ఆదిశంకర, సూరదాసు, రామానుజ జయంతులు, Shankaracharya Jayanthi, Surdas Jayanthi, Ramanuja Jayanti, Skanda Sashti,


పండుగలు మరియు పర్వదినాలు Festivals and Holidays: 
ఆదిశంకర, సూరదాసు, రామానుజ జయంతులు, Shankaracharya Jayanthi, Surdas Jayanthi, Ramanuja Jayanti, Skanda Sashti,

Best Wishes !


06 May 2022

మైత్రేయ మహర్షి బోధనలు - 114


🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 114 🌹

✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 89. దైవకారుణ్యము - 2 🌻


అజ్ఞానులకు పరిష్కారమేమి? జ్ఞానమను దీపమును వెలిగించుటయే, అది వెలిగించు రూపమున దైవమే గురువుగ దిగిరాగ, నిరాకరించు వారినేమన వలెను? నిరాకరించుటయే కాక, దూషించుట, హేళన చేయుట కూడ జరుగుచున్నది. ఇట్టివారే సృష్టి పరిణామ కథకు అంతరాయములు కలిగించుచుందురు. అట్టివారి నుద్ధరించుటకు దైవము శిక్షించుట జరుగుచుండును. శిక్షించుట కూడ ప్రేమతోనే నిర్వర్తింప బడును.

ప్రస్తుతము మానవ జాతి యందు ఇట్లు వెనుకబడి యున్న మానవుల గుంపు ఒకటి కలదు. వారి వలననే ఘర్షణలు, పోరాటములు, మారణకాండ జరుగుచున్నవి. వీరు బహుకొద్ది మందే. అయినను మూర్ఖులగుటచే ఘర్షణము కొనసాగు చుండును. కాలక్రమమున వీరికిని సద్భుద్ధి కలుగునంత వరకు మా కృషి జరుగుచునే యుండును. శపించిననూ, శిక్షించిననూ, శాసించిననూ జీవుల యందు మార్పురాదు. ఓర్పుతో, ప్రేమతో, కరుణతో వీరికిని సన్మార్గము చూపవలెనని దైవనిర్ణయము. కరుణ లేనిచో యిట్టి కార్యము చేయుట కష్టము.


సశేషం.....

🌹 🌹 🌹 🌹 🌹


06 May 2022

నిర్మల ధ్యానాలు - ఓషో - 175


🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 175 🌹

✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ

🍀. స్వచ్ఛమైన హృదయమున్న వ్యక్తి ఎంపిక లేని మార్గంలో వుంటాడు. చురుగ్గా, మెలకువగా, సందర్భానికి సానుకూలంగా వుంటాడు. బాధ్యతగా వుంటాడు. పరవశం పరిమళించడానికి ప్రాథమిక స్థితి అది. 🍀


స్వచ్ఛమైన హృదయంలో సంతోషముంటుంది. అది నీతి కాదు. అమాయకత్వం. నీతివంతుడు అమాయకుడు కాడు. అతను లెక్కలేస్తాడు. దేవుడితో బేరసారాలాడుతాడు. ధర్మబద్ధంగా వున్నాడు. గనక స్వర్గసుఖాలు ఆశిస్తాడు. అతనిలో మోసకారితనముంది. అతని పునాది అంచనాలు వెయ్యడం. అతను అమాయకుడు కాడు. కొన్ని మార్లు నీతివంతుడయిన మనిషి కన్నా నీతి లేని మనిషి అమాయకుడుగా వుండవచ్చు. కారణం ఫలితాలు గురించి అతను లెక్కడు కట్టడు. నీతి లేని మనిషి నిరాడంబరుడు కావచ్చు. కానీ నీతి వున్న వ్యక్తి నిరాడంబరుడు కాడు. అతను చాలా సంక్లిష్టుడు. సన్యాసులంతా చాలా సంక్లిష్టవ్యక్తులు. మోసగాళ్ళు, లెక్కలేసుకునే వాళ్ళు.

వాళ్ళ అస్తిత్వంలో పసిపాప అమాయకత్వం వుండదు. స్వచ్చత అంటే పసిపాప అమాయకత్వం, పసిపాప మంచిది కాదు, చెడ్డదీ కాదు. స్వచ్ఛమయిన హృదయం, ద్వంద్వ వైఖరి లేకపోవడం స్వచ్ఛత. ఏదో ఒకదాన్ని ఎన్నుకోవడం నీతివంతుడి లక్షణం. స్వచ్ఛమైన హృదయంలో స్పందన వుంటుంది. అక్కడ ఎట్లాంటి ఎంపికా వుండదు. స్వచ్ఛమైన హృదయమున్న వ్యక్తి ఎంపిక లేని మార్గంలో వుంటాడు. చురుగ్గా, మెలకువగా, సందర్భానికి సానుకూలంగా వుంటాడు. బాధ్యతగా వుంటాడు. ప్రతిస్పందిస్తాడు. లెక్కలు వేయడు. పరవశం పరిమళించడానికి ప్రాథమిక స్థితి అది.


సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹


06 May 2022

నిత్య ప్రజ్ఞా సందేశములు - 275 - 1. ఆసక్తి ఒక్క విషయంలో మాత్రమే ఉండాలి / DAILY WISDOM - 275 - 1. The Interest should be Only in One Thing


🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 275 / DAILY WISDOM - 275 🌹

🍀 📖. యోగా అధ్యయనం మరియు అభ్యాసం నుండి 🍀

📝 .స్వామి కృష్ణానంద
📚. ప్రసాద్ భరద్వాజ


🌻 1. ఆసక్తి ఒక్క విషయంలో మాత్రమే ఉండాలి 🌻

వివిధ వృత్తులతో మనస్సు చెదిరిపోయే వారికి యోగమనే సాహసం అంత సులభం కాదు. మానవ మనస్సులో ఉన్న చిక్కు ఏమిటంటే అది ఏదైనా ఒక విషయం పట్ల పూర్తి ఏకాగ్రతని కలిగి ఉండదు. ఒకవైపు విషయాలపై ఆసక్తిని కనబరచడానికి మనస్సు పై ఒత్తిడి ఉంటుంది, అదే సమయంలో, మనస్సు యొక్క ఒక విచిత్రమైన చంచలత్వం కారణంగా ఒకే విషయంపై అన్ని సమయాల్లో ఏకాగ్రతను చూపలేదు. ఇది ఒక విచిత్రమైన ద్వంద్వ రజస్సును కలిగి ఉంది. ఇది అవిశ్రాంతంగా విషయాలను అన్ని కోణాల నుంచి విశ్లేషిస్తూ అశాంతితో సతమతమౌతుంది.

దేనిపైనా ఆసక్తి చూపడం వల్ల నష్టం లేదు; కానీ ఆసక్తి ఒక విషయంపై మాత్రమే ఉండాలి, అనేక విషయాలపై కాదు. ఈ ప్రపంచంలో దేనినైనా ఆత్మ విముక్తికి మాధ్యమంగా తీసుకోవచ్చు. భౌతిక వస్తువు బంధాన్ని కలిగిస్తుంది; ఇది కొన్ని పరిస్థితులలో విముక్తిని కూడా కలిగిస్తుంది. ఒక వస్తువు అనేకం లో ఒకటిగా ఉన్నప్పుడు, దాని పట్ల ఉన్న ఆసక్తి ఇంకొక వస్తువు పై మళ్లవచ్చు. అప్పుడది మోక్షానికి సోపానం కాకపోగా బంధానికి కారణం అవుతుంది. ఎందుకంటే ఒకే ఒక్క వస్తువు సత్యం యొక్క సంపూర్ణతను స్వయంగా వ్యక్తపరచలేదు.


కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹



🌹 DAILY WISDOM - 275 🌹

🍀 📖 from The Study and Practice of Yoga 🍀

📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj

🌻 1. The Interest should be Only in One Thing 🌻


The great adventure of yoga is not easy for those whose minds are distracted with various occupations. The difficulty with the human mind is that it cannot be wholly interested in anything. While on the one hand there is a pressure of the mind towards taking interest in things, there is, simultaneously, a peculiar cussedness of the mind on account of which it cannot take interest in anything for all times. It has a peculiar two fold rajas, or inability to rest in itself, working behind it, inside it and outside it—from all sides—as a disturbing factor.

There is no harm in taking interest in anything; but the interest should be only in one thing, not in many things. Anything in this world can be taken as a medium for the liberation of the soul. An object of sense can cause bondage; it also can cause liberation under certain conditions. When an object becomes merely one among the many—just one individual in a group—and the interest in the object may shift to another object after a period of time, then that object becomes a source of bondage, because it is not true that any single individual object can manifest the wholeness of truth in itself.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


06 May 2022

విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 596 / Vishnu Sahasranama Contemplation - 596


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 596 / Vishnu Sahasranama Contemplation - 596🌹

📚. ప్రసాద్‌ భరధ్వాజ

🌻 596. అనివర్తీ, अनिवर्ती, Anivartī 🌻


ఓం అనివర్తినే నమః | ॐ अनिवर्तिने नमः | OM Anivartine namaḥ

వృషప్రియత్వాద్ధర్మాద్వా సఙ్గ్రామాద్వాఽసురైస్సహ ।
న నివర్తత ఇత్యనివర్తీతి ప్రోచ్యతే హరిః ॥

తాను వృషప్రియుడు అనగా ధర్మము తనకు ప్రీతిపాత్రముగా కలవాడుగావున ధర్మమునుండి ఎన్నడును మరలువాడు కాదు. లేదా దేవాసురుల నడుమ జరుగు సంగ్రామమునుండి ఎన్నడును మరలువాడు కాదు.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 596 🌹

📚 Prasad Bharadwaj

🌻 596. Anivartī 🌻


OM Anivartine namaḥ

वृषप्रियत्वाद्धर्माद्वा सङ्ग्रामाद्वाऽसुरैस्सह ।
न निवर्तत इत्यनिवर्तीति प्रोच्यते हरिः ॥

Vr‌ṣapriyatvāddharmādvā saṅgrāmādvā’suraissaha,
Na nivartata ityanivartīti procyate hariḥ.


Since He is Vr‌ṣapriyaḥ i.e., the One to whom dharma or righteousness is dear, He never abrogates from the path of dharma.

Or He who never turns back from the war between devas and asuras is Anivartī.


🌻 🌻 🌻 🌻 🌻


Source Sloka

अनिवर्ती निवृत्तात्मा संक्षेप्ता क्षेमकृच्छिवः ।
श्रीवत्सवक्षाश्श्रीवासश्श्रीपतिः श्रीमतां वरः ॥ ६४ ॥

అనివర్తీ నివృత్తాత్మా సంక్షేప్తా క్షేమకృచ్ఛివః ।
శ్రీవత్సవక్షాశ్శ్రీవాసశ్శ్రీపతిః శ్రీమతాం వరః ॥ 64 ॥

Anivartī nivr‌ttātmā saṃkṣeptā kṣemakr‌cchivaḥ,
Śrīvatsavakṣāśśrīvāsaśśrīpatiḥ śrīmatāṃ varaḥ ॥ 64 ॥


Continues....

🌹 🌹 🌹 🌹🌹


06 May 2022

06 - MAY - 2022 శుక్రవారం, భృగు వాసరే MESSAGES

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam, 06, మే 2022 శుక్రవారం, భృగు వాసరే 🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 197 / Bhagavad-Gita - 197 - 4-35 జ్ఞానయోగము 🌹
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 596 / Vishnu Sahasranama Contemplation - 596🌹
4) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 275 / DAILY WISDOM - 275 🌹  
5) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 175 🌹
6) 🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 114 🌹 

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శుభ శుక్రవారం మిత్రులందరికీ 🌹*
*భృగు వాసరే, 06, మే 2022*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*

*🌻. పండుగలు మరియు పర్వదినాలు : ఆదిశంకర, సూరదాసు, రామానుజ జయంతులు, Shankaracharya, Surdas, Ramanuja Jayanti, Skanda Sashti, 
🌻*

*🍀. 4. గజలక్ష్మి స్త్రోత్రం 🍀*

*జయ జయ దుర్గతి నాశిని కామిని, సర్వఫలప్రద శాస్త్రమయే*
*రధగజ తురగపదాతి సమావృత, పరిజన మండిత లోకనుతే |*
*హరిహర బ్రహ్మ సుపూజిత సేవిత, తాప నివారిణి పాదయుతే*
*జయ జయహే మధుసూదన కామిని, గజలక్ష్మీ రూపేణ పాలయ మామ్*

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : పుట్టుకతోనే జీవితం పూలవనం కాదు. ప్రతి మొక్కా మనమే నాటుకుని దాన్ని అందమైన ఉద్యానవనంగా మార్చుకోవాలి - సద్గురు శ్రీరామశర్మ 🍀*

🌷🌷🌷🌷🌷

శుభకృత్‌ సంవత్సరం, వైశాఖ మాసం
ఉత్తరాయణం, వసంత ఋతువు
తిధి : శుద్ధ పంచమి మ.12:34 వరకు
నక్షత్రం : ఆరుద్ర ఉ.9:19 వరకు
యోగం : ధృతి రా.7:06 వరకు
కరణం : బాలవ మ.12:34 వరకు,
కౌలువ 07తా తె.1:48 వరకు
సూర్యోదయం : ఉ.5:52 
సూర్యాస్తమయం : సా.6:34
అభిజత్ ముహూర్తం : ఉ.11:48ల 
మ.12:38
బ్రహ్మ ముహూర్తం : తె.4:16ల తె.5:04
వర్జ్య కాలం : రా.10:51ల 
07తా తె.0:52
గుళిక : ఉ.7:27ల ఉ.9:02
దుర్ముహూర్తం : ఉ.8:24ల ఉ.9:15,  
మ.12:38ల మ.1:29
రాహు కాలం : ఉ.10:38ల మ.12:13
యమగండం : మ.3:24ల సా.4:59
సూర్య సంచార రాశి: మేషం
చంద్ర సంచార రాశి: జెమిని
పద్మ యోగం - ఐశ్వర్య ప్రాప్తి 09:21:40
వరకు తదుపరి లంబ యోగం - చికాకులు,
అపశకునం 

🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam 
#PanchangDaily
#DailyTeluguCalender 
Join and Share 
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 197 / Bhagavad-Gita - 197 🌹*
*✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. 4 వ అధ్యాయము - జ్ఞాన యోగము - 35 🌴*

*35. యద్జ్ఞాత్వా న పునర్మోహమేవం యాస్యసి పాణ్డవ |*
*యేన భూతాన్య శేషాణి ద్రక్ష్య స్యాత్మన్యథో మయి ||*

🌷. తాత్పర్యం :
*ఆత్మదర్శియైన మహాత్ముని నుండి నిజమైన జ్ఞానమును పొందినపుడు ఆ జ్ఞానముచే సమస్తజీవులు పరమాత్ముని అంశలని, అనగా నాకు సంబంధించిన వారని గాంచగలుగుటచే నీవు తిరిగి ఎన్నడును ఇట్టి మొహమునకు గురికావు.*

🌷. భాష్యము :
జీవులందరును దేవదేవుడైన శ్రీకృష్ణుని అంశలని ఎరుగగలుగుటయే ఆత్మదర్శియైన మహాత్ముని(ఉన్నది ఉన్నట్లుగా గాంచగలిగిన సత్యదర్శి) నుండి జ్ఞానమును పొందుట వలన కలిగెడి ఫలితమై యున్నది. కృష్ణుని నుండి విడివడియున్న స్థితి యొక్క భావనయే మాయ(మా – కాదు, యా – ఇది) యనబడును. అయినను కొందరు మాకు కృష్ణునితో సంబంధము లేదనియు, అతడు కేవలము ఒక చారిత్రాత్మకపురుషుడు మాత్రమే యనియు మరియు పరతత్త్వమనునది నిరాకారబ్రహ్మమే యనియు భావింతురు. కాని వాస్తవమునాకు భగవద్గీత యందు తెలుపబడిన రీతిగా నిరాకారబ్రహ్మము శ్రీకృష్ణుని శరీరకాంతియై యున్నది. పూర్ణపురుషోత్తమునిగా శ్రీకృష్ణుడే సమస్తమునకు కారణమైయున్నాడు. 

శ్రీకృష్ణుడే సమస్త కారణములకు కారణమైన దేవదేవుడని బ్రహ్మసంహిత యందు స్పష్టముగా తెలుపబడినది. లక్షలాదిగానున్న అవతారములన్నియును అతని భిన్నవిస్తారములై యున్నవి. అదే విధముగా జీవులు సైతము ఆ శ్రీకృష్ణుని విస్తారములే. శ్రీకృష్ణుడు అట్టి వివిధ విస్తారములందు తన మూలస్థితిని కోల్పోవునని మయావాద తత్త్వవేత్తలు తప్పుగా భావింతురు. 

వాస్తవమునకు అట్టి భావనము కేవలము భౌతికమైనది. దేనినైనను ముక్కలుగా విభజించినచో అది తన మూలరూపమును కోల్పోవుననుట ఈ భౌతికజగత్తు యొక్క అనుభవమై యున్నది. కాని పరతత్త్వమనగా ఒకటిని ఒకటితో కలుపగా ఒకటిగా నుండునదనియు మరియు ఒకటి నుండి ఒకటిని తీసివేసినను ఒకటిగనే నిలుచునటువంటిదనియు వారు ఎరుగజాలరు. కాని ఆధ్యాత్మికజగము సమస్తము ఏ రీతిగానే ఉండును. 

పరతత్త్వమును గూర్చిన తగిన జ్ఞానము లేనందున మాయచే కప్పబడి మనము కృష్ణుని నుండి వేరనెడి భావనను కలిగియుందుము. మనము శ్రీకృష్ణుని నుండి విదివదిన అంశలమైనను అతని నుండి భిన్నులము కాము. జీవుల దేహభేదములు మాయయేగాని వాస్తావము కాదు. 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 Bhagavad-Gita as It is - 197 🌹*
*✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada*
*📚 Prasad Bharadwaj*

*🌴 Chapter 4 - Jnana Yoga - 35 🌴*

*35. yaj jñātvā na punar moham evaṁ yāsyasi pāṇḍava*
*yena bhūtāny aśeṣāṇi drakṣyasy ātmany atho mayi*

🌷 Translation : 
*Having obtained real knowledge from a self-realized soul, you will never fall again into such illusion, for by this knowledge you will see that all living beings are but part of the Supreme, or, in other words, that they are Mine.*

🌹 Purport :
The result of receiving knowledge from a self-realized soul, or one who knows things as they are, is learning that all living beings are parts and parcels of the Supreme Personality of Godhead, Lord Śrī Kṛṣṇa. The sense of an existence separate from Kṛṣṇa is called māyā (mā – not, yā – this).

Some think that we have nothing to do with Kṛṣṇa, that Kṛṣṇa is only a great historical personality and that the Absolute is the impersonal Brahman. Factually, as it is stated in the Bhagavad-gītā, this impersonal Brahman is the personal effulgence of Kṛṣṇa. Kṛṣṇa, as the Supreme Personality of Godhead, is the cause of everything. In the Brahma-saṁhitā it is clearly stated that Kṛṣṇa is the Supreme Personality of Godhead, the cause of all causes. Even the millions of incarnations are only His different expansions. 

Similarly, the living entities are also expansions of Kṛṣṇa. The Māyāvādī philosophers wrongly think that Kṛṣṇa loses His own separate existence in His many expansions. This thought is material in nature. We have experience in the material world that a thing, when fragmentally distributed, loses its own original identity. But the Māyāvādī philosophers fail to understand that absolute means that one plus one is equal to one, and that one minus one is also equal to one. This is the case in the absolute world.

For want of sufficient knowledge in the absolute science, we are now covered with illusion, and therefore we think that we are separate from Kṛṣṇa. Although we are separated parts of Kṛṣṇa, we are nevertheless not different from Him. The bodily difference of the living entities is māyā, or not actual fact. 
🌹 🌹 🌹 🌹 🌹
#భగవద్గీత #BhagavadGita
#చైతన్యవిజ్ఞానం #PrasadBhardwaj 
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 596 / Vishnu Sahasranama Contemplation - 596🌹*
📚. ప్రసాద్‌ భరధ్వాజ

*🌻 596. అనివర్తీ, अनिवर्ती, Anivartī 🌻*

*ఓం అనివర్తినే నమః | ॐ अनिवर्तिने नमः | OM Anivartine namaḥ*

*వృషప్రియత్వాద్ధర్మాద్వా సఙ్గ్రామాద్వాఽసురైస్సహ ।*
*న నివర్తత ఇత్యనివర్తీతి ప్రోచ్యతే హరిః ॥*

*తాను వృషప్రియుడు అనగా ధర్మము తనకు ప్రీతిపాత్రముగా కలవాడుగావున ధర్మమునుండి ఎన్నడును మరలువాడు కాదు. లేదా దేవాసురుల నడుమ జరుగు సంగ్రామమునుండి ఎన్నడును మరలువాడు కాదు.*

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 596 🌹*
📚 Prasad Bharadwaj

*🌻 596. Anivartī 🌻*

*OM Anivartine namaḥ*

वृषप्रियत्वाद्धर्माद्वा सङ्ग्रामाद्वाऽसुरैस्सह ।
न निवर्तत इत्यनिवर्तीति प्रोच्यते हरिः ॥

*Vr‌ṣapriyatvāddharmādvā saṅgrāmādvā’suraissaha,*
*Na nivartata ityanivartīti procyate hariḥ.*

*Since He is Vr‌ṣapriyaḥ i.e., the One to whom dharma or righteousness is dear, He never abrogates from the path of dharma.*

*Or He who never turns back from the war between devas and asuras is Anivartī.*

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
अनिवर्ती निवृत्तात्मा संक्षेप्ता क्षेमकृच्छिवः ।श्रीवत्सवक्षाश्श्रीवासश्श्रीपतिः श्रीमतां वरः ॥ ६४ ॥
అనివర్తీ నివృత్తాత్మా సంక్షేప్తా క్షేమకృచ్ఛివః ।శ్రీవత్సవక్షాశ్శ్రీవాసశ్శ్రీపతిః శ్రీమతాం వరః ॥ 64 ॥
Anivartī nivr‌ttātmā saṃkṣeptā kṣemakr‌cchivaḥ,Śrīvatsavakṣāśśrīvāsaśśrīpatiḥ śrīmatāṃ varaḥ ॥ 64 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹
#విష్ణుసహస్రనామతత్వవిచారణ #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama #PrasadBhardwaj 
https://t.me/vishnusahasranaam
www.facebook.com/groups/vishnusahasranaam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://chat.whatsapp.com/
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 275 / DAILY WISDOM - 275 🌹*
*🍀 📖. యోగా అధ్యయనం మరియు అభ్యాసం నుండి 🍀*
*📝 .స్వామి కృష్ణానంద*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🌻 1. ఆసక్తి ఒక్క విషయంలో మాత్రమే ఉండాలి 🌻*

*వివిధ వృత్తులతో మనస్సు చెదిరిపోయే వారికి యోగమనే సాహసం అంత సులభం కాదు. మానవ మనస్సులో ఉన్న చిక్కు ఏమిటంటే అది ఏదైనా ఒక విషయం పట్ల పూర్తి ఏకాగ్రతని కలిగి ఉండదు. ఒకవైపు విషయాలపై ఆసక్తిని కనబరచడానికి మనస్సు పై ఒత్తిడి ఉంటుంది, అదే సమయంలో, మనస్సు యొక్క ఒక విచిత్రమైన చంచలత్వం కారణంగా ఒకే విషయంపై అన్ని సమయాల్లో ఏకాగ్రతను చూపలేదు. ఇది ఒక విచిత్రమైన ద్వంద్వ రజస్సును కలిగి ఉంది. ఇది అవిశ్రాంతంగా విషయాలను అన్ని కోణాల నుంచి విశ్లేషిస్తూ అశాంతితో సతమతమౌతుంది.*

*దేనిపైనా ఆసక్తి చూపడం వల్ల నష్టం లేదు; కానీ ఆసక్తి ఒక విషయంపై మాత్రమే ఉండాలి, అనేక విషయాలపై కాదు. ఈ ప్రపంచంలో దేనినైనా ఆత్మ విముక్తికి మాధ్యమంగా తీసుకోవచ్చు. భౌతిక వస్తువు బంధాన్ని కలిగిస్తుంది; ఇది కొన్ని పరిస్థితులలో విముక్తిని కూడా కలిగిస్తుంది. ఒక వస్తువు అనేకం లో ఒకటిగా ఉన్నప్పుడు, దాని పట్ల ఉన్న ఆసక్తి ఇంకొక వస్తువు పై మళ్లవచ్చు. అప్పుడది మోక్షానికి సోపానం కాకపోగా బంధానికి కారణం అవుతుంది. ఎందుకంటే ఒకే ఒక్క వస్తువు సత్యం యొక్క సంపూర్ణతను స్వయంగా వ్యక్తపరచలేదు.*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 DAILY WISDOM - 275 🌹*
*🍀 📖 from The Study and Practice of Yoga 🍀*
*📝 Swami Krishnananda*
*📚. Prasad Bharadwaj*

*🌻 1. The Interest should be Only in One Thing 🌻*

*The great adventure of yoga is not easy for those whose minds are distracted with various occupations. The difficulty with the human mind is that it cannot be wholly interested in anything. While on the one hand there is a pressure of the mind towards taking interest in things, there is, simultaneously, a peculiar cussedness of the mind on account of which it cannot take interest in anything for all times. It has a peculiar twofold rajas, or inability to rest in itself, working behind it, inside it and outside it—from all sides—as a disturbing factor.*

*There is no harm in taking interest in anything; but the interest should be only in one thing, not in many things. Anything in this world can be taken as a medium for the liberation of the soul. An object of sense can cause bondage; it also can cause liberation under certain conditions. When an object becomes merely one among the many—just one individual in a group—and the interest in the object may shift to another object after a period of time, then that object becomes a source of bondage, because it is not true that any single individual object can manifest the wholeness of truth in itself.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#DailyWisdom
#నిత్యప్రజ్ఞాసందేశములు #SwamiKrishnananda
 #PrasadBhardwaj 
https://t.me/Seeds_Of_Consciousness
www.facebook.com/groups/dailysatsangwisdom/ 
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://incarnation14.wordpress.com/
https://dailybhakthimessages.blogspot.com

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 175 🌹*
*✍️. సౌభాగ్య*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🍀. స్వచ్ఛమైన హృదయమున్న వ్యక్తి ఎంపిక లేని మార్గంలో వుంటాడు. చురుగ్గా, మెలకువగా, సందర్భానికి సానుకూలంగా వుంటాడు. బాధ్యతగా వుంటాడు. పరవశం పరిమళించడానికి ప్రాథమిక స్థితి అది. 🍀*

*స్వచ్ఛమైన హృదయంలో సంతోషముంటుంది. అది నీతి కాదు. అమాయకత్వం. నీతివంతుడు అమాయకుడు కాడు. అతను లెక్కలేస్తాడు. దేవుడితో బేరసారాలాడుతాడు. ధర్మబద్ధంగా వున్నాడు. గనక స్వర్గసుఖాలు ఆశిస్తాడు. అతనిలో మోసకారితనముంది. అతని పునాది అంచనాలు వెయ్యడం. అతను అమాయకుడు కాడు. కొన్ని మార్లు నీతివంతుడయిన మనిషి కన్నా నీతి లేని మనిషి అమాయకుడుగా వుండవచ్చు. కారణం ఫలితాలు గురించి అతను లెక్కడు కట్టడు. నీతి లేని మనిషి నిరాడంబరుడు కావచ్చు. కానీ నీతి వున్న వ్యక్తి నిరాడంబరుడు కాడు. అతను చాలా సంక్లిష్టుడు. సన్యాసులంతా చాలా సంక్లిష్టవ్యక్తులు. మోసగాళ్ళు, లెక్కలేసుకునే వాళ్ళు.*

*వాళ్ళ అస్తిత్వంలో పసిపాప అమాయకత్వం వుండదు. స్వచ్చత అంటే పసిపాప అమాయకత్వం, పసిపాప మంచిది కాదు, చెడ్డదీ కాదు. స్వచ్ఛమయిన హృదయం, ద్వంద్వ వైఖరి లేకపోవడం స్వచ్ఛత. ఏదో ఒకదాన్ని ఎన్నుకోవడం నీతివంతుడి లక్షణం. స్వచ్ఛమైన హృదయంలో స్పందన వుంటుంది. అక్కడ ఎట్లాంటి ఎంపికా వుండదు. స్వచ్ఛమైన హృదయమున్న వ్యక్తి ఎంపిక లేని మార్గంలో వుంటాడు. చురుగ్గా, మెలకువగా, సందర్భానికి సానుకూలంగా వుంటాడు. బాధ్యతగా వుంటాడు. ప్రతిస్పందిస్తాడు. లెక్కలు వేయడు. పరవశం పరిమళించడానికి ప్రాథమిక స్థితి అది.*

*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోరోజువారీధ్యానములు
#OshoDailyMeditations
#ఓషోబోధనలు #OshoDiscourse 
#ఓషోనిర్మలధ్యానములు #PrasadBhardwaj 
https://t.me/ChaitanyaVijnanam
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/ 
https://oshodailymeditations.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 114 🌹* 
*✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*

*🌻 89. దైవకారుణ్యము - 2 🌻*

*అజ్ఞానులకు పరిష్కారమేమి? జ్ఞానమను దీపమును వెలిగించుటయే, అది వెలిగించు రూపమున దైవమే గురువుగ దిగిరాగ, నిరాకరించు వారినేమన వలెను? నిరాకరించుటయే కాక, దూషించుట, హేళన చేయుట కూడ జరుగుచున్నది. ఇట్టివారే సృష్టి పరిణామ కథకు అంతరాయములు కలిగించుచుందురు. అట్టివారి నుద్ధరించుటకు దైవము శిక్షించుట జరుగుచుండును. శిక్షించుట కూడ ప్రేమతోనే నిర్వర్తింప బడును.*

*ప్రస్తుతము మానవ జాతి యందు ఇట్లు వెనుకబడి యున్న మానవుల గుంపు ఒకటి కలదు. వారి వలననే ఘర్షణలు, పోరాటములు, మారణకాండ జరుగుచున్నవి. వీరు బహుకొద్ది మందే. అయినను మూర్ఖులగుటచే ఘర్షణము కొనసాగు చుండును. కాలక్రమమున వీరికిని సద్భుద్ధి కలుగునంత వరకు మా కృషి జరుగుచునే యుండును. శపించిననూ, శిక్షించిననూ, శాసించిననూ జీవుల యందు మార్పురాదు. ఓర్పుతో, ప్రేమతో, కరుణతో వీరికిని సన్మార్గము చూపవలెనని దైవనిర్ణయము. కరుణ లేనిచో యిట్టి కార్యము చేయుట కష్టము.*

*సశేషం.....*
🌹 🌹 🌹 🌹 🌹
#మైత్రేయమహర్షిబోధనలు #MaitreyaMaharshi #సద్గురుపార్వతీకుమార్ #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
www.facebook.com/groups/maharshiwisdom/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