శ్రీ రమణ మహర్షి జయంతి శుభాకాంక్షలు Sri Ramana Maharishi Jayanti



🌹. శ్రీ రమణ మహర్షి జయంతి శుభాకాంక్షలు 🌹

ప్రసాద్‌ భరధ్వాజ

“బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి”-బ్రహ్మమును ఎవరు అనుభవించాడో వాడే బ్రహ్మము అవుతాడు. పరబ్రహ్మమును అనుభవించిన కారణం చేత ఆయనే పరబ్రహ్మము. అందుకే “గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః! గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మైశ్రీ గురవేనమః!!”-గురువే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు అనబడే మూడు రూపములు పొందినటువంటి వాడై ఉంటాడు. అటువంటి గురువు జ్ఞానమును పొందినప్పటికీ, సమున్నతమైన స్థాయిలో నిలబడినప్పటికీ సామాన్యమైన లోకులు శాస్త్రాన్ని ఎలా ఆచరిస్తారో అలా ఆయన కూడా ఆచరించాలని నియమం లేదు. ఆయన అలా ఆచరించలేదు కాబట్టి ఆయన స్థాయి తక్కువైంది అని చెప్పడం సాధ్యంకాదు.

భగవాన్ రమణులు మహా పురుషులు. వారు బ్రహ్మముయొక్క స్థాయిని చేరిపోయినవారు. అంతటి అద్వైతానుభూతియందు ఓలలాడుతూ ఉండేవారు. శరీరాన్ని చూపించి ఎప్పుడూ ఇది అని వేలు చూపించి తను సాక్షిగా ఉండేవారు. అటువంటి పరబ్రహ్మ స్వరూపుడైనటువంటి, గురుస్వరూపుడైన రమణమహర్షి సంధ్యావందనం చేయాలనీ, యజ్ఞోపవీతం వేసుకోవాలనీ, గోచీపోసి పంచె కట్టుకోవాలనీ, వేదం ఎలా చెప్పిందో అలా ఆయన ప్రవర్తించాలనీ, అలా ఆయన ప్రవర్తించకపోతే దోషం వస్తుందనీ, చెప్పడం సాధ్యం కాదు.అది అగ్నిహోత్రం వంటిది. ఆస్థాయికి చేరినటువంటి మహాపురుషులు కర్మాచరణను శాస్త్రీయంగా చేశారా? చేయలేదా? అన్న విషయంతో సంబంధం ఉండదు. వారు ఎప్పుడూ జ్ఞానమునందు ఓలలాడుతూ ఉంటారు.

జ్ఞానిని అనుకరించే ప్రయత్నం చేయకూడదు. అజ్ఞానిని ఎప్పుడూ అనుకరించకూడదు. అనుకరణవల్ల మహాత్ముల స్థాయిని చేరలేరు. పరమభక్తితో కర్మాచరణము చేయగా చేయగా అనుగ్రహించిన భగవంతుని కారుణ్యమే ఒకనాడు జ్ఞానము కలగడానికి అవకాశం ఇస్తుంది. ఒకసారి జ్ఞానము కలిగిన తరువాత అదే మోక్షమునకు హేతువు. జ్ఞాని శరీరముతో ఉన్నప్పటికీ నేను ఆత్మ అని దానియందు రూఢియై అద్వైతానుభూతియందు ఓలలాడుతూ ఉంటాడు. అటువంటి వ్యక్తి శరీరం పడిపోతున్నప్పుడు కూడా సాక్షిగా చూస్తాడు శరీరాన్ని. శరీరంతో తాదాత్మ్యత పొందడు. అందుకే అందరూ ఇలా ప్రవర్తిస్తున్నారో ఎలా వైదికమైనటువంటి ప్రవర్తనకు కట్టుబడుతున్నారో అలా కట్టుబడాలి అని భావించడం పొరపాటు.

గురువుయొక్క లీల, మాట పరమశక్తివంతములు. గురువు లోకోద్ధరణకొరకే నోరువిప్పుతాడు. గురువుయొక్క సహజస్థితి మౌనం. భగవాన్ రమణులకు అందుకే మౌనయోగి అని పేరు. అలా మౌనంగా ఉండి పరబ్రహ్మముగా అనుభవములో ఎప్పుడూ రమిస్తూ ఉంటారు. అటువంటి స్థాయి పొందిన మహాపురుషులు.

🌹 🌹 🌹 🌹 🌹


21 Dec 2021

శ్రీ లలితా సహస్ర నామములు - 170 / Sri Lalita Sahasranamavali - Meaning - 170



🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 170 / Sri Lalita Sahasranamavali - Meaning - 170 🌹

🌻. మంత్రము - అర్ధం 🌻

📚. ప్రసాద్ భరద్వాజ

🍀 170. చైతన్యార్ఘ్య సమారాధ్యా, చైతన్య కుసుమప్రియా ।
సదోదితా, సదాతుష్టా, తరుణాదిత్య పాటలా ॥ 170 ॥ 🍀


915. చైతన్యార్ఘ్య సమారాధ్యా :
ఙ్ఞానులచే పూజింపబడునది

916. చైతన్య కుసుమప్రియా :
ఙ్ఞానము అనెడి పుష్పముల యెందు ప్రీతి కలిగినది

917. సదొదితా :
సత్యస్వరూపిణీ

918. సదాతుష్టా :
ఎల్లప్పుడూ సంతొషముతో ఉండునది

919. తరుణాదిత్యపాటలా :
ఉదయసూర్యుని వంటి కాంతి కలిగినది


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹




🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 170 🌹

📚. Prasad Bharadwaj

🌻 170. Chaitanyardhya samaradhya chaitanya kusumapriya
Sadodita sadatushta tarunaditya patala ॥ 170 ॥ 🌻


🌻 915 ) Chaithnyarkya samaradhya - She who is worshipped by the ablation of water

🌻 916 ) Chaitanya kusuma priya - She who likes the never fading flowers

🌻 917 ) Saddothitha - She who never sets

🌻 918 ) Sadha thushta - She who is always happy

🌻 919 ) Tharunadithya patala - She who like the young son is red mixed with white


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


21 Dec 2021

మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 122


🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 122 🌹

✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
సంకలనము : వేణుమాధవ్

📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. లోకోద్ధరణము- లోక కల్యాణము - 7 🌻

జీవుడు లోకహితార్థమై పనిచేయుటకు ఇష్టపడకున్నను, తన అవసరములు తీరుటకై ఇతరులపై ఆధారపడునట్లు ప్రకృతి ఏర్పాటు చేసినది‌. ఈ ఏర్పాటు నుండి నరుడు లోకహిత కాంక్షయను గుణపాఠము నేర్చుటయే ప్రకృతి ఆశయము. అట్లు నేర్చుటకు కొంతకాలము పట్టును. ఈ లోపు జీవుల పరస్పరాశ్రయత్వము వ్యాపారముగ మార్చుకొని, డబ్బు జీవికగా జీవించుట వలన, ఆహార వస్త్రాది ఆవశ్యకములు తీరుచున్నట్లే కనపడును. అనుక్షణము అసంతృప్తి మాత్రము తప్పదు.

బహు సంఖ్యాకులగు జనులు ఇట్లే జీవించినచో, పోటి పెరుగును. సమాజమున బలుపు ఏర్పడును. బలము కాదు. బలహీనులు అణచివేతకు గురియగుదురు. ఆపై వారు ప్రతిఘటనకు పూనుకొందురు. వర్గములు ఏర్పడి, పోరాటములతో సంఘము విచ్ఛిన్నమగును. సిద్ధాంతముల పేర ఎట్టి ఆర్థిక సాంఘిక వ్యవస్థ నిర్మించినను, సంక్షోభము, వినాశము తప్పవు..

.....✍️ మాస్టర్ ఇ.కె.🌻

🌹 🌹 🌹 🌹 🌹


21 Dec 2021

వివేక చూడామణి - 170 / Viveka Chudamani - 170


🌹. వివేక చూడామణి - 170 / Viveka Chudamani - 170 🌹

✍️ రచన : పేర్నేటి గంగాధర రావు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍀. 32. నేను బ్రహ్మాన్ని తెలుసుకొన్నవాడిని -17 🍀

554. హద్దులను తొలగించుకొని, బ్రహ్మాన్ని పూర్తిగా తెలుసుకొన్నవాడు, తాను బ్రహ్మములో పూర్తిగా లీనమై, రెండవది ఏదీ లేకుండా, అంతా అదే అయి అతడు శాశ్వతముగా స్వేచ్ఛగా జీవితములో తన లక్ష్యమును చేరుకొన్నవాడవుతాడు.

555. నటుని వలె ఎవడైతే తన పాత్రకు తగిన దుస్తులు ధరిస్తాడో లేక ఏమి ధరించకుండా నగ్నముగా ఉంటాడో, అట్టి వాడు అన్ని తెలిసినవాడు. బ్రహ్మ జ్ఞానిగా ఎల్లపుడు బ్రహ్మములోనే జీవిస్తుంటాడు.

556. ఎవడైతే బ్రహ్మాన్ని తెలుసుకుంటాడో అతని శరీరము విశీర్ణమై ఎచ్చట పడిపోయినప్పటికి, చెట్టు మీద ఆకు వలె అతనికి దాని పై ఎట్టి ప్రభావము ఉండదు. ఎందువలనంటే అతనికి శరీర వ్యామోహము తన జ్ఞానము వలన తొలగిపోయినది. తాను చనిపోయిన తరువాత తన శరీరమును గూర్చిన పట్టింపు ఉండదు.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹




🌹 VIVEKA CHUDAMANI - 170 🌹

✍️ Sri Adi Shankaracharya, Swami Madhavananda

📚 Prasad Bharadwaj

🌻 32. I am the one who knows Brahman -17 🌻

554. Through the destruction of limitations, the perfect knower of Brahman is merged in the One Brahman without a second – which he had been all along – becomes very free even while living, and attains the goal of his life.

555. As an actor, when he puts on the dress of his role, or when he does not, is always a man, so the perfect knower of Brahman is always Brahman and nothing else.

