🍀🌹 24, JULY 2024 WEDNESDAY ALL MESSAGES బుధవారం, సౌమ్య వాసర సందేశాలు🌹🍀1) 🌹. శ్రీమద్భగవద్గీత - 555 / Bhagavad-Gita - 555 🌹
🌴. 15వ అధ్యాయము - పురుషోత్తమ యోగము - 04 / Chapter 15 - Purushothama Yoga - 04 🌴
3) 🌹 సిద్దేశ్వరయానం - 108 🌹
🏵 యోగులు - సూక్ష్మశరీరులు - 4 🏵
4) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 552 - 4 / Sri Lalitha Chaitanya Vijnanam - 552 - 4 🌹
🌻 552. 'సర్వమృత్యు నివారిణీ' - 4 / 552. 'Sarvamrutyu Nivarini' - 4 🌻
5) 🌹🎥 ఆత్మ ప్రయాణం - దాని లోతు మరియు అర్థాన్ని అన్వేషించడం 🎥🌹
6) 🌹 आत्मा शाश्वत और पवित्र है 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹🎥 ఆత్మ ప్రయాణం - దాని లోతు మరియు అర్థాన్ని అన్వేషించడం 🎥🌹*
*ప్రసాద్ భరధ్వాజ*
*ఆత్మ ప్రయాణం: దాని లోతు మరియు అర్థాన్ని అన్వేషించడం యొక్క లోతైన అర్థాలను కనుగొనండి. ఈ వీడియో ఆత్మ ప్రయాణంలో ఉన్న ఆధ్యాత్మిక పెరుగుదల, స్వీయ-ఆవిష్కరణ మరియు విశ్వంతో లోతైన సంబంధాన్ని అన్వేషిస్తుంది. ఉద్దేశ్యం మరియు విధిని కనుగొనడానికి ప్రస్థానం, పరిణామం యొక్క పరివర్తన ప్రక్రియ, ఐక్యత మరియు పరస్పర అనుసంధానాన్ని గుర్తించడం, మరియు హీలింగ్ మరియు ఇంటిగ్రేషన్ యొక్క ప్రాముఖ్యత గురించి నేర్చుకోండి. మార్గాన్ని మార్గనిర్దేశం చేసే రహస్యాలు మరియు విశ్వాసాన్ని స్వీకరించండి, సేవ మరియు సహకారం యొక్క పాత్రను అర్థం చేసుకోండి, మరియు ఈ జీవితకాల ప్రయాణాన్ని నిర్వచించే నిరంతర ఎదుగుదలను గ్రహించండి.*
*రోజువారీ అభ్యాసాలు, జ్ఞానాన్ని వెతకడం, సవాళ్లను స్వీకరించడం, సంఘంతో అనుసంధానం మరియు మీ అంతర్ దృష్టిని విశ్వసించడం ద్వారా మీ ఆధ్యాత్మిక మార్గాన్ని మెరుగుపరచడానికి ఆచరణాత్మక దశలను పొందండి. స్వీయ-అవగాహన, ఆధ్యాత్మిక పరిణామం మరియు ప్రపంచపు విజయాలను అధిగమించే ఉద్దేశ్యాన్ని అనుభవించడానికి ఈ అన్వేషణలో మాతో చేరండి.*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 आत्मा शाश्वत और पवित्र है 🌹*
*इस वीडियो में हम आत्मा की शाश्वतता और पवित्रता के बारे में जानेंगे। आत्मा हमारे भीतर का शुद्ध प्रकाश है, जो हमें हमारे वास्तविक स्वयं से जोड़ती है। ध्यान, प्रार्थना और मौन के माध्यम से इस शाश्वत आत्मा के निकट पहुँचें। आत्मा का प्रकाश हमारा मार्गदर्शन करता है और हमें शांति और प्रेम से भर देता है।*
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
The Soul's Journey: Exploring Its Depth and Meaning
*🌹📽ChaitanyaVijnanam Channel 📽🌹*
*Like, Subscribe and Share 👀*
*Embark on "The Soul's Journey: Exploring Its Depth and Meaning" and delve into the profound aspects of spiritual growth, self-discovery, and universal connection. This video covers key elements such as discovering purpose and destiny, undergoing evolution and transformation, recognizing unity and interconnectedness, and embracing healing and integration. Learn about the mysteries and faith involved in the soul's journey, the importance of service and contribution, and the continuous growth that defines this lifelong process.*
