శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 362-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 362-1


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 362-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 362-1 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 80. చితి, స్తత్పదలక్ష్యార్థా, చిదేక రసరూపిణీ ।
స్వాత్మానంద లవీభూత బ్రహ్మాద్యానంద సంతతిః ॥ 80 ॥ 🍀

🌻 362-1. 'చితిః' 🌻


చితిః అనగా చైతన్యము అని అర్థము. అనగా శ్రీమాత సహజముగ చైతన్యము అని అర్థము. స్వతంత్రమైనది, సిద్ధికి విశ్వసిద్ధికి కారణమైనది చిత్ అని నిర్వచింప బడినది. జీవుడు కూడ చైతన్య స్వరూపుడే. కాని అతడు ప్రకృతికి లోనై వుండుటచే అస్వతంత్రుడై యుండును. ప్రకృతికి లోబడని జీవుడు శుద్ధ చైతన్య స్వరూపుడు. అతడు గుణముల నాశ్రయించి అహంకార స్వరూపు డగును. బుద్ధి అను చైతన్య ప్రజ్ఞ అతనికి తోడుగ నుండును.

అటుపైన మనస్సు నాశ్రయించి యింద్రియములను చేరును. అపుడు చిత్తమను ప్రజ్ఞ సహాయ పడుచుండును. ఇట్లు నాలుగు స్థితులలో చైతన్యము మానవునియందు శుద్ధ చైతన్యముగను, అహంకారము గను, బుద్ధిగను, చిత్తముగను యుండును. ఇందు మొదటిది మనలోని దైవము. రెండవది మనము. మూడవది మనయందలి విచక్షణా జ్ఞానము. నాలుగవది మన యందలి స్వభావము ప్రవర్తింప జేయు ప్రజ్ఞ. దీనినే వరుసగ పరా పశ్యంతి మధ్యమ వైఖరి వాక్కులుగ తెలుపుదురు.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 362-1 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️. Acharya Ravi Sarma
📚. Prasad Bharadwaj


🌻 80. Chiti statpadalakshyardha chidekarasa rupini
Svatyanandalavibhuta bramhadyananda santatih ॥ 80 ॥ 🌻

🌻 362-1. Citiḥ चितिः 🌻

She is in the form of eternal knowledge. Cit can be explained as pure knowledge that helps in realizing the Brahman. The opposite of cit (vidyā) is nescience (avidyā or ignorance about the Brahman).

Her vimarśa form is discussed here. Brahman has two forms prakāśa or the static and self illuminating energy and vimarśa or the kinetic and reflecting energy. The one without the other is not capable of sustaining this universe and this interdependency is called as the union of Śiva and Śaktī.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


08 Apr 2022

ఓషో రోజువారీ ధ్యానాలు - 165. ఉద్ధృతం / Osho Daily Meditations - 165. WILD



🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 165 / Osho Daily Meditations - 165 🌹

📚. ప్రసాద్ భరద్వాజ్

🍀 165. ఉద్ధృతం 🍀

🕉. ప్రేమ ఒక ఉద్ధృతి. మీరు దానిని నియంత్రించడానికి ప్రయత్నించిన క్షణం అది మిగలదు. ప్రేమ అనేది స్వేచ్ఛ, ఉగ్రత, మరియు ఆకస్మికత యొక్క సుడిగాలి. 🕉


మీరు ప్రేమను నిర్వహించ లేరు. దానిని నియంత్రించ లేరు. నియంత్రణలో ఉందా, అది చనిపోతుంది. ప్రేమను ఇప్పటికే చంపి ఉంటే మీరు దానిని నియంత్రించ వచ్చు. అది సజీవంగా ఉంటే, అది మిమ్మల్ని నియంత్రిస్తుంది, లేకపోతే కాదు. అది సజీవంగా ఉంటే, అది మిమ్మల్ని కలిగి ఉంటుంది. మీరు దానిలో మిమ్మల్ని పోగొట్టుకుంటారు, ఎందుకంటే అది మీ కంటే పెద్దది, మీ కంటే విశాలమైనది, మీ కంటే ప్రాథమికమైనది, మీకు పునాది. అదే విధంగా దేవుడు కూడా వస్తాడు. దేవుడు కూడా అనంతుడు. దైవం, ప్రేమ అంటే అంతులేని విశాలత్వం. నాగరికత కలిగిన దేవుడు అస్సలు దేవుడు కాదు.

ఆలయ దేవుడు కేవలం విగ్రహం మాత్రమే. దేవుడు చాలా కాలం క్రితం ఆ ప్రదేశాల నుండి అదృశ్యమయ్యాడు, ఎందుకంటే దేవుణ్ణి బంధించ లేరు. మీరు భగవంతుడిని కనుగొనాలను కుంటే, మీరు జీవితంలోని అత్యంత సహజమైన ఉద్ధృతి శక్తికి అందుబాటులో ఉండాలి. ప్రేమ మొదటి సంగ్రహావలోకనం, ప్రయాణం ప్రారంభం. దేవుడు అంతిమం, పరాకాష్ట. కానీ దేవుడు సుడిగాలిలా, ఉప్పెనలా వస్తాడు. అది నిన్ను నిర్మూలిస్తుంది, అది నిన్ను స్వాధీనం చేసుకుంటుంది. అది నిన్ను ముక్కలుగా నలిపేస్తుంది. అది నిన్ను చంపి పునరుత్థానం చేస్తుంది. ఇది ఒకేసారి మరణ రేఖను దాటడం మరియు పునరుత్థానం కూడా.


కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Osho Daily Meditations - 165 🌹

📚. Prasad Bharadwaj

🍀 165. WILD 🍀

🕉 Love is wild, and the moment one tries to domesticate it, it is destroyed. Love is a whirlwind of freedom, of wildness, of spontaneity. 🕉

You cannot manage love and control it. Controlled, it is dead. Love can be controlled only when you have already killed it. If it is alive, it controls you, not otherwise. If it is alive, it possesses you. You are simply lost in it, because it is bigger than you, vaster than you, more primal than you, more foundational than you. In the same way God also comes. The same way love comes to you, God comes. God is also wild, wilder than love. A civilized God is no God at all.

The God of the temple is just an idol. God has disappeared from those places long ago, because God cannot be imprisoned. If you want to find God, you will have to be available to the wild energy of life. Love is the first glimpse, the beginning of the journey. God is the climax, the culmination, but God comes as a whirlwind. It will uproot you, it will possess you. It will crush you to pieces. It will kill you and resurrect you. It will be both-the crossing the line of death and the resurrection.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


08 Apr 2022

మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 176


🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 176 🌹

✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. మోక్షము - వినాశము - 2 🌻


మంచుగడ్డలు నీటిపై తేలుచున్నపుడు నీరుగా నున్న ద్రవ్యము ననుసరించి మంచుగడ్డగా నున్న అదే ద్రవ్యము ప్రవర్తించును. మంచుగడ్డ ప్రవహించు దిక్కు మున్నగునవి నీటి ప్రవాహము ననుసరించి యుండును. అనగా మంచుగడ్డలోని అదే ద్రవ్యమునకు పరాధీనత , నీటిలోని అదే ద్రవ్యమునకు స్వామిత్వము కలుగును.

అదే విధముగా త్రిగుణములతో బద్ధుడుగా జీవుడును , త్రిగుణాత్మక ప్రకృతికి ప్రభువుగా ఈశ్వరుడును వర్తించుచున్నారు. ఈ బద్ధస్థితి ఉన్నంత తడవును జీవునకు బోధపడదు. బోధపడుట యనగా ఈశత్వము నందు మేల్కొనుట. అదియే మోక్షము.


...✍️ మాస్టర్ ఇ.కె.🌻

🌹 🌹 🌹 🌹 🌹


08 Apr 2022

శ్రీ శివ మహా పురాణము - 546 / Sri Siva Maha Purana - 546


🌹 . శ్రీ శివ మహా పురాణము - 546 / Sri Siva Maha Purana - 546 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః - అధ్యాయము - 50 🌴

🌻. పరిహాసములు - 1 🌻


బ్రహ్మ ఇట్లు పలికెను -

ఓ నారదా! తరువాత నేను శివుని పార్వతీ పరమేశ్వరుల వివాహములో మిగిలిన కార్యమును ముని గణములతో గూడి ప్రతీతో చేసితిని (1). బ్రాహ్మణనులు వారద్దరికి తరువాత శిరస్సులపై అభిషేకమును సాదరముగా జరిపించిరి. తరువాత ధ్రువనక్షత్ర దర్శనమును చేయించిరి (2). ఆ తరువాత హృదయమును స్పృశించుట అను కర్మ జరుపబడెను. ఓ బ్రాహ్మణ శ్రేష్ఠా! స్వస్తి పఠనము మహోత్సవముతో సాగెను (3). శంభుడు బ్రాహ్మణుల ఆజ్ఞచే పార్వతి శిరస్సుపై సిందూరమునంచెను. అపుడు పార్వతి వర్ణింపశక్యము కాని అద్భుత సౌందర్యముతో నలరారెను (4).

అపుడు బ్రహ్మణుల ఆజ్ఞచే వారిద్దరు ఒకే ఆసనమునందు గూర్చుండి పరమశోభను కలిగియుండిరి. ఆ దృశ్యమునకు భక్తుల చిత్తములు ఉప్పొంగును (5). ఓ మునీ! తరువాత అద్భుతమైన లీలలను ప్రదర్శించే ఆ దంపతులు నా ఆదేశముచే తమ స్థానములకు వచ్చి మోమ శేషద్రవ్యమును ఆనందముతో బుజించిరి (6). ఈ తీరున వివాహయజ్ఞము యతావిదిగా సంపన్నము కాగా, శివప్రభుడు సృష్టకర్త, బ్రహ్మ అగు నాకు పూర్ణ పాత్రను ఇచ్చెను (7). తరువాత శంభుడు యథావిధిగా గో). దానమును ఆచార్యునకిచ్చి, మంగళములనిచ్చే మహాదానములను కూడా ప్రీతితో చేసెను (8).

తరువాత ఆయన బ్రాహ్ముణునలకు ఒక్కోక్కరికి వంద సువర్ణముల నిచ్చెను. కోట్ల కొలది రత్నములను, వివిద ద్రవ్యములను అనేక మందికి ఇచ్చెను (9). అపుడు సర్వదేవతలు, ఇతరములగు చరాచర ప్రాణనులు మనస్సులో చాల ఆనందించి జయధ్వనులను చేసిరి (10).


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹




🌹 SRI SIVA MAHA PURANA - 546 🌹

✍️ J.L. SHASTRI
📚. Prasad Bharadwaj

🌴 Rudra-saṃhitā (3): Pārvatī-khaṇḍa - CHAPTER 50 🌴

🌻 Description of fun and frolic - 1 🌻



Brahmā said:—

1. O Nārada, thereafter at the bidding of Śiva, I carried out the concluding ceremonies of the wedding of Śiva and Pārvatī joyously through the sages.

2. Their ceremonial head-bath[1] was respectfully gone through. The brahmins showed the Pole star Dhruva[2] with respect.

3. Thereafter the rite of Hṛdayālambhana[3] was performed. O great brahmin, then Svastipāṭha[4] was jubilantly celebrated.

4. At the behest of the brahmins, Śiva applied Red powder[5] on the head of Pārvatī. The lustre of Pārvatī at that time was beyond description and very wondrous.

5. Thereafter at the bidding of the brahmins both sat on the same cushion and attained such a lustre as accentuated joy in the hearts of the devotees.

6. O sage, then they returned to their apartment and, at my behest performed the rite of Saṃsrava Prāśana[6], of wonderful sportive nature that they were.

7. When the sacrificial rites in marriage ceremony were thus concluded duly, lord Śiva gave the Pūrṇapātra[7] to me, the creator of the worlds.

8. Śiva then made the gift of cows to the presiding priest. Other gifts of auspicious nature were also made.

9. He gave the brahmins a hundred gold pieces each. A crore of gems and other articles were distributed among the people as gifts.

10. The Gods, mobile and immobile creatures, rejoiced much. Shouts of victory rose up.


Continues....

🌹🌹🌹🌹🌹


08 Apr 2022

గీతోపనిషత్తు -348


🌹. గీతోపనిషత్తు -348 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము - 32 📚


🍀 32-2. తత్వదర్శనులు - జీవుడు సహజముగ స్వయం ప్రకాశకుడు. అతడు దైవము నుండి ఏర్పడినవాడే. అతని చుట్టును మూడు గుణములచేత, ఐదు భూతములచేత, ఎనిమిది ఆవరణలు ఏర్పడి యున్నవి. ఆవరణ లెట్లున్నను అందున్నది జీవుడే. జీవులందరును దేవుని అంశలే. వారి కేర్పడిన దేహములు బట్టి వారి అర్హత, అనర్హత నిర్ణయము చేయుట దురాచారమే గాక, దురహంకారము కూడ. 🍀

32. మాం హి పార్థ వ్యపాశ్రిత్య యే2 పి స్యుః పాపయోనయః I
స్త్రియో వైశ్యాస్తథా శూద్రాస్తే పి యాంతి పరాం గతిమ్ ॥

తాత్పర్యము : అనన్యభక్తి మార్గమున నన్నాశ్రయించు వారు నిశ్చయముగ నన్నే పొందుచున్నారు. అట్టివారు స్త్రీలైనను, వైశ్యులైనను, శూద్రులైనను అంతర మేమియు ఉండదు.

వివరణము : జీవులందరును దేవుని అంశలే. వారి కేర్పడిన దేహములు బట్టి వారి అర్హత, అనర్హత నిర్ణయము చేయుట దురాచారమే గాక, దురహంకారము కూడ. ఎందరో స్త్రీలు, వైశ్యులు, శూద్రులు, నిమ్నజాతుల వారు, ఆటవికులు కూడ పరమపదమును పొందిన ఉదంతము లున్నవి. మాంసపు దుకాణమును నిర్వర్తించెడి ధర్మవ్యాధుడు బ్రహ్మర్షియై నిలచినాడు. అడవిజాతికి చెందిన రత్నాకరుడను బందిపోటు దొంగ వాల్మీకి మహర్షియై నిలచినాడు. ఎందరో స్త్రీలు బ్రహ్మత్వమును పొందిన కథ లున్నవి.

ఇటీవలి కాలముననే బ్రహ్మ రూపిణిగ జిల్లెళ్లమూడి గ్రామము నందు అమ్మ ఎందరినో తరింప జేసినది. సూరదాసు, కాళిదాసు, కనకదాసు వంటి భక్తులు సూటిగ దైవమును చేరిన కథ లున్నవి. జీవుడు సహజముగ స్వయం ప్రకాశకుడు. అతడు దైవము నుండి ఏర్పడినవాడే. అతని చుట్టును మూడు గుణములచేత, ఐదు భూతములచేత, ఎనిమిది ఆవరణలు ఏర్పడి యున్నవి. ఆవరణ లెట్లున్నను అందున్నది జీవుడే.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


08 Apr 2022

08 - APRIL - 2022 శుక్రవారం MESSAGES

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam 08, శుక్రవారం, ఏప్రిల్ 2022 భృగు వాసరే 🌹
2) 🌹. గీతోపనిషత్తు - రాజవిద్య రాజగుహ్య యోగము 32-2 - 348 - తత్వదర్శనులు🌹 
3) 🌹. శివ మహా పురాణము - 546 / Siva Maha Purana - 546 🌹
4)🌹. మాస్టర్ ఇ.కె సందేశాలు -176🌹
5) 🌹 ఓషో రోజువారీ ధ్యానములు - 165 / Osho Daily Meditations - 165 🌹
6) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 362-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 362-1 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శుభ శుక్రవారం మిత్రులందరికీ 🌹*
*భృగు వాసరే, 08, ఏప్రిల్‌ 2022*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*

*🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు🌻*

*🍀. శ్రీ మహాలక్ష్మి స్తోత్రం - 17 🍀*

*33. మందురాకరిశాలాసు గవాం గోష్ఠే సమాహితః |*
*పఠేత్తద్దోషశాంత్యర్థం మహాపాతకనాశనమ్*
*34. సర్వసౌఖ్యకరం నృణామాయురారోగ్యదం తథా* |
*అగస్తిమునినా ప్రోక్తం ప్రజానాం హితకామ్యయా*


🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : తమ పట్ల క్రూరంగా వ్యవహరించే వ్యక్తుల పట్ల స్నేహాన్ని కురిపించ గలగడం ఆధ్యాత్మిక సాధకుల లక్షణం. - సద్గురు శ్రీరామశర్మ 🍀*

