శ్రీ శివ మహా పురాణము - 772 / Sri Siva Maha Purana - 772


🌹 . శ్రీ శివ మహా పురాణము - 772 / Sri Siva Maha Purana - 772🌹

✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 18 🌴

🌻. నారద జలంధర సంవాదము - 2 🌻


దేవతలిట్లు పలికిరి - ఓ మహర్షీ! దయానిధీ! మా కష్టమును గురించి వినుము. విని వెంటనే దానిని దూరము చేయుము. నీవు సమర్థుడవు. శంకరునకు ప్రియమైన వాడవు (9). జలంధరాసురుడు దేవతలను తమ తమ స్థానములనుండి, మరియు అధికారములనుండి పూర్ణముగా వెళ్లగొట్టినాడు. మేము మిక్కిలి ఆదుర్దాను, దుఃఖమును పొంది యున్నాము (10). సూర్యుడు, చంద్రుడు, అగ్ని యమధర్మరాజు, మరియు ఇతరలోక పాలకులు తమ స్థానములనుండి త్రోసివేయబడినారు (11). మహా బలశాలియగు ఆతడు దేవతలనందరినీ పీడించుచున్నాడు. మేము మహాదుఃఖమును పొంది యున్నాము. నిన్ను శరణు జొచ్చుచున్నాము (12). బలశాలి, దేవతలందరినీ పీచమడంచిన మహారాక్షసుడు అగు జలంధరుడు యుద్ధములో హృషీకేశుని తన వశము గావించుకొనినాడు (13). మనకు కార్యముల నన్నిటినీ సాధించిపెట్టిన విష్ణువు తాను ఇచ్చిన వరమునకు ఆధీనుడై ఆతనికి వశుడై లక్ష్మీదేవితో గూడి ఆతని ఇంటిలో నివసింప జొచ్చెను (14). ఓ మహాప్రాజ్ఞా! జలంధరుని వినాశము కొరకు ప్రయత్నమును చేయుము. నీవు మాకు దైవానుగ్రహముచే దొరికితివి. నీవు సర్వదా దేవకార్యములనన్నింటినీ చక్కబెట్టితివి (15).

సనత్కుమారుడిట్లు పలికెను - ఆ దేవతల ఈ మాటను విని దయానిధియగు ఆ నారదమహర్షి వారిని ఓదార్చి ఇట్లు పలికెను (16).

నారదుడిట్లు పలికెను- ఓ దేవతలారా! రాక్షసరాజు చేతిలో ఓడి ఆతనిచే మీ స్థానములనుండి వెళ్లగొట్టబడి మీరు ఆతనిచే పీడింపబడి దుఃఖమును పొంది యున్నారను విషయమును నేను ఎరుంగుదును (17). నేను నా శక్తికి తగినట్లు మీ కార్యమును చక్కబెట్టెదను. సందేహము వలదు. ఓ దేవతలారా! మీరు దుఃఖమును పొంది యున్నారు గనుక, నేను మీకు అనుకూలుడనే (18).


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹




🌹 SRI SIVA MAHA PURANA - 772🌹

✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj

🌴 Rudra-saṃhitā (4): Yuddha-khaṇḍa - CHAPTER 18 🌴

🌻 The conversation between Nārada and Jalandhara - 2 🌻


The gods said:—

9. O excellent sage, listen to our misery. O merciful one, after listening to it, destroy it quickly. You are powerful and the favourite of Śiva.

10. The gods have been routed by the Asura Jalandhara from their abodes and positions of controlling authority. Hence we are miserable and distressed.

11. The hot-rayed sun and the moon have been ousted from their positions. The fire-god and the god of death and guardians of the quarters have been expelled.

12. The gods have been harassed by that powerful Asura. We who have been subjected to great grief now seek refuge in you.

13. The great Asura Jalandhara who has suppressed the gods and who is very powerful has made Viṣṇu subservient to him in the battle.

14. Becoming subservient because of helplessness occa. sioned by the boon granted to him, Viṣṇu who carried out our tasks has now begun to stay in his palace along with Lakṣmī.

15. O intelligent one, please exert yourself for the destruction of Jalandhara. You have fortunately come to us and you have always been the person who can achieve everything for us.


Sanatkumāra said:—

16. On hearing these words of the gods, the great sage Nārada, the merciful, consoled them and said.


Nārada said:—

17. O gods, I know that you have been defeated by the king of Asuras, that you are miserable and harassed and have been deposed.

18. There is no doubt in this that I shall carry out your task according to my ability. O gods, since you are in misery I shall be favourable to you.”


Continues....

🌹🌹🌹🌹🌹


No comments:

Post a Comment