*Discover practical steps to enhance your spiritual journey through daily practices, seeking wisdom, embracing challenges, connecting with community, and trusting your intuition. Join us in this exploration for a deeper understanding of self-awareness, spiritual evolution, and a fulfilling sense of purpose.*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీమద్భగవద్గీత - 555 / Bhagavad-Gita - 555 🌹*
*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్* భరద్వాజ
*🌴. 15వ అధ్యాయము - పురుషోత్తమ యోగము - 04 🌴*
*04. తత: పదం తత్పరిమార్గతవ్యం యస్మిన్ గతా న నివర్తన్తి భూయ: |*
*తమేవ చాద్యం పురుషం ప్రపద్యే యత: ప్రవృత్తి: ప్రసృతా పురాణీ ||*
*🌷. తాత్పర్యం : ఆ పిదప పునరావృత్తి రహితమైన దివ్యపదమును పొందుటకు ప్రయత్నించి, అనాదికాలము నుండి ఎవ్వని వలన సమస్తము ఆరంభమయ్యెనో మరియు వ్యాప్తినొందెనో అట్టి పరమపురుషుని అచ్చట శరణు పొందవలెను.*
*🌷. భాష్యము : చివరకు బ్రహ్మదేవునికి ఆదియైన శ్రీకృష్ణుని చేరిన పిమ్మట పరిశోధన పరిసమాప్తి చెందును. ఈ సంసారవృక్షపు అట్టి మూలమును (పూర్ణపురుషోత్తముడగు భగవానుని) దేవదేవుని గూర్చిన సంపూర్ణజ్ఞానము కలవారి సాంగత్యమున ప్రతియొక్కరు పరిశోధింప వలెను.*
*అట్టి అవగాహనచే మనుజుడు క్రమముగా యథార్థము యొక్క మిథ్యాప్రతిబింబము నుండి అసంగుడై, జ్ఞానముచే దానితో బంధమును ఛేదించి యథార్థవృక్షమునందు నిజాముగా ప్రతిష్టితుడగును.*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Bhagavad-Gita as It is - 555 🌹*
*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*
*🌴 Chapter 15 - Purushothama Yoga - 04 🌴*
*04. tataḥ padaṁ tat parimārgitavyaṁ yasmin gatā na nivartanti bhūyaḥ*
*tam eva cādyaṁ puruṣaṁ prapadye yataḥ pravṛttiḥ prasṛtā purāṇī*
*🌷 Translation : But with determination one must cut down this strongly rooted tree with the weapon of detachment. Thereafter, one must seek that place from which, having gone, one never returns, and there surrender to that Supreme Personality of Godhead from whom everything began and from whom everything has extended since time immemorial.*
*🌹 Purport : By searching in this way, one comes to Brahmā, who is generated by the Garbhodaka-śāyī Viṣṇu. Finally, in this way, when one reaches the Supreme Personality of Godhead, that is the end of research work. One has to search out that origin of this tree, the Supreme Personality of Godhead, through the association of persons who are in knowledge of that Supreme Personality of Godhead.*
