శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 355-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 355-1
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 355-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 355-1 🌹
🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 78. భక్తిమత్-కల్పలతికా, పశుపాశ విమోచనీ ।
సంహృతాశేష పాషండా, సదాచార ప్రవర్తికా ॥ 78 ॥ 🍀
🌻 355-1. 'సంహృతాశేష పాషండా' 🌻
శేషము లేకుండ పాషండులను నశింప జేయునది శ్రీమాత అని అర్థము. పాషండత్వము కరడుగట్టిన అజ్ఞానము. ఇట్టి వారికి జ్ఞానము బోధించిననూ రుచింపదు. వీరు జ్ఞానమునం దరుచి, అజ్ఞానము నందు రుచి కలిగియుందురు. ధర్మము, శాస్త్రము, సదాచారము వంటి విషయముల యందు ఏవగింపు కలిగి యుందురు. కేవలము ఆహార నిద్రా మైథునాదులలో మునిగి యుందురు. వాని విషయమున కూడ అశుచి మెండుగ నుండును. చేయకూడని పనులయందు ఆసక్తి మెండుగ నుండును. వితండ వాదములు చేయుచు పెద్దలను అవమానించుచు వికృతముగ ప్రవర్తించు చుందురు.
ప్రస్తుతము భరత ప్రజలను కలిధర్మము ఆక్రమించి యున్నది. రహదారులలోను, వాక్కుల యందు, విద్యాలయముల యందు కూడ యువతీ యువకులు స్వేచ్ఛ పేరున చాలా వికృతముగ ప్రవర్తించు చున్నారు. సిగ్గు, ల లేక సదాచారమును వర్ణించి అడ్డగోలుగ ప్రవర్తించు చున్నారు. ఇది అంతయూ పాషండ తత్వమే.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 355-1 🌹
Contemplation of 1000 Names of Sri Lalitha Devi
✍️. Acharya Ravi Sarma
📚. Prasad Bharadwaj
🌻 78. Bhaktimatkalpalatika pashupasha vimochani
Sanhruta sheshapashanda sadachara pravartika ॥ 78 ॥ 🌻
🌻 355-1. Saṃhṛtāśeṣa-pāṣaṇḍā संहृताशेष-पाषण्डा 🌻
She is referred in this nāma as the destroyer of heretics. Heretics are those who do not follow the principles laid down by Veda-s. Fourteen places (which include the four Veda-s and their extensions are referred to as the principle domains of dharma.
Those men who cross the boundaries of the principles of dharma are called pāṣaṇḍa or heresy. She destroys all those who act against the principles of Veda-s.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
11 Mar 2022
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment