🍀 01, FEBRUARY 2023 WEDNESDAY ALL MESSAGES బుధవారం, సౌమ్య వాసర సందేశాలు 🍀

🌹🍀 01, FEBRUARY 2023 WEDNESDAY ALL MESSAGES బుధవారం, సౌమ్య వాసర సందేశాలు 🍀🌹
1) 🌹 01, FEBRUARY 2023 WEDNESDAY, బుధవారం, సౌమ్య వాసరే - నిత్య పంచాంగము Daily Panchangam🌹
*🍀. భీష్మ - జయ ఏకాదశి, విష్టు సహస్రనామ జయంతి శుభాకాంక్షలు, Bhishma - Jaya Ekadashi, Vishnu Sahasra Nama Jayahti Good Wishes to All 🍀*
2) 🌹 కపిల గీత - 127 / Kapila Gita - 127 🌹 🌴 3. ప్రకృతి పురుషుల వివేకము వలన మోక్షప్రాప్తి - 11 / 3. Salvation due to wisdom of Nature and Jeeva - 11 🌴
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 719 / Vishnu Sahasranama Contemplation - 719 🌹 
🌻719. దీప్తమూర్తిః, दीप्तमूर्तिः, Dīptamūrtiḥ🌻
4) 🌹 . శ్రీ శివ మహా పురాణము - 680 / Sri Siva Maha Purana - 680 🌹 🌻. గణేశుని వివాహము - 4 / The celebration of Gaṇeśa’s marriage - 4 🌻
5) 🌹 ఓషో రోజువారీ ధ్యానములు - 301 / Osho Daily Meditations - 301 🌹 🍀 301. తల్లిదండ్రులు / 301. PARENTS 🍀
6) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 428 / Sri Lalitha Chaitanya Vijnanam - 428 🌹 🌻 428. 'నిత్య యౌవనా' / 428. 'Nitya-yaovana' 🌻

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹01, ఫిబ్రవరి, February 2023 పంచాగము - Panchagam 🌹*
*శుభ బుధవారం, సౌమ్య వాసరే Wednesday*
*🍀. భీష్మ - జయ ఏకాదశి, విష్టు సహస్రనామ జయంతి శుభాకాంక్షలు, Bhishma - Jaya Ekadashi, Vishnu Sahasra Nama Jayahti Good Wishes to All 🍀*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*

*🌺. పండుగలు మరియు పర్వదినాలు : భీష్మ - జయ ఏకాదశి, విష్ణు సహస్రనామ జయంతి, Bhishma - Jaya Ekadashi, Vishnu Sahasra Nama Jayahti 🌺*

*🍀. శ్రీ గణేశ హృదయం - 5‌ 🍀*

8. వినాయకం నాయకవర్జితం ప్రియే
విశేషతో నాయకమీశ్వరాత్మనామ్ |
నిరంకుశం తం ప్రణమామి సర్వదం
సదాత్మకం భావయుతేన చేతసా

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : పురుష ప్రకృతులు సత్యవస్తువు యొక్క వేర్వేరు శక్తులు. అనగా, నైష్కర్మ స్థితియే పురుషుడనీ, కర్మ ప్రవృత్తియే ప్రకృతియనీ, నైష్కర్మ్య స్థితి యందు ప్రకృతి లేదనీ, కర్మప్రవృత్తి యందు పురుషుడు లేడనీ భావింపరాదు. సంపూర్ణమైన కర్మప్రవృత్తిలో కూడ పురుషుడు మరుగున దాగియే యున్నాడు. అట్లే సంపూర్ణమైన నైష్కర్మ్యస్థితిలో కూడ ప్రకృతి విశ్రాంత రూపిణిగ నిలిచియే యున్నది. 🍀*

*🌹. భీష్మ - జయ ఏకాదశి, విష్టు సహస్రనామ జయంతి 🌹*
*కురువృద్ధుడు, అత్యంత శక్తివంతుడు, తెలివైనవాడు అయిన భీష్మాచార్యుడు మహాభారత యుద్ధంలో నేలకొరిగినప్పటికీ దక్షిణాయనంలో మరణించడం ఇష్టంలేక ఉత్తరాయణంకోసం వేచి ఉన్నాడు. తన నిర్యాణానికి సమయం నిర్ణయించుకున్నాడు. 58 రోజులు అంపశయ్యపై పవళించి మాఘ శుద్ధ అష్టమినాడు పరమపదించాడు. మాఘ శుద్ధ అష్టమి నాడు భీష్మాచార్యుని ఆత్మ శ్రీకృష్ణునిలో లీనమైంది. భీష్ముడు మోక్షం పొందిన తర్వాత వచ్చిన మాఘ శుద్ధ ఏకాదశిని ''భీష్మ ఏకాదశి'', ''మహాఫల ఏకాదశి'', ''జయ ఏకాదశి'' అని అంటారు. ధర్మరాజు అడిగిన ప్రశ్నలకు భీష్ముడు ఇచ్చిన సమాధానమే విష్ణు సహస్రనామ స్తోత్రము.*

*నమామి నారాయణ పాద పంకజం కరోమి నారాయణ పూజనం సదా*
*వదామి నారాయణ నామ నిర్మలం స్మరామి నారాయణ తత్వమవ్యయం*

*''శ్రీమన్నారాయణుని పాదకమలాలకు నమస్కారం. దేవదేవుని నిరంతరం పూజిస్తూ, ఆ పవిత్ర నామాన్ని జపిస్తూ, నిర్మలమైన మనసుతో, అవ్యయమైన ఆయన తత్వాన్ని స్మరిస్తున్నాను''.*

🌷🌷🌷🌷🌷

శుభకృత్‌, శిశిర ఋతువు,
ఉత్తరాయణం, మాఘ మాసం
తిథి: శుక్ల-ఏకాదశి 14:03:47 వరకు
తదుపరి శుక్ల ద్వాదశి
నక్షత్రం: మృగశిర 27:24:48 వరకు
తదుపరి ఆర్ద్ర
యోగం: ఇంద్ర 11:29:39 వరకు
తదుపరి వైధృతి
కరణం: విష్టి 14:03:47 వరకు
వర్జ్యం: 06:54:16 - 08:41:12
దుర్ముహూర్తం: 12:06:50 - 12:52:23
రాహు కాలం: 12:29:36 - 13:55:00
గుళిక కాలం: 11:04:13 - 12:29:36
యమ గండం: 08:13:26 - 09:38:49
అభిజిత్ ముహూర్తం: 12:07 - 12:51
అమృత కాలం: 17:35:52 - 19:22:48
సూర్యోదయం: 06:48:02
సూర్యాస్తమయం: 18:11:10
చంద్రోదయం: 14:29:38
చంద్రాస్తమయం: 03:17:53
సూర్య సంచార రాశి: మకరం
చంద్ర సంచార రాశి: వృషభం
యోగాలు: అమృత యోగం - కార్య
సిధ్ది 27:24:48 వరకు తదుపరి 
ముసల యోగం - దుఃఖం 
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻    

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🍀. భీష్మ - జయ ఏకాదశి, విష్టు సహస్రనామ జయంతి శుభాకాంక్షలు, Bhishma - Jaya Ekadashi, Vishnu Sahasra Nama Jayahti Good Wishes to All 🍀*
*ప్రసాద్ భరద్వాజ*

*కురువృద్ధుడు, అత్యంత శక్తివంతుడు, తెలివైనవాడు అయిన భీష్మాచార్యుడు మహాభారత యుద్ధంలో నేలకొరిగినప్పటికీ దక్షిణాయనంలో మరణించడం ఇష్టంలేక ఉత్తరాయణంకోసం వేచి ఉన్నాడు. తన నిర్యాణానికి సమయం నిర్ణయించుకున్నాడు. 58 రోజులు అంపశయ్యపై పవళించి మాఘ శుద్ధ అష్టమినాడు పరమపదించాడు. మాఘ శుద్ధ అష్టమి నాడు భీష్మాచార్యుని ఆత్మ శ్రీకృష్ణునిలో లీనమైంది. భీష్ముడు మోక్షం పొందిన తర్వాత వచ్చిన మాఘ శుద్ధ ఏకాదశిని ''భీష్మ ఏకాదశి'', ''మహాఫల ఏకాదశి'', ''జయ ఏకాదశి'' అని అంటారు.*

*ఉత్తరాయణ పుణ్య తిథికోసం వేచిచూస్తోన్న భీష్ముని చూసేందుకు శ్రీకృష్ణుడు వచ్చాడు. అందుకు అమితానందం పొందిన భీష్ముడు శ్రీమన్నారాయణుని వేయి నామాలతో కీర్తించాడు. అదే ఇంటింటా భక్తిప్రపత్తులతో పారాయణం చేసే విష్ణు సహస్రనామం. అనంతరకాలంలో రాజ్యపాలన చేయవలసి ఉన్న ధర్మరాజును ఉద్దేశించి రాజనీతి అంశాలను బోధించాడు. ధర్మరాజు అడిగిన ప్రశ్నలకు భీష్ముడు ఇచ్చిన సమాధానమే విష్ణు సహస్రనామానికి ఉపోద్ఘాతం.*

*విష్ణు సహస్రనామం ఎప్పుడు పఠించినా పుణ్యం కలుగుతుంది. ముఖ్యంగా భీష్మ ఏకాదశినాడు గనుక విష్ణు సహస్రనామం పారాయణం చేస్తే ఆ ఫలితం అనంతంగా ఉంటుంది. అనుకున్న పనులు నిర్విఘ్నంగా నెరవేరుతాయి. భోగభాగ్యాలు కలుగుతాయి. సర్వ పాపాలూ హరిస్తాయి. పుణ్యగతులు లభిస్తాయి.*

*నమామి నారాయణ పాద పంకజం కరోమి నారాయణ పూజనం సదా*
*వదామి నారాయణ నామ నిర్మలం స్మరామి నారాయణ తత్వమవ్యయం*

*''శ్రీమన్నారాయణుని పాదకమలాలకు నమస్కారం. దేవదేవుని నిరంతరం పూజిస్తూ, ఆ పవిత్ర నామాన్ని జపిస్తూ, నిర్మలమైన మనసుతో, అవ్యయమైన ఆయన తత్వాన్ని స్మరిస్తున్నాను'' - అనేది ఈ శ్లోకానికి అర్ధం.*

*ఒక సందర్భంలో మహాశివుడు ''విష్ణు సహస్రనామం ఎలాంటి కష్టాల నుండి అయినా కాపాడుతుందని, సర్వవిధాలుగా రక్షిస్తుందని'' పార్వతీదేవికి చెప్పి, ''ఒకవేళ విష్ణు సహస్రనామం గనుక పారాయణం చేయలేకపొతే కనీసం*

*''శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే*
*సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే''*

*- అనే శ్లోకాన్ని మూడుసార్లు ఉచ్చరించినట్లయితే అంతే ఫలితం కలుగుతుంది'' అంటూ వివరించాడు.*

*ఈ భీష్మ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని విష్ణు సహస్రనామం పారాయణం చేయండి. అవకాశం లేకపోతే ''శ్రీరామ రామ...'' శ్లోకాన్ని మూడుసార్లు భక్తిగా జపించండి.*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. కపిల గీత - 127 / Kapila Gita - 127🌹*
*🍀. కపిల దేవహూతి సంవాదం 🍀*
*✍️. శ్రీమాన్ క.రామానుజాచార్యులు, 📚. ప్రసాద్‌ భరధ్వాజ*

*🌴 3. ప్రకృతి పురుషుల వివేకము వలన మోక్షప్రాప్తి - 11 🌴*

*11. నివృత్తబుద్ధ్యవస్థానో దూరీభూతాన్యదర్శనః|*
*ఉపలభ్యాత్మనాఽఽత్మానం చక్షుషేవార్కమాత్మదృక్॥*

*తాత్పర్యము : ఆత్మ దేహాది ఉపాధులకంటే వేరైనది. ఐనను అహంకారాది మిథ్యావస్తువుల యొక్క సాంగత్య కారణముగా ఈ దేహాదులు సత్యముగనే భాసించును. ఆ పరమాత్మ జగత్కారణ భూతమైన ప్రకృతికి అధిష్ఠాత - మహదాది కార్యవర్గముసు ప్రకాశింప జేయువాడు. కార్యకారణ రూపమగు సకల పదార్థముల యందును ఆ పరమాత్మయే వ్యాపించియున్నాడు.*

*వ్యాఖ్య : లింగమంటే దేహం. మనమే పేరు పెట్టినా, ఆ పేరు శరీరానికే గానీ ఆత్మకు కాదు. ఎపుడైతే పరమాత్మ స్వరూప జ్ఞ్యానం అవగతమవుతుందో, అపుడు దేహాసక్తి పోతుంది. అప్పుడు ముక్తలింగుడవుతాడు. ఆత్మ ఉంది అని చెప్పడానికి గుర్తుగా చెప్పబడుతున్న శరీరం మీద అనుబంధం వదిలి పెట్టబడుతుంది. దేవ తిర్యక్ మనుష్యాది బుద్ధిని విడిచిపెడతాడు. ఇది ముక్త లింగః - జీవుడు. ఇది పరమాత్మ జ్ఞ్యానం కలిగిన ఆత్మ జ్ఞ్యాని ప్రవర్తించే విధానం. దేహం యందు అభిమతి పోతుంది.*

*అలా అయిన తరువాత, ఎప్పుడు సత్ గానే ప్రకాశించే, ఉత్పత్తీ వినాశం లేని, సంకోచ వికాసమూ లేనీ, జీవాత్మకు బంధువైన, దేహాన్ని చూపేవాడైన, ప్రతీ వానిలోనూ (జీవుడిలోనూ, శరీరములోనూ) అంతర్యామిగా ఉండేవాడు, అద్వయం (రెండవ వాడైన వాడు లేని వాడు) ఐన వాడు అయిన పరమాత్మను దేహమునందు చూడగలడు. పరమాత్మ అనుగ్రహంతో ఆత్మస్వరూపం తెలుసుకున్న వాడు, తెలుసుకున్న ఆత్మ స్వరూపముతో, లేనట్లుగా, అంతవరకూ ఉన్నట్లు అనిపించిన, అంతలోనే ఇది లేకుండా ఉండేదనుకునే శరీరములోనే, ఈ దేహములోనే పరమాత్మను చూస్తాడు. ప్రకృతి కంటే విడిగా ఉన్న ఆత్మను చూస్తాడు, ఆత్మకన్నా వేరుగా ఉన్న పరమాత్మను కూడా చూస్తాడు. దేహముగా అంతర్యామిగా ఉన్న ఆత్మలో, అంతర్యామిగా ఉన్న పరమాత్మ చేతనే, 1. ఆత్మ జ్ఞ్యానమూ 2. పరమాత్మ జ్ఞ్యానమూ 3. దేహజ్ఞ్యానమూ కలుగుతాయి. ఇంద్రియములచే చూడదగని ఆత్మను శరీరముతో ఎలా చూడగలడు. ఆత్మ పరమాత్మ స్వరూపాన్ని మొదట ఎలా తెలుసుకోవాలి?*

*సశేషం..*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Kapila Gita - 127 🌹*
*🍀 Conversation of Kapila and Devahuti 🍀*
*📚 Prasad Bharadwaj*

*🌴 3. Salvation due to wisdom of Nature and Jeeva - 11 🌴*

*11. mukta-liṅgaṁ sad-ābhāsam asati pratipadyate*
*sato bandhum asac-cakṣuḥ sarvānusyūtam advayam*

*Meaning : A liberated soul realizes the Absolute Personality of Godhead, who is transcendental and who is manifest as a reflection even in the false ego. He is the support of the material cause and He enters into everything. He is absolute, one without a second, and He is the eyes of the illusory energy.*

*PURPORT : A pure devotee can see the presence of the Supreme Personality of Godhead in everything materially manifested. He is present there only as a reflection, but a pure devotee can realize that in the darkness of material illusion the only light is the Supreme Lord, who is its support. It is confirmed in Bhagavad-gītā that the background of the material manifestation is Lord Kṛṣṇa. And, as confirmed in the Brahma-saṁhitā, Kṛṣṇa is the cause of all causes. In the Brahma-saṁhitā it is stated that the Supreme Lord, by His partial or plenary expansion, is present not only within this universe and each and every universe, but in every atom, although He is one without a second. The word advayam, "without a second," which is used in this verse, indicates that although the Supreme Personality of Godhead is represented in everything, including the atoms, He is not divided. His presence in everything is explained in the next verse.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 719 / Vishnu Sahasranama Contemplation - 719🌹*

*🌻719. దీప్తమూర్తిః, दीप्तमूर्तिः, Dīptamūrtiḥ🌻*

*ఓం దీప్తమూర్తయే నమః | ॐ दीप्तमूर्तये नमः | OM Dīptamūrtaye namaḥ*

*దీప్తా జ్ఞానమయీ మూర్తి రస్యేతి స్వేచ్ఛయా హరేః ।*
*గృహీతా తైజసీ మూర్తిర్దీప్తాఽస్యేత్యథవా హరిః ।*
*దీప్తమూర్తితి ప్రోక్తో వేదవిద్యావిశారదైః ॥*

*ప్రకాశించుచుండు జ్ఞానమయియగు మూర్తి ఎవనికి కలదో అట్టివాడు. లేదా ఎవరి ఆజ్ఞతోను పనిలేక తన ఇచ్ఛతో గ్రహించబడిన తైజస మూర్తి అనగా హిరణ్యగర్భ మూర్తి - దీప్తమగు, ప్రకాశించునది ఈతనికి కలదు. (సకల తైజసమూర్తుల సమష్టియే హిరణ్యగర్భమూర్తి.)*

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 719🌹*

*🌻719. Dīptamūrtiḥ🌻*

*OM Dīptamūrtaye namaḥ*

दीप्ता ज्ञानमयी मूर्ति रस्येति स्वेच्छया हरेः ।
गृहीता तैजसी मूर्तिर्दीप्ताऽस्येत्यथवा हरिः ।
दीप्तमूर्तिति प्रोक्तो वेदविद्याविशारदैः ॥

*Dīptā jñānamayī mūrti rasyeti svecchayā hareḥ,*
*Gr‌hītā taijasī mūrtirdīptā’syetyathavā hariḥ,*
*Dīptamūrtiti prokto vedavidyāviśāradaiḥ.*

*Resplendent is the nature of His superior knowledge. Or since He assumed by His own free will - His bright and flowing form, He is Dīptamūrtiḥ.*

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
विश्वमूर्तिर्महामूर्तिर्दीप्तमूर्तिरमूर्तिमान् ।अनेकमूर्तिरव्यक्तश्शतमूर्तिश्शताननः ॥ ७७ ॥
విశ్వమూర్తిర్మహామూర్తిర్దీప్తమూర్తిరమూర్తిమాన్ ।అనేకమూర్తిరవ్యక్తశ్శతమూర్తిశ్శతాననః ॥ 77 ॥
Viśvamūrtirmahāmūrtirdīptamūrtiramūrtimān,Anekamūrtiravyaktaśśatamūrtiśśatānanaḥ ॥ 77 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹 . శ్రీ శివ మహా పురాణము - 680 / Sri Siva Maha Purana - 680 🌹* 
*✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. రుద్రసంహితా-కుమార ఖండః - అధ్యాయము - 20 🌴*
*🌻. గణేశుని వివాహము - 4 🌻*

పార్వతీ పరమేశ్వరులు వచ్చి నారని తెలిసిన ఆ కుమారస్వామి విరక్తుడై మరియొక చోటకు పోవుటకు సంసిద్ధుడాయెను. దేవతలు, మునులు ప్రార్థించగా ఆతడు కూడా మూడు యోజనముల దూరమును విడచి అచటనే ఉండెను. ఇట్లు అదే స్థానములో కార్తికుడు కూడ ఉన్నాడు (34,35).

పార్వతీ పరమేశ్వరులు పుత్ర స్నేహముచే ఆర్ద్రమైన హృదయము గల వారై ప్రతి పర్వమునందు కుమారస్వామిని చూచుటకు అచటికి వెళ్లు చుందురు. ఓ నారదా! (36) అమావాస్య నాడు శంభుడు, పూర్ణిమనాడు పార్వతి తప్పని సరిగా అచటకు స్వయముగా వెళ్లుచుందురు (37). ఓ మహర్షీ! నీవు ప్రశ్నించిన విధముగా నేను కార్తీక గణశుల పరమ పవిత్ర గాథను వివరించితిని (38). ఈ గాథను వినిన బుద్ధిమంతుడగు మానవుడు పాపములన్నిటి నుండియూ విముక్తుడై తాను కోరుకునే శుభకామనలనన్నింటినీ పొందగలడు(39).

ఎవరైతే ఈ గాథను పఠించెదరో, పఠింపజేసెదరో, వినెదరో, వినిపించెదరో వారు కోర్కెలనన్నిటినీ పొందెదరనుటలో సందేహము లేదు (40). బ్రహ్మణుడు బ్రహ్మతేజస్సును. క్షత్రియుడు విజయమును, వైశ్యుడు ధనసమృద్ధిని పొందెదరు. శ్రూద్రుడు సత్పురుషులతో సమానుడగును (41). రోగి ఆరోగ్యవంతుడగును. భయపడినవాడు భయవిముక్తుడగును. అట్టి మానవుడు భూతప్రేతాది బాధలచే పీడింపబడడు (42). ఈ గాథ పుణ్యమును, కీర్తిని, సుఖమును, ఆయుర్దాయమును వర్ధిల్ల జేయును. సాటిలేని ఈ గాథ పుత్ర పౌత్రాదులనిచ్చి స్వర్గప్రాప్తిని కలిగించును (43).
 ఓం నమశ్శివాయ 

ఈ గాథ ముక్తిని ఇచ్చును. శ్రేష్ఠ మగు శివ జ్ఞానము నిచ్చును. పార్వతీ పరమేశ్వరులకు ప్రీతికరమగు ఈ గాథ శివభక్తిని వర్థిల్ల జేయును (44). భక్తులు, మరియు కామనలు లేని ముముక్షువులు ఈ గాథను సర్వదా వినవలెను. సదాశివ స్వరూపము, మంగళకరమునగు ఈ గాథ శివాద్వైతము నిచ్చును (45).

శ్రీ శివమహాపురాణములో రుద్రసంహితయందు కుమారఖండలో గణేశ వివాహము అనే ఇరువదియవ అధ్యాయము ముగిసినది (20).

కుమార ఖండము ముగిసినది. 

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 SRI SIVA MAHA PURANA - 680🌹*
*✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj *

*🌴 Rudra-saṃhitā (4): Kumara-khaṇḍa - CHAPTER 20 🌴*

*🌻 The celebration of Gaṇeśa’s marriage - 4 🌻*

34. On coming to know that Śiva had come there with Pārvatī, Kumāra became unattached and was eager to go elsewhere.

35. On being requested by the gods and sages he stayed in a place three Yojanas away.

36. O Nārada, on the full and new moon days, Pārvatī and Śiva are excited by love towards their son and they go there to see him.

37. On new moon days, Śiva himself goes there. On full moon days, Pārvatī goes there certainly.

38. O great sage, whatever you had asked in regard to Kārttikeya and Gaṇeśa has been narrated by me.

39. On hearing this, an intelligent man becomes free from all sins. He achieves all desired fruits of auspicious nature.

40. Whoever reads, teaches, listens or narrates this story derives all desires. No doubt need be entertained in this respect.

41. A brahmin derives brahminical splendour, a Kṣatriya becomes victorious, a Vaiśya prosperous and a Śūdra attains equality with the good.

42. A sick man becomes free from sickness; a frightened man becomes free from fear; no man is harassed by the visitation of goblins, ghosts etc.

43. This narrative is sinless, conducive to glory and enhancer of happiness. It is conducive to longevity and attainment of heaven. It is unequalled and bestows sons and grandsons.

44. It confers salvation and reveals Śiva’s principles. It is pleasing to Pārvatī and Śiva and increases devotion to Śiva.

45. This shall always be heard by devotees and by those who seek liberation and are free from worldly desires. It confers identity with Śiva. It is conducive to welfare and is identical with Śiva himself.

Here Ends Kumara Kanda

Continues....
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 301 / Osho Daily Meditations - 301 🌹*
*✍️. ప్రసాద్ భరద్వాజ*

*🍀 301. తల్లిదండ్రులు 🍀*

*🕉. మీ తల్లిదండ్రులతో ఒక అవగాహనకు రావడం ఎల్లప్పుడూ మంచిది. 🕉*

*గుర్జియేఫ్, 'మీరు మీ తల్లిదండ్రులతో సత్సంబంధాలు కలిగి ఉండక పోతే, మీరు మీ జీవితాన్ని కోల్పోయారు' అని చెప్పేవారు. మీకు మరియు మీ తల్లిదండ్రుల మధ్య కొంత కోపం కొనసాగితే, మీరు ఎప్పటికీ సుఖంగా ఉండరు. మీరు ఎక్కడ ఉన్నా, మీరు కొంచెం దోషిగా అనుభూతి చెందుతారు. మిమ్మల్ని మీరు ఎప్పటికీ క్షమించు కోలేరు. తల్లిదండ్రులు కేవలం సామాజిక సంబంధం మాత్రమే కాదు. వారి నుండి మీరు వచ్చారు. మీరు వారిలో భాగం, వారి చెట్టు యొక్క కొమ్మ. మీరు ఇప్పటికీ వాటిలో పాతుకుపోయారు. తల్లిదండ్రులు చనిపోయినప్పుడు, మీలో చాలా లోతుగా పాతుకుపోయినది ఏదో చనిపోతుంది.*

*తల్లిదండ్రులు చనిపోయినప్పుడు, మొదటి సారి మీరు ఒంటరిగా అయి, నిర్మూలించబడినట్లు అనిపిస్తుంది. కాబట్టి వారు సజీవంగా ఉన్నప్పుడు, మీరు చేయగలిగినదంతా చేయండి, తద్వారా అవగాహన ఏర్పడుతుంది. మీరు వారితో మాట్లాడచ్చు మరియు వారు మీతో మాట్లాడవచ్చు. అప్పుడు విషయాలు పరిష్కరించ బడతాయి మరియు కర్మ ఖాతాలు మూసివేయ బడతాయి. తద్వారా వారు ప్రపంచాన్ని విడిచిపెట్టినప్పుడు మీరు దోష భావాన్ని అనుభవించరు, మీరు పశ్చాత్తాపపడరు; వారు మీతో సంతోషంగా ఉన్నారు; మీరు వారితో సంతోషంగా ఉన్నారు. విషయాలు స్థిరపడ్డాయని మీకు తెలుస్తుంది.*
 
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Osho Daily Meditations - 301 🌹*
*📚. Prasad Bharadwaj*

*🍀 301. PARENTS 🍀*

*🕉. It is always good to come to an understanding with your parents. 🕉*

*Gurdjieff used to say, "Unless you are in good communion with your parents, you have missed your life." If some anger persists between you and your parents, you will never feel at ease. Wherever you are, you will feel a little guilty. You will never be able to forgive and forget...Parents are not just a social relationship. It is out of them that you have come. You are part of them, a branch of their tree. You are still rooted in them. When parents die, something very deep-rooted dies within you.*

*When parents die, for the first time you feel alone, uprooted. So while they are alive, do everything that you can so that an understanding can arise and you can communicate with them and they can communicate with you. Then things settle and the accounts are closed. Then when they leave the world-and they will leave someday-you will not feel guilty, you will not repent; you will know that things have settled. They have been happy with you; you have been happy with them.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 428 / Sri Lalitha Chaitanya Vijnanam - 428 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀 91. తత్త్వాసనా, తత్త్వమయీ, పంచకోశాంతరస్థితా ।*
*నిస్సీమమహిమా, నిత్యయౌవనా, మదశాలినీ ॥ 91 ॥ 🍀*

*🌻 428. 'నిత్య యౌవనా' 🌻* 

*ముదుసలితనము లేనిది శ్రీమాత అని అర్థము. త్రికాలములకు లోనగు వారికి బాల్యము, యౌవనము, వార్ధక్యము వుండును. కాలము ప్రభావము చూపని వారికి వారు నిత్యమొకే మాదిరిగ నుందురు. కాలము దైవముపై మాత్రమే ప్రభావము చూపలేదు. సృష్టింపబడు సర్వజీవరాసులు కాలబద్ధులే. సృష్టికర్తయగు బ్రహ్మకు కూడ వార్ధక్య మున్నది. ప్రస్తుతము మన సృష్టికి కర్తయైన 'పద్మభూః' అను బ్రహ్మదేవుడు ద్వితీయ పరార్దమున ప్రవేశించెనని నిత్యము సంకల్పమున చెప్పుకొను చున్నాము కదా!*

*బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కూడ కాలమునకు లోబడు వారే. వారికినీ వార్ధక్యముండును. కాలము వారిని కూడ హరించును. కాలమున కతీతమగు ఈశ్వర తత్త్వము మాత్ర మెప్పుడునూ నిత్యనూతనముగ నుండును. దానినే నిత్యయౌవన మందురు. అట్టి నిత్య యౌవన తత్త్వము రూపు గట్టుగొని దిగివచ్చినచో ఎట్లుండును? అదియే లలితమగు శ్రీకృష్ణ రూపము. అది అపురూపము.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 428 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️ Prasad Bharadwaj*

*🌻 91. Tatvasana tatvamaei panchakoshantarah sdhita*
*Nisima mahima nitya-yaovana madashalini ॥ 91 ॥ 🌻*

*🌻 428. 'Nitya-yaovana' 🌻*

*It means that Shree Mata is ageless. Those who are under the influence of time have childhood, youth and old age. Those who are not influenced by time are forever in youth. Time does not affect God alone. All created beings are temporal. Old age is also before Brahma who is the creator. At present, we are always saying in our daily aphorisms that 'Padmabhu' , the present Lord Brahma, has entered the second phase!*

*Brahma, Vishnu and Maheshwar are all subject to time. They also have an old age. Time will drain them too. Only the philosophy of God, which has evolved over time, is eternally new. That is eternal youth. What will it be like when such an eternal philosophy takes shape and descends into earth? That is the beautiful form of Lord Krishna. That is incredible.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
#నిత్యసందేశములు #DailyMessages 
Join and Share 
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages
https://chaitanyavijnanam.tumblr.com/
https://www.kooapp.com/profile/Prasad_Bharadwaj

Siva Sutras - 033 - 11. Tritayabhoktā vīreśaḥ - 1 / శివ సూత్రములు - 033 - 11. త్రితయభోక్తా విరేషః - 1



🌹. శివ సూత్రములు - 033 / Siva Sutras - 033 🌹

🍀. శివ ఆగమ తత్వశాస్త్రం యొక్క సూత్రములు 🍀

1- శాంభవోపాయ

✍️. ప్రసాద్‌ భరధ్వాజ

🌻 11. త్రితయభోక్తా విరేషః - 1🌻

🌴. మూడు స్పృహ స్థితుల ఆనందాన్ని అస్వాదించే వాడు శివుడు. 🌴


త్రితయ - త్రయాలు (సూత్రాలు 8, 9 మరియు 10లో చర్చించినట్లుగా సాధారణ స్పృహ, మేల్కొని, కల మరియు గాఢ నిద్ర యొక్క మూడు దశలు.) భోక్తా - ఆనందించేవాడు (ఆనందాన్ని ఆస్వాదించడం). విరేషః - తన ఇంద్రియాలను జయించినవాడు, కానీ ఇంకా విముక్తి పొందనివాడు. ఈ సూత్రాన్ని 7వ సూత్రం యొక్క పొడిగింపుగా పిలవవచ్చు. మూడు లౌకిక చైతన్య స్థాయిల్లో ద్వంద్వతను జయించిన వ్యక్తి, నాల్గవ స్థాయి చైతన్యం అయిన తురీయ స్థితికి ప్రవేశించడం ద్వారా ఆనందాన్ని పొందుతాడు.

తుర్య చైతన్య దశ మొదటి మూడు దశల జాడలను కలిగి ఉంటుంది. ఆధ్యాత్మిక పరిణామ సమయంలో, మునుపటి అనుభవం యొక్క జాడలు కొంతకాలం పాటు కొనసాగుతాయి. తదుపరి అభ్యాసం మరియు పురోగతి సమయంలో అవి కరిగిపోతాయి. అతను తుర్య దశలో మూడు ప్రాపంచిక స్థాయి చైతన్యాలను విలీనం చేయగలిగినప్పుడు, అతను ఆనందాన్ని పొందడం ప్రారంభిస్తాడు. ఇతర ఆలోచనలు లేకుండా ఒక వస్తువుపై దృష్టి కేంద్రీకరించ గల సామర్థ్యం ద్వారా ఆధ్యాత్మిక పురోగతిని కొలవవచ్చు.


కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Siva Sutras - 033 🌹

🍀Aphorisms of philosophy of Shiva āgama 🍀

Part 1 - Sāmbhavopāya

✍️. Acharya Ravi Sarma, 📚. Prasad Bharadwaj

🌻 11. Tritayabhoktā vīreśaḥ - 1 🌻

🌴. Shiva is the enjoyer of Bliss of all the three states 🌴


Tritaya – triads (the three stages of normal consciousness, awake, dream and deep sleep as discussed in sūtrās 8, 9 and 10.) bhoktā – the enjoyer (enjoying bliss). vīreśaḥ - the one who has conquered his senses, but yet to be liberated. This sūtrā can be called as an extension of sūtrā 7. The one, who could dissolve duality during the three mundane level of consciousness, attains bliss by entering the fourth level of consciousness, the turya stage.

Turya stage has traces of the first three stages of consciousness. During spiritual evolution, the traces of previous experience continue to exist for some time, and get dissolved during further practice and progression. When he is able to merge all the three mundane levels of consciousness in turya stage, he begins to enjoy the bliss. Spiritual advancement can be measured by one’s ability to concentrate on an object devoid any other thoughts.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹



నిర్మల ధ్యానాలు - ఓషో - 296


🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 296 🌹

✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ

🍀. జీవితమన్నది అస్తిత్వమిచ్చిన వరం. కాబట్టి అక్కడ అన్వేషించడం అన్నది కాదు స్వీకరించడం అన్నది విషయం. ఆనందాన్ని అందుకో. అదెక్కడో లేదు. మనం మరింతగా స్వీకరించే గుణంలో వుంది. ఆహ్వానంతో, నమ్మకంతో వుండు. 🍀


వ్యక్తి నరకాన్ని సృష్టించు కోవచ్చు. అది మన నిర్ణయం. మన బాధ్యత. జీవితంలో ముఖ్యమయిన విషయం జీవితమే. జీవితమన్నది అస్తిత్వమిచ్చిన వరం. కాబట్టి అక్కడ అన్వేషించడం అన్నది కాదు స్వీకరించడం అన్నది విషయం. ఆనందాన్ని అందుకో. అదెక్కడో టిబెట్లోనో, హిమాలయాల్లోనో లేదు. ఎక్కడికో ప్రయాణించాల్సిన పని లేదు. మరింత మరింతగా స్వీకరించే గుణంలో వుండడం చాలు. వరం ఎప్పుడూ వస్తూనే వుంటుంది. కానీ తలుపులు మూసి వుంటాయి.

సూర్యుడుంటాడు. మనం చీకట్లో వుంటాం. కళ్ళు మూసుకుని వుంటాం. వరమక్కడ వుంది. కళ్ళు తెరవాలి. కాంతి నందుకోవాలి. లేకుంటే చీకట్లోనే వుంటాం. జీవితానికి, అస్తిత్వానికి తలుపులు మూసుకోకు. మరింత స్పందనతో వుండు. ఆహ్వానంతో, నమ్మకంతో వుండు. జీవితం గురించి భయపడాల్సిన పన్లేదు. అన్ని మార్గాలకు అందుబాటులో వుండు. క్షణకాలం కూడా బాధ పడాల్సిన పన్లేదు. జీవితాంతం ఆనందంగా వుండొచ్చు.


సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹


DAILY WISDOM - 31 - 31. The Being of Reality / నిత్య ప్రజ్ఞా సందేశములు - 31 - 31. వాస్తవికత యొక్క ఉనికి



🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 31 / DAILY WISDOM - 31 🌹

🍀 📖 సంపూర్ణమైన సాక్షాత్కారం నుండి 🍀

✍️. ప్రసాద్ భరద్వాజ

🌻 31. వాస్తవికత యొక్క ఉనికి 🌻


వాస్తవికత యొక్క అనుభవం అనేది కేవలం అనుభవంలా మాత్రమే ఉంటుంది. అతీతత్వంతో విభేదించబడదు. సవరణలకు అందదు. అది అపరిమితంగా ఉంటుంది. ఈ ఏకత్వంలో అన్ని రూపాలు కలిసిపోయి, అవి దానిలో అదృశ్యమవుతాయి. ఈ వాస్తవికత-అనుభవం లక్షణరహితమైనది, తనలో తానే సత్యంగా భాసిల్లేది, ఆలోచనకు పైన ఉండేది, మరియు ఉనికిలో ఉన్న ప్రతి పాక్షిక అంశానికి అతీతమైనది. కానీ అన్ని తనలో ఇముడ్చకుని ఉండేది. ఎందుకంటే సత్య స్పర్శ లేనిదే ఏదీ సంపూర్ణం కాలేదు.

ఈ ఉనికి కేవలం ఒకటిగానే ఉంటుంది. ఎందుకంటే దాని యొక్క అనుభవం ఎప్పుడూ సంపూర్ణంగా ఉంటుంది కాబట్టి. ఎందుకంటే మీకుండే అసంతృప్తులు అన్నీ అనేకత్వం నుండి, బహుత్వం నుండి వచ్చాయి. ఈ బహుళ వాస్తవికతలు పరస్పర విరుద్ధత తో ఉంటూ మీకు అసంతృప్తి తెచ్చి పెట్టాయి. పరమార్థం ఎప్పుడూ ఎన్ని పార్శ్వాలు నుండి అర్థం చేసుకునేందుకు ప్రయత్నించినా ఒకే అఖండంగా గొచరమవుతుంది.


కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 DAILY WISDOM - 31 🌹

🍀 📖 The Realisation of the Absolute 🍀

📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj

🌻 31. The Being of Reality 🌻


The Being of Reality consists in Experience, uncontradicted by transcendence and untrammelled by modification. In this One Whole all appearances get fused, and they vanish into it. This Reality-Experience is one and attributeless, true to itself which is Alone, above thought, and above every partial aspect of being, but including all, none of which can be complete without getting itself merged in the fully real, which is the Absolute.

This Being can only be One, because experience is always a Whole, and because dissatisfaction is the effect of a faith in all independent pluralities and external relations which endlessly contradict themselves. The Absolute is experienced as the same Illimitable Immensity, even if it is approached in millions of ways.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹

శ్రీ మదగ్ని మహాపురాణము - 166 / Agni Maha Purana - 166


🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 166 / Agni Maha Purana - 166 🌹

✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ

శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.

ప్రథమ సంపుటము, అధ్యాయము - 51

🌻. సూర్యుడు మరియు ఇతర గ్రహా ప్రతిమా లక్షణములు - 1 🌻


హయాగ్రీవుడు చెప్పెను: సూర్యుడు ఏడు గుఱ్ఱములు కట్టిన, ఒకే చక్రముగల రథముపై రెండు పద్మములను హస్తములలో ధరించి యుండును. ఆతని దక్షిణ పార్శ్వమున దండి సిరా బుడ్డి లేఖిని ధరించి యుండును. వామపార్శ్వమున పింగళుడు దండమును ధరించి ద్వారము నందుండును. వీరిరువురను సూర్యుని పార్షదులు. పార్శ్వములందు ఇద్దరు స్త్రీలు వాలవ్యజనమును ధరించుయందురు. రాణియైన (భార్యయైన) ఛాయాదేవి ప్రక్క నుండును. లేదా అశ్వము పైన కూర్చున్న ఒక్క సూర్యుని ప్రతిమ మాత్రమే కన్పించవలెను. సమస్త దిక్పాలకులును వరద ముద్రతో, రెండేసి పద్మములు ధరించి సాయుధులై దిక్కుల వరుసలో నుందురు.

పండ్రెండు దళముల కమలమును నిర్మింపవలెను. సూర్యుడు, అర్యమ మొదలగు ద్వాదశ సూర్యులను ఆ ద్వాదశ దళములపై స్థాపింపవలెను. ఈ స్థాపనము పశ్చిమవాయవ్య దిక్కలతో ప్రారంభించి నైరృతిదిక్కు వరకును ఉన్న దళములపై చేయవలెను ఈ ఆదిత్య గణమునకు నాలుగేసి చేతులు చేతులలో ముద్గర - శూల - చక్ర - కమలములు ఉండును.

అగ్నేయము నుండి నైరృతి వరకు, నైరృతి నుండి వాయవ్యము వరకు, వాయవ్యము నుండి ఈశాన్యము వరకు, ఈశాన్యము నుండి అగ్నేయము వరకు ఉన్న దళములపై స్థాపింపవలెను.


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Agni Maha Purana - 166 🌹

✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj

Chapter 51

🌻 Characteristics of the images of the Sun and other planets - 1 🌻


The Lord said:

1. (The image of) the Sun (should be made) to ride a chariot having one wheel and seven horses. (He must) hold two lotuses, ink-stand, pen and a staff in his right hand.

2. Piṅgala, an attendant and gate-keeper of the Sun (should be placed) on the left with the mace in his hand. (Sun-god) should have female attendants bearing chowries (fly-flappers) and the pale-looking consort by his side.

3. Or (the image of) the Sun should be made as riding a horse alone. The guardian deities of different quarters should duly be endowed with weapons, holding two lotuses (in hands) and bestowing boons.

4. (The images of) Agni and other gods bearing the club, trident, disc and lotus should be placed in different directions (around). (The images of) the forms of Sun, commencing with Aryamā are represented as possessing four arms and placed in a diagram of twelve petals.


Continues....

🌹 🌹 🌹 🌹 🌹

శ్రీమద్భగవద్గీత - 319: 08వ అధ్., శ్లో 09 / Bhagavad-Gita - 319: Chap. 08, Ver. 09

 

🌹. శ్రీమద్భగవద్గీత - 319 / Bhagavad-Gita - 319 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 8వ అధ్యాయము - అక్షరబ్రహ్మ యోగం - 09 🌴

09. కవిం పురాణమనుశాసితారమ్ అణోరణీయాం సమనుస్మరేద్ య: |
సర్వస్య ధాతారమచిన్త్యరూపమ్ ఆదిత్యవర్ణం తమస: పరస్తాత్ ||


🌷. తాత్పర్యం :

నియమించు వాడును, సూక్ష్మము కన్నను సూక్ష్మమైన వాడను, సమస్తమును పోషించు వాడును, భౌతిక భావనలకు పరమైనవాడును, అచింత్యుడును, రూపసహితుడును అగు పరమపురుషుని సర్వజ్ఞునిగను మరియు ప్రాచీనునిగను ప్రతి యొక్కరు ధ్యానము చేయవలెను. సూర్యుని వలె తేజోసంపన్నుడును మరియు దివ్యుడును అగు అతడు భౌతిక ప్రకృతికి అతీతుడు.

🌷. భాష్యము :

భగవానుని స్మరించు విధానము ఈ శ్లోకమున తెలుపబడినది. ముఖ్యమైన విషయమేమనగా అతడు నిరాకారుడు(శూన్యుడు) కాడు. నిరాకారము లేదా శూన్యమునందు ఎవ్వరును ధ్యానమును నిలుపలేరు. అది అతికష్టము. కాని శ్రీకృష్ణుని స్మరణము అత్యంత సులభమైనది. అట్టి స్మరణమే వాస్తవముగా ఇచ్చట పేర్కొనబడినది.

మొట్టమొదట మనము అతడు పరుషుడని (రూప సహితుడని) తెలిసికొనవలెను. అనగా శ్రీకృష్ణనిగాని లేక శ్రీరామునిగాని సచ్చిదానందవిగ్రహునిగానే మనము ద్యానింపవలెను. రాముని తలచినను లేదా కృష్ణుని తలచినను అతడు ఎట్టివాడో ఈ శ్లోకమునందు వివరింపబడినది. శ్రీకృష్ణభగవానుడు “కవి” యని ఇచ్చట వర్ణింపబడినాడు. అనగా భూత, భవిష్యత్, వర్తమానములను తెలియుట ద్వారా సమస్తము నెరిగియుండెడి సర్వజ్ఞుడని భావము. సమస్తమునకు అది అతడే కనుక ప్రాచీనునిగా పిలువబడినాడు. సమస్తము అతని నుండియే ఉద్భవించినది. జగన్నియామకుడు మరియు మనుజుల పోషకుడుపోషకుడు, శిక్షకుడు అతడే. అతడే సూక్ష్మము కన్నను సూక్ష్మమైనవాడు. వెంట్రుక కొనలో పదివేలవంతు యుండెడి ఆత్మ యందును అచింత్యముగా ప్రవేశింపగలిగినంత సూక్ష్మమైనవాడు గనుకనే అతడు సూక్ష్మమైనవాటిలో సూక్ష్మమైనవాడని పిలువబడినాడు.

దేవదేవునిగా అతడు అణువు నందును మరియు అతిసూక్ష్మమైనట్టి దాని హృదయమునందును ప్రవేశించి పరమాత్మరూపమున నియమించుచుండును. అతిసూక్ష్మమైనను అతడు సర్వత్రా వ్యాపించి సమస్తమును పోషించుచున్నాడు. అతని వలననే సమస్త గ్రహమండలము నిలిచియున్నది.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 319 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 8 - Akshara Brahma Yoga - 09 🌴

09. kaviṁ purāṇam anuśāsitāram aṇor aṇīyāṁsam anusmared yaḥ
sarvasya dhātāram acintya-rūpam āditya-varṇaṁ tamasaḥ parastāt

🌷 Translation :

One should meditate upon the Supreme Person as the one who knows everything, as He who is the oldest, who is the controller, who is smaller than the smallest, who is the maintainer of everything, who is beyond all material conception, who is inconceivable, and who is always a person. He is luminous like the sun, and He is transcendental, beyond this material nature.

🌹 Purport :

The process of thinking of the Supreme is mentioned in this verse. The foremost point is that He is not impersonal or void. One cannot meditate on something impersonal or void. That is very difficult. The process of thinking of Kṛṣṇa, however, is very easy and is factually stated herein.

First of all, the Lord is puruṣa, a person – we think of the person Rāma and the person Kṛṣṇa. And whether one thinks of Rāma or of Kṛṣṇa, what He is like is described in this verse of Bhagavad-gītā. The Lord is kavi; that is, He knows past, present and future and therefore knows everything. He is the oldest personality because He is the origin of everything; everything is born out of Him.

He is also the supreme controller of the universe, and He is the maintainer and instructor of humanity. He is smaller than the smallest. The living entity is one ten-thousandth part of the tip of a hair, but the Lord is so inconceivably small that He enters into the heart of this particle. Therefore He is called smaller than the smallest. As the Supreme, He can enter into the atom and into the heart of the smallest and control him as the Supersoul. Although so small, He is still all-pervading and is maintaining everything.

By Him all these planetary systems are sustained. We often wonder how these big planets are floating in the air. It is stated here that the Supreme Lord, by His inconceivable energy, is sustaining all these big planets and systems of galaxies.

🌹 🌹 🌹 🌹 🌹



31 Jan 2023 Daily Panchang నిత్య పంచాంగము


🌹31, జనవరి, January 2023 పంచాగము - Panchagam 🌹

శుభ మంగళవారం, Tuesday, భౌమ వాసరే

మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని దైవాన్నర్థిస్తూ

ప్రసాద్ భరద్వాజ

🌻. పండుగలు మరియు పర్వదినాలు : రోహిణి వ్రతం, Rohini Vrat🌻

🍀. అపరాజితా స్తోత్రం - 4 🍀


7. యా దేవీ సర్వభూతేషు చేతనేత్యభిధీయతే |
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః

8. యా దేవీ సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థితా |
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః

🌻 🌻 🌻 🌻 🌻

🍀. నేటి సూక్తి : ముక్తావస్థ యందు లోని పురుషుడొక్కడే కాదు సంగరహితుడై వుండేది. (పురుషుడెప్పుడూ సంగరహితుడే. సామాన్య స్థితిలో మన మిది గుర్తించలేము) ప్రకృతి కూడా గుణ ప్రవృత్తులకు కలవక సంగరహితంగానే వుంటుంది. అనగా, ప్రకృతి రూపములైన అన్న, ప్రాణ, మనఃకోశాలు కూడా పురుషుని వలె ప్రశాంతి అనుభవిస్తాయి. అది కర్మరహిత స్థితి కాదు. కర్మ యందే ప్రశాంతస్థితి. 🍀

🌷🌷🌷🌷🌷


శుభకృత్‌, శిశిర ఋతువు,

ఉత్తరాయణం, మాఘ మాసం

తిథి: శుక్ల-దశమి 11:55:01 వరకు

తదుపరి శుక్ల-ఏకాదశి

నక్షత్రం: రోహిణి 24:40:53 వరకు

తదుపరి మృగశిర

యోగం: బ్రహ్మ 10:58:48 వరకు

తదుపరి ఇంద్ర

కరణం: గార 11:56:02 వరకు

వర్జ్యం: 15:52:00 - 17:37:36

దుర్ముహూర్తం: 09:04:45 - 09:50:14

రాహు కాలం: 15:20:03 - 16:45:21

గుళిక కాలం: 12:29:28 - 13:54:45

యమ గండం: 09:38:52 - 11:04:10

అభిజిత్ ముహూర్తం: 12:07 - 12:51

అమృత కాలం: 21:08:48 - 22:54:24

సూర్యోదయం: 06:48:16

సూర్యాస్తమయం: 18:10:39

చంద్రోదయం: 13:42:08

చంద్రాస్తమయం: 02:23:44

సూర్య సంచార రాశి: మకరం

చంద్ర సంచార రాశి: వృషభం

యోగాలు: మతంగ యోగం - అశ్వ

లాభం 24:40:53 వరకు తదుపరి

రాక్షస యోగం - మిత్ర కలహం

✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి

🌻 🌻 🌻 🌻 🌻


🍀. నిత్య ప్రార్థన 🍀

వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ

నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా

యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా

తయో సంస్మరణా త్పుంసాం సర్వతో జయ మంగళం

తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ

విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.

🌹🌹🌹🌹🌹

🍀 31, JANUARY 2023 TUESDAY ALL MESSAGES మంగళవారం, భౌమ వాసర సందేశాలు 🍀

🌹🍀 31, JANUARY 2023 TUESDAY ALL MESSAGES మంగళవారం, భౌమ వాసర సందేశాలు 🍀🌹
1) 🌹 31, JANUARY 2023 TUESDAY, మంగళవారం, భౌమ వాసరే నిత్య పంచాంగము Daily Panchangam🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 319 / Bhagavad-Gita -319 🌹 🌴 8వ అధ్యాయము - అక్షరబ్రహ్మ యోగం / Akshara Brahma Yoga - 09 వ శ్లోకము 🌴
4) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 166 / Agni Maha Purana - 166 🌹 🌻. సూర్యుడు మరియు ఇతర గ్రహా ప్రతిమా లక్షణములు - 1 / Characteristics of the images of the Sun and other planets - 1 🌻
4) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 031 / DAILY WISDOM - 031 🌹 🌻 31. వాస్తవికత యొక్క ఉనికి / 31. The Being of Reality 🌻 
5) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 296 🌹
6) 🌹. శివ సూత్రములు - 33 / Siva Sutras - 33 🌹 
🌻 11. త్రితయభోక్తా విరేషః - 1 / 11. Tritayabhoktā vīreśaḥ - 1 🌻

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹31, జనవరి, January 2023 పంచాగము - Panchagam 🌹*
*శుభ మంగళవారం, Tuesday, భౌమ వాసరే*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని దైవాన్నర్థిస్తూ *
*ప్రసాద్ భరద్వాజ*

*🌻. పండుగలు మరియు పర్వదినాలు : రోహిణి వ్రతం, Rohini Vrat🌻*

*🍀. అపరాజితా స్తోత్రం - 4 🍀*

*7. యా దేవీ సర్వభూతేషు చేతనేత్యభిధీయతే |*
*నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః*
*8. యా దేవీ సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థితా |*
*నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః*

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : ముక్తావస్థ యందు లోని పురుషుడొక్కడే కాదు సంగరహితుడై వుండేది. (పురుషుడెప్పుడూ సంగరహితుడే. సామాన్య స్థితిలో మన మిది గుర్తించలేము) ప్రకృతి కూడా గుణ ప్రవృత్తులకు కలవక సంగరహితంగానే వుంటుంది. అనగా, ప్రకృతి రూపములైన అన్న, ప్రాణ, మనఃకోశాలు కూడా పురుషుని వలె ప్రశాంతి అనుభవిస్తాయి. అది కర్మరహిత స్థితి కాదు. కర్మ యందే ప్రశాంతస్థితి. 🍀*

🌷🌷🌷🌷🌷

శుభకృత్‌, శిశిర ఋతువు,
ఉత్తరాయణం, మాఘ మాసం
తిథి: శుక్ల-దశమి 11:55:01 వరకు
తదుపరి శుక్ల-ఏకాదశి
నక్షత్రం: రోహిణి 24:40:53 వరకు
తదుపరి మృగశిర
యోగం: బ్రహ్మ 10:58:48 వరకు
తదుపరి ఇంద్ర
కరణం: గార 11:56:02 వరకు
వర్జ్యం: 15:52:00 - 17:37:36
దుర్ముహూర్తం: 09:04:45 - 09:50:14
రాహు కాలం: 15:20:03 - 16:45:21
గుళిక కాలం: 12:29:28 - 13:54:45
యమ గండం: 09:38:52 - 11:04:10
అభిజిత్ ముహూర్తం: 12:07 - 12:51
అమృత కాలం: 21:08:48 - 22:54:24
సూర్యోదయం: 06:48:16
సూర్యాస్తమయం: 18:10:39
చంద్రోదయం: 13:42:08
చంద్రాస్తమయం: 02:23:44
సూర్య సంచార రాశి: మకరం
చంద్ర సంచార రాశి: వృషభం
యోగాలు: మతంగ యోగం - అశ్వ
లాభం 24:40:53 వరకు తదుపరి
రాక్షస యోగం - మిత్ర కలహం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణా త్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. శ్రీమద్భగవద్గీత - 319 / Bhagavad-Gita - 319 🌹*
*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. 8వ అధ్యాయము - అక్షరబ్రహ్మ యోగం - 09 🌴*

*09. కవిం పురాణమనుశాసితారమ్ అణోరణీయాం సమనుస్మరేద్ య: |*
*సర్వస్య ధాతారమచిన్త్యరూపమ్ ఆదిత్యవర్ణం తమస: పరస్తాత్ ||*

🌷. తాత్పర్యం :
*నియమించు వాడును, సూక్ష్మము కన్నను సూక్ష్మమైన వాడను, సమస్తమును పోషించు వాడును, భౌతిక భావనలకు పరమైనవాడును, అచింత్యుడును, రూపసహితుడును అగు పరమపురుషుని సర్వజ్ఞునిగను మరియు ప్రాచీనునిగను ప్రతి యొక్కరు ధ్యానము చేయవలెను. సూర్యుని వలె తేజోసంపన్నుడును మరియు దివ్యుడును అగు అతడు భౌతిక ప్రకృతికి అతీతుడు.*

🌷. భాష్యము :
భగవానుని స్మరించు విధానము ఈ శ్లోకమున తెలుపబడినది. ముఖ్యమైన విషయమేమనగా అతడు నిరాకారుడు(శూన్యుడు) కాడు. నిరాకారము లేదా శూన్యమునందు ఎవ్వరును ధ్యానమును నిలుపలేరు. అది అతికష్టము. కాని శ్రీకృష్ణుని స్మరణము అత్యంత సులభమైనది. అట్టి స్మరణమే వాస్తవముగా ఇచ్చట పేర్కొనబడినది. 

మొట్టమొదట మనము అతడు పరుషుడని (రూప సహితుడని) తెలిసికొనవలెను. అనగా శ్రీకృష్ణనిగాని లేక శ్రీరామునిగాని సచ్చిదానందవిగ్రహునిగానే మనము ద్యానింపవలెను. రాముని తలచినను లేదా కృష్ణుని తలచినను అతడు ఎట్టివాడో ఈ శ్లోకమునందు వివరింపబడినది. శ్రీకృష్ణభగవానుడు “కవి” యని ఇచ్చట వర్ణింపబడినాడు. అనగా భూత, భవిష్యత్, వర్తమానములను తెలియుట ద్వారా సమస్తము నెరిగియుండెడి సర్వజ్ఞుడని భావము. సమస్తమునకు అది అతడే కనుక ప్రాచీనునిగా పిలువబడినాడు. సమస్తము అతని నుండియే ఉద్భవించినది. జగన్నియామకుడు మరియు మనుజుల పోషకుడుపోషకుడు, శిక్షకుడు అతడే. అతడే సూక్ష్మము కన్నను సూక్ష్మమైనవాడు. వెంట్రుక కొనలో పదివేలవంతు యుండెడి ఆత్మ యందును అచింత్యముగా ప్రవేశింపగలిగినంత సూక్ష్మమైనవాడు గనుకనే అతడు సూక్ష్మమైనవాటిలో సూక్ష్మమైనవాడని పిలువబడినాడు. 

దేవదేవునిగా అతడు అణువు నందును మరియు అతిసూక్ష్మమైనట్టి దాని హృదయమునందును ప్రవేశించి పరమాత్మరూపమున నియమించుచుండును. అతిసూక్ష్మమైనను అతడు సర్వత్రా వ్యాపించి సమస్తమును పోషించుచున్నాడు. అతని వలననే సమస్త గ్రహమండలము నిలిచియున్నది. 
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 319 🌹*
*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*

*🌴 Chapter 8 - Akshara Brahma Yoga - 09 🌴*

*09. kaviṁ purāṇam anuśāsitāram aṇor aṇīyāṁsam anusmared yaḥ*
*sarvasya dhātāram acintya-rūpam āditya-varṇaṁ tamasaḥ parastāt*

🌷 Translation : 
*One should meditate upon the Supreme Person as the one who knows everything, as He who is the oldest, who is the controller, who is smaller than the smallest, who is the maintainer of everything, who is beyond all material conception, who is inconceivable, and who is always a person. He is luminous like the sun, and He is transcendental, beyond this material nature.*

🌹 Purport :
The process of thinking of the Supreme is mentioned in this verse. The foremost point is that He is not impersonal or void. One cannot meditate on something impersonal or void. That is very difficult. The process of thinking of Kṛṣṇa, however, is very easy and is factually stated herein. 

First of all, the Lord is puruṣa, a person – we think of the person Rāma and the person Kṛṣṇa. And whether one thinks of Rāma or of Kṛṣṇa, what He is like is described in this verse of Bhagavad-gītā. The Lord is kavi; that is, He knows past, present and future and therefore knows everything. He is the oldest personality because He is the origin of everything; everything is born out of Him. 

He is also the supreme controller of the universe, and He is the maintainer and instructor of humanity. He is smaller than the smallest. The living entity is one ten-thousandth part of the tip of a hair, but the Lord is so inconceivably small that He enters into the heart of this particle. Therefore He is called smaller than the smallest. As the Supreme, He can enter into the atom and into the heart of the smallest and control him as the Supersoul. Although so small, He is still all-pervading and is maintaining everything. 

By Him all these planetary systems are sustained. We often wonder how these big planets are floating in the air. It is stated here that the Supreme Lord, by His inconceivable energy, is sustaining all these big planets and systems of galaxies.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 166 / Agni Maha Purana - 166 🌹*
*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ*
*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*
*ప్రథమ సంపుటము, అధ్యాయము - 51*

*🌻. సూర్యుడు మరియు ఇతర గ్రహా ప్రతిమా లక్షణములు - 1 🌻*

హయాగ్రీవుడు చెప్పెను: సూర్యుడు ఏడు గుఱ్ఱములు కట్టిన, ఒకే చక్రముగల రథముపై రెండు పద్మములను హస్తములలో ధరించి యుండును. ఆతని దక్షిణ పార్శ్వమున దండి సిరా బుడ్డి లేఖిని ధరించి యుండును. వామపార్శ్వమున పింగళుడు దండమును ధరించి ద్వారము నందుండును. వీరిరువురను సూర్యుని పార్షదులు. పార్శ్వములందు ఇద్దరు స్త్రీలు వాలవ్యజనమును ధరించుయందురు. రాణియైన (భార్యయైన) ఛాయాదేవి ప్రక్క నుండును. లేదా అశ్వము పైన కూర్చున్న ఒక్క సూర్యుని ప్రతిమ మాత్రమే కన్పించవలెను. సమస్త దిక్పాలకులును వరద ముద్రతో, రెండేసి పద్మములు ధరించి సాయుధులై దిక్కుల వరుసలో నుందురు.

పండ్రెండు దళముల కమలమును నిర్మింపవలెను. సూర్యుడు, అర్యమ మొదలగు ద్వాదశ సూర్యులను ఆ ద్వాదశ దళములపై స్థాపింపవలెను. ఈ స్థాపనము పశ్చిమవాయవ్య దిక్కలతో ప్రారంభించి నైరృతిదిక్కు వరకును ఉన్న దళములపై చేయవలెను ఈ ఆదిత్య గణమునకు నాలుగేసి చేతులు చేతులలో ముద్గర - శూల - చక్ర - కమలములు ఉండును. 

అగ్నేయము నుండి నైరృతి వరకు, నైరృతి నుండి వాయవ్యము వరకు, వాయవ్యము నుండి ఈశాన్యము వరకు, ఈశాన్యము నుండి అగ్నేయము వరకు ఉన్న దళములపై స్థాపింపవలెను.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Agni Maha Purana - 166 🌹*
*✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj *

*Chapter 51
*🌻 Characteristics of the images of the Sun and other planets - 1 🌻*

The Lord said:
1. (The image of) the Sun (should be made) to ride a chariot having one wheel and seven horses. (He must) hold two lotuses, ink-stand, pen and a staff in his right hand.

2. Piṅgala, an attendant and gate-keeper of the Sun (should be placed) on the left with the mace in his hand. (Sun-god) should have female attendants bearing chowries (fly-flappers) and the pale-looking consort by his side.

3. Or (the image of) the Sun should be made as riding a horse alone. The guardian deities of different quarters should duly be endowed with weapons, holding two lotuses (in hands) and bestowing boons.

4. (The images of) Agni and other gods bearing the club, trident, disc and lotus should be placed in different directions (around). (The images of) the forms of Sun, commencing with Aryamā are represented as possessing four arms and placed in a diagram of twelve petals.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 31 / DAILY WISDOM - 31 🌹*
*🍀 📖 సంపూర్ణమైన సాక్షాత్కారం నుండి 🍀*
*✍️. ప్రసాద్ భరద్వాజ*

*🌻 31. వాస్తవికత యొక్క ఉనికి 🌻*

*వాస్తవికత యొక్క అనుభవం అనేది కేవలం అనుభవంలా మాత్రమే ఉంటుంది. అతీతత్వంతో విభేదించబడదు. సవరణలకు అందదు. అది అపరిమితంగా ఉంటుంది. ఈ ఏకత్వంలో అన్ని రూపాలు కలిసిపోయి, అవి దానిలో అదృశ్యమవుతాయి. ఈ వాస్తవికత-అనుభవం లక్షణరహితమైనది, తనలో తానే సత్యంగా భాసిల్లేది, ఆలోచనకు పైన ఉండేది, మరియు ఉనికిలో ఉన్న ప్రతి పాక్షిక అంశానికి అతీతమైనది. కానీ అన్ని తనలో ఇముడ్చకుని ఉండేది. ఎందుకంటే సత్య స్పర్శ లేనిదే ఏదీ సంపూర్ణం కాలేదు.*

ఈ ఉనికి కేవలం ఒకటిగానే ఉంటుంది. ఎందుకంటే దాని యొక్క అనుభవం ఎప్పుడూ సంపూర్ణంగా ఉంటుంది కాబట్టి. ఎందుకంటే మీకుండే అసంతృప్తులు అన్నీ అనేకత్వం నుండి, బహుత్వం నుండి వచ్చాయి. ఈ బహుళ వాస్తవికతలు పరస్పర విరుద్ధత తో ఉంటూ మీకు అసంతృప్తి తెచ్చి పెట్టాయి. పరమార్థం ఎప్పుడూ ఎన్ని పార్శ్వాలు నుండి అర్థం చేసుకునేందుకు ప్రయత్నించినా ఒకే అఖండంగా గొచరమవుతుంది. 

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹


*🌹 DAILY WISDOM - 31 🌹*
*🍀 📖 The Realisation of the Absolute 🍀*
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj

*🌻 31. The Being of Reality 🌻*

*The Being of Reality consists in Experience, uncontradicted by transcendence and untrammelled by modification. In this One Whole all appearances get fused, and they vanish into it. This Reality-Experience is one and attributeless, true to itself which is Alone, above thought, and above every partial aspect of being, but including all, none of which can be complete without getting itself merged in the fully real, which is the Absolute.*

*This Being can only be One, because experience is always a Whole, and because dissatisfaction is the effect of a faith in all independent pluralities and external relations which endlessly contradict themselves. The Absolute is experienced as the same Illimitable Immensity, even if it is approached in millions of ways.*

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 296 🌹*
*✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ*

*🍀. జీవితమన్నది అస్తిత్వమిచ్చిన వరం. కాబట్టి అక్కడ అన్వేషించడం అన్నది కాదు స్వీకరించడం అన్నది విషయం. ఆనందాన్ని అందుకో. అదెక్కడో లేదు. మనం మరింతగా స్వీకరించే గుణంలో వుంది. ఆహ్వానంతో, నమ్మకంతో వుండు. 🍀*

*వ్యక్తి నరకాన్ని సృష్టించు కోవచ్చు. అది మన నిర్ణయం. మన బాధ్యత. జీవితంలో ముఖ్యమయిన విషయం జీవితమే. జీవితమన్నది అస్తిత్వమిచ్చిన వరం. కాబట్టి అక్కడ అన్వేషించడం అన్నది కాదు స్వీకరించడం అన్నది విషయం. ఆనందాన్ని అందుకో. అదెక్కడో టిబెట్లోనో, హిమాలయాల్లోనో లేదు. ఎక్కడికో ప్రయాణించాల్సిన పని లేదు. మరింత మరింతగా స్వీకరించే గుణంలో వుండడం చాలు. వరం ఎప్పుడూ వస్తూనే వుంటుంది. కానీ తలుపులు మూసి వుంటాయి.*

*సూర్యుడుంటాడు. మనం చీకట్లో వుంటాం. కళ్ళు మూసుకుని వుంటాం. వరమక్కడ వుంది. కళ్ళు తెరవాలి. కాంతి నందుకోవాలి. లేకుంటే చీకట్లోనే వుంటాం. జీవితానికి, అస్తిత్వానికి తలుపులు మూసుకోకు. మరింత స్పందనతో వుండు. ఆహ్వానంతో, నమ్మకంతో వుండు. జీవితం గురించి భయపడాల్సిన పన్లేదు. అన్ని మార్గాలకు అందుబాటులో వుండు. క్షణకాలం కూడా బాధ పడాల్సిన పన్లేదు. జీవితాంతం ఆనందంగా వుండొచ్చు.*

*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. శివ సూత్రములు - 033 / Siva Sutras - 033 🌹*
*🍀. శివ ఆగమ తత్వశాస్త్రం యొక్క సూత్రములు 🍀*
*1- శాంభవోపాయ*
 *✍️. ప్రసాద్‌ భరధ్వాజ*

*🌻 11. త్రితయభోక్తా విరేషః - 1🌻*
*🌴. మూడు స్పృహ స్థితుల ఆనందాన్ని అస్వాదించే వాడు శివుడు. 🌴*

*త్రితయ - త్రయాలు (సూత్రాలు 8, 9 మరియు 10లో చర్చించినట్లుగా సాధారణ స్పృహ, మేల్కొని, కల మరియు గాఢ నిద్ర యొక్క మూడు దశలు.) భోక్తా - ఆనందించేవాడు (ఆనందాన్ని ఆస్వాదించడం). విరేషః - తన ఇంద్రియాలను జయించినవాడు, కానీ ఇంకా విముక్తి పొందనివాడు. ఈ సూత్రాన్ని 7వ సూత్రం యొక్క పొడిగింపుగా పిలవవచ్చు. మూడు లౌకిక చైతన్య స్థాయిల్లో ద్వంద్వతను జయించిన వ్యక్తి, నాల్గవ స్థాయి చైతన్యం అయిన తురీయ స్థితికి ప్రవేశించడం ద్వారా ఆనందాన్ని పొందుతాడు.*

*తుర్య చైతన్య దశ మొదటి మూడు దశల జాడలను కలిగి ఉంటుంది. ఆధ్యాత్మిక పరిణామ సమయంలో, మునుపటి అనుభవం యొక్క జాడలు కొంతకాలం పాటు కొనసాగుతాయి. తదుపరి అభ్యాసం మరియు పురోగతి సమయంలో అవి కరిగిపోతాయి. అతను తుర్య దశలో మూడు ప్రాపంచిక స్థాయి చైతన్యాలను విలీనం చేయగలిగినప్పుడు, అతను ఆనందాన్ని పొందడం ప్రారంభిస్తాడు. ఇతర ఆలోచనలు లేకుండా ఒక వస్తువుపై దృష్టి కేంద్రీకరించ గల సామర్థ్యం ద్వారా ఆధ్యాత్మిక పురోగతిని కొలవవచ్చు.*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Siva Sutras - 033 🌹*
*🍀Aphorisms of philosophy of Shiva āgama 🍀*
Part 1 - Sāmbhavopāya
*✍️. Acharya Ravi Sarma, 📚. Prasad Bharadwaj*

*🌻 11. Tritayabhoktā vīreśaḥ - 1 🌻*
*🌴. Shiva is the enjoyer of Bliss of all the three states 🌴*

*Tritaya – triads (the three stages of normal consciousness, awake, dream and deep sleep as discussed in sūtrās 8, 9 and 10.) bhoktā – the enjoyer (enjoying bliss). vīreśaḥ - the one who has conquered his senses, but yet to be liberated. This sūtrā can be called as an extension of sūtrā 7. The one, who could dissolve duality during the three mundane level of consciousness, attains bliss by entering the fourth level of consciousness, the turya stage.*

*Turya stage has traces of the first three stages of consciousness. During spiritual evolution, the traces of previous experience continue to exist for some time, and get dissolved during further practice and progression. When he is able to merge all the three mundane levels of consciousness in turya stage, he begins to enjoy the bliss. Spiritual advancement can be measured by one’s ability to concentrate on an object devoid any other thoughts.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
#నిత్యసందేశములు #DailyMessages 
Join and Share 
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages
https://chaitanyavijnanam.tumblr.com/
https://www.kooapp.com/profile/Prasad_Bharadwaj

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 427 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 427 - 2


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 427 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 427 - 2 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 91. తత్త్వాసనా, తత్త్వమయీ, పంచకోశాంతరస్థితా ।
నిస్సీమమహిమా, నిత్యయౌవనా, మదశాలినీ ॥ 91 ॥ 🍀

🌻 427. 'నిస్సీమ మహిమ’ - 2 🌻


శ్రీమాత మహిమను కొలతలు వేయుటకు పూనుకొనిన త్రిమూర్తులు ఆమె మహిమను తెలియుటలో భయమును చెందిరి. తమ తమ స్థానములకు పరిమితులై కర్తవ్యోన్ముఖులైరి. జీవులు శ్రీమాత స్వరూపులే గనుక వారు కూడ వారి దేహ పరిమాణమునకు లొంగి యుండవలసిన అవసరము లేదు. జీవుని దేహము సృష్టివంటిది. అందు జీవుడు దైవాంశ. అతడు కూడ నిజమునకు దేహపరిమితులను దాటి యుండవచ్చును.

అతడి మహిమ కూడ దూర తీరములకు వ్యాపించ వచ్చును. శ్రీమాత భక్తులగు మహాత్ములట్లే యుందురు. బ్రహ్మర్షులు, మహర్షులు, రాజర్షులు వారి యోగ తపో బలములచే తీరముల నతిక్రమించి మహిమ చూపుచుండుట తెలిసిన విషయమే. ఇట్లు జీవులందరును కూడ నిజమునకు పరిమితులు లేనివారే. ఉన్నదని భావించుటచే అట్లు ఇమిడి యుందురు. వారి యందు జ్ఞానము వికసించు చుండగా వ్యాప్తి చెందుచు నుందురు.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 427 - 2 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️ Prasad Bharadwaj

🌻 91. Tatvasana tatvamaei panchakoshantarah sdhita
Nisima mahima nitya-yaovana madashalini ॥ 91 ॥ 🌻

🌻 427. 'Nisseema Mahima' - 2 🌻


Trimurthi( The Holy triumvirate) who tried to measure Srimata's glory got scared upon knowing Her glory. They were bound by their duty and limited to their respective positions. As living beings are forms of Sri Mata, there is no need for them to be limited by the bodies. Jiva's body is like creation. In that, the creature is divine. He may also be beyond the physical limits of his body.

Their glory too can spread to distant shores. Devotees of Sri Mata who are Mahatmas are like this. It is a well-known fact that Brahmarshis, Maharshis and Rajarshis have shown their powers and glory well beyond their physical existence. All such living beings are also limitless. They are limited because they think they are. As knowledge blossoms in them, they walk towards omniscience .


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


Osho Daily Meditations - 300. THE MASTER KEY / ఓషో రోజువారీ ధ్యానాలు - 300. మూలపు తాళం చెవి



🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 300 / Osho Daily Meditations - 300 🌹

✍️. ప్రసాద్ భరద్వాజ

🍀 300. మూలపు తాళం చెవి 🍀

🕉. పూర్తి అంగీకారం కీలకం. ఇది మూలపు తాళం చెవి. అది అన్ని తలుపులు తెరుస్తుంది. 🕉


అంగీకారం ద్వారా తెరవలేని తాళం లేదు. ఇది అన్ని తాళాలకు సరిపోయే చెవి -ఎందుకంటే మీరు ఏదైనా అంగీకరించిన క్షణం, మీ ఉనికిలో ఒక పరివర్తన ప్రారంభమైంది ఎందుకంటే ఇప్పుడు ఎటువంటి వైరుధ్యం లేదు. మీరు ఇద్దరు కాదు. అంగీకారంలో మీరు ఒక్కటయ్యారు, మీరు ఐక్యత అయ్యారు. మీ ఐక్యతను, మీ సంక్లిష్టతను గుర్తుంచుకోండి. ఇది చాలా బాగుంది. కోరికలు అందమైనవి. అభిరుచి మంచిది - మీరు దానిని అంగీకరిస్తే, అది కరుణ అవుతుంది. మీరు కోరికలను అంగీకరిస్తే, అదే శక్తి కోరిక లేనిదిగా మారడం మీరు చూస్తారు. కోరికలలో చేరి ఉండే శక్తి అదే. మీరు కోరికలను అంగీకరించినప్పుడు, మీరు విశ్రాంతి తీసుకుంటారు మరియు శక్తి మరింత సహజంగా ప్రసారం ప్రారంభమవుతుంది.

మీరు వాటిని ఉన్నట్లుగా చూడటం ప్రారంభించండి. మీరు ఈ కోరికతో లేదా దానితో ఎక్కువ పాలుపంచుకోలేదు. మీరు అంగీకరించారు, కాబట్టి సమస్య లేదు. మీరు కోరిక అని పిలవబడేది కోరిక లేనిది అవుతుంది. ప్రస్తుతం బొగ్గులా ఉంది. ఇది వజ్రాలుగా రూపాంతరం చెందుతుంది; అది విలువైనదిగా మారవచ్చు. కోరిక లేని వ్యక్తి గురించి ఆలోచించండి - అతను నపుంసకుడు అవుతాడు. నిజానికి, అది సజీవంగా ఉండదు. ఎందుకంటే అతను కోరిక లేకుండా ఎలా జీవిస్తాడు? కాబట్టి కోరికలేమి ప్రతికూలమైనది కాదు. ఇది అన్ని కోరికల యొక్క అంతిమ సానుకూలత. కోరికలు తెలిసినప్పుడు, అర్థం చేసుకున్నప్పుడు, జీవించినప్పుడు మరియు అనుభవించి నప్పుడు, మీరు వాటిని మించిపోయారు. నీకు యుక్తవయస్సు వచ్చింది.


కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹


🌹 Osho Daily Meditations - 300 🌹

📚. Prasad Bharadwaj

🍀 300. THE MASTER KEY 🍀

🕉. Total acceptance is the key. It is the master key; it opens all the doors. 🕉


There is no lock that cannot be opened by acceptance. It is simply the key that fits all the locks-because the moment you accept something, a transformation has started in your being because now there is no conflict. You are not two. In acceptance you have become one, you have become a unity. Remember your unity, your complexity. It is beautiful. Desires are beautiful. Passion is good-if you accept it, it will become compassion. If you accept the desires, by and by you will see that the same energy is becoming desirelessness. It is the same energy that was involved in the desires. When you accept the desires, by and by you relax, and energy starts streaming more naturally.

You start seeing things as they are. You are not too involved with this desire or that. You have accepted, so there is no problem. Whatever you call desire will become desirelessness. Right now is like coal. It can be transfigured into diamonds; it can become precious. Just think of the man who is desireless--he will be impotent. In fact, she will not be alive, because how will he live without desire? So desirelessness is not negative. It is the ultimate positivity of all desires. When desires are known, understood, lived, and experienced, you have gone beyond them. You have come of age.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹

శ్రీ శివ మహా పురాణము - 679 / Sri Siva Maha Purana - 679


🌹 . శ్రీ శివ మహా పురాణము - 679 / Sri Siva Maha Purana - 679 🌹

✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్రసంహితా-కుమార ఖండః - అధ్యాయము - 20 🌴

🌻. గణేశుని వివాహము - 3 🌻


బ్రహ్మ ఇట్లు పలికెను -

ఓ నారదా! మహేశ్వరుని మనస్సులో ధ్యానించే నీవు ఆ కుమారునితో ఈ వాక్యమును పలికి మౌనమును వహించితివి(22). కోపమనే అగ్నితో మండిపడుచున్న స్కందుడు తండ్రికి నమస్కరించి, తల్లిదండ్రులు వారించిననూ వినక, క్రౌంచపర్వతమునకు వెళ్లెను (23).

'నీవు ఇపుడు ఎట్లు వెళ్లెదవు?' అని వారించి నిషేధించిననూ ఆతడు 'కుదరదు' అని బదులిడి వెళ్లిపోయెను (24). తల్లిదండ్రులారా! నేను ఇచట క్షణకాలమైననూ ఉండరాదు. ఏలయన, మీరు ప్రేమను ప్రక్కన బెట్టి నా యందు కపటమును చేసితిరి (25). ఓ మునీ! ఇట్లు పలికి ఆతడు అచటకు వెళ్లెను. ఇప్పటికినీ అచటనే యున్నాడు. ఆయన దర్శన మాత్రముచే సర్వమానవుల పాపములను పోగొట్టును (26). ఓ దేవర్షీ! ఆ దినమునుండి శివపుత్రుడగు కార్తికేయుని బ్రహ్మ చర్యము స్థిరముగా నుండెను (27).

కార్తికేయుని నామము ముల్లోకములలో ప్రసిద్ధమైనది. ఆ శ్రేష్ఠ పవిత్ర నామము సర్వపాపములను పోగొట్టి బ్రహ్మచర్యమునిచ్చును (28). ప్రతి సంవత్సరములో కార్తీక మాసము నందు దేవతలు, శిష్యులతో గూడి ఋషులు, మరియు మునిశ్రేష్ఠులు కుమారుని దర్శనముకొరకు వెళ్లు చుందురు (29). ఎవడైతే కార్తీక మాసములో కృత్తికానక్షత్రమునాడు కుమారస్వామిని దర్శించునో, వాని పాపములన్నియు భస్మమై, మనస్సులో కోరిన ఫలములు లభించును (30). స్కందుడు దూరమగుటచే దుఃఖమును పొందిన ఉమాదేవి కూడా దీనురాలై శివునితో 'ప్రభూ! నన్ను అచటకు తీసుకొని వెళ్లుడు' అని పలికెను (31). ఆమె సుఖము కొరకు శంభుడు ఆమెతో గూడి స్వయముగా ఆ పర్వతమునకు వెళ్లి మల్లికార్జునుడు అను పేర అచట జ్యోతిర్లింగమై వెలసి జనులకు సుఖములనిచ్చు చున్నాడు (32). ఈనాటికీ శివుడు పార్వతితో గూడి అచట దర్శనమిస్తూ, తన భక్తులందరి కోర్కెలనీడేర్చుచూ సత్పురుషులకు శరణమై ఉన్నాడు(33).


