🌹 12, AUGUST 2023 SATURDAY ALL MESSAGES శనివారం, స్థిర వాసర సందేశాలు 🌹

🍀🌹 12, AUGUST 2023 SATURDAY ALL MESSAGES శనివారం, స్థిర వాసర సందేశాలు 🌹🍀
1) 🌹12, AUGUST 2023 SATURDAY శనివారం, స్థిర వాసరే, నిత్య పంచాంగము Daily Panchangam🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 412 / Bhagavad-Gita - 412 🌹
 🌴10వ అధ్యాయము - విభూతి యోగం - 40 / Chapter 10 - Vibhuti Yoga - 40 🌴
3) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 258 / Agni Maha Purana - 258 🌹 
🌻. శివ పూజాంగ హోమ విధి - 3 / Mode of installation of the fire (agni-sthāpana) - 3 🌻
4) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 124 / DAILY WISDOM - 124 🌹 
🌻 3. అంతిమంగా అనంతానికి ఆరోహణ / 3. The Ascent of the Finite to the Infinite 🌻
5) 🌹. శివ సూత్రములు - 126 / Siva Sutras - 126 🌹 
🌻 2-09. జ్ఞానం అన్నం - 3 / 2-09.  Jñānam annam  - 3 🌻

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 12, ఆగష్టు, AUGUST 2023 పంచాంగము - Panchangam 🌹*
*శుభ శనివారం, Saturday, స్థిర వాసరే*
*మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ*

*🌻. పండుగలు మరియు పర్వదినాలు : పరమ ఏకాదశి, Parama Ekadashi 🌻*

*🍀. శ్రీ వేంకటేశ సహస్రనామ స్తోత్రం - 10 🍀*
 
*18. ఉచ్ఛ్వాసాకృష్టభూతేశో నిశ్శ్వాసత్యక్త విశ్వసృట్ |*
*అంతర్భ్రమజ్జగద్గర్భోఽనంతో బ్రహ్మకపాలహృత్*
*19. ఉగ్రో వీరో మహావిష్ణుర్జ్వలనః సర్వతోముఖః |*
*నృసింహో భీషణో భద్రో మృత్యుమృత్యుః* సనాతనః

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : వర్జింప వలసిన బాహ్య వ్యాపారాలు - కొన్నిరకాల బహిర్వ్యాపారాలు ఇతర బహిర్వ్యాపారాల కంటే ఎక్కువగా చేతనను చెదర గొట్టడానికి, క్రిందికి, బయటకు లాగడానికి సహకారు లవుతాయి. సాధకుడు ఇది గుర్తించి అట్టి బహిర్య్యాపారాలను వర్జించడం అవసరం.🍀*

🌷🌷🌷🌷🌷

విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,
వర్ష ఋతువు, దక్షిణాయణం,
శ్రావణ మాసం
తిథి: కృష్ణ ఏకాదశి 06:32:10 వరకు
తదుపరి కృష్ణ ద్వాదశి
నక్షత్రం: మృగశిర 06:03:30 వరకు
తదుపరి ఆర్ద్ర
యోగం: హర్షణ 15:22:59 వరకు
తదుపరి వజ్ర
కరణం: బాలవ 06:32:10 వరకు
వర్జ్యం: 15:17:24 - 17:03:00
దుర్ముహూర్తం: 07:40:17 - 08:31:20
రాహు కాలం: 09:09:37 - 10:45:20
గుళిక కాలం: 05:58:10 - 07:33:54
యమ గండం: 13:56:47 - 15:32:30
అభిజిత్ ముహూర్తం: 11:56 - 12:46
అమృత కాలం: 21:27:00 - 23:12:36
సూర్యోదయం: 05:58:10
సూర్యాస్తమయం: 18:43:56
చంద్రోదయం: 02:13:14
చంద్రాస్తమయం: 15:58:02
సూర్య సంచార రాశి: కర్కాటకం
చంద్ర సంచార రాశి: జెమిని
యోగాలు: వజ్ర యోగం - ఫల
ప్రాప్తి 06:03:30 వరకు తదుపరి
ముద్గర యోగం - కలహం
దిశ శూల: తూర్పు
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి

🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 412 / Bhagavad-Gita - 412 🌹*
*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. 10వ అధ్యాయము - విభూతి యోగం - 40 🌴*

*40. నాన్తోస్తి మయ దివ్యానాం విభూతీనాం పరన్తప |*
*ఏష తూద్దేశత: ప్రోక్తా విభూతేర్విస్తరో మయా ||*

*🌷. తాత్పర్యం : ఓ శత్రుంజయుడా! నా దివ్య విభూతులకు అంతమనునది లేదు. నేను నీకు తెలిపినదంతయు నా అనంత విభూతుల యొక్క సూచన మాత్రమే.*

