శ్రీ లలితా సహస్ర నామములు - 78 / Sri Lalita Sahasranamavali - Meaning - 78

🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 78 / Sri Lalita Sahasranamavali - Meaning - 78 🌹

🌻. మంత్రము - అర్ధం 🌻

📚. ప్రసాద్ భరద్వాజ

🍀 78.భక్తిమత్-కల్పలతికా, పశుపాశ విమోచనీ ।
సంహృతాశేష పాషండా, సదాచార ప్రవర్తికా ॥ 78 ॥ 🍀

🍀 353. భక్తిమత్కల్పలతికా -
భక్తికలవారిపట్ల కల్పవృక్షపు తీగవంటిది.

🍀 354. పశుపాశ విమోచనీ -
వివిధ పాశములచే బంధింపబడువారిని బంధ విముక్తులను చేయునది.

🍀 355. సంహృతాశేషపాషండా -
సంహరింపబడిన సకలమైన పాషడులు కలది.

🍀 356. సదాచారప్రవర్తికా -
సంప్రదాయబద్దమైన, శ్రోత్రీయ మార్గము ననుసరించి యుండునట్లు ప్రవర్తింప చేయునది.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 78 🌹

📚. Prasad Bharadwaj

🌻 78. bhaktimat-kalpalatikā paśupāśa-vimocinī |
saṁhṛtāśeṣa-pāṣaṇḍā sadācāra-pravartikā || 78 || 🌻

🌻 353 ) Bhakthi mat kalpa lathika -
She who is the wish giving creeper Kalpaga

🌻 354 ) Pasu pasa vimochani -
She who removes shackles from the living

🌻 355 ) Samhrutha sesha pashanda -
She who destroys those people who have left their faith

🌻 356 ) Sadachara pravarthika -
She who makes things happen through good conduct.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

22 May 2021

Join and Share

🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹

https://t.me/srilalithachaitanyavijnanam

http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 29

🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 29 🌹

✍️. సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
సంకలనము : వేణుమాధవ్

📚. ప్రసాద్ భరద్వాజ

🌻. అభిప్రాయములు 🌻

ఇతరులను గూర్చి గాని, దేవుని గూర్చి కాని అభిప్రాయములు కలవారు తపస్సు చేసినను , భగవంతుడు లభ్యపడడు. వీనిని సమర్పణ చేసినవానికి భగవంతుడు సృష్టి రూపమున మొదట దర్శనమిచ్చును.

సృష్టిని గూడ వాని రూపముగా భావించిన వానికి , తన కర్తవ్యమును వానికి సమర్పణముగా సృష్టి జీవుల యెడల నెరవేర్చిన వానికి మాత్రమే భగవంతుడు దర్శనమిచ్చును.

భాగవతము 3-245

🌹 🌹 🌹 🌹 🌹

22 May 2021

శ్రీ శివ మహా పురాణము - 401

🌹 . శ్రీ శివ మహా పురాణము - 401🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴

అధ్యాయము - 20

🌻. బడబాగ్ని - 2 🌻

గొప్ప సామర్థ్యము గల ఈ మహేశ్వరుని క్రోధము మన్మథుని భస్మము చేసి, వెను వెంటనే సర్వమును తగులబెట్టుటకు తలపడగా, నేను బడబాగ్నిగా స్తంభింపజేసితిని (14). దుఃఖితులగు దేవతలు నన్ను శీఘ్రమే ప్రార్థించగా నేను సంకరుని ఇచ్ఛచే శీఘ్రముగా అచటికి వచ్చితిని. ఓ కుమారా! నేనా అగ్నిని స్తంభింపజేసితిని (15).

ఓ సముద్రమా! బడబారూపమును ధరించిన ఈ అగ్నిని తీసుకొని కరుణానిధియగు నేను ఇచటకు వచ్చి నిన్ను ఆదేశించుచుంటిని (16). ఈ మహేశ్వరుని క్రోధము బడబా రూపమును ధరించి నోటినుండి నిప్పులను గ్రక్కుచున్నది. ప్రలయకాలము వరకు నీవు దీనిని ధరించవలెను. (17) ఓ నదీ పతీ! నేను ఇచటకు వచ్చి ప్రలయములో నివసించగలను. అపుడు నీవు ఈ శంకరుని అద్భుతమగు క్రోధమును విడిచిపెట్టవచ్చును (18). ఈ అగ్నికి నీ జలము నిత్యము భోజనమగుచుండును. ఈ అగ్ని నీ గర్భములోనికి వెళ్లకుండునట్లు నీవు ప్రయత్న పూర్వకముగా ధరించి యుండుము (19).

బ్రహ్మ ఇట్లు పలికెను-

నేనిట్లు పలుకగా, అపుడా సముద్రుడు రుద్రుని కోపరూపమగు ఆ బడబాగ్నిని ధరించుటకు నిశ్చయముగా నంగీకరించెను. ఆ పనిని సముద్రుడు తక్క ఇతరులు చేయజాలరు (20). అపుడు జ్వాలలతో మండిపడుచున్న ఆ అగ్ని బడబా రూపముతో సముద్రములో ప్రవేశించి జలసమూహములను దహింపనారంభించెను (21). ఓ మహర్షీ! అపుడు సంతసముతో నిండిన మనస్సుగల వాడనై నేను నాలోకమునకు వెళ్లితిని. దివ్యరూపము గల సముద్రుడు నాకు ప్రణమిల్లి అంతర్దానము జెందెను (22). ఓ మహర్షీ! రుద్ర కోపాగ్ని వలన కలిగిన భయమునుండి జగత్తు సర్వము విముక్తిని పొందెను. దేవతలు మరియు ఋషులు స్వస్థులైరి (23).

శ్రీ శివ మహాపురాణములో రుద్ర సంహిత యందలి పార్వతీ ఖండములో బడబాగ్ని చరితమనే ఇరువదియవ అధ్యాయము ముగిసినది (20).

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

22 May 2021

గీతోపనిషత్తు -201

🌹. గీతోపనిషత్తు -201 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. 6వ అధ్యాయము - ఆత్మ సంయమ యోగము 📚

శ్లోకము 42

🍀 41. యోగిజన్మ - యోగాభ్యాసి యోగ విద్య యందు ప్రవేశించి శ్రద్ధతో యోగము చేయుచు, యోగసిద్ధి చెందకయే మరణించినచో అతని యోగాభ్యాస నాణ్యతను బట్టి యోగుల కుటుంబముననే జన్మించ గలడు. అచట దైవీ వాతావరణము సహజముగ నుండును. భక్తి జ్ఞానము లుండును. మానవజన్మ యోగుల కుటుంబమున జరిగి నచో అంతకన్న గొప్ప అవకాశము జీవునకు మరియొకటి లేదు. ముందు జన్మలు ఉత్తమముగ నుండ వలెనన్నచో, శుభ వాసనల నాశ్రయించుట కర్తవ్యమై నిలచును. అట్లే యోగుల కుటుంబములలో జన్మించుట కూడ పూర్వ వాసనలను బట్టి యుండును. 🍀

అథవా యోగినా మేవ కులే భవతి ధీమతామ్ |
ఏతద్ది దుర్లభతరం లోకే జన్మ యదీదృశమ్ || 42

యోగాభ్యాసి యోగ విద్య యందు ప్రవేశించి శ్రద్ధతో యోగము చేయుచు, యోగసిద్ధి చెందకయే మరణించినచో అతని యోగాభ్యాస నాణ్యతను బట్టి యోగుల కుటుంబముననే జన్మించ గలడు. యోగుల కుటుంబమున జన్మించుట, శ్రీమంతుల కుటుంబమున జన్మించుట కన్న శ్రేష్ఠమని తెలుపబడు చున్నది. యోగుల కుటుంబములో జన్మించినపుడు పూర్వ జన్మ వాసనల వలన చిన్నవయస్సుననే యోగమున ప్రవేశించుటకు అవకాశ మేర్పడును.

యోగుల కుటుంబమందు దైవీ వాతావరణము సహజముగ నుండును. భక్తి జ్ఞానము లుండును. చిల్లర విషయములు గూర్చి చర్చగాని, చేష్టగాని యుండదు. భారత భాగవత రామాయణాది సద్ధంథముల చర్చలు, యోగాభ్యాస పరమైన ప్రవర్తన యుండును.

యోగము కొనసాగుట కంతకన్న ఉత్తమమైన వాతావరణము ఏమి కావలయును? ప్రపంచమున అన్ని రకముల జన్మల కంటెను మానవ జన్మ ఒక అదృష్టము. అట్టి మానవజన్మ యోగుల కుటుంబమున జరిగి నచో అంతకన్న గొప్ప అవకాశము జీవునకు మరియొకటి లేదు. ధనికులు, అధిపతులు, రాజాధిరాజుల జన్మల కన్న యోగుల జన్మమే గొప్పది.

ఇంద్రుని జన్మ కన్న కూడ యోగిజన్మ గొప్పది. యోగులు ధీమంతులు. ఆత్మారాములు. నిష్కపటులు. వారు కేవలము ప్రపంచమునకు హితము చేయుటకే జన్మింతురు. అట్టి వారి కుటుంబములలో పుట్టుట మహాదుర్లభమైన విషయము.

వశిష్ఠ మహర్షి సాక్షాత్తు బ్రహ్మమే. అతని కుటుంబమున పుట్టిన శక్తి మహర్షి సూటిగ ధ్యానమందు నిలచి, బ్రహ్మమును చేరి బ్రహ్మమై యున్నాడు. అతని కుమారునిగ జన్మించిన పరాశర మహర్షి మహాయోగియై, జగద్గురువై, మైత్రేయాది జగద్గురువులకు కూడ గురుస్థానము నలంకరించినాడు. పరాశర మహర్షి కుమారుడు వేదవ్యాసుడు. తండ్రిని మించిన తనయుడు.

తండ్రి అందించిన యోగమును, ధ్యానమును సమస్తమును విపులీకరించి, వేదము లను నిర్వచించి, పురాణములను వర్గీకరించి, భారత భాగవతాది గ్రంథములు రచించి, కలియుగమందు మానవులు తరించుటకు మహత్తర కృషి గావించినాడు. అతని కుమారుడు శుకుడు చిన్నతనముననే బ్రహ్మత్వము సాధించినాడు.

యోగస్పర్శ గలవారే యోగుల కుటుంబమున జన్మింతురు. అట్లు జన్మించి యోగసిద్ధిని పొందుదురు. నిజమునకు జీవులు మరణ సమయమునకు ఏ యే వాసనలు కలిగియుందురో ఆయా వాసనల పరితృప్తికై తదనుగుణమైన వాతావరణమున మరల జన్మింతురు. అట్లే యోగవాసన ప్రబలముగ నుండగ మరణించినవారు యోగుల కుటుంబమున జన్మింతురు.

గుఱ్ఱమునకు గుఱ్ఱము, గాడిదకు గాడిద పుట్టుట ప్రకృతి విధానము. కాకికి కోకిల పుట్టదు. కోకిలకు కాకి పుట్టదు. శుభవాసనలు గలవారు శుభంకరమగు గృహములలో జన్మింతురు. అశుభ వాసనలు గలవారు అట్టి వాసనలు గల కుటుంబములలో జన్మింతురు. సామాన్యముగ శుభాశుభ మిశ్రమముగ వాసనలుండును.

కావున అట్టి కుటుంబములో జన్మించుట జరుగును. ముందు జన్మలు ఉత్తమముగ నుండ వలెనన్నచో, శుభ వాసనల నాశ్రయించుట కర్తవ్యమై నిలచును. అట్లే యోగుల కుటుంబములలో జన్మించుట కూడ పూర్వ వాసనలను బట్టి యుండును.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

22 May 2021

22-MAY-2021 MESSAGES

1) 🌹. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 201🌹  
2) 🌹. శివ మహా పురాణము - 401🌹 
3) 🌹 Light On The Path - 148🌹
4)🌹. మాస్టర్ ఇ.కె సందేశాలు -29🌹  
5) 🌹 Osho Daily Meditations - 18🌹
6) 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 78 / Lalitha Sahasra Namavali - 78🌹 
7) 🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 78 / Sri Vishnu Sahasranama - 78🌹 

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. గీతోపనిషత్తు -201 🌹*
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*📚. 6వ అధ్యాయము - ఆత్మ సంయమ యోగము 📚*
శ్లోకము 42

*🍀 41. యోగిజన్మ - యోగాభ్యాసి యోగ విద్య యందు ప్రవేశించి శ్రద్ధతో యోగము చేయుచు, యోగసిద్ధి చెందకయే మరణించినచో అతని యోగాభ్యాస నాణ్యతను బట్టి యోగుల కుటుంబముననే జన్మించ గలడు. అచట దైవీ వాతావరణము సహజముగ నుండును. భక్తి జ్ఞానము లుండును. మానవజన్మ యోగుల కుటుంబమున జరిగి నచో అంతకన్న గొప్ప అవకాశము జీవునకు మరియొకటి లేదు. ముందు జన్మలు ఉత్తమముగ నుండ వలెనన్నచో, శుభ వాసనల నాశ్రయించుట కర్తవ్యమై నిలచును. అట్లే యోగుల కుటుంబములలో జన్మించుట కూడ పూర్వ వాసనలను బట్టి యుండును. 🍀*

అథవా యోగినా మేవ కులే భవతి ధీమతామ్ |
ఏతద్ది దుర్లభతరం లోకే జన్మ యదీదృశమ్ || 42

యోగాభ్యాసి యోగ విద్య యందు ప్రవేశించి శ్రద్ధతో యోగము చేయుచు, యోగసిద్ధి చెందకయే మరణించినచో అతని యోగాభ్యాస నాణ్యతను బట్టి యోగుల కుటుంబముననే జన్మించ గలడు. యోగుల కుటుంబమున జన్మించుట, శ్రీమంతుల కుటుంబమున జన్మించుట కన్న శ్రేష్ఠమని తెలుపబడు చున్నది. యోగుల కుటుంబములో జన్మించినపుడు పూర్వ జన్మ వాసనల వలన చిన్నవయస్సుననే యోగమున ప్రవేశించుటకు అవకాశ మేర్పడును. 

యోగుల కుటుంబమందు దైవీ వాతావరణము సహజముగ నుండును. భక్తి జ్ఞానము లుండును. చిల్లర విషయములు గూర్చి చర్చగాని, చేష్టగాని యుండదు. భారత భాగవత రామాయణాది సద్ధంథముల చర్చలు, యోగాభ్యాస పరమైన ప్రవర్తన యుండును. 

యోగము కొనసాగుట కంతకన్న ఉత్తమమైన వాతావరణము ఏమి కావలయును? ప్రపంచమున అన్ని రకముల జన్మల కంటెను మానవ జన్మ ఒక అదృష్టము. అట్టి మానవజన్మ యోగుల కుటుంబమున జరిగి నచో అంతకన్న గొప్ప అవకాశము జీవునకు మరియొకటి లేదు. ధనికులు, అధిపతులు, రాజాధిరాజుల జన్మల కన్న యోగుల జన్మమే గొప్పది. 

ఇంద్రుని జన్మ కన్న కూడ యోగిజన్మ గొప్పది. యోగులు ధీమంతులు. ఆత్మారాములు. నిష్కపటులు. వారు కేవలము ప్రపంచమునకు హితము చేయుటకే జన్మింతురు. అట్టి వారి కుటుంబములలో పుట్టుట మహాదుర్లభమైన విషయము. 

వశిష్ఠ మహర్షి సాక్షాత్తు బ్రహ్మమే. అతని కుటుంబమున పుట్టిన శక్తి మహర్షి సూటిగ ధ్యానమందు నిలచి, బ్రహ్మమును చేరి బ్రహ్మమై యున్నాడు. అతని కుమారునిగ జన్మించిన పరాశర మహర్షి మహాయోగియై, జగద్గురువై, మైత్రేయాది జగద్గురువులకు కూడ గురుస్థానము నలంకరించినాడు. పరాశర మహర్షి కుమారుడు వేదవ్యాసుడు. తండ్రిని మించిన తనయుడు. 

తండ్రి అందించిన యోగమును, ధ్యానమును సమస్తమును విపులీకరించి, వేదము లను నిర్వచించి, పురాణములను వర్గీకరించి, భారత భాగవతాది గ్రంథములు రచించి, కలియుగమందు మానవులు తరించుటకు మహత్తర కృషి గావించినాడు. అతని కుమారుడు శుకుడు చిన్నతనముననే బ్రహ్మత్వము సాధించినాడు. 

యోగస్పర్శ గలవారే యోగుల కుటుంబమున జన్మింతురు. అట్లు జన్మించి యోగసిద్ధిని పొందుదురు. నిజమునకు జీవులు మరణ సమయమునకు ఏ యే వాసనలు కలిగియుందురో ఆయా వాసనల పరితృప్తికై తదనుగుణమైన వాతావరణమున మరల జన్మింతురు. అట్లే యోగవాసన ప్రబలముగ నుండగ మరణించినవారు యోగుల కుటుంబమున జన్మింతురు. 

గుఱ్ఱమునకు గుఱ్ఱము, గాడిదకు గాడిద పుట్టుట ప్రకృతి విధానము. కాకికి కోకిల పుట్టదు. కోకిలకు కాకి పుట్టదు. శుభవాసనలు గలవారు శుభంకరమగు గృహములలో జన్మింతురు. అశుభ వాసనలు గలవారు అట్టి వాసనలు గల కుటుంబములలో జన్మింతురు. సామాన్యముగ శుభాశుభ మిశ్రమముగ వాసనలుండును. 

కావున అట్టి కుటుంబములో జన్మించుట జరుగును. ముందు జన్మలు ఉత్తమముగ నుండ వలెనన్నచో, శుభ వాసనల నాశ్రయించుట కర్తవ్యమై నిలచును. అట్లే యోగుల కుటుంబములలో జన్మించుట కూడ పూర్వ వాసనలను బట్టి యుండును. 

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 401🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴* 
అధ్యాయము - 20

*🌻. బడబాగ్ని - 2 🌻*

 గొప్ప సామర్థ్యము గల ఈ మహేశ్వరుని క్రోధము మన్మథుని భస్మము చేసి, వెను వెంటనే సర్వమును తగులబెట్టుటకు తలపడగా, నేను బడబాగ్నిగా స్తంభింపజేసితిని (14). దుఃఖితులగు దేవతలు నన్ను శీఘ్రమే ప్రార్థించగా నేను సంకరుని ఇచ్ఛచే శీఘ్రముగా అచటికి వచ్చితిని. ఓ కుమారా! నేనా అగ్నిని స్తంభింపజేసితిని (15).

ఓ సముద్రమా! బడబారూపమును ధరించిన ఈ అగ్నిని తీసుకొని కరుణానిధియగు నేను ఇచటకు వచ్చి నిన్ను ఆదేశించుచుంటిని (16). ఈ మహేశ్వరుని క్రోధము బడబా రూపమును ధరించి నోటినుండి నిప్పులను గ్రక్కుచున్నది. ప్రలయకాలము వరకు నీవు దీనిని ధరించవలెను. (17) ఓ నదీ పతీ! నేను ఇచటకు వచ్చి ప్రలయములో నివసించగలను. అపుడు నీవు ఈ శంకరుని అద్భుతమగు క్రోధమును విడిచిపెట్టవచ్చును (18). ఈ అగ్నికి నీ జలము నిత్యము భోజనమగుచుండును. ఈ అగ్ని నీ గర్భములోనికి వెళ్లకుండునట్లు నీవు ప్రయత్న పూర్వకముగా ధరించి యుండుము (19).

బ్రహ్మ ఇట్లు పలికెను-

నేనిట్లు పలుకగా, అపుడా సముద్రుడు రుద్రుని కోపరూపమగు ఆ బడబాగ్నిని ధరించుటకు నిశ్చయముగా నంగీకరించెను. ఆ పనిని సముద్రుడు తక్క ఇతరులు చేయజాలరు (20). అపుడు జ్వాలలతో మండిపడుచున్న ఆ అగ్ని బడబా రూపముతో సముద్రములో ప్రవేశించి జలసమూహములను దహింపనారంభించెను (21). ఓ మహర్షీ! అపుడు సంతసముతో నిండిన మనస్సుగల వాడనై నేను నాలోకమునకు వెళ్లితిని. దివ్యరూపము గల సముద్రుడు నాకు ప్రణమిల్లి అంతర్దానము జెందెను (22). ఓ మహర్షీ! రుద్ర కోపాగ్ని వలన కలిగిన భయమునుండి జగత్తు సర్వము విముక్తిని పొందెను. దేవతలు మరియు ఋషులు స్వస్థులైరి (23).

శ్రీ శివ మహాపురాణములో రుద్ర సంహిత యందలి పార్వతీ ఖండములో బడబాగ్ని చరితమనే ఇరువదియవ అధ్యాయము ముగిసినది (20).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#శివమహాపురాణము #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 LIGHT ON THE PATH - 148 🌹*
*🍀 For those WHO DESIRE TO ENTER WITHIN - For DISCIPLES 🍀*
✍️. ANNIE BESANT and LEADBEATER
📚. Prasad Bharadwaj

CHAPTER 11 - Master Hilarion’s note on Rule 21.
*🌻 To read, in the occult sense, is to read with the eyes of the spirit. To ask is to feel the hunger within – the yearning of spiritual aspiration. - 3🌻*

555. Such emotionalism is not permissible, however, to students of occultism, because they are beyond the stage at which such excitement could advance their progress. There must be no confusion between emotion of that sort and the exaltation of the higher planes. People at such revivals often pass into an ecstatic condition in which they certainly lose control for the time. 

I have myself seen cases in which people stamped about, shouted loudly, and were so carried out of themselves that they did not know what they were doing. They say it is all joy; I suppose that they certainly do feel that, but it is an uncontrolled emotion, and therefore is to be avoided by the student of occultism.

556. The man who experiences buddhic consciousness is also carried out of himself, with a bliss so intense that words altogether fail to express it: but he never loses the knowledge that he is himself. He is on a higher level: he is more himself than he ever was before; he does not lose his self-control. 

The ecstasy which he feels may indeed produce by reflection a certain emotion in the personality – a feeling of most intense joy on all levels, but never an uncontrolled emotion. It would never lead him into rash or ill-considered actions, to forget himself or lose his dignity. With the intense exaltation, with the indescribable bliss of the higher experience, there comes an utter peace which seems to fill the earth, whereas the lower emotions disturb the equilibrium to a most extraordinary extent.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#LightonPath #Theosophy
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
Thosophical Teachings దివ్యజ్ఞాన సందేశములు
www.facebook.com/groups/theosophywisdom/
https://t.me/Seeds_Of_Consciousness

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 29 🌹*
✍️. సద్గురు ఇ. కృష్ణమాచార్యులు 
సంకలనము : వేణుమాధవ్ 
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. అభిప్రాయములు 🌻 *

ఇతరులను గూర్చి గాని, దేవుని గూర్చి కాని అభిప్రాయములు కలవారు తపస్సు చేసినను , భగవంతుడు లభ్యపడడు. వీనిని సమర్పణ చేసినవానికి భగవంతుడు సృష్టి రూపమున మొదట దర్శనమిచ్చును.  

సృష్టిని గూడ వాని రూపముగా భావించిన వానికి , తన కర్తవ్యమును వానికి సమర్పణముగా సృష్టి జీవుల యెడల నెరవేర్చిన వానికి మాత్రమే భగవంతుడు దర్శనమిచ్చును.

భాగవతము 3-245
🌹 🌹 🌹 🌹 🌹
#మాస్టర్‌ఇకెసందేశములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌷. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు 🌷 
www.facebook.com/groups/masterek/
https://t.me/ChaitanyaVijnanam
 www.facebook.com/groups/chaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 Osho Daily Meditations - 18 🌹*
📚. Prasad Bharadwaj

*🍀 BEHIND ANGER 🍀*

*🕉 Shift from anger to creativity, and immediately you will see a great change arising in you. Tomorrow the same things will not feel like excuses for being angry. 🕉*

Out of one hundred people suffering from anger, about 50 percent suffer from too much creative energy that they have not been able to put into use. Their problem is not anger, but they will go on thinking their whole life that it is. Once a problem is diagnosed rightly, half of it is already solved.

Put your energies into creativity. Forget about anger as a problem; ignore it. Channel your energy towards more creativity. Pour yourself into something that you love. Rather than making anger your problem, let creativity be your object of meditation. 

Shift from anger to creativity and immediately you will see a great change arising in you. And tomorrow the same things will not feel like excuses for being angry because now energy is moving, it is enjoying itself, its own dance. Who cares about small things?

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹 ఓషో బోధనలు - Osho Teachings 🌹
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 78 / Sri Lalita Sahasranamavali - Meaning - 78 🌹*
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ

*🍀 78.భక్తిమత్-కల్పలతికా, పశుపాశ విమోచనీ ।*
*సంహృతాశేష పాషండా, సదాచార ప్రవర్తికా ॥ 78 ॥ 🍀*

🍀 353. భక్తిమత్కల్పలతికా - 
భక్తికలవారిపట్ల కల్పవృక్షపు తీగవంటిది.

🍀 354. పశుపాశ విమోచనీ - 
వివిధ పాశములచే బంధింపబడువారిని బంధ విముక్తులను చేయునది.

🍀 355. సంహృతాశేషపాషండా -
 సంహరింపబడిన సకలమైన పాషడులు కలది.

🍀 356. సదాచారప్రవర్తికా -
 సంప్రదాయబద్దమైన, శ్రోత్రీయ మార్గము ననుసరించి యుండునట్లు ప్రవర్తింప చేయునది.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 78 🌹*
📚. Prasad Bharadwaj 

*🌻 78. bhaktimat-kalpalatikā paśupāśa-vimocinī |*
*saṁhṛtāśeṣa-pāṣaṇḍā sadācāra-pravartikā || 78 || 🌻*

🌻 353 ) Bhakthi mat kalpa lathika -   
She who is the wish giving creeper Kalpaga

🌻 354 ) Pasu pasa vimochani -   
She who removes shackles from the living

🌻 355 ) Samhrutha sesha pashanda -   
She who destroys those people who have left their faith

🌻 356 ) Sadachara pravarthika -   
She who makes things happen through good conduct.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
 #లలితాసహస్రనామ #LalithaSahasranama
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 78 / Sri Vishnu Sahasra Namavali - 78 🌹*
*నామము - భావము*
📚. ప్రసాద్ భరద్వాజ 

*🌷. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 🌷*

*పూర్వాషాడ నక్షత్ర ద్వితీయ పాద శ్లోకం*

*🍀 78. ఏకో నైక స్సవః కః కిం యత్తత్పద మనుత్తమం|*
*లోకబన్ధు ర్లోకనాథో మాధవో భక్తవత్సలః|| 🍀*

🍀725. ఏక: - 
ఒక్కడే అయినవాడు.

🍀726. నైక: - 
అనేక రూపములు గలవాడు.

🍀727. సవ: - 
ఏకముగా, అనేకముగా వ్యక్తమయ్యే పూర్ణరూపుడు.

🍀728. క: - 
సుఖ స్వరూపుడు.

🍀729. కిమ్ - 
అతడెవరు? అనే విచారణ చేయదగిన - ఆ బ్రహ్మము! 

🍀730. యత్ - 
దేనినుండి సర్వభూతములు ఆవిర్భవించుచున్నవో - ఆ బ్రహ్మము!

🍀731. తత్ - 
ఏది అయితే వ్యాపించిఉన్నదో - ఆ బ్రహ్మము!

🍀732. పదం-అనుత్తమం - 
ముముక్షువులు పొందగోరే ఉత్తమస్థితైన - ఆ బ్రహ్మము! 

🍀733. లోకబంధు: -
 లోకమునకు బంధువైనవాడు.

🍀734. లోకనాధ: - 
లోకములకు ప్రభువు

🍀735. మాధవ: - 
మౌన, ధ్యాన, యోగాదుల వలన గ్రహింపశక్యమైనవాడు.

🍀736. భక్తవత్సల: - 
భక్తులయందు వాత్సల్యము గలవాడు.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 Vishnu Sahasra Namavali - 78 🌹*
*Name - Meaning*
📚 Prasad Bharadwaj

*🌷 OM NARAYANAYA VIDMAHE VASUDEVAYA DHIMAHI । TANNO VISHNU PRACHODAYAT ॥ 🌷*

*Sloka for Poorvashada 2nd Padam*

*🌻78. ekō naikaḥ savaḥ kaḥ kiṁ yattatpadamanuttamam |*
*lōkabandhurlōkanāthō mādhavō bhaktavatsalaḥ || 78 || 🌻*

🌻 725. Ekaḥ: 
One without any kind of differences that are internal or that relate to similar objects external or to dissimilar objects.

🌻 726. Naikaḥ: 
One who has numerous bodies born of Maya.

🌻 727. Savaḥ: 
That Yajna in which Soma is made.

🌻 728. Kaḥ: 
The syllable 'Ka' indicatesjoy or happiness. So it means one who is hymned as constituted of joy.

🌻 729. Kim: 
One who is fit to be contemplated upon, because He is the summation of all values.

🌻 730. Yat: 
One who is by nature existent. The word 'Yat' indicates a self-subsisting entity.

🌻 731. Tat: 
Brahma is so called because He 'expands'.

🌻 732. Padamanuttamam: 
Braman is 'Pada' or Status, because He is the goal of all Moksha-seekers. It is Anuttama, because It is that beyond which there is nothing else to be attained.

🌻 733. Lokabandhuḥ: 
One who is friend of the world.

🌻 734. Lokanāthah: 
One to whom all the worlds pray.

🌻 735. Mādhavaḥ: 
One who was born in the clan of Madhu.

🌻 736. Bhaktavatsalaḥ: 
One who has got love for devotees.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#విష్ణుసహస్రనామములు #VishnuSahasranama #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
విష్ణు సహస్రనామ స్తోత్రము / Vishnu Sahasranama group. 
https://t.me/vishnusahasranaam
www.facebook.com/groups/vishnusahasranaam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