*Then by understanding one becomes gradually detached from this false reflection of reality, and by knowledge one can cut off the connection and actually become situated in the real tree.*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 సిద్దేశ్వరయానం - 108 🌹*
*💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐*
*🏵 యోగులు - సూక్ష్మశరీరులు - 4 🏵*
*ఢిల్లీలోని కల్కాజీ గుడి బహాయ్ మార్గీయుల లోటస్ టెంపులుకు దగ్గరగా ఉంది. ఆ కాళీ దేవి ఎంతో శక్తిగల దేవత. ఆమె తను అనుగ్రహాన్ని, దర్శనాన్ని ఎంతో వాత్సల్యంతో ప్రసాదించింది. కలకత్తాలోని ప్రాచీన కాళీదేవత నిత్యబలులతో రక్తపు మడుగుల మధ్య తీవ్రరూపిణిగా అలరారుతూ ఉంటే రామకృష్ణుడు పూజించిన దక్షిణేశ్వర కాళి ప్రసన్నశాంతరూపంగా భాసించింది. అర్చన పద్ధతులలో ఉండే తేడా అక్కడి చైతన్యమండలంలో స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. కాశీలో రామకృష్ణ పరమహంస సాధన చేసిన ఆశ్రమంలో కూడా కాళీదేవత ప్రసన్నమూర్తిగానే ఉన్నది.*
*సిద్ధపురుషుడై మూడు వందల సంవత్సరాలు జీవించిన కాళీ భక్తుడు త్రైలింగస్వామి దర్శనం కోసం వచ్చినప్పుడు పరమహంస ఉన్న ఇల్లు అది. కాశీలోని త్రైలింగస్వామి ఆశ్రమంతోను ఆ మహానీయునితోను ఉన్న అనుబంధం ఇటీవల కొన్ని గుర్తుకు వచ్చినవి. రెండు వందల సంవత్సరాల క్రింద ఆయన శిష్యులుగా ఉన్న ఇద్దరు ఈనాడు నాకు శిష్యులు కావటమే కాక త్రైలింగ స్వామి కూడా నా కాళీ విగ్రహాన్ని పూజించిన వారిలో ఒకరు కావటం, అలానే రామకృష్ణ పరమహంస కూడా ఆ విగ్రహాన్ని పూజించిన వారిలో ఉండడం ఇటీవల స్మృతి పథంలోకి జగన్మాత తీసుకొని వచ్చింది.*
*అమెరికాలో ఉద్యోగం చేస్తున్న ఒక తెలుగు దంపతుల కుమారుడు మంత్రసాధన యందు అభిరుచి కల్గి నా దగ్గరకు వచ్చాడు. కాళీసాధన చేయాలని తన ప్రబలమైన కాంక్షను వ్యక్తం చేయటంతో అతనికి మంత్రోపదేశం చేశాను. గుంటూరు లోను, కుర్తాళంలోను మా ఆశ్రమంలో తీవ్రంగా జపం చేశాడు. తనకు ధ్యానంలో కన్పించిన కాళీదేవి మూర్తులను అతడు చిత్రకారుడు కూడా కావడం వల్ల బొమ్మలు గీసి చూపించాడు. మంచి అనుభవాలు పొందుతున్నా డా యువకుడు. ఒక కార్తీకమాసంలో అండమాన్ దీవులలో దేవాలయ ప్రతిష్ఠల కోసం నేను వెళ్ళినపుడు స్వాతంత్య్ర సమరయోధుడు. 'సావర్కార్' ను ఉంచిన 'సెల్యులర్' జైలును చూచాను. దానిలో ఎందరో ఖైదీలను ఉంచిన గదులున్నాయి. ఒక గదిలో ఈ యువకుని పూర్వజన్మ స్వరూపం కన్పించింది. స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొని ద్వీపాంతర వాస శిక్ష విధించబడిన ఈ వ్యక్తి ఆనాడు ఔత్తరాహుడు. జైలులో ఉన్న రోజులలో కాళీ మంత్రసాధన చేసేవాడు. అది ఈనాడు మళ్ళీ అతడికి ప్రాప్తించింది.*
*కాశీలో శవశివకాళీ మందిరం ఒకటి విచిత్రమయినది. అక్కడ ప్రవేశించి దేవీ దర్శనం చేసుకోగానే ఒక శిష్యుడు "స్వామీజీ ! నూట యాభై సంవత్సరాల క్రింద మనం ఇక్కడ ఉన్నట్లు ఈ మందిరంలో తపస్సు చేసినట్లు నాకు కన్పిస్తున్నది" అన్నాడు నిజమే, అతని అనుభూతి సత్యమైనదే. కాళిదాస మహాకవి కర్పూరాది స్తోత్రంలో ఈ దేవత నిలా స్తుతించి తన భక్తిని చాటుకొన్నాడు.*
*శ్లో॥ గతాసూనాం బాహు ప్రకరకృతి కాంచీపరిలస న్నితంబాం దిగ్వస్త్రాం త్రిభువన విధాత్రీం త్రిణయనాం శ్మశానస్థే తల్పే శవహృది మహాకాల సురత
ప్రసక్తాం త్వాం ధ్యాయన్ జపతి జడచేతా అపి కవిః*
*శ్మశానంలో చితాశయ్య - దానిపై శవం శవం మీద మహాకాలునితోన్నది కాళి. ఆమె దిగంబర. నడుముచుట్టూ నరికిన చేతుల దండతో మూడు కన్నులతో మూడు లోకాలను శాసించే మహాశక్తి అటువంటి నిన్ను జపం చేస్తే ఓ మహాకాళీ ! జడుడు కూడా మహాకవి అవుతాడు.*
*కాళీదేవి కాళిదాసుకు కవిత్వము నిచ్చింది. తెనాలి రామకృష్ణునకు కూడ కవితాశక్తి నిచ్చింది. తెనాలి రామలింగేశ్వరాలయ ధ్వజ స్తంభం క్రింద దొరికిన కాళీ విగ్రహం దీనికి నిదర్శనంగా నిలిచి ఉంది.*
*( సశేషం )*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 552 - 4 / Sri Lalitha Chaitanya Vijnanam - 552 - 4 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*
*🍀 112. విమర్శరూపిణీ, విద్యా, వియదాది జగత్ప్రసూః ।*
*సర్వవ్యాధి ప్రశమనీ, సర్వమృత్యు నివారిణీ ॥ 112 ॥ 🍀*
*🌻 552. 'సర్వమృత్యు నివారిణీ' - 4 🌻*
*స్వచ్ఛందముగ దేహమును విడచుటకును, దేహమునందు వేదనలతో చచ్చుటకును అనుభవమున చాల వ్యత్యాస మున్నది. జ్ఞానము వలన దేహమును విడచుట తెలియును. అజ్ఞానము వలన దేహమున చచ్చుట తెలియును. నిజమునకు జీవుడు దేహధారియే గాని దేహము కాదు. దేహము ధరించి కర్తవ్యములను నిర్వర్తించి అటుపైన దేహమును విడచుట పెద్దలు చెప్పిన మార్గము. తాను దేహి యని, దేహము కాదని, దేహము తన వాహనము మాత్రమే అని అనుభవ పూర్వకముగా తెలియుటకు ఉపాయము లున్నవి. అందు శ్రీమాత ఆరాధనము అత్యుత్తమము.*
*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 552 - 4 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*
*✍️ Prasad Bharadwaj*
*🌻 112. Vimarsharupini vidya viyadadi jagatprasuh*
*sarvavyadhi prashamani sarvamrutyu nivarini ॥112 ॥ 🌻*
*🌻 552. 'Sarvamrutyu Nivarini' - 4 🌻*
*There is a great difference in experience between voluntarily detaching from the body and dying in agony in the body. By knowledge one knows how to separate the body. Ignorance leads to death in the body. In truth, jeeva is the one that wears the body but not the body himself. It is the way of the elders to wear the body and perform the duties and then leave the body. There are ways to know experientially that one is in the body and not the body itself, that the body is only one's vehicle. And the worship of Srimata is the best amongst those.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
#నిత్యసందేశములు #DailyMessages
Join and Share
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom YouTube FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
https://t.me/+9zDjTpPe_PQzMWVl
https://t.me/Sivasutras
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/bhagavadgeethaa/
https://t.me/AgniMahaPuranam
https://t.me/+LmH1GyjNXXlkNDRl
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages3
https://www.threads.net/@prasad.bharadwaj