🌹. కపిల గీత - 126 / Kapila Gita - 126🌹
🍀. కపిల దేవహూతి సంవాదం 🍀
✍️. శ్రీమాన్ క.రామానుజాచార్యులు, 📚. ప్రసాద్ భరధ్వాజ
🌴 3. ప్రకృతి పురుషుల వివేకము వలన మోక్షప్రాప్తి - 10 🌴
10. నివృత్తబుద్ధ్యవస్థానో దూరీభూతాన్యదర్శనః|
ఉపలభ్యాత్మనాఽఽత్మానం చక్షుషేవార్కమాత్మదృక్॥
ఆత్మదర్శియైన ముని బుద్ధి యొక్క జాగ్రదాది అవస్థల నుండి తనను వేరుగా భావించు కొనును. అతడు పరమాత్మను తప్ప మరి ఏ యితర వస్తువును చూడగూడదు (ఆయన దృష్టిలో పరమాత్మ ఒక్కడే సత్యము. తక్కినవి నశ్వరములు. కావున వాటివైపు తన దృష్టిని పోనీయడు). నేత్రములు సూర్యుని చూచిన విధముగా తన శుద్ధాంతః కరణము ద్వారా పరమాత్మ సాక్షాత్కారముసు పొంది అద్వితీయమైన బ్రహ్మపదమును చేరును.
శరీరమునకూ ఇంద్రియములకూ మనసుకూ జ్ఞ్యానం ఉండదు. ప్రకృతి పురుషుల యధార్థ తత్వము తెలిపే జ్ఞ్యానముతో బుద్ధి అవస్థానం (బుద్ధి యొక్క సమూహం - బుద్ధి మనసు చిత్తం అంతఃకరణం) చేసే పని అయిన సంకల్ప వికల్పాలు, నిశ్చయ, విపరీత జ్ఞానాల నుంచి పక్కకు తొలగుతుంది. ఇలా జరగాలంటే ప్రకృతి అంటే ఏమిటో పురుషుడు అంటే ఏమిటొ తెలిస్తే, ప్రకృతితో పురుషుడు సంబంధం ఏర్పరుచు కోవడానికి చేసే వ్యాపారమే, సంకల్పం వికల్ప్లం, భ్రమ అన్యధా జ్ఞానం విపరీత జ్ఞ్యానం. ఇవి మానేసినపుడు, బుద్ధి మనసు యొక్క పనులైన సంకల్ప వికల్పాలను విడిచిపెడతాడు. దాని వలన పరమాత్మ కన్నా ఇతరమైన వాటిని దర్శించడు.
భగవంతుని కంటే భిన్నమైన వాటిని చూడకుండా అయ్యి, పరమాత్మ చేత జీవాత్మను తెలుసుకుంటాము. భగవంతుని చేతనే జీవాత్మ స్వరూపం తెలుస్తుంది. బుద్ధి యొక్కా, మనసు యొక్కా, ఆసక్తిని తొలగించాలి, ప్రవృత్తిని తొలగించాలి. మనసు బుద్ధీ వేటి యందు ప్రవర్తిస్తుందో వాటిని వెనక్కు మరల్చాలి. ఇతరములను చూడకూడదు. అప్పుడు జీవునితో పరమాత్మను తెలుసుకోవాలి. పరమాత్మ అనుగ్రహం తోటే ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది. ఆయన సంకల్పము లేకుంటే ఉన్న శాస్త్ర జ్ఞానముతో ఆయుష్షు వ్యయము అవుతుంది తప్ప లాభం ఉండదు.
సశేషం..
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Kapila Gita - 126 🌹
🍀 Conversation of Kapila and Devahuti 🍀
📚 Prasad Bharadwaj
🌴 3. Salvation due to wisdom of Nature and Jeeva - 10 🌴
10. nivṛtta-buddhy-avasthāno dūrī-bhūtānya-darśanaḥ
upalabhyātmanātmānaṁ cakṣuṣevārkam ātma-dṛk
One should be situated in the transcendental position, beyond the stages of material consciousness, and should be aloof from all other conceptions of life. Thus realizing freedom from false ego, one should see his own self just as he sees the sun in the sky.
Consciousness acts in three stages under the material conception of life. When we are awake, consciousness acts in a particular way, when we are asleep it acts in a different way, and when we are in deep sleep, consciousness acts in still another way. To become Kṛṣṇa conscious, one has to become transcendental to these three stages of consciousness. Our present consciousness should be freed from all perceptions of life other than consciousness of Kṛṣṇa, the Supreme Personality of Godhead. This is called dūrī-bhūtānya-darśanaḥ, which means that when one attains perfect Kṛṣṇa consciousness he does not see anything but Kṛṣṇa.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
No comments:
Post a Comment