శ్రీ శివ మహా పురాణము - 546 / Sri Siva Maha Purana - 546


🌹 . శ్రీ శివ మహా పురాణము - 546 / Sri Siva Maha Purana - 546 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః - అధ్యాయము - 50 🌴

🌻. పరిహాసములు - 1 🌻


బ్రహ్మ ఇట్లు పలికెను -

ఓ నారదా! తరువాత నేను శివుని పార్వతీ పరమేశ్వరుల వివాహములో మిగిలిన కార్యమును ముని గణములతో గూడి ప్రతీతో చేసితిని (1). బ్రాహ్మణనులు వారద్దరికి తరువాత శిరస్సులపై అభిషేకమును సాదరముగా జరిపించిరి. తరువాత ధ్రువనక్షత్ర దర్శనమును చేయించిరి (2). ఆ తరువాత హృదయమును స్పృశించుట అను కర్మ జరుపబడెను. ఓ బ్రాహ్మణ శ్రేష్ఠా! స్వస్తి పఠనము మహోత్సవముతో సాగెను (3). శంభుడు బ్రాహ్మణుల ఆజ్ఞచే పార్వతి శిరస్సుపై సిందూరమునంచెను. అపుడు పార్వతి వర్ణింపశక్యము కాని అద్భుత సౌందర్యముతో నలరారెను (4).

అపుడు బ్రహ్మణుల ఆజ్ఞచే వారిద్దరు ఒకే ఆసనమునందు గూర్చుండి పరమశోభను కలిగియుండిరి. ఆ దృశ్యమునకు భక్తుల చిత్తములు ఉప్పొంగును (5). ఓ మునీ! తరువాత అద్భుతమైన లీలలను ప్రదర్శించే ఆ దంపతులు నా ఆదేశముచే తమ స్థానములకు వచ్చి మోమ శేషద్రవ్యమును ఆనందముతో బుజించిరి (6). ఈ తీరున వివాహయజ్ఞము యతావిదిగా సంపన్నము కాగా, శివప్రభుడు సృష్టకర్త, బ్రహ్మ అగు నాకు పూర్ణ పాత్రను ఇచ్చెను (7). తరువాత శంభుడు యథావిధిగా గో). దానమును ఆచార్యునకిచ్చి, మంగళములనిచ్చే మహాదానములను కూడా ప్రీతితో చేసెను (8).

తరువాత ఆయన బ్రాహ్ముణునలకు ఒక్కోక్కరికి వంద సువర్ణముల నిచ్చెను. కోట్ల కొలది రత్నములను, వివిద ద్రవ్యములను అనేక మందికి ఇచ్చెను (9). అపుడు సర్వదేవతలు, ఇతరములగు చరాచర ప్రాణనులు మనస్సులో చాల ఆనందించి జయధ్వనులను చేసిరి (10).


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹




🌹 SRI SIVA MAHA PURANA - 546 🌹

✍️ J.L. SHASTRI
📚. Prasad Bharadwaj

🌴 Rudra-saṃhitā (3): Pārvatī-khaṇḍa - CHAPTER 50 🌴

🌻 Description of fun and frolic - 1 🌻



Brahmā said:—

1. O Nārada, thereafter at the bidding of Śiva, I carried out the concluding ceremonies of the wedding of Śiva and Pārvatī joyously through the sages.

2. Their ceremonial head-bath[1] was respectfully gone through. The brahmins showed the Pole star Dhruva[2] with respect.

3. Thereafter the rite of Hṛdayālambhana[3] was performed. O great brahmin, then Svastipāṭha[4] was jubilantly celebrated.

4. At the behest of the brahmins, Śiva applied Red powder[5] on the head of Pārvatī. The lustre of Pārvatī at that time was beyond description and very wondrous.

5. Thereafter at the bidding of the brahmins both sat on the same cushion and attained such a lustre as accentuated joy in the hearts of the devotees.

6. O sage, then they returned to their apartment and, at my behest performed the rite of Saṃsrava Prāśana[6], of wonderful sportive nature that they were.

7. When the sacrificial rites in marriage ceremony were thus concluded duly, lord Śiva gave the Pūrṇapātra[7] to me, the creator of the worlds.

8. Śiva then made the gift of cows to the presiding priest. Other gifts of auspicious nature were also made.

9. He gave the brahmins a hundred gold pieces each. A crore of gems and other articles were distributed among the people as gifts.

10. The Gods, mobile and immobile creatures, rejoiced much. Shouts of victory rose up.


Continues....

🌹🌹🌹🌹🌹


08 Apr 2022

No comments:

Post a Comment