556. It is only the presence or absence of dress that makes the different characters assumed by the actor (the man remains the same always); so this knower of Brahman is always Brahman (not separate from him), no matter in what name or form.


Continues....

🌹 🌹 🌹 🌹 🌹


21 Dec 2021

శ్రీ శివ మహా పురాణము - 493


🌹 . శ్రీ శివ మహా పురాణము - 493 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴

అధ్యాయము - 39

🌻. శివుని యాత్ర - 3 🌻

బ్రహ్మ ఇట్లు పలికెను-

ఓ మునీ! శివునకు ప్రియుడవగు నీవు శివుని ఆ యాజ్ఞను స్వీకరించి అందరి వద్దకు వ్యక్తిగతముగా వెళ్లి శీఘ్రమే ఆహ్వానించితివి (24). నారదా! నీవు శివుని దూతవై ఆయన ఆజ్ఞను నిర్వర్తించి వెనువెంటనే శివుని వద్దకు వచ్చి నిలబడితివి (25). శివుడు కూడా ముహూర్తము యొక్క రాకను ఉత్కంఠతో ఎదురుచూచుండెను. శివగణములన్నియూ అన్ని దిక్కులయందు నాట్యము చేయుచూ ఉత్సవమును చేసుకొనెను (26). అదే కాలములో విష్ణువు తన వేషమును ధరించి గణములతో గూడి శీఘ్రముగా కైలాసమునకు వచ్చెను (27).

ఆయన భార్యతో గణములతో గూడి శివునకు ఆనందముతో పూర్ణ భక్తితో నమస్కరించి, ఆయన ఆజ్ఞను పొంది, చక్కని స్థానమునందు హర్షము నిండిన మనస్సు గలవాడై నివసించెను (28). అదేవిధముగా నేను కూడా నా గణములతో గూడి ఆనందముతో వెంటనే కైలాసమునకు వెళ్లి గణములతో సహా శివునకు నమస్కరించి ఆనందముగా మకాము చేసితిని (29). ఇంద్రుడు మొదలగు లోకపాలు రందరు చక్కగా అలంకరించుకొని తమ భార్యలతో, పరివారముతో గూడి ఉత్సాహముతో విచ్చేసిరి (30). అదే విధముగా ఆహ్వానించబడిన మునులు, నాగులు, సిద్ధులు, ఉపదేవతలు, మరియు ఇతరులందరు ఉత్సాహముతో కైలాసమునకు విచ్చేసిరి (31).

అపుడు మహేశ్వరుడు అచటకు వచ్చిన దేవతలు మొదలగు వారందరికీ వ్యక్తిగతముగా సత్కారమును ఆనందముతో చేసెను (32). తరువాత కైలాసములో అత్యద్భుతమగు మహోత్సవము జరిగెను. అపుడు దేవతాస్త్రీలు యథోచితముగా నాట్యము మొదలగు వాటిని చేసిరి (33).


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

21 Dec 2021

గీతోపనిషత్తు -294


🌹. గీతోపనిషత్తు -294🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము 📚

శ్లోకము 17-5

🍀 17-5. ప్రణవ స్వరూపుడు - ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తుల సమన్వయమున సృష్టి ఏర్పడుచు యున్నది. మనయందు కూడ ఇచ్ఛా జ్ఞాన క్రియల సమన్వయమే జీవన సిద్ధినిచ్చును. ఈ మూడు వేదములు గ్రంథము లనుకొనుట కన్న మూడు సజీవ ప్రవాహములుగ గుర్తించుట శ్రేష్ఠము. ఈ మూడింటికిని మూలము ఓంకారము. క్రతువు నేనే, యజ్ఞము నేనే, స్వాహాకారము నేనే, హోమ ద్రవ్యమును నేనే, మంత్రము నేనే, అగ్నిని నేనే, అగ్ని యందు సమర్పింపబడు ఓషధులు నేనే, పవిత్ర వస్తువులుగ గోచరించునది నేనే, ఓంకారము నేనే, వేదమును నేనే అని ఉదాహరణ పూర్వకముగ తెలిపినాడు. 🍀

పితా హమస్య జగతో మాతా ధాతా పితామహః |
వేద్యం పవిత్ర మోంకార ఋక్సామ యజురేవ చ || 17

తాత్పర్యము : ఈ జగత్తునకు తండ్రిని నేనే. తల్లి, తండ్రి, తాత కూడ నేనే. ఓంకారము నేనే. అన్నిటి యందు తెలిసికొనదగినది నేనే. పవిత్ర పదార్థముగ నున్నది నేనే. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము నేనే.

వివరణము : సంకల్పము ఇచ్ఛాశక్తి స్వరూపము. ప్రాణము జ్ఞానశక్తి స్వరూపము. బుద్ధి క్రియాశక్తి స్వరూపము. ఓంకారము రూపమున ఈ మూడింటికిని బలము కూర్చి ఈశ్వరుడు సృష్టి నిర్వహణము చేయుచున్నాడు. ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తుల సమన్వయమున సృష్టి ఏర్పడుచు యున్నది. మనయందు కూడ ఇచ్ఛా జ్ఞాన క్రియల సమన్వయమే జీవన సిద్ధినిచ్చును. ఈ మూడు వేదములు గ్రంథము లనుకొనుట కన్న మూడు సజీవ ప్రవాహములుగ గుర్తించుట శ్రేష్ఠము. ఈ మూడింటికిని మూలము ఓంకారము.

ఇట్లు ఈశ్వరుడు ఈ శ్లోకమున తన అస్థిత్వమును గూర్చి మరికొన్ని ఉదాహరణలు పేర్కొని యున్నాడు. “క్రతువు నేనే, యజ్ఞము నేనే, స్వాహాకారము నేనే, హోమ ద్రవ్యమును నేనే, మంత్రము నేనే, అగ్నిని నేనే, అగ్ని యందు సమర్పింపబడు ఓషధులు నేనే, నేయి నేనే, సమస్తమును హుతము గావించు వాడను నేనే యనియు, తండ్రిని నేనే, తల్లిని నేనే, తాతను నేనే, సమస్తము నందు తెలియబడు వాడను నేనే, పవిత్ర వస్తువులుగ గోచరించునది నేనే, ఓంకారము నేనే, వేదమును నేనే అని ఉదాహరణ పూర్వకముగ తెలిపినాడు. అట్లే తరువాతి శ్లోకములలో కూడ మరికొన్ని ఉదాహరణలు తెలుపబూనినాడు.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


21 Dec 2021

21-DECEMBER-2021 మంగళవారం MESSAGES

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam 21, మంగళవారం, డిసెంబర్ 2021 భౌమ వాసరే 
2) 🌹. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 294 🌹  
3) 🌹. శివ మహా పురాణము - 493🌹 
4) 🌹 వివేక చూడామణి - 170 / Viveka Chudamani - 170🌹
5)🌹. మాస్టర్ ఇ.కె సందేశాలు -122🌹  
6) 🌹 Osho Daily Meditations - 111 🌹
7) 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 170 / Sri Lalitha Sahasra Namaavali - Meaning - 170🌹
🌹. శ్రీ రమణ మహర్షి జయంతి శుభాకాంక్షలు 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శుభ మంగళవారం మిత్రులందరికీ 🌹*
*భౌమ వాసరే, 21, డిసెంబర్‌ 2021*
*మీకు ఈ రోజు అంతా కాలం అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*

*🍀. ఆంజనేయుని శ్లోకాలు -7 🍀*

*అతులిత బలధామం స్వర్ణశైలభ దేహం*
*దనుజవనక్రుశానుం ఙ్ఞానినాం అగ్రగణ్యం|*
*సకలగుణ నిధానం వానరాణాం అధీశం*
*రఘుపతిప్రియభక్తం వాతజాతం నమామి||*

*భావము:- ఎవరికీ సమానము రాని శక్తిని సొంతం చేసుకొని,బంగారు వర్ణం కలిగిన కొండంత శరీరం, భూతప్రేతపిశాచాలకు ఆవేశంతో ఉన్న అగ్నిపర్వతంలా కనబడి,ఙ్ఞానునలో అగ్రగణ్యుడు,అన్ని మంచి లక్షణాలు కలిగి ఉండి, వానర మూకకు అధిపతి అయి శ్రీ రామచంద్రమూర్తికి నమ్మిన బంటు అయిన వాయుపుత్రుడైన హనుమంతునికి నమస్కారాలు.*

🌻 🌻 🌻 🌻 🌻

విక్రమ సంవత్సరం: 2078 ఆనంద
శఖ సంవత్సరం: 1943 ప్లవ,
దక్షిణాయణం, హేమంత ఋతువు,
మృగశిర మాసం
తిథి: కృష్ణ విదియ 14:55:25 వరకు 
తదుపరి కృష్ణ తదియ
నక్షత్రం: పునర్వసు 22:25:13 
వరకు తదుపరి పుష్యమి
యోగం: బ్రహ్మ 11:37:42 వరకు 
తదుపరి ఇంద్ర
కరణం: గార 14:52:25 వరకు
వర్జ్యం: 09:06:00 - 10:52:32
దుర్ముహూర్తం: 08:54:24 - 09:38:46
రాహు కాలం: 15:00:29 - 16:23:41
గుళిక కాలం: 12:14:05 - 13:37:17
యమ గండం: 09:27:41 - 10:50:53
అభిజిత్ ముహూర్తం: 11:52 - 12:36
అమృత కాలం: 19:45:12 - 21:31:44
సూర్యోదయం: 06:41:17
సూర్యాస్తమయం: 17:46:53
వైదిక సూర్యోదయం: 06:45:10
వైదిక సూర్యాస్తమయం: 17:42:59
చంద్రోదయం : 19:37:05
చంద్రాస్తమయం: 08:21:54
సూర్య సంచార రాశి: ధనుస్సు
చంద్ర సంచార రాశి: జెమిని
స్థిర యోగం - శుభాశుభ మిశ్రమ ఫలం 
22:25:13 వరకు తదుపరి 
వర్ధమాన యోగం - ఉత్తమ ఫలం
పండుగలు : సంవత్సర అతి చిన్న దినం 
Shortest Day of Year
🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam 
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://chat.whatsapp.com/KtLL1EZQceL1YLFwsAp8bh
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. గీతోపనిషత్తు -294🌹*
*✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము 📚*
శ్లోకము 17-5
 
*🍀 17-5. ప్రణవ స్వరూపుడు - ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తుల సమన్వయమున సృష్టి ఏర్పడుచు యున్నది. మనయందు కూడ ఇచ్ఛా జ్ఞాన క్రియల సమన్వయమే జీవన సిద్ధినిచ్చును. ఈ మూడు వేదములు గ్రంథము లనుకొనుట కన్న మూడు సజీవ ప్రవాహములుగ గుర్తించుట శ్రేష్ఠము. ఈ మూడింటికిని మూలము ఓంకారము. క్రతువు నేనే, యజ్ఞము నేనే, స్వాహాకారము నేనే, హోమ ద్రవ్యమును నేనే, మంత్రము నేనే, అగ్నిని నేనే, అగ్ని యందు సమర్పింపబడు ఓషధులు నేనే, పవిత్ర వస్తువులుగ గోచరించునది నేనే, ఓంకారము నేనే, వేదమును నేనే అని ఉదాహరణ పూర్వకముగ తెలిపినాడు. 🍀*

*పితా హమస్య జగతో మాతా ధాతా పితామహః |*
*వేద్యం పవిత్ర మోంకార ఋక్సామ యజురేవ చ || 17*

*తాత్పర్యము : ఈ జగత్తునకు తండ్రిని నేనే. తల్లి, తండ్రి, తాత కూడ నేనే. ఓంకారము నేనే. అన్నిటి యందు తెలిసికొనదగినది నేనే. పవిత్ర పదార్థముగ నున్నది నేనే. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము నేనే.*

*వివరణము : సంకల్పము ఇచ్ఛాశక్తి స్వరూపము. ప్రాణము జ్ఞానశక్తి స్వరూపము. బుద్ధి క్రియాశక్తి స్వరూపము. ఓంకారము రూపమున ఈ మూడింటికిని బలము కూర్చి ఈశ్వరుడు సృష్టి నిర్వహణము చేయుచున్నాడు. ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తుల సమన్వయమున సృష్టి ఏర్పడుచు యున్నది. మనయందు కూడ ఇచ్ఛా జ్ఞాన క్రియల సమన్వయమే జీవన సిద్ధినిచ్చును. ఈ మూడు వేదములు గ్రంథము లనుకొనుట కన్న మూడు సజీవ ప్రవాహములుగ గుర్తించుట శ్రేష్ఠము. ఈ మూడింటికిని మూలము ఓంకారము.*

*ఇట్లు ఈశ్వరుడు ఈ శ్లోకమున తన అస్థిత్వమును గూర్చి మరికొన్ని ఉదాహరణలు పేర్కొని యున్నాడు. “క్రతువు నేనే, యజ్ఞము నేనే, స్వాహాకారము నేనే, హోమ ద్రవ్యమును నేనే, మంత్రము నేనే, అగ్నిని నేనే, అగ్ని యందు సమర్పింపబడు ఓషధులు నేనే, నేయి నేనే, సమస్తమును హుతము గావించు వాడను నేనే యనియు, తండ్రిని నేనే, తల్లిని నేనే, తాతను నేనే, సమస్తము నందు తెలియబడు వాడను నేనే, పవిత్ర వస్తువులుగ గోచరించునది నేనే, ఓంకారము నేనే, వేదమును నేనే అని ఉదాహరణ పూర్వకముగ తెలిపినాడు. అట్లే తరువాతి శ్లోకములలో కూడ మరికొన్ని ఉదాహరణలు తెలుపబూనినాడు.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
#గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://chat.whatsapp.com/KtLL1EZQceL1YLFwsAp8bh
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 493 🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴* 
అధ్యాయము - 39

*🌻. శివుని యాత్ర - 3 🌻*

బ్రహ్మ ఇట్లు పలికెను-

ఓ మునీ! శివునకు ప్రియుడవగు నీవు శివుని ఆ యాజ్ఞను స్వీకరించి అందరి వద్దకు వ్యక్తిగతముగా వెళ్లి శీఘ్రమే ఆహ్వానించితివి (24). నారదా! నీవు శివుని దూతవై ఆయన ఆజ్ఞను నిర్వర్తించి వెనువెంటనే శివుని వద్దకు వచ్చి నిలబడితివి (25). శివుడు కూడా ముహూర్తము యొక్క రాకను ఉత్కంఠతో ఎదురుచూచుండెను. శివగణములన్నియూ అన్ని దిక్కులయందు నాట్యము చేయుచూ ఉత్సవమును చేసుకొనెను (26). అదే కాలములో విష్ణువు తన వేషమును ధరించి గణములతో గూడి శీఘ్రముగా కైలాసమునకు వచ్చెను (27).

ఆయన భార్యతో గణములతో గూడి శివునకు ఆనందముతో పూర్ణ భక్తితో నమస్కరించి, ఆయన ఆజ్ఞను పొంది, చక్కని స్థానమునందు హర్షము నిండిన మనస్సు గలవాడై నివసించెను (28). అదేవిధముగా నేను కూడా నా గణములతో గూడి ఆనందముతో వెంటనే కైలాసమునకు వెళ్లి గణములతో సహా శివునకు నమస్కరించి ఆనందముగా మకాము చేసితిని (29). ఇంద్రుడు మొదలగు లోకపాలు రందరు చక్కగా అలంకరించుకొని తమ భార్యలతో, పరివారముతో గూడి ఉత్సాహముతో విచ్చేసిరి (30). అదే విధముగా ఆహ్వానించబడిన మునులు, నాగులు, సిద్ధులు, ఉపదేవతలు, మరియు ఇతరులందరు ఉత్సాహముతో కైలాసమునకు విచ్చేసిరి (31).

అపుడు మహేశ్వరుడు అచటకు వచ్చిన దేవతలు మొదలగు వారందరికీ వ్యక్తిగతముగా సత్కారమును ఆనందముతో చేసెను (32). తరువాత కైలాసములో అత్యద్భుతమగు మహోత్సవము జరిగెను. అపుడు దేవతాస్త్రీలు యథోచితముగా నాట్యము మొదలగు వాటిని చేసిరి (33). 

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#శివమహాపురాణము #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam
https://pyramidbook.in/Chaitanyavijnanam
https://dailybhakthimessages.blogspot.com
https://chat.whatsapp.com/KtLL1EZQceL1YLFwsAp8bh
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. వివేక చూడామణి - 170 / Viveka Chudamani - 170 🌹*
*✍️ రచన : పేర్నేటి గంగాధర రావు*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*

*🍀. 32. నేను బ్రహ్మాన్ని తెలుసుకొన్నవాడిని -17 🍀*

*554. హద్దులను తొలగించుకొని, బ్రహ్మాన్ని పూర్తిగా తెలుసుకొన్నవాడు, తాను బ్రహ్మములో పూర్తిగా లీనమై, రెండవది ఏదీ లేకుండా, అంతా అదే అయి అతడు శాశ్వతముగా స్వేచ్ఛగా జీవితములో తన లక్ష్యమును చేరుకొన్నవాడవుతాడు.*

*555. నటుని వలె ఎవడైతే తన పాత్రకు తగిన దుస్తులు ధరిస్తాడో లేక ఏమి ధరించకుండా నగ్నముగా ఉంటాడో, అట్టి వాడు అన్ని తెలిసినవాడు. బ్రహ్మ జ్ఞానిగా ఎల్లపుడు బ్రహ్మములోనే జీవిస్తుంటాడు.*

*556. ఎవడైతే బ్రహ్మాన్ని తెలుసుకుంటాడో అతని శరీరము విశీర్ణమై ఎచ్చట పడిపోయినప్పటికి, చెట్టు మీద ఆకు వలె అతనికి దాని పై ఎట్టి ప్రభావము ఉండదు. ఎందువలనంటే అతనికి శరీర వ్యామోహము తన జ్ఞానము వలన తొలగిపోయినది. తాను చనిపోయిన తరువాత తన శరీరమును గూర్చిన పట్టింపు ఉండదు. *

*సశేషం....*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 VIVEKA CHUDAMANI - 170 🌹*
*✍️ Sri Adi Shankaracharya, Swami Madhavananda*
*📚 Prasad Bharadwaj*

*🌻 32. I am the one who knows Brahman -17 🌻*

*554. Through the destruction of limitations, the perfect knower of Brahman is merged in the One Brahman without a second – which he had been all along – becomes very free even while living, and attains the goal of his life.*

*555. As an actor, when he puts on the dress of his role, or when he does not, is always a man, so the perfect knower of Brahman is always Brahman and nothing else.*

*556. It is only the presence or absence of dress that makes the different characters assumed by the actor (the man remains the same always); so this knower of Brahman is always Brahman (not separate from him), no matter in what name or form.*

*Continues....*
🌹 🌹 🌹 🌹 🌹
#వివేకచూడామణి #VivekaChudamani #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. వివేకచూడామణి Viveka Chudamani 🌹
https://t.me/vivekchudamani
www.facebook.com/groups/vivekachudamani/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
https://dailybhakthimessages.blogspot.com
https://chat.whatsapp.com/KtLL1EZQceL1YLFwsAp8bh
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 VIVEKA CHUDAMANI - 170 🌹*
*✍️ Sri Adi Shankaracharya, Swami Madhavananda*
*📚 Prasad Bharadwaj*

*🌻 32. I am the one who knows Brahman -17 🌻*

*554. Through the destruction of limitations, the perfect knower of Brahman is merged in the One Brahman without a second – which he had been all along – becomes very free even while living, and attains the goal of his life.*

*555. As an actor, when he puts on the dress of his role, or when he does not, is always a man, so the perfect knower of Brahman is always Brahman and nothing else.*

*556. It is only the presence or absence of dress that makes the different characters assumed by the actor (the man remains the same always); so this knower of Brahman is always Brahman (not separate from him), no matter in what name or form.*

*Continues....*
🌹 🌹 🌹 🌹 🌹
#వివేకచూడామణి #VivekaChudamani #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. వివేకచూడామణి Viveka Chudamani 🌹
https://t.me/vivekchudamani
www.facebook.com/groups/vivekachudamani/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
https://dailybhakthimessages.blogspot.com
https://chat.whatsapp.com/KtLL1EZQceL1YLFwsAp8bh
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 122 🌹*
*✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు*
*సంకలనము : వేణుమాధవ్*
*📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ*

*🌻. లోకోద్ధరణము- లోక కల్యాణము - 7 🌻*

*జీవుడు లోకహితార్థమై పనిచేయుటకు ఇష్టపడకున్నను, తన అవసరములు తీరుటకై ఇతరులపై ఆధారపడునట్లు ప్రకృతి ఏర్పాటు చేసినది‌. ఈ ఏర్పాటు నుండి నరుడు లోకహిత కాంక్షయను గుణపాఠము నేర్చుటయే ప్రకృతి ఆశయము. అట్లు నేర్చుటకు కొంతకాలము పట్టును. ఈ లోపు జీవుల పరస్పరాశ్రయత్వము వ్యాపారముగ మార్చుకొని, డబ్బు జీవికగా జీవించుట వలన, ఆహార వస్త్రాది ఆవశ్యకములు తీరుచున్నట్లే కనపడును. అనుక్షణము అసంతృప్తి మాత్రము తప్పదు.*

*బహు సంఖ్యాకులగు జనులు ఇట్లే జీవించినచో, పోటి పెరుగును. సమాజమున బలుపు ఏర్పడును. బలము కాదు. బలహీనులు అణచివేతకు గురియగుదురు. ఆపై వారు ప్రతిఘటనకు పూనుకొందురు. వర్గములు ఏర్పడి, పోరాటములతో సంఘము విచ్ఛిన్నమగును. సిద్ధాంతముల పేర ఎట్టి ఆర్థిక సాంఘిక వ్యవస్థ నిర్మించినను, సంక్షోభము, వినాశము తప్పవు..*

.....✍️ *మాస్టర్ ఇ.కె.*🌻
🌹 🌹 🌹 🌹 🌹
#మాస్టర్‌ఇకెసందేశములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌷. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు 🌷 
www.facebook.com/groups/masterek/
https://t.me/ChaitanyaVijnanam
 www.facebook.com/groups/chaitanyavijnanam/
https://chat.whatsapp.com/KtLL1EZQceL1YLFwsAp8bh
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 Osho Daily Meditations - 111 🌹*
*📚. Prasad Bharadwaj*

*🍀 111. THE THREAD 🍀*

*🕉 This is the work if the meditator: to find the thread. 🕉*
 
*The world is in a constant flux, it is riverlike. It flows, but behind all this flow, change, flux, there must be a thread running that keeps everything together. Change is not possible without something remaining absolutely unchanging. Change can exist only together with a nonchanging element, otherwise things will fall apart. Life is like a garland: You don't see the thread that runs through the flowers. but it is there, holding them together. If the thread were not there, the flowers would fall apart; there would be a heap of flowers but no garland. And existence is not a heap, it is a very well-knit pattern. Things are changing, but some unchanging element keeps a cosmic law behind it all.*

*That cosmic law is called sadashiva, the eternal God, the timeless God, the nonchanging God. And that is the work of the meditator: to find the thread. There are only two types of people. One gets too enchanted by the flowers and forgets the thread. He lives a life that cannot have any lasting value or significance, because whatever he does will vanish. Today he will make it, tomorrow it will be gone. It will be making castles of sand or launching boats of paper. The second type of person searches for the thread and devotes his whole life to that which always abides; he is never a loser.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹 ఓషో బోధనలు - Osho Teachings 🌹
https://t.me/ChaitanyaVijnanam 
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://chat.whatsapp.com/KtLL1EZQceL1YLFwsAp8bh
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 170 / Sri Lalita Sahasranamavali - Meaning - 170 🌹*
*🌻. మంత్రము - అర్ధం 🌻*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🍀 170. చైతన్యార్ఘ్య సమారాధ్యా, చైతన్య కుసుమప్రియా ।*
*సదోదితా, సదాతుష్టా, తరుణాదిత్య పాటలా ॥ 170 ॥ 🍀*

915. చైతన్యార్ఘ్య సమారాధ్యా :
 ఙ్ఞానులచే పూజింపబడునది

916. చైతన్య కుసుమప్రియా : 
ఙ్ఞానము అనెడి పుష్పముల యెందు ప్రీతి కలిగినది

917. సదొదితా : 
సత్యస్వరూపిణీ

918. సదాతుష్టా : 
ఎల్లప్పుడూ సంతొషముతో ఉండునది

919. తరుణాదిత్యపాటలా :
 ఉదయసూర్యుని వంటి కాంతి కలిగినది

*సశేషం....*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 170 🌹*
*📚. Prasad Bharadwaj*

*🌻 170. Chaitanyardhya samaradhya chaitanya kusumapriya*
*Sadodita sadatushta tarunaditya patala ॥ 170 ॥ 🌻*

🌻 915 ) Chaithnyarkya samaradhya - She who is worshipped by the ablation of water

🌻 916 ) Chaitanya kusuma priya - She who likes the never fading flowers

🌻 917 ) Saddothitha - She who never sets

🌻 918 ) Sadha thushta - She who is always happy

🌻 919 ) Tharunadithya patala - She who like the young son is red mixed with white

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
 #లలితాసహస్రనామములు #LalithaSahasranam
 #PrasadBhardwaj 
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/  

https://t.me/ChaitanyaVijnanam 
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://chat.whatsapp.com/KtLL1EZQceL1YLFwsAp8bh
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ రమణ మహర్షి జయంతి శుభాకాంక్షలు 🌹*
*ప్రసాద్‌ భరధ్వాజ*

*“బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి”-బ్రహ్మమును ఎవరు అనుభవించాడో వాడే బ్రహ్మము అవుతాడు. పరబ్రహ్మమును అనుభవించిన కారణం చేత ఆయనే పరబ్రహ్మము. అందుకే “గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః! గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మైశ్రీ గురవేనమః!!”-గురువే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు అనబడే మూడు రూపములు పొందినటువంటి వాడై ఉంటాడు. అటువంటి గురువు జ్ఞానమును పొందినప్పటికీ, సమున్నతమైన స్థాయిలో నిలబడినప్పటికీ సామాన్యమైన లోకులు శాస్త్రాన్ని ఎలా ఆచరిస్తారో అలా ఆయన కూడా ఆచరించాలని నియమం లేదు. ఆయన అలా ఆచరించలేదు కాబట్టి ఆయన స్థాయి తక్కువైంది అని చెప్పడం సాధ్యంకాదు.*

*భగవాన్ రమణులు మహా పురుషులు. వారు బ్రహ్మముయొక్క స్థాయిని చేరిపోయినవారు. అంతటి అద్వైతానుభూతియందు ఓలలాడుతూ ఉండేవారు. శరీరాన్ని చూపించి ఎప్పుడూ ఇది అని వేలు చూపించి తను సాక్షిగా ఉండేవారు. అటువంటి పరబ్రహ్మ స్వరూపుడైనటువంటి, గురుస్వరూపుడైన రమణమహర్షి సంధ్యావందనం చేయాలనీ, యజ్ఞోపవీతం వేసుకోవాలనీ, గోచీపోసి పంచె కట్టుకోవాలనీ, వేదం ఎలా చెప్పిందో అలా ఆయన ప్రవర్తించాలనీ, అలా ఆయన ప్రవర్తించకపోతే దోషం వస్తుందనీ, చెప్పడం సాధ్యం కాదు.అది అగ్నిహోత్రం వంటిది. ఆస్థాయికి చేరినటువంటి మహాపురుషులు కర్మాచరణను శాస్త్రీయంగా చేశారా? చేయలేదా? అన్న విషయంతో సంబంధం ఉండదు. వారు ఎప్పుడూ జ్ఞానమునందు ఓలలాడుతూ ఉంటారు.*

*జ్ఞానిని అనుకరించే ప్రయత్నం చేయకూడదు. అజ్ఞానిని ఎప్పుడూ అనుకరించకూడదు. అనుకరణవల్ల మహాత్ముల స్థాయిని చేరలేరు. పరమభక్తితో కర్మాచరణము చేయగా చేయగా అనుగ్రహించిన భగవంతుని కారుణ్యమే ఒకనాడు జ్ఞానము కలగడానికి అవకాశం ఇస్తుంది. ఒకసారి జ్ఞానము కలిగిన తరువాత అదే మోక్షమునకు హేతువు. *జ్ఞాని శరీరముతో ఉన్నప్పటికీ నేను ఆత్మ అని దానియందు రూఢియై అద్వైతానుభూతియందు ఓలలాడుతూ ఉంటాడు. అటువంటి వ్యక్తి శరీరం పడిపోతున్నప్పుడు కూడా సాక్షిగా చూస్తాడు శరీరాన్ని. శరీరంతో తాదాత్మ్యత పొందడు. అందుకే అందరూ ఇలా ప్రవర్తిస్తున్నారో ఎలా వైదికమైనటువంటి ప్రవర్తనకు కట్టుబడుతున్నారో అలా కట్టుబడాలి అని భావించడం పొరపాటు.*

*గురువుయొక్క లీల, మాట పరమశక్తివంతములు. గురువు లోకోద్ధరణకొరకే నోరువిప్పుతాడు. గురువుయొక్క సహజస్థితి మౌనం. భగవాన్ రమణులకు అందుకే మౌనయోగి అని పేరు. అలా మౌనంగా ఉండి పరబ్రహ్మముగా అనుభవములో ఎప్పుడూ రమిస్తూ ఉంటారు. అటువంటి స్థాయి పొందిన మహాపురుషులు.*
🌹 🌹 🌹 🌹 🌹Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹

https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://chat.whatsapp.com/KtLL1EZQceL1YLFwsAp8bh
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