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹




🌹 SRI SIVA MAHA PURANA - 679🌹

✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj

🌴 Rudra-saṃhitā (4): Kumara-khaṇḍa - CHAPTER 20 🌴

🌻 The celebration of Gaṇeśa’s marriage - 3 🌻



Brahmā said:—

22. O Nārada, following the mental process of lord Śiva, you spoke these words to Kumāra and then kept quiet.

23. After bowing to his father, the infuriated Skanda went to the Krauñca mountain[2] though forbidden by his parents.

24. “Even when forbidden by us why do you go?” Although he was prevented by saying this, he went away saying “No”.

25. “O parents, I shall not stay here even a moment when deception has been practised on me eschewing affection towards me.”

26. O sage, he went away saying so. Even today he is staying there removing the sin of all by his very vision.

27. Ever since that day, O celestial sage, the son of Śiva, Kārttikeya remains a bachelor.

28. His name bestows auspiciousness in the world. It is famous in the three worlds. It dispels all sins, is meritorious and confers the sanctity of celibacy.

29. In the month of Kārttika, the gods, the holy sages and great ascetics go there to see Kumāra.

30. He who has the vision of the lord in the Kṛttikā Nakṣatra in the month of Kārttika is divested of all sins. He derives all desired fruits.

31. Pārvatī became grief-stricken by separation from Skanda. She piteously told her lord. “O lord, let us go there.”

32. Śiva went to that mountain partially for her happiness. He assumed the pleasing form of Jyotirliṅga named Mallikārjuna.[3]

33. Even now Śiva is seen there with Pārvatī satisfying the desires of his devotees. He is the goal of the good.


Continues....

🌹🌹🌹🌹🌹



విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 718 / Vishnu Sahasranama Contemplation - 718


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 718 / Vishnu Sahasranama Contemplation - 718🌹

🌻718. మహామూర్తిః, महामूर्तिः, Mahāmūrtiḥ🌻

ఓం మహామూర్తయే నమః | ॐ महामूर्तये नमः | OM Mahāmūrtaye namaḥ


మహతీ మూర్తిరేతస్య శేష పర్యఙ్కశాయినః ।
ఇతి విష్ణుర్మహామూర్తిరితి సఙ్కీర్త్యతే బుధైః ॥

అపరిమిత శరీరుడైన అనంతుడు అనగా శేషుని తన పర్యంకముగా చేసికొని శయనించి యున్నందున ఈతని మూర్తి చాలా పెద్దదియే కదా!


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 718🌹

🌻718. Mahāmūrtiḥ🌻

OM Mahāmūrtaye namaḥ

महती मूर्तिरेतस्य शेष पर्यङ्कशायिनः ।
इति विष्णुर्महामूर्तिरिति सङ्कीर्त्यते बुधैः ॥

Mahatī mūrtiretasya śeṣa paryaṅkaśāyinaḥ,
Iti viṣṇurmahāmūrtiriti saṅkīrtyate budhaiḥ.


Since He lies on Ādiśeṣa for His bed - who is enormously big in size, He too is big in His form and that is why He is called Mahāmūrtiḥ.


🌻 🌻 🌻 🌻 🌻


Source Sloka

विश्वमूर्तिर्महामूर्तिर्दीप्तमूर्तिरमूर्तिमान् ।
अनेकमूर्तिरव्यक्तश्शतमूर्तिश्शताननः ॥ ७७ ॥

విశ్వమూర్తిర్మహామూర్తిర్దీప్తమూర్తిరమూర్తిమాన్ ।
అనేకమూర్తిరవ్యక్తశ్శతమూర్తిశ్శతాననః ॥ 77 ॥

Viśvamūrtirmahāmūrtirdīptamūrtiramūrtimān,
Anekamūrtiravyaktaśśatamūrtiśśatānanaḥ ॥ 77 ॥



Continues....

🌹 🌹 🌹 🌹🌹


కపిల గీత - 126 / Kapila Gita - 126


🌹. కపిల గీత - 126 / Kapila Gita - 126🌹

🍀. కపిల దేవహూతి సంవాదం 🍀

✍️. శ్రీమాన్ క.రామానుజాచార్యులు, 📚. ప్రసాద్‌ భరధ్వాజ

🌴 3. ప్రకృతి పురుషుల వివేకము వలన మోక్షప్రాప్తి - 10 🌴

10. నివృత్తబుద్ధ్యవస్థానో దూరీభూతాన్యదర్శనః|
ఉపలభ్యాత్మనాఽఽత్మానం చక్షుషేవార్కమాత్మదృక్॥


ఆత్మదర్శియైన ముని బుద్ధి యొక్క జాగ్రదాది అవస్థల నుండి తనను వేరుగా భావించు కొనును. అతడు పరమాత్మను తప్ప మరి ఏ యితర వస్తువును చూడగూడదు (ఆయన దృష్టిలో పరమాత్మ ఒక్కడే సత్యము. తక్కినవి నశ్వరములు. కావున వాటివైపు తన దృష్టిని పోనీయడు). నేత్రములు సూర్యుని చూచిన విధముగా తన శుద్ధాంతః కరణము ద్వారా పరమాత్మ సాక్షాత్కారముసు పొంది అద్వితీయమైన బ్రహ్మపదమును చేరును.

శరీరమునకూ ఇంద్రియములకూ మనసుకూ జ్ఞ్యానం ఉండదు. ప్రకృతి పురుషుల యధార్థ తత్వము తెలిపే జ్ఞ్యానముతో బుద్ధి అవస్థానం (బుద్ధి యొక్క సమూహం - బుద్ధి మనసు చిత్తం అంతఃకరణం) చేసే పని అయిన సంకల్ప వికల్పాలు, నిశ్చయ, విపరీత జ్ఞానాల నుంచి పక్కకు తొలగుతుంది. ఇలా జరగాలంటే ప్రకృతి అంటే ఏమిటో పురుషుడు అంటే ఏమిటొ తెలిస్తే, ప్రకృతితో పురుషుడు సంబంధం ఏర్పరుచు కోవడానికి చేసే వ్యాపారమే, సంకల్పం వికల్ప్లం, భ్రమ అన్యధా జ్ఞానం విపరీత జ్ఞ్యానం. ఇవి మానేసినపుడు, బుద్ధి మనసు యొక్క పనులైన సంకల్ప వికల్పాలను విడిచిపెడతాడు. దాని వలన పరమాత్మ కన్నా ఇతరమైన వాటిని దర్శించడు.

భగవంతుని కంటే భిన్నమైన వాటిని చూడకుండా అయ్యి, పరమాత్మ చేత జీవాత్మను తెలుసుకుంటాము. భగవంతుని చేతనే జీవాత్మ స్వరూపం తెలుస్తుంది. బుద్ధి యొక్కా, మనసు యొక్కా, ఆసక్తిని తొలగించాలి, ప్రవృత్తిని తొలగించాలి. మనసు బుద్ధీ వేటి యందు ప్రవర్తిస్తుందో వాటిని వెనక్కు మరల్చాలి. ఇతరములను చూడకూడదు. అప్పుడు జీవునితో పరమాత్మను తెలుసుకోవాలి. పరమాత్మ అనుగ్రహం తోటే ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది. ఆయన సంకల్పము లేకుంటే ఉన్న శాస్త్ర జ్ఞానముతో ఆయుష్షు వ్యయము అవుతుంది తప్ప లాభం ఉండదు.


సశేషం..

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Kapila Gita - 126 🌹

🍀 Conversation of Kapila and Devahuti 🍀

📚 Prasad Bharadwaj

🌴 3. Salvation due to wisdom of Nature and Jeeva - 10 🌴


10. nivṛtta-buddhy-avasthāno dūrī-bhūtānya-darśanaḥ
upalabhyātmanātmānaṁ cakṣuṣevārkam ātma-dṛk

One should be situated in the transcendental position, beyond the stages of material consciousness, and should be aloof from all other conceptions of life. Thus realizing freedom from false ego, one should see his own self just as he sees the sun in the sky.

Consciousness acts in three stages under the material conception of life. When we are awake, consciousness acts in a particular way, when we are asleep it acts in a different way, and when we are in deep sleep, consciousness acts in still another way. To become Kṛṣṇa conscious, one has to become transcendental to these three stages of consciousness. Our present consciousness should be freed from all perceptions of life other than consciousness of Kṛṣṇa, the Supreme Personality of Godhead. This is called dūrī-bhūtānya-darśanaḥ, which means that when one attains perfect Kṛṣṇa consciousness he does not see anything but Kṛṣṇa.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹

30 Jan 2023 Daily Panchang నిత్య పంచాంగము


🌹30, జనవరి, January 2023 పంచాగము - Panchagam 🌹

శుభ సోమవారం, Monday, ఇందు వాసరే

మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని దైవాన్నర్థిస్తూ - ప్రసాద్ భరద్వాజ

🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు🌻

🍀. శ్రీ శివ సహస్రనామ స్తోత్రం - 18 🍀

33. సాంఖ్యప్రసాదో దుర్వాసాః సర్వసాధునిషేవితః |
ప్రస్కందనో విభాగజ్ఞో అతుల్యో యజ్ఞభాగవిత్

34. సర్వవాసః సర్వచారీ దుర్వాసా వాసవోఽమరః |
హైమో హేమకరో యజ్ఞః సర్వధారీ ధరోత్తమః

🌻 🌻 🌻 🌻 🌻

🍀. నేటి సూక్తి : నిస్సంగత్వం - జీవన్ముక్తులు తమ యందలి ప్రకృతితత్త్వమందు సంగం కలవారైనా పురుషతత్వ మందు నిస్సంగముగా వుంటారు గనుక వారు నిస్సంగులే ననడంలో అర్థంలేదు. సంగం ఏ విభాగంలో ఉన్నా అది సంగమే. నిస్సంగుడు కావడానికి మానవుడు ఎక్కడనో అంతరాత్మలోనే కాక, అంతటా అనగా దేహ, ప్రాణ, మనః ప్రవృత్తులలో కూడా నిస్సంగుడు గానే ఉండడం అవసరం. 🍀

🌷🌷🌷🌷🌷



శుభకృత్‌, శిశిర ఋతువు,

ఉత్తరాయణం, మాఘ మాసం

తిథి: శుక్ల-నవమి 10:13:52 వరకు

తదుపరి శుక్ల-దశమి

నక్షత్రం: కృత్తిక 22:17:09 వరకు

తదుపరి రోహిణి

యోగం: శుక్ల 10:48:45 వరకు

తదుపరి బ్రహ్మ

కరణం: కౌలవ 10:13:52 వరకు

వర్జ్యం: 09:18:30 - 11:02:10

దుర్ముహూర్తం: 12:52:01 - 13:37:27

మరియు 15:08:20 - 15:53:47

రాహు కాలం: 08:13:41 - 09:38:53

గుళిక కాలం: 13:54:30 - 15:19:42

యమ గండం: 11:04:05 - 12:29:17

అభిజిత్ ముహూర్తం: 12:07 - 12:51

అమృత కాలం: 19:40:30 - 21:24:10

సూర్యోదయం: 06:48:29

సూర్యాస్తమయం: 18:10:07

చంద్రోదయం: 12:57:53

చంద్రాస్తమయం: 01:29:33

సూర్య సంచార రాశి: మకరం

చంద్ర సంచార రాశి: వృషభం

యోగాలు: స్థిర యోగం - శుభాశుభ

మిశ్రమ ఫలం 22:17:09 వరకు తదుపరి

వర్ధమాన యోగం - ఉత్తమ ఫలం

✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి

🌻 🌻 🌻 🌻 🌻


🍀. నిత్య ప్రార్థన 🍀

వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ

నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా

యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా

తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం

తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ

విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.

🌹🌹🌹🌹🌹