శ్రీ శివ మహా పురాణము - 388


🌹 . శ్రీ శివ మహా పురాణము - 388 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴

అధ్యాయము - 16

🌻. బ్రహ్మ దేవతల నోదార్చుట - 2 🌻


మాకు గతి నీవే . మా పాలకుడవు, తండ్రివి, రక్షకుడవు నీవే. మేమందరము తారకుడనే అగ్ని యందు మాడి దుఃఖితులమై యున్నాము.(17) మేము అతని యందు ప్రయోగించిన భయంకరమగు ఆయుధములన్నియూ, సన్నిపాతరోగికి ఈయబడిన గొప్ప శక్తి గల ఔషధముల వలె, నిర్వీర్యములుగా చేయబడినవి(18) విష్ణువు యొక్క సుదర్శన చక్రముపై మాకు జయించగలమనే ఆశ ఉండెడిది. కాని అది అతని కంఠమునందు పుష్పమాలవలె అలంకారమై, నిర్వీర్యమైనది(19).

బ్రహ్మ ఇట్లు పలికెను-

ఓ మహర్షీ !దేవతల ఈ వచనములను విని నేను దేవతలనందరినీ ఉద్దేశించి ఆ కాలమునకు తగిన విధముగా నిట్లు బదులిడితిని (20). తారకాసురుడు నా ఆజ్ఞచేతనే పెంచి పెద్ద చేయబడినాడు. ఓ దేవతలారా! నేను అతనిని సంహరించుట సరిగాదు(21). ఒక వ్యక్తి ని ఎవరు పెంచెదరో, వారే అతనిని సంహరించుట యోగ్యము కాదు. విషవృక్షమునైననూ పెంచిన వ్యక్తి తన చేతులతో నరికివేయుట తగదు(22) మీ కార్యమునంతనూ చక్క బెట్టుటకు తగిన వాడు శంకరుడు. కాని మీరు ప్రార్థించిననూ ఆయన స్వయముగా ఆ రాక్షసుని మట్టుబెట్టజాలడు(23)

తారకాసురుడు తాను ఆచరించు పాపముల చేతనే వినాశమును పొందగలడు. మీకు తెలియు విధముగా నేను ఉపదేశమును చేసెగను(24). నేను గాని, విష్ణువు గాని, శివుడు గాని, దేవతలలో ఇతరులెవ్వరైననూ గాని నా వరప్రభవముచే తారకుని వధింపజాలరు. నేను సత్యమును చెప్పుచున్నాను(25). ఓ దేవతలారా !శివుని వీర్యము వలన కుమారుడు జన్మించినచో, అతడు మాత్రమే తారకాసురుని సంహరించగలడు. ఇతరుడు ఎవ్వడూ అతనిని సంహరించజాలడు(26). ఓ దేవతోత్తములారా! నేను చెప్పబోవు ఉపాయమును మీరు ఆచరించుడు. ఆ ఉపాయము మహాదేవుని అనుగ్రముచే నిశ్చయముగా సిద్ధించగలదు.(27)

పూర్వము దక్షుని కుమారైగా జన్మించి దేహమును త్యజించిన సతీదేవియే మేనక గర్భమునందు జన్మించినది. ఈ వృత్తాంతము మీకు తెలిసినదే(28). ఆమెను శివుడు నిశ్చయముగా వివాహమాడు ఉపాయమును మీరు అనుష్ఠించుడు. ఓ దేవతలారా! (29). మేనక కుమారై యగు పార్వతి శివుని వీర్యమును తన గర్భమునందు ధరించు ఉపాయమును ప్రయత్న పూర్వకముగా చేయుడు (30) ఊర్ధ్వ రేతస్కుడగు శంభుని సంసారిగా చేయగల శక్తి ఆమెకు తక్క మరియొక స్త్రీకి ఏ విధముగనైననూ లేదు(31) సా సుతా గిరిరాజ్య సాంప్రతం ప్రౌఢ¸°వనా| తపస్యంతం హిమగిరౌ నిత్యం సంసేవతే హరమ్‌||32


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


20 Apr 2021

No comments:

Post a Comment