🌹. వివేక చూడామణి - 170 / Viveka Chudamani - 170 🌹
✍️ రచన : పేర్నేటి గంగాధర రావు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🍀. 32. నేను బ్రహ్మాన్ని తెలుసుకొన్నవాడిని -17 🍀
554. హద్దులను తొలగించుకొని, బ్రహ్మాన్ని పూర్తిగా తెలుసుకొన్నవాడు, తాను బ్రహ్మములో పూర్తిగా లీనమై, రెండవది ఏదీ లేకుండా, అంతా అదే అయి అతడు శాశ్వతముగా స్వేచ్ఛగా జీవితములో తన లక్ష్యమును చేరుకొన్నవాడవుతాడు.
555. నటుని వలె ఎవడైతే తన పాత్రకు తగిన దుస్తులు ధరిస్తాడో లేక ఏమి ధరించకుండా నగ్నముగా ఉంటాడో, అట్టి వాడు అన్ని తెలిసినవాడు. బ్రహ్మ జ్ఞానిగా ఎల్లపుడు బ్రహ్మములోనే జీవిస్తుంటాడు.
556. ఎవడైతే బ్రహ్మాన్ని తెలుసుకుంటాడో అతని శరీరము విశీర్ణమై ఎచ్చట పడిపోయినప్పటికి, చెట్టు మీద ఆకు వలె అతనికి దాని పై ఎట్టి ప్రభావము ఉండదు. ఎందువలనంటే అతనికి శరీర వ్యామోహము తన జ్ఞానము వలన తొలగిపోయినది. తాను చనిపోయిన తరువాత తన శరీరమును గూర్చిన పట్టింపు ఉండదు.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 VIVEKA CHUDAMANI - 170 🌹
✍️ Sri Adi Shankaracharya, Swami Madhavananda
📚 Prasad Bharadwaj
🌻 32. I am the one who knows Brahman -17 🌻
554. Through the destruction of limitations, the perfect knower of Brahman is merged in the One Brahman without a second – which he had been all along – becomes very free even while living, and attains the goal of his life.
555. As an actor, when he puts on the dress of his role, or when he does not, is always a man, so the perfect knower of Brahman is always Brahman and nothing else.
556. It is only the presence or absence of dress that makes the different characters assumed by the actor (the man remains the same always); so this knower of Brahman is always Brahman (not separate from him), no matter in what name or form.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
21 Dec 2021
No comments:
Post a Comment