నవనాగ నామ స్తోత్రం - సర్ప సూక్తం Navanaga Nam Stotram - Sarpa Suktam

🌹. నవనాగ నామ స్తోత్రం - సర్ప సూక్తం 🌹

📚. ప్రసాద్ భరద్వాజ


అనంతం వాసుకిం శేషం పద్మనాభం చ కంబలం!
శంఖపాలం ధృతరాష్ట్రం తక్షకం కాళియం తథా!!

ఫలశృతి:

ఏతాని నవ నామాని నాగానాం చ మహాత్మనామ్!
సాయంకాలే పఠేన్నిత్యం ప్రాతః కాలే విశేషతః!

సంతానం ప్రాప్యతే నూనం సంతానస్య చ రక్షకాః!
సర్వబాధా వినిర్ముక్తః సర్వత్ర విజయీభవేత్!!

సర్ప దర్శనకాలే వా పూజాకాలే చ యః ఫఠేత్!
తస్య విషభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్‌!!

🙏ఓం నాగరాజాయనమః ప్రార్థయామి నమస్కరోమి🙏

ఇతి శ్రీ నవనాగ స్తోత్రం.

🌻 🌻 🌻 🌻 🌻


🌹. సర్ప సూక్తం 🌹

బ్రహ్మలోకేషు యేసర్పాః శేషనాగ పురోగమాః
నమోస్తు తేభ్యః సర్వేభ్యః సుప్రీతాః మమ సర్వదాః

ఇంద్రలోకేషు యేసర్పాః వాసుకీ ప్రముఖాదయః
నమోస్తు తేభ్యః సర్వేభ్యః సుప్రీతాః మమ సర్వదాః

కౌద్ర వేయాశ్చ యేసర్పాః మాతృభక్తి పరాయణాః
నమోస్తు తేభ్యః సర్వేభ్యః సుప్రీతాః మమ సర్వదాః

ఇంద్రలోకేషు యేసర్పాః తక్షకా ప్రముఖాదయః
నమోస్తు తేభ్యః సర్వేభ్యః సుప్రీతాః మమ సర్వదాః

సత్యలోకేషు యేసర్పాః వాసుకి నా సురక్షితాః
నమోస్తు తేభ్యః సర్వేభ్యః సుప్రీతాః మమ సర్వదాః

మలయేచైవ యేసర్పాః కర్కోటక ప్రముఖాదయః
నమోస్తు తేభ్యః సర్వేభ్యః సుప్రీతాః మమ సర్వదాః

పృథివ్యాం చైవ యేసర్పాః యే సాకేత నివాసినః
నమోస్తు తేభ్యః సర్వేభ్యః సుప్రీతాః మమ సర్వదాః

గ్రామే యదివారణ్యే యేసర్పాః ప్రచరన్తిచ
నమోస్తు తేభ్యః సర్వేభ్యః సుప్రీతాః మమ సర్వదాః

సముద్ర తీరే యేసర్పాః యే సర్పా జలవాసినః
నమోస్తు తేభ్యః సర్వేభ్యః సుప్రీతాః మమ సర్వదాః

రసాతలేఘ యేసర్పాః అనంతాది మహాబలాః
నమోస్తు తేభ్యః సర్వేభ్యః సుప్రీతాః మమ సర్వదాః

🌹 🌹 🌹 🌹 🌹

08 Nov 2021

నాగులచవితి విశిష్టత Nagulachauvithy Vishishtata

🌹. నాగులచవితి విశిష్టత 🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌹. నాగులచవితి రోజున ఈ క్రింది శ్లోకాన్ని పఠిస్తే కలిదోష నివారణ అవుతుందని శాస్త్రాలు పేర్కొంటున్నాయి. 🌹

"కర్కోటకస్య నాగస్య దయయంత్యా నలస్య చ |
ఋతుపర్ణస్య రాజర్షే : కీర్తనం కలినాశనమ్‌ ||
🌹 🌹 🌹 🌹 🌹


కాలనాగము మానవ శరీరంలో నిద్రిస్తున్నట్లు నటిస్తూ ! కామ , క్రోధ , లోభ , మోహ , మద , మాత్సర్యాలనే విషాల్ని గ్రక్కుతూ మానవునిలో 'సత్వగుణ' సంపత్తిని హరించి వేస్తూ ఉంటుందని అందుకు ' నాగుల చవితి రోజున ప్రత్యక్షంగా విషసర్ప పుట్టలను ఆరాధించి పుట్టలో పాలు పోస్తే మానవునిలో ఉన్న విషసర్పం కూడా శ్వేతత్వం పొంది , అందరి హృదయాలలో నివసించే ' శ్రీమహావిష్ణువు" నకు తెల్లని ఆదిశేషువుగా మారి శేషపాన్పుగా మారాలని కోరికతో చేసేదే ! ఈ నాగుపాము పుట్టలో పాలు పోయుటలోగల అంతర్యమని కొంత మంది పెద్దల మాటల ద్వార తెలుస్తుంది.

🍀. నాగులకు పాలు పోయడంలోని అంతరార్థం 🍀

పాలు స్వచ్ఛతకు ప్రతీక. ఈ పాలను వేడి చేసి చల్లపరచి దానికి కొద్దిగా చల్లను చేరిస్తే పెరుగవుతుంది.

ఆ పెరుగును చిలుకగా వచ్చిన చల్లలో నుంచి వచ్చే వెన్నను కాయగా నెయ్యి అవుతుంది. దీనిని మనం యజ్ఞంలో హవిస్సుగా ఉపయోగిస్తాం. అలాగే మన బ్రతుకనే పాలను జ్ఞానమనే వేడితో కాచి వివేకమనే చల్ల కలిపితే సుఖమనే పెరుగు తయారవుతుంది.

ఈ పెరుగును ఔదార్యమనే కవ్వంతో చిలుకగా శాంతి అనే చల్ల లభిస్తుంది. ఆ చల్లను సత్యం , శివం , సుందరం అనే మూడు వేళ్ళతో కాస్త వంచి తీస్తే సమాజ సహకారం అనే వెన్న బయటకు వస్తుంది.

ఆ వెన్నకు భగవంతుని ఆరాధన అనే జ్ఞానాన్ని జోడిస్తే త్యాగము , యోగము , భోగమనే మూడు రకముల నెయ్యి ఆవిర్భవిస్తుంది. ఇదే సకల వేదాలసారం , సకల జీవనసారం అయిన పాలను జీవనమునకు ప్రతీక అయిన నాగులకు అర్పించడంలోని అంతరార్థం.

”దేవా: చక్షుషా భుంజానా: భక్తాన్‌ పాలయంతి” అనేది ప్రమాణ వాక్యం , అనగా దేవతలు ప్రసాదాన్ని చూపులతోనే ఆరగిస్తారని అర్థం.

పాములు పాలు తాగవనే అపోహతో పాలు పోయడం మానకుండా కొద్దిగా పాలను పుట్టలో పోసి మిగిలిన పాలను నైవేద్యంగా స్వీకరించాలి.

నాగుల చవితి మంత్రం

🌹. నాగులచవితి రోజున ఈ క్రింది శ్లోకాన్ని పఠిస్తే కలిదోష నివారణ అవుతుందని శాస్త్రాలు పేర్కొంటున్నాయి. 🌹


"కర్కోటకస్య నాగస్య దయయంత్యా నలస్య చ |
ఋతుపర్ణస్య రాజర్షే : కీర్తనం కలినాశనమ్‌ ||

పాములకు చేసే ఏదైనా పూజ , నైవేద్యం నాగదేవతలకు చేరుతుందని నమ్ముతారు.

అందువల్ల ఈ రోజు ప్రజలు పాములను ఆరాధిస్తారు. అనేక సర్పదేవతలు ఉన్నప్పటికీ 12 మందిని మాత్రం నాగులు చవితి పూజా సమయంలో కొలుస్తారు.

అంతేకాకుండా పాముకు పాలను సమర్పిస్తుంటారు. చవితి నాడు సర్పాలను పూజిస్తే కుజ దోషం , కాలసర్ప దోషానికి ఆదిదేవుడు సుభ్రహ్మణ్య స్వామి కాబట్టి నాగుపాము పుట్టకు పూజ చేస్తే కళత్ర దోషాలు తొలుగుతాయని శాస్త్రాలు సూచిస్తున్నాయి.

అనంత

వాసుకి

శేష

పద్మ

కంబాల

కర్కోటకం

ఆశ్వతార

ధృతరాష్ట్ర

శంఖపాల

కలియా

తక్షక

పింగళ

ఈ ప్రపంంచంలో పాములు, ఆకాశం , స్వర్గం , సూర్యకిరణాలు , సరస్సులు , బావులు చెరువులు నివసిస్తున్నాయి. ఈ రోజు ఈ సర్పాలను పూజించి ఆశీర్వాదాలు పొందుతారు.


పాము పుట్టలో పాలు పోసేటప్పుడు ఇలా చేప్పాలి మరియు పిల్లలు చేత చెప్పించాలి .

నడుము తొక్కితే నావాడు అనుకో

పడగ తొక్కితే పగవాడు కాదు అనుకో

తోక తొక్కితే తోటి వాడు అనుకో

నా కంట నువ్వుపడకు నీకంట నేను పడకుండా చూడు తండ్రీ అని చెప్పాలి.

ప్రకృతిని పూజిచటం మన భారతీయుల సంస్కృతి. మనం విషసర్పమును కూడా పూజించి మన శత్రువును కూడా ఆదరిస్తాము, అని అర్ధము.

పిల్లల చేత ఇవి చెప్పించటం ఎందుకంటే వారికి మంచి అలవాట్లు నేర్పించటము ముఖ్యవుద్దేశము.

మనలను ఇబ్బంది పెట్టినవారిని , కష్టపెట్టేవారిని క్షమించాలి అని తెలుపుట ఇలాంటివి నేర్పుట ఉద్దేశము.

నాగుల చవితిరోజు పుట్టలో పాలుపోసిన తరువాత. బియ్యం , రవ్వ లేదా పిండిని చుట్టూ జల్లుతారు ఎందుకంటే మన చుట్టూ వుండే చిన్న చిన్న జీవులకు ఆహారంను పెట్టటం అన్నమాట, ఉదాహరణకు చీమలకు ఆహారంగా పెడుతున్నాం.

పుట్ట నుండి మట్టి తీసుకొని ఆ మన్నును చేవులకు పెడతారు, ఎందుకంటే చెవికి సంభందించిన ఇబ్బందులు రాకూడదని.

🌹 🌹 🌹 🌹 🌹




08 Nov 2021

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 318 -2 / Sri Lalitha Chaitanya Vijnanam - 318-2


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 318 -2 / Sri Lalitha Chaitanya Vijnanam - 318-2 🌹

సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 72. రమా, రాకేందువదనా, రతిరూపా, రతిప్రియా ।
రక్షాకరీ, రాక్షసఘ్నీ, రామా, రమణలంపటా ॥ 72 ॥ 🍀

🌻 318-2. 'రాక్షసఘ్ని' 🌻


వరహావతారమున హిరణ్యాక్షుని చంపుట, నరసింహావతారమున హిరణ్యకశిపుని చంపుట, వామనావతారమున బలిని దమించుట జరిగినది. పరశురామావతారమున రాజుల రూపమున నున్న రాక్షసుల నందరిని చంపుట జరిగినది. అయిననూ రాముని కాలమునకు మరల రాక్షసత్వము పుట్టుకొచ్చినది. శ్రీరాముడు లెక్కకు మిక్కుటముగ రాక్షసులను సంహరించినాడు. అయిననూ కృష్ణావతార సమయమునకు మరల రాక్షస శక్తి ఉద్భవించినది. కల్కియై మరల రాక్షసులను సంహరించిననూ మరల రాక్షసులు పుట్టక మానరు. కావున రాక్షసులు శాశ్వత కథలో ఒక భాగము. రాక్షసులను సంహరించుట, నిర్జించుట, పరాభవించుట వలన ప్రయోజనము లేదు. అవి శాశ్వత శక్తులు.

ప్రతి జీవి యందును కూడ నిండియుండి అవకాశము కలిగినపుడెల్ల విజృంభింతురు. ఇట్టి వారిని చంపుకొనుచు వుండుట వలన పరిష్కారము లభించదు. దైవమును ఆరాధించుచు వారిని అధిగమించి జీవించుట యున్నది. సంహరింపక అధిగమించినచో రాక్షసుల మిత్రత్వము కూడ పొంద గలరు. యోగీశ్వరు లట్టివారు. వశిష్ఠుడు, అగస్త్యుడు, నారదుడు అట్టివారు. పై విధమగు ఉపాయమును యోగవిద్య ద్వారా అందించు నది కూడ శ్రీమాతయే. ఆమె యోగేశ్వరి.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 318-2 🌹

1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj

🌻 72. Rama rakenduvadana ratirupa ratipriya
Rakshakari rakshasaghni rama ramanalanpata ॥ 72 ॥ 🌻


🌻 318-2. Rākṣasaghnī राक्षसघ्नी (318)🌻


The destroyer of demons. Kṛṣṇa says (Bhagavad Gīta IV.8) “I appear from age to age to protect the virtuous and to destroy the evil doers in order to re-establish righteousness”. This is the famous saying of Bhagavad Gīta:

paritrāṇāya sādhūnāṁ vināśāya ca duṣkṛtām|
dharmasaṁsthāpanārthāya sambhavāmi yuge yuge||

परित्राणाय साधूनां विनाशाय च दुष्कृताम्।
धर्मसंस्थापनार्थाय सम्भवामि युगे युगे॥

Demons mean the evils. It is believed that when evil prevails everywhere, the great dissolution of the universe takes place and the creation happens again


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


08 Nov 2021

నిర్మల ధ్యానాలు - ఓషో - 91


🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 91 🌹

✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ

🍀. స్వేచ్చగా వున్నపుడు మాత్రమే సత్యాన్ని అన్వేషించ గలవు. స్వేచ్ఛగా వున్నపుడు మాత్రమే నువ్వు ఆనందంగా వుండగలవు. స్వేచ్ఛ నీ తత్వం, అది సాధించాల్సింది కాదు. బానిసత్వం మాయమయితే వ్యక్తి స్వేచ్ఛగా మిగుల్తాడు. అప్పుడు ప్రేమకు, సత్యానికి దైవత్వానికి అవకాశ మేర్పడు తుంది 🍀

స్వేచ్ఛ అన్నది ప్రత్యేక లక్షణం కలిగింది. కేవలం స్వేచ్ఛ నించి మాత్రమే గొప్పతనమన్నది జన్మిస్తుంది. నువ్వు స్వేచ్ఛగా వున్నప్పుడు మాత్రమే ప్రేమించగలవు. స్వేచ్చగా వున్నపుడు మాత్రమే సత్యాన్ని అన్వేషించగలవు. స్వేచ్ఛగా వున్నపుడు మాత్రమే నువ్వు ఆనందంగా వుండగలవు. కాబట్టి స్వేచ్ఛ అన్నది సన్యాసికి పునాది లాంటిది. నువ్వు ఏ మత సంస్థకో, తెగకో, జాతికో, దేశానికే చెందాలని నేను కోరుకోను. అవి అసహ్యకరమైన విషయాలు. వ్యక్తి ఆ చెత్తా చెదారానికి దూరంగా వుండాలి. మనిషి కేవలం మనిషిగా వుండాలి. ఇండియన్, జర్మన్, అమెరికన్ కావాల్సిన పన్లేదు.

అన్ని సరిహద్దుల నించీ వ్యక్తి స్వేచ్ఛగా వుండాలి. మనిషికి ఆటంకంగా మారిన ఈ జైళ్ళని ఛేదించాలి. చైతన్యంతో వున్నపుడే ఈ బానిస శృంఖలాల నించి బయట పడతాం. స్వేచ్ఛ నీ తత్వం, అది సాధించాల్సింది కాదు. బానిసత్వం మాయమయితే వ్యక్తి స్వేచ్ఛగా మిగుల్తాడు. స్వేచ్ఛ నించీ జీవితం అద్భుత సౌందర్యంతో ధగధగ లాడుతుంది. అప్పుడు అప్పుడు ప్రేమకు, సత్యానికి దైవత్వానికి అవకాశ మేర్పడుతుంది.


సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹


08 Nov 2021

మైత్రేయ మహర్షి బోధనలు - 24


🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 24 🌹

✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 15. ప్రాథమిక దీక్ష -2🌻

సోదరత్వమను దీక్ష మా బృందమున శ్రేష్ఠమైన దీక్షగా భావింతుము. నీ కుటుంబమునందు, నీ పరిసరముల యందు యీ భావమును ప్రవేశపెట్టి జీవించుట ప్రయత్నించుము. క్రమశః ఈ భావము నిన్ను ఉన్నతునిగ చేయగలదు. మనోవికాసము కలిగించగలదు. సోదరత్వమును గూర్చి భాషించుట తగ్గించి జీవించుట మొదలిడుము. సోదరత్వ భావమును ధరించిన సాధకునకు మా సోదరబృందము అదృశ్యముగ సహాయ సహకారముల నందించును. అది కారణముగ మిక్కిలి బలవంతుడవై మహత్కార్యములు సాధింప గలవు.

యుధిష్ఠిరుని కందిన సహాయ, సహకారములు జ్ఞప్తికి తెచ్చు కొనుము. అతడు ధర్మదేవతను సహితము సోదర భావముతో రంజింప జేసెను. తన వెంట వచ్చు జాగిలమును సోదర భావముతో మన్నించుట వలననే కదా ధర్మదేవత సంతసించినది! మరణమును సహితము సోదర భావముతో జయించవచ్చును. అట్టి పటిష్ఠమైన దీక్ష కలవారందరు వైశాఖలోయలో వైశాఖ పౌర్ణమినాడు ఒక బృందముగ ఉత్సవములు జరుపుకొనుచున్నారు. నీవును సోదరదీక్ష నాధారముగ గొని బృందమున చేరుము.


సశేషం.....

🌹 🌹 🌹 🌹 🌹


08 Nov 2021

విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 507 / Vishnu Sahasranama Contemplation - 507



🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 507 / Vishnu Sahasranama Contemplation - 507 🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻 507. పురుసత్తమః, पुरुसत्तमः, Purusattamaḥ 🌻

ఓం పురుసత్తమాయ నమః | ॐ पुरुसत्तमाय नमः | OM Purusattamāya namaḥ

యో విశ్వరూపీ స పురురుత్కృష్టత్వాచ్చ సత్తమః ।
పురుశ్చాసౌ సత్తమశ్చ పురుసత్తమ ఉచ్యతే ॥

పురు అనగా అనేకము అని అర్థము. అన్నియు తానేయగు విశ్వరూపుడు కావున పరమాత్ముని పురు అనదగును. సజ్జనులలోనెల్ల ఉత్కృష్టుడు కావున సత్తముడు. పురుసత్తమః అనగా ఈతడు విశ్వరూపుడూ, చాలా గొప్ప సజ్జనుడూ అని చెప్పదగును.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 507🌹

📚. Prasad Bharadwaj

🌻507. Purusattamaḥ🌻


OM Purusattamāya namaḥ

यो विश्वरूपी स पुरुरुत्कृष्टत्वाच्च सत्तमः ।
पुरुश्चासौ सत्तमश्च पुरुसत्तम उच्यते ॥

Yo viśvarūpī sa pururutkr‌ṣṭatvācca sattamaḥ,
Puruścāsau sattamaśca purusattama ucyate.

As His is universal cosmic dimension and form, He is Puru - excellent and good. Since He is the superlatively good amongst the venerable, He is Sattamaḥ. Thus Purusattamaḥ means the One who is the best amongst the respectable and with cosmic dimensions.

🌻 🌻 🌻 🌻 🌻

Source Sloka

सोमपोऽमृतस्सोमः पुरुजित्पुरुसत्तमः ।विनयो जयस्सत्यसंधो दाशार्ह स्सात्वतां पतिः ॥ ५४ ॥

సోమపోఽమృతస్సోమః పురుజిత్పురుసత్తమః ।వినయో జయస్సత్యసంధో దాశార్హ స్సాత్వతాం పతిః ॥ 54 ॥

Somapo’mr‌tassomaḥ purujitpurusattamaḥ,Vinayo jayassatyasaṃdho dāśārha ssātvatāṃ patiḥ ॥ 54 ॥


Continues....

🌹 🌹 🌹 🌹🌹


08 Nov 2021