నిత్య ప్రజ్ఞా సందేశములు - 275 - 1. ఆసక్తి ఒక్క విషయంలో మాత్రమే ఉండాలి / DAILY WISDOM - 275 - 1. The Interest should be Only in One Thing


🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 275 / DAILY WISDOM - 275 🌹

🍀 📖. యోగా అధ్యయనం మరియు అభ్యాసం నుండి 🍀

📝 .స్వామి కృష్ణానంద
📚. ప్రసాద్ భరద్వాజ


🌻 1. ఆసక్తి ఒక్క విషయంలో మాత్రమే ఉండాలి 🌻

వివిధ వృత్తులతో మనస్సు చెదిరిపోయే వారికి యోగమనే సాహసం అంత సులభం కాదు. మానవ మనస్సులో ఉన్న చిక్కు ఏమిటంటే అది ఏదైనా ఒక విషయం పట్ల పూర్తి ఏకాగ్రతని కలిగి ఉండదు. ఒకవైపు విషయాలపై ఆసక్తిని కనబరచడానికి మనస్సు పై ఒత్తిడి ఉంటుంది, అదే సమయంలో, మనస్సు యొక్క ఒక విచిత్రమైన చంచలత్వం కారణంగా ఒకే విషయంపై అన్ని సమయాల్లో ఏకాగ్రతను చూపలేదు. ఇది ఒక విచిత్రమైన ద్వంద్వ రజస్సును కలిగి ఉంది. ఇది అవిశ్రాంతంగా విషయాలను అన్ని కోణాల నుంచి విశ్లేషిస్తూ అశాంతితో సతమతమౌతుంది.

దేనిపైనా ఆసక్తి చూపడం వల్ల నష్టం లేదు; కానీ ఆసక్తి ఒక విషయంపై మాత్రమే ఉండాలి, అనేక విషయాలపై కాదు. ఈ ప్రపంచంలో దేనినైనా ఆత్మ విముక్తికి మాధ్యమంగా తీసుకోవచ్చు. భౌతిక వస్తువు బంధాన్ని కలిగిస్తుంది; ఇది కొన్ని పరిస్థితులలో విముక్తిని కూడా కలిగిస్తుంది. ఒక వస్తువు అనేకం లో ఒకటిగా ఉన్నప్పుడు, దాని పట్ల ఉన్న ఆసక్తి ఇంకొక వస్తువు పై మళ్లవచ్చు. అప్పుడది మోక్షానికి సోపానం కాకపోగా బంధానికి కారణం అవుతుంది. ఎందుకంటే ఒకే ఒక్క వస్తువు సత్యం యొక్క సంపూర్ణతను స్వయంగా వ్యక్తపరచలేదు.


కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹



🌹 DAILY WISDOM - 275 🌹

🍀 📖 from The Study and Practice of Yoga 🍀

📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj

🌻 1. The Interest should be Only in One Thing 🌻


The great adventure of yoga is not easy for those whose minds are distracted with various occupations. The difficulty with the human mind is that it cannot be wholly interested in anything. While on the one hand there is a pressure of the mind towards taking interest in things, there is, simultaneously, a peculiar cussedness of the mind on account of which it cannot take interest in anything for all times. It has a peculiar two fold rajas, or inability to rest in itself, working behind it, inside it and outside it—from all sides—as a disturbing factor.

There is no harm in taking interest in anything; but the interest should be only in one thing, not in many things. Anything in this world can be taken as a medium for the liberation of the soul. An object of sense can cause bondage; it also can cause liberation under certain conditions. When an object becomes merely one among the many—just one individual in a group—and the interest in the object may shift to another object after a period of time, then that object becomes a source of bondage, because it is not true that any single individual object can manifest the wholeness of truth in itself.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


06 May 2022

No comments:

Post a Comment