🌷🌷🌷🌷🌷

విక్రమ సంవత్సరం: 2079 రక్ష
శాలివాహన శక : 1944
ఉత్తరాయణం, వసంత ఋతువు
శుభకృత్‌ సంవత్సరం, చైత్ర మాసం
తిథి: శుక్ల-సప్తమి 23:06:34 వరకు
తదుపరి శుక్ల-అష్టమి
నక్షత్రం: ఆర్ద్ర 25:44:27 వరకు
తదుపరి పునర్వసు
యోగం: శోభన 10:30:00 వరకు
తదుపరి అతిగంధ్
కరణం: గార 09:49:37 వరకు
వర్జ్యం: 08:09:42 - 09:57:50
దుర్ముహూర్తం: 08:34:32 - 09:24:13
మరియు 12:42:55 - 13:32:36
రాహు కాలం: 10:44:56 - 12:18:05
గుళిక కాలం: 07:38:39 - 09:11:48
యమ గండం: 15:24:22 - 16:57:31
అభిజిత్ ముహూర్తం: 11:54 - 12:42
అమృత కాలం: 14:28:10 - 16:16:18
మరియు 25:50:18 - 27:37:26
సూర్యోదయం: 06:05:30
సూర్యాస్తమయం: 18:30:40
చంద్రోదయం: 11:05:08
చంద్రాస్తమయం: 00:45:11
సూర్య సంచార రాశి: మీనం
చంద్ర సంచార రాశి: జెమిని
పద్మ యోగం - ఐశ్వర్య ప్రాప్తి 25:44:27
వరకు తదుపరి లంబ యోగం 
- చికాకులు, అపశకునం

🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam 
#PanchangDaily
#DailyTeluguCalender 
Join and Share 
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. గీతోపనిషత్తు -348 🌹*
*✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము - 32 📚*
 
*🍀 32-2. తత్వదర్శనులు - జీవుడు సహజముగ స్వయం ప్రకాశకుడు. అతడు దైవము నుండి ఏర్పడినవాడే. అతని చుట్టును మూడు గుణములచేత, ఐదు భూతములచేత, ఎనిమిది ఆవరణలు ఏర్పడి యున్నవి. ఆవరణ లెట్లున్నను అందున్నది జీవుడే. జీవులందరును దేవుని అంశలే. వారి కేర్పడిన దేహములు బట్టి వారి అర్హత, అనర్హత నిర్ణయము చేయుట దురాచారమే గాక, దురహంకారము కూడ. 🍀*

*32. మాం హి పార్థ వ్యపాశ్రిత్య యే2 పి స్యుః పాపయోనయః I*
*స్త్రియో వైశ్యాస్తథా శూద్రాస్తే పి యాంతి పరాం గతిమ్ ॥*

*తాత్పర్యము : అనన్యభక్తి మార్గమున నన్నాశ్రయించు వారు నిశ్చయముగ నన్నే పొందుచున్నారు. అట్టివారు స్త్రీలైనను, వైశ్యులైనను, శూద్రులైనను అంతర మేమియు ఉండదు.*

*వివరణము : జీవులందరును దేవుని అంశలే. వారి కేర్పడిన దేహములు బట్టి వారి అర్హత, అనర్హత నిర్ణయము చేయుట దురాచారమే గాక, దురహంకారము కూడ. ఎందరో స్త్రీలు, వైశ్యులు, శూద్రులు, నిమ్నజాతుల వారు, ఆటవికులు కూడ పరమపదమును పొందిన ఉదంతము లున్నవి. మాంసపు దుకాణమును నిర్వర్తించెడి ధర్మవ్యాధుడు బ్రహ్మర్షియై నిలచినాడు. అడవిజాతికి చెందిన రత్నాకరుడను బందిపోటు దొంగ వాల్మీకి మహర్షియై నిలచినాడు. ఎందరో స్త్రీలు బ్రహ్మత్వమును పొందిన కథ లున్నవి.*

*ఇటీవలి కాలముననే బ్రహ్మ రూపిణిగ జిల్లెళ్లమూడి గ్రామము నందు అమ్మ ఎందరినో తరింప జేసినది. సూరదాసు, కాళిదాసు, కనకదాసు వంటి భక్తులు సూటిగ దైవమును చేరిన కథ లున్నవి. జీవుడు సహజముగ స్వయం ప్రకాశకుడు. అతడు దైవము నుండి ఏర్పడినవాడే. అతని చుట్టును మూడు గుణములచేత, ఐదు భూతములచేత, ఎనిమిది ఆవరణలు ఏర్పడి యున్నవి. ఆవరణ లెట్లున్నను అందున్నది జీవుడే.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
#గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 546 / Sri Siva Maha Purana - 546 🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః - అధ్యాయము - 50 🌴*

*🌻. పరిహాసములు - 1 🌻*

బ్రహ్మ ఇట్లు పలికెను -

ఓ నారదా! తరువాత నేను శివుని పార్వతీ పరమేశ్వరుల వివాహములో మిగిలిన కార్యమును ముని గణములతో గూడి ప్రతీతో చేసితిని (1). బ్రాహ్మణనులు వారద్దరికి తరువాత శిరస్సులపై అభిషేకమును సాదరముగా జరిపించిరి. తరువాత ధ్రువనక్షత్ర దర్శనమును చేయించిరి (2). ఆ తరువాత హృదయమును స్పృశించుట అను కర్మ జరుపబడెను. ఓ బ్రాహ్మణ శ్రేష్ఠా! స్వస్తి పఠనము మహోత్సవముతో సాగెను (3). శంభుడు బ్రాహ్మణుల ఆజ్ఞచే పార్వతి శిరస్సుపై సిందూరమునంచెను. అపుడు పార్వతి వర్ణింపశక్యము కాని అద్భుత సౌందర్యముతో నలరారెను (4).

అపుడు బ్రహ్మణుల ఆజ్ఞచే వారిద్దరు ఒకే ఆసనమునందు గూర్చుండి పరమశోభను కలిగియుండిరి. ఆ దృశ్యమునకు భక్తుల చిత్తములు ఉప్పొంగును (5). ఓ మునీ! తరువాత అద్భుతమైన లీలలను ప్రదర్శించే ఆ దంపతులు నా ఆదేశముచే తమ స్థానములకు వచ్చి మోమ శేషద్రవ్యమును ఆనందముతో బుజించిరి (6). ఈ తీరున వివాహయజ్ఞము యతావిదిగా సంపన్నము కాగా, శివప్రభుడు సృష్టకర్త, బ్రహ్మ అగు నాకు పూర్ణ పాత్రను ఇచ్చెను (7). తరువాత శంభుడు యథావిధిగా గో). దానమును ఆచార్యునకిచ్చి, మంగళములనిచ్చే మహాదానములను కూడా ప్రీతితో చేసెను (8).

తరువాత ఆయన బ్రాహ్ముణునలకు ఒక్కోక్కరికి వంద సువర్ణముల నిచ్చెను. కోట్ల కొలది రత్నములను, వివిద ద్రవ్యములను అనేక మందికి ఇచ్చెను (9). అపుడు సర్వదేవతలు, ఇతరములగు చరాచర ప్రాణనులు మనస్సులో చాల ఆనందించి జయధ్వనులను చేసిరి (10). 

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 SRI SIVA MAHA PURANA - 546 🌹*
*✍️ J.L. SHASTRI*
*📚. Prasad Bharadwaj *

*🌴 Rudra-saṃhitā (3): Pārvatī-khaṇḍa - CHAPTER 50 🌴*

*🌻 Description of fun and frolic - 1 🌻*

Brahmā said:—

1. O Nārada, thereafter at the bidding of Śiva, I carried out the concluding ceremonies of the wedding of Śiva and Pārvatī joyously through the sages.

2. Their ceremonial head-bath[1] was respectfully gone through. The brahmins showed the Pole star Dhruva[2] with respect.

3. Thereafter the rite of Hṛdayālambhana[3] was performed. O great brahmin, then Svastipāṭha[4] was jubilantly celebrated.

4. At the behest of the brahmins, Śiva applied Red powder[5] on the head of Pārvatī. The lustre of Pārvatī at that time was beyond description and very wondrous.

5. Thereafter at the bidding of the brahmins both sat on the same cushion and attained such a lustre as accentuated joy in the hearts of the devotees.

6. O sage, then they returned to their apartment and, at my behest performed the rite of Saṃsrava Prāśana[6], of wonderful sportive nature that they were.

7. When the sacrificial rites in marriage ceremony were thus concluded duly, lord Śiva gave the Pūrṇapātra[7] to me, the creator of the worlds.

8. Śiva then made the gift of cows to the presiding priest. Other gifts of auspicious nature were also made.

9. He gave the brahmins a hundred gold pieces each. A crore of gems and other articles were distributed among the people as gifts.

10. The Gods, mobile and immobile creatures, rejoiced much. Shouts of victory rose up.

Continues....
🌹🌹🌹🌹🌹
#శివమహాపురాణము
#SivaMahaPuranam #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://facebook.com/groups/hindupuranas/
https://facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 176 🌹*
*✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు*
*📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ*

*🌻. మోక్షము - వినాశము - 2 🌻* 

*మంచుగడ్డలు నీటిపై తేలుచున్నపుడు నీరుగా నున్న ద్రవ్యము ననుసరించి మంచుగడ్డగా నున్న అదే ద్రవ్యము ప్రవర్తించును. మంచుగడ్డ ప్రవహించు దిక్కు మున్నగునవి నీటి ప్రవాహము ననుసరించి యుండును. అనగా మంచుగడ్డలోని అదే ద్రవ్యమునకు పరాధీనత , నీటిలోని అదే ద్రవ్యమునకు స్వామిత్వము కలుగును.*

*అదే విధముగా త్రిగుణములతో బద్ధుడుగా జీవుడును , త్రిగుణాత్మక ప్రకృతికి ప్రభువుగా ఈశ్వరుడును వర్తించుచున్నారు. ఈ బద్ధస్థితి ఉన్నంత తడవును జీవునకు బోధపడదు. బోధపడుట యనగా ఈశత్వము నందు మేల్కొనుట. అదియే మోక్షము.*

...✍️ *మాస్టర్ ఇ.కె.*🌻
🌹 🌹 🌹 🌹 🌹
#మాస్టర్‌ఇకెసందేశములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌷. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు 🌷 
www.facebook.com/groups/masterek/
https://t.me/ChaitanyaVijnanam
 www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 165 / Osho Daily Meditations - 165 🌹*
*📚. ప్రసాద్ భరద్వాజ్*

*🍀 165. ఉద్ధృతం 🍀*

*🕉. ప్రేమ ఒక ఉద్ధృతి. మీరు దానిని నియంత్రించడానికి ప్రయత్నించిన క్షణం అది మిగలదు. ప్రేమ అనేది స్వేచ్ఛ, ఉగ్రత, మరియు ఆకస్మికత యొక్క సుడిగాలి. 🕉*
 
*మీరు ప్రేమను నిర్వహించ లేరు. దానిని నియంత్రించ లేరు. నియంత్రణలో ఉందా, అది చనిపోతుంది. ప్రేమను ఇప్పటికే చంపి ఉంటే మీరు దానిని నియంత్రించ వచ్చు. అది సజీవంగా ఉంటే, అది మిమ్మల్ని నియంత్రిస్తుంది, లేకపోతే కాదు. అది సజీవంగా ఉంటే, అది మిమ్మల్ని కలిగి ఉంటుంది. మీరు దానిలో మిమ్మల్ని పోగొట్టుకుంటారు, ఎందుకంటే అది మీ కంటే పెద్దది, మీ కంటే విశాలమైనది, మీ కంటే ప్రాథమికమైనది, మీకు పునాది. అదే విధంగా దేవుడు కూడా వస్తాడు. దేవుడు కూడా అనంతుడు. దైవం, ప్రేమ అంటే అంతులేని విశాలత్వం. నాగరికత కలిగిన దేవుడు అస్సలు దేవుడు కాదు.*

*ఆలయ దేవుడు కేవలం విగ్రహం మాత్రమే. దేవుడు చాలా కాలం క్రితం ఆ ప్రదేశాల నుండి అదృశ్యమయ్యాడు, ఎందుకంటే దేవుణ్ణి బంధించ లేరు. మీరు భగవంతుడిని కనుగొనాలను కుంటే, మీరు జీవితంలోని అత్యంత సహజమైన ఉద్ధృతి శక్తికి అందుబాటులో ఉండాలి. ప్రేమ మొదటి సంగ్రహావలోకనం, ప్రయాణం ప్రారంభం. దేవుడు అంతిమం, పరాకాష్ట. కానీ దేవుడు సుడిగాలిలా, ఉప్పెనలా వస్తాడు. అది నిన్ను నిర్మూలిస్తుంది, అది నిన్ను స్వాధీనం చేసుకుంటుంది. అది నిన్ను ముక్కలుగా నలిపేస్తుంది. అది నిన్ను చంపి పునరుత్థానం చేస్తుంది. ఇది ఒకేసారి మరణ రేఖను దాటడం మరియు పునరుత్థానం కూడా.*
  
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Osho Daily Meditations - 165 🌹*
*📚. Prasad Bharadwaj*

*🍀 165. WILD 🍀*

*🕉 Love is wild, and the moment one tries to domesticate it, it is destroyed. Love is a whirlwind of freedom, of wildness, of spontaneity. 🕉*
 
*You cannot manage love and control it. Controlled, it is dead. Love can be controlled only when you have already killed it. If it is alive, it controls you, not otherwise. If it is alive, it possesses you. You are simply lost in it, because it is bigger than you, vaster than you, more primal than you, more foundational than you. In the same way God also comes. The same way love comes to you, God comes. God is also wild, wilder than love. A civilized God is no God at all.*

*The God of the temple is just an idol. God has disappeared from those places long ago, because God cannot be imprisoned. If you want to find God, you will have to be available to the wild energy of life. Love is the first glimpse, the beginning of the journey. God is the climax, the culmination, but God comes as a whirlwind. It will uproot you, it will possess you. It will crush you to pieces. It will kill you and resurrect you. It will be both-the crossing the line of death and the resurrection.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోరోజువారీధ్యానములు
#OshoDailyMeditations
#ఓషోబోధనలు #OshoDiscourse 
#ఓషోనిర్మలధ్యానములు #PrasadBhardwaj 
https://t.me/ChaitanyaVijnanam
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/ 
https://oshodailymeditations.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 362-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 362-1 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*మూల మంత్రము :*
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀 80. చితి, స్తత్పదలక్ష్యార్థా, చిదేక రసరూపిణీ ।*
*స్వాత్మానంద లవీభూత బ్రహ్మాద్యానంద సంతతిః ॥ 80 ॥ 🍀*

*🌻 362-1. 'చితిః' 🌻* 

*చితిః అనగా చైతన్యము అని అర్థము. అనగా శ్రీమాత సహజముగ చైతన్యము అని అర్థము. స్వతంత్రమైనది, సిద్ధికి విశ్వసిద్ధికి కారణమైనది చిత్ అని నిర్వచింప బడినది. జీవుడు కూడ చైతన్య స్వరూపుడే. కాని అతడు ప్రకృతికి లోనై వుండుటచే అస్వతంత్రుడై యుండును. ప్రకృతికి లోబడని జీవుడు శుద్ధ చైతన్య స్వరూపుడు. అతడు గుణముల నాశ్రయించి అహంకార స్వరూపు డగును. బుద్ధి అను చైతన్య ప్రజ్ఞ అతనికి తోడుగ నుండును.*

*అటుపైన మనస్సు నాశ్రయించి యింద్రియములను చేరును. అపుడు చిత్తమను ప్రజ్ఞ సహాయ పడుచుండును. ఇట్లు నాలుగు స్థితులలో చైతన్యము మానవునియందు శుద్ధ చైతన్యముగను, అహంకారము గను, బుద్ధిగను, చిత్తముగను యుండును. ఇందు మొదటిది మనలోని దైవము. రెండవది మనము. మూడవది మనయందలి విచక్షణా జ్ఞానము. నాలుగవది మన యందలి స్వభావము ప్రవర్తింప జేయు ప్రజ్ఞ. దీనినే వరుసగ పరా పశ్యంతి మధ్యమ వైఖరి వాక్కులుగ తెలుపుదురు.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 362-1 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️. Acharya Ravi Sarma *
*📚. Prasad Bharadwaj*

*🌻 80. Chiti statpadalakshyardha chidekarasa rupini*
*Svatyanandalavibhuta bramhadyananda santatih ॥ 80 ॥ 🌻*

*🌻 362-1. Citiḥ चितिः 🌻*

*She is in the form of eternal knowledge. Cit can be explained as pure knowledge that helps in realizing the Brahman. The opposite of cit (vidyā) is nescience (avidyā or ignorance about the Brahman).*

*Her vimarśa form is discussed here. Brahman has two forms prakāśa or the static and self illuminating energy and vimarśa or the kinetic and reflecting energy. The one without the other is not capable of sustaining this universe and this interdependency is called as the union of Śiva and Śaktī.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#శ్రీలలితాసహస్రనామచైతన్యవిజ్ఞానము #SriLalithaChaitanyaVijnanam #లలితాసహస్రనామములు #LalithaSahasranama
#PrasadBhardwaj 
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://www.facebook.com/103080154909766/
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