మైత్రేయ మహర్షి బోధనలు - 114
🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 114 🌹
✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻 89. దైవకారుణ్యము - 2 🌻
అజ్ఞానులకు పరిష్కారమేమి? జ్ఞానమను దీపమును వెలిగించుటయే, అది వెలిగించు రూపమున దైవమే గురువుగ దిగిరాగ, నిరాకరించు వారినేమన వలెను? నిరాకరించుటయే కాక, దూషించుట, హేళన చేయుట కూడ జరుగుచున్నది. ఇట్టివారే సృష్టి పరిణామ కథకు అంతరాయములు కలిగించుచుందురు. అట్టివారి నుద్ధరించుటకు దైవము శిక్షించుట జరుగుచుండును. శిక్షించుట కూడ ప్రేమతోనే నిర్వర్తింప బడును.
ప్రస్తుతము మానవ జాతి యందు ఇట్లు వెనుకబడి యున్న మానవుల గుంపు ఒకటి కలదు. వారి వలననే ఘర్షణలు, పోరాటములు, మారణకాండ జరుగుచున్నవి. వీరు బహుకొద్ది మందే. అయినను మూర్ఖులగుటచే ఘర్షణము కొనసాగు చుండును. కాలక్రమమున వీరికిని సద్భుద్ధి కలుగునంత వరకు మా కృషి జరుగుచునే యుండును. శపించిననూ, శిక్షించిననూ, శాసించిననూ జీవుల యందు మార్పురాదు. ఓర్పుతో, ప్రేమతో, కరుణతో వీరికిని సన్మార్గము చూపవలెనని దైవనిర్ణయము. కరుణ లేనిచో యిట్టి కార్యము చేయుట కష్టము.
సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹
06 May 2022
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment