శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 362-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 362-1
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 362-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 362-1 🌹
🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 80. చితి, స్తత్పదలక్ష్యార్థా, చిదేక రసరూపిణీ ।
స్వాత్మానంద లవీభూత బ్రహ్మాద్యానంద సంతతిః ॥ 80 ॥ 🍀
🌻 362-1. 'చితిః' 🌻
చితిః అనగా చైతన్యము అని అర్థము. అనగా శ్రీమాత సహజముగ చైతన్యము అని అర్థము. స్వతంత్రమైనది, సిద్ధికి విశ్వసిద్ధికి కారణమైనది చిత్ అని నిర్వచింప బడినది. జీవుడు కూడ చైతన్య స్వరూపుడే. కాని అతడు ప్రకృతికి లోనై వుండుటచే అస్వతంత్రుడై యుండును. ప్రకృతికి లోబడని జీవుడు శుద్ధ చైతన్య స్వరూపుడు. అతడు గుణముల నాశ్రయించి అహంకార స్వరూపు డగును. బుద్ధి అను చైతన్య ప్రజ్ఞ అతనికి తోడుగ నుండును.
అటుపైన మనస్సు నాశ్రయించి యింద్రియములను చేరును. అపుడు చిత్తమను ప్రజ్ఞ సహాయ పడుచుండును. ఇట్లు నాలుగు స్థితులలో చైతన్యము మానవునియందు శుద్ధ చైతన్యముగను, అహంకారము గను, బుద్ధిగను, చిత్తముగను యుండును. ఇందు మొదటిది మనలోని దైవము. రెండవది మనము. మూడవది మనయందలి విచక్షణా జ్ఞానము. నాలుగవది మన యందలి స్వభావము ప్రవర్తింప జేయు ప్రజ్ఞ. దీనినే వరుసగ పరా పశ్యంతి మధ్యమ వైఖరి వాక్కులుగ తెలుపుదురు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 362-1 🌹
Contemplation of 1000 Names of Sri Lalitha Devi
✍️. Acharya Ravi Sarma
📚. Prasad Bharadwaj
🌻 80. Chiti statpadalakshyardha chidekarasa rupini
Svatyanandalavibhuta bramhadyananda santatih ॥ 80 ॥ 🌻
🌻 362-1. Citiḥ चितिः 🌻
She is in the form of eternal knowledge. Cit can be explained as pure knowledge that helps in realizing the Brahman. The opposite of cit (vidyā) is nescience (avidyā or ignorance about the Brahman).
Her vimarśa form is discussed here. Brahman has two forms prakāśa or the static and self illuminating energy and vimarśa or the kinetic and reflecting energy. The one without the other is not capable of sustaining this universe and this interdependency is called as the union of Śiva and Śaktī.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
08 Apr 2022
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment