గీతోపనిషత్తు -188

🌹. గీతోపనిషత్తు -188 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. 6వ అధ్యాయము - ఆత్మ సంయమ యోగము 📚

శ్లోకము 29

🍀 29. అనన్య స్థితి - ఆత్మతో యుక్తము చెందిన యోగి సర్వము నందును ఆత్మనే దర్శించును. సర్వభూతములను తన యందు దర్శించును. ఆత్మసంయమ యోగమున ఇది ఒక విభూతి. తా నాత్మనని ధ్యానించి దర్శించిన వాడు ప్రపంచము నందన్ని వస్తువుల యందును ఆత్మనే దర్శించును. తా నాత్మతో యోగము చెందియున్నాడు గనుక అన్ని జీవులు కూడ ఆత్మ స్వరూపమే అని తెలియును. ఆత్మ దర్శనునికి సమస్తము నందు తానే గోచరించి అనన్య స్థితి కలుగును. తన నిజస్థితి పూర్ణమగు అద్వైత స్థితి. అనన్య స్థితి. 🍀

సర్వభూతస్థ మాత్మానం సర్వభూతాని చాత్మని |
ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శనః || 29

ఆత్మతో యుక్తము చెందిన యోగి సర్వము నందును ఆత్మనే దర్శించును. సర్వభూతములను తన యందు దర్శించును. ఆత్మసంయమ యోగమున ఇది ఒక విభూతి. తా నాత్మనని ధ్యానించి దర్శించిన వాడు ప్రపంచము నందన్ని వస్తువుల యందును ఆత్మనే దర్శించును. తా నాత్మతో యోగము చెందియున్నాడు గనుక అన్ని జీవులు కూడ ఆత్మ స్వరూపమే అని తెలియును.

చూచువాని యందెల్ల ఆత్మ కనబడుటచే తననే వారియందు దర్శించు చుండును. అట్టి వానికి పరిసరములన్నియు అద్దపు గదివలె గోచరించును. అద్దపు గదిలో ప్రవేశించినవానికి ఎటు చూచినను తానే కనపడును గదా! అట్లే ఆత్మ దర్శనునికి సమస్తము నందు తానే గోచరించి అనన్య స్థితి కలుగును. అంతే గాక సర్వ భూతములు తన యందే ఉన్నట్లు కూడ గోచరించును.

తా నన్నిటి యందు ఉన్నట్లే, తనయందే అన్నియు ఉన్నవని తెలియును. ఇది అత్యుత్తమమగు విభూతి. గీతాచార్యుడగు కృష్ణుని స్థితి ఇదియే. ఇట్టి స్థితియే అర్జునునకు కూడ కలుగవలెనని ఆప్యాయముగ బోధించు చున్నాడు. పురాణ పురుషుడగు శ్రీ కృష్ణుడు మాత్రమే ఇట్టి బోధనను చేయగలవాడు. కనుకనే తరువాతి శ్లోకమున తన నిజస్థితిని వివరించు చున్నాడు. ఈ శ్లోకమందలి అనుభూతి పూర్ణమగు అద్వైత స్థితి. అనన్య స్థితి అని కూడ తెలియనగును.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

20 Apr 2021

శ్రీ లలితా సహస్ర నామములు - 65 / Sri Lalita Sahasranamavali - Meaning - 65

🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 65 / Sri Lalita Sahasranamavali - Meaning - 65 🌹

🌻. మంత్రము - అర్ధం 🌻

📚. ప్రసాద్ భరద్వాజ

🌻.65. భానుమండల మధ్యస్థా, భైరవీ, భగమాలినీ ।
పద్మాసనా, భగవతీ, పద్మనాభ సహోదరీ ॥ 65 ॥ 🍀

🍀 275. భానుమండల మధ్యస్థా -
సూర్య మండలములో కేంద్రము వద్ద ఉండునది.

🍀 276. భైరవీ -
భైరవీ స్వరూపిణి.

🍀 277. భగమాలినీ -
వెలుగుతూ గమనము చేయువారిచే హారముగా అగుపించునది.

🍀 278. పద్మాసనా -
పద్మమును నెలవుగా కలిగినది.

🍀 279. భగవతీ - 
భగశబ్ద స్వరూపిణి.

🍀 280. పద్మనాభ సహోదరీ -
విష్ణుమూర్తి యొక్క సహోదరి.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 65 🌹

📚. Prasad Bharadwaj

🌻 65. bhānumaṇḍala-madhyasthā bhairavī bhagamālinī |
padmāsanā bhagavatī padmanābha-sahodarī || 65 || 🌻

🌻 275 ) Bhanu mandala madhyastha -
She who is in the middle of the sun’s universe

🌻 276 ) Bhairavi -
She who is the consort of Bhairava

🌻 277 ) Bhaga malini -
She who is the goddess bhaga malini

🌻 278 ) Padmasana -
She who sits on a lotus

🌻 279 ) Bhagavathi -
She who is with all wealth and knowledge

🌻 280 ) Padmanabha sahodari -
She who is the sister of Vishnu.

Continues....

🌹 🌹 🌹 🌹 🌹

20 Apr 2021

భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 210

🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 210 🌹

✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. సమీక్ష - 8 🌻

(ఊ) ఆదిలో ఆత్మ, తన యందు ఎఱుక లేకుండెను. మధ్యలో జీవాత్మయై, దేహముల యందు ఎఱుక కల్గి వాటి తాదాత్మ్యమును పొంది, దేహములే తానని భావించెను. అంత్యములో తన యందు పూర్తి ఎఱుకను కలిగి, తానే పరమాత్మ అయ్యెను.

అనుభవ పూర్వకమైన యీ సత్యస్థితి, భూతలము మీద మానవ రూపములలో భగవంతుని నాలుగు వేర్వేరు దివ్య ఉన్నత స్థాయిలుగా వ్యక్తమగు చుండును.

1. మజ్‌ జూబియత్‌ | బ్రహ్మీభూతుడు (విదేహ ముక్తుడు) | సృష్టిలో కర్తవ్యము లేదు.

2. తురీయావస్థ | జీవన్ముక్తుడు (పరమ హంస) | లేదు

3. సులూకియత్‌ | సలీక్‌ | లేదు

4. కుతుబీయత్‌ | సద్గురువు | (దివ్యాధికారి)

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

20 Apr 2021

మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 16

🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 16 🌹

✍️. సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
సంకలనం : నారాయణ మంత్రిప్రగడ

📚. ప్రసాద్ భరద్వాజ

🌻. భాగవత రహస్య ప్రకాశము 🌻

"ఓం"అను అక్షరమును పై కుచ్చరించి వినుచుండవలెను. ఈ సాధనతో వాక్కు పరిశుద్ధ మగును. మనస్సు, ప్రాణము కలిసి యొకటియై వాక్కునందు ధారణ జరుగును.

దీనితో బాటు సత్యమునే పలుకుట, పెద్దలను భక్తితో వాగ్రూపమున గౌరవించుట, స్వధర్మమునందు మాత్రమే సంభాషణ చేయుట, అక్కరలేని విషయములు ప్రసంగింపకుండుట కూడ జోడించవలెను.

దానితో నరుడు భూమిపై తిరుగుచున్న విష్ణుమూర్తిగా వ్యవహరించును. జీవిత దినచర్యయే యజ్ఞ మగును.

🌹 🌹 🌹 🌹 🌹

20 Apr 2021

శ్రీ శివ మహా పురాణము - 388

🌹 . శ్రీ శివ మహా పురాణము - 388 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴

అధ్యాయము - 16

🌻. బ్రహ్మ దేవతల నోదార్చుట - 2 🌻

మాకు గతి నీవే . మా పాలకుడవు, తండ్రివి, రక్షకుడవు నీవే. మేమందరము తారకుడనే అగ్ని యందు మాడి దుఃఖితులమై యున్నాము.(17) మేము అతని యందు ప్రయోగించిన భయంకరమగు ఆయుధములన్నియూ, సన్నిపాతరోగికి ఈయబడిన గొప్ప శక్తి గల ఔషధముల వలె, నిర్వీర్యములుగా చేయబడినవి(18) విష్ణువు యొక్క సుదర్శన చక్రముపై మాకు జయించగలమనే ఆశ ఉండెడిది. కాని అది అతని కంఠమునందు పుష్పమాలవలె అలంకారమై, నిర్వీర్యమైనది(19).

బ్రహ్మ ఇట్లు పలికెను-

ఓ మహర్షీ !దేవతల ఈ వచనములను విని నేను దేవతలనందరినీ ఉద్దేశించి ఆ కాలమునకు తగిన విధముగా నిట్లు బదులిడితిని (20). తారకాసురుడు నా ఆజ్ఞచేతనే పెంచి పెద్ద చేయబడినాడు. ఓ దేవతలారా! నేను అతనిని సంహరించుట సరిగాదు(21). ఒక వ్యక్తి ని ఎవరు పెంచెదరో, వారే అతనిని సంహరించుట యోగ్యము కాదు. విషవృక్షమునైననూ పెంచిన వ్యక్తి తన చేతులతో నరికివేయుట తగదు(22) మీ కార్యమునంతనూ చక్క బెట్టుటకు తగిన వాడు శంకరుడు. కాని మీరు ప్రార్థించిననూ ఆయన స్వయముగా ఆ రాక్షసుని మట్టుబెట్టజాలడు(23)

తారకాసురుడు తాను ఆచరించు పాపముల చేతనే వినాశమును పొందగలడు. మీకు తెలియు విధముగా నేను ఉపదేశమును చేసెగను(24). నేను గాని, విష్ణువు గాని, శివుడు గాని, దేవతలలో ఇతరులెవ్వరైననూ గాని నా వరప్రభవముచే తారకుని వధింపజాలరు. నేను సత్యమును చెప్పుచున్నాను(25). ఓ దేవతలారా !శివుని వీర్యము వలన కుమారుడు జన్మించినచో, అతడు మాత్రమే తారకాసురుని సంహరించగలడు. ఇతరుడు ఎవ్వడూ అతనిని సంహరించజాలడు(26). ఓ దేవతోత్తములారా! నేను చెప్పబోవు ఉపాయమును మీరు ఆచరించుడు. ఆ ఉపాయము మహాదేవుని అనుగ్రముచే నిశ్చయముగా సిద్ధించగలదు.(27)

పూర్వము దక్షుని కుమారైగా జన్మించి దేహమును త్యజించిన సతీదేవియే మేనక గర్భమునందు జన్మించినది. ఈ వృత్తాంతము మీకు తెలిసినదే(28). ఆమెను శివుడు నిశ్చయముగా వివాహమాడు ఉపాయమును మీరు అనుష్ఠించుడు. ఓ దేవతలారా! (29). మేనక కుమారై యగు పార్వతి శివుని వీర్యమును తన గర్భమునందు ధరించు ఉపాయమును ప్రయత్న పూర్వకముగా చేయుడు (30) ఊర్ధ్వ రేతస్కుడగు శంభుని సంసారిగా చేయగల శక్తి ఆమెకు తక్క మరియొక స్త్రీకి ఏ విధముగనైననూ లేదు(31) సా సుతా గిరిరాజ్య సాంప్రతం ప్రౌఢ¸°వనా| తపస్యంతం హిమగిరౌ నిత్యం సంసేవతే హరమ్‌||32

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

20 Apr 2021

20-APRIL-2021 MESSAGES

1) 🌹. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 188🌹  
2) 🌹. శివ మహా పురాణము - 388🌹 
3) 🌹 Light On The Path - 137🌹
4)🌹. మాస్టర్ ఇ.కె సందేశాలు -16🌹  
5) 🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 210🌹
6) 🌹 Osho Daily Meditations - 5 🌹
7) 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 65 / Lalitha Sahasra Namavali - 65🌹 
8) 🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 65 / Sri Vishnu Sahasranama - 65🌹 

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. గీతోపనిషత్తు -188 🌹*
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*📚. 6వ అధ్యాయము - ఆత్మ సంయమ యోగము 📚*
శ్లోకము 29

*🍀 29. అనన్య స్థితి - ఆత్మతో యుక్తము చెందిన యోగి సర్వము నందును ఆత్మనే దర్శించును. సర్వభూతములను తన యందు దర్శించును. ఆత్మసంయమ యోగమున ఇది ఒక విభూతి. తా నాత్మనని ధ్యానించి దర్శించిన వాడు ప్రపంచము నందన్ని వస్తువుల యందును ఆత్మనే దర్శించును. తా నాత్మతో యోగము చెందియున్నాడు గనుక అన్ని జీవులు కూడ ఆత్మ స్వరూపమే అని తెలియును. ఆత్మ దర్శనునికి సమస్తము నందు తానే గోచరించి అనన్య స్థితి కలుగును. తన నిజస్థితి పూర్ణమగు అద్వైత స్థితి. అనన్య స్థితి. 🍀*

సర్వభూతస్థ మాత్మానం సర్వభూతాని చాత్మని |
ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శనః || 29

ఆత్మతో యుక్తము చెందిన యోగి సర్వము నందును ఆత్మనే దర్శించును. సర్వభూతములను తన యందు దర్శించును. ఆత్మసంయమ యోగమున ఇది ఒక విభూతి. తా నాత్మనని ధ్యానించి దర్శించిన వాడు ప్రపంచము నందన్ని వస్తువుల యందును ఆత్మనే దర్శించును. తా నాత్మతో యోగము చెందియున్నాడు గనుక అన్ని జీవులు కూడ ఆత్మ స్వరూపమే అని తెలియును. 

