నిర్మల ధ్యానాలు - ఓషో - 91


🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 91 🌹

✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ

🍀. స్వేచ్చగా వున్నపుడు మాత్రమే సత్యాన్ని అన్వేషించ గలవు. స్వేచ్ఛగా వున్నపుడు మాత్రమే నువ్వు ఆనందంగా వుండగలవు. స్వేచ్ఛ నీ తత్వం, అది సాధించాల్సింది కాదు. బానిసత్వం మాయమయితే వ్యక్తి స్వేచ్ఛగా మిగుల్తాడు. అప్పుడు ప్రేమకు, సత్యానికి దైవత్వానికి అవకాశ మేర్పడు తుంది 🍀

స్వేచ్ఛ అన్నది ప్రత్యేక లక్షణం కలిగింది. కేవలం స్వేచ్ఛ నించి మాత్రమే గొప్పతనమన్నది జన్మిస్తుంది. నువ్వు స్వేచ్ఛగా వున్నప్పుడు మాత్రమే ప్రేమించగలవు. స్వేచ్చగా వున్నపుడు మాత్రమే సత్యాన్ని అన్వేషించగలవు. స్వేచ్ఛగా వున్నపుడు మాత్రమే నువ్వు ఆనందంగా వుండగలవు. కాబట్టి స్వేచ్ఛ అన్నది సన్యాసికి పునాది లాంటిది. నువ్వు ఏ మత సంస్థకో, తెగకో, జాతికో, దేశానికే చెందాలని నేను కోరుకోను. అవి అసహ్యకరమైన విషయాలు. వ్యక్తి ఆ చెత్తా చెదారానికి దూరంగా వుండాలి. మనిషి కేవలం మనిషిగా వుండాలి. ఇండియన్, జర్మన్, అమెరికన్ కావాల్సిన పన్లేదు.

అన్ని సరిహద్దుల నించీ వ్యక్తి స్వేచ్ఛగా వుండాలి. మనిషికి ఆటంకంగా మారిన ఈ జైళ్ళని ఛేదించాలి. చైతన్యంతో వున్నపుడే ఈ బానిస శృంఖలాల నించి బయట పడతాం. స్వేచ్ఛ నీ తత్వం, అది సాధించాల్సింది కాదు. బానిసత్వం మాయమయితే వ్యక్తి స్వేచ్ఛగా మిగుల్తాడు. స్వేచ్ఛ నించీ జీవితం అద్భుత సౌందర్యంతో ధగధగ లాడుతుంది. అప్పుడు అప్పుడు ప్రేమకు, సత్యానికి దైవత్వానికి అవకాశ మేర్పడుతుంది.


సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹


08 Nov 2021

No comments:

Post a Comment