సన్యసించుట, కర్మము లను సన్యసించుట కాదు. కర్తవ్యకర్మలను నిర్వర్తించుచు అందుండి ఏర్పడు ఫలములను సన్యసింపవలెను. ఫలముల యందాసక్తితో కర్మము నిర్వర్తించువారు బద్దులగుచునే యుందురు. కర్తవ్య కర్మలను నిర్వర్తింపకున్నచో కూడ బంధము లేర్పడును. నిర్వర్తించు నపుడు ఫలములందాసక్తి యున్నచో బంధము లుండును.

ఫలాసక్తి లేక నిత్యనైమిత్తిక కర్మలను నిర్వర్తించు చుండుటచే జీవుడు స్థితప్రజ్ఞు డగును. ఇదియే నిష్కామ కర్మయోగము లేక కర్మఫల సన్యాస యోగము. ఫలముల యందాసక్తి లేక చేయవలసిన పనియందే శ్రద్ధా భక్తులు గలవారు క్రమముగ ఫల సన్యాసమేగాక సంకల్ప సన్యాసము గూడ నిర్వర్తింతురు. స్వంత సంకల్పములు గలవానికి, వానిని సిద్ధింప చేసుకొన వలెనను ఆకాంక్ష యుండును. దాని వలన కర్మబంధ మేర్పడు చుండును.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


11 Mar 2022

11 - MARCH - 2022 శుక్రవారం MESSAGES

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam 11, శుక్రవారం, మార్చి 2022 భృగు వాసరే 🌹
2) 🌹. గీతోపనిషత్తు - రాజవిద్య రాజగుహ్య యోగము 28-1 - 334 - సన్యాస యోగము 🌹 
3) 🌹. శివ మహా పురాణము - 532 / Siva Maha Purana - 532 🌹
4)🌹. మాస్టర్ ఇ.కె సందేశాలు -162 🌹  
5) 🌹 ఓషో రోజువారీ ధ్యానములు - 151 / Osho Daily Meditations - 151 🌹
6) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 355-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 355-1 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శుభ శుక్రవారం మిత్రులందరికీ 🌹*
*భృగు వాసరే, 11, మార్చి 2022*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*

*🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు 🌻*

*🍀. శ్రీ మహాలక్ష్మి స్తోత్రం - 13 🍀*

25. ఏతచ్ఛ్రుత్వాఽగస్తివాక్యం హృష్యమాణా హరిప్రియా |
ఉవాచ మధురాం వాణీం తుష్టాహం తవ సర్వదా
26. యత్త్వయోక్తమిదం స్తోత్రం యః పఠిష్యతి మానవః |
శృణోతి చ మహాభాగః తస్యాహం వశవర్తినీ

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : వివేకం, సంకల్పం, బలం అనే మూడు శక్తులు కలిసి ఉంటే ఎంతటి పనులైనా సాధించ వచ్చు. సాఫల్యత తధ్యం. 🍀*

🌷🌷🌷🌷🌷

విక్రమ సంవత్సరం: 2078 ఆనంద
శఖ సంవత్సరం: 1943 ప్లవ,
ఉత్తరాయణం, శిశిర ఋతువు, 
ఫాల్గుణ మాసం
తిథి: శుక్ల-నవమి 32:09:29 వరకు
తదుపరి శుక్ల-దశమి
నక్షత్రం: మృగశిర 14:36:23 వరకు
తదుపరి ఆర్ద్ర
యోగం: ఆయుష్మాన్ 27:10:07 వరకు
తదుపరి సౌభాగ్య
కరణం: బాలవ 18:51:39 వరకు
వర్జ్యం: 24:01:36 - 25:49:20
దుర్ముహూర్తం: 08:50:55 - 09:38:45
మరియు 12:50:08 - 13:37:59
రాహు కాలం: 10:56:30 - 12:26:13
గుళిక కాలం: 07:57:05 - 09:26:48
యమ గండం: 15:25:38 - 16:55:21
అభిజిత్ ముహూర్తం: 12:03 - 12:49
అమృత కాలం: 04:40:32 - 06:28:48
మరియు 30:18:40 - 32:06:24
సూర్యోదయం: 06:27:23
సూర్యాస్తమయం: 18:25:04
చంద్రోదయం: 12:23:56
చంద్రాస్తమయం: 01:11:02
సూర్య సంచార రాశి: కుంభం
చంద్ర సంచార రాశి: జెమిని
మానస యోగం - కార్య లాభం 14:36:23
వరకు తదుపరి పద్మ యోగం
 - ఐశ్వర్య ప్రాప్తి 

🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam 
#PanchangDaily
#DailyTeluguCalender 
Join and Share 
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. గీతోపనిషత్తు -334 🌹*
*✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము - 28-1 📚*
 
*🍀 28-1. సన్యాస యోగము - సన్యాస యోగమనగా కర్మఫలములను సన్యసించుట, కర్మములను సన్యసించుట కాదు. కర్తవ్యకర్మలను నిర్వర్తించుచు అందుండి ఏర్పడు ఫలములను సన్యసింపవలెను. ఫలముల యందాసక్తితో కర్మము నిర్వర్తించువారు బద్దులగుచునే యుందురు. ఫలాసక్తి లేక నిత్యనైమిత్తిక కర్మలను నిర్వర్తించు చుండుటచే జీవుడు స్థితప్రజ్ఞు డగును. ఇదియే నిష్కామ కర్మయోగము లేక కర్మఫల సన్యాస యోగము. 🍀*

*28. శుభాశుభఫలై రేవం మోక్ష్యసే కర్మబంధనైః |*
*సన్న్యాసయోగయుక్తాత్మా విముక్తో మా ముపైష్యసి ||*

*🌻. తాత్పర్యము : పై విధముగ సర్వమును నాకు సమర్పణ చేసుకొనిన వానికి పాపపుణ్య ఫలముల బంధము విడువబడును. నాతో సమ్య జ్ఞాన యోగమున సమస్తము నుండి విముక్తి చెంది నన్ను పొందిన వాడగును.*

*🌻. వివరణము : ఈ శ్లోకమున ప్రధానముగ రెండు విషయములు భగవానుడు తెలియజేయు చున్నాడు.*
*1. సన్యాస యోగము. 2. కర్మబంధము నుండి విముక్తి.*

*సన్యాస యోగమనగా కర్మఫలములను సన్యసించుట, కర్మము లను సన్యసించుట కాదు. కర్తవ్యకర్మలను నిర్వర్తించుచు అందుండి ఏర్పడు ఫలములను సన్యసింపవలెను. ఫలముల యందాసక్తితో కర్మము నిర్వర్తించువారు బద్దులగుచునే యుందురు. కర్తవ్య కర్మలను నిర్వర్తింపకున్నచో కూడ బంధము లేర్పడును. నిర్వర్తించు నపుడు ఫలములందాసక్తి యున్నచో బంధము లుండును.*

*ఫలాసక్తి లేక నిత్యనైమిత్తిక కర్మలను నిర్వర్తించు చుండుటచే జీవుడు స్థితప్రజ్ఞు డగును. ఇదియే నిష్కామ కర్మయోగము లేక కర్మఫల సన్యాస యోగము. ఫలముల యందాసక్తి లేక చేయవలసిన పనియందే శ్రద్ధా భక్తులు గలవారు క్రమముగ ఫల సన్యాసమేగాక సంకల్ప సన్యాసము గూడ నిర్వర్తింతురు. స్వంత సంకల్పములు గలవానికి, వానిని సిద్ధింప చేసుకొన వలెనను ఆకాంక్ష యుండును. దాని వలన కర్మబంధ మేర్పడు చుండును.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
#గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 532 / Sri Siva Maha Purana - 532 🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴* 
అధ్యాయము - 47

*🌻.శివుని అంతఃపుర ప్రవేశము - 2 🌻*

 ఇంతలో జ్యోతిశ్శాస్త్ర పండితుడగు గర్గుడు పర్వతరాజగు హిమవంతుని వద్దకు వచ్చి ఇట్లనెను (13).

ఓ పర్వత రాజా! హిమాలయా! స్వామీ! ప్రభూ! కాళీపతియగు శంభుని పాణి గ్రహణము కొరకు నీ మందిరమునకు దోడ్కొని రమ్ము(14).

బ్రహ్మ ఇట్లు పనికెను-

కన్యా దానమునకు సమయ మాసన్నమైనది గుర్తించి గర్గుడు నివేదించగా అపుడు హిమవంతుడు మనస్సులో చాల సంతసించెను (15). అపుడు ఆ హిమవంతుడు పర్వతులను, బ్రాహ్మణులను, మరియు ఇతరులను శివుని తీసుకొని వచ్చుట కొరకై ఆనందముతో పంపెను (16). ఆపర్వతులు మరియు బ్రాహ్మణులు మంగళ ద్రవ్యములన్నిటినీ చేతుల యందు పట్టుకొని ఉత్సాహముతో మహేశ్వరుడు నివసించిన స్ధానమునకు వెళ్లిరి(17). అపుడచట వాద్య ఘోష, విస్తారమగు వేదఘోష మరియు గీతములతో నృత్యములతో మహోత్సాహము వర్ధిల్లెను(18).

వాద్యముల శబ్దమును విని శంకరుని గణములు,దేవతలు ,ఋషులు అందరు ఒక్కసారిగా ఆనందముతో లేచి నిలబడిరి (19). ఆనందముతో నిండిన మనస్సు గల వారందరు వారిలో వారు ఇట్లు మాటలాడు కొనిరి. శివుని దోడ్కొని వెళ్లుటకై ఇచటకు పర్వతులు వచ్చు చున్నారు (20). పాణి గ్రహణ ముహూర్తము చాల తొందరగా ఆసన్నమైనది. మనందరికి మహాభాగ్యము సంపన్న మైనదని భావించుచున్నాము(21).మనము చాల ధన్యులము. సందేహము లేదు. ఏలయన,లోకములకు మంగళములను కలిగించే పార్వతీ పరమేశ్వరుల వివాహమును పరమానందముతో చూడబోయెదము(22).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 SRI SIVA MAHA PURANA - 532 🌹*
*✍️ J.L. SHASTRI*
*📚. Prasad Bharadwaj *

*🌴 Rudra-saṃhitā (3): Pārvatī-khaṇḍa - CHAPTER 47 🌴*

*🌻 The ceremonious entry of Śiva - 2 🌻*

13. In the meantime Garga, a great expert in the science of astrology, spoke to Himavat, the lord of mountains.
Garga said:—

14. O Himavat, O lord, O father of Pārvatī, now fetch Śiva to your palace for the marriage rites.
Brahmā said:—

15. On realising that the auspicious time for the marriage rites had been intimated by Garga, the mountain rejoiced much.

16. With the desire to bring Śiva there, the mountain gladly sent mountains, brahmins and others.

17. The mountains and brahmins with auspicious holy objects in their hands jubilantly went to the place where lord Śiva stood.

18. Then the sound of the Vedic chants, musical instruments, songs and dances jubilantly arose there.

19. On hearing the loud sound of musical instruments trumpets etc. the attendants of Śiva simultaneously got up joyously along with the gods and sages.

20. With great joy m their minds they said to one another—“O here come the mountains to take Śiva over there!

21. The auspicious hour for marriage rites has come. We consider that our fortune is imminent.

22. Indeed we are highly blessed as to witness the marriage ceremony of Śiva and Pārvatī, highly portentous of the good fortune of all the worlds.”

Continues....
🌹🌹🌹🌹🌹
#శివమహాపురాణము
#SivaMahaPuranam #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://facebook.com/groups/hindupuranas/
https://facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 162 🌹*
*✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు*
*📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ*

*🌻. విషువత్ - 2 🌻*

*సంవత్సరాదిని నిర్ణయించుటకు వేదఋషులు ఒక పుల్లను పాతి దాని నీడను కొలిచి ఈ దినమును స్థాపించెడి వారు. ఈ బిందువు నుండి సమస్త ఖగోళ గణితములను లెక్కించెడివారు. ఈ బిందువు ప్రతి సంవత్సరము భూమధ్యరేఖపై కొంచెము వెనుకకు నడుచు చుండును. ఈ నడచుటనే "గవామయము" అను యజ్ఞముగా వేద ఋషులు గుర్తించిరి. ఈ బిందువుతోపాటు సంవత్సరాది కూడ వెనుకకు నడచు చుండును. దీనినే కాలస్వరూపుడగు శంకరుడు మృగరూపమైన యజ్ఞమును వేటాడుటగా కవులు వర్ణించిరి.*

*'నల్లలేడి యందు దృష్టి నిలిపి వింటియందెక్కు పెట్టిన బాణమును చూచుకొనుచున్న నీవు మృగము వెంట పరుగెత్తుచున్న పినాకపాణి వలె నున్నావు.' అని కాళిదాస కృతమగు శాకుంతల నాటకమున మాతలి దుష్యంతుని ప్రశంసించును. నాటకము మొత్తము నందును చాంద్ర సంవత్సరము యొక్క కథ అంతర్వాహినిగా నడచును. కనుకనే దుష్యంతుడు చాంద్రవంశపు రాజుగా చమత్కరింపబడెను.*

*ఈ బిందువునకై భూమధ్యరేఖ ఖండింపబడుటకు కావలసిన సూర్యగతి‌ ధ్రువుని కాలముననే పుట్టినది.*

....✍🏼 *మాస్టర్ ఇ.కె.*🌻
🌹 🌹 🌹 🌹 🌹
#మాస్టర్‌ఇకెసందేశములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌷. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు 🌷 
www.facebook.com/groups/masterek/
https://t.me/ChaitanyaVijnanam
 www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 151 / Osho Daily Meditations - 151 🌹*
*📚. ప్రసాద్ భరద్వాజ్*

*🍀 151. విమర్శ 🍀*

*🕉. మీరు దేనినైనా విమర్శించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు, దానికి సానుకూల ప్రత్యామ్నాయంగా మీరు ఏమి ఇవ్వబోతున్నారో మొదట నిర్ణయించుకోండి. 🕉*
 
*మీ విమర్శకు ప్రత్యామ్నాయం గురించి మీరు ఆలోచించ లేకపోతే, వేచి ఉండండి. విమర్శలు చేయవద్దు, ఎందుకంటే అది వ్యర్థం. సరైన ఔషధం ఎక్కడ ఉంది అని చెప్పకుండా ఈ ఔషధం సరైనది కాదని మీరు చెబితే, మీరు చెప్పింది నిజమే అయినా అది సరైనదిగా మారదు. విమర్శలు ఎప్పుడూ విప్లవాన్ని కలిగించవు. సానుకూల కార్యక్రమంలో భాగంగా మాత్రమే విమర్శలు బాగుంటాయి.*

*కాబట్టి మొదట సానుకూల కార్యక్రమం గురించి నిర్ణయించుకోండి, ఆపై, ఆ కార్యక్రమంపై నిఘా ఉంచండి, అప్పుడు విమర్శించండి. అప్పుడు మీ విమర్శ, మీరు విమర్శించే వారిచే చాలా విలువైనది అని ప్రశంసించ బడుతుంది. దీనివల్ల ఎవరూ బాధపడరు. ఎందుకంటే మీరు విమర్శిస్తున్నప్పుడు, మీరు నిరంతరం కొంత సానుకూల ప్రత్యామ్నాయాన్ని దృష్టిలో ఉంచుకుని, ఆపై ఏదో ప్రతిపాదిస్తున్నారు కనుక.*
  
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Osho Daily Meditations - 151 🌹*
*📚. Prasad Bharadwaj*

*🍀 151. CRITICISM 🍀*

*🕉 Whenever you are ready to criticize something, first decide what you are going to give as a positive alternative to it. 🕉*
 
*If you can't think of an alternative to your criticism, wait. Don't make the criticism, because it is futile. If you say that this medicine is not right, maybe you are right, but then where is the right medicine? Criticism never brings revolution. Criticism is good as part of a positive program.*

*So first decide about the positive program and then, keeping an eye on the positive program, criticize. Then your criticism will be very valuable, appreciated even, by those whom you are criticizing. Nobody will feel offended by it, because while you are criticizing, you are continuously keeping some positive alternative in mind and then proposing something.*
  
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోరోజువారీధ్యానములు
#OshoDailyMeditations
#ఓషోబోధనలు #OshoDiscourse 
#ఓషోనిర్మలధ్యానములు #PrasadBhardwaj 
https://t.me/ChaitanyaVijnanam
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 355-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 355-1 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*మూల మంత్రము :*
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀 78. భక్తిమత్-కల్పలతికా, పశుపాశ విమోచనీ ।*
*సంహృతాశేష పాషండా, సదాచార ప్రవర్తికా ॥ 78 ॥ 🍀*

*🌻 355-1. 'సంహృతాశేష పాషండా' 🌻* 

*శేషము లేకుండ పాషండులను నశింప జేయునది శ్రీమాత అని అర్థము. పాషండత్వము కరడుగట్టిన అజ్ఞానము. ఇట్టి వారికి జ్ఞానము బోధించిననూ రుచింపదు. వీరు జ్ఞానమునం దరుచి, అజ్ఞానము నందు రుచి కలిగియుందురు. ధర్మము, శాస్త్రము, సదాచారము వంటి విషయముల యందు ఏవగింపు కలిగి యుందురు. కేవలము ఆహార నిద్రా మైథునాదులలో మునిగి యుందురు. వాని విషయమున కూడ అశుచి మెండుగ నుండును. చేయకూడని పనులయందు ఆసక్తి మెండుగ నుండును. వితండ వాదములు చేయుచు పెద్దలను అవమానించుచు వికృతముగ ప్రవర్తించు చుందురు.*

*ప్రస్తుతము భరత ప్రజలను కలిధర్మము ఆక్రమించి యున్నది. రహదారులలోను, వాక్కుల యందు, విద్యాలయముల యందు కూడ యువతీ యువకులు స్వేచ్ఛ పేరున చాలా వికృతముగ ప్రవర్తించు చున్నారు. సిగ్గు, ల లేక సదాచారమును వర్ణించి అడ్డగోలుగ ప్రవర్తించు చున్నారు. ఇది అంతయూ పాషండ తత్వమే.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 355-1 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️. Acharya Ravi Sarma *
*📚. Prasad Bharadwaj*

*🌻 78. Bhaktimatkalpalatika pashupasha vimochani*
*Sanhruta sheshapashanda sadachara pravartika ॥ 78 ॥ 🌻*

*🌻 355-1. Saṃhṛtāśeṣa-pāṣaṇḍā संहृताशेष-पाषण्डा 🌻*

*She is referred in this nāma as the destroyer of heretics. Heretics are those who do not follow the principles laid down by Veda-s. Fourteen places (which include the four Veda-s and their extensions are referred to as the principle domains of dharma.*

*Those men who cross the boundaries of the principles of dharma are called pāṣaṇḍa or heresy. She destroys all those who act against the principles of Veda-s.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#శ్రీలలితాసహస్రనామచైతన్యవిజ్ఞానము #SriLalithaChaitanyaVijnanam #లలితాసహస్రనామములు #LalithaSahasranama
#PrasadBhardwaj 
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://www.facebook.com/103080154909766/
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