చూచువాని యందెల్ల ఆత్మ కనబడుటచే తననే వారియందు దర్శించు చుండును. అట్టి వానికి పరిసరములన్నియు అద్దపు గదివలె గోచరించును. అద్దపు గదిలో ప్రవేశించినవానికి ఎటు చూచినను తానే కనపడును గదా! అట్లే ఆత్మ దర్శనునికి సమస్తము నందు తానే గోచరించి అనన్య స్థితి కలుగును. అంతే గాక సర్వ భూతములు తన యందే ఉన్నట్లు కూడ గోచరించును. 

తా నన్నిటి యందు ఉన్నట్లే, తనయందే అన్నియు ఉన్నవని తెలియును. ఇది అత్యుత్తమమగు విభూతి. గీతాచార్యుడగు కృష్ణుని స్థితి ఇదియే. ఇట్టి స్థితియే అర్జునునకు కూడ కలుగవలెనని ఆప్యాయముగ బోధించు చున్నాడు. పురాణ పురుషుడగు శ్రీ కృష్ణుడు మాత్రమే ఇట్టి బోధనను చేయగలవాడు. కనుకనే తరువాతి శ్లోకమున తన నిజస్థితిని వివరించు చున్నాడు. ఈ శ్లోకమందలి అనుభూతి పూర్ణమగు అద్వైత స్థితి. అనన్య స్థితి అని కూడ తెలియనగును.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్
Join and Share 
🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 388🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴* 
అధ్యాయము - 16

*🌻. బ్రహ్మ దేవతల నోదార్చుట - 2 🌻*

మాకు గతి నీవే . మా పాలకుడవు, తండ్రివి, రక్షకుడవు నీవే. మేమందరము తారకుడనే అగ్ని యందు మాడి దుఃఖితులమై యున్నాము.(17) మేము అతని యందు ప్రయోగించిన భయంకరమగు ఆయుధములన్నియూ, సన్నిపాతరోగికి ఈయబడిన గొప్ప శక్తి గల ఔషధముల వలె, నిర్వీర్యములుగా చేయబడినవి(18) విష్ణువు యొక్క సుదర్శన చక్రముపై మాకు జయించగలమనే ఆశ ఉండెడిది. కాని అది అతని కంఠమునందు పుష్పమాలవలె అలంకారమై, నిర్వీర్యమైనది(19).

బ్రహ్మ ఇట్లు పలికెను-

ఓ మహర్షీ !దేవతల ఈ వచనములను విని నేను దేవతలనందరినీ ఉద్దేశించి ఆ కాలమునకు తగిన విధముగా నిట్లు బదులిడితిని (20). తారకాసురుడు నా ఆజ్ఞచేతనే పెంచి పెద్ద చేయబడినాడు. ఓ దేవతలారా! నేను అతనిని సంహరించుట సరిగాదు(21). ఒక వ్యక్తి ని ఎవరు పెంచెదరో, వారే అతనిని సంహరించుట యోగ్యము కాదు. విషవృక్షమునైననూ పెంచిన వ్యక్తి తన చేతులతో నరికివేయుట తగదు(22) మీ కార్యమునంతనూ చక్క బెట్టుటకు తగిన వాడు శంకరుడు. కాని మీరు ప్రార్థించిననూ ఆయన స్వయముగా ఆ రాక్షసుని మట్టుబెట్టజాలడు(23)

తారకాసురుడు తాను ఆచరించు పాపముల చేతనే వినాశమును పొందగలడు. మీకు తెలియు విధముగా నేను ఉపదేశమును చేసెగను(24). నేను గాని, విష్ణువు గాని, శివుడు గాని, దేవతలలో ఇతరులెవ్వరైననూ గాని నా వరప్రభవముచే తారకుని వధింపజాలరు. నేను సత్యమును చెప్పుచున్నాను(25). ఓ దేవతలారా !శివుని వీర్యము వలన కుమారుడు జన్మించినచో, అతడు మాత్రమే తారకాసురుని సంహరించగలడు. ఇతరుడు ఎవ్వడూ అతనిని సంహరించజాలడు(26). ఓ దేవతోత్తములారా! నేను చెప్పబోవు ఉపాయమును మీరు ఆచరించుడు. ఆ ఉపాయము మహాదేవుని అనుగ్రముచే నిశ్చయముగా సిద్ధించగలదు.(27)

పూర్వము దక్షుని కుమారైగా జన్మించి దేహమును త్యజించిన సతీదేవియే మేనక గర్భమునందు జన్మించినది. ఈ వృత్తాంతము మీకు తెలిసినదే(28). ఆమెను శివుడు నిశ్చయముగా వివాహమాడు ఉపాయమును మీరు అనుష్ఠించుడు. ఓ దేవతలారా! (29). మేనక కుమారై యగు పార్వతి శివుని వీర్యమును తన గర్భమునందు ధరించు ఉపాయమును ప్రయత్న పూర్వకముగా చేయుడు (30) ఊర్ధ్వ రేతస్కుడగు శంభుని సంసారిగా చేయగల శక్తి ఆమెకు తక్క మరియొక స్త్రీకి ఏ విధముగనైననూ లేదు(31) సా సుతా గిరిరాజ్య సాంప్రతం ప్రౌఢ¸°వనా| తపస్యంతం హిమగిరౌ నిత్యం సంసేవతే హరమ్‌||32

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #శివమహాపురాణము
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 LIGHT ON THE PATH - 137 🌹*
*🍀 For those WHO DESIRE TO ENTER WITHIN - For DISCIPLES 🍀*
✍️. ANNIE BESANT and LEADBEATER
📚. Prasad Bharadwaj

CHAPTER 11
*🌻 21. Look for the flower to bloom in the silence that follows the storm: not till then - 2 🌻*

518. The whole world is crying out, as it were, for that certainty about the higher things. So eager are the people that any charlatan who professes to have direct knowledge is at once assured of a following. Any teacher who is in earnest always draws people round him, because the religions of the world have failed sadly to give any real satisfaction. 

The weak point of most religious teaching in regard to all the subjects is that it does not explain; it simply lays down the law – perfectly good law – such as “Thou shalt not kill,” but it does not explain in detail why all these things are wrong. 

519. The first step towards gaining direct certainty about spiritual or super physical truth is that which is in effect - the first step in all occult progress - the dominating of the personality. When we have achieved that, peace comes at once, and we then find we have been living in the midst of an atmosphere of peace and did not know it; because we ourselves made a little storm around us for us the peace was not, even though some of our neighbours may have been living in it all the time.

When this soul faculty, this certainty, is attained, nothing ever seems the same again, because then we can no longer have any sense of hopelessness. That which we merely believe may fail us at a critical time, because the basis of belief which satisfies a man at one time does not always satisfy him at another, when perhaps he is under tremendous strain. But this certainty always satisfies. 

When once we have seen and known for ourselves, even though that sight and knowledge may fall away from us and we may no longer be able to cling to them, we can always say: “I have seen; I have known; just now I am not able to see or to know but I have seen, I have known,” and that certainty carries us through.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #LightonPath #Theosophy
Join and Share
Thosophical Teachings దివ్యజ్ఞాన సందేశములు
www.facebook.com/groups/theosophywisdom/
https://t.me/Seeds_Of_Consciousness

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 16 🌹*
✍️. సద్గురు ఇ. కృష్ణమాచార్యులు 
సంకలనం : నారాయణ మంత్రిప్రగడ
📚. ప్రసాద్ భరద్వాజ

 🌻. భాగవత రహస్య ప్రకాశము 🌻

"ఓం"అను అక్షరమును పై కుచ్చరించి వినుచుండవలెను. ఈ సాధనతో వాక్కు పరిశుద్ధ మగును. మనస్సు, ప్రాణము కలిసి యొకటియై వాక్కునందు ధారణ జరుగును. 

దీనితో బాటు సత్యమునే పలుకుట, పెద్దలను భక్తితో వాగ్రూపమున గౌరవించుట, స్వధర్మమునందు మాత్రమే సంభాషణ చేయుట, అక్కరలేని విషయములు ప్రసంగింపకుండుట కూడ జోడించవలెను. 

దానితో నరుడు భూమిపై తిరుగుచున్న విష్ణుమూర్తిగా వ్యవహరించును. జీవిత దినచర్యయే యజ్ఞ మగును.
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #మాస్టర్‌ఇకెసందేశములు
Join and Share
🌷. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు 🌷 
www.facebook.com/groups/masterek/
https://t.me/ChaitanyaVijnanam
 www.facebook.com/groups/chaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 210 🌹*
✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. సమీక్ష - 8 🌻*

(ఊ) ఆదిలో ఆత్మ, తన యందు ఎఱుక లేకుండెను. మధ్యలో జీవాత్మయై, దేహముల యందు ఎఱుక కల్గి వాటి తాదాత్మ్యమును పొంది, దేహములే తానని భావించెను. అంత్యములో తన యందు పూర్తి ఎఱుకను కలిగి, తానే పరమాత్మ అయ్యెను.

అనుభవ పూర్వకమైన యీ సత్యస్థితి, భూతలము మీద మానవ రూపములలో భగవంతుని నాలుగు వేర్వేరు దివ్య ఉన్నత స్థాయిలుగా వ్యక్తమగు చుండును.

1. మజ్‌ జూబియత్‌ | బ్రహ్మీభూతుడు (విదేహ ముక్తుడు) | సృష్టిలో కర్తవ్యము లేదు.
2. తురీయావస్థ | జీవన్ముక్తుడు (పరమ హంస) | లేదు
3. సులూకియత్‌ | సలీక్‌ | లేదు
4. కుతుబీయత్‌ | సద్గురువు | (దివ్యాధికారి)

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #భగవద్ధర్శిని #అవతారమెహర్
Join and share
🌹 Meher Baba అవతార్‌ మెహర్‌ బాబా 🌹
www.facebook.com/groups/avataarmeherbaba/
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 Osho Daily Meditations - 5 🌹*
📚. Prasad Bharadwaj

*🍀 RETROSPECTIVE WISDOM 🍀*

*🕉 The other is never responsible. Just watch. If you become wise in the moment, there will be no problem. But everybody becomes wise when the moment is gone. Retrospective wisdom is worthless. 🕉*

When you have fought and nagged and bitched and then you become wise and see that there was no point in it, it is too late. It is meaningless-you have already done the harm. This wisdom is just pseudo-wisdom. It gives you a feeling "as if" you have understood. That is a trick of the ego. 

This wisdom is not going to help. When you are doing the thing, at that very moment, simultaneously, the awareness should arise, and you should see that what you are doing is useless. If you can see it when it is there, then you cannot do it. One can never go against one's awareness, and if one goes against it, that awareness is not awareness. Something else is being mistaken for it.

So remember, the other is never responsible for anything. The problem is something boiling within you. And of course the one you love is closest. You cannot throw it on some stranger passing on the road, so the closest person becomes the place where you go on throwing and pouring your nonsense. But that has to be avoided, because love is very fragile. If you do it too much, if you overdo it, love can disappear.

The other is never responsible. Try to make this such a permanent state of awareness in you that whenever you start finding something wrong with the other, remember it. Catch yourself redhanded, and drop it then and there. And ask to be forgiven.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations
Join and Share 
🌹 ఓషో బోధనలు - Osho Teachings 🌹
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 65 / Sri Lalita Sahasranamavali - Meaning - 65 🌹*
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻.65. భానుమండల మధ్యస్థా, భైరవీ, భగమాలినీ ।*
*పద్మాసనా, భగవతీ, పద్మనాభ సహోదరీ ॥ 65 ॥ 🍀*

🍀 275. భానుమండల మధ్యస్థా - 
సూర్య మండలములో కేంద్రము వద్ద ఉండునది.

🍀 276. భైరవీ - 
భైరవీ స్వరూపిణి.

🍀 277. భగమాలినీ - 
వెలుగుతూ గమనము చేయువారిచే హారముగా అగుపించునది.

🍀 278. పద్మాసనా - 
పద్మమును నెలవుగా కలిగినది.

🍀 279. భగవతీ - భగశబ్ద స్వరూపిణి.

🍀 280. పద్మనాభ సహోదరీ - 
విష్ణుమూర్తి యొక్క సహోదరి.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 65 🌹*
📚. Prasad Bharadwaj 

*🌻 65. bhānumaṇḍala-madhyasthā bhairavī bhagamālinī |*
*padmāsanā bhagavatī padmanābha-sahodarī || 65 || 🌻*

🌻 275 ) Bhanu mandala madhyastha -   
She who is in the middle of the sun’s universe

🌻 276 ) Bhairavi -  
 She who is the consort of Bhairava

🌻 277 ) Bhaga malini -   
She who is the goddess bhaga malini

🌻 278 ) Padmasana -   
She who sits on a lotus

🌻 279 ) Bhagavathi -   
She who is with all wealth and knowledge

🌻 280 ) Padmanabha sahodari -   
She who is the sister of Vishnu.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #లలితాదేవి #LalithaDevi #లలితాసహస్రనామ #LalithaSahasranama
Join and Share 
🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 65 / Sri Vishnu Sahasra Namavali - 65 🌹*
*నామము - భావము*
📚. ప్రసాద్ భరద్వాజ 

*🌷. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 🌷*

*అనూరాధ నక్షత్ర ప్రధమ పాద శ్లోకం*

*🌻 65. శ్రీదః శ్రీశః శ్రీనివాసః శ్రీనిధిః శ్రీవిభావనః |*
*శ్రీధరః శ్రీకరః శ్రేయః శ్రీమా~ంల్లోకత్రయాశ్రయః ‖ 65 ‖ 🌻*

🍀 605) శ్రీ ద: - 
భక్తులకు సిరిని గ్రహించువాడు.

🍀 606) శ్రీ శ: - 
శ్రీ దేవికి నాథుడైనవాడు.

🍀 607) శ్రీనివాస: - 
ఆధ్యాత్మిక ఐశ్వర్యవంతులైనవారి హృదయముల యందు వసించువాడు.

🍀 608) శ్రీ నిధి: - 
ఐశ్వర్య నిధి.

🍀 609) శ్రీ విభావన: - 
సిరులను పంచువాడు.

🍀 610) శ్రీ ధర: - 
శ్రీదేవిని వక్షస్థలమున ధరించినవాడు.

🍀 611) శ్రీ కర: - 
శుభముల నొసగువాడు.

🍀 612) శ్రేయ: - 
మోక్ష స్వరూపుడు.

🍀 613) శ్రీమాన్ - 
సర్వ విధములైన ఐశ్వర్యములు గలవాడు.

🍀 614) లోకత్రయాశ్రయ: - 
ముల్లోకములకు ఆశ్రయమైనవాడు.

సశేషం.... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 Vishnu Sahasra Namavali - 65 🌹*
*Name - Meaning*
📚 Prasad Bharadwaj

*🌷 OM NARAYANAYA VIDMAHE VASUDEVAYA DHIMAHI । TANNO VISHNU PRACHODAYAT ॥ 🌷*

*Sloka for Anuradha 1st Padam*

*🌻 65. śrīdaḥ śrīśaḥ śrīnivāsaḥ śrīnidhiḥ śrīvibhāvanaḥ |
śrīdharaḥ śrīkaraḥ śreyaḥ śrīmān lōkatrayāśrayaḥ || 65 || 🌻*

🌻 605. Śrīdaḥ: 
One who bestows prosperity on devotees.

🌻 606. Śrīśaḥ: 
One who is Lord of the Goddess Shri.

🌻 607. Śrīnivāsaḥ: 
Shri here denotes men with Shri, that is, virtue and power. He who dwells in such men is Shrinivasa.

🌻 608. Śrīnidhiḥ: One who is the seat of all Shri, that is, virtues and powers.

🌻 609. Śrīvibhāvanaḥ: 
One who grants every form of prosperity and virtue according to their Karma.

🌻 610. Śrīdharaḥ: 
One who bears on His chest Shri who is the mother of all.

🌻 611. Śrīkaraḥ: 
One who makes devotees - those who praise, think about Him and worship Him- into virtuous and powerful beings.

🌻 612. Śreyaḥ: 
'Shreyas' means the attainment of what is un-decaying good and happiness. Such a state is the nature of the Lord.

🌻 613. Śrīmān: 
One in whom there are all forms of Shri that is power, virtue, beauty etc.

🌻 614. Lōkatrayāśrayaḥ: 
One who is the support of all the three worlds.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama
Join and Share
విష్ణు సహస్రనామ స్తోత్రము / Vishnu Sahasranama group. 
https://t.me/vishnusahasranaam
www.facebook.com/groups/vishnusahasranaam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