మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 122
🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 122 🌹
✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
సంకలనము : వేణుమాధవ్
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻. లోకోద్ధరణము- లోక కల్యాణము - 7 🌻
జీవుడు లోకహితార్థమై పనిచేయుటకు ఇష్టపడకున్నను, తన అవసరములు తీరుటకై ఇతరులపై ఆధారపడునట్లు ప్రకృతి ఏర్పాటు చేసినది. ఈ ఏర్పాటు నుండి నరుడు లోకహిత కాంక్షయను గుణపాఠము నేర్చుటయే ప్రకృతి ఆశయము. అట్లు నేర్చుటకు కొంతకాలము పట్టును. ఈ లోపు జీవుల పరస్పరాశ్రయత్వము వ్యాపారముగ మార్చుకొని, డబ్బు జీవికగా జీవించుట వలన, ఆహార వస్త్రాది ఆవశ్యకములు తీరుచున్నట్లే కనపడును. అనుక్షణము అసంతృప్తి మాత్రము తప్పదు.
బహు సంఖ్యాకులగు జనులు ఇట్లే జీవించినచో, పోటి పెరుగును. సమాజమున బలుపు ఏర్పడును. బలము కాదు. బలహీనులు అణచివేతకు గురియగుదురు. ఆపై వారు ప్రతిఘటనకు పూనుకొందురు. వర్గములు ఏర్పడి, పోరాటములతో సంఘము విచ్ఛిన్నమగును. సిద్ధాంతముల పేర ఎట్టి ఆర్థిక సాంఘిక వ్యవస్థ నిర్మించినను, సంక్షోభము, వినాశము తప్పవు..
.....✍️ మాస్టర్ ఇ.కె.🌻
🌹 🌹 🌹 🌹 🌹
21 Dec 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment