నిర్మల ధ్యానాలు - ఓషో - 175


🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 175 🌹

✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ

🍀. స్వచ్ఛమైన హృదయమున్న వ్యక్తి ఎంపిక లేని మార్గంలో వుంటాడు. చురుగ్గా, మెలకువగా, సందర్భానికి సానుకూలంగా వుంటాడు. బాధ్యతగా వుంటాడు. పరవశం పరిమళించడానికి ప్రాథమిక స్థితి అది. 🍀


స్వచ్ఛమైన హృదయంలో సంతోషముంటుంది. అది నీతి కాదు. అమాయకత్వం. నీతివంతుడు అమాయకుడు కాడు. అతను లెక్కలేస్తాడు. దేవుడితో బేరసారాలాడుతాడు. ధర్మబద్ధంగా వున్నాడు. గనక స్వర్గసుఖాలు ఆశిస్తాడు. అతనిలో మోసకారితనముంది. అతని పునాది అంచనాలు వెయ్యడం. అతను అమాయకుడు కాడు. కొన్ని మార్లు నీతివంతుడయిన మనిషి కన్నా నీతి లేని మనిషి అమాయకుడుగా వుండవచ్చు. కారణం ఫలితాలు గురించి అతను లెక్కడు కట్టడు. నీతి లేని మనిషి నిరాడంబరుడు కావచ్చు. కానీ నీతి వున్న వ్యక్తి నిరాడంబరుడు కాడు. అతను చాలా సంక్లిష్టుడు. సన్యాసులంతా చాలా సంక్లిష్టవ్యక్తులు. మోసగాళ్ళు, లెక్కలేసుకునే వాళ్ళు.

వాళ్ళ అస్తిత్వంలో పసిపాప అమాయకత్వం వుండదు. స్వచ్చత అంటే పసిపాప అమాయకత్వం, పసిపాప మంచిది కాదు, చెడ్డదీ కాదు. స్వచ్ఛమయిన హృదయం, ద్వంద్వ వైఖరి లేకపోవడం స్వచ్ఛత. ఏదో ఒకదాన్ని ఎన్నుకోవడం నీతివంతుడి లక్షణం. స్వచ్ఛమైన హృదయంలో స్పందన వుంటుంది. అక్కడ ఎట్లాంటి ఎంపికా వుండదు. స్వచ్ఛమైన హృదయమున్న వ్యక్తి ఎంపిక లేని మార్గంలో వుంటాడు. చురుగ్గా, మెలకువగా, సందర్భానికి సానుకూలంగా వుంటాడు. బాధ్యతగా వుంటాడు. ప్రతిస్పందిస్తాడు. లెక్కలు వేయడు. పరవశం పరిమళించడానికి ప్రాథమిక స్థితి అది.


సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹


06 May 2022

No comments:

Post a Comment