*🌷. భాష్యము : వేదవాజ్మయమున తెలుపబడినట్లు శ్రీకృష్ణభగవానుని విభూతులు మరియు శక్తులు వివిధరీతుల అవగతమైనను వాస్తవమునకు అట్టి విభూతులకు పరిమితిలేదు. కనుకనే సమస్త విభూతులు మరియు శక్తులు ఎన్నడును వివరింప బడలేవు. అనగా అర్జునుని జిజ్ఞాసను సంతృప్తిపరచుట కొరకు శ్రీకృష్ణభగవానుడు కేవలము కొన్ని ఉదాహరణములను మాత్రమే వివరించి యున్నాడు.*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 412 🌹*
*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*

*🌴 Chapter 10 - Vibhuti Yoga - 40 🌴*

*40. nānto ’sti mama divyānāṁ vibhūtīnāṁ paran-tapa*
*eṣa tūddeśataḥ prokto vibhūter vistaro mayā*

*🌷 Translation : O mighty conqueror of enemies, there is no end to My divine manifestations. What I have spoken to you is but a mere indication of My infinite opulences.*

*🌹 Purport : As stated in the Vedic literature, although the opulences and energies of the Supreme are understood in various ways, there is no limit to such opulences; therefore not all the opulences and energies can be explained. Simply a few examples are being described to Arjuna to pacify his inquisitiveness.*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 258 / Agni Maha Purana - 258 🌹*
*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ*
*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*
*ప్రథమ సంపుటము, అధ్యాయము - 75*

*🌻. శివ పూజాంగ హోమ విధి - 3 🌻*

*పిమ్మట ఆరవ మాసమున జరుగు సీమంతోన్నయమును భావనచేసి అఘోర మంత్రముతో అగ్ని పూజించి, "శిఖాయై వషట్‌" అని ఉచ్చరించుచు మూడు హోమములు చేసి, ఆ మంత్రముతోడనే ముఖాద్యంగ కల్పన చేయవలెను. ముఖోద్ఘాటనము ప్రకటీకరణమును చేయవలెను. పిమ్మట వెనుకటి వలెనే పదవ మాసమున జయగు జాతకర్మ-నరకర్మలను భావించుచు తత్పురుషమంత్రముతో దర్భాదులతో అగ్నిని పూజించి, జ్వలింపచేసి, గర్భమలమును తొలగించుటకై స్నానము చేయించి, దేవి హస్తమునందు సువర్ణ బంధనముచేసి నట్లు భావన చేసి, హృదయ మంత్రముతో పూజించవలెను. సూతకము వెంటనే నివర్తించుటకై అస్త్రమంత్రముతో అభిమంత్రించిన జలముతో అభిషేకము చేయవలెను.*

*కుండమును, బైటనుండి, అస్త్రమంత్రము చదువుచు కుశలతో మార్జనము చేయవలెను. 'హుం' అని ఉచ్చరించుచు ఉదకముతో తడపవలెను. కుండము వెలుపల నున్న మేఖలలపై, అస్త్రమంత్రముతో, ఉత్తర-దక్షిణదిక్కులందు పూర్వా గ్రముగాను, పూర్వపశ్చిమములందు ఉత్తరాగ్రముగాను కుశలు పరవవలెను వాటిపై హృదయమంత్రముతో పరిధివిష్టరము స్థాపింపవలెను. పిమ్మట సద్యోజాతాది ముఖపంచకమునకు సంబంధించిన మంత్రములు చదువుచు, అస్త్రమంత్ర ముచ్చరించుచు, నాలచ్ఛేదనము కొరకై, ఐదు సమిధుల మూలములను అజ్యమునందు ముంచి హోమము చేయవలెను. పిమ్మట నూర్వాక్ష తాదులతో బ్రహ్మ-శివ-విష్ణు-అనంతులను వారి నామములకు "నమః" చేర్చుచు పూజించవలెను. కుండమునకు నాల్గు వైపులందును పరచిన ఎనిమిది అసనములపై పూర్వాదిదిక్కులందు వరుసగ ఇంద్రాది దిక్పాలకులను అవాహన చేసి, స్థాపన చేసి వారందరును అగ్నివైపు ముఖములతో కూర్చున్నట్లు భావన చేయుచు, వారి నామములకు 'నమః' చేర్చుచు పూజచేయవలెను.*

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Agni Maha Purana - 258 🌹*
*✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj *

*Chapter 75*
*🌻 Mode of installation of the fire (agni-sthāpana) - 3 🌻*

17. Three oblations should be offered into the fire, after having determined the formation of its face and body by one who wants to restore or open up the face.

18. As before the jātakarma (the purificatory rite on the birth of a child) and ṛtukarma (the rite after the first menses) (usually performed) in the tenth month should be performed by kindling the fire with darbha etc. (Mental) bathing (should be done) to remove tḥe impurities of the pregnancy.

19. After having mentally contemplated the golden bracelet of the goddess one should worship with the hṛd (mantra). He should sprinkle with water consecrated by the mantra of the weapon for the immediate removal of impurities after the birth of a child.

20. The pitcher outside the receptacle for the sacred fire should be touched with the weapon (mantra) and (water) should be sprinkled over with the (mantra) of the armour. The ends of the kuśa which form the boundary (of the sacrificial pit) and placed on the north and east (should be washed with water) with (the mantra of) the weapon.

21. The periphery of a circle around (the fire) should be determined with the kuśa, previously consecrated with the weapon and hṛd mantra and then the cushions inscribed within it should be spread out by (reciting) the weapon mantra.

22. Five sacrificial sticks dipped in clarified butter should be offered into the fire with the repetition of the principal mantra. Brahmā, Śaṅkara, Viṣṇu and Ananta should be worshipped with the hṛd (mantra).

23. The gods located in the periphery (of that circle) should be worshipped in turn with unbroken rice. The gods Indra to Īśāna who are directly facing the fire and are having their places inside the circle should be worshipped in their own regions with the hṛd (mantra) “Protect this child (fire) by removing all obstacles, that might befall it.”

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 124 / DAILY WISDOM - 124 🌹*
*🍀 📖 . జీవితం యొక్క తత్వము నుండి 🍀*
*✍️. ప్రసాద్ భరద్వాజ*

*🌻 3. అంతిమంగా అనంతానికి ఆరోహణ / 3. The Ascent of the Finite to the Infinite 🌻*

*తత్వశాస్త్రం అనేది అనుభవం యొక్క రూపాలు, విషయాలు మరియు పర్యవసానాలుపై హేతుబద్ధమైన విచారణ. చైతన్యం యొక్క వివిధ ప్రక్రియలలో, దాని అభివ్యక్తి యొక్క అన్ని దశల యొక్క సంపూర్ణ జ్ఞానం కోసం ఇది ఒక ప్రయత్నం. అస్తిత్వం యొక్క అంతిమ అర్ధం మరియు సారాంశం యొక్క ఆవిష్కరణ తత్వశాస్త్రం యొక్క ప్రధాన ఉద్దేశ్యం. ఇది పరిపూర్ణ జీవితం యొక్క కళ, వాస్తవిక శాస్త్రం, ధర్మం యొక్క అభ్యాసానికి పునాది, స్వేచ్ఛ మరియు ఆనందాన్ని పొందటానికి ఒక మార్గం, మరియు సౌందర్యాన్ని ఉన్నతంగా అర్థం చేసుకోవడానికి మార్గాన్ని సూచిస్తుంది.*

*స్వామి శివానంద తత్వశాస్త్రాన్ని వేదాంతంగా, జ్ఞానం మరియు బ్రహ్మవిద్య యొక్క సమాగమంగా, యోగశాస్త్రం నుండి విడదీయరాని పరమాత్మిక జ్ఞానంగా భావించారు. ఇది ఉన్నది ఉన్నట్లుగా ఉన్న జ్ఞానానికి మార్గం. “తత్వశాస్త్రం అంటే జ్ఞానం పట్ల ప్రేమ, లేదా జ్ఞానం కోసం ప్రయత్నం. ఇది నైతిక మరియు మేధో శాస్త్రం. ఇది కార్యకారణన్యాయాలని ఉపయోగించడం ద్వారా విషయాలను వాటి మూలాలలో అర్థం చేసుకుని తద్వారా అవతరణల వాస్తవిక రూపాన్ని పూర్తిగా అర్థం చేసుకునే శాస్త్రం.” (ప్రశ్నలు మరియు సమాధానాలు).*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 DAILY WISDOM - 124 🌹*
*🍀 📖 The Philosophy of Life 🍀*
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj

*🌻 3. The Ascent of the Finite to the Infinite 🌻*

*Philosophy is a rational enquiry into the forms, contents and implications of experience. It is an attempt at a complete knowledge of being in all the phases of its manifestation in the various processes of consciousness. The discovery of the ultimate meaning and essence of existence is the central purpose of philosophy. It is the art of the perfect life, the science of reality, the foundation of the practice of righteousness, the law of the attainment of freedom and bliss, and provides a key to the meaning and appreciation of beauty.*

*Swami Sivananda holds philosophy to be the Vedanta or the consummation of knowledge, Brahmavidya, or the sacred lore of the Eternal, which is inseparable from Yogasastra, or the methodology of the ascent of the finite to the infinite. It is the way to the knowledge of being as such, of that which is. “Philosophy is love of wisdom, or striving for wisdom. It is a moral and intellectual science which tries to explain the reality behind appearances by reducing the phenomena of the universe to ultimate causes, through the application of reason and law” (Questions and Answers).*

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శివ సూత్రములు - 126 / Siva Sutras - 126 🌹*
*🍀. శివ ఆగమ తత్వశాస్త్రం యొక్క సూత్రములు 🍀*
*2వ భాగం - శక్తోపాయ*
*✍️. ప్రసాద్‌ భరధ్వాజ*

*🌻 2-09. జ్ఞానం అన్నం - 3 🌻*

*🌴. ఆత్మశుద్ధి కొరకు చేసే యఙ్యములో, మెలకువ, స్వప్న మరియు గాఢనిద్ర స్థితులలో మనస్సు మరియు ఇంద్రియాల కార్యకలాపాల నుండి ఉద్భవించి అజ్ఞానం, భ్రాంతి మరియు బంధనాలను కలిగించే అపవిత్ర జ్ఞానాన్ని హవిస్సుగా సమర్పించాలి 🌴 *

*భ్రమాత్మక జ్ఞానం అనేది భౌతిక శరీరం యొక్క విరమణని కూడా కలిగి ఉంటుంది, ఇది మరణం అని పిలువబడే సహజ ప్రక్రియ. ఒక వ్యక్తి తన భౌతిక శరీరం గురించి ఆలోచిస్తే, అతను సహజంగా మరణానికి భయపడతాడు. శరీరం యొక్క అనుభవాలతో ముడిపడి ఉన్న ఏదైనా ఆలోచన ప్రక్రియ అంతర్గత అగ్నిలో అర్పణగా అందించ బడుతుంది. నైవేద్యాలు పూర్తయిన తర్వాత మిగిలేది శివునితో ఏకత్వం అనే ఆలోచన, ఇతర ఆలోచనలు ఇప్పుడు కాలిపోయాయి. పరమాత్మతో ఏకత్వానికి సంబంధించిన ప్రభావవంతమైన ఆలోచన ప్రక్రియకు దారితీసే ఇటువంటి పదేపదే ధృవీకరణలు పైన చర్చించ బడిన సమీకరించ బడిన జ్ఞానం.*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Siva Sutras  - 126 🌹*
*🍀Aphorisms of philosophy of Shiva āgama 🍀*
Part 2 - Śāktopāya.
*✍️. Acharya Ravi Sarma, 📚. Prasad Bharadwaj*

*🌻 2-09.  Jñānam annam  - 3 🌻*

*🌴. In the sacrifice of self-purification, impure knowledge which arises from the activities of the mind and senses in the wakeful, dream and deep sleep states and which causes ignorance, delusion and bondage should be offered as food in the sacrifice of self-purification  🌴*

*Deluded knowledge also includes the cessation of the existence of the physical body, a natural process called death. If one thinks about his physical body, he naturally fears for death. Any thought process associated with experiences of the body is to be offered as oblations into the internal fire. What remains after the completion of the oblations is the thought of oneness with Śiva, as other thoughts are now burnt. Such repeated affirmations leading to effectual thought process of oneness with the Supreme is the assimilated knowledge discussed above.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
https://t.me/+9zDjTpPe_PQzMWVl
https://t.me/Sivasutras
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/bhagavadgeethaa/
https://t.me/AgniMahaPuranam
https://t.me/+LmH1GyjNXXlkNDRl
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages2
https://chaitanyavijnanam.tumblr.com/
https://prasadbharadwaj.wixsite.com/lalithasahasranama
https://www.threads.net/@prasad.bharadwaj

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 469 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 469 - 2


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 469 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 469 - 2 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 97. వజ్రేశ్వరీ, వామదేవీ, వయోఽవస్థా వివర్జితా ।
సిద్ధేశ్వరీ, సిద్ధవిద్యా, సిద్ధమాతా, యశస్వినీ ॥ 97 ॥ 🍀

🌻 469. 'వయోవస్థా వివర్జితా' - 2 /469. 'vayovasdha vivarjita'- 2 🌻


మానవదేహము స్థూల దేహముగను, సూక్ష్మ దేహముగను, కారణ దేహముగను, తదతీతమగు జీవ చైతన్యముగను యున్నది. ఇందొకదానికన్న యొకటి అధికమగు వయోపరిమితి కలది. అయిననూ వానికి వయోపరిమితి యున్నది. మానవులకన్న దేవతలు, దేవతలకన్న బ్రహ్మదేవుడు ఎక్కువ ఆయుర్దాయము కలవారు. బ్రహ్మదేవుని ఆయుర్దాయము నూరు దివ్య సంవత్సరములుగ తెలుపుదురు. ప్రస్తుతము ఈ సృష్టికి బ్రహ్మయగు 'పద్మభూ' నకు 51వ సంవత్సరము నడచు చున్నదని, ద్వితీయ పరార్థము నడచు చున్నదని పెద్దలు తెలుపుదురు.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 469 - 2 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️ Prasad Bharadwaj

🌻 97. Vajreshvari vamadevi vayovasdha vivarjita
sideshvari sidhavidya sidhamata yashasvini ॥ 97 ॥ 🌻

🌻 469. 'vayovasdha vivarjita'- 2 🌻


The human body consists of a gross body, a subtle body, a causal body, and so on. Each one has a relatively increasing age limit. They do have an age limit. Gods have a longer lifespan than humans and Lord Brahma has a longer lifespan than Gods. Lord Brahma's lifespan is said to be one hundred divine years. At present, elders say that the 51st year of current Brahma 'Padmabhu' is running and the second Padartha is running


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


Osho Daily Meditations - 26. PLAYING A ROLE / ఓషో రోజువారీ ధ్యానాలు - 26. ఒక పాత్ర పోషించడం




🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 26 / Osho Daily Meditations - 26 🌹

✍️. ప్రసాద్ భరద్వాజ

🍀 26. ఒక పాత్ర పోషించడం / 26. PLAYING A ROLE 🍀


🕉. ఆడండి, కానీ తెలిసి ఆడండి. మీ పాత్రలని పోషించండి, అవి ఏమైనా; వాటిని అణచివేయవద్దు. వాటిని సాధ్యమైనంత ఖచ్చితంగా ప్లే చేయండి, కానీ పూర్తిగా అప్రమత్తంగా ఉండండి. దీన్ని ఆస్వాదించండి మరి ఇతరులు కూడా ఆనందిస్తారు. 🕉

ఒక వ్యక్తి ఒక పాత్ర పోషిస్తే అందులో ఏదో ఒక కారణం ఉంటుంది. ఆ పాత్ర ఆ వ్యక్తికి కొంత ప్రాముఖ్యత ఉంటుంది. గేమ్ ఖచ్చితంగా ఆడినట్లయితే, అపస్మారక స్థితి నుండి ఏదో అదృశ్యమవుతుంది, ఆవిరైపోతుంది మరియు మీరు భారం నుండి విముక్తి పొందుతారు. ఉదాహరణకు, మీరు చిన్నపిల్లలా ఆడుకోవాలనుకుంటే, మీ బాల్యంలో ఏదో అసంపూర్ణంగా ఉండిపోయిందని అర్థం. మీరు కోరుకున్నట్లు మీరు పిల్లవాడిగా ఉండలేదు; మిమ్మల్ని ఎవరో ఆపారు.

ప్రజలు మిమ్మల్ని మరింత గంభీరంగా మార్చారు, మీ వయసుకి మించి పరిణతి చెందినట్లు కనిపించాలని మిమ్మల్ని బలవంతం చేశారు. ఏదో అసంపూర్తిగా మిగిలిపోయింది. ఆ అసంపూర్ణత పూర్తి కావాలని డిమాండ్ చేస్తుంది మరియు అది మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది. కాబట్టి పూర్తి చేయండి. అందులో తప్పేమీ లేదు. గతంలో మీరు ఆ సమయంలో చిన్నపిల్లగా ఉండలేక పోయారు; ఇప్పుడు మీరు ఉండగలరు. ఒక్కసారి మీరు పూర్తిగా దానిలో ఉండగలిగితే, అది అదృశ్యమైందని మళ్లీ రాదు అని మీరు చూస్తారు.


కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Osho Daily Meditations - 26 🌹

📚. Prasad Bharadwaj

🍀 26. PLAYING A ROLE 🍀

🕉. Play, but play knowingly. Play your roles, whatever they are; don’t repress them. Play them as perfectly as possible, but stay fully alert. Enjoy it, and others will also enjoy it. 🕉


When a person plays a role there is some reason in it. That role has some significance to the person. If the game is played perfectly, something from the unconscious will disappear, evaporate, and you will be freed from a burden. For example, if you want to play like a child, that means that in your childhood something has remained incomplete. You could not be a child as you wanted to be; somebody stopped you.

People made you more serious, forced you to appear more adult and mature than you were. Something has remained incomplete. That incompletion demands to be completed and it will continue to haunt you. So finish it. Nothing is wrong in it. You could not be a child that time, back in the past; now you can be. Once you can be totally in it, you will see that it has disappeared and will never come again.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


శ్రీ శివ మహా పురాణము - 772 / Sri Siva Maha Purana - 772


🌹 . శ్రీ శివ మహా పురాణము - 772 / Sri Siva Maha Purana - 772🌹

✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 18 🌴

🌻. నారద జలంధర సంవాదము - 2 🌻


దేవతలిట్లు పలికిరి - ఓ మహర్షీ! దయానిధీ! మా కష్టమును గురించి వినుము. విని వెంటనే దానిని దూరము చేయుము. నీవు సమర్థుడవు. శంకరునకు ప్రియమైన వాడవు (9). జలంధరాసురుడు దేవతలను తమ తమ స్థానములనుండి, మరియు అధికారములనుండి పూర్ణముగా వెళ్లగొట్టినాడు. మేము మిక్కిలి ఆదుర్దాను, దుఃఖమును పొంది యున్నాము (10). సూర్యుడు, చంద్రుడు, అగ్ని యమధర్మరాజు, మరియు ఇతరలోక పాలకులు తమ స్థానములనుండి త్రోసివేయబడినారు (11). మహా బలశాలియగు ఆతడు దేవతలనందరినీ పీడించుచున్నాడు. మేము మహాదుఃఖమును పొంది యున్నాము. నిన్ను శరణు జొచ్చుచున్నాము (12). బలశాలి, దేవతలందరినీ పీచమడంచిన మహారాక్షసుడు అగు జలంధరుడు యుద్ధములో హృషీకేశుని తన వశము గావించుకొనినాడు (13). మనకు కార్యముల నన్నిటినీ సాధించిపెట్టిన విష్ణువు తాను ఇచ్చిన వరమునకు ఆధీనుడై ఆతనికి వశుడై లక్ష్మీదేవితో గూడి ఆతని ఇంటిలో నివసింప జొచ్చెను (14). ఓ మహాప్రాజ్ఞా! జలంధరుని వినాశము కొరకు ప్రయత్నమును చేయుము. నీవు మాకు దైవానుగ్రహముచే దొరికితివి. నీవు సర్వదా దేవకార్యములనన్నింటినీ చక్కబెట్టితివి (15).

సనత్కుమారుడిట్లు పలికెను - ఆ దేవతల ఈ మాటను విని దయానిధియగు ఆ నారదమహర్షి వారిని ఓదార్చి ఇట్లు పలికెను (16).

నారదుడిట్లు పలికెను- ఓ దేవతలారా! రాక్షసరాజు చేతిలో ఓడి ఆతనిచే మీ స్థానములనుండి వెళ్లగొట్టబడి మీరు ఆతనిచే పీడింపబడి దుఃఖమును పొంది యున్నారను విషయమును నేను ఎరుంగుదును (17). నేను నా శక్తికి తగినట్లు మీ కార్యమును చక్కబెట్టెదను. సందేహము వలదు. ఓ దేవతలారా! మీరు దుఃఖమును పొంది యున్నారు గనుక, నేను మీకు అనుకూలుడనే (18).


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹




🌹 SRI SIVA MAHA PURANA - 772🌹

✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj

🌴 Rudra-saṃhitā (4): Yuddha-khaṇḍa - CHAPTER 18 🌴

🌻 The conversation between Nārada and Jalandhara - 2 🌻


The gods said:—

9. O excellent sage, listen to our misery. O merciful one, after listening to it, destroy it quickly. You are powerful and the favourite of Śiva.

10. The gods have been routed by the Asura Jalandhara from their abodes and positions of controlling authority. Hence we are miserable and distressed.

11. The hot-rayed sun and the moon have been ousted from their positions. The fire-god and the god of death and guardians of the quarters have been expelled.

12. The gods have been harassed by that powerful Asura. We who have been subjected to great grief now seek refuge in you.

13. The great Asura Jalandhara who has suppressed the gods and who is very powerful has made Viṣṇu subservient to him in the battle.

14. Becoming subservient because of helplessness occa. sioned by the boon granted to him, Viṣṇu who carried out our tasks has now begun to stay in his palace along with Lakṣmī.

15. O intelligent one, please exert yourself for the destruction of Jalandhara. You have fortunately come to us and you have always been the person who can achieve everything for us.


Sanatkumāra said:—

16. On hearing these words of the gods, the great sage Nārada, the merciful, consoled them and said.


Nārada said:—

17. O gods, I know that you have been defeated by the king of Asuras, that you are miserable and harassed and have been deposed.

18. There is no doubt in this that I shall carry out your task according to my ability. O gods, since you are in misery I shall be favourable to you.”


Continues....

🌹🌹🌹🌹🌹


విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 811 / Vishnu Sahasranama Contemplation - 811


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 811 / Vishnu Sahasranama Contemplation - 811🌹

🌻 811. పావనః, पावनः, Pāvanaḥ 🌻

ఓం పావనాయ నమః | ॐ पावनाय नमः | OM Pāvanāya namaḥ


స్మృతిమాత్రేణ పునాతీత్యచ్యుతః పావనః స్మృతః

స్మరణ మాత్రము చేతనే స్మరించిన వారిని పవిత్రులనుగా చేయును.



సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 811🌹

🌻811. Pāvanaḥ🌻

OM Pāvanāya namaḥ


स्मृतिमात्रेण पुनातीत्यच्युतः पावनः स्मृतः /

Smr‌timātreṇa punātītyacyutaḥ pāvanaḥ smr‌taḥ


He purifies by mere thought of Him.

🌻 🌻 🌻 🌻 🌻


Source Sloka

कुमुदः कुन्दरः कुन्दः पर्जन्यः पावनोऽनिलः ।
अमृतांशोऽमृतवपुस्सर्वज्ञस्सर्वतोमुखः ॥ ८७ ॥

కుముదః కున్దరః కున్దః పర్జన్యః పావనోఽనిలః ।
అమృతాంశోఽమృతవపుస్సర్వజ్ఞస్సర్వతోముఖః ॥ 87 ॥

Kumudaḥ kundaraḥ kundaḥ parjanyaḥ pāvano’nilaḥ,
Amr‌tāṃśo’mr‌tavapussarvajñassarvatomukhaḥ ॥ 87 ॥


Continues....

🌹 🌹 🌹 🌹🌹


కపిల గీత - 219 / Kapila Gita - 219


🌹. కపిల గీత - 219 / Kapila Gita - 219 🌹

🍀. కపిల దేవహూతి సంవాదం 🍀

✍️. ప్రసాద్‌ భరధ్వాజ

🌴 5. భక్తి స్వరూపము - కాలమహిమ - 29 🌴

29. తత్రాపి స్పర్శవేదిభ్యః ప్రవరా రసవేదినః
తేభ్యో గన్ధవిదః శ్రేష్ఠాస్తతః శబ్దవిదో వరాః॥

తాత్పర్యము : ఇంద్రియ వ్యాపారములు గల ప్రాణులలో గూడ స్పర్శజ్ఞానము గల వృక్షముల కంటెను రసగ్రహణ మొనర్చు చీమలు, చేపలు మొదలగునవి ఉత్కృష్టములు. వాటి కంటెను గంధము అనగా పరిమళములను గ్రహించు భ్రమరాదులును, వాటి కంటెను శబ్దమును గ్రహింపగల సర్పాదులు గొప్పవి.


వ్యాఖ్య : డార్విన్ మొదట పరిణామ సిద్ధాంతాన్ని వివరించాడని పాశ్చాత్యులు అంగీకరించినప్పటికీ, మానవ శాస్త్రం కొత్తది కాదు. ఐదు వేల సంవత్సరాల క్రితం వ్రాయబడిన భాగవతం నుండి పరిణామ ప్రక్రియ యొక్క అభివృద్ధి చాలా కాలం ముందు తెలుసు. దాదాపు సృష్టి ప్రారంభంలో ఉన్న కపిల ముని యొక్క ప్రకటనల దాఖలాలు ఉన్నాయి. ఈ జ్ఞానం వేద కాలం నుండి ఉనికిలో ఉంది మరియు ఈ క్రమాలన్నీ వేద సాహిత్యంలో వెల్లడి చేయబడ్డాయి; క్రమేణా పరిణామం లేదా మానవ శాస్త్ర సిద్ధాంతం వేదాలకు కొత్త కాదు.

చెట్ల మధ్య కూడా పరిణామ ప్రక్రియలు ఉన్నాయని ఇక్కడ చెప్పబడింది; వివిధ రకాల చెట్లు స్పర్శ జ్ఞానాన్ని కలిగి ఉంటాయి. చేపలు రుచిని పెంచుకున్నందున చెట్ల కంటే చేపలు మంచివని అంటారు. చేపల కంటే తేనెటీగలు మంచివి, అవి వాసనను అభివృద్ధి చేసాయి మరియు వాటి కంటే సర్పాలు మంచివి ఎందుకంటే సర్పాలు వినికిడిని అభివృద్ధి చేశాయి. రాత్రి చీకటిలో కప్ప యొక్క చాలా ఆహ్లాదకరమైన కేకలు వినడం ద్వారా పాము తన ఆహారాన్ని కనుగొనగలదు. పాము 'కప్ప ఉంది' అని అర్థం చేసుకోగలదు మరియు దాని ధ్వని కంపనం కారణంగా అది కప్పను బంధిస్తుంది. ఈ ఉదాహరణ కొన్నిసార్లు కేవలం మరణం కోసం శబ్దాలను కంపించే వాటి కోసం ఇవ్వబడుతుంది. ఆ కప్పలు ధ్వనిని కంపించే చక్కని నాలుకను కలిగి ఉండవచ్చు, కానీ ఆ రకమైన కంపనం కేవలం మరణాన్ని పిలుస్తుంది. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే/ హరే రామ, హరే రామ, రామ రామ, హరే హరే అని జపించడమే నాలుక మరియు ధ్వని ప్రకంపనల యొక్క ఉత్తమ ఉపయోగం. అది క్రూరమైన మరణం నుండి ఒకరిని కాపాడుతుంది.


సశేషం..

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Kapila Gita - 219 🌹

🍀 Conversation of Kapila and Devahuti 🍀

📚 Prasad Bharadwaj

🌴 5. Form of Bhakti - Glory of Time - 29 🌴

29. tatrāpi sparśa-vedibhyaḥ pravarā rasa-vedinaḥ
tebhyo gandha-vidaḥ śreṣṭhās tataḥ śabda-vido varāḥ


MEANING : Among the living entities who have developed sense perception, those who have developed the sense of taste are better than those who have developed only the sense of touch. Better than them are those who have developed the sense of smell, and better still are those who have developed the sense of hearing.

PURPORT : Although Westerners accept that Darwin first expounded the doctrine of evolution, the science of anthropology is not new. The development of the evolutionary process was known long before from the Bhāgavatam, which was written five thousand years ago. There are records of the statements of Kapila Muni, who was present almost in the beginning of the creation. This knowledge has existed since the Vedic time, and all these sequences are disclosed in Vedic literature; the theory of gradual evolution or anthropology is not new to the Vedas.

It is said here that amongst the trees there are also evolutionary processes; the different kinds of trees have touch perception. It is said that better than the trees are the fish because fish have developed the sense of taste. Better than the fish are the bees, who have developed the sense of smell, and better than them are the serpents because serpents have developed the sense of hearing. In the darkness of night a snake can find its eatables simply by hearing the frog's very pleasant cry. The snake can understand, "There is the frog," and he captures the frog simply because of its sound vibration. This example is sometimes given for persons who vibrate sounds simply for death. One may have a very nice tongue that can vibrate sound like the frogs, but that kind of vibration is simply calling death. The best use of the tongue and of sound vibration is to chant Hare Kṛṣṇa, Hare Kṛṣṇa, Kṛṣṇa Kṛṣṇa, Hare Hare/ Hare Rāma, Hare Rāma, Rāma Rāma, Hare Hare. That will protect one from the hands of cruel death.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


11 Aug 2023 : Daily Panchang నిత్య పంచాంగము


🌹 11, ఆగష్టు, AUGUST 2023 పంచాంగము - Panchangam 🌹

శుభ శుక్రవారం, భృగు వాసరే, Friday

మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ

🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు 🌻

🍀. శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రం - 04 🍀

07. చండికా చండరూపేశా చాముండా చక్రధారిణీ ।
త్రైలోక్యజయినీ దేవీ త్రైలోక్యవిజయోత్తమా ॥

08. సిద్ధలక్ష్మీః క్రియాలక్ష్మీర్మోక్షలక్ష్మీః ప్రసాదినీ ।
ఉమా భగవతీ దుర్గా చాంద్రీ దాక్షాయణీ శివా ॥

🌻 🌻 🌻 🌻 🌻


🍀. నేటి సూక్తి : ఈశ్వరునిపై దృష్టి చెదరకుండా పనులు - ఎల్లవేళలా, ఎల్ల పనులలో ఈశ్వరుని దృష్టి యందుంచుకొను సాధకుడు దృష్టి చెదరకుండానే వార్తాపత్రికలు చదవడం, ఉత్తరాలకు జవాబులు వ్రాయడం మొదలైనవి చేయవచ్చు. అయితే దృష్టిలో నైశిత్యం కొంత తగ్గితే తగ్గవచ్చు. సిద్ధత్వం కుదిరిన పిమ్మట ఈ భేదం కూడా ఉండబోదు. 🍀

🌷🌷🌷🌷🌷



విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన

కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,

వర్ష ఋతువు, దక్షిణాయణం,

శ్రావణ మాసం

తిథి: కృష్ణ ఏకాదశి 30:32:41 వరకు

తదుపరి కృష్ణ ద్వాదశి

నక్షత్రం: మృగశిర 30:03:26 వరకు

తదుపరి ఆర్ద్ర

యోగం: వ్యాఘత 15:05:53 వరకు

తదుపరి హర్షణ

కరణం: బవ 17:49:02 వరకు

వర్జ్యం: 10:06:14 - 11:50:18

దుర్ముహూర్తం: 08:31:15 - 09:22:21

మరియు 12:46:47 - 13:37:53

రాహు కాలం: 10:45:24 - 12:21:14

గుళిక కాలం: 07:33:45 - 09:09:35

యమ గండం: 15:32:53 - 17:08:42

అభిజిత్ ముహూర్తం: 11:56 - 12:46

అమృత కాలం: 20:30:38 - 22:14:42

సూర్యోదయం: 05:57:55

సూర్యాస్తమయం: 18:44:32

చంద్రోదయం: 01:22:36

చంద్రాస్తమయం: 15:04:02

సూర్య సంచార రాశి: కర్కాటకం

చంద్ర సంచార రాశి: వృషభం

యోగాలు: మానస యోగం - కార్య

లాభం 30:03:26 వరకు తదుపరి

పద్మ యోగం - ఐశ్వర్య ప్రాప్తి

దిశ శూల: పశ్చిమం

✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి

🌻 🌻 🌻 🌻 🌻




🍀. నిత్య ప్రార్థన 🍀

వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ

నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా

యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా

తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం

తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ

విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.

🌹🌹🌹🌹🌹